శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకం
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. హోంగార్డు రైసింగ్ డే 63వ వేడుకలను శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ముఖ్య అతిథిగా ఏఎస్పీ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 175 మంది హోంగార్డులు ఉన్నారని, మంచి పనితీరును కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందించడంతోపాటు వారు హోంగార్డు దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు సైతం ఇన్సూరెన్స్‌తోపాటు యూనిఫాం అలవెన్స్ చెల్లిస్తుందని, హోంగార్డుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవల ఓ బ్యాంకుతో సంప్రదింపులు జరిపామని త్వరలోనే సిబ్బంది అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఆర్‌ఐ జగన్, రాఘవరావు, ఎస్‌ఐ గోవర్ధన్, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, ప్రశాంత్, కల్యాణ్, శివాజీ, హోంగార్డులు పాల్గొన్నారు.


