క్రీడలతో మంచి గుర్తింపు
నాగర్‌కర్నూల్: యువతకు క్రీడల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆలిండియా స్థాయి క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఫైనల్‌లో డాలీ సీసీ జట్టు, ఎంఆర్‌సీసీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన డాలీ సీసీ జట్టు.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంఆర్‌సీసీ జట్టు.. 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. 27 పరుగుల తేడాతో డాలీ సీసీ జట్టు విన్నర్‌గా నిలవగా.. ఎంఆర్‌సీసీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. టోర్నీ విజేతలకు శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించే యువతకు అపారమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఎంచుకున్న క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు.


