ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ విడుదల | IPL 2026 second schedule released | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ విడుదల

Mar 26 2026 6:15 PM | Updated on Mar 26 2026 6:48 PM

IPL 2026 second schedule released

ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ దశలో లీగ్ స్టేజ్‌లో మిగిలిన 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి.  ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు దేశంలోని 12 వేదికలపై జరగనున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి దశ షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. 

మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే తొలి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు జరుగున్నాయి. తొలి దశ 20, రెండో దశ 50 కలిపి లీగ్‌ స్టేజ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్‌ వేదికలు తరువాత ప్రకటించబడతాయి.

రెండో దశ మ్యాచ్‌ల వేదికలు

  • బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయపూర్, న్యూ చండీగఢ్‌

  • రెండో దశలో తొలి మ్యాచ్‌ ఏప్రిల్ 13న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది.  

  • రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్న మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

    కాగా, దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement