సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన
నాగర్‌కర్నూల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చీఫ్ మేనేజర్ రాకేష్‌వర్మ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకు సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఖాతాదారులు సైబర్ నేరాల బారిన పడుతున్నారని అలాంటి వారికి అవగాహన కల్పించడానికి బ్యాంకు సిబ్బంది ముందు వరుసలో ఉండాలని సూచించారు. చాలామంది అవగాహన లేక బ్యాంకులలో గాని, 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఫ్రంట్ లైన్‌లో ఉండే బ్యాంకు సిబ్బంది ముందుగా సైబర్ నేరగాళ్ల బారిన పడినవారు సంప్రదిస్తారని అలాంటి వారికి అవగాహన కల్పించడమే కాకుండా టోల్ ఫ్రీ నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నరేష్‌కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ లీలావతి, అసోసియేట్స్ దినేష్, భాగ్యలక్ష్మి, అంజలి, షేక్ షరీఫ్, మాధవరావు, వర్షిణి, నవ కిషోర్‌రెడ్డి, మాధురి, నిఖిత, సర్వీస్ మేనేజర్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


