పల్లెలు పోటెత్తాయి..! | - | Sakshi
Sakshi News home page

పల్లెలు పోటెత్తాయి..!

Dec 15 2025 1:04 PM | Updated on Dec 15 2025 1:04 PM

పల్లెలు పోటెత్తాయి..!

పల్లెలు పోటెత్తాయి..!

2వ విడతలోనూ భారీగా పోలింగ్‌

87.08 ఓటింగ్‌ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్‌

అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో 84 శాతం..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్‌లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్‌ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్‌ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు.

84 శాతం.. ఆపైనే..

ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్‌ నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్‌ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్‌నగర్‌ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంది.

జిల్లాల వారీగా పోలింగ్‌ ఇలా..

జిల్లా మొత్తం ఓట్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారు

పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

మహబూబ్‌నగర్‌ 91,496 93,540 04 1,85,040 80,075 80,209 00 1,60,284

నాగర్‌కర్నూల్‌ 1,25,402 1,24,832 05 2,50,239 1,05,980 1,04,170 01 2,10,151

జోగుళాంబ గద్వాల 55,710 57,094 03 1,12,807 49,086 49,145 03 98,234

వనపర్తి 58,900 59,890 02 1,18,792 51,803 51,603 00 1,03,406

నారాయణపేట 73,674 76,642 02 1,50,318 62,703 64,065 01 1,26,769

మొత్తం 4,05,182 4,11,998 16 8,17,196 3,49,647 3,49,192 05 6,98,844

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement