మద్యం, నగదు రవాణాపై నిఘా : ఎస్పీ
బిజినేపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణాపై పోలీసు నిఘా ఉంచినట్లు ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం మాంగనూర్ వద్ద ఏర్పాటుచేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల త నిఖీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు, నిషేధిత వస్తువులు రవాణా అయ్యే అవకాశం ఉంటుందని.. చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహ నాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని సూచించారు.
శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరం
నాగర్‌కర్నూల్ క్రైం: శారీరక దృఢత్వం, మానసికోల్లాసానికి క్రీడలు అవసరమని అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. హోంగార్డుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హోంగార్డులకు కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ప్రజ ల రక్షణ కోసం హోంగార్డులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వారిలో మరింత ఉత్తేజం, ఉల్లాసాన్ని నింపేందుకు క్రీడా పోటీలు ని ర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జగన్, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు నల్లమల విద్యార్థి
అమ్రాబాద్: మండలంలోని తిర్మలాపూర్ (బీకే) గ్రామానికి చెందిన ఎడ్ల ప్రసాద్ వర్మ జాతీయస్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. రాజన్న సిరిసిల్లలో గతనెల 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ టోర్నీలో అతడు అత్యుత్తమ ప్రతిభకనబరిచి బ్రౌంజ్ మెడల్ సాధించడంతో పాటు ఈ నెల 16నుంచి 21వ తేదీ వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయ వాలీ బాల్ పోటీలకు ఎంపికై నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం వరప్రసాద్ వర్మ లింగాల రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇంటర్మీడియడ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
కోడేరు: రైతులు పంట విక్రయం కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వేముల నాయక్ సూచించారు. శుక్రవారం కోడేరు మండలంలోని జనుంపల్లి, తీగలపల్లి, బావాయిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఆయా కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని జాప్యం లేకుండా సేకరించాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం జంగయ్య, సీసీలు శేషన్నగౌడ్ ఉన్నారు.
మద్యం, నగదు రవాణాపై నిఘా : ఎస్పీ
మద్యం, నగదు రవాణాపై నిఘా : ఎస్పీ
మద్యం, నగదు రవాణాపై నిఘా : ఎస్పీ


