రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్.
‘‘ఇరుముడి’లో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ పోరాట సన్నివేశాలను ఫైట్ మాస్టర్స్ అనల్ అరసు, రియల్ సతీష్ తెరకెక్కిస్తున్నారు’’ అని యూనిట్ తెలిపింది.


