గర్భాశయ క్యాన్సర్‌ను పారదోలుదాం
నాగర్‌కర్నూల్ క్రైం: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ పనితీరు పూర్తిగా కోల్డ్ చైన్ నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఫార్మసీ ఆఫీసర్లు, కోల్డ్ చైన్ హ్యాండ్లర్లకు హెచ్‌పీవీ ెవ్యాక్సిన్ నిల్వ– రవాణ– శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ అత్యంత సున్నితమైనదని, తప్పనిసరిగా 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యే భద్రపరచాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న రిఫ్రిజిరేటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజుకు రెండుసార్లు ఉష్ణోగ్రత రీడింగులను లాగ్ బుక్‌లో నమోదు చేయాలని ఫార్మసీ ఆఫీసర్లను ఆదేశించారు. వ్యాక్సిన్‌ను వ్యాక్సినేషన్ సెషన్లకు తరలించే సమయంలో వ్యాక్సిన్ క్యారియర్లలో తగినన్ని ఐస్ ప్యాక్‌లు ఉండేలా చూసుకోవాలని, నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కందనూలును గర్భాశయ క్యాన్సర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలందరికీ వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, శ్రీనివాసులు, ఫార్మసీ ఆఫీసర్ సురేష్, వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, వీసీసీఎం దివ్య తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు న్యాయం చేయాలి
చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి మినహాయించాలని నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైదని, వారి నిరసన పట్ల ప్రభుత్వం స్పందించాలని గోకారం సర్పంచ్ పంజుగుల పరశురాములు అన్నారు. మండలంలోని గోకారం జలాశయంలో ఆయా గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 17వ రోజు చేసుకున్నాయి. ఈ మేరకు గోకారం గ్రామ సర్పంచ్ పరశురాములు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిర్వాసితులు గత 17 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదని వివర్శించారు. వారి న్యాయమైన డిమాండ్ జలాశయం సామర్ధ్యం తగ్గించి, వెంటనే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గర్భాశయ క్యాన్సర్‌ను పారదోలుదాం


