గ్రీన్ సిగ్నల్‌? | Mass Maharaja Ravi Teja is rumored to collaborate with director Hari | Sakshi
Sakshi News home page

గ్రీన్ సిగ్నల్‌?

Jun 16 2026 1:02 AM | Updated on Jun 16 2026 1:02 AM

Mass Maharaja Ravi Teja is rumored to collaborate with director Hari

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న విడుదల కానుంది. దీంతో తన తర్వాతి సినిమా కోసం వరుసగా కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ.

ఇప్పటికే దర్శకులు వివేక్‌ ఆత్రేయ, హసిత్‌గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదట. కాగా తమిళ దర్శకుడు హరి ఓ యాక్షన్  కథను సిద్ధం చేశారని, ఈ స్క్రిప్ట్‌కి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయన భావించారట. ప్రస్తుతం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలతో దర్శకుడు హరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మరి.. హరి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్‌ ఇస్తారా? వీరి కాంబినేషన్ సెట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement