మారిపోతున్న మన హీరోలు.. మార్పు మంచిదే! | Mahesh Babu, NTR, Nani, Tollywood Stars Changed Their Look For New Films | Sakshi
Sakshi News home page

మారిపోతున్న మన హీరోలు.. మార్పు మంచిదే!

Jun 28 2026 10:57 AM | Updated on Jun 28 2026 12:06 PM

Mahesh Babu, NTR, Nani, Tollywood Stars Changed Their Look For New Films

హీరో అంటే కేవలం హ్యాండ్‌సమ్‌గా, క్లాస్‌ లుక్‌లోనే కనిపించాలి... చొక్కా నలగకుండా విలన్లను రఫ్ఫాడించాలి.. కొత్త కొత్త ట్రెండీ డ్రెస్‌లతో హీరోయిన్లతో ఆడిపాడాలన్నది గతం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ట్రెండ్‌ మారుతూ వస్తోంది. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఎంత మాస్‌ లుక్‌లో అయినా కనిపించేందుకు హీరోలు సై అంటున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం చొక్కాలు విప్పి మరీ విలన్ల భరతం పడుతున్నారు. ఆయా పాత్రల కోసం లాంగ్‌ హెయిర్‌ స్టైల్,పొడవాటి గెడ్డం, సిక్స్‌ ప్యాక్‌ బాడీ... ఇలా తమ అభిమానులనే కాదు... సగటు సినీ ప్రేమికులను అలరించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్, నాని, విజయ్‌ దేవరకొండ, శర్వానంద్, నిఖిల్, అఖిల్, సాయి దుర్గాతేజ్, విరాట్‌ కర్ణ వంటి హీరోలు తమ తాజా చిత్రాల కోసం లుక్స్‌ ఛేంజ్‌ చేసి, సరికొత్త లుక్‌లోకి మారారు. ఇలా మారడం మంచిదే అంటూ... ఏ సినిమాల కోసం ఇలా సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు? అనే వివరాలు చూద్దాం...  

వారణాసి కోసం...  
‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్‌ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌ బాబు తొలిసారి ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు. 

గతంలో ఎన్నడూ కనిపించనంతగా పొడవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారాయన. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్‌ అడ్వెంచర్‌ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ‘వారణాసి’ని గ్లోబల్‌ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్‌బాబు పేర్కొన్న సంగతి తెలిసిందే.  

పవర్‌ఫుల్‌ డ్రాగన్‌...  
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్‌’. ‘కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, సలార్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బిజూ మీనన్‌ , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్‌ కనకాల, అశుతోష్‌ రాణా, అన్షుమన్‌ పుష్కర్, సిద్ధాంత్‌ గుత్తా, ప్రభాస్‌ శ్రీను, శత్రు, శివ, బిమల్‌ జీత్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై కల్యాణ్‌రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు  పాన్‌  ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ సరికొత్త లుక్స్‌లోకి మారిపోయారు. ఈ మూవీలో ఆయన రెండు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం సన్నగా మారిపోయారాయన. అలాగే మరో పాత్రకు తగ్గట్లు సిక్స్‌ప్యాక్‌తో పవర్‌ఫుల్‌ లుక్‌లోకి మారారు. మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘డ్రాగన్‌’ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌ గ్లింప్స్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.   

 ‘‘డ్రాగన్‌’ కథ గోల్డెన్‌ ట్రైయాంగిల్‌ ్ర΄ాంతంలోని అంతర్జాతీయ అఫీమ్‌ అక్రమ వ్యా΄ారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్‌ ఇందులో లూగర్‌ అనే ΄ాత్రలో ఆఫ్గాన్‌ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన వ్యక్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్‌ 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది.  
∙యాక్షన్‌ 

సింగ...  
హీరో గోపీచంద్‌ తన కెరీర్‌లో ఇప్పటివ రకూ ఎన్నో యాక్షన్‌ రోల్స్, మాస్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. గోపీచంద్‌ కెరీర్‌లో 34వ సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఫైట్‌ మాస్టర్‌ వి. వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్‌ హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టై¯Œ మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్‌ 12న గోపీచంద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్‌తో ΄ాటు ఆయన ఫస్ట్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేసింది యూనిట్‌. ఈ మూవీ కోసం ఆయన ఫుల్‌ మాస్‌ లుక్‌లో మేకోవర్‌ అయ్యారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా  రూ΄÷ందుతోన్న చిత్రం ‘సింగ’. గెడ్డం, మీసం, చెవి΄ోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్‌ అవతార్‌లో రిలీజ్‌ చేసిన గోపీచంద్‌ లుక్‌ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్‌ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. ఫైట్‌ మాస్టర్‌గా సక్సెస్‌ అందుకున్న వెంకట్‌ దర్శకుడిగా హీరోను ఎంత పవర్‌ఫుల్‌ మాస్‌ అవతార్‌లో చూపించాలో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్‌ఫుల్‌ కథతో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించనున్నారు వెంకట్‌’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

రా అండ్‌ రస్టిక్‌ జడల్‌ 
‘దసరా’ (2023), ‘హిట్‌ : ది థర్డ్‌కేస్‌’ (2025) వంటి సినిమాల తర్వాత ‘ది ΄్యారడైజ్‌’ కోసం మరోసారి పక్కా రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లోకి మారి΄ోయారు హీరో నాని. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేష¯Œ లో రూ΄÷ందుతున్న సినిమా ఇది. వారిద్దరి కాంబినేషన్‌లో ‘దసరా’ మూవీ నిర్మించిన సుధాకర్‌ చెరుకూరి ‘ది ΄్యారడైజ్‌’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు విలన్‌గా, రాఘవ్‌ జుయల్, సంపూర్ణేష్‌ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై రూ΄÷ందుతోన్న ఈ సినిమా కోసం పవర్‌ఫుల్‌ రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లోకి మారి΄ోయారు నాని. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో జడల్‌ అనే ఫుల్‌ మాస్‌ ΄ాత్రలో నటిస్తున్నారాయన. ఈ క్యారెక్టర్‌ కోసం ΄÷డవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో కొత్త లుక్‌లోకి మారారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌లో నాని రెండు జడలు వేసుకుని కనిపించగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక వెండితెరపై నాని ఏ  స్థాయిలో తన నట విశ్వరూపం చూ΄ారో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో ఆగస్టు 21న రిలీజ్‌ అవుతోంది.  

డబుల్‌ ధమాకా  
విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవి కిరణ్‌ కోలా దర్శకుడు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో భారీ ΄ాన్‌ ఇండియా ్ర΄ాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘రౌడీ జనార్థన’ సినిమాలో విజయ్‌ తొలిసారి పూర్తి స్థాయి పవర్‌ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న విడుదల చేసిన విజయ్‌ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘విజయ్‌ ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ, ‘రౌడీ జనార్థన’ లాంటి పూర్తి స్థాయి మాస్‌ ΄ాత్ర ఇంతవరకు చేయలేదు. తొలిసారి ఈ సినిమాలో తనతో తూర్పు గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.  

– మ మ మాస్‌...  
అక్కినేని అఖిల్‌ చూడ్డానికి ఫుల్‌ క్లాస్‌ లుక్‌లో కనిపిస్తుంటారు. అయితే ఆయన మాస్‌ లుక్‌లో కనిపించిన తొలి చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తొలిసారి ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు అఖిల్‌. ఆ మూవీ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘లెనిన్‌’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఈ సినిమాలో మాస్‌.. మ మ మాస్‌ అంటూ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్‌. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. పొడవాటి హెయిర్‌ స్టైల్‌తో పాటు, గెడ్డంతో ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా ‘లెనిన్‌’ రూపొందింది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెప్పారు అఖిల్‌. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మే 23కి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నాగార్జున 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లెనిన్‌’ టీజర్‌ని విడుదల చేశారు. ‘ఎన్టీఆర్‌ అంత గొప్ప కాకపోయినా నువ్వు బానే సెప్పినావులే’, ‘ఏయ్‌... ఏందమ్మీ అట్టా మాట్టాడుతుండావు... ఈ లెనిన్‌గాడు నిప్పు’, ‘నేను తప్పి΄ోయి రాలేదు మచ్చా.. మీ అందర్నీ వెతుక్కుంటూ వచ్చిన’ అంటూ టీజర్‌లో అఖిల్‌ చెప్పే డైలాగులకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా జూన్‌ 26న విడుదల కావాల్సి ఉండగా జూలై 10కి వాయిదా పడింది.  

పీరియాడిక్‌ యాక్షన్‌ 
శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్‌ హయతి, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూ΄÷ందుతోన్న ‘భోగి’ సినిమా కోసం శర్వానంద్‌ సరికొత్తగా మాస్‌ లుక్‌లో మేకోవర్‌ అయ్యారు. ‘‘1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూ΄÷ందుతోన్న సినిమా ‘భోగి’. ఈ ΄ాన్‌ ఇండియా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా శర్వానంద్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్‌ అనుభూతిని అందించేలా మా సినిమా ఉంటుంది. మోస్ట్‌ ఇంటె¯Œ ్స, రిస్కీ స్టంట్లతో తన నటనలో సరికొత్త కోణాన్ని శర్వానంద్‌ చూపించబోతున్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

స్వయంభు కోసం...  
‘కార్తికేయ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీతో ΄ాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన నిఖిల్‌ సిద్ధార్థ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై భువన్, శ్రీకర్‌ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ΄ోస్ట్‌ ్ర΄÷డక్షన్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్‌ సిద్ధార్థ పొడవైన హెయిర్‌ స్టైల్, గెడ్డంతో సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు.

