శ్రద్ధగా నేర్చుకుంటున్నాం..
మా పాఠశాలలో ప్రతిరోజు సాయంత్రం కరాటే తరగతులు నిర్వహిస్తున్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుంది. శారీరకంగా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఉత్సాహంగా ఉండవచ్చు.
– సోమేశ్వరి, జెడ్పీహెచ్‌ఎస్, నాగర్‌కర్నూల్
మంచి నిర్ణయం..
పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించడం చాలామంచి నిర్ణయం. కేంద్ర ప్రభు త్వం బాలికల స్వీయ రక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడేందుకు కృషిచేస్తాం.
– బిందు, జెడ్పీహెచ్‌ఎస్, నాగర్‌కర్నూల్
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..
పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికలకు కరాటే, కుంగ్‌ఫూ, ఇతర అంశాలు నేర్పించడం వలన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఎలాంటి ఆపద వచ్చిన తమను తాము రక్షించుకోగలుగుతాం అనే భావన వారిలో ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో బాలకలకు కరాటే చాలా అవసరం.
– స్వాతి, కరాటే శిక్షకురాలు, నాగర్‌కర్నూల్
●
శ్రద్ధగా నేర్చుకుంటున్నాం..
శ్రద్ధగా నేర్చుకుంటున్నాం..


