అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతిఏటా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపికై న వారికి 209 మంది, రెండో విడతలో 109 మంది, మూడో విడతలో భాగంగా 66 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశామన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు తన నిధులు రూ.50 లక్షలు కేటాయించి వాటిని ప్రారంభించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, నాయకులు ఆనంద్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.


