ఒకప్పుడు స్టార్ హీరోగా వరస హిట్స్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే సరైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. ఆడియెన్స్ కూడా ఇతడి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీతో వచ్చాడు. కంటెంట్ పర్లేదనిపించింది గానీ వసూళ్లు పెద్దగా రాలేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు రవితేజ చేయబోయే కొత్త సినిమా కోసం ఓ విచిత్రమైన టైటిల్ అనుకుంటున్నారట.
(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' అనే సినిమాని రవితేజ చేస్తున్నారు. కూతురి సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప మాలకు సంబంధించిన పార్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీని తర్వాత చేయబోయే మూవీ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడదే ఫైనల్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. 'రాజరాజచోర' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన హసిత్ గోలి.. తర్వాత 'స్వాగ్' తీశాడు గానీ ఫ్లాప్ అయింది.
ఇప్పుడీ దర్శకుడే రవితేజకు ఓ స్టోరీ చెప్పాడని, దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే 'అక్కాయిలు బాగున్నారా?' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


