ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా.. షెడ్యూల్ ఖ‌రారు చేసిన బీసీసీఐ | BCCI confirms dates and timings of India vs Ireland T20I series after IPL 2026 | Sakshi
Sakshi News home page

IRE vs IND: ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా.. షెడ్యూల్ ఖ‌రారు చేసిన బీసీసీఐ

Mar 21 2026 11:27 AM | Updated on Mar 21 2026 11:52 AM

BCCI confirms dates and timings of India vs Ireland T20I series after IPL 2026

భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. 

ఈ రెండు మ్యాచ్‌లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన తర్వాత భారత్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా  ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో లేదు.

ఐపీఎల్‌-2026 సీజ‌న్ ముగిసిన త‌ర్వాత టీమిండియా స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌  ఒక టెస్టు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది.  జూన్‌ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య సిరీస్‌ జరుగుతుంది. ఆ త‌ర్వాత  జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్‌ ఖరారైంది.

జూలై 1- 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ  ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ ఈ ప‌ర్య‌ట‌న‌ను ఖరారు చేసింది. ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు అక్క‌డ నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్ల‌నుంది. భార‌త్, ఐర్లాండ్ జ‌ట్లు చివ‌రిసారిగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌ల‌ప‌డ్డాయి.
చదవండి: IPl 2026: 'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement