breaking news
South India
-
స్టార్ హీరోలపై మానస వారణాసి కన్ను..!
ఓ హీరోయిన్‌కు హిట్ వస్తే వరుస అవకాశాలు రావడం, రెమ్యూనరేషన్ పెరగడం సహజం. అయితే మానస వారణాసి మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. సంతోష్ శోభన్‌తో చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో మానస కనిపించనుంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. లవ్ స్టోరీతో పాటు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉండనుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం మానస వారణాసి టూ టైర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. కానీ రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందా అని ఎదురుచూస్తోంది. మానసను చూడగానే స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని అంటారు. పైగా అందాల పోటీల రాణిగా కూడా నిరూపించుకుని వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మరే అవకాశం లేకపోలేదు. కానీ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తే మానస కెరీర్ మరింత వేగంగా టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే రష్మిక తరహాలో ఆమెకు కూడా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయా అనేది రానున్న రోజుల్లో చూడాలి. -
వేధింపులు తట్టుకోలేను.. విషమిస్తే చచ్చిపోతా: నటి ఆవేదన
ఓ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో పవిత్రా గౌడ తన బాధను న్యాయస్థానానికి వివరించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది.జైలులో తనను నైజీరియన్ మహిళ ఖైదీలు వేధిస్తున్నారని మరో పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని.. లేనిపక్షంలో చనిపోయేందుకు విషమైన ఇప్పించాలని పిటిషన్లో పేర్కొంది. పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయంటూ ఆమె తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే ఆమె మరో బ్యారక్‌కు తరలించామని సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి.. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక
ఒకప్పుడు హీరోయిన్లుగా చేసిన అక్కాచెల్లెళ్లు రాధ-అంబిక ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తన గదిలో ఖాళీ చెక్కులు దొంగిలించి, దాదాపు రూ.50 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించారని నటి రాధ.. తన అక్క అంబిక, సోదరుడు మల్లిఖార్జున్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ విషయంపై అంబిక స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో మోసపోయింది తానేనని తీవ్ర ఉద్వేగానికి లోనయింది. కమిషనరేట్‌లో రాధ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించారు.నిజానికి మోసపోయింది నేనే. నేనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. రాధకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు. ఆమె ఎవరి ప్రభావంతో ఇలా చేసిందో నాకు తెలీదు కానీ ఆమెని చూస్తే జాలేస్తోంది. మేం కష్టపడి సంపాదించిన డబ్బులో సగం అమ్మకు ఇచ్చాం. ఏఆర్ఎస్ అనేది అంబికా దేవర్ ఫిలిమ్స్ కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తి, అది మేం కొన్న మొదటి ఆస్తి. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేను అండగా నిలిచాను. దీని వెనక చాలా చరిత్ర ఉంది. ఈ వివాదానికి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నందున అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేను అని అంబిక చెప్పుకొచ్చారు.ఒకప్పుడు కుటుంబం కోసం అందరం కలిసికట్టుగా ఆలోచించేవాళ్లమని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోందని, సినిమా పరిశ్రమలో ఈ రోజు డబ్బు మాత్రమే ప్రధానమైపోయిందని ఎమోషనల్ అయ్యారు. -
ఎక్కువ సినిమాలు చేయడం సక్సెస్ కాదు
ఏ రంగంలోనైనా సరే సక్సెస్ అవ్వాలనే చూస్తారు. ఒక్కసారి విజయం సాధిస్తే తర్వాత జీవితమే మారిపోతుంది. అది సక్సెస్‌కి ఉన్న పవర్. అయితే ఇది వరించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం తోడవ్వాలి. అలాంటి అదృష్టం కోసమే హీరోయిన్ నిధి అగర్వాల్ ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఈ బ్యూటీ.. 2017లో మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. నాగచైతన్య 'సవ్యసాచి'తో తెలుగులోకి వచ్చింది. 'భూమి'తో తమిళంలోకి పరిచయమైంది.అయితే గత నాలుగైదేళ్లలో తెలుగులో పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు, ప్రభాస్‌తో రాజాసాబ్ మూవీస్ మాత్రమే చేసింది. వీటిపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇవి దారుణంగా నిరాశపరిచాయి. చెప్పాలంటే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ సరైన సక్సెస్ కోసం ఈ బ్యూటీ పోరాడుతూనే ఉంది. ఆకర్షణీయమైన అందం, అభినయం ఉన్నా పాన్ ఇండియా కథానాయికిగా గుర్తింపు వచ్చినా వాటికి అదృష్టం మాత్రం తోడవ్వలేదు. అందుకే హీరోయిన్గా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడమే సక్సెస్ కాదు. ప్రతిభని నిరూపించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన విజయం. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మంచి అవకాశాల కోసం నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నటిగా సాధించాలన్న తన లక్ష్యమే తనకు ఉత్తేజం పరుస్తోంది. సహజంగానే నేను కష్టజీవిని. నేను చేరాల్సిన స్థానం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని నిధి అగర్వాల్ పేర్కొంది. -
ఎదురుదెబ్బల నుంచి ఎదుగుదల వరకు.. చిరు, నాని చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
వ్యక్తిత్వ వికాసం గురించి పుస్తకాల్లో చదివిన విషయాలకంటే.. స్వయంగా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచి చెప్పే మాటలకు మరింత విలువ ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.చిరంజీవి తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం కష్టపడటం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదురైనా తనపై తాను నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడటం నేర్చుకున్నానని వెల్లడించారు. ఆయన చిరంజీవిగా తన పేరును మార్చుకొని నేటికి సరిగ్గా 48 ఏళ్లయింది. అప్పటి నుంచి ఈ 48 ఏళ్ల సుదీర్గ సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, మరెన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. తనపై విమర్శలొచ్చినప్పుడు ఎలా నిలబడాలో తెలుసుకున్నారు. అవన్నీ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.మరోవైపు నాని కూడా తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. మనం ఎదుగుతున్న కొద్దీ ప్రశంసించే వారితో పాటు కిందకు లాగాలని చూసేవాళ్లు కూడా ఉంటారని చెప్పారు. పెరుగుతున్న కొద్దీ నెగెటివిటీ కూడా పెరుగుతుంది. దానిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగాలని సూచించారు. తన కెరీర్ ప్రారంభం నుంచి నెగెటివిటీకి దూరంగానే ఉన్నాను. అలానే నా కెరీర్‌ని ఇలా నిర్మించుకున్నాను. అందరూ అలానే ఆలోచించాలని కూడా నాని అన్నారు.ఇలా ఒకే సమయంలో అటు చిరంజీవి, ఇటు నాని తమ జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను తమ అభిమానులతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మాటలు అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. -
రాత్రయితే ఆ విషయాలు మాట్లాడొద్దని నా భార్యకు చెప్పా
'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాతో తెలుగులోనూ కొందరు అభిమానుల్ని సంపాదించుకున్న యంగ్ హీరో అశోక్ సెల్వన్.. తర్వాత 'నిన్నిలా నిన్నిలా' అనే స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ కూడా చేశాడు. గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ADHD అనే రోగం తనకు వచ్చిందనే సంగతి బయటపెట్టాడు. దాని గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.(ఇదీ చదవండి: కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ రుగ్మత వస్తే ఉన్నట్టుండి హైపర్ అయిపోతుంటారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్..ఈ జబ్బు తనకు ఉందని బయటపెట్టాడు. ఇప్పుడు తమిళ హీరో అశోక్ సెల్వన్ మాట్లాడుతూ.. ఇది నిర్ధారణ అయిన తర్వాత నా ఆలోచనా విధానం, రోజువారీ అలవాట్లని మరింతగా అర్థం చేసుకునే విషయంలో స్పష్టత వచ్చిందని చెప్పుకొచ్చాడు.'నాకు మొదటినుంచీ సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం చేతకాదు. చెప్పాలంటే కొంత కష్టంగా ఉండేది. ప్రస్తుతం ఈ సమస్యని అధిగమించేందుకు నాకు నేను ఎక్కువగా రిమైండర్లు పెట్టుకుంటున్నాను. రాత్రి వేళల్లో ఎక్కువగా ఆలోచించే అలవాటు నాకు ఉంది. అందుకే రాత్రిపూట నాతో తీవ్రమైన లేదా ఎక్కువగా ఆలోచించేలా చేసే విషయాలని మాట్లాడొద్దని నా భార్య కీర్తికి చెప్పాను. మన మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని, దాన్ని అంగీకరించడం మంచిది అని ఇప్పుడు తెలుసుకున్నాను' అని అశోక్ సెల్వన్ చెప్పుకొచ్చాడు.ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలామందికి ఇలాంటి రుగ్మతలు ఉండి ఉండొచ్చు. కానీ తమకున్న జబ్బు గురించి బయటకు చెప్పుకోరు. కానీ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఇలాంటి వాటి బారిన పడినవాళ్లకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మనసు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా రోజువారీ పనులు చేసుకోవడం ముఖ్యమని అశోక్ సెల్వన్ మాటలబట్టి అర్థమవుతోంది. అశోక్ సెల్వన్.. తోటి హీరోయిన్ కీర్తి పాండియన్ని ప్రేమించి 2023లో పెళ్లి చేసుకున్నాడు. ఇతడు నటించిన అన్బిల్ అవన్ అనే తమిళ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే ఈ రుగ్మత బారినపడ్డ సంగతి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం) -
కర్ణుడిగా లారెన్స్.. ఫస్ట్ లుక్ అదిరింది!
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి సరికొత్త అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాభారతంలోని వీరుడు కర్ణుడి పాత్రలో ఆయన నటిస్తున్న ‘మహావీర కర్ణ’ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. పెన్ మూవీస్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇదీ చదవండి: వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి..!‘ఏ ఫేస్.. ఏ లెజెండ్.. ఏ వారియర్’ ..‘ఏ ఫేస్.. ఏ లెజెండ్.. ఏ వారియర్’ అంటూ రాఘవ లారెన్స్‌ను మహావీర కర్ణగా పరిచయం చేసింది. పోస్టర్లో లారెన్స్ బంగారు కవచంతో, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. వెనుక మంటలతో కూడిన నేపథ్యం ఆయన పాత్రలోని వీరత్వాన్ని మరింతగా ఎలివేట్ చేస్తోంది. ఈ లుక్‌లో రాఘవ లారెన్స్‌ను చూస్తే గతంలో కనిపించిన ఆయన పాత్రలకు పూర్తి భిన్నంగా అనిపిస్తోంది.సినిమా విషయానికి వస్తే..‘మహావీర కర్ణ’ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. లైవ్ యాక్షన్‌తో పాటు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి మహాభారత ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మహాభారతంలో కర్ణుడి పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరత్వం, దానగుణం, స్నేహం, విధేయతతో పాటు విషాదభరితమైన జీవిత ప్రయాణం కర్ణుడి పాత్రను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. అలాంటి కీలక పాత్రను రాఘవ లారెన్స్ పోషిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్‌తోనే భారీ అంచనాలు పెంచిన ‘మహావీర కర్ణ’లో రాఘవ లారెన్స్ కర్ణుడిగా ఎలా కనిపించనున్నారో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇదీ చదవండి: హీరో ధనుష్ తండ్రి సినిమా ‘హబీబీ’.. ఓటీటీలోకి..! View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
హీరో ధనుష్ తండ్రి సినిమా ‘హబీబీ’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తండ్రి, నటుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ‘హబీబీ’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడీ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.‘హబీబీ’ చిత్రానికి మీరా కతివరన్ దర్శకత్వం వహించారు. విఎస్ మొహమ్మద్ కథ అందించారు. ఇందులో కస్తూరి రాజా ‘యూసుఫ్’ అనే చేనేత కార్మికుడి పాత్రలో కనిపించారు. మాళవికా మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుశ్రేయా రాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియాడికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రేమకథలో అప్పటి కాలానికి సంబంధించిన జీవన విధానం, భావోద్వేగాలను చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. A story told through a voice, a cassette, and a love that never left.#Habeebi streaming from 25th September only on #SonyLIV#ComingSoon #HabeebiOnSonyLIV pic.twitter.com/rPoe6A24fK— Sony LIV (@SonyLIV) September 20, 2026 -
ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు: సూర్య–జ్యోతిక
‘‘మా మనసులోని మరో ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. మా పై మీరు కురిపించిన ప్రేమ, సానుకూలంగా స్పందించిన తీరుకి ముగ్ధులమయ్యాం’’ అంటూ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. పెళ్లయి 20 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 16న ఈ ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడం, మరో 20 ఏళ్లకు పైగా ఈ ప్రేమ ప్రయాణాన్ని ఇలానే సాగించాలనుకుంటున్నామని పేర్కొనడం తెలిసిందే. ఇలా మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని చాలామంది స్వాగతించారు... ఆశీర్వదించారు. వారందరూ చూపించిన ప్రేమను, ఈ వేడుక బాగా జరగడానికి కారకులైన వారిని ఉద్దేశించి సూర్య–జ్యోతిక సోమవారం తమ మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు. ‘‘స్కాట్‌ల్యాండ్‌లో మా వివాహ వేడుకను మరపురానిదిగా చేసిన మా బృందానికి ధన్యవాదాలు. మాకు జీవితంలో మరచిపోలేని అనుభూతిని బహుమతిగా ఇచ్చినందుకు వేడుక నిర్వాహకురాలు లిసాకు ధన్యవాదాలు. మా సీక్వెల్ మ్యారేజ్ ఆహ్వాన పత్రికను ఎప్పటికీ మా కాఫీ టేబుల్‌పై ఉంచేంత అద్భుతంగా చేసిన డారియాకి థ్యాంక్స్. ఇక డయానే అందించిన పువ్వుల అందాన్ని ఏ ఫొటో కూడా క్యాప్చర్ చేయలేదు. ఆ కోట గోడల మధ్య రాజకుటుంబీకుల్లా ఉన్నామనే అనుభూతిని బ్లెయిర్క్వాన్ కోటలోని రోజ్, ఆమె టీమ్ అందించారు.వారు ఇచ్చిన ఆతిథ్యం ఎంత బాగుందంటే వీడ్కోలు చెప్పేటప్పుడు మేం కన్నీళ్లు పెట్టుకుంటామని ఊహించలేదు. మా అందమైన క్షణాలను వీడియోలో అద్భుతంగా చిత్రీకరించిన జోవాన్‌కి, అంకిత భావంతో ఫొటోలు తీసిన డెల్, జేకి థ్యాంక్స్. స్కాట్‌ల్యాండ్‌లోని పొగమంచుతో నిండిన పర్వత ప్రాంతాలు, సరస్సులను మా ప్రేమకు తీపి గుర్తుగా ఎంచుకున్నాం. మాకు కలిగిన అనుభూతికి మించిన గొప్పదేదో మా ఇంటికి తీసుకొచ్చాం. మాకు గొప్ప అనుభూతిని మిగిల్చిన మంచి మనసున్న వ్యక్తులను కలవడం వల్ల మా హృదయాలు ఎప్పటికీ స్కాట్‌ల్యాండ్ జ్ఞాపకాలకు దూరం కావు’’ అంటూ సూర్య–జ్యోతిక తమ సీక్వెల్ వివాహం తాలూకు అనుభూతిని పంచుకున్నారు. -
దర్శకుడిగా మారిన హీరో కార్తికేయ.. ‘కమ్‌బ్యాక్’ గ్లింప్స్ రిలీజ్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘కమ్‌బ్యాక్’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో హీరోగా నటించడంతో పాటు తొలిసారి దర్శకుడిగానూ కార్తికేయ మెగాఫోన్ పట్టారు. కార్తికేయ హీరోగానే కాకుండా టాలీవుడ్ హీరో నానీ నటించిన 'గ్యాంగ్ లీడర్’, తమిళ నటుడు అజిత్‌తో ‘వలిమై’ వంటి చిత్రాల్లో నటించి విలనిజంతోనూ మెప్పించాడు. కథానాయకుడిగా రెండేళ్ల విరామం తర్వాత సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో కార్తికేయ బాక్సర్‌గా పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. ‘బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్లవుతోంది. ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్’ అంటూ సాగే వాయిస్ ఓవర్ గ్లింప్కు ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. బాక్సింగ్ ప్రాక్టీస్, స్కిప్పింగ్ సన్నివేశాలతో గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.సరస్వతి శుక్లా సమర్పిస్తున్న ఈ చిత్రానికి జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ సూర్యప్రకాష్ ఎడిటింగ్ అందిస్తున్నారు. సూర్య ఆకెళ్ల క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఘరానా మోసం.. అక్కపై హీరోయిన్ రాధ సంచలన ఆరోపణలు..!
సీనియర్ హీరోయిన్ రాధ కుటుంబంలో వివాదం నెలకొంది. తన చెక్‌లను దుర్వినియోగం చేశారని రాధ ఆరోపిస్తూ చెన్నై కోర్టును ఆశ్రయించింది. తన సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌పై గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించారని రాధ తన ఫిర్యాదులో పేర్కొంది.తన చెక్‌లను తస్కరించి దాదాపు రూ.46 కోట్ల మోసానికి పాల్పడ్డారని రాధ ఆరోపిస్తోంది. ఆ చెక్కులను తన సోదరుడు మల్లికార్జున, తన సోదరి అంబిక కలిసి ఈ పని చేశారని రాధ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు.. తన ప్రమేయం లేకుండా తన గది నుంచే ఆ చెక్కులను తీసుకున్నారని తెలిపారు. తాను ఆ చెక్కులను తన సోదరికి ఎప్పుడూ ఇవ్వలేదని.. వెంటనే చెల్లింపులను నిలిపివేయమని బ్యాంకు అధికారులకు సూచించినట్లు రాధ వెల్లడించింది.అంతేకాకుండా విలువైన వస్తువులు, నగలు, ఆస్తి పత్రాలు, ఇతర రికార్డులు ఉంచిన తన ఆస్తి భాగాన్ని తీసుకోకుండా అంబిక, మల్లికార్జున తనకు రాకుండా అడ్డుకున్నారని కూడా రాధ ఆరోపించారు. విచారణ జరిపి వారిద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
కదిలిస్తే.. కన్నీరే.. ఇదే కయాదు జర్నీ
సినిమా రంగంలో ఎలాంటి నేపథ్యం లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదగడం అంత సులభం కాదు. కొందరికి తొలి సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరు ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు దాటిన తర్వాత తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అస్సామీ బ్యూటీ కయాదు లోహర్ ఒకరు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం వరుస అవకాశాలతో సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారింది. (ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’)ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు.. హీరోయిన్గా మారకముందు తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంది. తన కుటుంబ పరిస్థితులు, చేసిన ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.టీలు అందించే స్థాయి నుంచి..కయాదు మాట్లాడుతూ.. తాను పుణెలో పుట్టి పెరిగినట్లు తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని.. అయితే నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో కాఫీ షాపులో టీలు అందించే పని కూడా చేశానని కయాదు గుర్తుచేసుకుంది. ఆ తర్వాత బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేశానని తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎలాంటి పని చేయడానికి కూడా వెనుకాడలేదని ఆమె చెప్పుకొచ్చింది.కన్నీళ్లతో బయటకు..కయాదు జీవితంలో ఐటీ ఉద్యోగం కూడా ఓ భాగమేనట. కొంతకాలం ఐటీ కంపెనీలో పనిచేసిన ఆమె.. అక్కడి పని ఒత్తిడి తనకు ఏమాత్రం సరిపోలేదని చెప్పింది. తన ఆలోచనలు, తనకు నచ్చిన జీవితం ఆ ఉద్యోగంతో ముడిపడటం లేదని భావించినట్లు తెలిపింది. ఓ దశలో ఆఫీసులోనే తీవ్ర ఒత్తిడికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసినట్లు వెల్లడించింది. మోడలింగ్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సినిమాల్లోకి వచ్చింది కయాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. చిన్న ఉద్యోగాలు చేస్తూ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో స్టార్ హీరో సరసన హీరోయిన్గా నటించే స్థాయికి చేరుకోవడం విశేషం.సినిమాల విషయానికి వస్తే..టాలీవుడ్లో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ (2022) సినిమాతో కయాదు లోహర్ హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చినప్పటికీ.. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో వెంటనే వరుస అవకాశాలు రాలేదు. తర్వాత ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ (2025) ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా విజయంతో కయాదుకు వరుస అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ‘ఫంకీ’, ‘పళ్ళి చట్టంబి’ వంటి చిత్రాల్లోనూ నటించి తన పరిధిని పెంచుకుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: విడాకులపై కాజల్ ఆసక్తికరమైన కామెంట్స్) -
విడాకులపై కాజల్ ఆసక్తికరమైన కామెంట్స్
ప్రస్తుతం కాలంలో విడాకులు పెరిగిపోవడంపై హీరోయిన్ కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసహనంతో కూడిన మనుషులు, మితిమీరిన సోషల్‌మీడియా వాడకం దీనికి ప్రధాన కారణమన్నారు. ‘ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫొన్లకే పరిమితమవుతున్నారు. అర్థవంతమైన మాటాలు, సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్లే రిలేషన్ షిప్లో దూరాలు పెరుతున్నాయన్నారు.‘నేను, నా భర్త ఖాళీగా ఉండే సమయాన్ని చాలా గౌరవిస్తాం. ప్రతివారం ఎక్కడకైనా డిన్నిర్కి వెళ్తాం. సరదాగా ఎక్కువ టైం మాట్లాడుకుంటాం’ అని కాజల్ తెలిపారు. సోషల్ మీడియాతో టైంపాస్ చేయకుండా భాగస్వామితో సమయం కేటాయిస్తే బాండిగ్ స్ట్రాంగ్ అవుతుందని సూచించారు.కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే...చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ 2020 అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. వీరికి నీల్ కిచ్లూ అనే కుమారుడు ఉన్నాడు. సినిమాల విషయానికి వస్తే ‘ది ఇండియా స్టోరీ’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇదీ చదవండి: బతికుండగానే చంపేశారు.. నటి భావోద్వేగం.. -
బతికుండగానే చంపేశారు.. నటి భావోద్వేగం..
చిత్రసీమలో తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వడివుక్కరసి గురించి సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త వైరల్‌గా మారింది. ఆమె అనారోగ్యంతో కన్నుమూశారంటూ కొందరు ప్రచారం చేయడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా వడివుక్కరసి స్పందించడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.‘నేను బతికే ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దు. నా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సినీ ప్రస్థానం ఇది..1978లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వడివుక్కరసి.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. 40కి పైగా టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు. తెలుగు ప్రేక్షకులకు కూడా వడివుక్కరసి సుపరిచితమే. రజినీకాంత్ నటించిన 'శివాజీ', 'అరుణాచలం' వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. చిరంజీవి, మోహన్‌బాబు కలిసి నటించిన 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'నేటి సిద్ధార్థ' వంటి సినిమాల్లోనూ ఆమె కనిపించారు.68 ఏళ్ల వయసులోనూ..కెరీర్ తొలిదశలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేసిన ఆమె.. ఆ తర్వాత తల్లి, బామ్మ, అత్త వంటి భావోద్వేగ పాత్రల్లోనూ మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అశోక్'లో విలన్‌గా ఆకట్టుకోగా.. సునీల్ హీరోగా నటించిన 'అందాల రాముడు'లో మనవడిపై ప్రేమను చూపించే నానమ్మగా భావోద్వేగాన్ని పండించారు. తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్న వడివుక్కరసి.. ప్రస్తుతం 68 ఏళ్ల వయసులోనూ నటిగా కొనసాగుతున్నారు. అలాంటి సీనియర్ నటిపై మృతి వార్తలు ప్రచారం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని ఆమె స్పష్టం చేయడంతో అభిమానులు ఆమె బతికి ఉండగానే చంపేశారు కదరా అంటూ సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారానికి తెరపడింది.ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’ -
రజినీకాంత్ జైలర్-2.. మరో పవర్ఫుల్ రోల్ రివీల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ క్యారెక్టర్ రివీల్ చేశారు. ఆమె కాంతా అనే పవర్‌పుల్ రోల్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెట్లపై నడుచుకుంటూ.. చేతిలో సిగరెట్ పట్టుకుని ఫుల్ మాస్ లుక్‌లో కనిపించింది బాలీవుడ్ బ్యూటీ.(ఇది చదవండి: రజినీకాంత్ జైలర్-2.. సూరజ్ వెంజరమూడు పవర్ఫుల్ రోల్..!)కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి..
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామా ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. దాదాపు నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాలతో థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.గాంధీ జయంతి సందర్భంగాజీ5 వేదికగా అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ‘కొన్ని కథలు మీరు చూసే విషయాలనే అనుమానించేలా చేస్తాయి. మరికొన్ని మీరు నమ్మే విషయాలను ప్రశ్నించేలా చేస్తాయి. కానీ ఈ కథ మాత్రం వాటి మధ్యలో ఉన్న ప్రతిదానినీ ప్రశ్నించేలా చేస్తుంది’ అంటూ మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.విభిన్నమైన కథాంశంతో..నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌తో పాటు హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్, రాజేష్ జైస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దినేష్ విజన్‌కు చెందిన మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మృణాల్ ఠాకూర్ కెరీర్లో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంగా ‘పూజా మేరీ జాన్’ నిలవనుంది. థియేటర్లలో విడుదల కాకపోవడంతో ఇన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో క్లారిటీ వచ్చింది. -
‘రామాయణ’ ఈ వెర్షన్లో 30 నిమిషాల నిడివి తగ్గింపు!
ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి భాగం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.మూడు గంటలకు పైగానే..భారతీయ వెర్షన్ మూడు గంటలకు పైగా రన్టైమ్తో విడుదల కానున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంగ్లీష్ వెర్షన్‌ను మాత్రం దాదాపు 30 నిమిషాల తక్కువ నిడివితో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అక్కడి ఆడియన్స్ టేస్ట్‌కు అనుగుణంగా కొన్ని పాటలు, సన్నివేశాలను కట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.రణ్‌బీర్‌కు మరో కొత్త ఛాలెంజ్..‘యానిమల్’ వంటి వైలెంట్ క్యారెక్టర్ తర్వాత రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. మర్యాద పురుషోత్తముడిగా ఆయన ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీకి కారణమవుతోంది. రాముడి పాత్రలో రణ్‌బీర్ ఎలా కనిపిస్తాడో, ఆ పాత్రను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.సాయిపల్లవికి కూడా కీలకమే..సాయిపల్లవి ఇప్పటికే దక్షిణాదిలో తన సహజమైన నటన, అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘ఏక్ దిన్’తో హిందీ ప్రేక్షకులను పలకరించినా.. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చర్చ ఉంది. ఇప్పుడు ‘రామాయణ’లో సీత పాత్ర ఆమెకు మరింత కీలకంగా మారింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఆడియన్స్‌ను కూడా సీతగా మెప్పించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.యశ్ ఏం చేస్తాడో?‘టాక్సిక్’ తర్వాత యశ్ ‘రామాయణ’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన యశ్.. రావణుడి పాత్రలో ఎలా కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఒక్కోసారి మార్పులు..భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ‘రామాయణ’ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. టీజర్ విజువల్స్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో తర్వాతి ప్రమోషనల్ కంటెంట్‌లో విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, కలర్ గ్రేడింగ్‌పై మరింత ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ‘జై జై రామ్’ పాటలోనూ విజువల్స్ మరింత మెరుగ్గా కనిపించాయి. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రణ్‌బీర్, సాయిపల్లవి, యశ్.. ఈ ముగ్గురి కెరీర్లో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. -
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్
ఓటీటీ ప్రియులకు మరో హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. ‘జబర్దస్త్’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ‘అదిరే అభి’ తెరకెక్కించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.జులై 31న థియేటర్లలో విడుదలై..జులై 31న థియేటర్లలో విడుదలైన ‘కర్మాఖ్య’ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నిన్న (శనివారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో చూడొచ్చు.‘కర్మాఖ్య’కు అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. సమైరా, సముద్రఖని, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, మధునందన్, ధనరాజ్, గడ్డం నవీన్, వైష్ణవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మై ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వడ్డేపల్లి వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, మిస్టరీ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులు ఇప్పుడు ‘కర్మాఖ్య’ను ఇంట్లోనే చూసేయొచ్చు.ఇదీ చదవండి: బన్నీ ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే.. -
అజిత్ కార్ రేసింగ్ జర్నీ.. గ్లాడియేటర్స్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ అజిత్ జీవితం ఆధారంగా వస్తోన్న మూవీ గ్లాడియేటర్స్. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. అజిత్ రేసింగ్ జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో అజిత్ కార్ రేస్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో అజిత్ జర్నీ గురించి ఆయన సతీమణి కూడా మాట్లాడారు. రేసింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ట్రైలర్‌లోని కార్ రేసింగ్ సన్నివేశాలు సైతం అజిత్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంటన్నర రన్టైమ్తో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అజిత్ రియల్ రేసింగ్ ఈవెంట్ ఫుటేజీ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
అన్న వల్లే ఆ సినిమా.. నా కెరీర్‌నే మార్చేసింది: రాకా డైరెక్టర్ అట్లీ
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. షారూఖ్ ఖాన్ జవాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో రాకా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 అట్లీ బర్త్ డే కానుకగా ట్రీట్ ఇవ్వనున్నట్లు నిర్మాణ సంస్థ హింట్ ఇచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ నేపథ్యంలోనే దర్శకుడు అట్లీ తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జవాన్ మూవీ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని అన్నారు. చెన్నైలో ఓ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన అట్లీ తన జర్నీ గురించి మాట్లాడారు. విజయ్ అన్న లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి రావడం సాధ్యమయ్యేది కాదని తెలిపారు. రాజా రాణి సినిమాతో నాకు గుర్తింపు వచ్చిందని వెల్లడించారు.ఆ దేవుడి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా భార్య ఆశీస్సులతో కెరీర్లో రాణిస్తున్నానని అట్లీ తెలిపారు. కానీ ఆ వ్యక్తి నాకు వరుస అవకాశాలు ఇచ్చి నా జీవితాన్నే మార్చేశారు. విజయ్ అన్న చెప్పడం వల్లే జవాన్ మూవీని తెరకెక్కించానని అట్లీ వెల్లడించారు. జవాన్ సినిమా చేయాలని విజయ్ అన్న ప్రోత్సహించిన విషయాన్ని డైరెక్టర్ అట్లీ గుర్తు చేసుకున్నారు. అందుకే విజయ్ అన్నకు నేనెప్పుడూ ఎంతో కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. అన్న సీఎం కావడం వల్ల మరో సినిమా చేసేందుకు నాకు అవకాశం లేకుండా పోయిందని నవ్వుతూ అన్నారు.అట్లీ మాట్లాడుతూ.' షారుఖ్ సర్ నా ఆఫీస్‌కి వచ్చినప్పుడు మా మధ్య మీటింగ్ జరిగింది. అప్పుడు విజయ్ అన్న నాతో ఓ మాట అన్నారు. చూడు.. నువ్వు ఏం చేస్తావో, దాన్ని ఎలా నిర్వహిస్తావో నాకు అనవసరం. ఇక నుంచి నా చుట్టూ తిరగడం ఆపు. దయచేసి ముందుకు వెళ్లి ఆ సినిమా చెయ్యి. అది నీ కెరీర్ గమనాన్ని మార్చేస్తుంది' అని చెప్పారు. విజయ్ అన్న చెప్పినట్లుగానే జవాన్ మూవీతో నా జీవితం మారిపోయిందని అట్లీ అన్నారు.కాగా.. విజయ్-అట్లీ కాంబోలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. తన విజయాలు సొంత కష్టంతోనే వచ్చినప్పటికీ.. కెరీర్‌ను తీర్చిదిద్దడంలో విజయ్ అన్న మద్దతు, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు. ఈ రోజు నేను వేసుకునే చొక్కా, ప్యాంటు, వాచ్ అన్నీ నా కష్టంతోనే సంపాదించుకున్నా.. ఇదంతా ఆయన వల్లేనని అట్లీ అన్నారు. విజయ్ అన్న మద్దతు లేకుండా తాను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదని అన్నారు. -
హీరో సూర్య సేవలకు నటుడు మాధవన్ సెల్యూట్..
తమిళ నటుడు సూర్య సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విద్యకు సంబంధించి ఆయన నిర్వహిస్తున్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా నటుడు ఆర్.మాధవన్ ఈ కార్యక్రమాపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.‘అంగరం ఫౌండేషన్’ ద్వారా..‘అంగరం ఫౌండేషన్’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందుతున్న సహాయంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్‌లో ఈయన కీలక వ్యాఖ్యలు పేర్కొన్నారు. ‘ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. వారిలో 51 మంది వైద్యులు, సుమారు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు అని మాధవన్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీషేర్ చేస్తూ సెల్యూట్ ఎమోజీలను జోడించారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. 6వేల మంది విద్యార్థుల జీవితాల్లో.. అగరం ఫౌండేషన్ కార్యక్రమాల గురించి సూర్య గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ రెండు దశాబ్దాల్లో దాదాపు 6వేల మంది విద్యార్థుల జీవితాల్లో ఈ ఫౌండేషన్ ఎంతో మార్పును తీసుకొచ్చింది’ అని తెలిపారు. విద్యను అత్యుత్తమ రక్షణ కవచంగా అభివర్ణించిన ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువును కొనసాగిస్తున్న విద్యార్థులను అభినందించారు. పిల్లల సమక్షంలో వివాహంతమిళ స్టార్ జంట సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2006లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్టియన్ పద్ధతిలో పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని కొత్త జంటలా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 'ది సీక్వెల్- 20 ఏళ్ల ప్రేమకు మరో ప్రతిజ్ఞ' పేరుతో వీడియో షేర్ చేసిన జ్యోతిక తన మనసులోని మాటలకు అద్భుతమైన అక్షరరూపం ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..) -
నటనకు అవకాశం ఉంటే అలాంటి పాత్రనైనా చేస్తా :భాగ్యశ్రీ
కథానాయకిగా దక్షిణాదిలో ఎదుగుతున్న నటి భాగ్యశ్రీ భోర్సే. ఈ మరాఠీ బ్యూటీ బిజినెస్ మేనేజ్మెంట్ చదివి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. అలా సినిమాల్లోకి వెళ్లమని స్నేహితులు, సన్నిహితులు సూచించగా అవకాశాలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఇటీవల ఒక భేటీలో భాగ్యశ్రీ భోర్సే పేర్కొన్నారు. తెలుగులో మిస్టర్ బచ్చన్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అక్కడ కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత కాంత చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు.ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా భాగ్యశ్రీ భోర్సే నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని గురించి ఆమె ప్రస్తావిస్తూ ఆ చిత్రంలో నటనను మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనతో పోల్చారనీ, బహుశా ఈ రెండు చిత్రాలు 1980–90 కాలానికి చెందిన కథలతో రూపొందినవి కావడమే కావచ్చునన్నారు. ఇటీవల తెలుగులో ఈమె నటించిన లెనిన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తున్నారు. తనకు ఎలాంటి పాత్ర అన్నది ముఖ్యం కాదని, నటనకు అవకాశం ఉంటే ఏ తరహా పాత్రనైనా చేయడానికి రెడీ అని, అది ప్రతినాయకి పాత్ర అయినా నటిస్తానని చెప్పారు. ఇటీవల ఈ భామ యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్‌తో కలిసి నటించిన ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లలో వైరల్ అవుతోంది. -
‘మీరే విగ్గు పెట్టుకున్నారు.. జడల కోసం మాకేలా చెప్తున్నారు’
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే ఇటీవల బెంగళూరులోనూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీకి ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.మీరు చెప్తే ఎవరు వింటారునాని మీడియా సమావేశంకి వచ్చిన ఓ లేడీ జర్నలిస్ట్‌ని చూసి.. ‘మీ హెయిర్ చాలా బాగుంది. ప్రస్తుతం హెయిర్ ఫాల్ అవుతోంది. జాగ్రత్తగా ఉండండి. నాలా జడలు పెట్టుకోండి అని పోస్టర్ని చూపిస్తూ సరదాగా అన్నారు. దీనికి స్పందించిన వేరే కన్నడ మహిళా జర్నలిస్ట్ ‘మీరు జడలు పెంచుకొని చెప్తే మీము వింటాం. కానీ మీరు జడలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ( బెంగళూరు)కి వచ్చి చెప్తే ఎవరు వింటారు’ అని నానిని ప్రశ్నించారు.సినిమాలో ఫేక్‌గా ఏడుస్తా..‘నేను యాక్టర్‌ని అందుకే ఇలా చెప్పా.. మీరు జీవితంలో నిజంగా ఏడుస్తారు. నేను సినిమాలో ఫేక్‌గా ఏడుస్తా.. అందుకే ఇలా చూపించి చెప్పా అని కౌంటర్‌ని కవర్ చేస్తూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. A Kannada Journalist’s QUESTION to #NANI :“మీరు #TheParadise లో lo JADAL పెంచుకుని చెప్తే పర్లేదు…మీరు WIG పెట్టుకుని, మాకు ఎలా చెప్తున్నారు…?”That CRAZY Response from the Crowd to #Nani’s Answer… 😂🔥 pic.twitter.com/0k9xXsqEl0— Rangasthalam (@RangasthalamIN) September 18, 2026 -
బన్నీ ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ గా రూపొందుతోంది. అయితే రాకా నుంచి బిగ్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ అప్డేట్పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు)37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను..ఇటీవలే 37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్చ్ షేర్ చేయడంతో అభిమానుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 21న అట్లీ పుట్టినరోజు కావడంతో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీన్ని చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఓ సరికొత్త విజువల్స్‌తో వేరే ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనే కీలక పాత్రలో కనిపించనుంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు టాక్. రష్మిక మందన్న నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమా 2028లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. Get ready to witness a global triumph! ✨ #Raaka pic.twitter.com/IWAskqz7Lw— Sun Pictures (@sunpictures) September 18, 2026 -
‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్లో..’
తన వ్యక్తిగత విషయాలతో పాటు మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కూడా బహిరంగంగా మాట్లాడుతుంటారు నటి శ్రుతిహాసన్. తాజాగా సైఫ్ అలీఖాన్ సోదరి, నటి సోహా అలీఖాన్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, పీరియడ్స్ వంటి అంశాలపై మాట్లాడారు. చిన్నతనంలో నెలసరి సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు.‘13 ఏళ్ల వయసులో తొలిసారి నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకున్నప్పటికీ.. తన పరిస్థితి చూసి ఆందోళన చెందేవారు. పిరియడ్స్ వచ్చిన రెండు గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి వచ్చేది. ఇలా దాదాపు 12 రోజుల పాటు ఇబ్బంది పడేదాన్ని’ అని తెలిపారు. కార్వాన్లోకి వెళ్లి వాంతులు..సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యలు తనను వెంటాడాయని శ్రుతి చెప్పారు. పీరియడ్స్ సమయంలో డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టంగా ఉండేదని తెలిపారు. షూటింగ్ సమయంలో కార్వాన్లోకి వెళ్లి వాంతులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మత్తుగా, అయోమయంగా అనిపించేది. మందులు వాడే సమయంలో చాలా ఎమోషనల్‌గా మారిపోయేదాన్నని, కారణం లేకుండానే ఏడ్చేదాన్ని’ అని శ్రుతి గుర్తుచేసుకున్నారు.ఇదీ చదవండి: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలపైనేఅమ్మ కావాలని ఉంది..ఇదే సందర్భంగా మదర్హుడ్పై తన అభిప్రాయాలను కూడా శ్రుతిహాసన్ పంచుకున్నారు. భవిష్యత్తులో తల్లి కావాలని తాను నిజంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే చిన్నతనం నుంచే పీసీఓఎస్ ఉందని, దాని కారణంగా భవిష్యత్తులో తల్లి కావడం కష్టమవుతుందని చెప్పడంతో చాలా కాలం ఆ విషయంలో భయపడినట్లు వెల్లడించారు. అయితే ఎగ్ ఫ్రీజింగ్‌తో పాటు దత్తత వంటి అవకాశాల గురించి పలువురు డాక్టర్లతో మాట్లాడడంతో కొంతవరకు భయం తగ్గిదని తెలిపారు. భవిష్యత్తులో తన పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని, దత్తత విషయంలోనూ తాను ఓపెన్‌గా ఉన్నానని శ్రుతిహాసన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కెప్టన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ -
ఆస్కార్ బరిలో గోంధళ్
మరాఠి థ్రిల్లర్ సినిమా ‘గోంధళ్’ ఆస్కార్ బరిలో నిలిచింది. వచ్చే ఏడాది మార్చి 14న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 15). కాగా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం భారతదేశం నుంచి ‘గోంధళ్’ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల్లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం 33 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘హక్’, ‘హనుమాన్ అంశ్’, ‘బోర్డర్ 2’, ‘120 బహదూర్’, ‘ఇక్కీస్’ వంటి 14 హిందీ సినిమాలున్నాయి. అలాగే ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘సింగ్ గీతం’, ‘ఇగ్వా (ఇంకా విడుదల కావాల్సి ఉంది)’ వంటి నాలుగు తెలుగు సినిమాలతో పాటుగా, మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ కూడా ఉంది. ఈ చిత్రాలన్నింటినీ దాటుకుని ‘గోంధళ్’ మూవీ ఆస్కార్ అవార్డుల పోటీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.కథ ఏంటంటే..?ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, అనుజ్ ప్రభు, నిషాద్ భోయిర్, కిషోర్ కదమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోంధళ్’. సంతోష్ దవఖర్ దర్శకత్వంలో దీక్షా దవఖర్ నిర్మించిన ఈ చిత్రం 2025 నవంబరు 14న విడుదలైంది. సంప్రదాయం, మోసం, అధికారం, ఆకాంక్షల అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే... మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన దంపతుల జీవితంలోని అడ్డంకులు తొలగిపోవడానికి రాత్రంతా సంగీతం, నృత్యం, పురాణ కథలతో ‘గోంధళ్’ అనే సంప్రదాయ జానపద పూజ నిర్వహిస్తారు. ఈ పూజ నేపథ్యంతోనే ఈ కథ సాగుతుంది. ఆనంద్ (యోగేష్ సోహోని)తో సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) వివాహం జరుగుతుంది. కానీ, గతంలోనే గోంధల్ ప్రదర్శకుడు సాహెబ్రావ్ (అనుజ్ ప్రభు)ను సుమన్ ప్రేమిస్తుంది. మరి.. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. కాగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం గతంలో ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’, ‘శ్వాస్’, ‘కోర్ట్’ వంటి మరాఠి చిత్రాలు పోటీలో నిలిచినా నామినేషన్ దక్కలేదు. మరి..‘గోంధళ్’కు అయినా ఆస్కార్ నామినేషన్ లభిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’, ‘లగాన్ ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్లోని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందినప్పటికీ అవార్డు మాత్రం లభించలేదు. -
అందుకే నటనకు గుడ్ బై – అనంత్‌నాగ్
‘‘ఇకపై నేను సినిమాల్లో నటించను.. మళ్లీ నటించాలనే ఆలోచన కూడా నాకు లేదు’’ అని కన్నడ సీనియర్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌నాగ్ తెలిపారు. బెంగళూరులోని యశవంతపురలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. నాసిరకం కథలు వస్తున్నాయి. ఇటీవల కథల్లో నాణ్యత లోపించింది. కథ, కథనం కంటే బాక్సాఫీస్ కలెక్షన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను ఒప్పుకుని నటించిన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. ఆ క్షణం నుంచి ఇకపై సినిమాల్లో నటించరాదని నిర్ణయించుకున్నా. అంతేకానీ నటించకపోవటానికి ఆరోగ్య సమస్యలు ఏమాత్రం లేవు. ప్రస్తుత సమకాలీన దర్శకులతో పని చేయటం ఇష్టం లేదు. మంచి విషయం, ప్రేక్షకులను పట్టించుకోకుండా కేవలం వసూళ్ల కోసమే వెంపర్లాడుతున్న సంస్కృతి ఇండస్ట్రీలో ఉంది’’ అని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన అనంత్‌నాగ్ తాజా నిర్ణయం ఆయన అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఆయన మళ్లీ సినిమాల్లో నటించాలని పలువురు అభి్రపాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే... సినిమా రంగానికి అనంత్‌నాగ్ చేసిన విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. – ఆనంద రెడ్డి, సాక్షి, యశవంతపుర -
విజయ్ తనయుడి తొలి సినిమా.. ట్రైలర్ వచ్చేసింది
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం సిగ్మా. ఈ మూవీలో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా గాంధీ జయంతి రోజున థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా సిగ్మా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే డ్రగ్స్, మత్తు, జూదం కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీలో ఫరియా ఆర్జేగా అలరించనుంది. ఈ ట్రైలర్లో సన్నివేశాలు చూస్తుంటే డ్రగ్స్ మాఫియా చుట్టు కథనం ఉండనుందని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా.. ఎన్ వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. -
స్టార్ హీరోల సీక్వెల్స్.. ఊహించని విధంగా డిజాస్టర్స్..!
ప్రస్తుతమున్న సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ అనే పదం కామన్ అయిపోయింది. కానీ ప్రతి సినిమాకు కొనసాగింపుగా ఎడాపెడా సీక్వెల్స్ తీసేస్తున్నారు. పార్ట్-1 సక్సెస్ అయినంత ఈజీగా.. సీక్వెల్ ఆదరిస్తారని భ్రమలో ఉన్నారు మేకర్స్. పెద్ద హీరోల సినిమాలకు సీక్వెల్ తీయడం అంత సులువేమి కాదు. మొదటి పార్ట్‌కు ఉన్నంత ఆదరణ వస్తుందో లేదో చెప్పలేం. ఏదైనా తేడా కొట్టిందంటే మొదటికే మోసం వస్తుంది. అలా ఇటీవల కాలంలో రిలీజైన అగ్రహీరోల సినిమాల సీక్వెల్స్ సైతం బాక్సాఫీస్ వద్ద బోక్కబోర్లా పడ్డాయి. అవేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.కార్తీ సర్దార్-2లో సత్తాలేదు..కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటించిన చిత్రం సర్దార్ 2. గతంలో వచ్చిన సర్దార్ మూవీకి సీక్వెల్‌గా తెరక్కిక్కించారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సీక్వెల్ సక్సెస్ అవుతుందని భావించిన నిర్మాతలకు నిరాశే ఎదురైంది.డిజాస్టర్‌గా ఇండియన్-2..కమల్ హాసన్ భారతీయుడు అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించింది. అదే కాన్ఫిడెన్స్‌తో ఇండియన్-2 నిర్మించారు మేకర్స్. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ 2024లో రిలీజైంది. ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మొదటి ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు దేశవ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. అలా భారీ అంచనాలలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమై డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ యుద్ధంలో వార్-2 ఫెయిల్..గతంలో సూపర్‌హిట్‌గా నిలిచిన బాలీవుడ్ మూవీ వార్. ఈ మూవీకి సీక్వెల్‌గా వార్-2 తెరెకెక్కించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. సీక్వెల్‌పై గంపెడాశలు పెట్టుకున్న నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది.కలిసిరాని అఖండ-2..టాలీవుడ్ హీరో బాలయ్య నటించిన హిట్ మూవీ అఖండ. మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో సీక్వెల్ తెరకెక్కించారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. రోటీన్ రొడ్డకొట్టుడు కంటెంట్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. సీక్వెల్‌తో సక్సెస్ కొడదామనుకున్న మేకర్స్‌కు అఖండ-2 షాకింగ్ ఫలితాన్నిచ్చింది.డబుల్ ఇస్మార్ట్.. డబుల్ షాక్టాలీవుడ్లో మరో మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ పోతినేని. గతంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ అభిమానులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పార్ట్-1 హిట్ కొట్టామన్న కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది కాస్తా బెడిసికొట్టింది. అదే రోటీన్ కంటెంట్ ఉండడంతో అభిమానులు మొహం చాటేశారు. దీంతో సీక్వెల్‌తో సత్తా చాటుదామనుకున్న మేకర్స్‌కు నిరాశే ఎదురైంది.ఇలా హిట్ అయిన ప్రతి సినిమాకు సీక్వెల్ తీసుకుంటే పోతే రిజల్ట్ తేడా రావడం ఖాయంగా కనిపిస్తోంది. రోటీన్ కంటెంట్‌ను ప్రేక్షకులు ఆదరించరని ఇప్పటికైనా మేకర్స్ తెలుసుకోవాలి. సీక్వెల్ ఆలోచన ఓకే కానీ.. కంటెంట్ భిన్నంగా, ఆసక్తిగా ఉండేలా చూసుకుంటేనే సక్సెస్ సాధించే అవకాశముంది. అంతేకానీ ప్రతి హిట్ మూవీకి సీక్వెల్ తీస్తామంటే ఇదిగో ఇలాగే డిజాస్టర్స్ మూటగట్టుకోవాల్సిందే. పుష్ప, దురంధర్, కాంతార లాంటి సినిమాల్లాగే సీక్వెల్స్ సక్సెస్ రావాలంటే కంటెంట్‌పై మరింత దృష్టి పెట్టాల్సిందే. -
వరల్డ్ ఆఫ్ వెట్టువం.. శోభిత యుద్ధ కళ చూశారా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ వెట్టువం. ఈ మూవీలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్ సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో దాదాపు ఐదు నిమిషాల వీడియో పంచుకున్నారు. ఇందులో కథ ఎలా ఉండనుందనే విషయాన్ని రివీల్ చేశారు. ఈ కథ మూడు కాలాల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఇందులో నటీనటులు ప్రాచీన యుద్ధ కళలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కోడలు శోభిత సైతం తన పాత్ర కోసం ప్రాచీన యుద్ధకళ నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Wow I love the world building!! looks like you put in a lot of work Sobhita … Looks too good😊💐Waiting for this one!!https://t.co/N9W8IH7BxM A film by @beemji @officialneelam @LearnNteachprod @Saidevanand3 @mr_saivenkat @arya_offl @vr_dineshravi #SobhitaDhulipala…— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 18, 2026 -
రజినీకాంత్ జైలర్-2.. సూరజ్ వెంజరమూడు పవర్ఫుల్ రోల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు రోల్‌ను రివీల్ చేశారు. ఈ మూవీలో ఆయన దిలీప్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియో పంచుకున్నారు. ఇందులో కారుపై కూర్చుని సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కనిపించారు. ఇది చూస్తంటే సూరజ్ పవర్‌పుల్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది. కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. Introducing Suraj Venjaramoodu as Dileep from the world of #Jailer2 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial #SurajVenjaramoodu @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju @kabilanchelliah… pic.twitter.com/fqPDTqHo18— Sun Pictures (@sunpictures) September 18, 2026 -
మమితా బైజు మూవీ.. బాక్సాపీస్ వద్ద మరో రికార్డ్
సినిమాల సక్సెస్ కావాలంటే కంటెంట్ మాత్రమే కింగ్ అని మరోసారి రుజువైంది. ఇటీవల మలయాళంలో రిలీజైన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన బెత్లెహమ్ కుటుంబ యూనిట్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా మరో మైలురాయి చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 27 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మలయాళ రొమాంటిక్ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గిరీష్ ఎ. డి. దర్శకత్వం వహించగా.. భావనా స్టూడియోస్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కీలక పాత్రల్లో నటించారు. హీరోయిన్ మమితా బైజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సైతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయాలతో మమితా బైజు పట్టిందల్లా బంగారమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఆమె డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్గా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. -
‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.‘సినిమాకి చాలా కష్టపడ్డాను. కథ డిమాండ్ చేసింది కాబట్టే జడలు వేసుకున్నా. ఊరికే ఎవరైనా వచ్చి వేయమంటే వేయను. సోషల్‌మీడియాలో ఏ చిన్న తప్పు దొర్లినా ట్రోల్ అవుతోంది. కానీ కథకు అనుగుణంగా ఈ రిస్క్ తీసుకున్నా. ‘ఆయా షేర్’ సాంగ్ విడుదలైన తర్వాత రీల్స్ చేసేందుకు చాలా మంది జడలు కొన్నారట. సుమారు లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయట. ఈ విషయం మా టీమ్ చెప్పింది’ అని తెలిపారు. Nani ki #Paradise lo jadalu pettadam…mother character thanaki koothuru kavali ani edho emotion valla ayyuntadha?Just a thought?? pic.twitter.com/yH4g7fTMAu— AlluArjunFANS (@AlluArjunFFANS) September 17, 2026 -
నటనకు ప్రాణం పెట్టిన తారలు.. కోట్లలో కలెక్షన్లు