 జూన్‌ 1న నిఖిల్‌ సిద్ధార్థ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘స్వయంభు’ నుంచి నిఖిల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటెన్స్‌ ప్రిపరేషన్‌కి సంబంధించిన స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘భారీ పీరియాడిక్‌ యాక్షన్‌గా రూపొందిన చిత్రం ‘స్వయంభు’. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్‌ ప్రాజెక్టులలో ఒకటిగా మా మూవీ రూపొందింది. వైర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, గాల్లో చేసే విన్యాసాలు, ఫ్లిప్స్, క్లిష్టమైన ఫైట్‌ మూమెంట్స్‌ను నిఖిల్‌ సాధన చేస్తున్న దశ్యాలు ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్‌ఎక్స్‌ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రాచీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్‌ ప్రపంచాన్ని రూ΄÷ందిస్తున్నాం. ΄ాన్‌ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన మా సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

ఏటిగట్టుపై సంబరాలు  
సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై  ‘హను–మాన్‌’ వంటి పాన్‌ ఇండియన్‌ హిట్‌ మూవీ తర్వాత  కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. 

తన క్యారెక్టర్‌ కోసం పొడవాటి హెయిర్‌ స్టైల్, గుబురు గెడ్డం, కండలు తిరిగిన దేహంతో ఫుల్‌గా మేకోవర్‌ అయ్యారాయన. ఈ మూవీ చివరి షెడ్యూల్‌ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ షెడ్యూల్‌ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరులో విడుదల కానుంది.  

ఇరుముడికి...  
క్లాస్, మాస్‌... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోతుంటారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ కెరీర్‌లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మŠస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఈ పాత్రకు తగ్గట్టు గెడ్డం, కొంచెం పొడవాటి హెయిర్‌ స్టైల్‌తో మేకోవర్‌ అయ్యారాయన. ‘‘ఇరుముడి’లో యాక్షన్‌ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కాన్సెప్ట్‌ ఉంటుంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌ వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.

రెండో సినిమాకే...  
‘పెదకాపు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విరాట్‌ కర్ణ. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చి త్రాన్ని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించారు. 2023 సెప్టెంబరు 29న ఈ చిత్రం రిలీజైంది. తొలి సినిమాలోనే మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించి, నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విరాట్‌ కర్ణ. ఆయన హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్‌ ట్రెజర్‌’.  అభిషేక్‌ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌  హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్‌ అవినాష్‌ కీలక పాత్రలు పోషించారు.

కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలో రెండు పవర్‌ఫుల్‌ పాత్రల్లో కనిపించనున్నారు విరాట్‌ కర్ణ. తన కెరీర్‌లోనే రెండో సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో ఆయా పాత్రల కోసం సిక్స్‌ ప్యాక్, పొడవాటి జుట్టు, గెడ్డంతో ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నటించారు విరాట్‌. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘నాగబంధం’ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 3న విడుదల కానుంది. 

డబుల్‌ ధమాకా  
హీరో విజయ్‌ దేవరకొండ తన కెరీర్‌లో ఒకేసారి రెండు మాస్‌ మూవీస్‌లో నటిస్తున్నారు. వాటిలో ‘రణబాలి, రౌడీ జనార్థన’ సినిమాలుఉన్నాయి. విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న ΄ాన్‌ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హాలీవుడ్‌ నటుడు ‘మమ్మీ’ మూవీ ఫేమ్‌ ఆర్నాల్డ్‌ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌  భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘రణబాలి’ చిత్రం కోసం విజయ్‌ దేవరకొండ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. హెయిర్‌స్టైల్‌తో పాటు లావుపాటి మీసాలతో ఆయన లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలోని యాక్షన్‌ సీక్వెన్సులు మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటాయని యూనిట్‌ పేర్కొంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సెప్టెంబరు 11న విడుదల కానుంది.    
పైన పేర్కొన్న  హీరోలు మాత్రమే కాదు... మరికొంత మంది స్టార్, సీనియర్‌ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమ సినిమాల కోసం సరికొత్తగా లుక్స్‌ ఛేంజ్‌ చేస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement