కోలలు వస్తున్నాయి
మామిడి తోటలకు నవంబర్ నెలలో మొదటి దశ పూతలు వస్తాయి. కానీ, ఈసారి మొదటి దశ పూతలు పెద్దగా రాలేదు. వాతావరణంలో మార్పులు, వర్షాల వల్ల పూతలకు బదులుగా మామిడి చెట్లకు పెద్దమొత్తంలో కోలలు (చిగుర్లు) వస్తున్నాయి. కోలలు ముదిరితేనే పూతలు వస్తాయి. దీంతో రెండో దశ పూతలపైనే ఆశలు పెట్టుకున్నాం.
– శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్
ఈసారి మామిడి పూతలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. నవంబర్‌లో వచ్చిన పూతలు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. చల్లని గాలలు, అకాల వర్షాల ప్రభావం మామిడి పూతలపై పడింది. ఈ నెలలో మామిడి చెట్లకు నీళ్లు పెట్టొద్దు. భూమి బెట్టగా ఉంటేనే పూతలు వచ్చేందుకు వీలుంటుంది. మామిడికి అధికంగా తేనె మంచు, బంక, బూడిద తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటికి సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. తెగుళ్ల నివారణకు మందులు ఎలా వాడాలనే అంశాలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం.
– లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్
కోలలు వస్తున్నాయి


