అద్దె భవనాలే దిక్కు
పోస్టుల భర్తీ ఎప్పుడో..
జిల్లాలో 154 అంగన్‌వాటీ టీచర్లు, 974 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి భర్తీ చేయకపోవడంతో అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. కొన్ని కేంద్రాల్లో ప్రైవేటు వ్యక్తులతో పని చేయించుకుంటున్నామని టీచర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
కందనూలు: చిన్నారులకు అక్షరాలు నేర్పించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు లేక చిన్నారులతో పాటు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లోనే బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ పలు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి.
వసతులు అంతంతే..
జిల్లావ్యాప్తంగా 1,132 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 932 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చిన్నారులకు డిజిటల్ బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆటలు, పాటలతో చిన్నారులను ఆకర్షించే విధంగా వివిధ రకాల ఆటల సామగ్రిని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అద్దె కోసం రూ.వేలు ఖర్చు..
అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులకు ఆకర్షణీయంగా ఉండాలి. ఇందుకు సొంత భవనాల్లో అనేక రకాల వసతులు అవసరం. అయితే జిల్లావ్యాప్తంగా 200 వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె రూపంలో ప్రతినెలా రూ.వేలు వెచ్చిస్తున్నారు. కొన్ని చోట్ల పెంకుటిళ్లలోనే కేంద్రాలను కొనసాగిస్తుండటంతో చిన్నారులతో పాటు టీచర్లు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పౌష్టికాహారం నిల్వ చేసేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
అన్ని పనులు వారిపైనే..
టీచర్లు లేని చోట ఆయాలు, ఆయాలు లేని చోట టీచర్లు అన్నీ తామై కేంద్రాలను కొనసాగిస్తున్నారు. పిల్లలను కేంద్రాలకు తీసుకురావడంతో మొదలుకొని.. వంట చేయడం, రికార్డులు రాయడం, చదువు చెప్పడం వంటి పనులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక టీచర్లు లేని చోట ఆయాలు కేంద్రాలను నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే బాధ్యత అంగన్‌వాడీ కేంద్రాలదే. అయితే ఆయా కేంద్రాలకు వచ్చే పాలు, పండ్లు, గుడ్లు ఇతర అంశాలను పక్క కేంద్రాల టీచర్లు చూస్తున్నారు. రెండు విధాలుగా అటు టీచర్లు, ఇటు ఆయాలు పడరాని పాట్లు పడుతున్నారు.
ఆయాలు లేకుండా కొనసాగుతున్నవి
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువు
కనీస వసతులు లేక అవస్థలు
భర్తీకి నోచుకోని టీచర్, ఆయా పోస్టులు
ప్రభుత్వం దృష్టిసారిస్తేనేపూర్వ ప్రాథమిక విద్య బలోపేతం
974
ప్రతిపాదనలు పంపించాం..
జిల్లాలో 60కి పైగా నూతన భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదే విధంగా అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంటాం. – రాజేశ్వరి, డీడబ్ల్యూఓ
అద్దె భవనాలే దిక్కు


