క్రేజీ దర్శకుడితో 'రవితేజ' కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌ విడుదల | Ravi Teja And Shiva Nirvana Movie Announced By Mythri movies | Sakshi
Sakshi News home page

క్రేజీ దర్శకుడితో 'రవితేజ' కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌ విడుదల

Jan 25 2026 11:00 AM | Updated on Jan 25 2026 12:13 PM

Ravi Teja And Shiva Nirvana Movie Announced By Mythri movies

రవితేజ- దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌ మూవీపై (RT77) అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన రవితేజ.. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. తాజాగా తన కొత్త సినిమాను . మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో ప్రకటించాడు. గతంలో నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ కాస్త రూట్‌ మార్చి ఓ థ్రిల్లర్‌ కథతో రానున్నాడు.  

హైదరాబాద్‌లో  టాకీ పార్ట్‌ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 10గంటలకు రవితేజ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  ఈ సినిమాకి 'ఇరుముడి' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.  

ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. సమంత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 2026లో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement