సంక్రాంతి బరిలో కామెడీ మల్టీస్టారర్ | Sree Vishnu joins Ravi Teja Project | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరిలో కామెడీ మల్టీస్టారర్

Jul 1 2026 4:05 AM | Updated on Jul 1 2026 10:25 AM

Sree Vishnu joins Ravi Teja Project

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో 2026 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించిన హీరో రవితేజ 2027 సంక్రాంతి పండక్కి కూడా ఆడియన్స్‌ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్‌ హసిత్‌గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారనే ప్రచారం  ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కథ రీత్యా ఇది మల్టీస్టారర్‌ మూవీ అని, రవితేజతో  పాటు శ్రీవిష్ణు మరో లీడ్‌ రోల్‌లో నటించనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్   వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని, ఆగస్టు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేలా యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్‌ చేయాలని యూనిట్‌ లక్ష్యంగా పెట్టుకుందట. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement