breaking news
Ravi Teja
-
'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
‘‘కెరీర్లో యావరేజ్ సినిమాలు, హిట్స్, ఫ్లాప్స్... ఇలా చాలా ఉంటాయి. కానీ...‘ఇరుముడి’ సినిమా యాక్టర్‌గా నాకు విపరీతమైన సంతృప్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సోల్ జీవీ ప్రకాష్ మ్యూజిక్. నిర్మాత నవీన్ ప్రతిరోజూ ఫోన్ చేసి, కలెక్షన్స్ చెబుతుండేవారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వారి సంతోషాన్ని నాతో పంచుకునేవారు’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవానీశంకర్ హీరోయిన్ గా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 21న విడుదలైంది. గురువారం జరిగిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా అంటే శివ నిర్వాణ. ఆయనకు ఈ సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది. మా అమ్మాయి మోక్షు అండ్ టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘రవన్నగారితో సినిమా అంటే... దర్శకులు అనిల్, బాబీ, గోపీచంద్గార్లు గుర్తుకు వస్తారు. రవన్న డైరెక్టర్స్ లీగ్‌లో నేను చేరడం హ్యాపీగా ఉంది. నా భార్య భాగ్య ఈ సినిమా విషయంలో మీకు ఏది నచ్చితే అది చేయమని చెప్పింది. అదే చేశాను. ఈ సినిమాతో భరించలేనంత సంతోషాన్ని నా హార్ట్ తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఓ పెద్దావిడ ఒంటరిగా ఈ ‘ఇరుముడి’ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లారు. ఆ వీడియోను రవన్నకు పంపాను. తెలుగు రాష్ట్రాలు మా ‘ఇరుముడి’ని ఓన్ చేసుకున్నాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉండాలనే సినిమాలు తీస్తాను’’ అని అన్నారు.నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘ఇరుముడి’ నిర్మించే అవకాశం మాకు లభించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. సినిమాకు పూనకం వస్తే బ్లాక్‌బస్టర్ అని, ఆడియన్స్ కు పూనకం వస్తే ‘ఇరుముడి’ సినిమా అని నా స్నేహితుడు ఒకరు నాతో అన్నారు’’ అని చెప్పారు.వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు–సాంకేతిక నిపుణులు మా మైత్రీ ఫ్యామిలీలో యాడ్ అయ్యారు. ‘ఇరుముడి’ మా బ్యానర్లో కీరిటం లాంటిది. ఈ కీరిటంలో రవన్న, శివ నిర్వాణ వంటి వజ్రాలు ఉన్నాయి’’ అని చెప్పారు.ఈ వేడుకలో ‘ఇరుముడి’ టీమ్‌కి చెందిన సాయికుమార్, నక్షత్ర, జీవీ ప్రకాష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూనిట్ సభ్యులకు షీల్డులను ప్రదానం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘ఇరుముడి’ ఘనవిజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, రచయిత బీవీఎస్ రవి, రచయిత–దర్శక–నిర్మాత కోన వెంకట్, నిర్మాత సాహు గారపాటి ‘ఇరుముడి’ ఘనవిజయం సాధించినందుకు యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. -
రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!
-
రవితేజ ఇరుముడి.. పూనకాలు తెప్పించే ఫుల్ వీడియో సాంగ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్లలో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మల్లెపూల పల్లకి.. మందార పల్లకి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు థియేటర్లు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ పాటకు చౌడమ్ శ్రీనివాసరావు లిరిక్స్ అందించగా.. డప్పు శ్రీను ఆలపించారు. ఈ సాంగ్‌ను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీకమాసం ఫుల్ వీడియో పాటను ఇరుముడి టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ పాడడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించగా.. సాయి కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి. -
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రఫ్ కట్ చూశా... భలే నచ్చింది – రవితేజ
రవితేజ సోదరుడి తనయుడు, రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్గా నటించారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలోని మహిషాపురంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా రఫ్ కట్ చూశాను... భలే నచ్చింది. ఎమోషన్స్ బాగున్నాయి. కుషాల్, మయూర్‌లకు ఈ సినిమాతో మంచి పేరు, డబ్బులు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. తమిళ అమ్మాయి దీపా తెలంగాణ భాష నేర్చుకుని, ఈ సినిమాలో బాగా పెర్ఫార్మ్ చేసింది. తొలి సినిమా అయినా నాగరాజు బాగా తీశారు. తమ్ముడు మాధవ్ బాగున్నావ్ రా.. ! ఈ సినిమా కోసం మాధవ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు బాగుంది. ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. మాధవ్ భూపతిరాజు మాట్లాడుతూ– ‘‘ఆయన (రవితేజ) నాకు పెదనాన్న కాదు... నా అన్నయ్య. నా తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రావడం హ్యాపీగా ఉంది. ఒక మనిషికి, ఒక దున్న΄ోతుకు మధ్య ఉన్న అనుబంధం తాలూకు ఎమోషన్‌ను ఊరి దైవం మారెమ్మతో కథలో చక్కగా బ్లెండ్ చేశారు నాగరాజుగారు. ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది’’ అన్నారు. మయూర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నాగరాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది మా ఊరి కథ అని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. మాధవ్ ఇలాంటి రూటెడ్ కథను ఎంచుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి’’ అని చెప్పారు. మంచాల నాగరాజు మాట్లాడుతూ– ‘‘2006 టైమ్ ఫ్రేమ్‌లో ఈ సినిమా కథ సాగుతుంది’’ అన్నారు. -
ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!
-
‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రామ్‌చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.తాజాగా ‘ఇరుముడి’ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్లో చరణ్ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్‌తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్‌ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్‌పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు. -
'ఇరుముడి'కి రూ.200 కోట్లు.. స్పెషల్ సర్ప్రైజ్
రవితేజ 'ఇరుముడి' సినిమా ఎట్టకేలకు రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం సర్ప్రైజింగ్గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు.చాలామంది అయ్యప్ప భక్తులు.. తమ పిల్లలతో ఈ తరహా ఫొటోలు దిగుతూ ఉంటారు. అయితే సినిమాలో లేని ఈ ఫొటోని ఇప్పుడు రూ.200 కోట్ల వసూళ్లు దాటిన సందర్భంగా విడుదల చేసి అభిమానులని సర్ప్రైజ్ చేశారు. రెండో వీకెండ్ దాటేసి మూడో వారాంతంలోకి వచ్చినా సరే 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గవి ఏం కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ హవా చూపించేలా కనిపిస్తున్నాడు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?
-
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది.ఇప్పటికే ఈ మూవీ నుంచి అయ్యప్ప సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా మరో పాట విడుదల చేశారు మేకర్స్. కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కంపోజ్ చేయడంతో పాటు ఆలపించారు. -
రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో.. ట్రైలర్ రిలీజ్
'ఇరుముడి' హిట్ కొట్టిన రవితేజ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇతడి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘ కొడుకు మాధవ్ ప్రధాన పాత్ర చేసిన 'మారెమ్మ' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం(సెప్టెంబరు 10) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)గతంలో 'లవ్ యూ ఇడియట్' అనే మూవీలో మాధవ్ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదొచ్చిందా లేదా అనే సంగతి జనాలకు పెద్దగా తెలీదు. తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'మారెమ్మ' ఒప్పుకొన్నాడు. ఏడాది క్రితం దీని గురించి ప్రకటన వచ్చింది. కొన్నిరోజుల క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు.మారెమ్మ అనే గ్రామ దేవత, ఈ దేవి కోసం పెంచే ఓ దున్నపోతు. దాన్ని కాపాలా కాసే ఓ కాపరి. ఊరిలో జరిగే కొన్ని అరిష్టాలు. ఇలా ట్రైలర్ సాగింది. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యంగా మూవీ ఉండనుంది. ఇందులో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్గా చేసింది. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమాతోనైనా మాధవ్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) -
మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి శ్రీవిష్ణు
ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు హీరో శ్రీవిష్ణు. కొంత గ్యాప్ తరువాత మరోసారి అదే జానర్లోకి ఎంటరయ్యాడు ఈ హీరో. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.నేటి యువత అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, జీవిత పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఇది మన అందరి కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. యానిమేషన్‌తో మొదలైన ఈ గ్లింప్స్ హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేసింది. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో సన్నీ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన మిడిల్ క్లాస్ పాత్రతో ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి చందు, రవి సంగీతమందించనున్నారు.ఈ సినిమా తరువాత హీరో రవితేజతో కలిసి 2027 సంక్రాంతి పండక్కి ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్‌గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం. -
ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?
రెండో వారాంతం పూర్తయినప్పటికీ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో తెగ ఆడేస్తోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. దీంతో ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. హీరో, దర్శకనిర్మాతల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ఎవరూ ఊహించని విజయం ఇదని చెప్పొచ్చు. ఇప్పటికీ జనాలు థియేటర్లకు వెళ్లి ఈ మూవీ చూస్తున్నారు. అదే టైంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఓ తేదీ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'టాక్సిక్' సినిమాకు నెగిటివ్ టాక్.. యష్ తల్లి ఆవేశం)రవితేజకు గత కొన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ అనేది లేదు. దీంతో 'ఇరుముడి'పై కూడా హైప్ ఓ మాదిరిగానే ఉండేది. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యం కావడంతో సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఇది కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మారు. వాళ్లకు నమ్మకాన్ని నిజం చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైనే వసూళ్లు దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఇకపోతే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిబట్టి చూస్తే సెప్టెంబరు 18 నుంచే ఓటీటీ రిలీజ్ కావొచ్చు. లేదంటే నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో ఏమైనా మాట్లాడి ఇంకొన్ని వారాల స్ట్రీమింగ్ వాయిదా వేసేలా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే థియేటర్లలో మూవీ ఉన్నప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు లైఫ్ టైమ్ తగ్గిపోయింది. అంటే మూడు నాలుగు రోజులకే జనాలు చాలా చిత్రాల్ని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రవితేజ 'ఇరుముడి' అద్భుతాలు చేస్తోంది. థియేటర్లలో రిలీజై 10 రోజులు దాటినా సరే చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనాలు ఈ మూవీని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు ఈ మూవీలో అయ్యప్ప హిట్ పాట పూర్తి వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)అయ్యప్ప దీక్ష నేపథ్యంగా తీసిన 'ఇరుముడి'లో ఎంతో ఫేమస్ అయిన 'మల్లెపూల పల్లకి'తో పాటు 'ఇరుముడి కట్టు' అంటూ సాగే గీతం కూడా ఉంది. ఇప్పుడు దీని పూర్తి వీడియోనే విడుదల చేశారు. రవితేజ పోషించిన త్రినాథ్ పాత్ర.. అయ్యప్ప దీక్షని తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కూడా కలిసి డ్యాన్స్ చేస్తారు.ఇకపోతే 'ఇరుముడి'కి ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ చేరుకునేవరకు ఈ సినిమా జోరు ఆగేలా లేదు. ఇకపోతే ఈ మూవీతో చాన్నాళ్ల తర్వాత రవితేజ అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!
వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోకు ఒక్క హిట్ పడితే చాలు.. మళ్లీ పుంజుకోవడానికి అదే విజయమే ఊతమవుతుంది. ఇప్పుడు రవితేజ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘ఇరుముడి’తో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత రూ.100 కోట్ల వసూళ్లను అందుకున్నాడు. ‘ధమాకా’(2022) తర్వాత ఆయన నటించిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కొన్ని సినిమాలైతే కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి. దీంతో రవితేజ సినిమా వస్తుందంటే గతంలో కనిపించినంత హడావుడి కూడా కనిపించేది కాదు. కానీ ‘ఇరుముడి’ మాత్రం ఆ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. రవితేజలో మళ్లీ జోష్ నింపడమే కాకుండా.. ఆయన మార్కెట్‌పై కూడా కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చింది. దీంతో వచ్చిన విజయాన్ని ఎలాగైనా కొనసాగించాలని భావిస్తున్న రవితేజ.. తన లైనప్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.‘ఇరుముడి’ ఇచ్చిన ఊపు‘ఇరుముడి’ ఇంతటి బ్లాక్‌బస్టర్ కావడం అభిమానులకు మాత్రమే కాదు.. రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తెచ్చిందట. హిట్ అయితే చాలనుకున్న సినిమాకు ఏకంగా రికార్డు స్థాయి వసూళ్లు(8 రోజుల్లో రూ. 150 కోట్ల గ్రాస్) రావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. రెండో వారంలో ‘టాక్సిక్’ కారణంగా స్క్రీన్లు తగ్గినా.. ఆ సినిమా టాక్ ప్రభావంతో ‘ఇరుముడి’కి మళ్లీ షోలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇలాంటి భారీ విజయం తర్వాత హీరోలు మరింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒక్కసారి వచ్చిన సక్సెస్‌ను కొనసాగించాలంటే తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇప్పుడు రవితేజ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు టాక్.రవితేజ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులుప్రస్తుతం రవితేజ చేతిలో రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీవిష్ణుతో కలిసి దిల్ రాజు నిర్మాణంలో హసిత్ గోలి తెరకెక్కించనున్న ఎంటర్టైనర్. ఈ సినిమాకు ‘దాగుడుమూతల దండాకోర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత లక్ష్మణ్ నిర్మించనున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రానికి కొంత హారర్ టచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే వరుస ప్రకారం చూస్తే ముందుగా హసిత్ గోలి సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ‘ఇరుముడి’ తర్వాత రవితేజకు వచ్చిన సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లు సమాచారం. ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.అయితే రెండు సినిమాలను సమాంతరంగా చేయడం కూడా ఒక ఆప్షన్‌గానే ఉన్నప్పటికీ.. రవితేజ లుక్‌లో మార్పులు చేయాల్సి రావడంతో అది అంత సులభం కాదని తెలుస్తోంది. మరోవైపు హసిత్ గోలి తెరకెక్కించనున్న ఎంటర్టైనర్లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉందని సమాచారం. స్క్రిప్ట్‌పై మరింత వర్క్ చేయడానికి సమయం అవసరం కావడంతో ఆ సినిమాను కొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం జరుగుతున్న చర్చలు నిజమైతే.. సెప్టెంబర్ మూడో వారం లేదా అక్టోబర్‌లో వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో హసిత్ గోలి సినిమా మొదలైతే సంక్రాంతి విడుదలను టార్గెట్‌గా పెట్టుకుని షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చలే తప్ప అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఏదేమైనా ‘ఇరుముడి’ విజయం రవితేజ ఆలోచనా విధానంలో మాత్రం గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. కలెక్షన్స్ ఎంతంటే..?
చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో.. వరుస పరాజయాల తర్వాత ఓ విజయం పలకరించడం కూడా అంతే సహజమని మరోసారి నిరూపించాడు మాస్ మహారాజా రవితేజ. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోకు ఎట్టకేలకు ‘ఇరుముడి’తో హిట్ దొరికింది. అది కూడా మాములు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్.సినిమా రిలీజై వారం రోజులు గడిచినా ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్స్‌కి పోటెత్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు రూ.150 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అప్పుడెప్పుడో రూ. 100 కోట్లు.. రవితేజ ఖాతాలో రూ. 100 కోట్ల వసూళ్ల సినిమా పడి చాలా కాలమైంది. 2022లో వచ్చిన ధమాకా ఒక్కటే సెంచరీ కొట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. ఈ నాలుగేళ్లలో ఆయన 6 సినిమాలు చేస్తే.. వాటిలో ఏ ఒక్కటి కూడా హిట్ టాక్ని సంపాదించుకోలేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇరుముడితో హిట్ కొట్టి.. పాత లెక్కలన్నీ సరిచేశాడు. మరి ఇకపై ఈ మాస్ మహారాజ సినీ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. -
ఇరుముడి సక్సెస్ తో జాక్‌పాట్...హీరో, డైరెక్టర్ కు ఆఫర్ల వర్షం!
-
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
వారం గడిచిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో 'ఇరుముడి' సినిమా అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవైపు భారీ హైప్‌తో రిలీజైన 'టాక్సిక్'కి ఫ్లాప్ టాక్ రావడం రవితేజ మూవీకి ఈ వీకెండ్ మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఇందులో నాగులు అనే విలన్ టచ్ ఉన్న పాత్ర చేసిన కొమరం.. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ వివరాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా)'ఇరుముడి' సినిమా ముందు వరకు కొమరం అంటే లేడీ గెటప్స్ వేసే వ్యక్తిగా మాత్రమే జనాలకు తెలుసు. ఇతడిలో విలనిజం చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. నాగులు పాత్రలో సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఇప్పటికే తనకు వస్తున్న గుర్తింపు చూసి ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్న కొమరం, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను 16 రోజులు పనిచేస్తే.. రోజుకీ రూ.60 వేలు లెక్కన ఇచ్చారని చెప్పుకొచ్చాడు.అంటే 'ఇరుముడి'లో నటించినందుకుగానూ కొమరం రూ.9.6 లక్షలు అందుకున్నాడు. ఈ మూవీలో అద్భుతమైన యాక్టింగ్ చేసిన ఇతడికి.. 'బలగం' వేణు తాను తీస్తున్న 'ఎల్లమ్మ'లో పిలిచి అవకాశమిచ్చాడు. ఈ సంగతి కూడా స్వయంగా కొమరం మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గత 18 ఏళ్లుగా ఇతడు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'జబర్దస్త్' లాంటి షోల్లో లేడీ గెటప్స్ వేసుకునే కమెడియన్‌గానే జనాలకు తెలుసు. ఇప్పుడు 'ఇరుముడి'తో ఫేట్ మారిపోయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రోజుకు రూ.60 వేల పారితోషికం ఉన్నది కాస్త త్వరలో క్రేజ్ పెరిగితే రూ.లక్ష అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
'ఇరుముడి' కావేరీ.. షూటింగ్లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు)
-
ఇరుముడి ఆఫర్ వదులుకున్న సూర్య.. కారణం ఇదేనా?
-
ఇరుముడి క్రేజ్.. సొంత ఊరిలో వీక్షించిన నటుడు
టాలీవుడ్లో ఇప్పుడంతా ఇరుముడి మానియా నడుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు.భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్ రిలీజైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ఇరుముడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మౌత్ టాక్‌తో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి నటుడు అజయ్ ఘోష్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన సొంత ఊరు వేటపాలంలోని థియేటర్‌కు వెళ్లిన సామాన్య ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని మూవీని చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. తన సొంత ఊరు వేటపాలం థియేటర్లో లైన్లో నిల్చొని టికెట్ తీసుకుని #Irumudi సినిమా చూసిన నటుడు Ajay Ghosh. ❤️ pic.twitter.com/LeqCajihvC— cinee worldd (@Cinee_Worldd) August 27, 2026 -
200 కోట్ల వైపు పరుగులు పెడుతోన్న.. IRUMUDI
-
ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్‌కు సూటి ప్రశ్న
ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఒకటే పేరు వినిపిస్తోంది. అందరూ ఆ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. యశ్ టాక్సిక్ రిలీజైనా కూడా ఇరుముడి గురించే ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఓ కూతురి తండ్రి ఎలా పెంచాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారని అంటున్నారు. ఈ మూవీ రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్‌ను సైతం దాటేసింది.అయితే ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఆడియన్స్ క్యూ కడతారు. అందులోని మైనస్‌ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరుముడికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అవీ పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఈ మూవీ సమాజానికి సందేశం ఇచ్చేలా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు ఓ ప్రముఖ వైద్యుడు ఉప్పలపాటి రామ్ వర్మ. ఇరుముడి డైరెక్టర్ తీరును ఆయన తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.డాక్టర్ తన ట్వీట్లో రాస్తూ..'ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే... సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి.. అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరో పక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి అదే శ్రీరామ రక్ష అంటాడు.. ఒకపక్క ధైర్యంగా మాట్లాడాలి అనే ఆడపిల్లను చంపేసి.. మరోపక్క భయంతో నిజాలను దాచేసి తన జీవితాన్ని ఓ ఎమ్మెల్యే చేతిలో నాశనం చేసుకొన్న మరో ఆడపిల్ల' అంటూ రాసుకొచ్చారు.అసలు ఇరుముడి మూవీతో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ సినిమా చూసిన పిల్లలు రియల్ లైఫ్‌లో నిజం మాట్లాడినా.. బయటకు చెప్పినా చంపేస్తారేమోనన్న భయం, అనుమానం కలగదా..? ఇద్దరు ఆడపిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఈ డైరెక్టర్..? ధైర్యంగా ఉండే ఆడపిల్ల చనిపోకుండా ఉండింటే చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్లుగా ఉండేది కదా.. ఇదంతా సినిమా... సినిమాను సినిమాలా చూడాలని నీతులు చెప్పకండి అంటారు.. కానీ సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి కదా? అని పోస్ట్ చేశారు. మరి దీనిపై దర్శకుడు శివ నిర్వాణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే...సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరోపక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి… pic.twitter.com/Zdan8y6haL— Uppalapati Ramvarma (@DRRamvarma22) August 26, 2026 -
నిన్న రామ్‌చరణ్...నేడు చిరంజీవి... ‘ఇరుముడి’పై ‘మెగా’ ప్రశంసలు
ఇరుముడి.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై రష్మిక, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఎక్స్ వేదికగా తమ రివ్యూని ఇచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించానన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. (చదవండి: 'ఇరుముడి' సక్సెస్.. చరణ్ ప్రశంసలు)‘ఇరుముడి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నా ప్రియ సోదరుడు రవితేజకి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. త్రినాథ్ పాత్రను తన భుజాలపై మోశాడు. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను భావోద్వేగంతో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బేబీ నక్షత్ర(ఈ చిత్రంలో రవితేజ కూతురుగా నటించింది)కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు. చిత్ర బృందానికి, నిర్మాతలకు, నవీన్ యెర్నేని, ఇతరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక చిరంజీవి ట్వీట్‌పై రవితేజ కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్య..థ్యాంక్యూ సో మచ్’ అని రీట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)ఇరుముడి విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, బేబీ నక్షత్ర, సాయి కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.108.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻Director @ShivaNirvana, you…— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2026 -
ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?
-
రవితేజ సార్ ఒక బాహుబలి.. నక్షత్ర క్యూట్ పొటాటో... Teacher అంటే స్వాసికానే..!
-
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
ప్రస్తుతం అంతటా ‘ఇరుముడి’ ఫీవర్ నడుస్తోంది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. తండ్రికూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇదే సమయంలో మరో బాలనటి నటన.. ప్రేక్షకులను మత్రముగ్ధులను చేసింది. ఆమె మరేవరో కాదు బాలనటి నక్షత్ర. ఇరుముడి చిత్రం ద్వారా అందరిమనసులు దోచుకుంది ఈ బాలనటి . ఈ సినిమాలో ఆమెకి ఉన్న పాత్ర అలాంటిది మరి. మనమ్మపాత్ర సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. ఇప్పటికే డైరెక్టర్ నుంచి హీరో వరకు ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. అయితే ఇరుముడిలో ఆమెకు ఎలా అవకాశం వచ్చింది, ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతని ఇప్పుడు హాట్‌టాపిగ్ మారింది.పారితోషికం ఎంతంటే..ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుండగా, దర్శకుడు ఆమె తల్లిని సంప్రదించారట. హైదరాబాద్‌లో ఆడిషన్ ఇచ్చి, మనమ్మపాత్రకు ఎంపికయ్యారని అటు నక్షత్ర, ఇటు డైరెక్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. సుమారు రూ.10లక్షలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్ -
'రవితేజను ఓ బూతు మాట అనాలి.. నా వల్ల కాలేదు'
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప భక్తి తోడు కావడంతో థియేటర్ల వద్ద ఇరుముడి అదరగొడుతోంది.ఈ మూవీతో ఫేమస్ అయిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్ కొమురం ఒకరు. ఈ సినిమాలో ఏకంగా విలన్ పాత్రలో మెప్పించారు. ఒక్కసారిగా స్టార్ హీరో చిత్రంలో విలన్ రోల్ చేయడం నా కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేనని కొమురం అన్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కొమురం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమురం ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పెద్ద బ్యానర్లో నన్ను ఎలా తీసుకున్నారని మొదట నాకే అనుమానం వచ్చిందన్నారు. నా పాత్ర ఏదైనా చిన్న గే రోల్ ఉంటుందని భావించానని తెలిపారు. లుక్ టెస్ట్ కోసం పిలిస్తే మొదట తాను వెళ్లలేదన్నారు. షూట్‌కు వెళ్లే వరకు నా రోల్ ఏంటనేది కూడా తెలియదన్నారు. ఈ సినిమా పాత్రపై నాకు ఎక్కడా కూడా సంతృప్తిగా అనిపించలేదని తెలిపారు.కానీ డైరెక్టర్ శివ నన్ను పిలిచి మేకప్ వేసి మరి రెడీ చేశారు. నువ్వు సిగరెంట్, మందు తాగుతావు.. ఈ మూవీలో నువ్వు ఒక సైకోలా చేయాలని డైరెక్టర్ చెప్పారు. ఇదంతా విని నేను షాకయ్యా.. రవితేజ క్యారవాన్ దిగి రాగానే నాకు చెమటలు పట్టాయని అన్నారు. ఆయన రాగానే గళ్ల పట్టుకుని రవితేజను కొట్టాలని డైరెక్టర్ చెప్పారు.. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. అదే సీన్లో రవితేజను ఒక బూతు మాట అనాలని కూడా చెప్పారు.. కానీ అప్పుడే నాలో భయం మొదలైందని కొమురం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెద్ద హీరో కదా.. సింగిల్ టేక్‌లో చేయకపోతే బాగుండదని చెమటలు పట్టేశాయని కొమురం తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగులు అనే విలన్ పాత్రలో కొమురం ఆకట్టుకున్నారు. -
రవితేజకి బ్యాడ్ టైం చిక్కుల్లో ఇరుముడి
-
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
రవితేజ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ అందుకుంటాదేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చూసిన రష్మిక, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు చిత్రం అద్భుతంగా ఉందని చెబుతూ పోస్టులు పెట్టారు. ఇప్పుడీ ఈ లిస్టులోకి మెగాహీరో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే చరణ్.. 'ఇరుముడి' చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని, రవితేజ-మూవీ టీమ్ పడ్డ కష్టానికి ఈ ప్రశంసలు కచ్చితంగా అర్హమైనవి అని రాసుకొచ్చాడు. డైరెక్టర్ శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరిన్ని హిట్స్ కొట్టాలని చరణ్ ఆకాంక్షించాడు. చివరలో స్వామి శరణం అని బుధవారం ఉదయం ట్వీట్ చేశాడు.తండ్రికూతురు సెంటిమెంట్‌కి 41 రోజుల అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన సినిమా 'ఇరుముడి'. చాలామంది ఈ చిత్రం, ఇందులోని ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెటుకుంటున్నారు. జీవీ ప్రకాశ్ అందించిన పాటలు, శివ నిర్వాణ దర్శకత్వం కూడా ఈ మూవీకి మేజర్ ప్లస్ అయింది. రవితేజ కూడా గత చిత్రాల్లో కనిపించినట్లు కాకుండా సహజంగా నటించడం ప్రేక్షకులకు నచ్చింది.(ఇదీ చదవండి: రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే అని) -
సంక్రాంతికి సై
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తెలుగు లోగిళ్లలో ముగ్గుల పండగ వేళ విందూ వినోదాల్లో కొత్త సినిమాలది కూడా ఒక భాగమే. ఇండస్ట్రీకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆడియన్స్. ఈ టైమ్‌లో వచ్చే మూవీస్‌లో చాలా వరకు కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటాయి. అందుకే హీరోలు, దర్శక– నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తుంటారు. పైగా ఈ సమయంలో విడుదలయ్యే చిత్రాలకు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. పండగకి వచ్చే సినిమాల్లో ‘ఫలానా సినిమా’ బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే. అందుకే స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి పోటీకి సై అంటుంటారు. 2027 సంక్రాంతి మరో నాలుగు నెలలు ఉండగానే పలు చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు కూడా సంక్రాంతి రేసులో ఉండేందుకు ముస్తాబవుతున్నాయి. చిరంజీవి, వెంకటేశ్–కల్యాణ్ రామ్, రవితేజ, శర్వానంద్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కర్చీఫ్ వేసేశారు. బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, సూర్య వంటి హీరోలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. మరి... సంక్రాంతి బరిలో నిలిచిన, నిలవనున్న సినిమాలేంటో చూద్దాం. 13న కాకా రాక చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వరా రాజన్ , సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చినట్లు యూనిట్ పేర్కొంది.‘‘తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ‘కాకా’ కథనం సాగుతుంది. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేస్తున్నారు బాబీ. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో, యంగ్ వెర్షన్ లో తన యాటిట్యూడ్, ఎనర్జీతో ఆకట్టుకుంటారు. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. టైటిల్ గ్లింప్స్ తర్వాత ‘కాకా’ పై అంచనాలు పెరిగాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.జనవరి 12 విడుదల వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జనవరి 12 విడుదల’ (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్‌లైన్) అనే టైటిల్‌ను ఖరారు చేసి, సినిమాని కూడా జనవరి 12 విడుదల చేయనున్నట్లు ఓ ఫన్నీ వీడియోను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.‘‘దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉంటుంది.వెంకటేష్, కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య సినిమాలో ఉండే రిలేషన్ ను హైలెట్ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ని పెట్టడం జరిగింది. మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలవనుంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. దాగుడు మూతల దండాకోర్? ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటించనున్న ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ 64వ సినిమాకి ‘ఎస్వీసీ 64’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ని మంగళవారం ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలి పారు.‘‘రవితేజ, హసిత్ గోలి కలిసి ఓ హార్డ్‌కోర్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే... వైవిధ్యమైన కథలు, హ్యూమర్‌తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపిస్తారు. ఈ సంక్రాంతికి రవితేజ నుంచి రానున్న ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను, టైటిల్‌ని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే టైటిల్‌ని ఖరారు చేయనున్నారట మేకర్స్. 14న జార్జ్ క్రిష్ ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరో శర్వానంద్ తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ సినిమాకి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు జనవరి 14 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలి పారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’.‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో పండుగ సీజన్ లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేస్తున్నాం. సంక్రాంతి సీజన్లో శర్వాకు ఉన్న విజయ వంతమైన ట్రాక్ రికార్డ్, కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలకు శ్రీను వైట్లకు ఉన్న పేరు, ఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయంగా రూపొందించిన టైటిల్... ఇలా వీటన్నింటితో ‘జార్జ్ క్రిష్’ పూర్తి స్థాయి పండగ వినోద చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు’’ అన్నారు మేకర్స్. 8న మహాకాళి ‘హను–మాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్, శ్రియా రెడ్డి, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్ర ఖని, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నార్, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు.ఈ మైథాలజీ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ మూవీ ‘మహాకాళి’. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌పై ఏర్పడిన క్యూరియాసిటీని ఈ గ్లింప్స్ మరింత పెంచింది.ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి–చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రియా రెడ్డి కూడా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తారు. ‘హను–మాన్’ మూవీతో పీవీసీయూకు బలమైన పునాది వేసిన ప్రశాంత్ వర్మ భారతీయ ఇతిహాసాలను మోడరన్ విజువల్ ట్రీట్మెంట్తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ‘మహాకాళి’తో మరింత భారీ స్థాయికి తీసుకెళ్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. 12న సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరి 12 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు)’. ఇందులో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు దర్శకుడు రోహిత్ కేపీ. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. షూ టింగ్ విజయవంతంగా ముగియడంతో ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి పోస్ట్ ప్రోడక్షన్‌పై దృష్టి పెట్టాం’’ అని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.⇒ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ మూవీని డిసెంబరులో విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిర్స్లో వినిపించింది. అయితే డిసెంబరులో తన తనయుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే... సంక్రాంతికి ‘కింగ్ 100’ని విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన అట. పైగా సంక్రాంతి పండగ అంటే నాగార్జునకు బాగా కలిసి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. జనవరి 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ⇒ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న ఈ 111వ సినిమాకి ‘ఎన్బీకే 111’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎన్బీకే 111’ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే బాలకృష్ణకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ⇒ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీఖన్నా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ధర్మన్’ పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా విడుదల కానుంది. 2027 పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులోనూ రిలీజ్ కావడం ఖాయం. ఈ రకంగా ‘ధర్మన్’ కూడా సంక్రాంతికి తెలుగు తెరపై సందడి చేయనుంది. ⇒ ‘వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన 47వ చిత్రానికి ‘ఆవేశం’ మూవీ ఫేమ్ జిత్తు మాధవ్ డైరెక్టర్. ‘సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. ఈ సినిమాని పొంగల్‌కి (సంక్రాంతి) రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. సూర్య చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ రకంగా ఈ మూవీ టాలీవుడ్‌లోనూ విడుదలవుతుందని ఊహించవచ్చు. – డేరంగుల జగన్ మోహన్ -
రవితేజ ఇరుముడి.. వంద కోట్లు వచ్చేశాయ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తాజాగా మరో క్రేజీ రికార్డ్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు.తండ్రీ, కూతురి కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వందమార్క్ను కేవలం ఐదు రోజుల్లోనే చేరుకుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥 100 CRORES GROSS WORLDWIDE 🔥🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 -
ఇరుముడిలో బేబీ నక్షత్ర హైలెట్.. మరి ఈ క్యూట్ అమ్మాయి ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
రవితేజ ఇరుముడి.. ఏ ఓటీటీకి రానుందంటే?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఇరుముడి వందకోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ న్యూస్ వైరల్‌గా మారింది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఏదనే విషయంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ పార్ట్నర్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత బుల్లితెరపై సందడి చేయనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై ప్రకటన రానుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
చాలాకాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. శివ నిర్వాణ దర్శకత్వం ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. రవితేజ, బేబీ నక్షత్రల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ తన కథ, కథనంతో అందరినీ ఎమోషనల్ గురి చేశాడని చెబుతున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ రోజే ఈ చిత్రంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని.. ఇరుముడి తన మనసుని ఎంతగానో హత్తుకుందని ట్వీట్ చేసింది.(చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)‘నిన్న నాకు ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం లభించింది. అసలు ఎంత మంచి సినిమానో ఇది. ఊహించని విధంగా నా మనసును ఎంతగానో హత్తుకుంది. సాధారణంగా చిన్నతనంలో మనకేదైనా జరిగినా లేదా ఏదైనా మనల్ని బాధించినా, అమాయకత్వంతో మన మొదటి స్పందన పెద్దవాళ్లకు చెప్పడమే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు నిజం అర్థమవుతుంది.. ఏం జరిగినా సరే నోరు మూసుకుని ఊరుకోవాలని మనకు చెబుతారు... ఈ సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజ్. కచ్చితంగా ప్రస్తావించాల్సిన, మాట్లాడాల్సిన ఒక విషయాన్ని ఈ చిత్రం ఎత్తిచూపింది. (చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్‌లో వార్నర్)రవితేజ సర్, మీకు అభినందనలు.. ఈ విజయం సాధించినందుకు మీ తరఫున నేను ఎంతో సంతోషిస్తున్నాను.. నక్షత్రకు నా అభినందనలు.. సినిమాలో నువ్వు సూర్యకాంతిలా మెరిసావు, నీ నవ్వు నా పెదవులపై చిరునవ్వు నింపింది.. శివ నిర్వాణ గారికి శుభాకాంక్షలు.. మీరు ఈ విజయానికి అన్ని విధాలా అర్హులు.. మీ గురించి చాలా చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి అభినందనలు. ఇంతటి సుందరమైన చిత్రాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు’ అని రష్మిక ట్వీట్ చేసింది. Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026 -
‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్‌లో వార్నర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి మూవీ తీయండంతో డైరెక్టర్ శివ నిర్వాణ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపంచాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఆ రవితేజ పాత్రలో ఊహించుకుంటున్నారు. ఇప్పుడీ ఫీవర్ అంతర్జాతీయస్థాయికి పాకింది.గతంలోనూ వైరల్..అయ్యప్ప మాల ధరించిన గెటప్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్.. ఫ్యాన్ ఎడిట్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. అయితే వార్నర్ అభిమానులకు ఇదే కొత్త కాదు. ఇంతకముందు తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు, పాటలకు ఎన్నో సార్లు తనదైన స్టైల్లో డైలాగ్‌లు చెప్పడం, స్టెప్పులు వేయడం వంటి చేశాడు. ఇలా చేయడంతో ఇంతక ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇప్పుడు అదే స్టైల్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారాడు.ఇదీ చదవండి: 'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్? -
విలన్‌గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
జబర్దస్త్ అనగానే కామెడీ, పంచులు, విభిన్నమైన గెటప్స్ గుర్తుకొస్తాయి. ఆ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారు ఉన్నారు. అదే షోతో వివాదాలపాలు అయినవారూ ఉన్నారు. అలా దగ్గరయిన వారే కొమురం. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు లేడీ గెటప్స్‌తో అలరించిన ఆయన.. యాంకరింగ్ చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమాలో కొమురం కాస్త నాగులుగా కనిపించి మరో సారి ప్రేక్షకులను ఆశ్చర్చపరిచాడు.మరో కోణం..కామెడీతో నవ్వించిన నటుడు.. సీరియస్ విలనిజంలో మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ ఇది కూడా సాధ్యం అవుతుందని కొమురం నిరూపించాడు. రవితేజ హీరోగా వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో నాగులుగా కనిపించాడు. సీరియస్ బాడీ లాంగ్వేజ్, హావాభావాలు, డైలాగ్ డెలివరీతో విలన్ పాత్రకు న్యాయం చేశాడు. కామెడీగా పరిచయం అయిన ప్రేక్షకులకు సినిమాలో నెగెటివ్ షేడ్‌లో కనిపించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. దాదాపు 12 సంవత్సరాలు కొమురక్క పాత్రలో కనిపించి ఒక్కసారిగా విలన్‌గా మారిన తన అనుభవాన్ని, తనకు ఈ అవకాశమిచ్చిన వారికోసం మూవీ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ డైరెక్టర్‌తో సహ అక్కడ ఉన్న వారిని కంటితడి తెప్పించాడు.నా ఫోన్ మోగుతూనే ఉంది..‘ నన్ను చాలా మంది అవమానించారు. నాతో కలిసి రూమ్‌లో ఉన్న దాదాపు 15మంది డైరెక్టర్స్ అయ్యారు. నాకోసం వారికి పూర్తిగా తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ ఎవరో తెలీదు. కానీ ఈ పాత్ర ఇచ్చారు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ డైరెక్టర్ వల్లే కొమురక్క నుంచి నాగులుగా మారిపోయా. 12 ఏళ్లగా నన్ను చూసిన భార్య ‘ఇరుముడి’ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయింది. నేను మరణించే వరకు శివ నిర్వాణ అన్నను మర్చిపోను. ఒక వేళ మర్చిపోతే మనిషినే కాను’ అంటూ భావోద్వేగానికి గురవుతూ మాట్లాడాడు.ప్రశంసల వెల్లువమొత్తానికి ఇప్పటి వరకు నవ్వించిన కొమరం.. నాగులుగా మెప్పించాడు. కామెడీ నటుడిగా ముద్ర పడిన ఓ ఆర్టిస్ట్.. చాలా అనుభవం ఉన్న సీరియస్ నెగిటివ్ రోల్లో నటించి తన సత్తా చాటుకోవడం విశేషమనే చెప్పాలి. అటు తన నటన చూసిన ప్రేక్షకులు సైతం అతన్ని మెచ్చుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: డూప్నకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్..! -
ఇరుముడి సక్సెస్‌పై రవితేజ పవర్ఫుల్ స్పీచ్
-
మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రవితేజ, శ్రీ విష్టు మల్టీస్టారర్ మూవీ.!
మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ విజయం మంచి ఊరటనిచ్చింది. వరుస పరాజయాలతో కొంతకాలంగా సతమతమవుతున్న ఆయనకు ఈ సినిమా ఓ విజయాన్ని తెచ్చిపెట్టింది. తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి కళ్లు చెదిరే కలెక్షన్లు రాబెట్టింది. ఇప్పుడు రవితేజ తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.త్వరలో హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఫుల్ ఎంటర్టైనర్గా తీయబోయే ఈ సినిమాను దిల్‌రాజు నిర్మాతగా ఉండనున్నట్లు టాక్. ఈ సినిమాను తొలిత ఆగస్టు చివరిలో ప్రారంభించాలని మేకర్స్ భావించారట. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. -
ప్రేక్షకుల స్పందనతో కళ్లు చెమర్చాయి: రవితేజ
‘‘ఇరుముడి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ‘ఇరుముడి’కి థియేటర్‌కి రావడం భావోద్వేగంగా అనిపించింది’’ అని హీరో రవితేజ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) విడుదలయింది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘ఇరుముడి’ చూస్తున్నప్పుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిర్మాతలు రవి, నవీన్‌లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాతో ఇంత మంచి సినిమా చేసినందుకు శివ నిర్వాణకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో కావేరిలాంటి పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణగారికి ధన్యవాదాలు’’ అన్నారు ప్రియా భవాని శంకర్. ‘‘ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది’’ అని వై. రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నవీన్ యెర్నేని తెలిపారు. నటుడు సాయికుమార్, నటి స్వసిక, బేబీ నక్షత్ర, కెమెరామేన్ విష్ణు శర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు మాట్లాడారు. -
ఇరుముడిలో బేబీ నక్షత్ర.. ఇంత కన్నీటి కథ ఉందా?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా బేబీ నక్షత్ర తల్లిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు. -
'12 ఏళ్ల కొమురక్క.. ఇప్పుడు నాగులు.. అంతా మీ వల్లే'
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది.ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్ కొమురం కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నాగులు అనే పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కొమురం ఎమోషనల్ అయ్యారు. గత 12 ఏళ్లుగా కొమురక్కగా బతుకుతున్న నాగులుగా మార్చిన ఘనత శివ నిర్వాణకే దక్కుతుందన్నారు. ఈ అవకాశమిచ్చిన ఆయనకు తన జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. కొమురం మాటలు విన్న డైరెక్టర్ శివ నిర్వాణ సైతం ఎమోషనల్ అయ్యారు.ఈవెంట్లో కొమురం మాట్లాడుతూ..'నన్ను చాలా మంది అవమానపరిచారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నాతో కలిసి ఓకే రూమ్‌లో ఉన్న 15 మంది డైరెక్టర్స్ అయ్యారు. నేను ఎలా నటిస్తానో కూడా వాళ్లకు తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ అన్న ఈ పాత్ర ఎందుకిచ్చారో నాకు తెలియదు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ రోజు మీ వల్లే కొమురక్క నుంచి నేను నాగులుని అయిపోయా. నేను చచ్చే వరకూ శివ నిర్వాణ అన్నను మర్చిపోతే నేను మనిషినే కాదు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.ఇంకా మాట్లాడుతూ..' మొదటి రోజు షూటింగ్‌కు వెళ్లినప్పుడు నాది గే పాత్ర అనుకున్నా. కానీ, రవితేజగారిని కొట్టే ఫైట్ అని తెలిశాక చెమటలు పట్టాయి. ఈ మూవీలో ఆ సీన్ చూసి ఏడు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఫోన్ చేశారు. మన ఇండస్ట్రీలో వందమంది హీరోలు ఉంటే.. 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. ఆ 100 రకాల ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో మన రవితేజనే. నా జీవితంలో బతుకు భరోసా ఇచ్చిన పాత్రే ఈ నాగులు. 12 ఏళ్లుగా కొమురక్క గెటప్‌లో బతుకుతున్నా. ఆ గెటప్ నిజంగా లెజెండ్.. కానీ అది నేను కాదు. అదొక గెటప్ మాత్రమే' అని అన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవితేజ ‘ఇరుముడి’ సక్సెస్ సెలబ్రేషన్స్.. (ఫొటోలు)
-
'ఇరుముడి'లో విలనిజం.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
రవితేజ 'ఇరుముడి'కి తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఓ మాదిరి హైప్‌తోనే థియేటర్లలో రిలీజైనప్పటికీ.. తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెకండాఫ్‌లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే వసూళ్లు సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. కలెక్షన్స్ పోస్టర్ని అధికారికంగా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ)రిలీజైన మూడు రోజుల్లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లని 'ఇరుముడి' సొంతం చేసుకుందని వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపు లేదు, పండగల సీజన్ కూడా కాదు. అయినా కానీ తొలి వీకెండ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఇది నిలిచిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ మేరకు రెండు పోస్టర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.గత మూడు రోజులుగా అదరగొడుతున్న 'ఇరుముడి'.. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా టికెట్ బుకింగ్స్‌లో మంచి జోష్ చూపిస్తోంది. ప్రస్తుత టాక్ బట్టి చూస్తే సోమవారం నాటికి రూ.100 కోట్ల మార్క్ సులభంగా దాటేయొచ్చు. రెండు రోజుల్లో 'టాక్సిక్' రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు వసూళ్లు కాస్త నెమ్మదించే అవకాశముంది. మరి లాంగ్ రన్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)TELUGU CINEMA IS WITNESSING ITS BIGGEST BLOCKBUSTER💥🔥Fastest-ever 80 CR+ GROSS for a regional film 🔥RAVANNA’S BOX-OFFICE RAMPAGE ❤️🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/ENLLEXWHJo— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2026 -
కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!
-
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
దేవుడు అంటే నమ్మేవాళ్లు ఉన్నట్లే.. నమ్మని వాళ్లు కూడా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అయితే కొన్నిసార్లు డెస్టినీ చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సీన్ రిపీటైంది. అసలు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని రవితేజకు అదే దేవుడి వల్ల దాదాపు నాలుగేళ్ల తర్వాత హిట్ దక్కింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ)రవితేజ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి తీశారు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా జనాలు తెగ చూస్తున్నారు.అయితే సినిమాలో కూతురి సెంటిమెంట్ ఎంతలా ఆకట్టుకుంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూవీలో చివరి అరగంట చాలామంది ప్రేక్షకుల్ని ఏడిపించేసింది. అదే టైంలో అయ్యప్ప స్వామి నేపథ్యం, రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపించాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఇందులో చూసుకున్నారంటే అతిశయోక్తి లేదు.అయితే 'ఇరుముడి'లో అయ్యప్ప భక్తుడిగా ఆకట్టుకున్న రవితేజ.. నిజజీవితంలో దేవుడిని పెద్దగా నమ్మడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా చెప్పాడు. మూడేళ్ల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రిలీజ్ టైంలో హిందీలో ఓ యూట్యూబర్‌కి రవితేజ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే మాట్లాడుతూ.. 'రోజూ పూజ చేయడం, దేవుడి ప్రతిమలని ఆరాధించడం లాంటి వాటిని నేను నమ్మను. ప్రకృతే నాకు దేవుడితో సమానం' అని రవితేజ అన్నాడు. ఇప్పుడు అదే రవితేజ 'ఇరుముడి' అనే భక్తి చిత్రంతో నాలుగేళ్ల తర్వాత ఓ సక్సెస్ అందుకోవడం డెస్టినీ(విధి) అనుకోవాలేమో!(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ) -
‘ఇరుముడి’ రెండో రోజూ జోరు.. కలెక్షన్లు ఎంతంటే..!
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. శనివారం రెండో రోజు కూడా భారీ వసూళ్ల రాబట్టింది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. రెండో రోజు కూడా ఇండియాలో రూ.16.10 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.31.40కు చేరాయి. గ్రాస్ వసూళ్లు రూ.36.45 కోట్లుగా ఉన్నాయి.ఆంధ్ర, తెలంగాణలో 15.75 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి రూ.2 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో అతి తొందరలోనే ‘ఇరుముడి’ ప్రపంచ వ్యాపంగా రూ.50 కోట్లక్లబ్లోకి చేరే అవకాశముందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. -
రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం రిలీజైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీగా నిలిచింది. విడుదలైన రెండు రోజుల్లోనే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటివరకు ఓవర్సీస్లో రవితేజకు ఉన్న రికార్డును ఇరుముడి బ్రేక్ చేసింది. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టడంతో రాబోయే రోజుల్లో ఇరుముడి మరిన్ని రికార్డులు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించింది. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ఇరుముడి మీ మనసులో నిలిచిపోతుంది: రవితేజ
‘‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు మొదటి నుంచి అంత నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ తమిళనాడులో కూడా ఉండాలని కోరుకున్నాను. శివ నిర్వాణ అద్భుతంగా తీశాడు. ఈ సినిమాని మీతోపాటు మీ మనసులో పెట్టుకుంటారు’’ అని రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా, బేబీ నక్షత్ర కీలకపాత్రలో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 21) విడుదలైంది. శనివారం చెన్నైలో నిర్వహించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘నాకు తమిళ సినిమాతో చాలా అనుబంధం ఉంది. నటుడిగా నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది’’ అని తెలిపారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘తమిళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇరుముడి’ కథ అనుకున్నప్పుడే తమిళ్లో విడుదల చేయాలనుకున్నాం’’ అన్నారు.‘‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియా భవానీశంకర్ చెప్పారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుందని ఆశించామో దానికి మూడు రెట్లు ఎక్కువ విజయాన్ని అయ్యప్ప స్వామి మాకు అందించారు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్, బేబి నక్షత్ర మాట్లాడారు. -
'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ
చాన్నాళ్ల తర్వాత హీరోగా రవితేజ హిట్ కొట్టాడు. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'ఇరుముడి'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. దీంతో రవితేజ ఫుల్ హ్యాపీస్. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఇతడు తక్కువే రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ అదిరిపోయే జాక్ పాట్ కొట్టినట్లు మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాలో నటించినందుకుగానూ రవితేజ.. సాధారణంగా అందుకునే పారితోషికంలో మూడో వంతు మాత్రమే తీసుకున్నాడట. అదనంగా నైజాం థియేట్రికల్ హక్కులు దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ దక్కేసరికి రవితేజ రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువనే రాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.20 కోట్ల వరకు రవితేజకు దక్కనున్నట్లు సమాచారం.'ఇరుముడి' విషయానికొస్తే.. సీలేరు దగ్గర పల్లెటూరిలో ఉండే త్రినాథ్ (రవితేజ) లగేజీ ఆటో డ్రైవర్. భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణి(నక్షత్ర)తో కలిసి హ్యాపీగా బతికేస్తుంటాడు. ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటాడు. ఏం జరిగినా తనతో చెప్పాలని కూతురితో చెబుతాడు. ఆమె కూడా ప్రతిదీ నాన్నకు చెబుతూ ఉంటుంది. త్రినాథ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత తాను చదువుతున్న స్కూల్లో జరుగుతున్న ఓ సంఘటన గురించి కూతురికి తెలుస్తోంది. దానిని ఎలాగైనా నాన్నకు చెప్పాలనుకుంటుంది. ఇంతకీ మణి చెప్పాలనుకుంటున్న విషయమేంటి? త్రినాథ్‌కి వాటి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్
-
రవితేజ ఇరుముడి.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
రవితేజ ఇరుముడిపై యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ ప్రత్యేకమని ఆయన కొనియాడారు. ఈ సినిమా మీ అంతరాత్మను చాలా లోతుగా టచ్ చేస్తుందని తెలిపారు. ఈ కథ ఒక స్వచ్ఛమైన భావోద్వేగం, భక్తితో జరుపుకునే వేడుక అని అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. మాస్ మహారాజా రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశారు. ఈ మూవీ తప్పకుండా చూడాలని అభిమానులను కోరారు. సూపర్ హిట్ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఓ థియేటర్లో ఏకంగా మల్లెపూల సాంగ్ వచ్చినప్పుడు హారతులు కూడా పట్టారు. కాగా..ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. It’s a pure celebration of EMOTION and DEVOTION. 🔥 MASS MAHARAJA RAVI TEJA sir, BABY NAKSHATRA & SIVA NIRVANA take us on a unforgettable emotional ride. ❤️IRUMUDI is truly one of a kind for this generation, a film that touches something deep within you and stays with you even…— Sandeep Reddy Vanga (@imvangasandeep) August 21, 2026 -
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఇరుముడినటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర తదితరులునిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఆగస్ట్ 21,2026వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ.. రవితేజ ఖాతాలో ఓ మంచి హిట్ పడి చాలా కాలమైంది. దీంతో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనూ గతంలో ఉన్నంత ఆసక్తి, అంచనాలు కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత రవితేజ నటించిన ఓ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిందంటే అది ‘ఇరుముడి’ అనే చెప్పాలి. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఇంతటి హైప్ మధ్య నేడు(ఆగస్ట్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ ఎలా ఉంది? ఈ చిత్రంలో రవితేజ హిట్‌ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన త్రినాథ(రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తుంటాడు. భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ అలియాస్ మణెమ్మ (బేబీ నక్షత్ర) అంటే అతనికి ప్రాణం. ప్రతి ఏడాది అయ్యప్పమాల ధరించిన 41 రోజులు తప్ప.. మిగతా రోజులన్నీ తాగుతూనే ఉంటాడు. ఊర్లో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన.. త్రినాథ్ ఊరుకోడు. దానివల్ల త్రినాథ్‌కు చాలా మంది శత్రువులు ఏర్పడతారు. మరోవైపు ఊర్లో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండడంతో హైస్కూల్ కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. ఆ స్కూల్ టీచర్(స్వసికా) స్టూడెంట్స్‌ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అదే సమయంలో ఆ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని నిజాలు మణికంఠకు తెలుస్తాయి. ఆవేంటి? ప్రతి విషయాన్ని తండ్రితో చెప్పే మణికంఠ.. ఆ విషయాలను కూడా తండ్రికి చెప్పిందా? ఆ విషయం తెలిసిన తర్వాత త్రినాథ్ ఏం చేశాడు? గురుస్వామి గోపరాజు (సాయికుమార్)తో త్రినాథ్ అనుబంధం ఎలా ఉంది? త్రినాథ్ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..మాస్ మహారాజా రవితేజను అయ్యప్పమాల నేపథ్యంలో చూపిస్తామని ప్రకటించినప్పటి నుంచే ‘ఇరుముడి’పై ఆసక్తి మొదలైంది. రవితేజ మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన భక్తి నేపథ్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎలా డీల్ చేశారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో దర్శకుడు తనదైన మార్క్ చూపించారు. అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని తీసుకుని ఓ కుటుంబ కథను రాసుకున్న ఆయన.. దానికి క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు.ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కథకు తగ్గట్టుగా మిక్స్ చేయడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను దర్శకుడు బలంగా రాసుకున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేయడంతో పాటు.. పిల్లలను ఎలా పెంచాలి, వారి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనే విషయాలను ఇందులో చర్చించారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.భక్తి నేపథ్యం ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ పూర్తిగా భక్తి చిత్రంగా మారిపోలేదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. రొటీన్ స్టోరీనే అయినా.. స్క్రీన్‌ప్లేను నడిపించిన విధానం ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలను కథలో మిళితం చేసిన విధానం సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది.స్కూల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టే టీచర్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ, భార్య-కూతురితో ఆయనకున్న అనుబంధం, కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలు ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఫస్టాఫ్ పూర్తిగా పాజిటివ్‌గా ఉందని చెప్పలేం. ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్స్‌లో కొన్ని సన్నివేశాలు ఒకే తరహాలో రిపీట్ కావడం, కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ లోపాలను అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలు కొంతవరకు కవర్ చేశాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కథను ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రధాన ఎమోషన్‌ను క్లైమాక్స్‌లో బలంగా క్యారీ చేయడంలో దర్శకుడు మంచి ప్రభావాన్ని చూపించారు.అయితే ‘ఇరుముడి’లో లోపాలు కూడా లేకపోలేదు. దర్శకుడు కథను నమ్మి కొన్ని సందర్భాల్లో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్కు దూరంగా అనిపించడంతో పాటు.. మరికొన్ని చోట్ల కథనం మరింత సహజంగా ఉండాల్సిందనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘ఇరుముడి’ భక్తి నేపథ్యాన్ని కమర్షియల్ కథతో ముడిపెట్టిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎవరెలా చేశారంటే.. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాడు. సాధారణ మధ్యతరగతి తండ్రి త్రినాథ్ పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రిగా భావోద్వేగాలను పలికించిన సన్నివేశాల్లో రవితేజ నటన మెప్పిస్తుంది.ప్రియా భవానీ శంకర్ మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో సహజంగా నటించింది. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలను తన నటనతో చక్కగా చూపించింది. ఇక ఈ సినిమాకు బేబీ నక్షత్ర ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆమె పాత్ర చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. కీలక సన్నివేశాల్లో నక్షత్ర అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.జబర్దస్త్ కొమరం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన మార్క్ చూపించాడు. సీరియస్ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూ పాత్రకు న్యాయం చేశాడు. ఇక గురుస్వామి పాత్రలో సాయి కుమార్ అనుభవం కనిపిస్తుంది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఇరుముడి’ పాట, సెకండాఫ్‌లో వచ్చే ‘మల్లె పూల’పాటు అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
థియేటర్లలో అభిమానుల హారతులు
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. నేడు( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో అభిమానులు తెరలకు హారతులు ఇస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరలవుతున్నాయి. Swamy sharanam 🙏 #Irumudi pic.twitter.com/0Zlo9Mkz5G— RTR (@natweetsnaistm) August 21, 2026 -
‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?
-
ఇరుముడి సెన్సార్ టాక్ ఇదే!
-
'ఇరుముడి' సంగీతం ఓ సవాల్
‘‘ఇరుముడి’ సినిమాలో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ... ఇలా అన్ని భావోద్వేగాలున్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేశాను. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ చెప్పాడు. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు చేసిన సినిమా ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఆగస్టు 21) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘‘శివ నిర్వాణ ‘ఇరుముడి’ కథ చెప్పినప్పుడు అందులో లీనమయ్యాను. ఈ మూవీ మ్యూజిక్ విషయంలో రవితేజ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా భావోద్వేగంగా రూపొందిన క్లైమాక్స్ పాట అంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు మాత్రం ‘యాలాలో..’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మలాంటి పాట. నెలలో 15 రోజులు హీరోగా నేను చేసే సినిమాల్లో నటిస్తాను. మరో 15 రోజులు కంపోజింగ్‌లో ఉంటాను. ‘జనవరి 12 విడుదల’ పాటలు అద్భుతంగా వస్తున్నాయి. దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార, శ్రీ శ్రీ’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. నటుడిగా నేను చేస్తున్న ‘ఇమ్మోర్టల్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 4న రిలీజ్ కానుంది అని పేర్కొన్నాడు. -
'ఇరుముడి'లో పాత్ర నాకు చాలా ప్రత్యేకం
చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ రెడీ అయింది. ఇంతకుముందు తమిళ సినిమాల్లో వరసగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు సహా తదితర భాషల్లో నటిస్తోంది. అలా లేటెస్ట్గా 'ఇరుముడి' చేసింది. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా నటించగా శివ నిర్వాణ దర్శకుడు.'ఇరుముడి'లో నటించిన అనుభవాన్ని పంచుకున్న ప్రియా భవానీ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తయినా సరే అందులోని పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రని నేను ఇందులో చేశా. అమ్మగా కావేరీ అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. స్టోరీ విన్నప్పుడు దర్శకుడు శివ నిర్వాణ క్రియేట్ చేసిన లోకాన్ని అర్థం చేసుకున్నాను. ఇలాంటి నిజాయితీ, బలమైన పాత్రలో నటించడం చాలా సంతోషం అనిపించింది''ఇరుముడి సినిమాలో అనుబంధాలు, ఎంతో ప్రేమ, భావోద్వేగాలతో కూడిన మూమెంట్స్ ఉన్నాయి. ఇందులోని కావేరి పాత్ర నాకు చాలా స్పెషల్. రవితేజతో కలిసి నటించడం మంచి అనుభవం. ఆయన అందరితోనూ చాలా ప్రేమగా, సహజంగా మసలుకుంటారు. సినిమా కాకుండా చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ఇరుముడి చాలా మంచి అనుభవం' అని ప్రియా భవానీ శంకర్ చెప్పుకొచ్చింది. -
ఈ సినిమా కోసమే నేను అయ్యప్ప మాల వేసుకున్నా
నిన్ను కోరి, మజిలీ.. ఇలా నా సినిమాలన్నీ మళ్లీ మళ్లీ చెప్పుకునేలా ఉంటాయి. ఇండస్ట్రీ నుంచి నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా కథలు గుర్తుండిపోవాలన్నదే నా ఉద్దేశం. అందుకే నా ప్రతి కథ అలానే ఉంటుంది. అయితే 'ఇరుముడి'లో ఇంటెన్సిటీతో పాటు ఒక క్రైమ్ యాంగిల్‌తో అద్భుతమైన కథ కుదిరింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు శివ నిర్వాణ చెప్పాడు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘ఇరుముడి’. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ ఆసక్తికర విశేషాలు చెప్పారు.మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, క్రైమ్ యాంగిల్... ఇలా మూడు లేయర్స్ ఉంటాయి. చిన్నపాటి సందేశం కూడా ఉంది. తాగుబోతు త్రినాథ్ (సినిమాలో రవితేజ పాత్ర పేరు) అయ్యప్ప మాల ధరించక ముందు చేసిన కొన్ని ఘటనలు అతను అయ్యప్ప మాల ధరించిన తర్వాత వెంటాడతాయి. ఆ సమయంలో అతను ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.రవితేజగారు చేసిన ఈ పాత్ర చుట్టూ ఒక మంచి హ్యూమన్ డ్రామా కుదిరింది. కథలో అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. కానీ పూర్తిగా అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌తో సాగే అయ్యప్ప స్వామి కథ కాదు. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు హీరో ఎలా ఉంటాడు? మాలలో లేనప్పుడు ఎలా ఉంటాడు? అనేది అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథ ముందుకు వెళ్తుంది. ఈ సినిమా కోసమే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. అసలు అయ్యప్ప స్వామి మాలలోనే అద్భుతమైన హ్యూమన్ డ్రామా ఉందనిపిస్తోంది. ఆ మాల వేసుకున్న తర్వాత ఎవరైనా సరే చాలా నిష్టగా, భయభక్తులతో ఉంటారు. ఈ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి..’ పాట అద్భుతంగా ఉంటుంది. ఒరిజినల్ పాటలో ఉన్న వైబ్ మా సినిమాలోని వాయిస్‌లో లేదనే మాటలు వినిపిస్తున్నాయి. డప్పు శ్రీనుగారు 15 ఏళ్ల క్రితం ఈ పాట పాడారు. ఇప్పుడు ఆయన వయసు 60. అప్పటికి, ఇప్పటికీ ఎనర్జీలో కొంత మార్పు రావడం సహజం. ఈ పాటను థియేటర్లో ఒక పూనకంతో చూస్తారు. ఈ పాటలో రామ్ చరణ్ కనిపిస్తారన్న వార్తల్లో నిజం లేదు. ‘మాలికాపురం’ చిత్రంతో కూడా మా సినిమాకు పోలికలు ఉండవు. -
‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. ఈ చిత్ర నిడివిని 2 గంటల 25 నిమిషాలుగా ఖరారు చేశారు.కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటించగా, వారిద్దరి మధ్య ఉండే అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్ర బృందం చెబుతోంది.మద్యానికి బానిసైన వ్యక్తిగా..ఈ చిత్రంలో రవితేజ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. మద్యానికి బానిసైన అతడి జీవితంలో అయ్యప్ప మాల ధరించిన తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది కథలో కీలకాంశంగా ఉండనుందట. గ్రామంలోని మహిళలను తన కుమార్తెల్లా చూసుకునే అతడి స్వభావం కూడా కథను మలుపు తిప్పనుందని సమాచారం.సహజమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడంతో కథకు మరింత సహజత్వం వచ్చిందని చిత్ర యూనిట్ పేర్కొంది. రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. -
‘ఇరుముడి’లో రామ్ చరణ్.. టీమ్ క్లారిటీ!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని ఓ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా రామ్ చరణ్ టీమ్ స్పందించింది.‘ఇరుముడి’ సినిమాలో ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ అంటూ సాగే పాటలో రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలో కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. ఈ పాటలో ఆయన ప్రత్యేకంగా కనిపించనున్నారని, ఇది సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా ఉండబోతోందంటూ అభిమానులు, నెటిజన్లు చర్చించుకున్నారు.ఈ ప్రచారానికి ‘ఇరుముడి’ ప్రీరిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. సినిమాలోని ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ పాటలో అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని ఆయన చెప్పడంతో.. ఆ సర్ప్రైజ్ రామ్ చరణ్‌నే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో మెగా అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది.అయితే తాజాగా ఈ వార్తలకు చెక్ పడింది. రామ్ చరణ్ ‘ఇరుముడి’ సినిమాలో నటించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. సినిమాలో రామ్ చరణ్ కనిపించనున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయొద్దని కూడా రామ్ చరణ్ టీమ్ విజ్ఞప్తి చేసింది.దీంతో ‘ఇరుముడి’లో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారనే ప్రచారానికి తెరపడినట్లైంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో జీవీ ప్రకాశ్ చెప్పిన సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. ఆ సర్ప్రైజ్ ఏమిటన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది. -
మాస్ మహారాజా చిక్కుల్లో!
