వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి | Mass Maharaja Ravi Teja Irumudi Worldwide Theatrical Release On August 21st | Sakshi
Sakshi News home page

వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి

Jun 8 2026 3:44 AM | Updated on Jun 8 2026 3:44 AM

Mass Maharaja Ravi Teja Irumudi Worldwide Theatrical Release On August 21st

అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘ఇరుముడి’ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం నిర్మాతలు తెలిపారు.

‘‘భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాల సమ్మేళనంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. భక్తి, మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్‌ అంశాలను కూడా జోడించి శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement