‘‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. కొన్ని పాత్రలు ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో స్వాసికను చూస్తే భయం వేస్తుంది. నేను, నక్షత్ర కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి. కావేరి పాత్రలో ప్రియ చక్కగా నటించింది. మైత్రీ బేనర్‌లో నాకు ఇది మూడో సినిమా. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అని రవితేజ అన్నారు.
రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి..’ పాటను విడుదల చేశారు.
ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులు, నా అభిమానులు థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. డిఫరెంట్ రవన్నను (రవితేజ) చూడబోతున్నారు (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి). జీవీ ప్రకాశ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శివ గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’’ అని అన్నారు.
‘‘మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. సాధారణ తండ్రి, కూతుళ్ల కథ ఇది. మన అమ్మాయిలను ఇలా చూసుకోవాలని మనకు అనిపిస్తుంది’’ అని శివ నిర్వాణ అన్నారు.
వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘అయ్యప్ప స్వామి దీక్షతో ఉన్న ఓ భక్తుడి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే థ్రిల్లింగ్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్, ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఆర్‌ఆర్ చేయడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు జీవీ ప్రకాష్ కుమార్. ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి..’ పాట పాడిన ఒరిజినల్ సింగర్ డప్పు రాంబాబు, ఒరిజినల్ కంపోజర్ సుంకర ఆంజనేయులు, లిరిసిస్ట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ చిత్రసంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటను రీ క్రియేట్ చేశారు.