-
‘ఇరుముడి’ వేడుకలో బూతు పదాలు.. రవితేజపై నెటిజన్స్ ఫైర్!
ఈ మధ్య సినిమా ఈవెంట్స్‌లో నటీనటులు బూతు పదాలు మాట్లాడటం కామన్‌గా మారిపోయింది. స్టేజ్‌పై మాట్లాడుతున్నామనే విషయం మర్చిపోయి.. ఫ్లోలో నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఓ సినిమా వేడుకలో చేసిన పదప్రయోగం చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో రవితేజ, సీనియర్ నటుడు అజయ్ ఘోష్ కూడా సినిమా వేదికపై చేసిన కొన్ని పదప్రయోగాలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతున్నాయి.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదికైంది. కార్యక్రమం మొత్తం సందడిగా సాగినప్పటికీ.. రవితేజ, అజయ్ ఘోష్ మాట్లాడిన సమయంలో వినిపించిన ఒకట్రెండు అసభ్య పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ తన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను పొగిడే క్రమంలో అనుకోకుండా బూతు పదాలను వాడేశాడు. (చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!)మరో సందర్భంలో రవితేజ కూడా అభ్యంతరకరంగా భావించే ఓ పదాన్ని ఉపయోగించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని అడగగా 'ముదురు ము...' అని రవితేజ అంటాడు. ఒక స్టార్ హీరో..చిన్న పిల్లను అలా అనడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ప్రేమతో అన్నా సరే.. వేదికపై అలాంటి బూతు పదాన్ని వాడడం కరెక్ట్ కాదంటూ రవితేజను ట్రోల్ చేస్తున్నారు.(చదవండి:‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్ ప్రశ్న.. రియాక్షన్ ఇదే!)సాధారణ కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి పదాలు వినిపిస్తే.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తులకు ‘ఇరుముడి’ అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోనే బూతు పదాలు వినిపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!
టాలీవుడ్లో పలువురు హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా భూములు, ఇతర స్థిరాస్తులపై పెట్టుబడిగా పెడుతుంటారు. ఈ జాబితాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆయన శంకర్పల్లి సమీపంలో 26 ఎకరాల తోటను కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేసినట్లు నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి విలువ వందల కోట్లకు చేరిందని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది.రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన ‘మాస్ జాతర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కోసం శంకర్పల్లి సమీపంలోని 26 ఎకరాల తోటలో రైల్వే స్టేషన్, ఇల్లు తదితర సెట్లు ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. ఆ తోట రవితేజకు చెందినదేనని చెప్పారు.(చదవండి: నిజంలో బతకడం రవితేజకే చెల్లింది.. అజయ్ ఘోష్)‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. “నేను, రవితేజ కలిసి ‘మాస్ జాతర’ సినిమా చేశాం. ఆ సినిమాకు రైల్వే స్టేషన్ సెట్, ఇల్లు సెట్‌ను ఒక తోటలో వేశారు. శంకర్పల్లి దగ్గర ఉన్న 26 ఎకరాల తోట అది. ఆ తోట రవితేజ గారిదే. ఎప్పుడో దాన్ని రూ.12 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ వందల కోట్లు ఉంది” అని తెలిపారు.అదే సమయంలో సెట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను కూడా అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. ఆ తోట విలువ గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ఈ తోట అన్ని కోట్ల విలువ చేస్తుందని అంట కదా?” అని రవితేజను అడిగారట. అందుకు రవితేజ స్పందిస్తూ.. ‘ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి. కానీ మనం పని చేసుకోవాలి’ అని చెప్పినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
రవితేజపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఈ నటుడు మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఆ పిల్లోడు (రవితేజ)తో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ.. ఆయనతో పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని అన్నారు.రవితేజలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూశానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ‘నీలాంటి తాత్వికుడితో పనిచేశాను. వీళ్లందరికీ నువ్వొక హీరోలా కనిపిస్తావు. కానీ నేను నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తిని చూశా. నిజంగా ఉన్నది ఉన్నట్లు.. మొహమాటం లేకుండా మాట్లాడటం.. నిజంలో బతకడం.. నిజంగా ఉండడం మీకే చెల్లింది’అని రవితేజను ప్రశంసించారు.నేను అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో పని చేశా.. కానీ రవితేజతో నా అనుబంధం..రవితేజలో ఒక జిడ్డు కృష్ణమూర్తి వున్నాడు.- Ajay Ghosh#Irumudi Grand Pre-Release Event pic.twitter.com/e063kqVf17— idlebrain.com (@idlebraindotcom) August 16, 2026 -
ఇరుముడి డిఫరెంట్ మూవీ.. ఆ సీన్లు మనసుల్నీ తాకుతాయి: రవితేజ
‘‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. కొన్ని పాత్రలు ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో స్వాసికను చూస్తే భయం వేస్తుంది. నేను, నక్షత్ర కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి. కావేరి పాత్రలో ప్రియ చక్కగా నటించింది. మైత్రీ బేనర్లో నాకు ఇది మూడో సినిమా. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘మల్లెపూల పల్లకి..’ పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులు, నా అభిమానులు థియేటర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. డిఫరెంట్ రవన్నను (రవితేజ) చూడబోతున్నారు (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి). జీవీ ప్రకాశ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శివ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను’’ అని అన్నారు. ‘‘మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. సాధారణ తండ్రి, కూతుళ్ల కథ ఇది. మన అమ్మాయిలను ఇలా చూసుకోవాలని మనకు అనిపిస్తుంది’’ అని శివ నిర్వాణ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘అయ్యప్ప స్వామి దీక్షతో ఉన్న ఓ భక్తుడి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే థ్రిల్లింగ్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్, ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఆర్ఆర్ చేయడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు జీవీ ప్రకాష్ కుమార్. ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి..’ పాట పాడిన ఒరిజినల్ సింగర్ డప్పు రాంబాబు, ఒరిజినల్ కంపోజర్ సుంకర ఆంజనేయులు, లిరిసిస్ట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ చిత్రసంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటను రీ క్రియేట్ చేశారు. -
'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. అయ్యప్పస్వామి నేపథ్యం కూడా ఇందులో కొంతమేర ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజయ్యాయి. ఈ శుక్రవారమే (ఆగస్టు 21) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే 'మల్లెపూల పల్లకి' అంటూ సాగే అయ్యప్ప పాటని విడుదల చేశారు.శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ మధ్య తరగతి తండ్రిగా నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఇతడికి జంటగా కనిపించనుంది. నక్షత్ర అనే బాలనటి, రవితేజ కూతురిగా చేసింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేని రవితేజకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఇదెంత వరకు నెరవేరుస్తుందో చూడాలి? -
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
'నా పిల్లలు కూడా ఆ సలహా ఇస్తారు.. కానీ'
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు రవితేజ. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారాయన. తాను సోషల్ మీడియాను ఎక్కువగా వాడనని తెలిపారు. అయితే అభిమానుల్లో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఫోటోలు, కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేయాలని తన పిల్లలు సలహా ఇస్తుంటారని మాస్ మహారాజా వెల్లడించారు. అయితే తాను పిల్లల సూచనలను అరుదుగా పాటిస్తానని రవితేజ అన్నారు.ప్రస్తుతమున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రమోషన్ అవసరమని రవితేజ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను వాటి గురించి ఆందోళన చెందకుండా.. తనకు నచ్చినవి మాత్రమే పోస్ట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. కాగా.. ఇరుముడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
నవ్వించాలని ఉంది
రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కావేరి అనే గృహిణి పాత్ర చేశాను. భర్త, కుమార్తె... ఈ ఇద్దరే కావేరి ప్రపంచం. పల్లెటూరి యాసలో ఈ సినిమా డైలాగ్స్ చెప్పడం సవాల్‌గా అనిపించింది. ఈ చిత్రంలో ఫాదర్–డాటర్ ఎమోషన్ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది.ఈ సినిమా ట్రైలర్లో ఓ తండ్రి తన కుమార్తెను ఎంత బాధ్యతగా పెంచుతాడో కనిపిస్తుంది. అలాగే కూతురు కూడా ఏం జరిగినా పేరెంట్స్‌తో చెబుతుంటుంది. అలాంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు కల్పించాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు పిల్లలకు ఏం జరిగినా తమతో షేర్ చేసుకునే కంఫర్ట్‌ను పేరెంట్స్ ఇవ్వాలనే అంశం ఆలోచింపజేసేలా ఉంటుంది. లైఫ్‌లో నేను హ్యాపీ పర్సన్‌ని. అయితే ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ రోల్స్ చేశాను. నాకు మాత్రం మంచి ఫన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ప్రేక్షకులను నవ్వించే సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నాగచైతన్యగారి ‘ధూత 2’లో నటిస్తున్నాను. తమిళంలో చేసిన ‘డిమోంటి కాలనీ 3’ రిలీజ్‌కు రెడీ అవుతోంది’ అని తెలిపారు. -
'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఇరుముడిలో ఇన్ని చిక్కు ముడిలా.? అసలు కథ ఇదే..!
-
రవితేజ ‘ఇరుముడి’ మూవీ HD స్టిల్స్
-
'ఇరుముడి'కి శబరిమలతో సంబంధం లేదు
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. పోస్టర్స్ దగ్గర నుంచి పాటల వరకు చూస్తుంటే ఇది అయ్యప్ప దీక్ష, స్వామి మాల నేపథ్య కథతో తీశారని చాలామంది అనుకున్నారు. అయితే శబరిమలకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారమే చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)'ఈ సినిమా స్టోరీకి శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఓ భాగం మాత్రమే. దీక్ష టైంలో అయ్యప్ప భక్తులు తమ అలవాట్లు, నియమావళి విషయంలో నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఓ మనిషి ఈ దీక్ష స్వీకరించాల్సి వస్తే అతడు మద్యానికి దురంగా ఉండాల్సి వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉంటాయి కాబట్టి నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని తీసుకున్నాను. అంతే తప్ప శబరిమలతో సినిమా స్టోరీ కాదు. 41 రోజుల దీక్ష కథే మూవీని మరింత ప్లస్. దీక్షకు ముందు ఏం జరిగింది? దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి' అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్) -
అక్టోబరులో ఆరంభం
రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారట. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరు ప్రారంభంలో మొదలుపెట్టాలని దర్శకుడు హసిత్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ ఆరంభించి, పూర్తి చేస్తే పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం లభిస్తుందని భావిస్తున్నారట హసిత్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌తో రవితేజ బిజీగా ఉంటారు. ఆ తర్వాత చిన్న విరామం తీసుకుంటారట. ఆ బ్రేక్ తర్వాత హసిత్‌తో చేయనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట: కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. -
భావోద్వేగాల ఇరుముడి
ఒకవైపు నోటిలో కత్తితో, మరోవైపు అయ్యప్ప మాల ధరించి... ఇలా రెండు రకాల లుక్స్‌లో రవితేజ కనిపించనున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ నెల 21న ‘ఇరుముడి’ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ 12న భీమవరంలో ఓ భారీ ఈవెంట్‌ని నిర్వహించి, ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ‘‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!
సెట్స్‌కు వెళ్లడానికి హీరో రెడీ. స్టార్ట్... కెమెరా... యాక్షన్ చెప్పడానికి దర్శకుడు రెడీ. బడ్జెట్ కేటాయించేందుకు ప్రోడ్యూసర్ రెడీ. కానీ హీరోయిన్ మాత్రం నాట్ రెడీ. అవును... ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే. తమ హీరోకు సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ వెతుకులాటలో బిజీగా ఉన్నారు దర్శక–నిర్మాతలు. ఈలోపే ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ అంటూ... కొన్ని గాసిప్స్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి... ఏయే హీరోకి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!’ చూద్దాం... ఎవరెవరు జోడీ కడతారో మరి...ముచ్చటగా మూడోసారి ‘ఖిలాడి’, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారా? అంటే... ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాకు ‘వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్రయూనిట్ ప్లాన్ అట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయాలని హసిత్ గోలి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట హసిత్. ఇందులో భాగంగానే రవితేజకు జోడీగా నటించేందుకు డింపుల్ హయతిని సంప్రదించారని తెలిసింది.మరి... మూడోసారి కూడా రవితేజ–డింపుల్‌ల జోడీ సెట్ అవుతుందా? చూడాలి. అలాగే శ్రీ విష్ణుకు జోడీగా ఓ యంగ్ నటి కనిపిస్తారట. మరోవైపు రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ ఆగస్టు 21న విడుదల కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.దీపిక ప్లేస్‌లో ఆలియా? ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం అయిన కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూట్లో జాయిన్ అవుతారు. అయితే ఈ మూవీలోని మరో ప్రధానమైన లీడ్ రోల్‌ను ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 1లో దీపికా పదుకోన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడంలేదని చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్ ప్లేస్‌లో ఎవరు నటిస్తారు? అనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతోంది. తొలుత సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటివలి కాలంలో ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. త్వరలో ప్రభాస్‌తో పాటు లీడ్ హీరోయిన్ కూడా సెట్స్‌లో పాల్గొనాల్సి ఉందట. దీంతో దీపిక ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం లేక పోలేదు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘కల్కి 2’ సినిమా 2027 చివర్లో రిలీజ్ అవుతుందని టాక్.గాడ్ ఆఫ్ వార్‌లో... ‘అరవిందసమేత వీరరాఘవ’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు ఎనీ్టఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.చరణ్‌కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్ కెరీర్ లోని 17వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఏడాదిన్నర క్రితమే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్‌చరణ్ బిజీగా ఉండటం వల్ల ‘ఆర్సీ 17’ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే ప్రారంభించాలని అనుకున్నారు మేకర్స్. కానీ ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్ చేతికి గాయమైంది. దీంతో ఇటీవల కోయంబత్తూరులో చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రామ్‌చరణ్.ఈ గాయం నుంచి కోలుకుని తిరిగి రామ్‌చరణ్ షూట్లో పాల్గొనేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై కూడా సుకుమార్ దృష్టి సారించారట. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లును పరిశీలిస్తున్నారు మేకర్స్. సమంత, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా రుక్మిణీ వసంత్ పేరు తెరపైకి వచి్చంది. మరి... రామ్‌చరణ్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌నే నటిస్తారా? వేచి చూడాల్సిందే.రాకాలో నలుగురు నాయికలు? అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఒక హీరోయిన్గా కన్ఫార్మ్ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దీంతో ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ఈ చిత్రంలోని ఇతర హీరోయిన్ రోల్స్‌కు ఫైనలైజ్ అయ్యారని, ఆల్రెడీ ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఈ ముగ్గురూ పాల్గొంటున్నారని టాక్.అయితే జాన్వీ, రష్మిక, మృణాల్లు ఈ సినిమాలో భాగమైన అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.పైగా రష్మిక ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారట. దీంతో ఆమె ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించక పోవచ్చట. మరి... అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించే హీరోయిన్స్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధురంధర్’ తరహాలో తక్కువ టైమ్ గ్యాప్‌లోనే ‘రాకా’ రెండు భాగాలు రిలీజ్ కానున్నాయని సమాచారం.రోమియో ప్రేయసి... నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ సెప్టెంబరు 24న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్‌లోని ‘బ్లడీ రోమియో’ సినిమాలో నటిస్తారు నాని. అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్స్ జరుగుతాయని తెలిసింది. కానీ... ఈ సినిమా మేజర్ షూటింగ్ మాత్రం లండన్‌లో ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైన లైజ్ కాలేదు. ప్రస్తుతానికి భాగ్యశ్రీ భోర్సేను అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని, ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలై, నాని ‘బ్లడీ రోమియో’ షూట్‌ను స్టార్ట్ చేసిన తర్వాత భాగ్యశ్రీ ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతోందని ఇటీవల రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. నానికి చెందిన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రోడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి ఈ ‘బ్లడీ రోమియో’ను నిర్మించనున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది.సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో... రామ్ హీరోగా నటిస్తూ, కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రా పో 23 (వర్కింగ్ టైటిల్). ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ సాంగ్‌ను, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు రామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, హీరోయిన్ పాత్రకు శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ పేర్లను పరిశీలించారట. సంయుక్త ఆల్మోస్ట్ ఖరారు అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాని కారణంగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంటే... ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని చెప్పాచ్చు.ఎల్లమ్మ..! ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత కీర్తి సురేష్‌ను అనుకున్నారట. కానీ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, మమితా బైజు వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.నో హీరోయిన్!ఒకవైపు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంటే ఒక సినిమాకి మాత్రం హీరోయినే అక్కర్లేదట. ఎందుకంటే అసలు హీరోయిన్ లేకుండానే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కొంతమంది బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేక పోవడంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రనే తొలగించాలని మేకర్స్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇంకా మరికొందరు తెలుగు హీరోలు నటించనున్న మరికొన్ని కొత్త సినిమాల్లో హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు.– ముసిమి శివాంజనేయులు -
మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్
రవితేజ తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా 'ఇరుముడి'. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లేదంటే ప్రయోగాలు చేశాడు. ఇందులో మాత్రం కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా, ఓ పాపకు తండ్రిగా కనిపించనున్నాడు. ఈ నెల 21న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇదివరకే ఇరుముడి కట్టు అంటూ అయ్యప్ప గీతం రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు కుటుంబ బంధాన్ని ఆవిష్కరించేలా 'యాలాలో యాలాలో' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. ఓ గిరిజన ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన రవితేజ, సాయం చేసే భార్య, మంచి కూతురు.. వీళ్ల మధ్య బాండింగ్ ఇందులో చూపించారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు) -
ఫ్యామిలీ స్టార్స్
సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్. ఇలా తండ్రి ఎమోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్‌తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేయండి.గ్యాంగ్‌స్టర్ నాన్న కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.కొన్ని సీన్స్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారని టాక్. నివేతా పేతురాజ్ మరో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తోందని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటు క్లాస్... అటు మాస్ సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్ చేయిస్తాడు. ఈ మాస్ ఫాదర్ డీటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్ రోల్ చేస్తున్నారు వెంకటేశ్. అలాగే వెంకటేశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. క్లాస్‌గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్ అయి పోయే మాస్ ఫాదర్ రోల్ చేస్తున్నారట వెంకటేశ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ ఫిల్మ్స్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.కూతురు కోసం... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రి ఆదేశం తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్‌బాబు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్ విలన్ అని టాక్. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్‌గా ఈ సెట్స్‌లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నారు అట్లీ అండ్ టీమ్. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్. ఈ వెకేషన్ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్ సమాచారం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి హీరో... కొడుకు విలన్? ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రాయ, టాక్సిక్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్.‘టాక్సిక్’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్‌లో వీరిద్దరూ కలిసి మెయిన్ విలన్‌ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ విశ్వనాథ్ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టైటిల్లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్ రోల్ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్ విశ్వనాథ్‌గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ బాండింగ్స్ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.⇒ కార్తీ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఏఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్.⇒ మదర్ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్ సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్‌తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
వెండితెరపై మరోసారి ఖడ్గం
సూపర్ హిట్ సినిమా ‘ఖడ్గం’ మళ్లీ విడుదల కానుంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, సోనాలీ బెంద్రే, సంగీత ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 29న విడుదలై, భారీ విజయం సాధించింది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రీ రిలీజ్ కానుంది.దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణు మొలకల నక్షత్ర నిర్మాతగా, కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ–నిర్మాతలుగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘దేశభక్తి, భావోద్వేగం, ప్రేమ, వినోదం... ఇలా అన్ని అంశాల మేళవింపుతో ‘ఖడ్గం’ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
రవితేజ, శివ బాలాజీ, అల్లరి నరేశ్ ముఖ్య పాత్రల్లో వచ్చిన లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ శంభో శివ శంభో. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తమ స్నేహితుడి ప్రేమ కోసం ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన త్యాగమే ఈ సినిమా. తమ స్నేహితుడి ప్రేమ గెలవడానికి ముగ్గురు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ మూవీలో చూపించారు.2010లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియమణి హీరోయిన్గా మెప్పించింది. -
రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. #MAREMMA - SEPTEMBER 10TH! Best wishes to @maadhav_9999 and team 🤗 pic.twitter.com/p84lQanTvR— Ravi Teja (@RaviTeja_offl) July 22, 2026 -
రవితేజకు జిరాక్స్ కాపీ.. ఇలా కూడా ఉంటారా?
ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఏడుగురో ఏమో కానీ మనలా అచ్చం ఒక్కరు కనపడినా చాలని ఫీలవుతుంటాం. సడన్‌గా మనలాంటి వ్యక్తి ఎవరైనా ఎదురుగా వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురవ్వాలని మనం కూడా కోరుకుందాం. మనకేమో గానీ.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇతన్ని రవితేజ మూవీస్‌లో డూప్‌గా వాడుకోవచ్చు కదా కామెంట్స్ పెడుతున్నారు. అయితే రవితేజకు అచ్చం జిరాక్స్ కాపీలా అతనెవరో వివరాలేమీ తెలియదు. ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం మనలాగే అలా ఎవరైనా ఉంటే చూడాలని మీకు కూడా అనిపిస్తోంది కదూ.As it is గా వున్నాడు,డూప్ గ వాడుకోవచ్చు కదా ఎలాగో కాండిడేట్ ఫేస్ వాడి పోయినట్టు వుంటుంది#Raviteja pic.twitter.com/jBgMjGLmDB— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 21, 2026 -
పూజా హెగ్డే.. మళ్లీ పిలుపొచ్చింది!
ఆరేడేళ్ల క్రితం తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన పూజా హెగ్డే.. తర్వాత వరస డిజాస్టర్ల దెబ్బకు పూర్తిగా టాలీవుడ్లో కనిపించకుండా పోయింది. ఈమె నటించిన 'జన నాయగన్' రిలీజ్‌కి సిద్ధమైంది. కానీ ఇందులో ఈమె సీన్స్ పెద్దగా ఉండవని దర్శకుడు హెచ్.వినోద్ తేల్చేశాడు. మరోవైపు ఈమె 'శ్రీశ్రీ' అనే తెలుగు సినిమా చేస్తోంది గానీ ఇందులో దుల్కర్ హీరో. అయితే ఇప్పుడు ఈమెని వెతుక్కుంటూ మరో రెండు తెలుగు మూవీస్ వెళ్లాయట.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న ఫేమస్ యూట్యూబర్.. ఏడాదికి రూ.600 కోట్ల సంపాదన)'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డేని అనుకుంటున్నారట. గతంలో బన్నీ-పూజా కలిసి దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో చిత్రాల్లో నటించారు. అప్పట్లో సక్సెస్ అందుకున్నారు గానీ ఇప్పుడు పూజా ఫామ్ ఏమంత గొప్పగా లేదు. మరి ఈమెని ఓకే చేస్తారా లేదా అనేది చూడాలి?మరోవైపు రవితేజ సరసన కూడా పూజా హెగ్డే ఛాన్స్ కొట్టినట్లు కనిపిస్తుంది. రవితేజ-శ్రీ విష్ణు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు. హసిత్ గోలి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ కోసం పూజాని ఓ హీరోయిన్గా అనుకుంటున్నారట. ఒకవేళ ఇది నిజమైతే కష్టకాలంలో ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ దొరికినట్లే. ఈ రెండు చిత్రాలు గనక సెట్ అయి, ఇవి హిట్ అయితే గనక పూజా మళ్లీ తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా) -
తిలక్ వర్మ జట్టును వీడాడు.. పరాజయాల పరంపరతో..
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ నుంచి మెదక్ ఫాల్కన్స్ నిష్క్రమించింది. ఖమ్మం ఏసెస్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఓడిపోయి.. పరాజయంతో టోర్నీని ముగించింది.కాగా సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో మెదక్ సంచలన విజయం సాధించింది. వరంగల్ వారియర్స్ విధించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ మెదక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. సెంచరీ (56 బంతుల్లో 136 నాటౌట్) బాది జట్టును గెలిపించాడు.Goosebumps! 🥶Stuff of dreams, really. The whole of Medak Falcons feel it. The whole of Telangana feels it! 😍😍#WWvMF #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/cASKvz7vgs— tg20official (@tg20official) June 22, 2026తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా..ఆ తర్వాత తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా.. మెదక్ పరాజయాల పరంపర కొనసాగింది. గెలుపున్నదే లేక చతికిల పడిన మెదక్.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. అయితే, సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన మెదక్ తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగాఆరంభంలోనే ఓపెనర్లలో జీఎస్కే రెడ్డిని డకౌట్ చేయడం సహా వాఫీ కచ్చి (14)ని కూడా త్వరగానే పెవిలియన్‌కు పంపి కెప్టెన్ రవితేజ శుభారంభం అందించాడు. మికిల్ జైస్వాల్ (15) అర్జున్ పెవిలియన్‌కు చేర్చగా ఖమ్మం ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 57 బంతుల్లోనే 103 పరుగులతో హిమతేజ అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ప్రతీక్ రెడ్డి (32) రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది.శుభారంభం అందించినా..ఓపెనర్లు నమన్ అగర్వాల్ (19 బంతుల్లో 32), శృంజిత్ రెడ్డి (46 బంతుల్లో 60) శుభారంభం అందించినా.. మిగతా వాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. కెప్టెన్ రవితేజ డకౌట్ కాగా.. విక్రమ్ నాయక్ (7), వరుణ్ యర్రం (0) తీవ్రంగా నిరాశపరిచారు.ఇక సూర్య తేజ (19 బంతుల్లో 26), ఇషాన్ శర్మ (15 బంతుల్లో 34 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఫలితంగా మెదక్ 19 పరుగుల తేడాతో ఓడిపోయి భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఖమ్మం ఈ విజయంతో ఐదో గెలుపు నమోదు చేసి పది పాయింట్లతో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. ఇక మెదక్‌తో మ్యాచ్‌లో ఖమ్మం బౌలర్లు హర్షిత్ సాయి, విద్యానంద రెడ్డి, వాఫీ కచ్చీ తలా రెండు వికెట్లు తీయగా.. వేద్రెడ్డికి ఒక వికెట్ దక్కింది. -
ఇరుజట్లకు ఆఖరి మ్యాచ్.. తుదిజట్లు ఇవే
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఖమ్మం.. నాలుగింట గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. మెదక్ మాత్రం పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో మెదక్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లు సాధించింది. లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.తుదిజట్లుఖమ్మంసీవీ మిలింద్ (కెప్టెన్), వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, హర్షిత్ సాయి, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.మెదక్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, ఇషాన్ శర్మ (వికెట్ కీపర్), విక్రమ్ నాయక్, సాయి వరుణ్ యెర్రం, అర్జున్ గొర్రపల్లి, ఎన్ సూర్యతేజ, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె, శశాంత్ బూడిది. -
నల్గొండతో మ్యాచ్.. మెదక్ నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా టాస్ గెలిచిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.ఓపెనర్లలో నమన్ అగర్వాల్ (18) ఫర్వాలేదనిపించగా.. శృంజిత్ రెడ్డి (17 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రవితేజ 33 పరుగులు చేశాడు. ఆఖర్లో విక్రం నాయక్ (31 బంతుల్లో 48), వరుణ్ యర్రం (29 బంతుల్లో 44) మెరుగ్గా రాణించి అజేయంగా నిలిచారు. నల్గొండ బౌలర్లలో రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి, సతాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.తుదిజట్లుమెదక్ ఫాల్కన్స్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్ కీపర్), సాయి వరుణ్ యర్రం, అర్జున్ గొర్రపల్లి, జగమ్ బన్నీ, నొమన్ అహ్మద్, సయ్మద్ ఘాజి అబ్బాస్, కార్తికేయ కాక్, మధుకర్ మన్నెనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, టి.హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, నితీశ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, ఇల్యాన్ సతాని, ఉర్వేశ్ కక్కడ్, రక్షన్ రెడ్డి. -
సంక్రాంతి బరిలో కామెడీ మల్టీస్టారర్
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో 2026 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించిన హీరో రవితేజ 2027 సంక్రాంతి పండక్కి కూడా ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్‌గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుందట. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్
గత కొన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అందుకోలేకపోతున్న హీరో రవితేజ.. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో తండ్రి-కూతురు సెంటిమెంటే దీని స్టోరీ. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ కానుందని కొన్నిరోజలు క్రితమే ప్రకటించారు. ఇప్పుడు 'ఇరుముడి కట్టు' అంటూ సాగే తొలి పాటని విడుదల చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు)'ఇరుముడి కట్టు' పాట గురించి అయ్యప్ప భక్తులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సదరు గీతం నుంచి లిరిక్స్ తీసుకున్నప్పటికీ ట్యూన్ మాత్రం చాలావరకు మార్చేశారు. 'స్వామియే అయ్యప్పో.. అయ్యప్పో స్వామియే' అనే లిరిక్స్, ట్యూన్ మాత్రం అలానే ఉంచేశారు. అయినా సరే ఈ గీతం వినడానికి బాగుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా శివ నిర్వాణ దర్శకుడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' ఓటీటీ.. కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్) -
మారిపోతున్న మన హీరోలు.. మార్పు మంచిదే!
హీరో అంటే కేవలం హ్యాండ్సమ్గా, క్లాస్ లుక్‌లోనే కనిపించాలి... చొక్కా నలగకుండా విలన్లను రఫ్ఫాడించాలి.. కొత్త కొత్త ట్రెండీ డ్రెస్‌లతో హీరోయిన్లతో ఆడిపాడాలన్నది గతం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ట్రెండ్ మారుతూ వస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత మాస్ లుక్‌లో అయినా కనిపించేందుకు హీరోలు సై అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం చొక్కాలు విప్పి మరీ విలన్ల భరతం పడుతున్నారు. ఆయా పాత్రల కోసం లాంగ్ హెయిర్ స్టైల్,పొడవాటి గెడ్డం, సిక్స్ ప్యాక్ బాడీ... ఇలా తమ అభిమానులనే కాదు... సగటు సినీ ప్రేమికులను అలరించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నిఖిల్, అఖిల్, సాయి దుర్గాతేజ్, విరాట్ కర్ణ వంటి హీరోలు తమ తాజా చిత్రాల కోసం లుక్స్ ఛేంజ్ చేసి, సరికొత్త లుక్‌లోకి మారారు. ఇలా మారడం మంచిదే అంటూ... ఏ సినిమాల కోసం ఇలా సరికొత్తగా మేకోవర్ అయ్యారు? అనే వివరాలు చూద్దాం... వారణాసి కోసం... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా హీరోయిన్. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. గతంలో ఎన్నడూ కనిపించనంతగా పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారాయన. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్‌బాబు పేర్కొన్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ డ్రాగన్... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. బిజూ మీనన్ , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గుత్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, బిమల్ జీత్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్స్‌లోకి మారిపోయారు. ఈ మూవీలో ఆయన రెండు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం సన్నగా మారిపోయారాయన. అలాగే మరో పాత్రకు తగ్గట్లు సిక్స్‌ప్యాక్‌తో పవర్ఫుల్ లుక్‌లోకి మారారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ ్ర΄ాంతంలోని అంతర్జాతీయ అఫీమ్ అక్రమ వ్యా΄ారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే ΄ాత్రలో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యక్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్ 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ∙యాక్షన్ సింగ... హీరో గోపీచంద్ తన కెరీర్లో ఇప్పటివ రకూ ఎన్నో యాక్షన్ రోల్స్, మాస్ క్యారెక్టర్స్ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. గోపీచంద్ కెరీర్లో 34వ సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టై¯Œ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్‌తో ΄ాటు ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేసింది యూనిట్. ఈ మూవీ కోసం ఆయన ఫుల్ మాస్ లుక్‌లో మేకోవర్ అయ్యారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న చిత్రం ‘సింగ’. గెడ్డం, మీసం, చెవి΄ోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ అవతార్‌లో చూపించాలో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించనున్నారు వెంకట్’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రా అండ్ రస్టిక్ జడల్ ‘దసరా’ (2023), ‘హిట్ : ది థర్డ్‌కేస్’ (2025) వంటి సినిమాల తర్వాత ‘ది ΄్యారడైజ్’ కోసం మరోసారి పక్కా రా అండ్ రస్టిక్ లుక్‌లోకి మారి΄ోయారు హీరో నాని. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష¯Œ లో రూ΄÷ందుతున్న సినిమా ఇది. వారిద్దరి కాంబినేషన్లో ‘దసరా’ మూవీ నిర్మించిన సుధాకర్ చెరుకూరి ‘ది ΄్యారడైజ్’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు విలన్‌గా, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూ΄÷ందుతోన్న ఈ సినిమా కోసం పవర్ఫుల్ రా అండ్ రస్టిక్ లుక్‌లోకి మారి΄ోయారు నాని. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే ఫుల్ మాస్ ΄ాత్రలో నటిస్తున్నారాయన. ఈ క్యారెక్టర్ కోసం ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో కొత్త లుక్‌లోకి మారారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌లో నాని రెండు జడలు వేసుకుని కనిపించగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక వెండితెరపై నాని ఏ స్థాయిలో తన నట విశ్వరూపం చూ΄ారో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న రిలీజ్ అవుతోంది. డబుల్ ధమాకా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవి కిరణ్ కోలా దర్శకుడు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో భారీ ΄ాన్ ఇండియా ్ర΄ాజెక్ట్గా తెరకెక్కుతోన్న ‘రౌడీ జనార్థన’ సినిమాలో విజయ్ తొలిసారి పూర్తి స్థాయి పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న విడుదల చేసిన విజయ్ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘విజయ్ ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ, ‘రౌడీ జనార్థన’ లాంటి పూర్తి స్థాయి మాస్ ΄ాత్ర ఇంతవరకు చేయలేదు. తొలిసారి ఈ సినిమాలో తనతో తూర్పు గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. – మ మ మాస్... అక్కినేని అఖిల్ చూడ్డానికి ఫుల్ క్లాస్ లుక్‌లో కనిపిస్తుంటారు. అయితే ఆయన మాస్ లుక్‌లో కనిపించిన తొలి చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించారు అఖిల్. ఆ మూవీ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మాస్.. మ మ మాస్ అంటూ పవర్ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. పొడవాటి హెయిర్ స్టైల్‌తో పాటు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ రూపొందింది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెప్పారు అఖిల్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మే 23కి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నాగార్జున 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లెనిన్’ టీజర్‌ని విడుదల చేశారు. ‘ఎన్టీఆర్ అంత గొప్ప కాకపోయినా నువ్వు బానే సెప్పినావులే’, ‘ఏయ్... ఏందమ్మీ అట్టా మాట్టాడుతుండావు... ఈ లెనిన్గాడు నిప్పు’, ‘నేను తప్పి΄ోయి రాలేదు మచ్చా.. మీ అందర్నీ వెతుక్కుంటూ వచ్చిన’ అంటూ టీజర్లో అఖిల్ చెప్పే డైలాగులకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా జూన్ 26న విడుదల కావాల్సి ఉండగా జూలై 10కి వాయిదా పడింది. పీరియాడిక్ యాక్షన్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ‘భోగి’ సినిమా కోసం శర్వానంద్ సరికొత్తగా మాస్ లుక్‌లో మేకోవర్ అయ్యారు. ‘‘1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూ΄÷ందుతోన్న సినిమా ‘భోగి’. ఈ ΄ాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేలా మా సినిమా ఉంటుంది. మోస్ట్ ఇంటె¯Œ ్స, రిస్కీ స్టంట్లతో తన నటనలో సరికొత్త కోణాన్ని శర్వానంద్ చూపించబోతున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో ΄ాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్ సిద్ధార్థ పొడవైన హెయిర్ స్టైల్, గెడ్డంతో సరికొత్తగా మేకోవర్ అయ్యారు. జూన్ 1న నిఖిల్ సిద్ధార్థ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘స్వయంభు’ నుంచి నిఖిల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెన్స్ ప్రిపరేషన్‌కి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్‌గా రూపొందిన చిత్రం ‘స్వయంభు’. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా మా మూవీ రూపొందింది. వైర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, గాల్లో చేసే విన్యాసాలు, ఫ్లిప్స్, క్లిష్టమైన ఫైట్ మూమెంట్స్‌ను నిఖిల్ సాధన చేస్తున్న దశ్యాలు ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రాచీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని రూ΄÷ందిస్తున్నాం. ΄ాన్ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన మా సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఏటిగట్టుపై సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తన క్యారెక్టర్ కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గుబురు గెడ్డం, కండలు తిరిగిన దేహంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారాయన. ఈ మూవీ చివరి షెడ్యూల్ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరులో విడుదల కానుంది. ఇరుముడికి... క్లాస్, మాస్... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోతుంటారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఈ పాత్రకు తగ్గట్టు గెడ్డం, కొంచెం పొడవాటి హెయిర్ స్టైల్‌తో మేకోవర్ అయ్యారాయన. ‘‘ఇరుముడి’లో యాక్షన్ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటుంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.రెండో సినిమాకే... ‘పెదకాపు’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విరాట్ కర్ణ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చి త్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. 2023 సెప్టెంబరు 29న ఈ చిత్రం రిలీజైంది. తొలి సినిమాలోనే మాస్ క్యారెక్టర్లో కనిపించి, నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విరాట్ కర్ణ. ఆయన హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించారు.కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలో రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు విరాట్ కర్ణ. తన కెరీర్లోనే రెండో సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో ఆయా పాత్రల కోసం సిక్స్ ప్యాక్, పొడవాటి జుట్టు, గెడ్డంతో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నటించారు విరాట్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘నాగబంధం’ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 3న విడుదల కానుంది. డబుల్ ధమాకా హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్లో ఒకేసారి రెండు మాస్ మూవీస్‌లో నటిస్తున్నారు. వాటిలో ‘రణబాలి, రౌడీ జనార్థన’ సినిమాలుఉన్నాయి. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న ΄ాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హాలీవుడ్ నటుడు ‘మమ్మీ’ మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘రణబాలి’ చిత్రం కోసం విజయ్ దేవరకొండ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. హెయిర్‌స్టైల్‌తో పాటు లావుపాటి మీసాలతో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటాయని యూనిట్ పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సెప్టెంబరు 11న విడుదల కానుంది. పైన పేర్కొన్న హీరోలు మాత్రమే కాదు... మరికొంత మంది స్టార్, సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమ సినిమాల కోసం సరికొత్తగా లుక్స్ ఛేంజ్ చేస్తున్నారు. -
నాన్నకు ప్రేమతో..
నాన్న అంటే ఓ భావోద్వేగం... నాన్న అంటే నమ్మకం... నాన్న అంటే భరోసా... నాన్న అంటే సూపర్ హీరో... నాన్న అంటే ప్రేమకు నిర్వచనం... ఆ ప్రేమ అనంతం.. అందుకే సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఫాదర్ ఎమోషన్ ఎవర్ గ్రీన్. వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కాసులు వర్షం కురిపిస్తారు. అందుకే ఫాదర్ ఎమోషన్‌తో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా ఉంది. మరి... ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఫాదర్ ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ కాకాజీ చిరంజీవి ‘డాడీ’ సినిమా గుర్తుందిగా..! ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో తండ్రీకూతుళ్ల ఎమోషన్ భావోద్వేగభరితంగానే సాగుతుంది. ఇక చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’లోనూ ఫాదర్–డాటర్ ఎమోషనల్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఓకే చేశారట చిరంజీవి.‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయని తెలిసింది. కథలో చిరంజీవి, అనశ్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.తొలి షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైందని తెలిసింది. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్స్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్.కూతురు కోసం..! కూతురు కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు హీరో నాగార్జున. ఏం చేశారు? అనేది ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో చూడొచ్చని తెలిసింది. నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘కింగ్ 100’. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. నాగార్జున కెరీర్‌లోని ఈ 100వ సినిమాలో టబు, సుష్మితా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టెక్నాలజీ సాయంతో పాతికేళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నాగార్జున కనిపించనున్నట్లు తెలిసింది.ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు... ఈ ‘కింగ్ 100’ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు కూడా నటిస్తారని తెలిసింది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్’ చిత్రంలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉన్న విషయం ఆ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది.ఇరుముడి రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రధానంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్టు నక్షత్ర నటిస్తోంది.రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెర పాలెం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘విక్రమార్కుడు’లో మంచి ఫాదర్–డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే.ఇటు స్పిరిట్... అటు సలార్... దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలు ‘అర్జున్ రెడ్డి, యానిమల్’. ఈ రెండు చిత్రాల్లోనూ అంతర్లీనంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. ఈ తరహా ఎమోషనల్ బాండింగ్ సందీప్ తాజా చిత్రం ‘స్పిరిట్’లోనూ కనిపించనుందని తెలిసింది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్, ప్రకాష్‌రాజ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని భోగట్టా.ప్రకాష్‌రాజ్ సైతం పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా నుంచి తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’వచ్చింది. ఈ చిత్రంలో దేవ పాత్రలో నటించారు ప్రభాస్.తొలి భాగంలో ప్రభాస్ తండ్రి పాత్ర గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ రెండో భాగంలో దేవ తండ్రి ధారా ప్రస్తావన పెద్ద స్థాయిలో ఉంటుందని తెలిసింది. సలార్ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవ–ధారాల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. వచ్చే ఏడాది ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి డ్రాగన్ అయితే కొడుకు లూగర్?ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో డ్రాగన్, లూగర్... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారని, కథ రీత్యా సినిమాలో డ్రాగన్, లూగర్లు తండ్రీ కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, అన్షుమాన్, సిద్ధాంత్ గుప్తా, బిజు మీనన్, ఖుష్బూ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవర, వర... ఇలా తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనుంది. ‘దేవర’ని నిర్మించిన కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ రెండో భాగాన్ని కూడా నిరిస్తారని చెప్పోచ్చు.తండ్రి... ఇద్దరు కొడుకులు! అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇందులో తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నారని తెలిసింది. ఇలా అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. దీపికా పదుకోన్, మలయాళ నటి ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని తెలిసింది. ఈ ‘రాక’ చిత్రంలో రష్మిక, అల్లు అర్జున్‌ల క్యారెక్టరైజేషన్స్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 డిసెంబరులో రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇతర భాషల్లో రూపొంది, తెలుగు తెరకూ రానున్న కొన్ని చిత్రాల్లోనూ తండ్రి ఎమోషన్ ప్రధానాంశంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే... ⇒ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల వల్ల విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానాంశంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ‘జన నాయకుడు’ ఉండబోతున్నట్లు ట్రైలర్‌లోని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్, మమితా బైజు తండ్రీ కుమార్తెలుగా నటించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, ప్రియమణి, నాజర్, సునీల్, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ ఆధారంగా ‘జన నాయకుడు’ సినిమా తీశారనే వార్తలు ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించారు. ⇒ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇదో ఫాదర్ ఎమోషన్‌తో అల్లుకున్న సినిమా కథ అని టైటిల్ స్పష్టం చేస్తోంది . ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ విజయ్ ప్రకాష్ తండ్రి సర్దార్. సమాజం నిందిస్తున్నట్లు తన తండ్రి ఓ దేశద్రోహి అనే భావనలో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ విజయ్‌ప్రకాష్. కానీ సర్దార్ ఒక ఇండియన్ స్పై ఏజెంట్ అని, నిజమైన దేశభక్తుడు అని విజయ్‌ప్రకాష్ ఆ తర్వాత తెలుసుకుంటాడు. తండ్రి బాటలోనే తాను ఇండియన్ స్పై ఏజెంట్‌గా మారతాడు. మరి... నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ‘సర్దార్’ సినిమాలో చూడాలి. విజయ్‌ప్రకాష్, సర్దార్... ఇలా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన తమిళ సినిమా ‘సర్దార్’. 2022లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రదర్శకుడు పీఎస్ మిత్రన్, హీరో కార్తీ కలిసి ‘సర్దార్2’ సినిమాని కూడా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్‌జె సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ షారుక్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హిందీ సినిమా ‘కింగ్’. నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లైన షారుక్, సుహానా ఖాన్ ‘కింగ్’ సినిమాలోనూ ఫాదర్–డాటర్ రోల్స్‌లో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తుండగా రాణీ ముఖర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. అలాగే ఇది సుహానా ఖాన్ నటిస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. సిల్వర్ స్క్రీన్‌పై తన డెబ్యూ మూవీలోనే తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఏ కుమార్తెకు అయినా ఇంతకంటే స్పెషల్ ఏం ఉంటుంది? నిజంగా యాక్టర్‌గా సుహానా లక్కీ అని చెప్పవచ్చు.⇒ ఆహార కల్తీ అనేది చిన్నారుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అన్న అంశం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. కూతురి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తండ్రి చేసిన అసాధారణమైన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో శ్రేయాస్ తల్పాడే నటించగా, న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైదానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషిలు సహ–నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంగీతం: మంగేష్ ధాక్డే. ⇒ కుమార్తెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఏదైనా మంచి బహుమతి ఇస్తాడు? కానీ ఓ తండ్రి తన కుమార్తె చేతికి గన్ ఇచ్చాడు. ఎవర్నో చంపిన తర్వాత హ్యాపీ బర్త్ డే చెప్పాడు. నిజంగా అతను ఆమెకు తండ్రేనా? లేక తండ్రిలా ఆ అమ్మాయిని పెంచి, తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడా? అనేది హిందీ సినిమా ‘ఆల్ఫా’లో చూడాలి. ఆలియా భట్, శార్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆల్ఫా’. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు.– ముసిమి శివాంజనేయులు -
రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.?
-
గ్రీన్ సిగ్నల్?
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న విడుదల కానుంది. దీంతో తన తర్వాతి సినిమా కోసం వరుసగా కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ.ఇప్పటికే దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్‌గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదట. కాగా తమిళ దర్శకుడు హరి ఓ యాక్షన్ కథను సిద్ధం చేశారని, ఈ స్క్రిప్ట్‌కి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయన భావించారట. ప్రస్తుతం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా.తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలతో దర్శకుడు హరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మరి.. హరి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
కూల్ కూల్‌గా... బిజీ బిజీగా...
హమ్మయ్యా... వేసవి ముగుస్తోంది. ఇప్పటి వరకూ భగ భగమంటూ తన ప్రతాపం చూపించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడుతున్నాడు. ఎండల తీవ్రత కారణంగా ఇప్పటి వరకూ సినిమా చిత్రీకరణల్లో కాస్త ఆచి తూచి పా ల్గొన్న నటీనటులు ఇప్పుడు వేగం పెంచారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ సందడి నెలకొంది.ప్రస్తుతం పలు సినిమాలు హైదరాబాద్‌తో పా టు పరిసరప్రాంతాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ఓ వైపు నాగార్జున, వెంకటేశ్, రవితేజ వంటి సీనియర్ హీరోలతో పా టు మరోవైపు ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, శ్రీవిష్ణు వంటి యంగ్ హీరోలు ప్రస్తుతం తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏయే చిత్రాల షూటింగ్స్‌తో కూల్ కూల్‌గా... బిజీ బిజీగా ఉన్నారో చూద్దాం....అల్యూమినియం ఫ్యాక్టరీలో...అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘నా సామి రంగా’. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. 2025లో ఆయన హీరోగా మిస్ అయినప్పటికీ ‘కూలీ, కుబేర’ వంటి సినిమాల్లో కీలక పా త్రల్లో కనిపించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్లో వందో చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు.సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే భారీ హడావుడి ఉంటుంది. కానీ, ఈ చిత్రం విషయంలో చిత్రబృందం చాలా గోప్యత పా టిస్తోంది. ఎలాంటి అధికారిక ప్రకటన, హడావుడి లేకుండానే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగార్జునతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్‌లో నాగార్జున కనిపించనున్నారు.సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతున్నారు. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై మళ్లీ 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు. తమ అభిమాన హీరోని ‘శివ’, ‘హలో బ్రదర్’ నాటి లుక్‌లో చూస్తామంటూ అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు సినిమా ప్రేమికుల్లో ఈ మూవీపై క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని టాక్. నాగార్జున కెరీర్లోనే వందో చిత్రంగా ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పా త్రల్లో మెరుస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే ‘కింగ్ 100, లాటరీ కింగ్, కింగ్ 100 నాటౌట్’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.రాజేంద్ర నగర్లో... హీరో దగ్గుబాటి వెంకటేశ్ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ అయింది. ఈ మూవీ ద్వారా రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరారు వెంకటేశ్. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో కీలకమైన వెంకీ గౌడ పా త్రలో సందడి చేశారు వెంకటేశ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీనిధీ శెట్టి హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీ నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పా టు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం తాజా షెడ్యూల్లో నిమగ్నం అయింది. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్లో షూటింగ్ జరుపుకుంటోంది.వెంకటేశ్‌తో పా టు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్... తొలిసారి ఆయన్ను డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని వెంకటేశ్ తన ఖాతాలో వేసుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. డబుల్ ధమాకా.... వరుస పా న్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన ప్రస్తుతం ‘ఫౌజీ, స్పిరిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ముఖ్యమైన పా త్రలుపోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ మూవీ తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పా ల్గొనకపోయినప్పటికీ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ విడుదల కానుంది. ⇒ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పా న్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్. ప్రకాశ్‌రాజ్ కీలక పా త్రపోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్స్, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘స్పిరిట్’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని అజీజ్ నగర్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో హీరో ప్రభాస్ పా ల్గొంటున్నారు. ఆయనతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారట సందీప్ రెడ్డి వంగా. ‘‘స్పిరిట్’ చిత్రంలో తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు ప్రభాస్. ఈ మూవీని తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్ రెడ్డి. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పా టు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శంషాబాద్‌లో... మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్ ఇండియన్ మూవీ ‘వారణాసి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ మూవీలో రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభ అనే ప్రతినాయకుడి పా త్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ జరుపుతున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పా టు కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన క్యారెక్టర్పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌కు అత్యద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో రామాయణం ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది కూడా.ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేయడం చర్చనీయాంశం అయింది. ‘‘రాముడికి, కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ‘వారణాసి’. టైటిల్ టీజర్లో కుంభ కర్ణుడు, రాముడు, ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా... ఈ ఎపిసోడ్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. డ్రాగన్ టైమ్ ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రానా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గు΄్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భిమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇతర కీలక పా త్రలుపోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పా న్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చేసిన ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.‘దేవుడు నాకు ఓ గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం’, ‘నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు... మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి.. ΄÷రపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ప్రాంతంలోని అంతర్జాతీయ అఫీమ్ (ఓపియం) అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పా త్రలో అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్–ఇన్–చీఫ్‌గా కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. నవ్వులు డబుల్ హీరో శ్రీ విష్ణు సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుంటాయి. ఆయన నుంచి వచ్చిన పలు సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. హీరో శ్రీవిష్ణు– డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. 2023 జూన్ 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదం అందించడంతో పా టు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పా త్రలుపోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పా టు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. ‘సామజ వరగమన’ చిత్రానికి మించి డబుల్ వినోదాన్ని అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు.యాక్షన్... ఎమోషన్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 34’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ మూవీ ద్వారా హీరోయిన్గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్–అనార్కలితో పా టు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట వెంకట్.‘‘గోపీచంద్ 34’ చిత్రం ద్వారా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన పా త్రలో చూపిస్తున్నారు ఆయన. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పా త్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రతో పా టు సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శివ నిర్వాణ. ఈ నెల 3న విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ ఉంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్... వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూపోషించని విభిన్నమైన పా త్రను ‘ఇరుముడి’లోపోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది.– డేరంగుల జగన్ మోహన్ -
వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి
అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘ఇరుముడి’ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం నిర్మాతలు తెలిపారు.‘‘భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. భక్తి, మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలను కూడా జోడించి శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హీరో రవితేజ కూతురు ఎలా ఉందో చూసారా..?
-
కథ చెప్పండి గురూ!
సినిమాలో కొత్తదనం లేక పోతే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. దీంతో హీరోలందరూ కొత్త కథల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క కథను ఓకే చేయడం కోసం పదుల సంఖ్యలో కథలు వింటున్నారు. ఇటు దర్శకులు, రచయితలు కూడా తమ కలానికి మరింత పదును పెట్టి విభిన్నమైన కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మరి... ఏ హీరోకి ఏ దర్శకుడు కథ చె΄్పారు? ఏ దర్శకుడు ఏ హీరోను మెప్పించారు? తెలుగులో రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏమిటి? అన్న విశేషాలపై ఓ లుక్ వేయండి.సంక్రాంతి తర్వాతే..! హీరో వెంకటేశ్ వరుస కథలు వింటున్నారు. యువ రచయిత నందు, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలను ఆల్రెడీ విన్నారు వెంకటేశ్. అయితే ఈ కథలతో సినిమాలు చేయాలని ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే స్పీడ్‌లో వెంకటేశ్ రీసెంట్గా మరో కథ విన్నారట. ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకుని, రెండో సినిమాయే చిరంజీవితో ‘విశ్వంభర’ తీసిన మల్లిడి వశిష్ట ఇటీవల వెంకటేశ్‌కు ఓ కథ వినిపించారట. ఈ సినిమా చేసేందుకు వెంకటేశ్ సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబరు 47’ సినిమాలో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలనే సంక్పల్పంతో ఉన్నారట ఈ సీనియర్ హీరో. అలాగే ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్’ (ఇందులో చిరంజీవి హీరో) వంటి హిట్ చిత్రాలను తనకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఓ సినిమా చేస్తారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. సో... వెంకీ ఇమ్మిడియట్ సినిమా ఇదే అవుతుంది. ఈ నెల 20 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటించనుండగా కీర్తీ సురేష్, కృతీశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తారు. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే ఓ క్రేజీ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇలా తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉండటంతో, వెంకీ తన తదుపరి సినిమాను సంక్రాంతి పండగ తర్వాతనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఈలోపు వెంకీని ఇంప్రెస్ చేసి, ఆయనతో సినిమా చేసే చాన్స్‌ను ఏ దర్శకుడు దక్కించుకుంటారో చూడాలి.నెక్ట్స్ ఎవరు? రాజమౌళి డైరెక్షన్‌లోని ‘వారణాసి’ చిత్రంతో మహేశ్‌బాబు ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే సినిమాను రిలీజ్ చేయాలని, ఇది జరగాలంటే ఈ ఏడాది ఆగస్టులోపే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇలా ‘వారణాసి’ సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయినా ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అవుతారు మహేశ్‌బాబు.కాగా, ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకూడదని మహేశ్‌బాబు అనుకుంటున్నారట. ఈ సినిమా రిలీజైన వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఇందుకు తగ్గట్లుగానే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో పాటు బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్స్‌ను మహేశ్‌బాబు విన్నారని సమాచారం. ‘వారణాసి’ సినిమా రిలీజైన తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంపై మహేశ్‌బాబు ఓ స్పష్టతకు వస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగాతోనే మహేశ్‌బాబు సినిమా ఉండొచ్చని భోగట్టా.ముందు ఎవరు? హీరో రవితేజ కాస్త స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే తన నెక్ట్స్ సినిమాలను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. ఇందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. ముందుగా హసిత్ గోలి కథ వినిపించారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్నారట రవితేజ.ఈ రెండు కథలకూ ఇంప్రెస్ అయినప్పటికీ ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లాలని రవితేజ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమా ప్రారంభమైన మరికొన్ని రోజులకే హసిత్ గోలీ సినిమానూ సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని రవితేజ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌ను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని రవితేజ అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు. ఇక రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్‌లోని సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాస్త సమయం ఉంది.. ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నారు హీరో నాని. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజిత్‌తో ‘బ్లడీ రొమియో’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా చేయనున్నారు నాని. ఇక రెండు సినిమాలు ఇలా ఉండగానే... నిర్మాతగా తనకు ‘కోర్టు’ సినిమా రూపంలో ఓ బ్లాక్‌బస్టర్‌ను అందించిన రామ్ జగదీష్ చెప్పిన కథను నాని ఓకే చేశారని తెలిసింది.కానీ ఈ కథలో నానీయే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణ బాధ్యతల వరకే పరిమితం అవుతారా? అనేది చూడాలి. అలాగే ఇటీవల ‘బ్యాండ్ మేళం’ సినిమా తీసిన సతీష్ జవ్వాజి చెప్పిన కథను కూడా విన్నారు నాని. ఈ కథను ఆల్మోస్ట్ ఓకే చేశారు. అయితే ఈ కథలో తానే హీరోగా నటించాలని నాని భావిస్తున్నారని, కాక పోతే కథకు ఇంకాస్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని సతీష్‌కు నాని సూచించారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇప్పటికే రెండు సినిమాలను ఖరారు చేసుకున్న నాని,మరో రెండు సినిమాల కథలను కూడా ఓకే చేశారు.మ్యూజికల్ లవ్‌స్టోరీ! ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో నాగచైతన్య బిజీ బిజీ. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో తన కెరీర్‌లోని 25వ సినిమాను లవ్ జానర్లో చేయాలా? లేక యాక్షన్ జానర్లో చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారట నాగచైతన్య. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ చెప్పిన కథలను విన్నారట నాగచైతన్య.అయితే రొటీన్ లవ్‌స్టోరీకీ కాస్త భిన్నంగా ఓ డిఫరెంట్ ప్రేమకథను చెప్పిన క్లాక్స్‌కు ముందుగా చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రజెంట్ ఈ కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట క్లాక్. ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ తర్వాత, నాగచైతన్య 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ‘దూత చాప్టర్2’ షూటింగ్‌లోనూ త్వరలోనే పాల్గొనున్నారు నాగచైతన్య. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దూత చాప్టర్ 2’తో తొలిసారిగా నిర్మాతగా మారారు నాగచైతన్య. ఈ సిరీస్‌కు శరత్‌మరార్ మరో నిర్మాత.రెండు సంవత్సరాల తర్వాత తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను రాబట్ట లేక పోయాయి. వైష్ణవ్ గత చిత్రం ‘ఆది కేశవ’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయడానికి వైష్ణవ్ దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో వైష్ణవ్ ఎన్నో కథలు విన్నారని తెలిసింది. కానీ ఫైనల్‌గా సుధీర్‌బాబుతో ‘హంట్’ సినిమా తీసిన దర్శకుడు మహేశ్ సూరపనేని చెప్పిన కథ వైష్ణవ్‌ను ఇంప్రెస్ చేసిందట.ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కనీసం రెండు సెట్స్‌పై ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే పూర్తవుతుంది. ‘ఫౌజీ’ సినిమా రిలీజ్‌ను ఈ ఏడాదే అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే... మరో రెండు సినిమాలను సమాంతరంగా సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ‘సలార్ 2’ ఒకటి అని తెలిసింది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు. కానీ వచ్చే ఏడాదికి ఈ ఇద్దరు దర్శకులు కాస్త ఫ్రీ అవుతారు. మరి... ప్రభాస్ తర్వాతి రెండు సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులే డైరెక్షన్ చేస్తారా? లేక మరో దర్శకుడి పేరు ఏదైనా సడన్‌గా తెరపైకి వచ్చి, కొత్త కాంబినేషన్ సెట్ అవు తుందా? అనేది చూడాలి. ఏదీ ఏమైనా తన తర్వాతి సినిమాలపై ప్రభాస్ ఓ క్లారిటీతో ఉన్నారని సమాచారం.అడవిలో పోరాటం ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రామ్‌చరణ్. ఇక మెల్లిగా చరణ్ ఫ్యాన్స్ చర్చంతా ఆయన తర్వాతి సినిమాపైనే జరుగుతోంది. ‘రంగస్థ్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన సుకుమార్‌తో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుందని సమాచారం. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో ఓ సందర్భంగా కలిశారట రామ్ చరణ్. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా కన్ఫార్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఇదొక పీరియాడికల్ జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించరని, కేవలం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవుతారనే వార్తలు బాలీవుడ్లో వినిపించాయి. అలాగే ఈ సినిమాకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్లో ‘కిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్‌తోనూ ఓ సినిమా విషయమై రామ్‌చరణ్ చర్చలు జరిపారని టాక్. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.– ముసిమి శివాంజనేయులు -
'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ
రవితేజ మంచి నటుడే కానీ గత కొన్నాళ్ల నుంచి ఒకే తరహా సినిమాలు తీసి తీసి బోర్ కొట్టించేస్తున్నాడు. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌ని పెద్దగా హడావుడి లేకుండానే రిలీజ్ చేశారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ కొత్తగా.. సాధారణ షర్ట్, లుంగీతో కనిపించాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)గ్లింప్స్ బట్టి చూస్తే గ్రామంలో ఉండే హీరో, అతడికో కూతురు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ హీరోకి మందు అలవాటు. వ్యసనాన్ని మానేయమని కూతురు అడుగుతుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా బాగుంది. ఆగస్టులో మూవీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా) -
అప్పట్లో చిరు & రవితేజ.. ఇప్పుడు నాని & విజయ్
-
TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు
-
రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?'
ఒకప్పుడు స్టార్ హీరోగా వరస హిట్స్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే సరైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. ఆడియెన్స్ కూడా ఇతడి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీతో వచ్చాడు. కంటెంట్ పర్లేదనిపించింది గానీ వసూళ్లు పెద్దగా రాలేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు రవితేజ చేయబోయే కొత్త సినిమా కోసం ఓ విచిత్రమైన టైటిల్ అనుకుంటున్నారట.(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' అనే సినిమాని రవితేజ చేస్తున్నారు. కూతురి సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప మాలకు సంబంధించిన పార్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీని తర్వాత చేయబోయే మూవీ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడదే ఫైనల్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. 'రాజరాజచోర' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన హసిత్ గోలి.. తర్వాత 'స్వాగ్' తీశాడు గానీ ఫ్లాప్ అయింది.ఇప్పుడీ దర్శకుడే రవితేజకు ఓ స్టోరీ చెప్పాడని, దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే 'అక్కాయిలు బాగున్నారా?' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్‌బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్‌గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్‌కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్‌బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్‌బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్‌ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్‌బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్‌గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్‌గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్‌బాబు ‘నాగబంధం’ టీజర్‌ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
డబుల్ ట్రీట్
అభిమాన హీరోలు స్క్రీన్‌పై ఒక గెటప్‌లో కనిపిస్తేనే వారి ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్స్ మారు మోగిపోతాయి. అలాంటిది ఒకే టికెట్‌పై ఒక బొమ్మలో తమ అభిమాన హీరోను రెండు గెటప్స్, రెండు క్యారెక్టరైజేషన్స్‌తో చూసినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఇలా ప్రేక్షకులను అలరించేందుకు కొందరు తెలుగు హీరోలు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చేస్తున్నారు. వెండితెరపై డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హీరోలపై ఓ లుక్ వేయండి.. మరోసారి డబుల్ ధమాకా ‘విక్రమార్కుడు, దరువు, పవర్’ వంటి చిత్రాల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేసి ఆడియన్స్‌ని మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ మళ్లీ ‘ఇరుముడి’ సినిమాలో డబుల్ రోల్లో కనిపించనున్నట్లుగా తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ థ్రిల్లర్ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా, మరో పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తారట. ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీశంకర్, కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.రుద్ర... రాముడు మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. అలాగే రాముడి పాత్రలోనూ కనిపించనున్నారు. ‘వారణాసి’ సినిమాలో రుద్ర, రాముడిగా... ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా ఇటీవల మహేశ్‌బాబు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే... సమ్మర్ సమయం కనుక వేసవి తాకిడికి కాస్త దూరంగా ఉండాలని మహేశ్‌బాబు అండ్ టీమ్ భావిస్తున్నారట.ఇందులో భాగంలో ఈ వేసవి సమయంలో మహేశ్‌బాబు ఓ వెకేషన్‌ను ప్లాన్ చేసుకున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. మేలో మళ్లీ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారు. జూన్‌లో ‘వారణాసి’ సినిమా యూనిట్ అంటార్కిటికా లొకేషన్స్‌లో చిత్రీకరకణను ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఈ ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకోబోయే తొలి తెలుగు చిత్రంగా ‘వారణాసి’ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రాతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఓ పాట చిత్రీ కరణ కూడా ఉంటుందట. అలాగే రాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపించే సీక్వెన్స్ దాదాపు అరగంట పాటు ఉంటుందని తెలిసింది.ఇంకా ‘వారణాసి’ సినిమాను తొలుత రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక భాగంగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా రాజమౌళి ఇటీవల ఓ సందర్భంగా చెప్పా రు. కానీ ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘ధురంధర్’ రెండు భాగాలుగా విడుదలై, బంపర్ బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. పైగా ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలుగా తీసిన అనుభవం రాజమౌళికి ఉంది. మరి... ‘వారణాసి’ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మహేశ్‌బాబు చైల్డ్ ఆర్టిస్టుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించగా, విజయశాంతి హీరోయిన్గా నటించారు.డ్రాగన్‌లో డ్యూయల్ రోల్? ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమా చిత్రీకరణ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా కనిపించారు. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత లీన్ లుక్‌లోకి వచ్చేశారు. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏమైనా ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అనిల్ కపూర్, కాజోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని భోగట్టా. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రీకొడుకు దేవ, వర పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదలైంది. మలి భాగం చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ‘దేవర’ సినిమాను నిర్మిస్తున్నారు.పెద్ది ఆట రామ్ చరణ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం రామ్ చరణ్ క్రికెటర్‌గా, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించారు. ఇటీవల ‘పెద్ది పహిల్వాన్’ అంటూ ‘పెద్ది’ సినిమా నుంచి ఓ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో క్రికెటర్‌గా ఉన్న రామ్‌చరణ్, కుస్తీ చాలెంజ్‌ను స్వీకరించినట్లుగా కనిపిస్తోంది.కానీ క్రికెటర్ నుంచి రామ్ చరణ్ కుస్తీ వైపు అడుగులు వేయడానికి బలమైన కారణం ఉందని, తన తండ్రి కోసమే రామ్ చరణ్ అలా మారతారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అయితే ఈ తండ్రి పాత్రలోనూ రామ్ చరణే కనిపిస్తారట. అలా తండ్రీకొడుకులుగా ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాకపోతే... ఈ సినిమా రిలీజ్ డేట్లో మార్పు ఉండొచ్చని, ‘పెద్ది’ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కావడం లేదని, జూన్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్స్ వర్క్స్ విషయంలో టీమ్ హడావిడి చేయకుండా క్వాలిటీ కోసం టైమ్ కేటాయించాల్సి రావడం, ఇటీవల రామ్ చరణ్ కంటికి చిన్న గాయం కావడం వంటి అంశాలు ‘పెద్ది’ సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణమై ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బ్రదర్స్‌గా... కెరీర్లో ఇప్పటి వరకు 21 సినిమాలను పూర్తి చేశారు అల్లు అర్జున్. కానీ వెండితెరపై అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి బ్రదర్స్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ఇటీవలి కాలంలో రెండు డిఫరెంట్ లుక్స్‌లో అల్లు అర్జున్ కనిపించారు.దీంతో అల్లు అర్జున్‌లోని ఈ డిఫరెంట్ మేకోవర్ అట్లీ సినిమా కోసమే అనే ప్రచారానికి బలం చేకూరి నట్లయింది. ఈ నెల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ భోర్సే... వంటి హీరోయిన్స్ కూడా భాగం కానున్నారని, త్వరలోనే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.అయితే తన వంతు షూటింగ్‌ను మాత్రం అల్లు అర్జున్ త్వరితగతిన పూర్తి చేసి, లోకేశ్ కనగరాజ్‌తో చేయాల్సిన సినిమా షూటింగ్లో పాల్గొంటారు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రానికి భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో పోస్ట్ ప్రోడక్షన్స్ కోసం ఈ మూవీ టీమ్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేయడం సాధ్యపడదట.తొలిసారిగా..! ఈ మధ్య ‘ఎక్స్ట్రా, రాబిన్‌హుడ్’ వంటి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ‘తమ్ముడు’ వంటి యాక్షన్ డ్రామా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్. తాజాగా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ సైన్ చేశారని సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా, ఒక్క క్షణం, ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనింగ్ మూవీలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. 30 సినిమాలకుపైగా చేసిన నితిన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న చిత్రం ఇది. కామ్రేడ్ కల్యాణ్ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’. 1992 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను బట్టి ఈ చిత్రంలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కామ్రేడ్ కల్యాణ్‌గా, గ్రామంలోని ఓ చురుకైన వ్యక్తిగా శ్రీ విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నాగబంధం విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్‌లో విరాట్ కర్ణ కనిపించనున్నట్లుగా ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది. ఇందులో లార్డ్ శివగా, ఓ మాములు మోడ్రన్ అబ్బాయిగా విరాట్ కర్ణ కనిపిస్తున్నారు. సో... ‘నాగబంధం’లో విరాట్‌కర్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఊహించవచ్చు మరి... ఈ సినిమాలో విరాట్ కర్ణ రోల్ ఎలా ఉండబోతుంది అనేది జూన్ 3న తెలిసిపోతుంది. ఎందుకంటే.. ఈ సినిమాను ఆ రోజే రిలీజ్ చేస్తున్నారు. ‘‘భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ‘నాగబంధం’ సినిమా కథనం సాగుతుంది. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఈ సినిమా స్టోరీ సాగుతుంది’’ అని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రిషబ్ సాహ్ని, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ తరహా కథలను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.– ముసిమి శివాంజనేయులు -
మరోసారి...
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ సాగుతోంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా వన్స్ మోర్ అంటూ ఆ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గత చిత్రాలను 4కె క్వాలిటీతో సరికొత్తగా అందిస్తుండటంతో ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేశ్‌బాబు ‘అతిథి’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా, ఊసరవెల్లి’, రవితేజ ‘కృష్ణ’, సిద్ధార్థ్ ‘ఓయ్’, శింబు ‘వల్లభ’ వంటి అరడజను పైగా సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆయా చిత్రాల వివరాలేంటో ఓ లుక్ వేద్దాం... పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో రవితేజ ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రం మే నెలలో రీ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ’. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముకుల్ దేవ్, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, వేణు మాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ శిండే, సత్యం రాజేశ్ ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ విజువల్స్‌పై బి. కాశీ విశ్వనాథం నిర్మించారు.రవితేజ మాస్ ఇమేజ్, వినాయక్ మాస్ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అయింది. రవితేజ, త్రిష, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చక్రి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో తన వంతు పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల తర్వాత మే 8న ‘కృష్ణ’ మూవీ రీ రిలీజ్ అవుతోంది.ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. దేవుడా... ‘రేసు గుర్రం’ సినిమాలో దేవుడా అంటూ ఓ మేనరిజమ్‌తో హీరో అల్లు అర్జున్ పలికిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరోసారి ఆ మేనరిజాన్ని ప్రేక్షకులు చూడనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేసు గుర్రం’. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, అలీ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రవి కిషన్, శ్యామ్, పవిత్రా లోకేష్, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ్రపొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.మాస్, యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి అల్లు అర్జున్–శ్రుతీహాసన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రుతీహాసన్ అమాయకత్వం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇన్స్పెక్టర్ కిల్‌బిల్ పాండేగా బ్రహ్మానందం ఏ స్థాయిలో ఆడియన్స్‌కి నవ్వులు పంచారో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘రేసు గుర్రం’ మూవీని ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.తమ అభిమాన హీరో (అల్లు అర్జున్) పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే... ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అతిథి వస్తున్నాడు ఈ వేసవికి మహేశ్ బాబు ‘అతిథి’ గా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా రావ్ హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, నాజర్, మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అజయ్, వేణుమాధవ్, రాజీవ్ కనకాల, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 అక్టోబరు 18న విడుదలైంది. మహేశ్ బాబు మేకోవర్, స్టైలిష్ లుక్స్, యాక్షన్... వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబును దర్శకుడు సురేందర్ రెడ్డి అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేశ్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు.ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతి పెద్ద బలం అని చెపొ్పచ్చు. అదే విధంగా మహేశ్ బాబు–అమృతా రావ్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4కె వెర్షన్న్లో రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న ‘అతిథి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన వారణాసి సెట్లో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. డబుల్ ధమాకా హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘ఊసరవెల్లి’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ మూవీలో రక్షిత హీరోయిన్గా నటించారు. రమాప్రభ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్, షాయాజీ శిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, సంఘవి ఇతర పాత్రలు పోషించారు.భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రి అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఎన్టీఆర్, రక్షిత డ్యాన్స్‌లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటిపోయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రావాలా’ని రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత గిరి. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, విద్యుత్ జమాల్, షాయాజీ శిండే, మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, జీవీ సుధాకర్ నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం అందించారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.మే 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఓయ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారాయన. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ (2006) మూవీతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రాల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించారు.సునీల్, అలీ, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, నెపోలియన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీ హిట్ అయ్యింది. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఓయ్’ ఏప్రిల్ 17న రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. వల్లభ సిద్ధం శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘వల్లవన్’. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, రీమా సేన్, సంధ్య, సంతానం, ప్రేమ్‌జీ, సత్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. పీఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో 2026 అక్టోబరు 21న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వల్లభ’ పేరుతో అనువదించి, రిలీజ్ చేశారు. 2006 నంబరు 11న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతార టీచర్‌గా, శింబు స్టూడెంట్‌గా నటించారు. టీచర్–స్టూడెంట్ మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి యువతని భారీగా ఈ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ‘వల్లభ’ సినిమా మే 9న విడుదలవుతోంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
విభిన్నమైన పాత్రలో రవితేజ.. హైదరాబాద్‌లో యాక్షన్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ‘‘ఇరుముడి’లో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ పోరాట సన్నివేశాలను ఫైట్ మాస్టర్స్ అనల్ అరసు, రియల్ సతీష్ తెరకెక్కిస్తున్నారు’’ అని యూనిట్ తెలిపింది. -
శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్
రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్ టచ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI 🫶శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹✨Starring MASS MAHARAJA @RaviTeja_offlA @gvprakash musical 🎺🎼@priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/CNZuTYRLKB— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026 -
భాగ్యనగరంలో భలే జోరు
వేసవి మొదలైపోయింది. ఎండలు కూడా అప్పుడే మండుతున్నాయ్. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్‌లతో బిబీ బిజీగా ఉంటున్నారు నటీనటులు. కొన్ని సినిమాలు ఇండోర్‌లో (స్టూడియోల్లో) షూటింగ్స్ జరుపుకుంటుండగా... మరికొన్ని మూవీస్ షూటింగ్స్ కోసం హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి చిత్రీకరణలు జరుపుతున్నారు మేకర్స్.ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...మూసరంబాగ్లో... నాగార్జున కెరీర్లో వందో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కర్నాటకలోని మైసూర్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని మూసరాంబాగ్లో జరుగుతోంది. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సీనియర్ నటి టబు–నాగార్జున కలిసి నటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని టాక్. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (గెస్ట్ అప్పీయరెన్స్) కలిసి ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న ఈ వందో చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గట్టు అద్భుతమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలిసింది. ‘కేజీఎఫ్’ మూవీ ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘యానిమల్’ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. శంకర్‌పల్లిలో ఇరుముడి... వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంకర్‌పల్లిలో జరుపుకుంటోంది.ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారట. ‘‘రవితేజ మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రని ‘ఇరుముడి’లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారట. ఆయనపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగకి ‘ఫౌజీ’ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శంకర్‌పల్లిలో కల్కి... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది.‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ పాత్ర చేసిన కమల్‌హాసన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తొలి భాగంలో అమితాబ్, కమల్‌కి ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ, ‘కల్కి 2898 ఏడీ 2’లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా కీలకం అట. ఈ నేపథ్యంలోనే శంకర్‌పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం అమితాబ్, కమల్ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అజీజ్ నగర్లో... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రెండు చోట్ల జరుగుతోంది.హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్ నగర్లో, అదే విధంగా గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు యూనిట్లతో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అజీజ్ నగర్లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలోని ముఖ్య తారాగణంపైనా పలు సీన్స్ తీస్తున్నారట. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి వాయిదా పడి ఏప్రిల్ 30కి ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంగీతం: ఏఆర్ రెహమాన్. ముచ్చింతల్‌లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో నానీతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే మాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. ఫైనల్‌గా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. అజీజ్ నగర్లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 33’ (వర్కింగ్ టైటిల్). సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకస్తున్నారట. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘గోపీచంద్ 33’.ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ అద్భుతంగా నటిస్తున్నారు. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణలో లెనిన్... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది.అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు చిత్రంలోని ప్రధాన తారగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మురళీ కిశోర్. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం పొడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘లెనిన్’ ఈ వేసవిలో విడుదల కానుంది. ముచ్చింతల్‌లో భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట సంపత్ నంది.ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘భారీ పాన్–ఇండియన్ పీరియాడిక్ మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. తుక్కుగూడలో... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో సాయిదుర్గా తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు రోహిత్. ఈ సినిమా 2025 సెప్టెంబరు 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు. పైన పేర్కొన్నటువంటి సినిమాలే కాదు. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఇరుముడి సినిమాలో..?
‘ఇరుముడి’ సినిమాలో తమన్నా భాగమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ తమన్నాను సంప్రదించారని, కథ, పాత్ర నచ్చడంతో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా 2015లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో తమన్నా ఓ హీరోయిన్గా నటించారు.మళ్లీ పదేళ్ల తర్వాత రవితేజతో తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటారా? మరి... ‘ఇరుముడి’ చిత్రంలో తమన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
ఓటీటీలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' .. ఎట్టకేలకు ప్రకటన
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో సునీల్, సత్య, మురళీధర్ గౌడ్, రోహన్, సోనియా సింగ్, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు.'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జీ5(Zee5)లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో ఆ సంస్థ చేర్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానుందని పేర్కొంది. సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో మంచి రెస్పాన్స్ రావచ్చని మేకర్స్ అంచనా వేస్తున్నారు.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్‌యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్‌గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్‌తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్‌లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్‌కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ, రాజకీయ ప్రముఖులు ( ఫోటోలు)
-
రవితేజ నా డాన్స్ క్లాస్ మెట్.. సూపర్ జర్నీ నాది
-
గెట్... సెట్... గో గెటప్ ఛేంజ్
వెరైటీ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నటీనటులు పర్ఫార్మెన్స్ పరంగానే కాదు... లుక్స్ పరంగా కూడా వెరైటీ చూపించడానికి రెడీ అయిపోతారు. ఒక్కోసారి గుర్తు పట్టడానికి వీలు లేనంతగా క్యారెక్టర్‌కి తగ్గట్టు మారిపోతారు. డార్క్ మేకప్,ప్రోస్థెటిక్ మేకప్... ఇలా మేకప్‌తో డిఫరెన్స్ చూపించడంతో పాటు ఫిజికల్‌గా కూడా క్యారెక్టర్‌కి తగ్గట్టు సన్నబడతారు... లావైపోతారు. హీరోలైతే క్లీన్ షేవ్ లుక్‌లోకి మారిపోతారు... క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గెడ్డం పెంచుకుంటారు... జుట్టు కూడా పెంచుకుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజ, నాని, అఖిల్, సాయి దుర్గాతేజ్, విరాట్ కర్ణ, సంపూర్ణేష్ బాబు... ఇలా స్టార్ హీరోస్తో పాటు యంగ్ హీరోస్ తమ సినిమాల కోసం గెటప్ ఛేంజ్ చేశారు. గెట్... సెట్... గో అంటూ ఇలా గెటప్ ఛేంజ్ చేసిన ఆ హీరోలు, వారు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం.తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్రపా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. గతంలో ఎన్నడూ కనిపించనంతగా పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారాయన.ఇప్పటికే విడుదలైన మహేశ్ గెటప్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందట. ‘వారణాసి’పై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 విడుదల కానుంది. సరికొత్తగా... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. తన పాత్రకు తగ్గట్టు సన్నగా మారిపోయారాయన. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తీసిన పాట హైలెట్‌గా మారనున్నాయి. జూన్ 25న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇరుముడి కోసం వరుస సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతుంటారు రవితేజ. క్లాస్, మాస్... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఆయా లుక్‌లోకి మారిపోతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఆధ్యాత్మికప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పాత్ర కోసం రవితేజ మేకోవర్ అయ్యారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఇరుముడి’.రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా విడుదల చేసిన టైటిల్, రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక లుక్‌లో రవితేజ చక్కగా ఒదిగిపోయారనే ప్రశంసలు లభించాయి. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది. రవితేజ మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. మరోసారి మ మ మాస్ రామ్‌చరణ్ ఫుల్ మాస్ లుక్‌లో నటించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయిక. ఈ సినిమాలో పోడవాటి జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా పక్కా మాస్ లుక్‌లో కనిపించిన రామ్‌చరణ్ ఆ తర్వాత లుక్స్ మార్చారు. తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు రామ్‌చరణ్. ఈ మూవీ కోసం మరింత మాస్ లుక్‌లోకి మారారాయన. ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, సాంగ్ చూస్తే ఆయన ఎంత మాస్‌గా కనిపించనున్నారో అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం పోడవైన జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా రెండోసారి మ మ మాస్ లుక్‌లోకి మారిపోయారు.ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, సినిమాపై మరింత బజ్‌ని పెంచింది. ఈ మూవీని రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ప్యారడైస్ కోసం... హీరో నాని మరోసారి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘దసరా’, ‘హిట్ : ది థర్డ్‌కేస్’ వంటి సినిమాల్లో ఫుల్ మాస్‌గా కనిపించిన ఆయన తాజాగా ‘ది ప్యారడైజ్’ మూవీ కోసం పవర్ఫుల్ మాస్ లుక్‌లోకి మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే రా రస్టిక్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని పక్కా మాస్ లుక్‌లో కనిపించగా ఏ స్థాయిలో స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి పోస్ట్‌పోన్ అయ్యి ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లెనిన్ కోసం... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ రూపొందుతోంది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెబుతున్నారు అఖిల్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీని వేసవి కానుకగా మే 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సంబరాల కోసం... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేకించి తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఇప్పటివరకూ చూడని పాత్రలో సాయిదుర్గా తేజ్ ప్రేక్షకులను అలరిస్తారని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదాపడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. నాగబంధంలో... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ద్వితీయ సినిమా ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్ . నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారు విరాట్ కర్ణ. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.‘‘అభిషేక్ నామా అత్యంత భారీగా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. మహాశివరాత్రి సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మూవీ కోసం విరాట్ కర్ణ అద్భుతంగా ట్రాన్ ్సఫార్మ్ అయ్యారు. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా శివుని అవతారంలో కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా సినిమాని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సరికొత్త బిర్యానీ... ‘ది ప్యారడైస్’ సినిమాలో నటుడు సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జడల్ పాత్ర పోషిస్తున్న నాని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ కనిపించనున్నారు. బిర్యానీ పాత్ర లుక్‌ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో సంపూర్ణేష్ గెటప్ ఆశ్చర్యపరచేలా ఉంది. పోడవాటి హెయిర్, గెడ్డం, రఫ్ లుక్, ఇంటెన్ ్స ఎక్స్ప్రెషన్ తో ఈ పాత్ర కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారాయన. ఈ మూవీ నుంచి విడుదలైన సంపూర్ణేష్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే ఆయన పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కూడా తమ పాత్రల కోసం సరికొత్తగా గెటప్ ఛేంజ్ చేస్తున్నారు.– డేరంగుల జగన్ మోహన్ -
ఓటీటీ 'మహాశయులకు విజ్ఞప్తి'.. ఆలస్యానికి కారణం ఇదేనా?
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. ది రాజాసాబ్ (జియోహాట్‌స్టార్), మన శంకర వరప్రసాద్‌గారు (జీ5), నారీ నారీ నడుమ మురారి (అమెజాన్), అనగనగా ఒకరాజు (నెట్‌ఫ్లిక్స్)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి, అయితే, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి( Bhartha Mahasayulaku Wignyapthi) మూవీ మాత్రం ఓటీటీ విడుదల విషయంలో జాప్యం ఏర్పడుతుంది. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే, ఓటీటీ ఆలస్యానికి కారణాలు ఏంటి అనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ థియేటర్ రన్ తర్వాత స్ట్రీమింగ్ హక్కులను ZEE5 పొందింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై మౌనం పాటిస్తోంది. ఇది ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. డిజిటల్ ప్రీమియర్ ఆలస్యం వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ తాజాగా ఆన్లైన్లో ఒక ఆసక్తికరమైన రూమర్ వైరల్ అవుతుంది. దీని ప్రకారం, ఇతర భాషాలకు సంబంధించిన డబ్బింగ్ వెర్షన్ పనులు పూర్తి కాలేదట. ముందుగా మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని, అందుకే OTT అరంగేట్రం చేసేందుకు మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది.ZEE5 సాధారణంగా బహుళ భాషలలో ప్రముఖ చిత్రాలను ఒకేసారి విడుదల చేస్తుంది. ఇటీవల, చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఏడు భాషలలో విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. -
ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది?
తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్‌గా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026 -
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.రవితేజ కీలక నిర్ణయం..సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రిస్క్‌లో షేర్..మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో నాని, సాయి ధరమ్ తేజ్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. రవితేజ కొత్త సినిమా..రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. -
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
కంటెంట్ బాగా నచ్చింది: రవితేజ
‘‘సుమతీ శతకం’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇందులోని కంటెంట్ బాగా నచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలి. అమర్దీప్ భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటు న్నాను’’ అని హీరో రవితేజ తెలిపారు. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ని చూసిన రవితేజ... ‘సుమతీ శతకం’ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. -
'వామ్మో.. వాయ్యో..' ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి
రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
రవితేజ 'ఇరుముడి'పై రీమేక్ రూమర్స్
అరడజనుకు పైగా సినిమాలతో వరసగా ఫ్లాప్స్ అందుకున్న హీరో రవితేజ.. ఈసారి సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీతో వచ్చాడు. కంటెంట్ పరంగా పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఎందుకనో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ చిత్రం ఫలితం సంగతి ఏంటనేది పక్కనబెడితే తాజాగా రవితేజ కొత్త మూవీని ప్రకటించాడు. 'ఇరుముడి' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంపై రీమేక్ రూమర్స్ వినిపిస్తున్నాయి.ట్రెండ్ ఎంత మారుతున్నా సరే రవితేజ ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో 'ఈగల్', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి ఒకటి రెండు ప్రయోగాత్మాక మూవీస్ చేసినప్పటికీ.. వాటిలోనూ రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్, సీన్స్ ఉండేసరికి అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కాస్త ఆలోచించి భిన్నంగా 'ఇరుముడి' అనే మూవీని రవితేజ చేస్తున్నాడు. ఇందులో అయ్యప్ప మాలధారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని చాలామంది 2022లో వచ్చిన మలయాళ మూవీ 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. అందులోనూ ఇలానే హీరో అయ్యప్ప మాల వేసుకుని ఉంటాడు. కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. దీంతో ఈ రెండింటి మధ్య పోలికలు కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్)కొన్నిరోజుల క్రితం శివ నిర్వాణ.. రవితేజతో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ 'ఇరుముడి' టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే ఇదో కూతురు, దేవుడి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. ఈ మలయాళ సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయి ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే 'ఇరుముడి' రీమేకా కాదా అనేది కొన్నిరోజుల ఆగితే క్లారిటీ వచ్చే అవకాశముంది.'మాలికాపురం' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల పాప కల్యాణి, అయ్యప్పస్వామి భక్తురాలు. తండ్రితో కలిసి శబరిమల వెళ్లాలనేది ఈమె కల. అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతుంది. దీంతో ఓ స్నేహితుడితో కలిసి శబరిమలకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు, కిడ్నాప్ ప్రయత్నాలు, చివరకు అయ్యప్పన్ అనే వ్యక్తి సాయంతో శబరిమల ఎలా చేరుకున్నారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్) -
'ఇరుముడి' సెట్లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
అయ్యప్ప దీక్షలో రవితేజ.. కొత్త సినిమా టైటిల్ ఇదే
రవితేజ పుట్టినరోజు సందర్భంగా నేడు (జనవరి 26) కొత్త సినిమాతో పాటు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. క్రేజీ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఇరుముడి(Irumudi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ తాజాగా విడుదల చేసిన పోస్టర్లో అయ్యప్పమాల ధరించి రవితేజ ఉన్నారు. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని ఆయన కనిపించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది.దర్శకుడు శివ నిర్వాణ గతంలో నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రవితేజ కోసం కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథతో రానున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో 2026లోనే ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
క్రేజీ దర్శకుడితో 'రవితేజ' కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్ విడుదల
రవితేజ- దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ మూవీపై (RT77) అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన రవితేజ.. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. తాజాగా తన కొత్త సినిమాను . మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో ప్రకటించాడు. గతంలో నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథతో రానున్నాడు. హైదరాబాద్‌లో టాకీ పార్ట్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 10గంటలకు రవితేజ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి 'ఇరుముడి' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కోసం హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. సమంత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2026లో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష
-
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. ఆరనీకుమా ఈ దీపం సాంగ్ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్‌ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్ప్రైజ్ అయ్యారు. స్క్రీన్‌పై రవితేజ మాస్ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. పబ్‌లో హీరోయిన్ ఆషికా రంగనాథ్‌తో మాస్ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..సినిమాసినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ -
Ravi Teja : నా మాటవిని సినిమాలు చేయరా బాబు
-
వెటకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ సునీల్: రవితేజ
సునీల్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య కామెడీ వదిలే వేరే జోనర్లో వెళ్లాడు. మళ్లీ భర్త మహాశయులు సినిమాతో కామెడీ వైపు వచ్చాడు. సినిమా చూసినవాళ్లు అంతా సునీల్ కామెడీ గురించి మాట్లాడుతున్నారు. దుబాయ్ శ్రీను తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. అప్పుడప్పుడైనా సునీల్ కామెడీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ నెల 13న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ లభించింది. శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో సినిమా సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్‌తో తనకున్న అనుబంధాన్ని రవితేజ పంచుకున్నాడు. ‘సునీల్, నేను మంచి స్నేహితులం. ఓ రకంగా చెప్పాలంటే.. వెతకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ నాకు. మా అమ్మ, వాళ్ల అమ్మ మంచి స్నేహితులు. వాళ్ల నుంచే మాకు వెతకారం వచ్చింది(నవ్వుతూ..) ’ అన్నారు. ఇక సునీల్ కూడా రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్ లేకున్నా సరే నేను కలిసే ఏకైక హీరో రవితేజ. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎనర్జీ నెక్ట్ లెవల్’ అన్నారు. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : భర్త మహాశయులకు విజ్ఞప్తినటీనటులు: రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఎల్వి సినిమాస్నిర్మాత: చెరుకూరి సుధాకర్‌దర్శకత్వం: కిషోర్ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: జనవరి 13, 2023ఈ ముగ్గుల పండక్కి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్ మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్‌గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయినా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్‌యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్‌గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్‌తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్‌లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్‌కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్‌కు తగ్గట్లు ప్రెష్‌గా ఉన్నాయి. మీమ్స్ కంటెంట్‌ని బాగా వాడుకున్నాడు. సోషల్ మీడియాని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు కొన్ని సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఏ జోనర్ సినిమాకైనా ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్ అయింది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్ మోడల్ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు. ఫస్టాఫ్‌లో సత్య, కిశోర్‌ల కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్ ఎపిసోడ్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది. హైదరాబాద్ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. మొత్తంగా పస్టాఫ్‌లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి.. బోర్ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆ కామెడీ డోస్ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్‌లో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ సీన్‌ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్, డింపుల్ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, సత్య, సునీల్‌ల కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయింది. మరళీధర్ గౌడ్ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. పిన్నీ సీరియల్ సాంగ్‌తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
కాణిపాకం వినాయకుడి సేవలో రవితేజ మూవీ టీమ్
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీమ్ కాణిపాకం వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారిలో హీరోయిన్స్ ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి, డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రవితేజ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రవితేజ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళే భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీమియర్స్ కూడా ప్రదర్శించనున్నారు. Blessed to seek the divine blessings of Lord Kanipakam Vinayaka alongside the talented @AshikaRanganath and our amazing #BMW movie team! Starting this new journey with positivity, laughter, and Ganapati Bappa's grace ahead of our Sankranthi release on 13th Jan! Here's a… pic.twitter.com/L45cM9g1NQ— Dimple parody (@hayathidimple) January 12, 2026 -
థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి
-
ఉంచాలా తీసేయాలా.. ఫస్ట్ నన్ను అడగాలి
కెరీర్లో తొలిసారి రవితేజ.. తన 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తీసేసి, రెమ్యునరేషన్ అందుకోకుండా చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మంగళవారం(జనవరి 13) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్.. రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సినిమాతో అలరించలేకపోయాం. ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ తీస్తా అని మాటిచ్చారు.'ఈ సినిమాకు రవితేజ అన్నయ్య.. మాస్ మహారాజ్ టైటిల్ తీసేయండి అని అన్నారట. ఆ టైటిల్ పెట్టింది నేను. దాన్ని పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నీ తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మాస్ మహారాజ్ అనే పేరు ఉంచాలా తీసేయాలా అనేది అన్నయ్య ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి. అది జరిగే పనికాదు. మిరాపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే 'నేనింతే'లో పూరీ జగన్నాథ్ పెట్టారు'(ఇదీ చదవండి: 'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్)'సినిమా ఎలా ఉన్నాసరే ఆడిందా ఊడిందా అనేది రవితేజ ఏం పట్టించుకోడు. తర్వాత రోజు షూటింగ్‌కి వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు పొంగిపోకురా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకురా' అని అర్థం. ఆయన పరిచయం చేసిన దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ.. ఈరోజు స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. మా గత సినిమా సరిగా ఎంటర్టైన్ చేయలేదు. డిసప్పాయింట్ చేశాం. కానీ మేం అక్కడితో అలా ఆగిపోము. రవితేజతో మళ్లీ బ్లాక్‌బస్టర్ తీస్తా' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ కెరీర్ చూసుకుంటే.. ఇరవైళ్లలో ఎనిమిది సినిమాలు తీశాడు. వీటిలో మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అయ్యాయి. చివరగా 2024లో 'మిస్టర్ బచ్చన్' అనే రీమేక్ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నాడు. ఇది దళపతి విజయ్ 'తెరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. దీని వల్ల మూవీపై అస్సలు బజ్ లేదు. ఈసారి హిట్ కొడితేనే హరీశ్ శంకర్‌కి ప్లస్ అవుతుంది. మరెం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఏపీలో రవితేజ, నవీన్ సినిమాలకు టికెట్ ధరలు పెంపు) -
'ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్లా ఉంటాడు'..మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఫ్యాన్స్‌ను పలకరించనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రవితేజ మాట్లాడారు.రవితేజ మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఆషికా, డింపుల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుంది. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో కలిసి 13 సినిమాలు చేశా. శేఖర్ కంపోజ్ చేసిన మూడు సాంగ్స్ బాగుంటాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక మా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడని అన్నారు. స్టీవ్ వా అనుకుంటా. హిట్‌తో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్‌లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. నా నెక్ట్స్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నా. ఇక ఈ మూవీకి భీమ్స్ అదరగొట్టేశాడు. కిశోర్ తిరుమలతో హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.'JAN 13TH - BHARTHA MAHASAYULAKU WIGNYAPTHI - thammullu kaluddham 💥💥💥 '@RaviTeja_offl super confident speech at the #BharthaMahasayulakuWignyapthi grand pre-release event ❤🔥#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/EHB6UXkmQ9— SLV Cinemas (@SLVCinemasOffl) January 10, 2026 -
ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు: రవితేజ
‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో తీశారు కిషోర్. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ నెల 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేటర్స్‌లో కలుద్దాం. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు’’అని హీరో రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు.కానీ, సినిమాని చాలా ఫ్యాషన్‌తో చేశారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్.. వీరి డైరెక్షన్లో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్ట్స్ శివ నిర్వాణతో చేస్తున్నాను. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. డింపుల్, ఆషిక, సునీల్, సత్య, కిషోర్, మురళీధర్, గెటప్ శీను అద్భుతంగా చేశారు. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’అని తెలిపారు.కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘జనవరి 13న మా బీఎమ్‌డబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కి వెళ్లండి.. అదిరి΄ోతుంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలిపారు. ‘‘నాకు డైరెక్టర్‌గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజగారే. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. ‘‘త్వరలోనే రవితేజగారితో సినిమా చేస్తాను’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు’’ అన్నారు డైరెక్టర్ పవన్. -
అది సవాల్‌గా అనిపించింది : ఆషికా రంగనాథ్
‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. నా పీఏ క్యారెక్టర్లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్‌గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్‌ని మ్యాచ్ చేయడం సవాల్ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని పేర్కొన్నారు. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలతో కాస్త హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రం జనవరి 13న అంటే వచ్చే మంగళవారం థియేటర్లలోకి రానుంది.రవితేజ కెరీర్ చూసుకుంటే గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. ధమాకా, క్రాక్.. కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ.. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడిపోయాడు. మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కాస్త కుదురుకోవాలంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో పక్కా హిట్ కొట్టాల్సిందే. మరి ఈసారి రవితేజ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్..!
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి వచ్చేశారు. గతేడాది హిట్ రాకపోవడంతో ఈ సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వామ్మో..వాయో అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ ఈ పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సాంగ్రకు దేవ్ పావేర్ లిరిక్స్ అందించగా.. స్వాతిరెడ్డి ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
కొత్త జోష్ అదిరింది
తెలుగు చిత్ర పరిశ్రమలో 2026 ఆరంభం కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా తమ సినిమాల ప్రకటనలు, కొత్త అప్డేట్స్ను పంచుకున్నారు మేకర్స్. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. ⇒ గన్ పట్టుకుని మాస్ లుక్‌తో కనిపించారు చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరో యిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కీలకపాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ⇒ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ⇒ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. ఎస్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మూవీని ప్రకటించారు. ⇒ ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ఫ్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ శర్వానంద్ హీరోగా, సంయుక్త– సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ సుమంత్ హీరోగా నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్పై జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ⇒ అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాటని ఈ నెల 5న, మూవీని వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది యూనిట్. ⇒ విశ్వక్సేన్ హీరోగా సాయి కిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ డ్రామాకి ‘లెగసీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్ . యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్్సమెంట్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ⇒ కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రయూనిట్. ⇒ నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జోడీగా నటిస్తున్న చిత్రం ‘హనీ’. కరుణ కుమార్ దర్శకత్వంలో ఓవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకాలజీ వంటి అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్. ⇒ హీరోయిన్ సంయుక్త నటిస్తున్న సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 75శాతం పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, సంయుక్త లుక్‌ని విడుదల చేశారు. ⇒ సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన సినిమా ‘హే భగవాన్ ’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. ⇒ నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ముఖ్య తారలుగా సింహాచలం గుడుపూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రుక్ష్మిణి’. నేలబల్లి కుమారి సమర్పణలో జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ⇒ అంకిత్ కొయ్య, మానసా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ జాతర’. ‘సమ్మతమే’ మూవీ ఫేమ్ గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ క్రియేషన్ ్సపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. పైన పేర్కొన్న చిత్రాలతోపాటుగా మరికొన్ని సినిమాల అప్డేట్స్ని న్యూ ఇయర్ సందర్భంగా ఆయా చిత్రాల మేకర్స్ వెల్లడించారు. -
రవితేజ, బింబిసార డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..?
-
కథ విన్నారా?
హీరో రవితేజ, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ సైన్స్ ఫిక్షన్ కథను రవితేజకు వశిష్ట వినిపించారని, ఈ కథ నచ్చి, సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట వశిష్ట. అలాగే తనకు ‘కిక్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితోనూ రవితేజ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ కథ కూడా విన్నారని తెలిసింది. ఇంకా ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా కమిట్అయినట్లుగా వార్తలున్నాయి. రవితేజ కొత్త సినిమా కబురు ఏ దర్శకుడితో ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ (వర్కింగ్ టైటిల్)తో రవితేజ బిజీగా ఉన్నారు. అలాగే ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు
హీరో రవితేజ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే అనేలా పరిస్థితి తయారైంది. గత మూడు నాలుగేళ్లలో 'క్రాక్', 'ధమాకా' లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాప్ అవడంతో పాటు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ చేతిలో ఉంది. దీనికోసం రవితేజ భారీ త్యాగాలే చేశాడు. తాజాగా ఆ విషయాల్ని దర్శకనిర్మాత బయటపెట్టారు.దర్శకుడు కిశోర్ తిరుమల తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్.. ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపించేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాలో నటించడంతో పాటు కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి త్యాగాలని రవితేజ చేశాడు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ గానీ రెమ్యునరేషన్ గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో బయటపెట్టారు. ఇదే చిత్రం కోసం రవితేజ.. తన 'మాస్ మహారాజా' ట్యాగ్ కూడా పక్కనబెట్టేశారని దర్శకుడు చెప్పాడు.ఇదంతా చూస్తుంటే రవితేజకు కూడా తన పరిస్థితి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుకే ఇలా త్యాగాలు చేస్తున్నాడా అని సందేహం వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రేక్షకుడు, కంటెంట్ చూసే థియేటర్‌కి వెళ్తున్నాడు. చిన్న సినిమానా పెద్ద సినిమానా.. చిన్న హీరోనా పెద్ద హీరోనా అని అస్సలు ఆలోచించట్లేదు. వరస ఫ్లాప్స్ వల్ల రవితేజ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బతింది. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయమని నిర్మాతని కోరాడు. అందుకు తగ్గట్లే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈసారి హిట్ పడితేనే రవితేజకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. -
ఈ సంక్రాంతికి రవితేజ మార్క్ మూవీ
-
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ కామెడీగా టీజర్
మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


