పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
బల్మూర్/లింగాల/ఉప్పునుంతల: ఎన్నికల నిర్వ హణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం బల్మూర్, లింగాల, ఉప్పునుంతల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ క్లస్టర్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎంపీడీఓల పాత్ర కీలకమని.. నామినేషన్లతో మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి పరిమితికి మించి ఎక్కువ మందిని అనుమతించొద్దన్నారు. ఆమె వెంట ఆర్డీఓ మాధవి, జిల్లా నోడల్ అధికారి సీతారాం, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, వెంకటేశ్ ఉన్నారు.
రెండు రోజులుగా తిరుగుతున్నా..
నా కొడుకు స్కాలర్‌షిప్ కోసం కులం సర్టిఫికెట్ అవసరం ఉంది. నేను రెండు రోజులుగా సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా. నోటరీ అఫిడవిట్ కోసం రూ. 500 ఖర్చు అయ్యింది. నోటరీ ఇచ్చినా దరఖాస్తుపై సంతకం పెడుతలేరు. మేం చదువుకోలేదు. మా పేరు మీద కులం సర్టిఫికెట్ లేదు. – రేకులపాటి రోజా, తూడుకుర్తి, నాగర్‌కర్నూల్ మండలం
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ


