టీమిండియా హోం షెడ్యూల్‌ విడుదల | BCCI HAS ANNOUNCED TEAM INDIA HOME SCHEDULE | Sakshi
Sakshi News home page

టీమిండియా హోం షెడ్యూల్‌ విడుదల

Mar 26 2026 3:33 PM | Updated on Mar 26 2026 3:59 PM

BCCI HAS ANNOUNCED TEAM INDIA HOME SCHEDULE

2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా హోం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు (9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్ట్‌లు) జరగనున్నాయి.

ఈ సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్ పర్యటనతో మొదలవుతుంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉన్నాయి. వన్డేలు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్‌లో.. టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి.  

డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటలో మూడు వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనుండగా.. మూడు టీ20లు రాజ్‌కోట్, కటక్, పూణేలో షెడ్యూల్‌ అయ్యాయి.  

వచ్చే ఏడాది (2027) జనవరిలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు ఉంటాయి. ఇవి కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి.  

ఈ హోం సీజన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భాగం ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం​ ఆస్ట్రేలియా జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ 21వ తేదీ నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతుంది. తరువాతి మ్యాచ్‌లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లో జరుగుతాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement