breaking news
BCCI
-
అతడికి కెప్టెన్సీ.. అప్పటినుంచే బీసీసీఐతో విబేధాలు!
భారత క్రికెట్లో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయాలపై మరోసారి చర్చ మొదలైంది. అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా వచ్చిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియా వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఆయన హయాంలో సానుకూల అంశాలు చాలానే ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు మొదలు అనేక వివాదాలతో అగర్కార్ పదవికి మచ్చను తెచ్చిపెట్టేలా చేశాయి. 2027 ప్రపంచ కప్ కోసం రోహిత్‌ను జట్టులో ఉంచడానికి అతను సుముఖంగా లేనప్పటికీ, బోర్డు మాత్రం ఆ ఆటగాడికి మద్దతు ఇచ్చింది. అయితే నిజానికి అగార్కర్ పదవీకాలం ప్రారంభమైన నాటి నుంచే బీసీసీఐతో సమస్యలు మొదలయ్యాయని ‘ది టెలిగ్రాఫ్’ తమ నివేదికలో పేర్కొంది.‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. 2023లో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన రెండో సమావేశంలోనే ఓ కీలక నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో జరగాల్సిన టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్సీ అంశం చర్చకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌ను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని అగార్కర్ భావించినట్లు కథనం తెలిపింది. అనంతరం జరిగిన 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. యువ ఆటగాడికి నాయకత్వ అనుభవం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఉపయోగపడేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అయితే బీసీసీఐ మాత్రం జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించినట్లు నివేదిక పేర్కొంది. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్ సిరీస్‌తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. అతడికి ఇది పునరాగమన సిరీస్ కావడంతో బోర్డు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బుమ్రా పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని రుతురాజ్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని అగార్కర్ కోరుకున్నట్లు నివేదికలో పేర్కొన్నప్పటికీ.. బుమ్రాకు నాయకత్వం వహించాలనే ఆసక్తి ఉండటంతో బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేసిందని కథనం తెలిపింది. ఇక అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత అతడి స్థానంలో ఎవరు రానున్నారనేది బీసీసీఐ ఇంకా చెప్పనప్పటికీ, భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఇదీ చదవండి: లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టులో విధ్వంస వీరుడు! -
టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI).. జూనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కీలక బాధ్యతలను చేపట్టే రేసులో భారత మాజీ క్రికెటర్ రమేష్ పవార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.కాగా 48 ఏళ్ల పవార్‌కు భారత క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ టీమిండియా తరఫున 2 టెస్టులు, 31 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ముఖ్యంగా 2004 ప్రారంభంలో పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో అతడు కూడా భాగమయ్యాడు.ఇక కేవలం ఆటగాడిగానే కాకుండా కోచ్‌గానూ అతడికి మంచి అనుభవం ఉంది. భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలు అందించారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో కూడా అతడు కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో ముంబై, గుజరాత్ జట్లకు వివిధ హోదాల్లో కోచ్‌గా వ్యవహరించారు. ఈ సుదీర్ఘ అనుభవం జూనియర్ స్థాయి నుంచి కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరోవైపు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్? -
బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి తన 100 ఏళ్ల ఘనమైన ప్రయాణాన్ని అత్యంత వైభవంగా సెల్‌బ్రేట్ చేసుకోవడానికి సమాయత్తమవుతోంది. ఈ శతాబ్ది ఉత్సవాలను క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మార్చేందుకు ఒక ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.ఈ ఉత్సవాల సందర్భంగా 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' మధ్య ఒక చారిత్రక మ్యాచ్ జరగనున్నట్లు 'ఆనందబజార్ పత్రిక' తన కథనంలో పేర్కొంది. ఇది గనుక కార్యరూపం దాల్చితే భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే మైదానంలో చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఈ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీసీసీఐ ఏజీఎం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాకుండా, గత వంద ఏళ్లలో భారత క్రికెట్ ప్రస్థానాన్ని మరియు ప్రపంచ క్రికెట్లో భారత్ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా పలు విశేష క్రీడా కార్యక్రమాలను సైతం బీసీసీఐ నిర్వహించనుంది.భారత జట్టు 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్'తో తలపడటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 1994-95 సీజన్లో ఈ రెండు జట్ల మధ్య పరిమిత ఓవర్ల ప్రదర్శన (ఎగ్జిబిషన్) మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో మొదటి మ్యాచ్ 1994 జూన్ 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 45 ఓవర్ల డే-నైట్ మ్యాచ్‌గా జరిగింది.ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఎలెవన్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (151) అద్భుత సెంచరీతో విరుచుకుపడగా, వినోద్ కాంబ్లీ (45) కూడా రాణించాడు. అనంతరం 264 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్' నిర్ణీత 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులకే పరిమితమైంది.ఆ తర్వాత రెండో మ్యాచ్ 1995 మార్చి 24న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ఇదే. ఇప్పుడు మళ్లీ దాదాపు 31 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ముఖాముఖి తలపడటానికి సిద్ధమవుతుండటం విశేషం.చదవండి: 'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు' -
మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ
భారత మహిళా, పురుష క్రికెట్ జట్లకు మరోసారి ‘నక్వీ గండం’ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత ఆసియా క్రీడలు-2026 టోర్నీలోనూ అతడి చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. కాగా ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రెండుసార్లు నిరాకరణఅయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు, ఇటీవల 2026లో ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఇంతవరకు ట్రోఫీలు భారత్‌కు అందకుండా నక్వీ పావులు కదుపుతున్నాడు.హాట్ ఫేవరెట్‌గా భారత జట్లుఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. జపాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ విభాగంలో టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా.. డిఫెండింగ్ చాంపియన్లు టీమిండియా, భారత మహిళా జట్టు హాట్ ఫేవరెట్‌గా ఉన్నాయి.ఇక్కడా అదే గండం.. నిరాకరిస్తే కష్టమే!ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్న ఇరుజట్లు దాదాపు స్వర్ణం గెలవడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఆసియా ఒలింపిక్ మండలి (OCA)లో భాగమైన నక్వీకి గనుక పతకాలు ప్రదానం చేసే అవకాశం వస్తే.. భారత జట్లు తప్పక అతడి చేతుల మీదుగానే మెడల్స్ స్వీకరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆసియా క్రీడలనే అవమానించినట్లుగా అవుతుంది. తద్వారా పతకాలు నిరాకరించిన జట్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.స్పందించిన బీసీసీఐఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించారు. ‘‘ముందుగా మ్యాచ్‌లు గెలవడంపైనే మా దృష్టి ఉంది. భారత జట్లు స్వర్ణ పతకం గెలిచి పోడియం వద్దకు వెళ్లాలి. అప్పుడే మేము దీని గురించి నిర్ణయం తీసుకుంటాము.ప్రస్తుతం మా దృష్టి మొత్తం మ్యాచ్‌లు గెలవడం మీదే ఉంది. బోర్డు, ఆటగాళ్లకు ఇదే మొదటి ప్రాధాన్యం. ఇప్పటి వరకు జరగని దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు.నిబంధనలు ఇవేకాగా ఆసియా ఒలింపిక్ మండలి నియావళిలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ‘విజయాలు, పతకాల ప్రదానోత్సం’లో భాగంగా విజేతలకు OCA అధ్యక్షుడు నేరుగా మెడల్ ప్రదానం చేయవచ్చు. లేదంటే.. మండలిలో భాగమైన ఇతర సభ్యులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ ఎలాంటి రాజకీయ, మతపరమైన, వాణిజ్యపరమైన అంశాలకు తావు ఉండదు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్ -
బీసీసీఐ 95వ వార్షిక సమావేశం.. 10 కీలక నిర్ణయాలు ఇవే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 95వ వార్షిక సభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్‌కు బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉప్యాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పది కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ ఏజీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే1. బీసీసీఐ జనరల్ బాడీలో భాగమైన అరుణ్ సింగ్ ధుమాల్ మరోసారి ఐపీఎల్ చైర్మన్‌గా ఖరారు కాగా.. ఖైరుల్ జమాల్ మజుందార్ సభ్యుడిగా చేరారు.2. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.3. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ ఆడిట్ చేయబడిన ఖాతాల నివేదికను జనరల్ బాడీ ఆమోదించింది.4. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లను నియమించారు.5. అదేవిధంగా 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ ఎడిషన్‌ను అత్యంత ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.6. బీసీసీఐ శత వసంత ఉత్సవాలు 2028లో ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది. డిసెంబరు 2027 నుంచి 2028 వరకు దాదాపు ఏడాది పాటు వేడుకలు చేయాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాన్ని వీలైనంత ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.7.దేశవాళీ క్రికెట్లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్లుగా విభజించేందుకు చర్యలు చేపట్టింది.8.లైంగిక వేధింపుల నిరోధక విధానంలో భాగంగా బీసీసీఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.9.ఆటగాళ్ల వయసు నిర్దారణకు సంబంధించిన విధానంలో అప్డేట్ తీసుకువచ్చింది.10. దివ్యాంగ క్రికెటర్లకు మద్దతుగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు, వారికి కల్పించాల్సిన వనరులు, సౌకర్యాల గురించి రాష్ట్ర అసోసియేషన్లతో చర్చించింది. దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. -
అంపైర్లు, రిఫరీల జీతాలు పెంపు
దేశవాళీ క్రికెట్లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుండగా, అప్పటి నుంచి కొత్త వేతనాలు వర్తిస్తాయి. ముంబైలో శుక్రవారం నాటి బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారు. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్లుగా విభజిస్తారు.రూ. 40 వేల చొప్పునతొలి రెండు గ్రేడ్లలో ఉన్నవారు సీనియర్ స్థాయి మ్యాచ్‌లకు, తర్వాతి రెండు గ్రేడ్లలో ఉన్నవారు జూనియర్ స్థాయి మ్యాచ్‌లకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం దేశంలో బీసీసీఐ గుర్తింపు పొందిన 20 మంది అంపైర్లకు రోజుకు రూ.40 వేల చొప్పున, ఇతర అంపైర్లు రోజుకు రూ.30 వేల చొప్పున ఇస్తున్నారు. టీ20 మ్యాచ్‌లకైతే రోజుకు రూ.20 వేలు లభిస్తాయి. రోజూవారీ భత్యం కింద ఇచ్చే రూ.500– రూ.1500 వరకు ఇచ్చే మొత్తం దీనికి అదనం. -
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెల (సెప్టెంబరు)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్-2027 వరకు అగార్కర్‌నే సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు భావించినట్లు తెలిసింది.అయితే, అగార్కర్ మాత్రం చీఫ్ సెలక్టర్‌గా కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు బుధవారం భారత వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అగార్కర్‌కు ఇదే ఆఖరి సమావేశం అని సమాచారం.రేసులో వారేఈ నేపథ్యంలో ఎన్డీటీవీ కథనం ఆసక్తికర విషయం వెల్లడించింది. చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ స్థానాన్ని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ లేదంటే.. మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొనట్లు తెలిపింది. కాగా పార్థివ్ పటేల్ (గుజరాత్), ప్రజ్ఞాన్ ఓజా ఇద్దరూ టీమిండియా తరఫున సత్తా చాటడంతో పాటు మూడుసార్లు టైటిళ్లు గెలిచిన ఐపీఎల్ జట్లలో సభ్యులు కావడం విశేషం. ఇక ఒడిశాకు చెందిన ఓజా ఇప్పటికే సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.ఘనమైన విజయాలుకాగా 2023 జూలైలో అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు. అతడి హయాంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. ఇక 2024, 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అంతేకాదు గతేడాది ఆసియా కప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్‌లోనే అగార్కర్ పదవీకాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అతడిపై నమ్మకంతో అక్టోబరు 4 దాకా గడువు పొడిగించింది. అయితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను వన్డే ప్రపంచకప్-2027 దాకా కొనసాగించే విషయంలో అగార్కర్- బీసీసీఐ పెద్దల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.అందుకే విభేదాలు!రో-కో ప్రపంచకప్ ఆడే విషయంపై స్పష్టత ఇవ్వలేదంటూ అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రో- కో మాత్రం తాము కచ్చితంగా వన్డే వరల్డ్‌కప్ ఆడతామనే సంకేతాలు ఇచ్చారు. ఇక రోహిత్- కోహ్లి అర్దంతరంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం కూడా అగార్కర్ వైఖరేనని గతంలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తలెత్తిన విభేదాల కారణంగా బీసీసీఐ పెద్దలు, అగార్కర్ మధ్య దూరం పెరిగిందని.. అందుకే అగార్కర్ ఇక తన పదవి నుంచి దిగిపోకతప్పలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: ఆసియా క్రీడలకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం -
ఈసారి భారత్‌లోనే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: మూడేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కార్యక్రమం భారత్‌లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు. ‘ప్రతి ఏడాది ఐపీఎల్ వేలం కార్యక్రమం భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్ కారణంగా వేదిక లభించడం కష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ వేలం భారత్‌లోనే ఉంటుంది. ఈసారి మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం’ అని రేపు జరిగే బీసీసీఐ ఏజీఎంలో మరోసారి ఐపీఎల్ చైర్మన్‌గా ఎన్నిక కానున్న అరుణ్ ధుమాల్ తెలిపారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఫ్రాంచైజీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. 2024 ఐపీఎల్ వేలం జిద్దాలో... 2025 ఐపీఎల్ వేలం దుబాయ్‌లో... 2026 వేలం అబుదాబిలో నిర్వహించారు. -
వైభవ్ తో పోటీనా... రిపోర్టర్ ప్రశ్నకు సంజూ శాంసన్ దిమ్మతిరిగే కౌంటర్
-
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
మహిళల ఆసియా కప్-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా బహుమతి అందుకోమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదుఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే విషయం గురించి మేము ముందుగానే చర్చించుకున్నాము. అతడే ట్రోఫీ ఇస్తానని పట్టుబడితే తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాము. జట్టుకు ఇదే విషయాన్ని తెలియజేశాము.ఇది బోర్డు సామూహిక నిర్ణయం. ఇందుకు నక్వీ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే వేదిక దగ్గరకు వచ్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు. కాగా మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.అపుడు కూడా ఇలాగేదుబాయ్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి హర్మన్ సేన టైటిల్ గెలుచుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్ గెలిచినప్పటికీ భారత పురుషుల క్రికెట్ జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.తాజాగా 2026లో చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా జట్టు సైతం అదే బాటలో నడిచింది. అయితే, ఈసారి తాము ముందుగానే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని బీసీసీఐ ఏసీసీకి సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ నక్వీ తానే స్వయంగా బహుమతి ప్రదానం చేస్తానని వేదిక వద్దకు రాగా.. భారత జట్టు కిందే ఉండిపోగా.. రన్నరప్ శ్రీలంకకు చెక్ ఇచ్చి నక్వీ వెళ్లిపోయాడు.ట్రోఫీ ఇంకా చేతికి రాలేదుఇదిలా ఉంటే.. పురుషుల జట్టుకు రావాల్సిన ఆసియా కప్ ట్రోఫీ ఇంకా బీసీసీఐ చేతికి అందనేలేదు. తాజాగా మహిళల ట్రోఫీ కూడా ఎప్పుడు చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఏసీసీతో సంప్రదించి త్వరలోనే రెండు ట్రోఫీలు దేశానికి చేరేలా చూస్తామని వెల్లడించారు. కాగా టీమిండియా గతేడాది ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా.. నక్వీ తనతో పాటే ట్రోఫీని ఎత్తుకెళ్లాడనే ప్రచారం జరిగింది. దీంతో తాజాగా మహిళల ఫైనల్ ముగిసిన తర్వాత నక్వీ స్టేడియంలోకి రాగా..‘ట్రోఫీ చోర్’ అంటూ టీమిండియా అభిమానులు నినాదాలు చేశారు. చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
భారత్ అఫ్గాన్ రెండో T20.. టీమ్ లో సంచలన మార్పులు
-
‘సంతోషంగా ఉంది.. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.గతేడాది పురుషుల జట్టు మాదిరిగానే ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది హర్మన్ సేన. ఫలితంగా.. ముందే సమాచారం ఇచ్చినప్పటికీ చాంపియన్‌కు తానే ట్రోఫీ ప్రదానం చేస్తానని పట్టుబట్టిన నక్వీకి భంగపాటు ఎదురైంది. ‘ట్రోఫీ దొంగ’ అంటూఅతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. స్టేడియంలో ఉన్నవాళ్లు ‘ట్రోఫీ దొంగ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. రన్నరప్ శ్రీలంక మాత్రం నక్వీ చేతుల మీదుగా చెక్ అందుకుంది.ఈ నేపథ్యంలో నక్వీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం అతడిని ప్రశంసిస్తూ అతి చేయడం కెమెరా కంటికి చిక్కింది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2026 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది.పాత కథ పునరావృతం కాకుండా..తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.దీంతో నక్వీ ట్రోఫీని తనతోపాటే తీసుకువెళ్లడం సహా.. తన అనుమతి లేకుండా భారత్‌కు ట్రోఫీని అందజేయవద్దనే ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చింది. తమ జట్టు ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోదని తేల్చి చెప్పింది.అయినప్పటికీ నక్వీ మొండిగా ముందుకు వెళ్లి.. చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియం వీడి కారులో నక్వీ తిరిగి వెళ్తున్న వేళ కొంతమంది పాక్ అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు‘మంచి పని చేశారు సర్. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’ అంటూ ఓ అభిమాని మాట్లాడటం రికార్డు అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్, నక్వీ తీరుపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.55 పరుగులకే ఆలౌట్ అయిన వాళ్లకే ఆ అర్హత ఉంది‘‘అవును.. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా చాంపియన్‌గా నిలిచిన హర్మన్‌సేనకు.. ఇలాంటి వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు అర్హత ఎందుకు ఉంటుంది?.. భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ అయిన పాక్ మహిళా జట్టుకు మాత్రమే ఆ అర్హత ఉంది. నక్వీ, పాక్ జట్టు.. వారికి వారే తగినవారు. శునకానందం పొందండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా గ్రూప్ దశలో భారత జట్టుతో తలపడ్డ పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్‌సేన 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. శ్రీలంక చేతిలో ఓడి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా అవతరించింది.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మHumiliation for Mohsin Naqvi 🔥😂“Good job, sir. We are happy with you. They don’t deserve the trophy,” a Pakistani fan tells Mohsin Naqvi. pic.twitter.com/6OSfKSNtzV— Anamika (@TheRubric_Medic) September 14, 2026 -
వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?
ఆసియా కప్ ట్రోఫీ బహూకరణ విషయంలో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు (ఏసీసీ), పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ వైఖరి కారణంగా భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది.ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరణకాగా గతేడాది పురుషుల ఆసియా కప్ టీ20 టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు నక్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో నక్వీ ట్రోఫీని తనతో పాటే తీసుకువెళ్లగా.. సూర్యకుమార్ సేన రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.ఇప్పటికీ ట్రోఫీ భారత్ చేతికి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలోనూ భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ గెలిచింది. అయితే, ట్రోఫీ అందించే విషయంలో నక్వీ మొండిపట్టుదల కారణంగా హర్మన్‌సేన విషయంలో పాత కథే పునరావృతమైంది.𝗧𝗛𝗘 𝗪𝗜𝗖𝗞𝗘𝗧. 𝗧𝗛𝗘 𝗥𝗢𝗔𝗥. 𝗧𝗛𝗘 𝗖𝗥𝗢𝗪𝗡! 👑8 titles. One unstoppable dynasty 💙 #SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame #DPWorldWomensAsiaCup2026 pic.twitter.com/NG3DRF52Xd— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026ముందుగానే సమాచారంనిజానికి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీ బహూకరణ అంశం గురించి ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ..‘‘పురుషుల ఆసియా కప్ మాదిరే ఈసారి కూడా ట్రోఫీ అందుకునే విషయంలో మా వైఖరి గురించి ముందుగానే స్పష్టంగా చెప్పాము. ఇప్పటికీ గతేడాది ట్రోఫీ ఇంకా మా చేతికి రాలేదు. అయినా సరే కొంతమంది విదేశీ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు ఈసారి కూడా సుముఖంగా లేమని చెప్పేశాము.ఆయన చేతుల మీదుగా అయితే ఓకేఒకవేళ ఏసీసీ డిప్యూటీ చైర్పర్సన్ ట్రోఫీని ఖలీద్ అల్ జరూనీ ప్రదానం చేస్తే తీసుకుంటామని చెప్పాము. కానీ మా అభ్యర్థనను తిరస్కరించారు. కాబట్టి ట్రోఫీని ఆ వ్యక్తి (నక్వీ) చేతుల మీదుగా తీసుకోవద్దమని మేము నిర్ణయించుకున్నాము’’ అని సైకియా తెలిపాడు.‘‘ఏదేమైనా ట్రోఫీ చేతికి రానంత మాత్రాన మా జట్టు సాధించిన విజయం వృథాగా పోదు. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిన అమ్మాయిలకు అభినందనలు. ఏదో ఒకరోజు రెండు ట్రోఫీలు మన చేతికి వస్తాయి’’ అని సైకియా పేర్కొన్నాడు.వద్దన్నా వినడు.. ఇదేం బుద్ధి?బీసీసీఐ ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినప్పటికీ మోసిన్ నక్వీ ట్రోఫీ తానే ఇస్తానని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా జియో న్యూస్ వెల్లడించింది. ఏదేమైనా ట్రోఫీ చాంపియన్ చేతికి అందుతుందని.. ఈ విషయంలో ఏసీసీ సుముఖంగానే ఉందని పేర్కొంది.కాగా నక్వీ తీరుపై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ముందుగా చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టడం దేనికి?.. ఇదేం బుద్ధి?.. కావాలనే భారత్‌కు ట్రోఫీలు రాకుండా అల్ప సంతోషం పొందడం పాక్ మంత్రికి అలవాటై పోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 🚨 NO TROPHY FROM MOHSIN NAQVI! 🇮🇳India Women chose not to collect the Asia Cup trophy from Pakistan’s Mohsin Naqvi.Smriti Mandhana simply turned around and headed back to the dugout! 🔥WELL DONE GIRLS! 🙌 pic.twitter.com/XwnW5eW8nW— The Khel India (@TheKhelIndia) September 14, 2026 -
మహిళా ఆసియా కప్-2026 ఫైనల్లో భారత్ గెలుపు.. ట్రోఫీ వేళ ట్విస్ట్!
దుబాయ్: మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ట్రోఫీ అందుకునే సమయంలో మాత్రం వేదిక వద్దకు రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినట్లు సమాచారం. దీంతో గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లో చోటుచేసుకున్న పరిస్థితే మరోసారి కనిపించింది.అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మ్యాచ్ అనంతరం ఎప్పటిలాగే సంబరాలు చేసుకుంది. ప్రసార సంస్థకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన 15–20 నిమిషాల్లో బహుమతుల ప్రదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గంటకుపైగా ఆలస్యమైంది. ఈ సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో మైదానం పక్కన మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే జట్టు సభ్యులకు పతకాలు అందజేసినట్లు సమాచారం.ఏసీసీ అధ్యక్షుడి హోదాలో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అందజేసేందుకు స్టేడియానికి వచ్చినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపత్తుకు ఆయన బహుమతి చెక్కును అందజేశారు. అయితే భారత జట్టు, కోచ్, అధికారులు ట్రోఫీ ప్రధాన వేదిక వద్ద కనిపించలేదు. దీంతో భారత జట్టు ట్రోఫీని తీసుకోకపోతే దానిని మరోసారి ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. భారత్ టైటిల్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. మరో ఏసీసీ లేదా ఐసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీ అందజేయాలని కోరింది. అయితే నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో అప్పట్లో బహుమతి ప్రదాన కార్యక్రమం వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆయన ట్రోఫీని తీసుకుని ఏసీసీ కార్యాలయానికి వెళ్లారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో గతేడాది ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల సందర్భంగా సంప్రదాయ హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడాన్ని భారత జట్టు వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నఖ్వీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా చేసిన గత వ్యాఖ్యలు కూడా దీనికి కారణమని కథనాలు పేర్కొన్నాయి. తాజాగా మహిళల ఆసియా కప్ ఫైనల్లోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించడంతో ట్రోఫీ ప్రదానంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి -
నాతో పెట్టుకోకు వైభవ్ కు చుక్కలు చూపించిన బుమ్రా
-
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
‘అలా అయితే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు.. మంచి పనే చేశారు’
హర్షిత్ రాణా.. ఐపీఎల్లో సత్తా చాటి అనతికాలంలోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో ఒకడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన ఈ ఢిల్లీ పేసర్.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అడుగుపెట్టాడు.టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, పద్నాలుగు వన్డేలు, పద్నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా నాలుగు, 26, 16 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు.గాయాలతో సావాసంఅయితే, గత కొంతకాలంగా హర్షిత్ రాణా గాయాల వల్ల ఇబ్బందిపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడిన అతడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మొత్తానికి ఈ కోల్‌కతా నైట్ నైడర్స్ ఆటగాడు దూరమయ్యాడు.ఇలా వచ్చి.. అలా వెళ్లాడుఈ క్రమంలో జూన్‌లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా భారత టీ20 జట్టులోకి హర్షిత్ రాణా పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వన్డే సందర్భంగా అతడికి తొడ కండరాల గాయమైంది. దీంతో హర్షిత్ రాణా మరోసారి జట్టుకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో హర్షిత్ రాణా పునరావాసం పొందుతున్నాడు. అయితే, అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో సెప్టెంబరు 13న మొదలయ్యే టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ తొలుత ప్రకటించింది.సిరీస్ మొత్తానికి దూరంఅయితే, ఫిట్నెస్ పరీక్ష సమయంలో హర్షిత్ రాణా మరోసారి గాయపడటంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత హర్షిత్‌ను టీమిండియాలో ఆడించాలని శరణ్‌దీప్ సింగ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం తొందరపడి అతడిని తీసుకురాకుండా మంచి పని చేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ....డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది‘‘ఒక్కసారి టీమిండియాలోకి తిరిగి వస్తే అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్షిత్ రాణాను మరికొంత కాలం పక్కనపెట్టడం సానుకూల విషయమే. లేదంటే వరుస గాయాల వల్ల హర్షిత్ డిప్రెషన్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.ఒత్తిడి పెరిగి అతడి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత జట్టులో అతడు కీలక సభ్యుడిగా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు అవసరమైనపుడు బ్యాటింగ్ కూడా చేయగలడు. గతేడాది కాలంగా బాగా రాణించాడు. అయితే, గాయాల వల్ల కాస్త వెనుకబడ్డాడు. అతడు త్వరలోనే ఫిట్‌గా మారి తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’’ అని శరణ్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే? -
ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా!
సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా మొదలుకానున్న ఆసియా క్రీడలకు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ నీలం రంగు (Blue) జెర్సీకి బదులు నారింజ రంగు (Orange) జెర్సీ ధరించి టీమిండియా మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆసియా క్రీడలకు మాత్రం టీమిండియా జెర్సీలో మార్పు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇటీవలే భారత హాకీ జట్టు మాత్రం కాషాయ రంగు జెర్సీ నుంచి బ్లూ జెర్సీలోకి మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఆసియా క్రీడలకు కూడా మన హాకీ జట్టు ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే హాకీ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లు కాషాయ రంగు జెర్సీ ధరించిన ఫొటోలు (ఏఐ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. అభిమానులు మాత్రం నారింజ రంగు వద్దని, అచ్చొచ్చిన నీలం రంగు జెర్సీతోనే ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలని కామెంట్లు చేశారు. కొందరు మాత్రం నారింజ, నీలం రంగులు కలిసిన జెర్సీని ధరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.ఇక జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 10 నుంచే ఆసియా గేమ్స్ ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్య, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. టాప్-10లో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న ఆడనుంది. ఇక మహిళల క్రికెట్లో మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 18న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది.🚨 NEW JERSEY FOR TEAM INDIA IN ASIAN GAMES 2026 !🧡🇮🇳- According to reports, Team India are set to move away from their iconic blue jersey and feature a new orange kit at the upcoming Asian Games. [News Arena] pic.twitter.com/3NpG2VXkDT— lndian Sports Network (@IS_Netwrk29) September 12, 2026చదవండి: యూఏఈ క్రికెటర్‌పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం! -
వైస్ కెప్టెన్ పదవి వచ్చినా హ్యాపీగా లేను.. తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్
-
సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు
-
కీలక పదవి కోసం బీసీసీఐకి దొరకని అభ్యర్ది.. ఏడాదిగా గాలింపు
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి ఓ కీలక పదవి కోసం సరైన వ్యక్తి దొరకడం లేదు. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్-స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పోస్ట్ కోసం భారత క్రికెట్ బోర్డు ఏడాదిగా అభ్యర్ది కోసం గాలిస్తూనే ఉంది. తాజాగా బోర్డు మరోసారి సదరు పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.నితిన్ పటేల్ 2025 మార్చిలో రాజీనామా చేసినప్పటికీ నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అతడు దాదాపు మూడేళ్లు సేవలు అందించిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.నితిన్ పటేల్ గతంలో జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీల రిహాబిలిటేషన్‌ను పర్యవేక్షించి 2023 వన్డే ప్రపంచకప్‌కు వారు సిద్ధం కావడంలో కీలక పాత్ర పోషించాడు.అర్హతలుఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి స్పోర్ట్స్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డాక్టరేట్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.అలాగే ప్రొఫెషనల్ లేదా ఒలింపిక్ క్రీడల్లో మల్టీ డిసిప్లినరీ పనితీరు బృందాలను నిర్వహించిన కనీసం ఐదేళ్ల వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 60 ఏళ్లలోపు ఉండాలి.దరఖాస్తుదారులు సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎంపికైన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ అధికారి నేరుగా CoE హెడ్, మాజీ భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.చదవండి: మరో 3 రోజుల్లో సిరీస్.. అంతలోనే టీమిండియా కీలక సభ్యుడి రాజీనామా! -
అఫ్గాన్‌కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ శుభవార్త అందింది. పేస్ గుర్రం, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులో చేరేందుకు సిద్దమయ్యాడు. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో అతడి ఉత్తీర్ణత సాధించినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. కాగా ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో బుమ్రా మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ఇంగ్లండ్ నుంచి వచ్చాక బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు. కానీ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో లంక టూర్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కింది. కానీ బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకుంటానే మైదానంలోకి అడుగుపెడతాడని సెలక్లర్లు స్పష్టత చేశారు. ఇప్పుడు బుమ్రా ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ కావడంతో బీసీసీఐ వైద్య బృందం నుంచి అతడికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అదేవిధంగా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలు సైతం ఫిట్నెస్ క్లియరెన్స్‌లు పొందారు. అయితే ఫిట్నెస్ టెస్టులో విఫలమైన పేసర్ హర్షిత్ రాణా.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియాక్రీడలకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు.అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్‌కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’ -
భారత ‘ఎ’ జట్టులో షేక్ రషీద్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా జట్టు... భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో... త్వరలో ఇరు దేశాల ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. వీటి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం వేర్వేరుగా జట్లను ప్రకటించింది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం ప్రకటించిన భారత ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో రషీద్ సౌత్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరంగా ఉన్న సీనియర్ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక వన్డేలకు ఎంపిక చేశారు. 32 ఏళ్ల పాండ్యా ఐపీఎల్ అనంతరం గ్రౌండ్లో అడుగు పెట్టలేదు. ఇటీవలే ఫిట్నెస్ సాధించిన పాండ్యా... ఈ సిరీస్ ద్వారా తిరిగి పోటీ క్రికెట్ ప్రారంభించనున్నాడు. భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య ఈ నెల 22 నుంచి పాండిచ్చేరి వేదికగా తొలి అనధికారిక టెస్టు జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 29 నుంచి అక్కడే రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం పాండిచ్చేరిలోనే అక్టోబర్ 6, 9, 11న వరుసగా మూడు అనధికారిక వన్డేలు నిర్వహించానున్నారు. దాదాపు అదే సమయంలో భారత సీనియర్ జట్టు వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. సుదీర్ఘ ఫార్మాట్లో భారత ‘ఎ’ జట్టుకు దేవదత్ పడిక్కల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్ నిలకడైన ప్రదర్శనతో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన సాయి సుదర్శన్... ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లంక సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పడిక్కల్... ఆస్ట్రేలియా ‘ఎ’పై ఎలా ఆడతాడనేది కీలకం. ఇక వన్డే ఫార్మాట్లో భారత ‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... పడిక్కల్ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.సుదీర్ఘ ఫార్మాట్‌కు భారత ‘ఎ’ జట్టు: దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుషాగ్ర, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, తుశార్ దేశ్‌పాండే, అన్షుల్ కంబోజ్, ప్రఫుల్ హింగే, ఎన్ జగదీశన్, నచికేత్ భుటే, వైశాక్. వన్డే ఫార్మాట్‌కు భారత ‘ఎ’ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్, కుమార్ కుషాగ్ర, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, ప్రభ్‌సిమ్రన్‌సింగ్, గుర్జపనీత్ సింగ్, యశ్ ఠాకూర్. -
ఆఫ్గన్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్‌లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వారు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.సుందర్ ఒక్కడే.. హర్షిత్ డౌట్!ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లకు సంబంధించి ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ క్లియరెన్స్ తీసుకొని టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హర్షిత్ రానా ఫిట్‌గా ఉన్నట్లు సమాచారమున్నప్పటికీ అతడికి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు బుమ్రా, నితీశ్‌రెడ్డిలు మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది."సుందర్ ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ పొందాడు. సెప్టెంబర్ 4న నిర్వహించిన సిములేషన్ ఎక్సర్సైజ్లో సుందర్ క్లియరెన్స్ పొందాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బుమ్రా, నితీశ్‌రెడ్డి, హర్షిత్ రానాలు మ్యాచ్ సిములేషన్కు పంపించాము. అయితే సిములేషన్‌లో ఈ ముగ్గురికి సంబంధించిన రిజల్ట్‌లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకే ఇవాళ మరోసారి ఈ ముగ్గురిని సిములేషన్ ఎక్సర్సైజ్కు పంపాలని నిర్ణయించాం. ఆ తర్వాత ఈ ముగ్గురి ఫిట్నెస్ క్లియరెన్స్‌కు సంబంధించిన రిపోర్ట్ వివరాలను వెల్లడిస్తాం" అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధుల బృందం తెలిపింది.బుమ్రా దూరం.. నితీశ్ కూడా!ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు బుమ్రా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రానా మాత్రం ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించడంతో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి మాత్రం ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడడని, అతడిని నేరుగా ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు పంపించనున్నట్లు సీవోఈ మరో ప్రకటనలో తెలిపింది.ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే హర్షిత్ రానా కూడా కండరాల గాయంతో రీహాబిలిటేషన్ సెంటర్‌కు వచ్చేశాడు. నితీశ్‌రెడ్డి కూడా కండరాల గాయంతోనే ఇంగ్లండ్‌తో పాటు లంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారు.🚨 UPDATE ON BUMRAH, NITISH & HARSHIT 🚨- Harshit Rana is fully fit and should be play in T20I series against Afghanistan.- Jasprit Bumrah is unlikely for T20i series against Afghanistan.- Nitish Kumar Reddy is doubtful for T20i series against Afghanistan & he is most… pic.twitter.com/pisBr2amZL— M A N U. (@Manu_1845) September 9, 2026చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా? -
ఏకంగా రూ. 130 కోట్లు!.. ఎవరు ఎంత చెల్లిస్తారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చే రెండేళ్ల పాటు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి మూడు సంస్థలను అసోసియేట్ స్పాన్సర్లుగా ఎంచుకుంది.క్యాంపా కోలా, ఎస్బీఐ లైఫ్‌తో పాటు చాట్ జీపీటీతో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో సిరీస్ మొదలు 2028 మార్చి కొనసాగే ఈ కాంట్రాక్ట్‌లో భారత్ 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.ఈ స్పాన్సర్షిప్ విలువ సుమారు రూ.130 కోట్లుగా ఉందని ప్రకటించిన బీసీసీఐ... గతంతో పోలిస్తే ఇది దాదాపు 44 శాతం ఎక్కువ అని ప్రకటించింది. విడివిడిగా బోర్డు వివరాలు వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు క్యాంపా కోలా రూ.1.31 కోట్లను చెల్లించనుండగా... ఎస్బీఐ లైఫ్, చాట్ జీపీటీ మ్యాచ్‌కు రూ.1.20 కోట్లు చొప్పున చెల్లిస్తాయి.ఇదీ చదవండిమెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ టీ20 లీగ్ టోర్నీ ‘బిగ్‌బాష్‘ను 15 సీజన్ల పాటు నిర్వహించింది. ఇప్పటి వరకు టోరీ్నకి సొంతదారుగా సీఏనే వ్యవహరించింది. జట్లతో పాటు టోర్నీల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపికవంటి అంశాలన్నీ స్వయంగా బోర్డు పర్యవేక్షణలోనే జరిగాయి. అయితే ఇప్పుడు లీగ్‌లో ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని సీఏ నిర్ణయించింది. లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడుల అనుమతికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ క్రమంలో ముందుగా మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో 100 శాతం వాటా అమ్మకానికి పచ్చ జెండా ఊపింది. ఆటగాళ్ల చెల్లింపులు, టీమ్ విలువ, క్రికెటర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోయినా సీఏ ముందుకు వెళ్లడం ఆసీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇవన్నీ తేలిన తర్వాతే బిగ్ బాష్‌కు సంబంధించిన ఎంఓయూలపై ఒప్పందం కుదరవచ్చని తెలుస్తోంది. -
ఏషియన్ గేమ్స్.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన!
ఆసియా క్రీడల్లో ఆటగాళ్లకు కల్పించే వసతి సౌకర్యాలు బాగా లేవని, భారత క్రికెటర్లు అలాంటి చోట ఉండటానికి ఇష్టపడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రీడల నిర్వాహక కమిటీ అవసరమైతే ప్లేయర్లు తమకు నచి్చన హోటళ్లలో ఉండవచ్చంటూ వెసులుబాటు కూడా కల్పించింది.అయితే ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు స్పష్టతనిచ్చింది. టీమిండియా ఆటగాళ్లు నిర్వాహకులు కలి్పంచిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. జపాన్‌లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. "విదేశీ పర్యటనల్లో మనకు లభించే ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇప్పుడు ఉండకపోవచ్చనేది వాస్తవం. అయితే నిర్వాహకులు ఎలాంటి వసతి కల్పించినా మన ఆటగాళ్లు అక్కడే ఉంటారు. అద్భుతంగా కాకపోయినా అవి సౌకర్యంగానే ఉంటాయని నమ్ముతున్నాం. నగోయాలో ఉండే వసతి, వారు ఎంచుకున్న చిన్న తరహా హోటల్ గదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూశాం. అవి బాగానే ఉన్నాయి. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు వాటినే వాడుకుంటారు. ఇక్కడ మేం ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నా ఎలాంటి పెద్ద హోటల్స్ లేవు. ఈవెంట్‌కు చాలా దూరంలో ఉండే ఒసాకా లేదా టోక్యోలలో బస చేయడానికి అవకాశం లేదు" అని శుక్లా పేర్కొన్నారు. అయితే వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు. చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
IND vs AUS: భారత జట్టులో మార్పులు.. ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో తలపడే అండర్-19 జట్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్పులు చేసింది. రోహిత్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో యూత్ వన్డే, యూత్ టెస్టులకు ఇద్దరు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.అవును.. అది నిజమేకాగా దేశీ క్రికెట్లో బెంగాల్‌కు ఆడుతున్న లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్. వయసుకు సంబంధించి అతడు పత్రాలు సమర్పించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘‘ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో రాజ్‌కోట్, అహ్మాదాబాద్ వేదికలుగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించి భారత అండర్-19 జట్టు నుంచి రోహిత్ వైదొలిగాడు. తన వయసుకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేకపోయినందున జట్టు నుంచి తప్పుకొన్నాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.ఇద్దరికి అవకాశంఇక రోహిత్ యాదవ్ నిష్క్రమణ నేపథ్యంలో జూనియర్ క్రికెట్ కమిటీ ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆసీస్‌తో యూత్ వన్డేలకు సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్ సావ్సానీ, యూత్ టెస్టులకు హర్యానా ప్లేయర్ తన్మయ్ బలోడాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరు 18- అక్టోబరు 8 మధ్య భారత్- ఆసీస్ మధ్య మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరుగుతాయి.ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డేలకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)లక్ష్యా రాయ్‌చందాని (కెప్టెన్), యశ్వర్దన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ భగేల్ (వికెట్ కీపర్),ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్రా ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి.యశ్వీర్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్, ఆర్యన్ సావ్సానీ.యూత్ టెస్టులకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)యశ్వర్దన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్యా రాయ్‌చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్రా ఓజా, మనాల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), ఇషాన్ ఓమ్, అయాన్ అక్రం, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్, తన్మయ్ బలోడా.చదవండి: టీమిండియాతో ఏకైక టీ20.. జట్టును ప్రకటించిన జపాన్ -
ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్
-
పాక్ సెలక్టర్ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్‌ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్‌ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు. ఆటగాళ్లు, కోచ్‌లు మార్పు విషయంలో పీసీబీ తొందరపాటు చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు.పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభంఅదే సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం క్రమపద్ధతిలో ముందుకు వెళ్తూ రోజురోజుకీ తమ జట్టును మరింతగా అభివృద్ధి చేసుకుంటోందని మిస్బా ప్రశంసించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది యాజమాన్యం.అంతేకాదు.. టెస్టు జట్టు హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను పదవుల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను వైట్‌బాల్ కోచ్ మైక్ హసన్ చేపట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపం చెందిన మిస్బా ఉల్ హక్ పాక్ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకొన్నాడు.వారి విషయంలో మాత్రం ఉదారంగా ఉంటారుఈ క్రమంలో స్థానిక టెలివిజన్ షోలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్లో విదేశీ కోచ్‌లు, దేశీ కోచ్‌లను వేర్వేరుగా చూస్తారు. విదేశీ కోచ్‌ల పట్ల యాజమాన్యం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంది. అదే దేశీ కోచ్‌ల విషయంలో మాత్రం ప్రతీ దానికి విమర్శలు వస్తాయి.విదేశీ కోచ్‌లకు అధికారాలు ఎక్కువే ఇస్తారు. కానీ జవాబుదారీతనంలో మాత్రం వారు వెనుకే ఉంటారు. అదే స్థానిక కోచ్‌లు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే ఇక తిట్ల వర్షమే. నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తారు కూడా!ఇక ఒకటీ రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లను తొలగించడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒత్తిడిలోనూ రాణించేలా వారికి ఊతం ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ మనవాళ్లకు తొందర, హడావుడి ఎక్కువ.టీమిండియాపై ప్రశంసలునిజానికి పాక్ యువ క్రికెటర్లు చాలా మంది ఎక్కువగా వైట్‌బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. రెడ్‌బాల్ క్రికెట్ ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఫోర్-డే మ్యాచ్‌లు మాత్రమే ఉంటే సరిపోదు. దేశీ క్రికెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి.90వ దశకం తర్వాత బీసీసీఐ క్రమక్రమంగా జట్టులో మార్పులు చేస్తూ వస్తోంది. లోపాలు సరిచేసుకుంటూ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది. అంతేతప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు’’ అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.చదవండి: శుబ్‌మన్ గిల్ మెరుపులు -
కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్!
కౌంటీ క్రికెట్లో తమిళనాడు క్రికెటర్ సాయి కిషోర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గ్లౌసెష్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి కిషోర్ 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడంతో గ్లౌసెష్టర్‌షైర్ 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీసిన సాయి కిషోర్ (తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) డెర్బీషైర్ పాలిట సింహస్వప్నమయ్యాడు. అతడి ధాటికి 319 పరుగుల ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో సాయి కిషోర్ 18 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడెన్ ఓవర్లు కావడం విశేషం.దేశవాళీలో ఇటీవలీ రంజీ ట్రోఫీలో నిలకడను ప్రదర్శించిన సాయి కిషోర్ కౌంటీ క్రికెట్లోనూ అదే జోరును చూపిస్తున్నాడు. తాజాగా తన ప్రదర్శనతో సాయి కిషోర్ బీసీసీఐ సెలెక్టర్లకు తన ఎంపిక గురించి హెచ్చరికలు పంపాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ఉండటం, ఇంగ్లండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం.. ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సీనియర్ల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. అతడి బౌలింగ్ శైలి కూడా గంభీర్ విధానాలకు తగినట్లుగా ఉండడం ఆసక్తికర విషయం. రాబోయే రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. మరి కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సాయి కిషోర్ టీమిండియాకు ఎంపికవుతాడా లేదా అనేది చూడాలి.SAI KISHORE: 18-12-20-5 🤯🔥- One of the best spells in this County Championship, he is bowling his heart out. pic.twitter.com/qpY6gqe1IJ— Johns. (@CricCrazyJohns) September 6, 2026చదవండి: ‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’ -
రోహిత్ కొత్త అవతారం.. ‘రిటైర్మెంట్ తర్వాత చేసే పని ఇదేనా’
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించనున్న షో పేరు "ఫ్యామిలీ ఫుల్హౌస్ విత్ రోహిత్ శర్మ". ఈ షోలో మల్టీ జనరేషన్ టీమ్స్ పాల్గొననున్నాయి. ఇప్పటిదాకా మైదానంలో బ్యాట్ పట్టి అభిమానులను అలరించిన హిట్‌మ్యాన్ ఇకపై గ్రీన్ మ్యాట్‌పై షోకు విచ్చేసే కుటుంబాలు చెప్పే కథలను కెమెరా, లైటింగ్ మధ్య విననున్నాడు. స్వతహాగా మంచి మాటకారి అయిన రోహిత్‌ను షోకు హోస్ట్‌గా ఎంపిక చేయడంతోనే సోనీ ఎంటర్టైన్మెంట్ సగం విజయం సాధించేసింది. ఇక రోహిత్ తన కామెడీ టైమింగ్‌తో షోను ఎంత మేర నడిపిస్తాడనేది చూడాలి. ఇప్పటికే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో కట్స్, అందులో రోహిత్ చేస్తున్న అల్లరి అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చేయబోయే పని కూడా ఇదేనని అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ రోహిత్ శర్మకు చివరి టోర్నీ అయ్యే అవకాశం లేకపోలేదు. కాగా రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టులో ఉంటాడని, అతడి గురించి అనవసర ఊహాగానాలు చేయడం ఆపేయాలని హితవు పలికాడు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరఫున తన చివరి వన్డే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీతో మెరిశాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 175 పరుగులు చేశాడు.Garden Se Reporting Live, Jersey No. 45 😉Family Full House With Rohit Sharma!Shuru ho raha hai 19th September se, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.#RohitSharma#FamilyFullHouse#ComingSoon #SonyTV@ImRo45 pic.twitter.com/DGWRp6Epzv— sonytv (@SonyTV) September 5, 2026చదవండి: భారత్‌తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్ -
వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా
-
ఏషియన్ గేమ్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం!?
జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్-2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ప్రారంభం కానుండగా.. మెన్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి షెడ్యూల్ అయ్యాయి. అయితే మ్యాచ్‌లు జరగనున్న ఐచి-నగోయాలోని వసతులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధానంగా క్రికెట్ జట్లకు సరైన 5-స్టార్ హోటల్ వసతి లేకపోవడం, తాత్కాలిక టెంట్లను డ్రెస్సింగ్ రూమ్‌లుగా కేటాయించడంపై వివాదం రేగింది. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ ఈ ఏర్పాట్లపై బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా తమ నిరసనను వ్యక్తం చేశాయి. క్రికెటర్లకు ప్రత్యేక ప్రత్యేక వసతి కల్పించాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాను డిమాండ్ చేశాయి. కానీ ఓసీఎ మాత్రం క్రికెటర్లకు ప్రత్యేక వసతి కల్పించబడదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోయేషిన్ కూడా (ఐఓఏ) ధ్రువీకరించింది.ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ తమ పురుష, మహిళల జట్ల వసతి, ఫుడ్, రవాణా ఏర్పాట్లను స్వయంగా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు భారత పురుషుల క్రికెట్ జట్టుకు త్రీ-స్టార్ హోటల్, ఉమెన్స్ టీమ్‌కు ఫోర్-స్టార్ హోటల్‌ను కేటాయించారు.అయితే ఒకే గదిని ఇద్దరు ప్లేయర్ షేర్ చేసుకోవాల్సి ఉండడతో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా భారత క్రికెటర్లకు అంతర్జాతీయ టోర్నీల్లో విడిగా సింగిల్-ఆక్యుపెన్సీ 5-స్టార్ రూమ్‌లు ఇస్తుంటారు. అదేవిధంగా ఆటగాళ్ల భారీ కిట్‌బ్యాగ్‌లు, ఇతర క్రీడా పరికరాలు ఉంచుకోవడానికి ఈ చిన్న గదులు సరిపోవని బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే సౌకర్యాలను పరిశీలించడానికి జపాన్‌కు ఓ బృందాన్ని బీసీసీఐ పంపనుంది. వారి రిపోర్ట్ మేరకు తమ ఆటగాళ్ల వసతుల విషయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
టీమిండియా నుంచి తీసేశారు.. ఆ కసి అక్కడ చూపించేస్తున్నాడు!
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం మెహాలీ వేదికగా లూధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 168 పరుగుల లక్ష్య చేధనలో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆర్యన్ యాదవ్(32) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా జలంధర్ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో ఊదిపడేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లుథియానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లుథియానా ఇన్నింగ్స్‌లో మాధవ్ సింగ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జలంధర్ బౌలర్లలో ఆర్యన్ యాదవ్ మూడు, రణ్‌దీప్ సింగ్, గుర్వీందర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కొనసాగుతున్న ప్రభ్సిమ్రాన్ నిరీక్షణ?కాగా 26 ఏళ్ల ప్రభ్సిమ్రాన్ సింగ్ గత కొన్నాళ్లగా వైట్‌బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే వంటి దేశవాళీ టోర్నీలతో ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లో కూడా అతడు దుమ్ములేపుతున్నాడు. ఇండియా-ఎ జట్టు తరపున కూడా తన మార్క్ చూపించాడు. కానీ సీనియర్ జట్టు తరపున మాత్రం అరంగేట్రం చేసే అవకాశం అతడికి లభించడం లేదు. జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ గైర్హజరీ కారణంగా ప్రబ్సిమ్రాన్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మొత్తం మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు సంజూ తిరిగి రావడంతో ప్రభ్సిమ్రాన్ను పక్కన పెట్టేశారు.అయినప్పటికి అతడు ఏ మాత్రం నిరాశ చెందకుండా తన అద్భుత ప్రదర్శనలతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటివరకు ఈ పంజాబ్ టీ20 లీగ్‌లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్సిమ్రాన్ 401 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
అఫ్గాన్ సిరీస్‌కు బుమ్రా డౌటే.. రేసులోకి యార్కర్ల స్పెషలిస్ట్!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడా? అంటే 'అవును' అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్లలో బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతడికి ఇంకా బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని 'బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకునే క్రమంలో ఉన్నాడు. అయితే బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకుండా మైదానంలోకి దించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సెప్టెంబర్ 10 నుంచి ఢిల్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.అంతకంటే ముందే బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు జట్టుతో కలిసే అవకాశముంది. అయితే బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో అతడికి ప్రత్యామ్నాయంగా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే టీమిండియా తరఫున ఆరు టీ20లు ఆడిన ప్రిన్స్.. 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా, హర్షిత్ రాణా వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వడంతో ప్రిన్స్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో ప్రిన్స్ మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.ప్రిన్స్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా పిన్ పాయింట్ యార్కర్లు వేయడంలో అతడు దిట్ట. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు:శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
సన్‌రైజర్స్ సిక్సర్ల కింగ్‌కు హ్యాపీ బర్త్‌డే..ఫోటోలు
-
62 మంది క్రికెటర్లపై నిషేధం యోచనలో బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికైన కొన్ని వారాలకే, తన వయసును తప్పుగా చెప్పాడనే ఆరోపణలపై బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది. రోహిత్ యాదవ్ ఒక్కడే కాదు దాదాపు 62 మంది యువ క్రికెటర్లు వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలింది. ఈ 62 మంది క్రికెటర్ల వయసులో వ్యత్యాసాలున్నట్లు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. పత్రాలు, వయస్సు సంబంధిత వ్యత్యాసాల కారణంగా, 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్‌కైనా నమోదు లేదా బదిలీ చేసిన 62 మంది క్రికెటర్లను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అనర్హులుగా ప్రకటించింది. వీరిలోనే ప్రస్తుతం రెండేళ్ల నిషేధం పడిన రోహిత్ యాదవ్ కూడా ఉన్నాడు.దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆ 62 మంది క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో పాటు తాను కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక జాబితాలో రోహిత్ యాదవ్‌తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. అయితే బెంగాల్ అసోసియేషన్ రికార్డుల్లో రవి వయసు అసలుతో పోలిస్తే 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది.రవితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా వయసుకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు క్యాబ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు క్యాబ్ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తప్పుడు వయసు పత్రాలను చూపించిన 62 మంది యువ ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది.ఇక ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు తీసి, చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్‌కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు. అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్‌గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం -
ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ
-
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరేంగట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగా ముగియకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనుంది. వైభవ్‌ను చూస్తుంటే భవిష్యత్తు సచిన్‌లా కనిపిస్తున్న తరుణంలోనే అతడి కెరీర్ ఒక్క సిరీస్, ఏడాది లేదా రెండేళ్లకే పరిమితం కాకూడదని, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగాలని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్‌తో పాటు ప్రతిభ చూపుతున్న యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ముంబైలో గురువారం నిర్వహించిన బీసీసీఐ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సచిన్ టెండూల్కర్‌లా వైభవ్ సూర్యవంశీ దేశానికి సుదీర్ఘకాలం సేవలందించే ఆటగాడిగా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోందని చెప్పారు. అతడి కెరీర్‌ను ప్రతి దశలోనూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇటీవలే వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. భారత్ ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు బాదాడు. 72 సిక్సర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం! -
అంతా బాగుంది!
ముంబై: భారత క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శనకు సంబంధించి బీసీసీఐ గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశం ఎలాంటి హడావిడి, కొత్త నిర్ణయాలేమీ లేకుండానే ముగిసింది. అజెండాలో చర్చించే పలు అంశాల గురించి ఈ సమావేశానికి ముందు బయట చర్చ జరిగినా... చివరకు సాధారణ సమీక్షగానే ఇది ముగిసింది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో వన్డే, టి20 జట్ల కెప్టెన్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీఓఈ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ దీనికి హాజరు కాలేదు. టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు, సీఓఈ మధ్య మంచి సమన్వయం ఉందని, సమాచారం విషయంలో ఎలాంటి సమస్యా లేదని దేవజిత్ సైకియా వెల్లడించారు. అయితే ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం కారణంగానే మన ఆటగాళ్లు తరచుగా గాయపడుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ షెడ్యూల్ రూపొందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ‘బీసీసీఐలో అంతా కలిసి బాగా పని చేస్తున్నారు. అందరి ఆలోచననలు ఒకే తరహాలో ఉన్నాయి. కోచ్‌లు, సహాయక సిబ్బంది, మహిళల జట్టు కమిటీలు, సీఓఈ... ఇలా అన్నింటి మధ్య సమన్వయం బాగుంది. కాబట్టి అంతా సరైన దిశలోనే నడుస్తోంది. అయితే ఏడాదిలో చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఉండటమే ప్రస్తుతం కొంత ఇబ్బందిగా మారింది. దీనిపై తగిన విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని షెడ్యూల్ తయారు చేసే ఎఫ్టీపీ బృందానికి చెప్పాం. మ్యాచ్‌ల మధ్య తగినంత విరామం ఉండేలా చూడమని వారికి సూచించాం. పైగా ప్రతీ విదేశీ సిరీస్‌కు ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడే విధంగా కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఉండేలా చూడామని కూడా వివరించాం’ అని సైకియా చెప్పారు. ఇటీవలి ఐర్లాండ్, ఇంగ్లండ్, శ్రీలంక పర్యటనల్లో భారత జట్టు ప్రదర్శన గురించి చర్చించామని, 2027 వరల్డ్ కప్ సహా వచ్చే ఏడాది మ్యాచ్‌లపై తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. రోహిత్ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలుభారత జట్టు రోహిత్ శర్మ స్థానం, అతని భవిష్యత్తు గురించి కూడా సమావేశంలో చర్చి జరిగిందంటూ వచ్చిన వార్తలను సైకియా కొట్టిపారేశారు. ‘రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌లలో చాలా బాగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో 138 పరుగులు చేశాడు. అతడి నుంచి ఇంకా ఏం ఆశిస్తున్నారు. అసలు ఈ సమయంలో అలాంటి ఊహాగానాలు ఎందుకు. వాటికి నేను మరింత ఊతం ఇవ్వను’ అని సైకియా స్పష్టం చేశారు.సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4న ముగియనుండగా... అతని కాంట్రాక్ట్ కొనసాగింపు విషయంపై అసలు చర్చించనే లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారత క్రికెట్‌కు డైరెక్టర్ హోదాలో వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయవచ్చంటూ వినిపిస్తున్న మాటలు కూడా ఉత్త పుకార్లేనని సైకియా చెప్పారు. దీనిపై కూడా చర్చించలేదని, డైరెక్టర్ పదవి గురించే బోర్డు ఆలోచన లేదని ఆయన పునరుద్ఘాటించారు. సీఓఈలో కొత్తగా హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్‌ను త్వరలోనే నియమిస్తామన్న కార్యదర్శి...ప్రస్తుతం ఆ పదవిలో ఎవరూ లేకపోయినా సీఓఈ సమర్థంగానే పని చేస్తోందని స్పష్టం చేశారు. గంభీర్‌దే తుది నిర్ణయం... ఆదివారం నుంచి చెన్నైలో జరిగే దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ తరఫున కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఇప్పటికే వారికి బోర్డు సూచించింది. అయితే 13 నుంచి అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ ఆడటంపై సందేహాలు ఉన్నాయి. వీరు ఆడాలా లేదా అనే అంశంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తుది నిర్ణయం తీసుకుంటారని సైకియా చెప్పారు. దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా చూస్తారని ఆయన వెల్లడించారు. జపాన్‌కు నెట్ బౌలర్లు... జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు ప్రాక్టీస్‌లో సహకరించేందుకు ముగ్గురు పేస్ బౌలర్లను బోర్డు ఎంపిక చేసింది. మయాంక్ యాదవ్, కార్తీక్ త్యాగి, మొహసిన్ ఖాన్లు టీమ్‌తో వెళ్లనున్నారు. వీరి వీసాల కోసం ప్రయత్నిస్తున్న బోర్డు... కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ సొంత ఖర్చులతో ఈ ముగ్గురిని పంపనుంది. -
BCCI: భారత క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం!
భారత అండర్-19 క్రికెటర్, బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది. వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో రెండేళ్ల పాటు అతడిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం.. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ ఆదేశాలను అమలు చేయాలని బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం. కాగా రోహిత్ యాదవ్ ఇటీవలి కాలంలో భారత్ అండర్-19 జట్టు తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు.శ్రీలంక పర్యటనలోశ్రీలంక పర్యటనలో భాగంగా యూత్ టెస్టుల్లో రోహిత్ యాదవ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో సెప్టెంబరులో జరిగే సిరీస్‌కు కూడా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఆసీస్‌తో యూత్ వన్డే, యూత్ టెస్టులు ఆడే జట్టులో అతడికి చోటు దక్కింది.వేర్వేరుగా వివరాలుఅయితే, అనూహ్య రీతిలో రోహిత్ యాదవ్‌పై రెండేళ్ల పాటు నిషేధం పడటం గమనార్హం. కాగా గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్‌కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు.అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్‌గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో రోహిత్ యాదవ్ తీరుపై అనుమానం రాగా బెంగాల్ అసోసియేషన్ సమీక్షలో భాగంగా.. అతడు మోసానికి పాల్పడినట్లు తేలినట్లు సమాచారం. కాగా రోహిత్ యాదవ్ స్థానంలో కనిష్క్ చౌహాన్ లేదంటే మహ్మద్ ఎనాన్ ఆసీస్‌తో సిరీస్ ఆడే జట్టులో చేరే అవకాశం ఉంది.చదవండి: సిరాజ్‌తో పాటు ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు! -
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్షా సమావేశం గురువారం ముంబైలో జరిగింది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం మీటింగ్‌కు రాలేదు. కాగా యూకే పర్యటనలో టీమిండియా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లలో ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ 1-2తో ఓటమిపాలైంది.రోహిత్ విషయంలో మరోసారి వదంతులుఈ నేపథ్యంలో జూలైలోనే సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. శ్రీలంక పర్యటన కారణంగా వాయిదా పడింది. అయితే, గురువారం జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌లోనే టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ భవితవ్యంపై కూడా చర్చ జరుగనుందనే వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఊహాగానాలు వినిపించాయి. రిటై ర్మెంట్ తీసుకునేలా అతడిపై ఒత్తిడి పెరిగిందనే రూమర్లు వినిపించాయి.ఆజ్యం పోయాలనుకోవడం లేదుఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. వదంతులకు నేను ఆజ్యం పోయాలనుకోవడం లేదు. అతడు అన్ని మ్యాచ్‌లలోనూ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు.ఇంతకంటే ఇంకేం కావాలి? చివరగా లార్డ్స్‌లో ఆడిన వన్డేలో అతడు 130-140 పరుగులు సాధించాడు. అయినా ఇంకా ఎందుకీ ప్రచారం? వదంతులు వ్యాప్తి చేసే వారికి నేను ఊతం ఇవ్వాలని అనుకోవడం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు. అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రోహిత్‌ను కచ్చితంగా ఆడిస్తామని మాత్రం సైకియా చెప్పలేకపోయారు. దీంతో యాజమాన్యం తీరుపై అభిమానులలో మరోసారి సందేహాలు రేకెత్తాయి. ఇదిలా ఉంటే.. అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కూడా సైకియా స్పందించారు. మీటింగ్ గురించి ముందుగా సమాచారం ఇవ్వలేకపోయామని.. అందుకే అగార్కర్ రాలేదని పేర్కొన్నారు. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్
-
బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఆ టీమ్‌తో ఏకంగా 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్!
సౌతాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి.. బీసీసీఐ ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లను అక్కడి పరిస్థితులను అలవాటు చేసేందుకు, ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాతో 4 నుంచి 6 వన్డేల సిరీస్ ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే బీసీసీఐ పెద్దలు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా భారత జట్టు చివరిసారిగా 2024లో టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. ప్రస్తుత ఎఫ్టీపీ (FTP) షెడ్యూల్లో భారత్-సౌతాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ ఏదీ లేదు. అయితే భారత టీమ్ మేనేజ్మెంట్ అభ్యర్థన మేరకు ఈ ప్రత్యేక సిరీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు."నూతన ఎఫ్టీపీ ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి ప్రపంచకప్‌నకు ముందు ఈ వన్డే సిరీస్ నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు" అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా సవాలుతో కూడుకున్న దక్షిణాఫ్రికా కండిషన్స్‌లో ముందస్తుగా సిరీస్ ఆడటం వరల్డ్ కప్ నాటికి భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.ఇక గత ప్రపంచకప్‌లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా టైటిల్ గెలిచి తమ 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిగా 2003లో పూర్తిస్థాయిలో వన్డే వరల్డ్ కప్‌కు సఫారీలు ఆతిథ్యమిచ్చారు.చదవండి: CPL 2026: పెద్దోడి మెరుపులు.. వణికిపోయిన సీఎస్కే బౌలర్ -
నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్
-
‘ఫిట్నెస్’పై స్పష్టత కావాలి!
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించేందుకు నేడు బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి హాజరు కానున్నారు. ప్రధానంగా మూడు అంశాలు ఇక్కడ చర్చకు రానున్నాయి. గాయాలతో బాధపడుతూ సీఓఈలో రీహాబిలిటేషన్‌లో ఉన్న ఆటగాళ్ల అందుబాటులో విషయంలో సీఓఈ నుంచి అగార్కర్, గంభీర్ మరింత స్పష్టత కోరుతున్నారు. ఆయా ఆటగాళ్లంతా ఎప్పటి వరకు పూర్తిగా ఫిట్‌గా మారతారో ఒక తేదీని ప్రకటించాలని, అప్పుడే జట్టును ఎంపిక చేసే విషయంలో నిర్ణయం తీసుకోగలమని వీరు చెబుతున్నారు. నిజానికి గాయాల తీవ్రత, వేర్వేరు వ్యక్తుల ఫిట్నెస్ స్థాయిని బట్టి చూస్తే ఇలా క చ్చితంగా తేదీని చెప్పడం కష్టమే అయినా... ఇటీవలి పరిణామాలు భారత టీమ్ మేనేజ్మెంట్కు అసహనం కలిగించాయి. శ్రీలంకతో రెండో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని చెప్పగా అది సాధ్యం కాలేదు. హార్దిక్ పాండ్యా ఎప్పుడు రెడీ అవుతాడో చెప్పలేని పరిస్థితి ఉంది. నెలల తరబడి ఇక్కడ ఉంటున్నా ఆకాశ్‌దీప్ కోలుకోలేదు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా పూర్తిగా ఫిట్‌గా లేకుండానే సందేహాల మధ్య నలుగురు ఆటగాళ్లను ప్రకటించారు. కాబట్టి సమావేశంలో లక్ష్మణ్ దీనిపై వివరణ ఇవ్వాల్సి రావచ్చు. రోహిత్ శర్మ భవిష్యత్తు విషయంలో కూడా చర్చ జరగవచ్చు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్ ముగియగానే అతను రిటైర్ అవుతాడని అంతా భావించినా... చివరి వన్డేలో అద్భుత సెంచరీ చేయడంతో ఆ చర్చకు తెర పడింది. అయితే సరే వచ్చే వరల్డ్ కప్ వరకు రోహిత్‌ను కొనసాగించే అంశంపై ఇంకా గ్యారంటీ లేదు. మరోవైపు అక్టోబర్ 4తో సెలక్టర్‌గా అగార్కర్ కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతని పదవీకాలాన్ని పొడిగిస్తారా అనే విషయంలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
IND vs AFG: అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు లేనట్లే!
టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమకు నచ్చిన క్రికెటర్లను ఆడించేందుకు అర్హులైన వారికి బలి చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ ఢిల్లీ వేదికగా టీమిండియాకు ఈ సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తుండగా.. ఇందుకోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.అదే జట్టుసెప్టెంబరులో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పూ లేకుండానే ఈ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ఎంచుకున్నారు. కాగా మోకాలి గాయంతో చాలా కాలంగా ఆటకు దూరమైన టీమిండియా ప్రధాన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సమయంలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో కూడా ఆడలేదు.ఆ నలుగురు...ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయాల నుంచి కోలుకుంటున్న మరో ముగ్గురు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు కూడా అఫ్గాన్‌తో ఆడే జట్టులో చోటు దక్కింది. అయితే ఈ నలుగురి ఎంపిక కూడా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని, పూర్తిగా ఫిట్‌గా మారితేనే సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు ఫిట్‌గా లేరు‘‘ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల (బుమ్రా, హర్షిత్, అర్ష్‌దీప్)ను ఎంపిక చేశారు. కానీ అందులో ఇద్దరు (బుమ్రా, హర్షిత్) ఫిట్నెస్ సాధిస్తేనే ఆడతారట. వాళ్లు ఒక మ్యాచ్ ఆడి మళ్లీ గాయపడితే పరిస్థితి ఏంటి? హర్షిత్ ఇంగ్లండ్ పర్యటనలో అలాగే గాయపడ్డాడు కదా!..గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడిని మరోసారి ఎంపిక చేశారా?.. హర్షిత్‌కు బదులు ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీని పిలిపించవచ్చు కదా!.. లేదంటే భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాల్సింది.ఇక వాషింగ్టన్ సుందర్.. అతడు ఎప్పుడూ గొప్పగా ఆడిందేమీ లేదు. పూర్తి ఫిట్నెస్ సాధించలేదు అంటున్నారు. అలాంటపుడు జట్టులో ఎందుకు? వాషీకి బదులు కృనాల్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేస్తే మెరుగ్గా ఉండేది. కానీ గంభీర్‌కు అది ఇష్టం లేదేమో!..పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో పరాభవం తర్వాత కూడా ఇంకా తమకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తామంటే.. టీమిండియా మున్ముందు మరిన్ని పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్హులైన ఆటగాళ్లను ఎంపిక చేయండి. జట్టుకు అదే మంచిది’’ అని సోషల్ మీడియా వేదికగా టీమిండియా యాజమాన్యానికి నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మరోవైపు.. ఫిట్‌గా మారిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. వాళ్లను పక్కన పెట్టేశారుజింబాబ్వేతో సిరీస్‌లో ఆడని సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ జట్టులోకి రాగా...ఈ పర్యటనలో టీమిండియాలో భాగంగా ఉన్న రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్లను పక్కన పెట్టారు. ఈ నెల 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20లు జరుగుతాయి. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్ చేస్తే సీన్ రివర్స్!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం భారత వెటరన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేయగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో భారత జట్టును ప్రకటించిన అనంతరం కృనాల్ సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్ స్టోరీని షేర్ చేశాడు. భారత జెండా ఎమోజీలను జత చేస్తూ.. "ఆశ ఇంకా సజీవంగానే ఉంది" అని అతడు పోస్ట్ చేశాడు. కృనాల్ పాండ్యా చివరిసారిగా భారత్ తరపున 2021లో ఆడాడు. అతడు ఇప్పటివరకు ఐదు వన్డేలు, 19 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 58 కాగా.. టీ20ల్లో 26 పరుగులగా ఉంది. మొత్తంగా అతడు రెండు ఫార్మాట్లలో కలిపి 17 వికెట్లు పడగొట్టాడు. అయితే ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో, ఐదేళ్ల తర్వాత కృనాల్‌ను తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ సెలక్టర్లు మాత్రం అతడివైపు మొగ్గు చూపలేదు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించికపోతే అతడి స్ధానంలో కృనాల్ పేరును పరిశీలించే అవకాశముంది.భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా*చదవండి: ప్రిటోరియస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం -
రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం మరో అరుదైన కట్టడానికి వేదిక అవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భాగస్వామ్యంతో భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో భారీ క్రికెట్ స్టేడియం కొలువుదీరనుంది. సుమారు 1,00,000 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఇది కార్యరూపంలోకి వస్తే దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించనుంది. గుజరాత్ అహ్మ దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం 1,32,000 సీట్ల సామర్థ్యంతో ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. దీని నిర్మాణ వ్య యం, నిర్వహణ ఖర్చులు బీసీసీఐ భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించనుంది. ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదన, శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం.. స్టేడియానికి ప్రేక్షకుల రాకపోకలకు అనుకూలించనున్నాయి. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్‌జీరో సిటీ కాన్సెప్ట్ లో భాగంగా ఈ క్రీడా ప్రాంగణం కీలకం కానుంది. ప్రస్తుతం ఉప్పల్‌లో క్రికెట్ స్టేడియమున్నా.. రానున్న కాలానికి తగ్గట్టు అధునాతన క్రికెట్ స్టేడియం అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్టేడియాన్ని క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా ఇతర క్రీడలకు తగ్గట్టుగా సైతం మలుచుకునేలా డిజైన్ చేయనున్నారు. అవసరాన్ని బట్టి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, భారీ కాన్సర్ట్‌లను నిర్వహించేలా నిర్మించనున్నారు. భారీస్థాయిలో ఈవెంట్స్ నిర్వహ ణకు ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్ఐసీసీకి మించిన సముదాయం అందుబాటులో లేదు. దీంతో ఈ స్టేడియంలో అటువంటి సౌకర్యాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయనున్నారు. -
బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్‌కు ‘కాశ్మీర్ ఎక్స్‌ప్రెస్’ ఆకిబ్ నబీ!
జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న కాంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే క్రికెట్ క్లబ్‌కు నబీ ప్రాతినిధ్యం వహించనున్నాడు. బీసీసీఐ ప్రత్యేక చొరవతో సర్రే కౌంటీ క్లబ్ ఆకిబ్‌తో ఈ స్వల్పకాలిక ఒప్పందం కుదుర్చుకుంది.సర్రే తరఫున ఆకిబ్ నబీ మొత్తం మూడు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. సెప్టెంబర్ 2 నుంచి యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ఆయన కౌంటీల్లో అడుగుపెట్టనున్నాడు. ఇటీవల శ్రీలంక సిరీస్‌కు ఆకిబ్ ఎంపికైనప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.బీసీసీఐ మాస్టర్ ప్లాన్కాగా భారత జట్టు రాబోయే న్యూజిలాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆకిబ్‌ను కౌంటీలకు పంపాలని నిర్ణయించింది. న్యూజిలాండ్ పిచ్‌లు బౌన్స్, పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అక్కడి కండీషన్స్ తగ్గట్టు సిద్దం చేసేందుకు నబీని ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై డ్యూక్ బాల్‌తో సాధన నబీకి ఎంతగానో ఉపయోగపడనుంది.అకిబ్ నబీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత కొంత కాలంగా రెడ్ బాల్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో 12.57 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ తొలి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. అయినప్పటికి అతడికి ఇంకా టీమిండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించలేదు.చదవండి: అతడి బౌలింగ్‌లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్ -
భారత క్రికెటర్లకు ఫిట్నెస్ పరీక్షలు
బెంగళూరు: శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన రెండు రోజులకే భారత క్రికెటర్లంతా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) బాట పట్టారు. సెప్టెంబర్ రెండో వారంతో మొదలు పెట్టి ఐపీఎల్ వరకు రాబోయే ఎనిమిది నెలల పాటు టీమిండియా ప్లేయర్లంతా బిజీగా ఉండనున్నారు. దాంతో సుదీర్ఘ సీజన్‌కు ముందు ఆటగాళ్ల ఫిట్నెస్ స్థాయిని పరీక్షించడంపై బోర్డు దృష్టి పెట్టింది. దాంతో బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లంతా సీఓఈలో వేర్వేరు పరీక్షలకు హాజరయ్యారు. టి20 టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కీపర్ రిషభ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలతో పాటు సంజు సామ్సన్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ కూడా ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఫిట్నెస్ మార్కర్ల మధ్య నుంచి పరుగెడుతూ ఐదున్నర నిమిషాల వ్యవధిలో కనీసం 1200 మీటర్లు పూర్తి చేయాల్సిన ‘బ్రాంకో టెస్టు’, 10 నిమిషాల్లో పూర్తి చేస్తే 2 కిలోమీటర్ల పరుగు, మొత్తంగా కనీసం 16.5 పాయింట్లు స్కోర్ చేయాల్సిన యో యో టెస్టుల ద్వారా క్రికెటర్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. గాయాలనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా ఈ ఫిట్నెస్ పరీక్షల్లో పాల్గొనలేదు. వీరంతా ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉండగా... ప్రిన్స్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. -
ఆసియా క్రీడల నుంచి టీమిండియా బాయ్ కాట్?
-
టీ20 కెప్టెన్‌గా తొలగింపు.. ఎట్టకేలకు స్పందించిన సూర్య
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మొట్టమొదటగా 2007లో ప్రవేశపెట్టిన ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోని టీమిండియాను విజేతగా నిలపగా.. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ మరోసారి పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.సూర్యపై వేటుఇక ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూర్య టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. అయితే, అనూహ్య రీతిలో సూర్యపై వేటు పడింది. ప్రపంచకప్ తర్వాత భారత్ ఆడిన తొలి సిరీస్ నుంచే యాజమాన్యం అతడిని తప్పించింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు.. జట్టులోనూ స్థానం లేకుండా చేసింది.ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. తాను కనీసం ఇంకో రెండేళ్ల వరకు టీమిండియాను ముందుకు నడిపిస్తాననే ధీమాతో ఉన్నట్లు తెలిపాడు. కానీ అంతలోనే మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి నిర్ణయం వెలువడిందని పేర్కొన్నాడు. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మరో రెండేళ్ల పాటు..‘‘ఆరోజు జట్టులో నా పేరు లేదు. అది చూడగానే నా పెదవులపైకి నవ్వు వచ్చింది. నేను దేశం కోసం ఆడుతున్న సమయంలో ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి ఉందనిపించినా.. పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయని అనిపిస్తున్నా.. అప్పుడూ ఇలాగే నవ్వు వస్తుంది. ముందుగా నేను రిలాక్స్ అవుతాను.గతంలో నాకు వచ్చిన అవకాశాలు.. వాటిని సద్వినియోగం చేసుకున్న తీరును గుర్తు చేసుకుంటాను. తద్వారా ఒత్తిడిని జయించే ప్రయత్నం చేస్తాను. నాకు దక్కినవాటికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అలాగే.. కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు కూడా నేను ఇలాగే ఆలోచించాను.2026 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. మరో రెండేళ్ల పాటు జట్టుకు నాయకుడిగా ఉంటానని అనిపించింది. ఒలింపిక్స్-2028లో నేను జట్టును ముందుకు నడిపిస్తాను.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2028లోనూ ఆడతానని అనిపించింది. అయితే, అందరి ఆలోచనలూ ఒకేలా ఉండవు కదా!ఇది పూర్తిగా వాళ్ల నిర్ణయమేవాళ్లు (సెలక్టర్లు) తమ ఆలోచనలను గౌరవించడంతో పాటు.. వాటిని అమలు చేయడం అత్యంత ముఖ్యం. నన్ను కాదని వాళ్లు ముందుకు వెళ్లాలని అనుకున్నపుడు తమకు నచ్చిన నిర్ణయం తీసుకుంటారు. కానీ నేను అందుకు పెద్దగా స్పందించలేదు.ఎందుకంటే ఇది వాళ్ల నిర్ణయం వాళ్లు ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. వేరే ఆటగాడి సారథ్యంలో జట్టును నడిపించాలని వాళ్లు అనుకున్నారు. అతడి కెప్టెన్సీలో జట్టు మంచి విజయాలు సాధిస్తే ఎలాంటి సమస్యా రాదు. వాళ్లు శ్రేయస్‌ను ఎంచుకున్నారు.నిరాశకు లోనయ్యాఅతడితో కలిసి నేను దేశీ క్రికెట్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. అతడొక మంచి క్రికెటర్. మంచి మనిషి. మంచి కెప్టెన్ కూడా!.. కాబట్టి.. ‘ఇతడిని ఎందుకు కెప్టెన్‌ను చేశారు’ అనే ప్రశ్న నా మదిలోకి రాలేదు. అయితే, నన్ను కెప్టెన్‌గా తొలగించడం పట్ల నిజంగానే నిరాశ చెందాను.రెండేళ్లుగా నేను ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రపంచకప్, ఆసియా కప్ గెలిచాను. ఇదే తరహాలో ముందుకు వెళ్లాలని భావించాను. కానీ అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేశారు? కెప్టెన్‌ను మార్చడానికి గల కారణం ఏమిటి? అనే ప్రశ్నలు నా మెదడును తొలచివేశాయి. ఈ ఆలోచనలతో దాదాపు నెలన్నరపాటు ఇంట్లోనే ఉండిపోయాను’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. అదే విధంగా సారథ్య మార్పు గురించి సెలక్టర్లు తనకు చెప్పినపుడు.. ఈ నిర్ణయంతో తనకు ఎలాంటి సమస్యా లేదని చెప్పినట్లు సూర్య తెలిపాడు. మున్ముందు ఎప్పుడు పిలిచినా వచ్చి ఆడతానని వారితో అన్నట్లు పేర్కొన్నాడు.కెప్టెన్‌గా హిట్.. బ్యాటర్‌గా విఫలంకాగా కెప్టెన్ అయిన తర్వాత సూర్య బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించిన అతడు.. నాయకత్వంపై దృష్టి పెట్టి.. ఆటగాడిగా విఫలమయ్యాడు. అదే విధంగా వయసు రిత్యా కూడా సూర్య (35 ఏళ్లు)ను ఎక్కువకాలం కొనసాగించలేమని సెలక్టర్లు భావించి ఉండవచ్చు.. అందుకే అతడిపై వేటు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత కొత్త టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.కానీ తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో పసికూన ఐరిష్ జట్టు చేతిలో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలోనూ 4-0తో వైట్‌వాష్ అయింది. అయితే, చివరగా జింబాబ్వే పర్యటనలో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.చదవండి: నో శ్రేయస్.. నో వైభవ్? -
కెప్టెన్ గా సూర్య రీఎంట్రీ.. ఫెర్ వెల్ కోసం BCCI మాస్టర్ ప్లాన్?
-
నో శ్రేయస్, నో వైభవ్.. నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ!
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు పంపే జట్టు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సందిగ్దంలో పడినట్లు సమాచారం. జపాన్‌లో జరిగే ఈవెంట్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.అయ్యర్ కెప్టెన్సీలోఈ క్రమంలో జూన్‌లోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి ఆసియా క్రీడల తాజా ఎడిషన్ మొదలుకానుంది.తీవ్ర అసంతృప్తి!జపాన్‌లోని ఐచి నగోయా ఇందుకు వేదిక. అయితే, అక్కడ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి సరైన వసతులు ఇంకా ఏర్పాటు చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ మండలి సైతం జపాన్‌లోని క్రీడా వేదిక వద్ద ఉన్న సదుపాయాలతో సంతృప్తిగా లేదు.అందుకే ముందుగా అక్కడికి ఒక అబ్జర్వర్‌ను పంపించాలనకుంటున్నాయి. అబ్జర్వర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే జట్టు మార్పు విషయంలో నిర్ణయం ఉంటుంది. ఒకవేళ సరైన వసతులు అక్కడ లేనట్లయితే.. ద్వితీయ శ్రేణి జట్టును పంపే అవకాశం ఉంది.మరీ టెంట్లలోనా?ఈ విషయం గురించి ఇప్పటికే మేము జపాన్ ఒలింపిక్స్ అధికారులతో మాట్లాడాము. డ్రెసింగ్రూమ్లను టెంట్లలో ఏర్పాటు చేశారు. వాష్‌రూమ్‌లు టెంట్లకు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు. ఆటగాళ్లు కచ్చితంగా అసంతృప్తికి లోనవుతారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అందుకే బి- టీమ్?ఇక పిచ్ కూడా అత్యంత నాసిరకంగా ఉందని బీసీసీఐతో పాటు పాకిస్తాన్ బోర్డు ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ను కనీసం రెండు వేల మంది ప్రేక్షకులు అయినా వీక్షించేలా స్టేడియం ఉండాలి. కానీ జపాన్‌లో అలాంటి పరిస్థితి లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తమ ద్వితీయ శ్రేణి జట్లను పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి.ఆసియా క్రీడలకు భారత పురుషుల టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్‌రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా.మహిళల టీ20 జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మలి, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.చదవండి: భారత జట్టులో లేని వైభవ్.. కారణం ఇదే! -
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యూత్ వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌లకు చోటు దక్కింది. ఇప్పటికే అన్వయ్ భారత అండర్-19 జట్టు తరఫున ఆడినప్పటికీ, ఆర్యవీర్ ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే ఈ జట్టులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి సత్తా చాటిన వైభవ్‌కు ఈ జూనియర్ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సూర్యవంశీని ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది.బీసీసీఐ 2016లో ఒక కీలక నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం.. వయస్సు పరంగా అర్హత ఉన్నప్పటికీ ఆటగాళ్లు కేవలం ఒక్క అండర్-19 ప్రపంచకప్‌లో మాత్రమే పాల్గొనాలి. సూర్యవంశీ ఇప్పటికే 2026 అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. దీంతో అతడు మరో ఎడిషన్‌లో పాల్గొనేందుకు అర్హుడు కాదు. అందుకే అతడిని అండర్-19 ప్రణాళికల నుంచి సెలక్టర్లు పక్కన పెట్టారు.ఇకపై సూర్యవంశీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడు. గతంలో ఈ నిబంధన కారణంగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2018 అండర్-19 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే ఈ రూల్ అమలులోకి రాకముందు సర్ఫరాజ్ ఖాన్, సందీప్ శర్మ, విజయ్ జోల్ వంటి ఆటగాళ్లు రెండుసార్లు అండర్-19 ప్రపంచకప్‌లు ఆడారు. సూర్యవంశీ ప్రస్తుతం భారత సీనియర్ జట్టు తరఫున స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు.భారత అండర్–19 వన్డే జట్టు: లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్), యశ్వర్ధన్ చౌహాన్, రజత్ బఘేల్, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్, యశ్వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకటనాగ విజయ సుభాశ్, కావ్య పటేల్.భారత్ అండర్–19 టెస్టు జట్టు: యశ్వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్‌చందాని, సాగర్ విర్క్, కుషాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ విశ్వాస్, రోహిత్ యాదవ్, ఇషాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్. -
IND vs AFG: ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్తాన్!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన జారీ చేసింది. భారత్‌లో టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కు సంబంధించిన ప్రసార హక్కులను పాకిస్తాన్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిరీస్ నిర్వహణపై ముందుకు సాగుతుందా? లేదంటే నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.కాగా తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో సొంతంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే అవకాశం లేదు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అఫ్గాన్ బోర్డు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో భారత్ వేదికగా టీమిండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో సెప్టెంబరు 13-17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన మీడియా హక్కులను పాక్‌కు చెందిన టీజీ (ట్రాన్స్ గ్రూప్)నకు అప్పగించినట్లు అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.‘‘ఏసీబీ గ్లోబల్ మీడియా హక్కుల సిండికేషన్ భాగస్వామిగా టీజీ ఉంటుంది. టీపీటీ360 మీడియా ప్రొడక్షన్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇండియాలో ఫ్యాన్ కోడ్ ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రసారం చేస్తుంది’’ అని అఫ్గాన్ బోర్డు తెలిపింది.కాగా ట్రాన్స్ గ్రూపునకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు ఉన్నాయి. పీసీబీ అంతర్జాతీయ మీడియా హక్కులు కలిగి ఉండటంతో పాటు.. ఆసియా, మధ్యప్రాచ్యంలో ఈ గ్రూపు మేజర్ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా ఈ సంస్థవే.ఈ నేపథ్యంలో బీసీసీఐ అఫ్గాన్ బోర్డు ప్రకటనపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాగా భారత్- పాక్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2026 మేజర్ టోర్నీల్లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.మరోవైపు.. ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించగా.. నక్వీ ట్రోఫీని ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గాన్ జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. శుబ్‌మన్ గిల్ సేనతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడి ఓడిపోయి ఇంటిబాటపట్టింది.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
సచిన్ మాదిరే: శ్రీలంక ప్లేయర్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడి ప్రశంసలు
శ్రీలంక ఆటగాడు సొనాల్ దినుషపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ప్రశంసలు కురిపించాడు. సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడని.. అతడి ఆట టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను గుర్తుకుతెస్తోందని కొనియాడాడు.కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ లంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.దినుష అద్భుత ప్రదర్శనఅయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా సెంచరీ (100) చేసి అవుటైన ఈ 25 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక కొలంబో వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 103 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పసిందు సూరియబండారా (80)తో కలిసి దినుష జట్టును ఆదుకున్నాడు.పసిందుతో కలిసి..అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడేందుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో బుధవారం నాటి నాలుగోరోజు ఆటలో లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.ఇక నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి దినుష ఏడు పరుగులు చేశాడు. అయితే, కీలకమైన గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో మాత్రం దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భోజన విరామ సమయానికి ముందే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాల క్రమంలో రాజీవ్ శుక్లా సొనాల్ దినుషపై ప్రశంసలు కురిపించాడు.సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు‘‘శ్రీలంకకు చెందిన సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు. టెండుల్కర్లా అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో గొప్ప ఆటగాడిగా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా కొనియాడాడు. అయితే, నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన వస్తోంది. దిగ్గజ సచిన్‌తో అప్‌కమింగ్ ప్లేయర్‌ను ఎలా పోలుస్తారని పలువురు రాజీవ్ శుక్లాను విమర్శిస్తున్నారు.కాగా గతేడాది దినుష బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో కలిపి 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సచిన్ టెండుల్కర్ తన రెండున్నర దశాబ్దాల కెరీర్లో 200 టెస్టులు ఆడి.. 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధికంగా 51 టెస్టు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
సూర్యకు BCCI గుడ్ న్యూస్.. టీమిండియాలోకి రీఎంట్రీ..?
-
ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె!
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ (ట్రాన్స్‌జెండర్) సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ తరఫున క్రికెట్ఆ డబోయేది లేదని, ఆస్ట్రేలియా తరఫునే ఫీమేల్ కమ్యూనిటీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపె ట్టింది. మంగళవారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయా బంగర్ మాట్లాడుతూ.. ఒక దశలో తాను క్రికెట్లోకి తిరిగి వచ్చే ఆశలను పూర్తిగా కోల్పోయానని, ఆ సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తనకు క్రికెట్ ఆడే అవకాశం కల్పించిందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. "నేను క్రికెట్ ఆడగలనని తెలిసిన రోజు నాకు స్పెషల్ డే. నేను మళ్లీ క్రికెట్ ఆడలేనేమో అనుకున్న రోజులున్నాయి. కానీ ఇవాళ ఫీమేల్ కమ్యూనిటీ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు కృతజ్ఞతలు. ఇది నాకు కచ్చితంగా మరో అవకాశం లాంటిది” అని చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో అనయా బంగర్ ట్రాన్స్‌జెండర్ మార్పిడి ఆపరేషన్ (వెగినోప్లాస్టీ) చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. సర్జరీ పూర్తయ్యి ఆరు నెలల కావడంతో ఇప్పుడు అనయా బంగర్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక షరతుతో అనయా బంగర్ తమ దేశం తరఫున ఎలైట్ క్రికెట్ ఆడేందుకు ఒప్పుకుంది.అయితే బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్) వంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే మాత్రం టెస్టోసిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, సదరు ప్లేయర్ అర్హత పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి.ఇప్పటికే అనయా బంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు సంబంధించిన లేఖను పంపించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రెటీ హెడ్ జాక్వి పార్టిడ్జ్ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున అనయా బంగర్ ఎలైట్ క్రికెట్లో ఆడాలనుకుంటే, మీ సీరం టెస్టోస్టెరాన్ గాఢత 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) తక్కువగా ఉన్నట్లు నిరూపిస్తూ వివరాలు అందించాలని కోరుతున్నాం. ఒకవేళ షరతులకు లోబడి నివేదిక ఉంటే అర్హత ప్రకారం ఆడేందుకు అనుమతిస్తాం.’’ అని చెప్పుకొచ్చారు. ట్రాన్స్జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం లేదని, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో వారిపై నిషేధం విధించింది. దీంతో మన దేశంలో ట్రాన్స్జెండర్ల క్రికెటర్ల భవిష్యత్తుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే భారత్ తరఫున ఆడే అవకాశం లేనందునే అనయా బంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే గతంలో అనయా బంగర్.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి క్రికెటర్లతో కలిసి ముంబై క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు.🔴ANAYA BANGAR CLEARED TO PLAY WOMEN’S CRICKET IN AUSTRALIA🤯- Anaya Bangar, daughter of former India cricketer Sanjay Bangar, has received clearance from Cricket Australia to play women’s community cricket.- She underwent gender-affirming surgery in March 2026 & had… pic.twitter.com/k9AIDzkLw5— Sam (@cricsam02) August 25, 2026🔴ANAYA BANGAR CLEARED TO PLAY WOMEN’S CRICKET IN AUSTRALIA🤯- Anaya Bangar, daughter of former India cricketer Sanjay Bangar, has received clearance from Cricket Australia to play women’s community cricket.- She underwent gender-affirming surgery in March 2026 & had… pic.twitter.com/k9AIDzkLw5— Sam (@cricsam02) August 25, 2026Read: వైఫల్యాలను దాచిపెట్టడానికి సిగ్గుండాలి: హాకీ దిగ్గజం -
బీసీసీఐకి కొత్త తలనొప్పి!
క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డుగా పేరుపొందిన భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ)కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. కొత్త స్పాన్సర్ వెతుకులాటలో బీసీసీఐకి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఏడాది పొడవునా మ్యాచ్లుండే టీమిండియా క్యాలెండర్ ద్వారా మరింత డబ్బు సంపాదించాలన్న బీసీసీఐ ప్రయత్నానికి స్పాన్సర్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.రాబోయే రెండేళ్లపాటు భారత టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం బోర్డు ఒక్కో మ్యాచ్‌కు కనీస ధరగా రూ. 4.85 కోట్లను నిర్ణయించింది. అయితే, బీసీసీఐ పేర్కొన్న అంనాలకు తగిన విధంగా ఆఫర్ రాలేదు. ఇంతలోనే బిడ్లకు సంబంధించిన గడువు ముగిసిపోవడంతో బీసీసీఐ బిడ్ దాఖలు సమయాన్ని పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.అయితే ప్రస్తతం స్పాన్సర్‌గా ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మునుపటి ఒప్పందం ప్రకారం టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.2 కోట్లు చొప్పున చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతం బీసీసీఐ ఒక్కో మ్యాచ్ ధరను గణనీయంగా పెంచడంతో స్పాన్సర్లు ముందుకు రావడం లేదు. అయితే రాబోయే రెండేళ్ల కాలంలో భారత జట్టు సుమారు 35 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ లెక్కన స్పాన్సర్షిప్ హక్కులు పొందిన సంస్థ నుంచి పెద్ద మొత్తంలో నగదు అందుతుందని, దీనిద్వారా భారీ వాణిజ్య లాభాన్ని పొందవచ్చని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.బిడ్ సమర్పణకు గడువు ఆగస్టు 13 అయినప్పటికీ, భారత బోర్డుకు హక్కుల కోసం బిడ్లు అందలేదు. బీసీసీఐ జూలై 20న ఆహ్వానాన్ని విడుదల చేసింది. ఐటీటీ పత్రాల కొనుగోలుకు చివరి తేదీ ఆగస్టు 4గా నిర్ణయించింది. వివరణలు కోరడానికి బీసీసీఐ ఆగస్టు 5న చివరి తేదీగా ఉంచింది. అయితే బిడ్లకు గడువు ముగియడంతో బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గూగుల్ జెమిని, స్పిన్నీ, ఎస్బీఐ లైఫ్ వంటి కంపెనీలతో ఇప్పటికే బీసీసీఐ చర్చలు ప్రారంభించినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.అంతేకాకుండా, బీసీసీఐ ఈవెంట్ల కోసం అసోసియేట్ పార్టనర్ హక్కులకై ఇండియన్ బోర్డ్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (RFQ)ను కూడా విడుదల చేసింది. టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను కొనుగోలు చేసిన బ్రాండ్, అసోసియేట్ పార్టనర్ హక్కులను పొందేందుకు వీలు లేదు. అందుకే టైటిల్ స్పాన్సర్ ఖరారైన తర్వాతే ఈ హక్కులు ఖరారు చేయబడతాయి. RFQను కొనుగోలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 14 కాగా, ఆగస్టు 16లోగా వివరణలు ఇచ్చుకోవాలి. ఇక కొటేషన్ పత్రాలను సమర్పించడానికి ఆగస్టు 25 చివరి తేదీ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
టీమిండియా, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ వాయిదా!
బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సిరీస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి బీసీబీ ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చలు జరుపుతుందని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే టీమిండియా.. బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండగా, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఢాకా, చట్టోగ్రామ్ వేదికలుగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుందని బీసీబీ ఈ ఏడాది జనవరిలో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సిరీస్‌పై బీసీసీఐ మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు బీసీబీ మాత్రం టీమిండియాతో సిరీస్ నిర్వహణకు సిద్దమైనట్లు తెలిపింది. పర్యటనలో భాగంగా ఆగస్టు 28న బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనున్న భారత్ సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో మూడు వన్డేలు, సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో సిరీస్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండగా, అసలు సిరీస్ జరుగుతుందా? లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఇదే విషయమై తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. "టీమిండియాతో సిరీస్ గురించి ఇరు బోర్డులు ఇంకా చర్చలు జరుపుతున్నాయి. టోర్నీ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అయితే షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. టోర్నీ మొత్తం మీర్పూర్ వేదికగా జరగాలని నిర్ణయిస్తే మాత్రం వేదికను బసుంధర గ్రౌండ్‌కు మారుస్తాం. సిరీస్ నిర్వహణపై అధికారిక ప్రకటన వస్తే దానికి అనుగుణంగా షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తాము’’ అని చెప్పుకొచ్చాడు.ఈ ఏడాది జనవరిలో బీసీబీ భారత పర్యటనను అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా, కేకేఆర్ బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ను తప్పించడంతో రెండు క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతరం, అమీనుల్ ఇస్లాం నేతృత్వంలోని బీసీబీ, భారత్ సహ-ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్‌కు తమ జట్టును పంపకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఇటీవల బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ ఈ నెల ప్రారంభంలో భారత్‌ను సందర్శించిన తర్వాత రెండు బోర్డుల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగయ్యాయి.Read: రూట్ ప్రపంచ రికార్డు.. పాక్‌తో టెస్టులో భారీ ఆధిక్యం -
వివాదంలో BCCI బాస్ మిథున్ మన్హాస్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వివాదంలో చిక్కుకున్నాడు. జూనియర్ స్థాయిలో క్రికెట్ సెలక్షన్ ఎంపిక సమయంలో అతడు పుట్టిన తేదీని మార్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, మాజీ డిప్యూటీ ఎస్పీ సుదర్శన్ మెహతా స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలో భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 175 (3) ప్రకారం.. చీటింగ్, ఫ్రాడ్, పుట్టిన తేదీ ఫోర్జరీ తదితర ప్రొవిజన్లకు అనుగుణంగా మన్హాస్‌పై నౌబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ అందించిన వివరాల ప్రకారం.. మిథున్ మన్హాస్ జూనియర్ లెవల్, నేషనల్ లెవల్లో క్రికెట్ ఆడే సమయంలో వేర్వేరు పుట్టిన తేదీలను నమోదు చేశారు.పోలీసులకు కోర్టు ఆదేశాలుసబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలలో అర్హత పొందేందుకు ఈ మేరకు అక్రమాలకు పాల్పడ్డాడని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక కోర్టు సెప్టెంబరు 3లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.ఢిల్లీ తరఫునకాగా 45 ఏళ్ల మిథున్ మన్హాస్ సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్. అయితే, దేశవాళీ క్రికెట్లో అతడు ఎక్కువగా ఢిల్లీ జట్టుకు ఆడాడు. కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి అనుభవం ఉన్న మిథ/న్.. 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు కూడా ఉన్నాయి.ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 130 మ్యాచ్‌లలో కలిపి మిథున్ 4126 పరుగులు సాధించాడు. అదే విధంగా 91 టీ20 మ్యాచ్‌లు ఆడి 1179 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.కెరీర్ చరమాంకంలో మిథున్ మన్హాస్ 2015లో జమ్మూ కశ్మీర్ క్రికెట్ సబ్ కమిటీ మెంటర్‌గా పనిచేశాడు. ఆ మరుసటి ఏడాది కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన మిథున్.. బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ పనిచేశాడు. అయితే, టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మిథున్.. పెద్దల అండతో ఏకంగా బీసీసీఐ బాస్ అయ్యాడు.చదవండి: సచిన్ కంటే కోహ్లి బెటర్: డివిలియర్స్ -
సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు (ట్రాన్స్‌జెండర్) అనయ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో మహిళల క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా కొత్త చాప్టర్‌ను ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ‘మీ అందరికీ ఒక శుభవార్త. నేను 2027లో మహిళల ఎలైట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. దీని గురించి చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చెప్పలేను. నాకు ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చిందన్న విషయం మాత్రం స్పష్టం చేయగలను.’ అని చెప్పుకొచ్చింది.ట్రాన్స్జెండర్లను ఉమెన్స్ క్రికెట్లోకి అనుమంతించేది లేదంటూ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని అనయ బంగర్ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ట్రాన్స్జెండర్లకు మహిళల క్రికెట్లో ఆడే హక్కు ఎందుకు ఉండదో చెప్పాలని ఐసీసీని ప్రశ్నించింది. అంతేకాదు లింగమార్పిడి తర్వాత మహిళా క్రికెటర్లతో సమానంగా తన శారీరక స్థితి ఉందని పేర్కొన్న అనన్య బంగర్, తన రిపోర్టుల్లో మహిళా క్రికెటర్లకు ఉండే కండబలం, గ్లూకోస్, ఆక్సిజన్ లెవల్స్.. తనకు అలానే ఉన్నాయని నిరూపించుకుంటానని సవాల్ చేస్తూ బీసీసీఐ, ఐసీసీకి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే అనయ బంగర్ మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆసుపత్రిలో చేయించుకున్న అదనపు రక్త పరీక్షలు, శస్త్ర చికిత్స వివరాలు సహా వైద్య, శారీరక సమాచారాన్ని ఒక సంస్థ (పేరు చెప్పలేని) పరిశీలించింది. ‘అనయ బంగర్ రిపోర్ట్స్‌ను సుశితంగా పరిశీలించాం. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ, మహిళలతో సమానంగా శారీరక స్థితి ఉండడంతో అనయకు మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందే’ అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.అయితే అనయ బంగర్ తాను మహిళల ఎలైట్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, భారత మహిళల జట్టుకు ఆడడం మాత్రం కష్టమే. క్రికెట్ ఆడేందుకు ట్రాన్స్జెండర్లకు అనుమతి లేదనే ఐసీసీ నిబంధనలే ఇందుకు కారణం. పురుష దశ దాటిన తర్వాత లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో పాల్గొనేందుకు అర్హులు కారు అని ఐసీసీ పేర్కొంది. ఇక అనయ తండ్రి సంజయ్ బంగర్ టీమిండియా తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2014 నుంచి 2019 వరకు సంజయ్ బంగర్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ తన కుటుంబం మద్దతుతో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT), జెండర్-అఫర్మింగ్ సర్జరీ పూర్తి చేసుకుని అనయా బంగర్గా గుర్తింపు పొందింది.😇 pic.twitter.com/pDOjd2B5mB— Anaya Bangar (@anayabangarbnxf) August 17, 2026Anaya Bangar gets candid on her upcoming debut in women’s cricket: I had given up on the hope of ever playing againFor Anaya Bangar, life has been a relentless battle of resilience, grit, and unwavering authenticity.Following her post-transition journey and a deeply personal… pic.twitter.com/h1xH292uAZ— Ritam English (@english_ritam) August 18, 2026Read: జడ్డూ చర్యపై గంభీర్ అసహనం! -
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
-
వీవీఎస్ లక్ష్మణ్ కు గుడ్ న్యూస్..! బీసీసీఐ కీలక నిర్ణయం
-
చావుతో పోరాడి దేశానికి కప్ తెచ్చిన యోధుడు.. యువరాజ్ సింగ్ లైఫ్ స్టోరీ
-
ఆ నలుగురికే కాదు.. అందరికీ తెలియాల్సిందే: గావస్కర్
ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు మారబోతున్నాడే ప్రచారం జోరుగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్ప.. మిగిలిన ఫ్రాంఛైజీలన్నీ హార్దిక్ కోసం పోటీలో ఉన్నాయని ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు.అయితే, ముంబై యాజమాన్యం మాత్రం ఇంతవరకు హార్దిక్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈ ఆల్‌రౌండర్ చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ ట్రేడింగ్ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించాడు. ‘‘వేలానికి ముందు ఆటగాళ్లు ఒక ఫ్రాంఛైజీ నుంచి మరో ఫ్రాంఛైజీకి మారే అంశం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే, ఈ విండో పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది. సమయం వచ్చినపుడు ఏ ఆటగాడు ఏ జట్టు నుంచి మరే జట్టుకు మారుతున్నాడో ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటిస్తున్నాయి. కానీ ఎంతకు ట్రేడింగ్ (ధర) జరిగిందన్న విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు.సదరు ఆటగాడు, బీసీసీఐ, రెండు ఫ్రాంఛైజీల వద్ద మాత్రమే ఆ సమాచారం ఉంటోంది. అలాంటపుడు ఫ్రాంఛైజీలు తమ సాలరీ క్యాప్‌నకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నాయా? లేదంటే ఉల్లంఘిస్తున్నాయా? అన్న విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ట్రేడింగ్ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. ఆ నంబర్లను కూడా బహిరంగంగా ప్రకటించాలి.ఫ్రాంఛైజీలు జవాబుదారీతనం పాటించేలా చూడాలి. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత గొప్ప లీగ్‌గా కొనసాగుతోంది. ఇలాంటి టోర్నీలో పారదర్శకతకు పెద్దపీట వేయకపోతే.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది’’ అని సునిల్ గావస్కర్ మిడ్-డేకు రాసిన కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
బీసీసీఐ బిగ్ ట్విస్ట్.. అగార్కర్‌కు చెక్? రేసులోకి ఊహించని పేరు
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని పొడిగించాలా? లేదా వద్దా? అన్న అంశంపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. అతడి భవితవ్యం తెల్చేందుకు శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ అగర్కార్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించకపోతే అతడి స్ధానాన్ని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ భర్తీ చేసే అవకాశముందని 'ది టెలిగ్రాఫ్' తమ కథనంలో వెల్లడించింది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. తొలుత అగార్కర్ స్థానంలో లక్ష్మణ్‌ను పరిగణనలోకి తీసుకున్నారని, అయితే ప్రయాణాల భారం కారణంగా చీఫ్ సెలక్టర్ పదవిని చేపట్టడానికి అతడు చూపలేదంట. దీంతో లక్ష్మణ్‌కు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' (Director of Cricket) అనే నూతన పదవిని కట్టబెట్టేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది జూన్‌తో ముగియాల్సి ఉంది. కానీ భారత క్రికెట్ బోర్డు అతడికి మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడినే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావించినట్లు వార్తలు వచ్చాయి.కానీ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు విషయంలో బీసీసీఐకి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిని తప్పించే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది.చదవండి: IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్! -
అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్‌లైన్ అప్పుడే!
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్‌ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది. అంతేకాదు ఇంగ్లండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్‌గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు. అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్‌ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్‌కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్‌పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.Read: సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త! -
లైవ్ మ్యాచ్‌లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా, తన ప్రియురాలికి ఒక యువ బ్యాటర్ ఫోన్లో టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించినందుకు, సదరు యువ బ్యాటర్‌కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) రూ. 1 లక్ష జరిమానా విధించింది. ‘‘విచారణ కొనసాగుతున్నందున తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆటగాడి పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘జరిమానా విధించిన ఆటగాడు ఎడమచేతి వాటం బ్యాటర్ అని, గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున రెండు అర్ధశతకాలు సాధించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను తన ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్‌లు పంపుతూ కనిపించాడు. ఇది ఎలాంటి అవినీతి ఆరోపణల కిందకు రానప్పటికీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు PMOAలో మొబైల్ ఫోన్ వాడటం నిషేధం. అందువల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే అతడికి లక్ష జరిమానా విధించాం" అని సీనియర్ అధికారి పేర్కొన్నాడు. మొదట యువ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించాలనుకున్నప్పటికీ, నేరం పెద్దది కాకపోవడంతో జరిమానాతో సరిపెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్లో, రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం అప్పట్లో సంచలనం కలిగించింది. రోమీ భిందర్ పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా అతడి ఫోన్ చూస్తుండడం వైరల్‌గా మారింది. దీంతో మ్యాచ్ జరుగున్న సమయంలో ఫోన్ చూడడం పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. దీంతో బీసీసీఐ పీఎంవోఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రోమీ భిందర్‌కు లక్ష జరిమానా విధించిన బీసీసీఐ వైభవ్‌ను మాత్రం హెచ్చరికలతో సరిపెట్టింది. -
Asia Cup 2026: టీమిండియాకు భారీ షాక్
ఏసీసీ మహిళల ఆసియా కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నీకి దూరమైంది. ఆసియా కప్ ఈవెంట్‌తో పాటు.. ఆసియా క్రీడలకు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్ వేదికగా ‘ది హండ్రెడ్’ మహిళల లీగ్-2026లో జెమీమా రోడ్రిగ్స్ సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అయితే, ఇటీవల ఆగష్టు 3 నాటి మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో విలవిల్లాడింది.గాయం తీవ్రతరంఫలితంగా హండ్రెడ్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు జెమీమా దూరమైంది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న ఆమె గాయం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైద్య బృందం సూచన మేరకు ఆమెకు విశ్రాంతి అవసరమని నిర్ణయించింది.ఈ క్రమంలో ఆసియా కప్, ఆసియా క్రీడలకు జెమీమా రోడ్రిగ్స్ దూరమైనట్లు బోర్డు ప్రకటించిది. ఇక ఆసియా కప్ టోర్నీకి మాత్రం జెమీమా స్థానంలో ప్రతికా రావల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఆసియా కప్ నిర్వహణకు ఆగష్టు 28- సెప్టెంబరు 13 మధ్య షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు యూఏఈ వేదిక.ఆసియా కప్-2026 టోర్నీకి భారత మహిళల జట్టు (అప్డేటెడ్)హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, భారతి ఫల్మలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతికా రావల్.చదవండి: ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్ ఫైర్ -
చీఫ్ సెలక్టర్ లేదా హెడ్‌కోచ్ అవుతా: టీమిండియా దిగ్గజం
భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భాగమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. తనకు ఏ పదవి ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తానంటూ మనలోని మాటను వెల్లడించాడు.గంభీర్, అగార్కర్‌పై విమర్శలుకాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరి నేతృత్వంలో వైట్‌బాల్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలో భారత జట్టు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇటీవల ఘోర పరాభవాలు చవిచూసింది.వరుస పరాభవాలుఎన్నడూలేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్ కోల్పోవడం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం.. ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ కావడం, వన్డే సిరీస్‌ను కోల్పోవడం తాజా ఉదాహరణలు.చీఫ్ సెలక్టర్, హెడ్‌కోచ్ అయ్యేందుకు సిద్ధంఈ నేపథ్యంలో శ్రీలంకతో తాజాగా రెండు టెస్టుల సిరీస్ తర్వాత వీరి భవితవ్యంపై స్పష్టత రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్భజన్ సింగ్ బీసీసీఐలో ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.‘‘బీసీసీఐ అధ్యక్షుడు, చీఫ్ సెలక్టర్ లేదంటే హెడ్‌కోచ్... ఈ మూడింటిలో ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భారత క్రికెట్‌కు ఏ స్థాయిలోనైనా సేవ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషమే. భవిష్యత్తులో ఈ మూడింటిలో ప్రతీ పాత్ర పోషించాలని నేను కోరుకోవడం లేదు.గంభీర్‌కు మద్దతుఅయితే, నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ నాకే గనుక నిజంగా అవకాశం వస్తే.. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని భజ్జీ PTI ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా ప్రతీ దానికి గంభీర్‌ను విమర్శించడం తగదని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అతడు ప్రతీ నిర్ణయం తీసుకుంటాడని అండగా నిలిచాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి! -
వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి?
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే బీసీసీఐ అత్యున్నత పదవిని అలంకరించనున్నట్లు సమాచారం. గంభీర్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా రానున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్‌కు బీసీసీఐ (హెడ్‌కోచ్ పదవికి మించి) డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.కొత్తగా రూపొందించనున్న డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి లక్ష్మణ్ అయితేనే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ భావించింది. అంతేకాదు లక్ష్మణ్ ఆ పదవిలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తాడని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్‌గా ఆటగాళ్ల పునరావాసం, శిక్షణ వంటి బాధ్యతలు చూస్తున్నాడు. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా నియమితులైతే, ఆయన పరిధి మరింత విస్తృతం కానుంది. సీనియర్ పురుషుల, మహిళల జట్ల వ్యూహరచన, జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల ప్రగతిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు ఆయన చేతికి రానున్నాయి.ఇదే సమయంలో, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబర్‌తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అనే అంశంపై కూడా బీసీసీఐ చర్చిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం కోసం లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.గతంలో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ కోరినప్పటికీ, లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. బెంగళూరులోని నూతన సీవోఈ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గాడిన పడటంతో, ఆయన అనుభవాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది. Read: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్ -
భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌లో మార్పు!
సెప్టెంబర్‌లో భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇటీవల ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మూడు మ్యాచ్‌లు వచ్చే నెల 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయాలని బీసీసీఐని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్దించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండగను పురస్కరించుకుని, ఆ రోజున ఒక టీ20 మ్యాచ్ నిర్వహించాలని ఏసీబీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు పండగ సెలవు దినం కావడంతో మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆశిస్తోంది. ఈ ప్రతిపాదనకు భారత క్రికెట్ బోర్డు అంగీకరిస్తే.. సెప్టెంబర్ 13 లేదా 15న జరగాల్సిన మ్యాచ్‌లలో ఒకదానిని సెప్టెంబర్ 14కి మార్చనుంది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం ఇది అఫ్గానిస్తాన్‌కు హోమ్ సిరీస్ కావడం విశేషం. గతంలో అఫ్గాన్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడినప్పటికి, టీమిండియాతో హోమ్ సిరీస్ ఆడడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చారిత్రత్మక సిరీస్ ప్రసార హక్కులకు సంబంధించి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వంటి ప్రముఖ ఛానళ్లతో ఏసీబీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్ -
'బుమ్రాకు గాయం.. వారిదే పూర్తి బాధ్యత'
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో మెకాలి గాయానికి గురైన బుమ్రా ఇంకా కోలుకోలేదు. దీంతో శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. తొలుత లంకతో సిరీస్ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలక్టర్లు అంచనా వేశారు. కానీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో అతడిని లంక టూర్‌ను నుంచి సెలక్టర్లు తప్పించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఫిట్నెస్, వర్క్‌లోడ్ నిర్వహణలో టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని అతడు మండిపడ్డాడు.కాగా గతేడాది ఆరంభంలో వెన్ను గాయం బారిన పడినప్పటికి నుంచి బుమ్రా వర్క్‌లోడ్‌ను బీసీసీఐ పర్యవేక్షిస్తునే ఉంది. కీలక మ్యాచ్‌లలోనూ అతడు ఆడుతూ వస్తున్నాడు. మిగిలిన మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ బుమ్రాకు విశ్రాంతి ఇస్తోంది. అయినప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదు."బుమ్రా వర్క్‌లోడ్ విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధం లేని విషయం. సీఓఈ కేవలం ఆటగాడి ఫిట్నెస్ స్థితిపై సమాచారం మాత్రమే ఇస్తుంది. ఏ మ్యాచ్‌లు ఆడాలి, ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలనేది కెప్టెన్, కోచ్, సెలెక్టర్లే నిర్ణయిస్తారు" అని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అదేవిధంగా బుమ్రాతో పాటు జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంపై కూడా బద్రీనాథ్ ఆందోళన వ్యక్తం చేశాడు. "జట్టులో ఇంతమంది ఆటగాళ్ల గాయాలకు గల స్పష్టమైన కారణాలైతే నాకు తెలియదు. కానీ క్రికెట్ వంటి ప్రొఫెషనల్ క్రీడల్లో గాయాలు తప్పవు. వాటిని పూర్తిగా నియంత్రించలేం. అయితే సరైన మేనేజ్మెంట్, నిరంతర పర్యవేక్షణ చాలా అవసరమని " అతడు అన్నాడు. -
కాశ్మీర్లో క్రికెట్ పండగ.. కీలక మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!
జమ్మూ అండ్ కాశ్మీర్ మరో కీలక క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమైంది. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జమ్మూ కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి.. జమ్మూ హెడ్ కోచ్ అజేయ్ శర్మ మాత్రం ధ్రువీకరించాడు.ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు అతడు తెలిపాడు. షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధిపై స్ధానిక క్రికెట్ అసోసియేషన్‌కు దిశానిర్దేశం చేసేందుకు బీసీసీఐ ప్రతినిధుల బృందం ఇప్పటికే రెండుసార్లు శ్రీనగర్‌లో పర్యటించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 5,000గా ఉంది. కాగా షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం గతంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది. ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి.శ్రీనగర్ వేదికగా 1983లో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత చివరగా 1986లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను ఈ గ్రౌండ్లో నిర్వహించారు. అయితే జమ్మూ-కాశ్మీర్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా చాన్నాళ్ల పాటు డొమాస్టిక్ మ్యాచ్‌లు సైతం నిర్వహించలేదు. అయితే పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో గతేడాది అక్టోబర్ 15-18 మధ్య శ్రీనగర్‌లోని ఈ స్టేడియంలో ముంబై, జమ్మూ కాశ్మీర్ మధ్య కీలక రంజీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది.మళ్లీ ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ సందడి నెలకొంది. కాగా రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా జమ్మూ నిలిచిన సంగతి తెలిసిందే. జమ్మూ అండ్ కాశ్మీర్‌కు ఇదే తొలి రంజీ టైటిల్ కావడం విశేషం. ఈ చారిత్రత్మక విజయంలో పేసర్ ఆకిబ్ నబీది కీలక పాత్ర. అతడు ప్రస్తుతం భారత జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.చదవండి: IND vs SL: గిల్ కాదు.. అతడితో జాగ్రత్త! శ్రీలంకకు దిగ్గజ క్రికెటర్ వార్నింగ్ -
సర్ఫరాజ్ సెలక్షన్ వెనుక అసలు కారణం ఇదే.. BCCI మాస్టర్ స్కెచ్
-
IND vs SL: టీమిండియా దిగ్గజ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే లంకకు చేరుకున్న టీమిండియాకు.. వార్మప్ మ్యాచ్‌తో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరంఈ సిరీస్‌లో 2-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవగలుగుతుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యారు. గాయాల వల్ల ఈ ముగ్గురూ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక సూచనలు చేశాడు. ఆటగాళ్లు గాయాల బెడద, టెస్టు క్రికెట్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ మేరకు JITO ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా మాట్లాడుతూ..అదే అత్యంత ముఖ్యం‘‘ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం అత్యంత ముఖ్యం. ఇటీవలి కాలంలో భారత జట్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇందుకు కారణం వారు దేశీ క్రికెట్ ఆడకపోవడమే.బీసీసీఐ ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ప్రతి ఒక్క ఆటగాడు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడేలా చూడాలి. సీనియర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకుంటారు. వారితో కలిసి ఆడటం వల్ల యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.మనోళ్లు తేలిపోతున్నారుఇటీవల టీమిండియా ఎన్నో టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడింది. అయితే, స్పిన్ బౌలింగ్‌లో మనోళ్లు అత్యుత్తమంగా రాణించలేకపోయారు. ఇక టెస్టు ఫార్మాట్ మరింత భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని కపిల్ దేవ్ టీమిండియాతో పాటు బీసీసీఐకి సూచించాడు. కాగా శ్రీలంకతో ఆగష్టు 15 నుంచి టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ -
IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది.అఫ్గాన్ క్రికెట్‌కు అండగా ఉంటాముఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్- అఫ్గానిస్తాన్ జట్ల మధ్య పోరు చాలా ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇరుజట్లలోనూ మంచి నైపుణ్యాలున్న క్రికెటర్లు ఉన్నారు.అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో చాలా మందికి భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నాయి. 2018లో తొలిసారి బారత్ అఫ్గానిస్తాన్‌కు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది.చిరస్మరణీయంఅప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత పటిష్టంగా మారాయి. ఇటీవలే జూన్‌లో అఫ్గాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు ఇరుజట్లు టీ20 సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఢిల్లీలో అఫ్గాన్ జట్టు టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది’’ అని పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. అయితే, అఫ్గాన్‌తో టీమిండియా సిరీస్ ఖరారైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.బంగ్లాదేశ్‌కు షాక్నిజానికి సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం అఫ్గాన్‌ను రంగంలోకి దింపి బంగ్లాకు చెక్ పెట్టింది.కాగా టీ20 ప్రపంచకప్-2026 సమయంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్ద పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా బోర్డు తమ జట్టు భారత్‌కు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నం చేయగా.. బంగ్లా పట్టువీడలేదు. వేదిక మార్చలేదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో బంగ్లా బోర్డు- బీసీసీఐ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇక లేనట్లేనా?అయితే, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం బీసీసీఐతో బంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. బీసీసీఐతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని.. అయితే, ద్వైపాక్షిక సిరీస్ విషయంలో వారిదే అంతిమ నిర్ణయం అని ఇటీవల పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ మాత్రం బంగ్లాతో సిరీస్ విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో అఫ్గాన్‌తో సిరీస్ ఖరారు చేసి.. భారత్‌ను ఆతిథ్య దేశంగా ఉపయోగించుకునే బంపరాఫర్ ఇచ్చింది.అఫ్గానిస్తాన్ వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: సెప్టెంబరు 13- ఆదివారంరెండో టీ20: సెప్టెంబరు 15- మంగళవారంమూడో టీ20: సెప్టెంబరు 17- గురువారంవేదిక: ఢిల్లీ.చదవండి: టెస్టులలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. జైసూ సరికొత్త ఫీట్ -
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్‌లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్‌లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్‌తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్.. అఫ్గాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్‌లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్ -
జై షా విజన్.. 40 ఎకరాల బీడు భూమి నుంచి సీఓఈ దాకా!
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గురుంచి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చనడుస్తోంది. సీఓఈ క్లియరెన్స్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆటగాళ్ల గాయాలు తిరగబెట్టడం పలు అనుమానులకు తావనిస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే సీఓఈ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇస్తుందనున్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత జట్టులోని జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు సీఓఈలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు సీఓఈను సందర్శించారు. వీరంతా సీఓఈ హెడ్ వీవీయస్ లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవజిత్ సైకియా కీలక విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు ఏ ఉపయోగం లేకుండా పడివున్న 40 ఎకరాల బంజారు భూమిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జై షాది కీలక పాత్ర అని సైకియా తెలిపారు."బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఈరోజు అందుబాటులో ఉందంటే అందుకు ప్రధాన కారణం జై షా. 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ఏర్పాటు కోసం అతడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లోని అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు.ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఏర్పాట్లతో సాగిన నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉండే ఓ అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్‌ను తీసుకురావాలని అతడు బలంగా నిశ్చయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించే క్రమంలో అనేక నిబంధనలను పాటించాల్సి వచ్చింది.చట్టపరమైన అడ్డంకులన్నింటినీ తొలగించేందుకు జై షా స్వయంగా పలుమార్లు ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా, 40 ఎకరాల బీడు భూమిని క్రమబద్ధీకరించే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఆ భూమి నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు, చాలామంది దానిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు.అందుకే 2022 ఫిబ్రవరి 14న పనులు ప్రారంభించడానికి ముందే దానిని చట్టబద్ధంగా సొంతం చేసుకున్నాం. అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ రోజు అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది" అని సైకియా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా ఈ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యకలాపాలు నవంబర్ 2024లో ప్రారంభమయ్యాయి. -
నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది: భువీ
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్-2027 కోసం సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే, తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నానని భువీ తెలిపాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకోవడంలో ఈ యూపీ పేసర్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లతో భువీ సత్తాచాటాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్, రవి శాస్త్రి, దినేష్ కార్తీక్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం భువీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు తను రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు."జాతీయ జట్టు సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు కాదంటాను? భారత్ తరపున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దమే. కానీ నా చేతుల్లో లేని విషయం గురుంచి ఎక్కువ నేను ఆలోచించను. నన్ను తీసుకోవాలా లేదా అన్నది సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉటుంది. అయితే నా శరీరం అలిసిపోయేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. అందుకే యూపీ టీ20 లీగ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాను. అంతేతప్ప మెరుగ్గా రాణించి ఎవరినో ఆకట్టుకోవాలని అయితే ఇక్కడికి రాలేదు. ఐపీఎల్లో కూడా అంతే. జట్టు కోసం రాణించి మ్యాచ్‌లు గెలవాలన్నదే నా లక్ష్యం. ఎవరో ఏదో అన్నారని లేదా మరో చోట ఎంపికవ్వాలనే ఆశతో నేను ఆడడం లేదు" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువీ పేర్కొన్నాడు. కాగా భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు.చదవండి: ఆ పేరంటే ద్వేషం: భారత బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్ -
‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్‌లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.ఇక జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్‌లకు ఫిట్‌గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు."గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.Read: బాడీ షేమింగ్‌పై ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ! -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్‌తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్‌కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన గిల్ మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్‌లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. అయితే జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్‌లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్‌కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్‌ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం!
టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆటగాళ్ల రీఫ్రెష్మెంట్కు రీహాబిలిటేషన్ సెంటర్లా ఉపయోగపడాల్సిన సీవోఈ కేంద్రం ఇప్పుడు ఆసుపత్రి వార్డులా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీవోఈలో చికిత్స తీసుకుంటున్న ఆటగాళ్లతో ఒక జట్టునే తయారు చేయొచ్చని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీవోఈ కేంద్రంలోని ఆటగాళ్ల పునరావాసం, ఎంత వేగంగా కోలుకుంటున్నారనే దానిపై సమీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం లక్ష్మణ్‌ను కలిశారు. వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గాయపడిన క్రీడాకారుడు అనుకున్న సమయానికి వేగంగా కోలుకోవడానికి వారేమీ రోబోలు లేదా యంత్రాలు కాదని స్పష్టం చేశారు. ప్రతీ ఆటగాడి శరీరం స్పందించే తీరు వేరువేరుగా ఉంటుందని, తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన ఆధునిక క్రికెట్లో గాయపడిన ప్లేయర్‌కు అవసరమైనంత కోలుకునే సమయం ఇవ్వడం అత్యంత కీలకమని లక్ష్మణ్ తెలిపాడు. ప్రతి ఒక్కరి నుంచి ఒకే విధమైన రికవరీ సమయాన్ని ఆశించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో కొత్తగా పునర్నిర్మించిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్-బ్యాటర్ సాయి సుదర్శన్, నితీశ్ కుమార్‌రెడ్డి, అశోక్ శర్మ సహా మొత్తంగా 13 మంది ఆటగాళ్లు రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నారు. అయితే వీరంతా వేగంగా కోలుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించాడు. భారత క్రికెటర్ల ఫిట్నెస్ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంలో, వారికి అవసరమైన హై-టెక్ రీహాబిలిటేషన్ సదుపాయాలు అందించడంలో సీవోఈ ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందన్నాడు. టీమ్ మేనేజ్మెంట్, ఫిజియోలు, సీవోఈ వైద్య నిపుణుల మధ్య అత్యుత్తమ సమన్వయం ఉందన్న ఆయన.. ఆటగాళ్ల భవిష్యత్తు, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల పర్యవేక్షణలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు.నితీశ్ రెడ్డి గాయంపై స్పందించిన లక్ష్మణ్.. ఒక ఆల్‌రౌండర్‌గా పనిభారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం కోసమే అతడిని పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేవరకు శిక్షణ తీసుకుంటాడని తెలిపాడు. ఇక యో-యో అనేది ఆటగాడి అనెరోబిక్ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక పరీక్ష అని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు ఒక సిరీస్‌లో భాగంగా ఉన్నప్పుడు యో-యో చేయడాని వీలు ఉండదు, అంతేకాదు దాని నుంచి కోలుకోవడానికి శరీరానికి చాలా కష్టంగా ఉంటుందన్నాడు.అందుకే బ్రాంకో టెస్ట్ ఒక కండిషనింగ్ సెషన్‌లా పనిచేస్తుందని, ఇది పరోక్షంగా ఆటగాడి ఫిట్నెస్ స్థాయిలను, అనెరోబిక్ ఫిట్నెస్ స్థాయిలను కూడా పరీక్షిస్తుందని తెలిపాడు. దీనిని వివిధ వయసుల వారిలో పరిగణనలోకి తీసుకుంటామని, సీజన్ పొడవునా దీనిని నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నామమాత్రపు మ్యాచ్.. లివింగ్‌స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం -
ఇండియన్ క్రికెట్ ట్రైనింగ్ సెంటరా? లేదా ఆస్పత్రి వార్డా?
భారత పురుషల క్రికెట్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గాయాల సమస్యను ఎదుర్కొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంలా కాకుండా ‘ఆస్పత్రి వార్డు’ను తలపిస్తోంది. జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు అక్కడే చికిత్స పొందుతున్నారు.మైదానంలో మెరుపులు మెరిపించాల్సిన మన స్టార్ క్రికెటర్లు సీఓఈలో గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం సీఓఈలో ఉన్న ఆటగాళ్లతో ఒక జట్టునే తాయారు చేయొచ్చు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో అత్యవసర భేటీకి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. దైనిక్ జాగరణ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం 13 మంది భారత క్రికెటర్లు సీఓఈలో ఉన్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా టాప్ క్రికెటర్లు ఉన్నారు.జస్ప్రీత్ బుమ్రాపేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఎడమ మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. మోకాలి కీలులో చేరిన వాటర్‌ను తొలగించి జాయింట్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ రన్నింగ్, డ్రిల్స్ చేసే సమయంలో మోకాలిలో అతడికి ఇంకా నొప్పి ఉంది. పూర్తి స్థాయి బౌలింగ్ వర్క్‌లోడ్‌ను తట్టుకునే స్థితిలో అతడు లేడు. దీంతో జస్ప్రీత్ లంక టూర్‌కు దూరమయ్యాడు.హార్దిక్ పాండ్యా ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్తేమి కాదు. ఈ బరోడా క్రికెటర్ జట్టులో కంటే ఎక్కువగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు అతడు ఇంకా జాతీయ జట్టులోకి తిరిగి రాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే అతడు తొడ కండరాల గాయం కారణంగా సీఓఈలో చేరాడు. అయితే అతడు వేగంగా కోలుకోవడంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ సిరీస్ ఆరంభానికి ముందు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. దీంతో అతడు అఫ్గాన్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమయ్యాడు. అయితే తాజాగా మళ్లీ అతడు కుడి కాలి పిక్క గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్, బౌలింగ్ ఆపేయాలని డాక్టర్లు సూచించారు.వాషింగ్టన్ సుందర్తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడి కుడి కాలి తొడ కండరానికి గాయమైంది. దీంతో స్వదేశంలో అఫ్గాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లకు వాషీ దూరమయ్యాడు.అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని ప్రధాన జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో శ్రీలంక టూర్‌కు కూడా సుందర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.సాయిసుదర్శన్ యువ బ్యాటర్ సాయిసుదర్శన్ కూడా సీఓఈలో ఉన్నాడు. కుడి కాలి బొటనవేలి నొప్పి తగ్గకపోవడంతో అతడిని శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి తప్పించారు.శుబ్‌మన్ గిల్భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తాజాగా ఈ జాబితాలోకి చేరాడు. శ్రీలంకతో టెస్టులకు ముందు ప్రాక్టీస్ లో గిల్ కుడిచేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్య భాగంగా వార్మాప్ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగలేదు. రాహుల్ భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.వీరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి (ఎడమ తొడ కండరాల గాయం), హర్షిత్ రాణా (కుడి తొడ కండరాల గాయం), ఆకాశ్ దీప్(వెన్ను గాయం), వరుణ్ చక్రవర్తి(ఎడమ తొడ కండరాల గాయం), రియాన్ పరాగ్ ( భుజం గాయం), సుయాష్ శర్మ(మోకాలి గాయం), యుధ్వీర్ సింగ్(కుడి భుజం గాయం), అశోక్ శర్మ( వెన్ను గాయం)లు కూడా తమ తమ గాయాల నుంచి కోలుకుంటున్నారు. -
వీవీఎస్ లక్ష్మణ్‌తో సైకియా భేటీ.. కారణం ఇదే!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా.. హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆదివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హుటాహుటిన ఆయన బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా టీమిండియా గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.స్టార్ ఆటగాళ్లంతా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. అదే విధంగా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్.. బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయాల నుంచి కోలుకోలేదు.ఇక తొడకండరాల నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా పరిస్థితిలో ఏమాత్రం పురోగతి లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేవజిత్ సైకియా బెంగళూరుకు వెళ్లి లక్ష్మణ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ వర్గాలు తాజాగా పీటీఐకి వెల్లడించాయి.‘‘అవును.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బెంగళూరులో వీవీఎస్ లక్ష్మణ్‌తో భేటీ అవుతారు. ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆన్లైన్లో ఈ భేటీలో పాల్గొంటారనే సమాచారం ఉన్నా.. స్పష్టత మాత్రం లేదు.ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యల గురించి సైకియా- లక్ష్మణ్ చర్చిస్తారు. ఇద్దరూ కలిసి మీడియా ఎదుటకు వచ్చి అన్ని ప్రశ్నలకు బదులిస్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), టీమిండియా సెలక్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండానే.. వారిని రిలీజ్ చేయడం సరికాదని సెలక్టర్లు హితవు పలికినట్లు సమాచారం. ఇటీవల హర్షిత్ రాణా.. తాజాగా బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఫిట్నెస్ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకలేదని తెలుస్తోంది.దీంతో వారిని తొలుత పలు సిరీస్‌లకు ఎంపిక చేసి.. ఆ తర్వాత వారి స్థానాలను వేరే వారితో భర్తీ చేయడంలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని CoE దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బుమ్రా, సుదర్శన్ రిలీజ్ చేయడం వల్ల జట్టు ఎంపిక సమయంలో క్లారిటీ లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
గిల్‌కు గాయం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.ఫైనల్ రేసులో ఉండాలంటే గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.గిల్‌కు గాయంకాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి పరిశీలించి బాండ్‌ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే, శ్రీలంక ఎలెవన్‌తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు.బీసీసీఐ అధికారిక ప్రకటనఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమైంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో వామప్ మ్యాచ్‌లో తొలిరోజు గిల్ మైదానంలోకి రాడు. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
వాళ్ళకి దూరంగా ఉండు లేదంటే.. బుర్డోడికి ఉతప్ప వార్నింగ్
-
క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?
-
బీసీసీఐ పెన్షన్ ఎంత.. ఎవరెవరికి వస్తుంది..?
అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ పథకం మరోసారి చర్చలోకి వచ్చింది. 2004లో ప్రారంభమైన ఈ పథకంలో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర అధికారులు ప్రయోజనం పొందుతున్నట్లు సమాచారం.మొదటల్లో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన మాజీ క్రికెటర్లకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించేవారు. 2022లో బీసీసీఐ పెన్షన్ మొత్తాలను భారీగా పెంచింది. దీంతో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, అధికారులు లబ్ది పొందారు.ప్రస్తుతం క్రికెటర్ల నెల పెన్షన్ ఎంత..?25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన పురుష క్రికెటర్లు- రూ.70,000ఇతర మాజీ పురుష టెస్టు క్రికెటర్లు- రూ.60,000మాజీ మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు- రూ.52,5002003కు ముందు రిటైరైన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు- రూ.45,000ఇతర మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు- రూ.30,000జీవితాంతం వస్తుందా..?అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, పెన్షన్ సాధారణంగా శాశ్వతంగా రద్దు కాదు. అయితే మాజీ క్రికెటర్ లేదా అధికారి బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘంలో జీతభత్యాలు తీసుకునే పదవిలో చేరితే, ఉదాహరణకు కోచ్, సెలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ వంటి బాధ్యతలు చేపడితే, పెన్షన్ చెల్లింపులో తాత్కాలిక విరామం ఉండవచ్చు.పెన్షన్ పొందుతున్న ప్రముఖ క్రికెటర్లు..?పెన్షన్ పొందుతున్న మాజీ క్రికెటర్ల జాబితాను బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, పెన్షన్ అర్హత ఉన్న ప్రముఖ మాజీ క్రికెటర్లలో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి వారు ఉంటారు.అజింక్య రహానేకు ఎంత..?రహానే భారత్ తరఫున 85 టెస్టులు ఆడాడు. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అత్యధిక రూ.70,000 నెలవారీ పెన్షన్ బ్రాకెట్‌కు అర్హత పొందుతాడు. -
‘వాళ్లిద్దరికి పడట్లేదు.. నువ్వు టీమిండియా కోచ్‌గా రావాలి’
భారత దిగ్గజ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్‌కోచ్‌గా తనకు గతంలో అవకాశం వచ్చిందని.. అయితే, తనకు స్వేచ్ఛనిస్తేనే ఈ పనిచేస్తానని యాజమాన్యంతో కరాఖండిగా చెప్పినట్లు తెలిపాడు.కాగా 2017లో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే, కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి మధ్య విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కోచ్‌గా తనకు ఆఫర్ వచ్చిందని సెహ్వాగ్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. క్రికెట్నెక్ట్స్తో మాట్లాడుతూ..వాళ్లిద్దరికి పడట్లేదు‘‘ఆరోజు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, కెప్టెన్ విరాట్ కోహ్లి గనుక నన్ను సంప్రదించకపోయి ఉంటే.. నేను అస్సలు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసేవాడినే కాదు. అమితాబ్ నాతో అధికారికంగా సమావేశం నిర్వహించాడు. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లికి పడటం లేదని.. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని చెప్పాడు.నువ్వు టీమిండియా కోచ్‌గా రావాలిఅందుకే నేను కోచ్‌గా రావాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ 2017 తర్వాత అనిల్ కాంట్రాక్టు ముగిసిపోతుందని.. ఆ వెంటనే వెస్టిండీస్ పర్యటన నుంచి నేను బాధ్యతలు చేపట్టాలని సూచించాడు. అయితే, నేను అప్పుడు యస్ అని గానీ.. నో అని గానీ చెప్పలేదు. నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదుఒకవేళ నేను కోచ్‌గా వస్తే మాత్రం నేను కోరుకున్న సహాయక సిబ్బందినే నియమించాలని చెప్పేవాడిని. అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, ట్రైనర్.. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో నా ఛాయిస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరేవాడిని. కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే నేను వెళ్లలేదు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా 2017 జూన్‌లో కుంబ్లే హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో సంజయ్ బంగర్ నాడు తాత్కాలిక కోచ్‌గా వచ్చాడు. ఇక ఆ తర్వాత జూలై 2017 నుంచి 2021 వరకు రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా పనిచేశాడు.ఇక రవిశాస్త్రి- కోహ్లి నేతృత్వంలో టెస్టు ఫార్మాట్లో టీమిండియా మంచి విజయాలు అందుకుంది. ఇదిలా ఉంటే.. భారత విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన సెహ్వాగ్.. టెస్టుల్లో 8586, వన్డేల్లో 8273, టీ20లలో 394 పరుగులు సాధించాడు.చదవండి: గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు! -
గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వైఖరి పట్ల సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన సంగతి తెలిసిందే.ఘోర పరాభవాలుఈ క్రమంలో బీసీసీఐ ఏరికోరి గంభీర్‌తో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసింది. అయితే, అతడి మార్గదర్శనంలో విజయాల మాట పక్కనపెడితే.. టీమిండియా ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. ముఖ్యంగా టెస్టుల్లో సొంతగడ్డ మీదే న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో వైట్‌వాష్ అయింది.ఇటీవల టీ20 సిరీస్‌లో పసికూన ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయింది. అయితే, భారత జట్టు ఇలా అవమానకర రీతిలో పరాజయాల పాలైనప్పుడు గంభీర్.. ఆ తప్పును ఆటగాళ్లు లేదంటే సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నాడనే భావన జట్టు అంతర్గత సభ్యుల్లో నిండిపోయినట్లు సమాచారం.తప్పంతా మాపైనే నెట్టేస్తారా?ఏ ఒక్క ఓటమికి కూడా గంభీర్ జవాబుదారీగా ఉండకుండా తప్పంతా తమపైనే నెట్టేయడాన్ని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అపెక్స్ సభ్యులకు వీరు అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు క్రిక్‌బ్లాగర్ పేర్కొంది.ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దల్లో కొంతమంది గంభీర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ అతడికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాల్లో తలదూర్చడం సరైన పద్ధతి కాదనే యోచనలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.అసంతృప్తి, సందేహాలుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్ కోచింగ్ శైలి, అతడి తీరు పట్ల కొంతమంది సీనియర్ క్రికెటర్లు బీసీసీఐ అపెక్స్ మండలి వద్ద అసంతృప్తి, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, అనధికారికంగానే వారు ఈ ఫిర్యాదు చేశారు. కాబట్టి శ్రీలంక పర్యటన నేపథ్యంలో గంభీర్‌పై పెద్దలు దృష్టి సారించారు’’ అని పేర్కొన్నాయి.లంక టూర్లో రాణిస్తేనే..కాగా ఆగష్టు 15-28 మధ్య టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే. ఒకవేళ ఇక్కడ ప్రతికూల ఫలితం వస్తే గనుక గంభీర్ భవితవ్యం (టెస్టు కోచ్‌గా) ప్రశ్నార్థకంగా మారనుంది. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాతే తొలిసారి భారత్ కనీసం డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కూడా చేరకుండా నిష్క్రమించింది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
ఆసీస్, ఇంగ్లండ్ వల్ల కాలేదు.. చరిత్ర సృష్టించిన బీసీసీఐ!
భారత ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. రహానే సీనియర్ టెస్టు క్రికెటర్ కావడంతో, అతడు నెలకు పెన్షన్ కింద రూ. 70వేలు అందుకోనున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే క్రికెట్ చరిత్రలో బీసీసీఐ (భారత్), ఈసీబీ (ఇంగ్లండ్), క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ సంపన్న బోర్డులుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు బోర్డుల్లో బీసీసీఐ మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు గౌరవ వేతనం కింద పెన్షన్ అందిస్తుండడం విశేషం.అటు ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ తమ మాజీ ఆటగాళ్లకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. బీసీసీఐ అందిస్తున్న పెన్షన్ విధానాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం.బీసీసీఐ కల్పిస్తున్న పెన్షన్ వివరాలు👉మాజీ క్రికెటర్లు: నెలకు రూ. 58,750👉టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 60 వేలు👉సీనియర్ టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 70 వేలు👉ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: నెలకు రూ. 30 వేల నుంచి 45వేలు👉అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 52,500👉దేశవాళీ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 45వేలుఇక దేశవాళీ క్రికెట్లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెటర్లకు పెన్షన్‌తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా తమ మాజీ క్రికెటర్లకు తమకు తోచినంత పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 🔴 NO AUSTRALIA, NO ENGLAND- ONLY BCCI PAYS CRICKETERS AFTER RETIREMENT 🤯- Cricket Australia: No pension system- England Cricket: No pension systemBCCI: Pays an avg pension of ₹58,750/month to former cricketers.Current BCCI pension structure:- Test cricketers:… pic.twitter.com/HM0Y3aBMqr— Sam (@cricsam02) August 3, 2026Read: ప్రేమకు ఎండ్‌కార్డ్.. గర్ల్‌ఫ్రెండ్‌తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే? -
తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు!
ఇటీవలి కాలంలో టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. కీలక ఆటగాళ్లంతా జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. జట్టు విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2026 తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు, అయితే, గాయం వల్ల టూర్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. పాండ్యా మాదిరే అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డాడు.యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇటీవలే ఈ గాయాల జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.ఫిజియోథెరపీ టీమ్‌లో సమూలంగా మార్పులు చేపట్టేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంజూరీ మేనేజ్మెంట్, ఫిట్నెస్ క్లియరెన్స్‌ల విషయంలో స్పష్టత లేదని.. ఇందుకు హెడ్ ఫిజియోథెరపిస్ట్ నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు క్లియరెన్స్ సర్టిఫికెట్తో తిరిగి వచ్చిన తర్వాత.. ఆ వెంటనే మళ్లీ గాయాల బారిన పడటాన్ని ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్ ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్, టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కమలేశ్ జైన్ విషయంలో మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడటం వల్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తమ తుదిజట్టు కూర్పులో ఇబ్బంది పడుతున్నారు.పదిహేను మంది సభ్యులు ఉన్నప్పటికీ సరైన కాంబినేషన్‌ని సెట్ చేయలేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాయాల విషయంలో సిబ్బంది పూర్తి అవగాహన, స్పష్టతతో ఉండాలి. ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి పంపేందుకు తొందరపడకూడదు.వారు పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే సర్టిఫికెట్ జారీచేయాలి. హడావుడిగా రంగంలోకి దించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి తొందరపాటు చర్యలు కీలక సమయంలో జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయి. అందుకు సదరు బృందం కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిందే. వారి నుంచి సరైన వివరణ లభించకపోతే వేటు తప్పకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా ఆటగాళ్లు తరచూ గాయపడటం పట్ల టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఒకటి, రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లు గాయపడితే.. వన్డే వరల్డ్‌కప్-2027 వంటి మేజర్ టోర్నీలో తమకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఫిట్నెస్ సమస్యలు మెరుగుపరచుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. చికిత్స కోసం బయటి డాక్టర్లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా గిల్ తరచూ మెడనొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్‌తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటారని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్‌కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ వ్యాఖ్యల ను బట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారి కనిపించాడు. షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్దరి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్‌కోచ్‌గా గంభీర్, సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంతయ్యింది.🚨 Ajit Agarkar breaks silence on Mohammed Shami .🚨🔹We've picked our group of 15 fast bowlers for the future and want to give young players more opportunities ahead of the World Test Championship and the 2027 ODI World Cup.Shami has been one of India's finest match-winners… pic.twitter.com/p0mEPybruS— Indian cricket (@Cricketpaglu45) August 1, 2026చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు! -
ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన
మహిళల ఆసియా కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ప్లేయర్లకు చోటు దక్కింది.శ్రేయాంక పాటిల్‌కు చోటు లేదుటీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆమె కుడి చీలమండకు గాయమయ్యింది. శ్రేయాంక స్థానంలో టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్ ఆసియా కప్ జట్టులోనూ కొనసాగింది. ఇదే జట్టులో జరిగిన ప్రధాన మార్పు.భారత మహిళల ఆసియా కప్ 2026 జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.కాగా, ఆసియా కప్ 2026 సెప్టెంబర్ 17న మొదలై 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీ ఫిక్చర్స్ ఇంకా ఖరారు కాలేదు. -
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రహానే ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.అతడి సారథ్యంలోనే భారత్ 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.రహానే పెన్షన్ ఎంతంటే?బీసీసీఐ మాజీ క్రికెటర్లను వారి అనుభవం, ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా మూడు విభాగాలగా విభజించింది. అత్యధికంగా 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు టాప్ కేటగిరీకి వస్తారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.70,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ. 50,000 దక్కేది. కానీ 2022లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని రూ.70,000కు పెంచాడు. ఇప్పుడు భారత్ తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే, అత్యున్నత పెన్షన్ స్లాట్‌లో ఉన్నాడు. అతడికి ప్రతీ నెల రూ.70,000 పెన్షన్ లభించనుంది. ఇక దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. -
అగార్కర్ అవుట్.. అశ్విన్ ఇన్ ఇక హిట్ మ్యాన్ ను ఆపేదెవరు
-
ఓ శకం ముగిసింది! క్రికెట్‌కు రహానే గుడ్‌బై.. అభిమానులు ఎమోషనల్
-
కొడితే సిక్స్ పడాల్సిందే.. వైభవ్ కీలక వ్యాఖ్యలు
-
పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఊహించిన విధంగానే, దక్షిణాఫ్రికా టెస్ట్ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన, ఆఫ్ఘనిస్తాన్పై సాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ , ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మరోవైపు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. పంత్‌కు బ్యాకప్‌గా ప్రతీ సిరీస్‌కు ఎంపికవుతూ వస్తున్న ధ్రువ్ జురేల్ సిరీస్ సిరీస్‌కు రాటుదేలుతూ పంత్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యాడనిపిస్తోంది. టెస్టు క్రికెట్లో ఇప్పటికైతే టీమిండియా వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యత పంతకే ఉన్నప్పటికీ, జురేల్ రాకతో పోటీ తీవ్రమయింది. జురెల్ తనకు అవకాశాలు వచ్చినప్పుడల్లా బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనుక కూడా నిలకడ ప్రదర్శిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో పడ్డాడు.Photo Credit: BCCI Twitterఈ నేపథ్యంలోనే పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి జురెల్ నిజంగా అర్హుడేనా అని చూస్తే మాత్రం తొలి 10 టెస్టుల్లో పంత్ 727 పరుగులు చేస్తే, ధ్రువ్ జురెల్ 478 పరుగులు సాధించాడు. అయితే పంత్ టెస్టుల్లో ప్రధానంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ జురెల్ జట్టులో ఉంటే అతడి బ్యాటింగ్ స్థానం ఆరు లేదా ఏడు. దీనివల్ల జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లంతా ఔటైన తర్వాత కానీ ధ్రువ్ జురెల్‌కు అవకాశం రావడం లేదు. దీంతో అతడు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడేందుకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఒత్తిడి పరిస్థితులు ఉన్నప్పుడు సంయమనం పాటించడంలో పంత్‌తో పోలిస్తే జురెల్ ఒక మెట్టుపైనే ఉంటాడు. ఇక జురెల్‌తో పోలిస్తే పంత్ ప్రతీ 100 బంతులకు 18 పరుగులు వేగంగా సాధించడంలో దిట్ట. ఇంగ్లండ్‌లో జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియాలో నాథన్ లయన్ ఇలా విదేశీ గడ్డపై ఎలాంటి బౌలర్లనైనా తన దూకుడైన బ్యాటింగ్‌తో పరుగులు సాధించడంలో ముందుంటాడు. అయితే పంత్‌తో పోలిస్తే ధ్రువ్ జురెల్ది పూర్తిగా భిన్నమైన బ్యాటింగ్. టెక్నికల్‌గా బ్యాటింగ్ ఆడడంలో నేర్పరి అయిన ధ్రువ్ జురెల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌లు నిర్మించడంలోనూ జురెల్ ముందు వరుసలో ఉంటాడు.బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే, వికెట్‌కీపింగ్ నైపుణ్యంలో మాత్రం పంత్, జురెల్ సమానంగానే కనిపిస్తున్నారు. పది టెస్టుల తర్వాత పంత్ వికెట్ల వెనుక 47 డిస్మిసల్స్ చేస్తే, జురెల్ 15 నమోదు చేశాడు. ఇది పంత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, పంత్ కీపర్‌గా లేని 10 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు. అదీగాక జురెల్ తుదిజట్టులో ఉన్నప్పటికీ, అనేక మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ లేదా పంత్‌లో ఒకరు గ్లోవ్స్ చేపట్టేవారు. అయితే 2026లో దేశీయంగా జురెల్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, విదేశీ పర్యటనలన్నింటిలోనూ పంత్‌కు ప్రత్యామ్నాయంగా జురెల్‌ను ఎంపిక చేస్తూ ఉండడం, అతడి వికెట్‌కీపింగ్ సామర్థ్యాలపై యాజమాన్యానికి నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది.Read: ‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’ -
BCCI నుంచి వైభవ్‌కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్!
-
బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్లో వయో మోసాన్ని (Age Fraud) అరికట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది. ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది.పత్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమార్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.ఇకపై అన్ని వయో విభాగాల క్రికెటర్లకు బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో వయో మోసం ఆరోపణలతో రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్, మంజోత్ కల్రా, నితీష్ రాణా వంటి పలువురు ఆటగాళ్లు బీసీసీఐ చర్యలను ఎదుర్కొన్నారు.ఆధార్‌లో చిరునామా మార్చాలిఅలాగే 2026-27 సీజన్‌కు రాష్ట్ర సంఘాన్ని మార్చుకోవాలనుకునే ఆటగాళ్లు సెప్టెంబర్ 1లోపు తమ ఆధార్ కార్డులో చిరునామాను నవీకరించి బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాతే వారు కొత్త రాష్ట్రం తరఫున ఆడేందుకు అర్హత పొందుతారు. -
రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దశాబ్దంన్నర పాటు భారత క్రికెట్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రహానే ఇటీవలే ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వయసు మీదపడడం, ఫామ్ లేమి, జట్టులో యువకుల రాక పెరగడం వెరసి రహానే క్రమంగా టీమిండియాకు దూరమవుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్లో మాత్రం రహానే ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే వచ్చే ఐపీఎల్ సీజన్లో మనకు మరోసారి కనిపించొచ్చు. ఇదిలా ఉంటే రహానే రిటైర్మెంట్ పోస్టుపై బీసీసీఐ తొలిసారి తన స్పందన వ్యక్తం చేసింది. భారత క్రికెట్‌కు రహానే అందించిన సేవలకు కృతజ్క్షతలు తెలుపుతూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. 'ఒక అద్భుతమైన కెరీర్ ముగిసింది. క్రికెటర్‌గా భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు అజింక్య రహానే. క్రికెటర్‌గా మీరు సాధించిన అద్భుత విజయాలు ఒక జ్ఞాపకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. రిటైర్మెంట్ తర్వాతి చాప్టర్‌కు ‘ఆల్ ది బెస్ట్ రహానే'’ అంటూ బీసీసీఐ ఎమోషనల్ ట్వీట్ చేసింది..15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్‌ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్‌లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. రహానేకు టెస్టు కెప్టెన్‌గా అజేయమైన రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీని రహానే సారథ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై టెస్టు విజయం, 2018లో అఫ్గానిస్తాన్‌పై విజయంలో రహానే కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలకపాత్ర పోషించాడు. An illustrious career comes to an end 🇮🇳Thank you @ajinkyarahane88 for your immense contribution to Indian cricket and all the memories that will be cherished forever Wishing you the very best in your next chapter #TeamIndia | #ThankYouAjinkya pic.twitter.com/Gbi7sIcgwS— BCCI (@BCCI) July 30, 2026 AJINKYA RAHANE IN TEARS 🥹- The moment ajji announced his retirement, Cap 278 Signing off forever 🥹❤️ pic.twitter.com/jgCCXh8kv8— Sam (@cricsam02) July 30, 2026Read: జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం -
శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అతడి కండరాలు పట్టేస్తున్నాయి. తరచూ మెడ నొప్పి కారణంగానూ అతడు ఇబ్బంది పడుతున్నాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగానూ గిల్ అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న వేళ కండరాల నొప్పితో గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు, ఐపీఎల్ సందర్భంగా మెడ నొప్పితో మ్యాచ్‌లు మిస్సయ్యాడు.అక్కడ ఎలా ఆడగలరు?విరామం లేని షెడ్యూల్, ఒత్తిడి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ఇక రానున్న ఏడాది కాలంలో టీమిండియా మరింత బిజీ కానుంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2027 వంటి మేజర్ ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల గురించి గిల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయపడి.. జట్టుకు దూరమయ్యే వాళ్లు వరల్డ్‌కప్‌లో వరుసగా ఏడు- ఎనిమిది మ్యాచ్‌లు ఎలా ఆడగలరని ప్రశ్నించాడు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయంఅయితే, స్వయంగా గిల్ సైతం గాయాల బారిన పడటాన్ని ఇంగ్లండ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నించాడు. డెబ్బై పరుగులు చేయగానే కండరాలు పట్టేయడం.. మైదానం నుంచి నిష్క్రమించడం గిల్‌కు అలవాటైపోయిందని విమర్శించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. ఫిట్నెస్ సమస్యలకు పరిష్కారం కనుగొనే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల వద్ద గిల్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..‘‘చాన్నాళ్లుగా గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని భావించాడు. అందుకే బీసీసీఐ వైద్యబృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: 30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై! -
'స్టార్ ప్లేయర్స్‌నే భయపెట్టాడు.. అయినా జట్టులో నో ఛాన్స్'
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్ నబీకి మరోసారి నిరాశే ఎదురైంది. అతడిని జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లకు సెలక్టర్లు అవకాశం కల్పించినప్పటికి.. గత రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన నబీకి మాత్రం చోటు దక్కక పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు."ఆకిబ్ నబీని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే తెలియదు. అతడి వద్ద పేస్ తక్కువగా ఉండడంతోనే సెలక్ట్ చేయలేదని చాలా మంది చెబుతున్నారు. వాస్తవానికి పేస్‌తో పనిలేదు, ఒక బౌలర్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడా? లేదా అన్నది ముఖ్యం. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే నబీ టాలెంట్‌ను మనం చూశాం. రంజీ సీజన్ అసాంతం అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతడు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ బ్యాటర్‌ను సైతం ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అతడి ప్రదర్శనకు తగిన గుర్తింపు దక్కాల్సిందే. అతడు మంచి రిథమ్‌లో ఉన్నాడు. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను జమ్ముకాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. ఫైనల్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడు ఇప్పటివరకు 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 18.63 సగటుతో 162 వికెట్లు పడగొట్టాడు. అందులో పదిహేను ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం. -
టీమిండియాకు కొత్త కోచ్‌గా శుభదీప్ ఘోష్.. ఎవరీ ఈయన?
-
నా కల నెరవేరింది.. వైభవ్ ఎమోషనల్ కామెంట్స్
-
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాన్ష్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్‌లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్‌కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్‌తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే! -
కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!
జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా కోచ్ మార్పు అంశం సోమవారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. గంభీర్‌ను తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తిస్థాయి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. రోజంతా ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ కూడా జరిగింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్నజట్టే అయినప్పటికీ, లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటబట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనుక వీవీఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక నాలుగు అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది.స్థిరమైన ఓపెనింగ్ జోడిఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున అభిషేక్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. వైభవ్ ఈ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. రెండు అర్ధసెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎగరేసుకుపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కోచ్‌గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇచ్చి స్థిరమైన ఓపెనింగ్ జోడిని కొనసాగించాడు.ముగ్గురు పేసర్లతో బరిలోకియూకే పర్యటనలో కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్లను ఉపయోగించిన తీరు విమర్శలకు దారి తీసింది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై అనవసర ప్రయోగాలకు పోయి స్పిన్-ఆల్‌రౌండర్ల కలయికపై ఎక్కువగా ఆధారపడి గంభీర్ చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో మొత్తం ఐదుగురిలో ఒకే ఒక పేసర్‌ను ఆడించడం గమనార్హం. ఇక వన్డే సిరీస్‌లోనూ గంభీర్ వ్యూహాలు పనిచేయలేదు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం లక్ష్మణ్ గంభీర్‌కు విరుద్ధంగా వ్యవహరించాడు. టీ20 సిరీస్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడాలని నిర్ణయించిన లక్ష్మణ్.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ సేవలు వినియోగించుకొని అద్భుత ఫలితాలు రాబట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్‌పై నమ్మకముంచిన లక్ష్మణ్ అవకాశాలిచ్చాడు. దీంతో మయాంక్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.ఆల్‌రౌండర్ల వినియోగంఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రానాలకు గంభీర్ తుది 11 మందిలో చోటిచ్చాడు. దీని ఫలితంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ లోపించడంతో పాటు, తన నాలుగు ఓవర్ల కోటాను నమ్మకంగా పూర్తి చేయగల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కూడా ఏర్పడింది. కానీ లక్ష్మణ్ మాత్రం కేవలం ఒక్క ఆల్‌రౌండర్‌కే చోటు కల్పించాడు. తొలి రెండు టీ20ల్లో శివమ్ దూబేను ఆడిపించిన లక్ష్మణ్ చివరి టీ20 మ్యాచ్‌కు సూర్యాంశ్ షెడ్గేను చాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల జట్టులో ఒక పూర్తిస్థాయి బ్యాటర్‌కు అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్‌కు అవకాశం కల్పించినట్లయింది. రింకూ సింగ్ ఫినిషర్‌గా, రవి బిష్ణోయ్ స్పిన్నర్‌గా తమ పాత్రను సమర్థంగా పోషించారు.ఆటగాళ్లపై నమ్మకంజింబాబ్వేలో భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సమయంలో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ వారికి అండగా నిలిచాడు. కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి స్థానంలో, చివరి నిమిషంలో బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక క్లిష్టమైన టీ20 మ్యాచ్‌లో బిష్ణోయ్ అధిక ఎకానమీ రేటుతో ఇబ్బంది పడ్డాడు.అయినప్పటికీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడించి ఫుంజుకోవడానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో రవి బిష్ణోయ్ మొత్తంలో 5.667 సగటు ఎకానమీతో 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.చదవండి: శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. ఇక ఏడాది తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్ జైన్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా గాయానికి గురైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని భావించినప్పటికీ, అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. మరో ఆల్‌రౌండర్ నితీశ్ రానాతో పాటు పేసర్ హర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లంక టూర్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.టెస్టు మ్యాచ్ సిరీస్:ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలేఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబోభారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్. 🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced Note: Washington Sundar was not available for selection for the first Test. More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj— BCCI (@BCCI) July 28, 2026చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్‌బాల్ సిరీస్‌కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్‌కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్‌లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్‌కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్‌లో ఆతిథ్య లంక జట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్‌కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’ -
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్‌లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్‌లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్‌గా 2026 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్నాడు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్‌కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్‌గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్‌ను తొలగించి లక్ష్మణ్‌ను కోచ్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌కు హెడ్‌కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్‌లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్‌పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్‌పై 1-0తో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్‌గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు! -
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్‌లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్‌లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్‌లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్‌లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్‌గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్‌దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్‌కోచ్‌గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్‌ను ట్రోల్స్‌కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్‌తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్‌కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
అది వాళ్ల నిర్ణయం: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.బ్యాట్‌తోనే సమాధానంవన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ను కూడా మెరుగుపరచుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేనే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది.అయితే, ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని తేలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మెరుపు శతకం (138)తో చెలరేగి విమర్శకులకు రోహిత్ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తాను ఇప్పట్లో రిటైర్ కానని.. తాను ఆడినంత కాలం ఇలాంటి వదంతులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.నిప్పు లేనిదే పొగ రాదుబీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ‘‘నిప్పు లేనిదే పొగ రాదు.. ఏదో జరిగే ఉంటుంది’’ అని అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లదే అంతిమ నిర్ణయంయూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమానికి హాజరైన రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో రోహిత్ అంతర్భాగం. అతడి ఆట కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ గురించి వస్తున్న వార్తలకు అసలు అర్థమే లేదు.ఇప్పట్లో అతడు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, జట్టులో ఎవరు ఉండాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో సెలక్టర్లదే అంతిమ నిర్ణయం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో టీమిండియా వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘టీమిండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది. మ్యాచ్‌లు గెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో నాయకత్వ బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.వరుస పరాజయాల తర్వాత..కాగా టీ20 సిరీస్‌లలో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ 1-2తో ఓటమిపాలైంది. దీంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు రాగా.. రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకత్వ బృందానికి మద్దతుగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు.. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. అఫ్గాన్‌కు షాక్! -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్‌బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్‌కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్తాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్‌కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్‌లో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్‌పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్‌గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు -
బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. Photo Credit: BCCI Twitterఅయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్‌వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్‌తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్‌లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
AUS vs ENG: భారత్‌లో యాషెస్ టెస్టు మ్యాచ్!
క్రికెట్లో అత్యంత ప్రాచీన, ప్రతిష్టాత్మక, చరిత్రాత్మక సిరీస్‌లలో యాషెస్ టెస్టు సిరీస్ ఒకటి. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ పోరు 1882లో మొదలైంది. నాటి నుంచి ప్రతి రెండేళ్లకొకసారి ఇరుజట్ల మధ్య ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)లో భాగంగా జరిగే ఈ సిరీస్‌కు ఆసీస్, ఇంగ్లండ్ చెరోసారి ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. అయితే, ఈ చారిత్రక సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ను భారత గడ్డపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) సంకేతాలు ఇచ్చింది.బీసీసీఐతో అనుబంధంఆసీస్ క్రికెట్ బోర్డు సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ ఈ విషయం గురించి బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మా బంధం బలమైనది. అదే విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయి.ఇండియాలో యాషెస్ మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడే దీని గురించి మేమేమీ ప్రణాళికలు రచించడం లేదు. కానీ ఈ అంశం అయితే మా పరిశీలనలో ఉంది. ఆసీస్- ఇంగ్లండ్- ఇండియా మధ్య టెస్టు క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు జట్ల మ్యాచ్‌లకు అభిమానులు ఉన్నారు. వారిని అలరించడం కోసం.. టెస్టు క్రికెట్ అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని గ్రీన్బర్గ్ స్పష్టం చేశారు.డిసెంబరులో బీబీఎల్ మ్యాచ్ఆసీస్ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (BBL) తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మెల్బోర్న్ రెనెగేడ్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య డిసెంబరు 12, 2026న ఈ మ్యాచ్ జరుగనుంది.యాషెస్ 2027 షెడ్యూల్ ప్రకటనఅదే విధంగా.. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. యాషెస్ 2027 షెడ్యూల్‌ను ఈసీబీ ఇటీవలే ప్రకటించింది. జూన్ 18- ఆగష్టు 2 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ మైదానాలు ఇందుకు వేదికలు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియాకు 2029-2030 సైకిల్లో ఆతిథ్య హక్కులు వస్తాయి. కాబట్టి అప్పటికి భారత్‌లో ఒక మ్యాచ్ నిర్వహించినా ఆశ్చర్యం లేదు.చదవండి: వైభవ్ మెరుపులు -
అతడికి 2 నెలలే డెడ్‌లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్‌గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్‌గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్‌ను సెలెక్టర్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్‌కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్‌ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్‌లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్‌గా అగార్కర్‌పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు. అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌కు కూడా దూరంగా ఉన్నాడు.ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్‌ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌కు 2-0తో కోల్పోయింది.చదవండి: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’ -
జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలి.. రోహిత్ రిటైర్మెంట్ పై యూవీ కీలక వ్యాఖ్యలు
-
లంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశముంది. కాగా సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్‌లో ఒకరు ఈ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. ఇక బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్‌ను 2025 నవంబర్‌లో సౌతాఫ్రికాతో ఆడారు.గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది. అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్‌లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగ2ఆ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. 🚨 GOOD NEWS FOR TEAM INDIA 🇮🇳Jasprit Bumrah & Ravindra Jadeja set to play in the Test series vs Sri Lanka. [Sahil Malhotra from TOI]Test squad will be announced this week. pic.twitter.com/kAJ3m0tBqj— Johns. (@CricCrazyJohns) July 21, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త!
దేశవాళీ సీజన్‌కు (2026-27) ముందు బీసీసీఐ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించిన చట్టాలను ఐసీసీ అమలు పరచనున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు సమానంగా బీసీసీఐ కూడా దేశవాళీ టోర్నీల్లో ఆయా చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు అన్ని దేశీయ టోర్నీల్లో అంతర్జాతీయంగా ఉన్న రూల్స్ అన్ని అమల్లోకి రానున్నాయి. దేశవాళీ క్రికెట్లో మరింత పారదర్శకత, న్యాయంతో కూడిన క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలను తీసుకొచ్చినట్లు బీసీసీఐ తెలిపింది.చివరి ఓవర్ పూర్తి చేయాల్సిందేఇకపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రోజులో చివరి ఓవర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటి వరకు చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడితే అంపైర్లు ఆ రోజు ఆటను ముగించే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధన ప్రకారం వికెట్ పడినా మిగిలిన బంతులన్నీ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త బ్యాటర్ కూడా మిగిలిన బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త బ్యాటర్‌ను పంపకుండా సమయం వృథా చేసే అవకాశాన్ని నివారించడానికే ఈ మార్పు తీసుకొచ్చారు.ఉద్దేశపూర్వక నోబాల్ వేస్తే కఠిన చర్యలుకొత్త నిబంధనల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా నోబాల్స్ వేస్తే బౌలర్లపై కఠినచర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్ లేదా పిచ్‌పై పడకుండా డెలివరీ వేస్తే, అతడు ఆ ఇన్నింగ్స్‌కే కాదు, మొత్తం మ్యాచ్‌లోనే బౌలింగ్ చేసే హక్కును కోల్పోతాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అన్నది అంపైర్లే నిర్ణయిస్తారు.ఫీల్డర్ ముందే బంతిని అడ్డుకుంటే?బ్యాటింగ్ సమయంలో స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ వద్దకు చేరకముందే ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే, దానిని నోబాల్‌తో పాటు డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. అలాగే మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో జట్లు ‘డిక్లరేషన్’ లేదా ‘ఫోర్ఫిట్’ చేసే అవకాశాన్ని కూడా తొలగించారు.కోచ్‌లకు అనుమతి..వన్డే మ్యాచ్‌ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనున్నారు.దీంతో మ్యాచ్ మధ్యలోనే వ్యూహాలను మరింత సమర్థంగా చర్చించే అవకాశం జట్లకు లభించనుంది.షార్ట్ రన్‌పై స్పష్టతబ్యాటర్లు ప్రత్యర్థిని మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా పరుగు మధ్యలో తిరిగి వెనక్కి వస్తే, దానిని డెలిబరేట్ షార్ట్ రన్‌గా పరిగణించరు. కానీ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసుకుంటే, తదుపరి బంతిని ఏ బ్యాటర్ ఎదుర్కోవాలో నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు ఉండేలా నిబంధన తీసుకొచ్చారు.డెడ్ బాల్ రూల్‌లో మార్పుఇప్పటి వరకు బంతి బౌలర్ లేదా వికెట్‌కీపర్ చేతిలోకి వచ్చిన తర్వాతే సాధారణంగా డెడ్ బాల్‌గా పరిగణించేవారు. ఇకపై బంతి ఏ ఫీల్డర్ చేతిలో స్థిరంగా ఉన్నా లేదా మైదానంలో పూర్తిగా నిలిచిపోయినా దానిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.👉వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో లెగ్‌సైడ్ వైడ్ విషయంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బంతి విసిరే సమయంలో ఫీల్డర్లందరూ తప్పనిసరిగా బౌండరీ లైన్ లోపలే ఉండాలి. దీంతో బౌండరీ బయట నిలబడి ప్రయోజనం పొందే అవకాశానికి చెక్ పడుతుంది. అలాగే వికెట్‌కీపర్ బంతి డెలివరీ సమయంలో తప్పనిసరిగా వికెట్ వెనుకనే ఉండాలి.👉మ్యాచ్‌లో ఎవరైనా అక్రమ పరికరాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే, అంపైర్లు వాటి వినియోగాన్ని వెంటనే నిలిపివేసి సంబంధిత అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధనలను 2026-27 దేశీయ సీజన్ నుంచే అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.Read: గంభీర్ చేతుల్లో అతడి కెరీర్ కూడా నాశనమే! -
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్‌లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం -
దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం!
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోపీకి సంబంధించి వెస్ట్‌జోన్ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ వెస్ట్‌జోన్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా, ఉర్విల్పటేల్, హార్విక్ దేశాయ్‌లను వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్ ప్లేయర్లుగా జయ్ గోహిల్, ఆర్యా దేశాయ్, అర్షిన్ కులకర్ణి, విజయ్ జైస్వాల్, రాజ్‌వర్దన్ హంగ్రేకర్లకు చోటు దక్కింది.అయితే భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టోర్నీలో ఆడతాడని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు అతడిని దులీప్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఉన్న కారణంగానే జైస్వాల్‌ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఇక జైస్వాల్‌తో పాటు టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లను కూడా పక్కనబెట్టారు. అయితే శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లోనే ఎక్కువగా ఆడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా చాలా సేపు బ్యాటింగ్ చేయాల్సిన టెస్టు ఫార్మాట్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఇక టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. దులీప్ ట్రోఫీని అందుకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పటికీ, అతడిని ఎంపిక చేయలేదు. దీంతో 2026-27 రంజీ సీజన్లో ముంబై తరఫున సూర్యకుమార్ ఆడాలని భావిస్తున్నాడు. ఇక మరో సీనియర్ అజింక్య రహానేను కూడా సెలెక్టర్లు పక్కనబెట్టారు. టీమిండియా ఫ్యూచర్ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వెస్ట్ జోన్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షమ్స్ ములానీ (వైస్ కెప్టెన్), హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జయమీత్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్ధార్థ్ దేశాయ్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, అతిత్ షేత్, ముఖేష్ చౌదరి, తనుశ్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండేరిజర్వ్ ప్లేయర్లు: జే గోహిల్, ఆర్య దేశాయ్, అర్షిన్ కులకర్ణి, మహేష్ పిథియా, విశాల్ జైస్వాల్ మరియు రాజవర్ధన్ హంగర్గేకర్.చదవండి: మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి! -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్‌లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
రంగంలోకి జైషా..ఒక్క ఫోన్ కాల్ తో వణికిపోయిన గంభీర్, అగార్కర్
-
రోహిత్‌పైనే అందరి దృష్టి
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది. రో‘హిట్’ కొట్టేనా! గత రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్‌గా నిలచిన రూట్... భారత్‌పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్‌ను ఆపడం కష్టతరమే! బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. పిచ్ ఎలా ఉందంటే... లార్డ్స్‌లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఓవరాల్‌గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్. -
IND vs ENG: వాషీ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో హర్ష్ దూబేను ఎంపిక చేసినట్లు శనివారం ప్రకటించింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్- భారత్ చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. అర్ధ శతకాలతో రాణించితొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (80)తో కలిసి ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (52), వాషింగ్టన్ సుందర్ (57 )జట్టును గెలిపించారు. ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో వాషీ సిక్సర్ బాది విజయ లాంఛనం పూర్తి చేశాడు.గాయపడ్డ వాషీఅయితే, రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్ పరంగా అక్షర్ (1)తో పాటు వాషీ (2) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా వాషీ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్‌కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం అతడి గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది.జట్టులోకి హర్ష్ దూబేఈ నేపథ్యంలోనే వాషీ స్థానంలో యువ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా మహారాష్ట్రకు చెందిన హర్ష్ దూబే.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి రెండు వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ ప్లేయర్.. నాలుగు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ వేదిక.చదవండి: IND vs ENG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
‘లార్డ్స్ వన్డే ఆఖరిది కాదు’
న్యూఢిల్లీ: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్పై వాదోపవాదాలు నడుస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఇంగ్లండ్‌తో లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్‌కు చివరిదనే వాదనను బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా... అందులో ఆడాలని రోహిత్ భావిస్తుండగా... అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వన్డే కెరీర్‌పై శుక్రవారం సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్‌కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. కెప్టెన్ గా భారత జట్టుకు టి20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్... వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా... ఈసారి చిరకాల కల నెరవేర్చుకునేందుకు రోహిత్ మరో ఏడాది పాటు కెరీర్ కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు. -
రోహిత్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..LORDS లో రిటైర్మెంట్!
-
‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సీనియర్ విరాట్ కోహ్లి రియాక్షన్ ఆసక్తిగా మారింది. లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్‌కు ఆఖరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్‌ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్‌మాన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ నిజంగానే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈడ్కోలు పలుకుతాడా? లేదా అన్నది ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే ద్వారా తేలిపోనుంది. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ రిటైర్ అవ్వనున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లి, బుమ్రాలు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను సీరియస్‌గా వీక్షించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ పక్కపక్కనే కూర్చోవడం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'డ్రెసింగ్ రూమ్‌లో కోహ్లి, రోహిత్‌లు ఇలా పక్కపక్కన కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. రోహిత్ రిటైర్ అవ్వబోతున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి కోహ్లి దిగాలుగా కనిపిస్తున్నాడని, అతడి పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లుగా అనిపిస్తోందని, నిజమైన స్నేహం అంటే ఇదేనంటూ' కామెంట్ చేశాడు.ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్పై అటు హిట్‌మ్యాచ్ కానీ, ఇటు బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ కూడా రోహిత్ ఫామ్‌పై స్పందించాడే తప్ప అతడి రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొంతమంది అభిమానులు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడుతాడని, తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్‌తో మెరుస్తాడని జోస్యం చెబుతున్నారు. ఇక శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. Never seen Kohli and Rohit sit together in the dressing room like this. Kohli's looking concerned seems like that Rohit retirement news is actually true and he knows. pic.twitter.com/7vcOZejDMq— Dhillon (@sehajdhillon_) July 16, 2026Read: అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు! -
రోహిత్ శర్మ రిటైర్మెంట్..? ఎల్లుండే ఆఖరి మ్యాచ్?
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆదివారం(జూలై 19) ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డే అతడి చివరి ఇంటర్ననేషనల్ మ్యాచ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రోహిత్ తనంతంట తాను తీసుకున్న నిర్ణయం కాదని, సెలక్టర్ల ఒత్తిడి మేరకే అతడు తప్పుకొంటున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హిట్‌మ్యాన్‌తో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని అగార్కర్ చెప్పినట్లు సమాచారం.అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు అవకాశమివ్వనున్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తమ కథనంలో రాసుకొచ్చింది. జైశ్వాల్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో నూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, జట్టులో ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేకపోవడంతో అతడికి చోటు దక్కడం లేదు.ఈ క్రమంలోనే 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యశస్విని పూర్తి స్ధాయి ఓపెనర్‌గా సిద్దం చేయాలని మేనెజ్మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వయస్సును కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్ ఫిట్‌నెస్‌పై కూడా బీసీసీఐకి సందేహాలు ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసంతృప్తిలో రోహిత్!అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అతడు బీసీసీఐ పెద్దలతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ ఇప్పటికే టీ20ఐలు, టెస్టుల నుంచి తప్పుకోగా.. వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అతడు టెస్టుల నుంచి తప్పుకున్నప్పటి నుంచి, రోహిత్ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీ టీమ్ మేనేజ్మెంట్తో నిరంతరం చర్చిస్తూనే ఉంది. కాగా రోహిత్ ఇటీవల ఆశించిన విధంగా రోహిత్ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్‌లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నా... అతని స్థాయిలో బ్యాటింగ్‌లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో రెండు వన్డేల్లో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. ఇక వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న రోహిత్ 19 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్‌మన్ గిల్ -
విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలం ఉపయోగించాడని ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.సోషల్‌మీడియా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఓ జర్నలిస్టు భారత జట్టు బస్సు బయలుదేరే దృశ్యాలను (కోహ్లి బస్సులోకి ఎక్కుతుండగా) అధికారిక మీడియా పాయింట్లో నిలబడి చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్ అక్కడికి వచ్చి సదరు జర్నలిస్టును అక్కడి నుంచి వెళ్లిపోవాలని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.జర్నలిస్టు తన వద్ద అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉందని చెప్పినా, బాడీగార్డ్ పట్టించుకోకుండా అవమానకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో వెల్లడించడంతో వివాదం ముదిరింది.బీసీసీఐ నిబంధనలపై ప్రశ్నలుఈ ఘటనతో మరో అంశం కూడా చర్చనీయాంశమైంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు విదేశీ పర్యటనల్లో వ్యక్తిగత బాడీగార్డులు, వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.బీసీసీఐ అమల్లో ఉన్న క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భద్రతను బోర్డు, స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేసిన అధికారిక భద్రతా సిబ్బందే చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి సాధారణంగా అనుమతి ఉండదు.బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూపుఈ ఘటనపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించలేదు. అయితే ఆరోపణలు నిజమని తేలితే, బీసీసీఐ అంతర్గతంగా విచారణ జరిపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ మాత్రం విఫలమయ్యాడు. రెండో వన్డే జులై 16న కార్డిఫ్ వేదికగా జరుగనుంది. -
మాట తప్పిన బీసీసీఐ!?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా అంశంలో బిగ్ ట్విస్ట్..! వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు తన పదవి నుంచి తప్పుకొన్నాడని తొలుత వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత డస్కటే తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.మాట తప్పిన బీసీసీఐ!అయితే, కేవలం వ్యక్తిగత కారణాలు కాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యాజమాన్యం తనకు ఇచ్చిన మాట తప్పినందు వల్లే డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. కాగా రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ భారత హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత డస్కటే టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గంభీర్ ఏరికోరి తెచ్చుకుంటే..గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కలిసి పని చేసిన అనుభవంతో డస్కటేను గంభీర్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికీ తన బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో డస్కటే జట్టుకు దూరం కావడమే సరైందిగా భావిస్తున్నట్లు తెలిసింది. టీమ్‌తో చేరినప్పుడు తనకు స్పెషలిస్ట్ ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. కానీ హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ను చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కొనసాగించడంతో డస్కటేకు ఆ అవకాశం దక్కలేదు.పని లేదు.. అందుకే‘బ్యాటింగ్ బాధ్యతలను గంభీర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ చూస్తున్నారు. పేసర్ల కోసం మోర్నీ మోర్కెల్, స్పిన్నర్లకు సాయిరాజ్ బహుతులే కోచ్‌లుగా ఉన్నారు. ఇక డస్కటేకు పని ఏముంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. లండన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న డస్కటే తన కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు కూడా భారత జట్టును వీడాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.అంతర్జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ లీగ్‌లతో కలిసి పని చేయడం తనకు సౌకర్యంగా ఉంటుందని కూడా డస్కటే అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు లీగ్‌ల యాజమాన్యాలు డస్కటేను సంప్రదించినట్లు సమాచారం. ఇక డస్కటే నిజంగా తప్పుకొంటే దిలీప్‌ను బీసీసీఐ మరికొంత కాలం పాటు ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ రికార్డు -
అప్పటి నుంచే విబేధాలు.. టీమిండియాను వీడనున్న కోచ్?
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత పురుషల క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత సదరు సభ్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.అయితే అతడు మేనెజ్మెంట్పై అసంతృప్తితో తప్పుకుంటున్నారా లేదా కొత్త కోచింగ్ బాధ్యతల కోసమా అనేది స్పష్టం కాలేదు. కానీ ఆ కోచ్ ఇప్పటికే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆ జట్టు కోచింగ్ స్టాప్‌లో చేరనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో మరొకరు కూడా తప్పుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత భారత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. ఆ తర్వాత అతడి స్ధానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. అతడితో పాటు ర్యాన్ టెన్‌డెష్కాట్, అభిషేక్ నాయర్ సహాయక కోచ్‌లగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌లగా నియమితులయ్యారు. టి. దిలీప్‌ను యథావిధిగా ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా తప్పుకొని, కేకేఆర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత సీతాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ కోటరీలోకి చేరాడు. అప్పటి నుంచే విబేధాలు?అయితే గంభీర్ హయాంలో సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్ (2024), దక్షిణాఫ్రికా (2025) చేతుల్లో ఘోర టెస్ట్ సిరీస్ ఓటములను చవిచూసింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు-కోచ్‌లకు మధ్య, అలాగే సెలెక్టర్లకు-కోచింగ్ స్టాఫ్‌కు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. ఆ విభేదాలు ఇప్పుడు కూడా అలానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే సదరు కోచ్ టీమిండియాను వీడేందుకు సిద్దమయ్యాడు మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా టీ20 నంబర్ వన్ జట్టు అయిన భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటివరకు పర్యటనలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో ఈ వరుస వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని గంభీర్‌ను బీసీసీఐ సూచింది. భారత్‌కు చేరుకున్న వెంటనే భారత కోచింగ్ బృందంతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇక జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అయితే శ్రీలంక టెస్ట్ సిరీస్‌తో పాటు ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్‌లో గంభీర్ హెడ్‌కోచ్‌గా ఉండనున్నాడు. -
కోచ్‌గా గంభీర్ అవుట్.. అదే నిజమైతే టీమిండియానే WORLD NO1
-
ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి.. తొలి వేటు అతడి మీదేనా?
టీమిండియా ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెలల క్రితం పొట్టి ఫార్మాట్లో మూడోసారి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వరుస ఓటములు చవిచూస్తోంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమితో బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పటికే తీవ్ర అసంతృత్తితో ఉన్న బీసీసీఐ అతడిని తొలగించడానికి ముందు కోచింగ్ జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోంది. ఈ మేరకు గంభీర్ టీంలో కీలకంగా ఉన్న వ్యక్తులను తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక వ్యక్తిని పదని నుంచి తొలగించాలని చూస్తున్న బీసీసీఐకి ఒక వార్త అందింది. గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో ఒక కీలక వ్యక్తి తనంతట తానుగా బయటికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరి సదరు వ్యక్తి నిష్క్రమణ వ్యక్తిగత కారణాలతోనా లేక తన పాత్రకు న్యాయం చేయకపోవడంతో తప్పుకున్నాడా అనేది స్పష్టంగా తెలియదు. మొత్తానికి రెండు వరుస సిరీస్ ఓటములు టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇక నేడు సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ గండం నుంచి బయటపడాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది.ఇప్పటికే ఆసియా గేమ్స్‌తో పాటు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలోని కోచింగ్ స్టాఫ్‌ను పంపించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. దీంతో గంభీర్‌తో పాటు అతడి సపోర్ట్ స్టాఫ్‌పై కూడా త్వరలో వేటు పడే అవకాశముంది. చదవండి: వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్మెంట్పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు -
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
నేపాల్‌తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్‌కు ప్రమోషన్!
నేపాల్‌తో క్రికెట్ బంధాన్ని పెంచుకునే క్రమంలో బీసీసీఐ మరో కీలక అడుగు వేయనుంది. సమీప భవిష్యత్తులో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడేందుకు నేపాల్‌కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళిక రాజకీ యాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం చారిత్రక క్రికెట్ సిరీస్ నిర్వహణతో మరింత బలపడనుంది. అయితే నేపాల్ పర్యటనకు సీనియర్ జట్టును కాకుండా ఇండియా-ఏ జట్టును పంపించనున్నట్లు దేవజిత్ స్పష్టం చేశారు.అయితే నేపాల్‌తో ఆడబోయే సిరీస్ ఏ ఫార్మాట్లో నిర్వహించాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇండియా-ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైభవ్‌కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికైతే తిలక్ వర్మ ఇండియా-ఏ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్‌ను కెప్టెన్ హోదాలో నేపాల్‌కు పంపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్ ఆటలో ఇంకా ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.ఇటీవల సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి క్రికెట్లో అడుగుపెట్టిన దేశాల్లో నేపాల్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆటలో పురోగతి సాధించడం ద్వారా నేపాల్ జట్టు వరుసగా 2024తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాప్రికాకు ఓడించినంత పని చేసిన నేపాల్.. 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించినంత పని చేసింది. చివరకు ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక ఇదే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై విజయంతో నేపాల్ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ టూర్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ సూర్యవంశీకి ఆ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ టూర్లో మాత్రం తొలి టీ20 మినహా మిగతా అన్న్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వైభవ్ రాణించడంలో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు కలిపి వైభవ్ 42 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో పరుగుల పండుగ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. India A are likely to tour Nepal.. @BCCI secretary Devajit Saikia had hinted about this to reporters in Mumbai recently!— Gaurav Gupta (@toi_gauravG) July 10, 2026చదవండి: ‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’ -
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్‌కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్‌కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్‌ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్‌దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్‌ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్‌కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్‌పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్‌పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్‌లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్‌తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్‌గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్‌తో పాటు కోచ్ గంభీర్‌పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్‌ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్‌గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్‌లకే అతడు కెప్టెన్‌గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్‌తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్‌లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్‌గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
గంభీర్ కు బిగ్ షాక్.. టీమిండియా కోచ్ గా VVS లక్ష్మణ్