బయోపిక్ అంటేనే ఓ సవాల్. నిజజీవితంలో తెలిసిన వ్యక్తులను తెరపై వారి పాత్రలో నటించి మెప్పించడం అంత ఈజీ మాట కాదు. వారి హావాభావాలు, నడక, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ప్రముఖల బయోపిక్‌లో నటించడం నటీనటులకు సవాల్‌తో కూడుకున్న పని. కొంచం అటు ఇటు అయితే అటు డైరెక్టర్లకి, ఇటు యాక్టర్లకీ ట్రోలింగ్ తప్పదు. అయితే ఇంతటి కఠిన పరీక్షలోనూ కొంతమంది తారలు అలాంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా ఉన్నారు. బయోపిక్ కథాంశంతో వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇలా తెలుగు విడుదలైన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మనం చూద్దాం.మహానటిగా కీర్తి సురేశ్తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటి సావిత్రి. ఈమె కోసం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి నటి జీవితాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. తెరపై సావిత్రిగా కనిపించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి ఆదరణ పొందడంతో కీర్తి సురేశ్‌కు ఏకంగా ఉత్తమ నటి జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమా 2018లో విడుదలై సుమారు 90కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తలైవిగా కంగనా రనౌత్..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఇందులో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా విడుదల సమయంలో కంగనా లుక్, నటనపై చర్చ జరిగింది. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. 2021లో విడుదలైన ఈ చిత్రం సుమారు 50 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది.గుంగూబాయిగా అలియా భట్ముంబైలోని కామాఠిపుర ప్రాంతంలో ప్రముఖరాలిగా ఎదిగిన గంగూబాయి జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కాఠియావాడి’. సాధారణ యువతిగా మొదలై కామాఠిపురంలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగిన గంగూబాయి పాత్రలో అలియా భట్ విభిన్నమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రానికి అలియాకు మంచి ప్రశంసలు అందాయి. 2022లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 126 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది.గంజన్ సక్సేనాగా జాన్వీ కపూర్జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కార్గిల్ ముద్ధంలో సేవలందించిన భారత వైమానిక దళ అధికారిణి గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కోవిడ్ కారణంగా థియేటర్లలో విడుదలకానప్పటికీ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక..ఇప్పుడు ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగా నటించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నరు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. -
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ముకేశ్, నీతా అంబానీ నిర్వహించిన గణేశ్ వేడుకలకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే కొందరు నెటిజన్లు కత్రినా ప్రెగ్నెన్సీకి ముందు, ఆ తర్వాతి ఫొటోలను పోల్చుతూ ఆమె లుక్‌పై కామెంట్లు చేశారు. దీంతో కత్రినాపై జరుగుతున్న బాడీ షేమింగ్‌పై పాకిస్థాన్ నటుడు, గాయకుడు అలీ జాఫర్ స్పందించాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..)‘ఆమెను బతకనివ్వండి’కత్రినా గురించి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని అలీ జాఫర్ తెలిపాడు. మహిళల శరీరం, రూపంపై సమాజం పెట్టుకున్న ప్రమాణాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా పురుషులు తమ ఆలోచనా విధానాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని సూచించాడు. ప్రతి మహిళకు తనదైన జీవితం ఉంటుందని ఆమె గతం, భవిష్యత్తు గురించి బయటివారు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ‘ఆమెను బతకనివ్వండి.. మీరు మీ జీవితంపై దృష్టిపెట్టండి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కత్రినా కైఫ్‌కు మద్దతుగా నిలిచాడు.కత్రినాపై గతంలోనూ ఇలాంటి కామెంట్లు రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. నటి శివాలీకా ఒబెరాయ్ సైతం కత్రినా పోస్ట్ ప్రెగ్నెన్సీ లుక్‌పై వస్తున్న విమర్శలను ప్రశ్నిస్తూ.. ఇది మాతృత్వం అని పేర్కొంది.(ఇదీ చదవండి: ఈసారి నాని కాదు.. ఆ పేరుతో పిలుస్తారు: నాని) -
బిగ్‌బాస్‌లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రేసులో భాగంగా లెవెల్-2లో పోటీదారులకు వరుసగా టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో తొలి టాస్క్‌లో రోహిత్ తన సత్తా చాటలేకపోవడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో దెబ్జానీ, రాంప్రసాద్, త్రిగుణ్ మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా మిగిలారు. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది..! ఒకసారి చూద్దాం రండి!ఇదీ చదవండి: ఈ ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! స్పీడ్ అండ్ సక్సెస్..లెవెల్-2లో మిగిలిన సభ్యులకు బిగ్‌బాస్ ‘స్పీడ్ అండ్ సక్సెస్’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌ను రెండు స్టేజ్‌లుగా నిర్వహించారు. మొదటి స్టేజ్‌లో పోటీదారులు స్టార్టింగ్ పాయింట్ నుంచి టేబుల్ కింద ఉన్న సందుల్లోంచి ముందుకు వెళ్లాలి. అనంతరం టేబుల్‌పై ఉన్న గ్యాప్స్‌లో వేళ్లు పెట్టి.. పైన ఉంచిన ఐదు డిస్కుల్లో ఒక్కో డిస్క్‌ను బయటకు తీసుకురావాలి. అలా తీసుకున్న డిస్క్‌ను టేబుల్‌పై ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎండింగ్ పాయింట్ వరకు జరిపి కిందకు పడేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న టైర్లలో కాళ్లు పెడుతూ వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి. చివరికి డిస్క్‌ను నిర్ణయించిన లైన్ దగ్గర పెట్టాలి. ఇలా ఐదు డిస్కులను లైన్ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత రెండో స్టేజ్ ప్రారంభమవుతుంది. రెండో స్టేజిలో లైన్ దగ్గర నిలబడి.. తాము తీసుకొచ్చిన ఐదు డిస్కులను ఎదురుగా ఉన్న టేబుల్‌పైకి ఒక్కొక్కటిగా విసిరి ల్యాండ్ చేయాలి. నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన ఇద్దరు విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. విజేతలే కెప్టెన్సీ కంటెండర్లుగా కొనసాగుతారని, చివరి స్థానంలో నిలిచిన వారు కెప్టెన్సీ రేసు నుంచి నిష్క్రమిస్తారని తెలిపాడు. ఈ టాస్క్‌కు నరేశ్‌ను సంచాలకుడిగా నియమించారు. పోటీదారులు గెలుపు కోసం హోరాహోరీగా పోటీ పడగా.. చివరికి రాంప్రసాద్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.మళ్లీ హౌస్‌లోకి చరణ్..ఇక అందరూ ఊహించినట్లుగానే చరణ్ మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడి రాకతో హౌస్‌లో సందడి నెలకొంది. వచ్చిరావడంతోనే ఈసారి తన టాలెంట్ ఏంటో చూపిస్తానని గట్టి పంతానే విసిరాడు. మరోవైపు నరేశ్, రాంప్రసాద్ అక్కడున్న కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ కాసేపు నవ్వులు పూయించారు. చరణ్‌కు స్పెషల్ పవర్..కొత్తగా హౌస్‌లోకి వచ్చిన చరణ్‌కు బిగ్‌బాస్ ఓ ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని కెప్టెన్సీ రేసులో పాల్గొనకుండా చేయడంతో పాటు.. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన వారిలో ఒకరితో ఛాలెంజ్ చేసి గెలిస్తే తాను కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కల్పించాడు. ఈ రెండు ఆప్షన్లలో చరణ్ రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. దీంతో అప్పటికే కెప్టెన్సీ కంటెండర్‌గా ఉన్న త్రిగుణ్‌తో ఛాలెంజ్‌కు సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. చివరికి త్రిగుణ్ విజేతగా నిలిచినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చీ రావడంతోనే చరణ్‌కు ఇది మొదటి అపజయం. ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే.. -
అద్భుతమైన ప్రయాణం
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ అనేపాత్రలో నటిస్తున్నారు దుల్కర్ సల్మాన్.ఈ సినిమాని నవంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, గురువారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. నవంబర్ 20న మీ అందరికీ (ప్రేక్షకులు) ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు దుల్కర్. -
సూర్య ఫేవరేట్ రోల్.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల సూపర్ హిట్ అందుకున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సూర్య కొత్త మూవీ టీజర్ కూడా వచ్చేసింది.ప్రస్తుతం సూర్య.. జితు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి సీన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని సీన్స్ సింగం-2 మూవీని తలపించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్గా కనిపించనుండగా.. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నట్లు టీజర్లోనే రివీల్ చేశారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. -
ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! 40 రోజుల్లోనే..
నీమ్ కరోలి బాబా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘హనుమాన్ అంశ్’. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రూ.291.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 40 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోబినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో విశ్వాసం, ప్రేమ, సేవ, భక్తి వంటి అంశాలను చూపించారు.ముగ్గురు మహిళల పెట్టుబడి..‘హనుమాన్ అంశ్’ నిర్మాణంలో ముగ్గురు మహిళలు కీలకంగా వ్యవహరించారని మీకు తెలుసా. రాగిణి సోనా, నమ్రత జీ. సింగ్‌తో పాటు 21 ఏళ్ల అనుప్రియా నగర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఒక్కొక్కరు సుమారు రూ.60 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామని అందులో ఒకరైన అనుప్రియా వివరించారు. అయితే తాను సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రాజెక్టులో లేనని అనుప్రియా స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దశలో తాను చిత్ర బృందంలోకి వచ్చినట్లు తెలిపింది. ‘నేను ముగ్గురు మహిళా నిర్మాతల్లో చిన్నదాన్ని. షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలోకి వచ్చాను. పోస్ట్ ప్రొడక్షన్ కోసం డబ్బులు అవసరమైన సమయంలో నా వంతు పెట్టుబడి పెట్టాను’ అని అనుప్రియా తెలిపింది.దర్శకుడు ఏమన్నారంటే?అనుప్రియా పాత్రపై దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా స్పందించారు. ఆమె తమ బృందంలో నిర్మాతేనని, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచారని చెప్పారు. అయితే అనుప్రియా కథ రాశారని, సినిమాను ఆమె క్యూరేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఆమె స్వయంగా ఆ విషయాన్ని ఖండించారని తెలిపారు. ఇక అసలు నిర్మాతలైన రాగిణి సోనా, నమ్రతా సింగ్ కూడా సినిమాకు ఎంతో కష్టపడ్డారని విశాల్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?)ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆఫర్లుథియేటర్లలో ఊహించని విజయాన్ని అందుకోవడంతో ‘హనుమాన్ అంష్’పై ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒకటి, రెండు కాకుండా మూడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ సినిమా హక్కుల కోసం సంప్రదిస్తున్నట్లు నిర్మాత రాగిణి సోనా వెల్లడించారు. అయితే ఈ సినిమాను మొదటి నుంచే ఓటీటీ కోసం తెరకెక్కించలేదని ఆమె స్పష్టం చేశారు. పెద్ద తెరపైనే ప్రేక్షకులు సినిమాను చూడాలనేది తమ ఉద్దేశమని తెలిపారు.22 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..దర్శకుడు విశాల్ చతుర్వేది ప్రకారం.. తొలుత 26 రోజుల షూటింగ్‌కు బడ్జెట్ సిద్ధం చేసుకున్నారట. అయితే ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో 22 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేశారట. పరిమిత వనరులతో సినిమాను పూర్తి చేయడం తమకు పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. కాగా అనుమన్ అంశ్ తెలుగులో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. -
‘ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు’
గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో విద్యాంసురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎం.ఎస్’. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ బయోపిక్ తీయాలని స్ఫూర్తి పొందాం‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిసిన తర్వాత ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎంఎస్ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించారో చాలా మందికి తెలీదు. అమ్మ సంగీతాన్ని రీక్రియేట్ చేసేంత గొప్పవాళ్లం కాదు. అందుకే అనిరుధ్ సంగీతంతో ఓ గొప్ప బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నాం’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కాగా చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్మికపై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి కమల్‌హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!) -
‘బాహుబలి, పుష్పాలకే ప్లాప్ అన్నారు.. తెలుగోళ్లకే ఎందుకిలా ?’
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెట్లు.. ఆడపిల్ల అని కూడా చూడలేదు)‘సంజయ్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, గుర్తింపు ఇచ్చారు. సంజయ్ అనుకుంటే ఎవరితోనైనా సినిమా చేయగలరని, కానీ నాతోనే తొలి చిత్రంలో హీరోగా తనను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘సిగ్మా’ కోసం నన్ను ఎంపిక చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ తెలుగులో మాత్రం సందీప్‌ను ఎందుకు హీరోగా తీసుకున్నారనే ప్రశ్నలు వచ్చాయని సందీప్ తెలిపారు.మనోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తాం?తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటని సందీప్ అన్నారు. అయితే ఆ సినిమా విడుదలైన తొలినాళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్లాప్ టాక్ వచ్చిందని గుర్తుచేశారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. ‘మనోళ్లను మనం పెంచుకోవడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి గొప్పగా చేస్తుంటే.. ‘తెలుగోళ్లు ఏదో చేయగలరు’ అంటూ ఇతర రాష్ట్రాల వారు మన టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. ఇదే మన తెలుగు గొప్పతనం’ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.కాగా సినిమా విషయానికి వస్తే ‘సిగ్మా’లో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ‘సిగ్మా’పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. -
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో జేసన్ సంజయ్ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలు తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు.నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు ‘‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్న జేసన్ సంజయ్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా అందర్నీ వినోదపరుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా లైకాప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ తెలుగు–తమిళ భాషల్లో నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో జేసన్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘నేను కాలేజీలో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ చదువుకున్నాను. సినిమా ప్రయాణంలో 24 క్రాఫ్ట్స్‌తో కలిసి పని చేశాను. ఈ ప్రయాణంలో మా నాన్న (విజయ్), నా కుటుంబం, అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన నచ్చడంతోనే ‘సిగ్మా’ కోసం ఆయనను హీరోగా ఎంపిక చేశాను. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘సిగ్మా’ నా తొలి తమిళ చిత్రం అయినప్పటికీ డబ్బింగ్ చెప్పాను’’ అని ఫరియా పేర్కొన్నారు. ‘‘సిగ్మా’తో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరో పెద్ద విజయం సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు మైత్రీ శశిధర్ రెడ్డి. -
కేంద్ర సెన్సార్ బోర్డులో సుప్రియ, ప్రీతి జింటా.. CBFCలో కీలక మార్పులు
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో చోటు దక్కింది. CBFCని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ప్రకటించింది.ఛైర్మన్‌గా శశి శేఖర్ వేంపటి కొనసాగనుండగా, సుప్రియతో పాటు బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, రిక్కీ కేజ్ తదితర సినీ, కళారంగ ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. -
హాలీవుడ్‌లోకి ‘మహారాజా’.. తొలి చిత్రంగా రికార్డు!
ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మన కథల్లోని కంటెంట్ నచ్చితే.. వాటిని ఇతర భాషల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సినిమాలు బాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మరో తమిళ సినిమా హాలీవుడ్ గడప తొక్కేందుకు సిద్ధమైంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం హాలీవుడ్లో రీమేక్ కానుంది.నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహారాజ’ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి తనదైన నటనతో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయన కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటికి తెరదించుతూ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్ స్టూడియోస్’ అధికారికంగా ఈ రీమేక్‌ను ప్రకటించింది.(ఇదీ చదవండి: ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది)‘మహారాజ’ను హాలీవుడ్లో రీమేక్ చేయడం తమకు ప్రత్యేకమైన మైలురాయిగా పేర్కొన్న నిర్మాణ సంస్థ.. హాలీవుడ్లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా ఇది నిలుస్తుందని వెల్లడించింది. దీంతో తమిళ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే హాలీవుడ్ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.(చదవండి: నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక)ఇక ఈ రీమేక్‌లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను ఆస్కార్ అవార్డు అందుకున్న ఓ స్టార్ హీరో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘మాథ్యూ’ అనే హాలీవుడ్ స్టార్ పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే హాలీవుడ్ రీమేక్‌లో నటించబోయే నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.కాగా.. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా ‘మహారాజ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు పలు అవార్డులు కూడా దక్కాయి. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు.. చైనాలో విడుదలైన తర్వాత అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం విశేషం.ఇప్పటికే ‘మహారాజ’ కథ, విజయ్ సేతుపతి నటనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రీమేక్‌కు రంగం సిద్ధం కావడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. హాలీవుడ్ నటీనటులతో ఈ కథను ఎలా తెరకెక్కిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక
తమిళ స్టార్ జంట సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2006లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్టియన్ పద్ధతిలో పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని కొత్త జంటలా వివాహం చేసుకున్నారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 'ది సీక్వెల్- 20 ఏళ్ల ప్రేమకు మరో ప్రతిజ్ఞ' పేరుతో వీడియో షేర్ చేసిన జ్యోతిక తన మనసులోని మాటలకు అద్భుతమైన అక్షరరూపం ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'20 ఏళ్ల వైవాహిక బంధం.. ఎన్నో మధుర జ్ఞాపకాలు. చిన్న చిన్న మనస్పర్థలు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, త్యాగాలు, మరీ ముఖ్యంగా ఎలాంటి అంచనాల్లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఇది పరిపూర్ణమైన పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఒకరి కోసం మరొకరు మారుతూ, ఎదుగుతూ వచ్చిన మనం అనే బంధానికి ఇది ఓ వేడుక. ఒకప్పుడు కలలా అనిపించిన జీవితం.. ఇప్పుడు నా జీవితాంతం కలగనేంత అందమైన నిజంలా మారింది''ఇకపై నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. జీవితంలో ఇబ్బందులు ఎదురైతే అందులోని పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకున్నాను. జీవితాన్ని ప్రతిరోజూ వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇకపై ఎలాంటి ఫిర్యాదు చేయను. కృతజ్ఞతతో ఉంటాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. మంచి తల్లిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.తన భర్త సూర్య గురించి మాట్లాడుతూ.. 'నేను ఎప్పటికీ నీతో గొడవపడతాను. మళ్లీ నేనే వచ్చి మాట్లాడతాను. ప్రతి చిన్న గొడవ తర్వాత మన బంధం మరింత దగ్గరవుతుందని నమ్ముతాను. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో అన్నింటికంటే విలువైనది మన స్నేహమే. ఓ వ్యక్తి నాతో సమానంగా, మనసులోని మాటలు చెప్పుకోగలిగే నమ్మకస్తుడిగా, గాసిప్ పార్ట్నర్గా, బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండటం అరుదు. అలాంటి వ్యక్తే నా భర్తగా, నా పిల్లలకు తండ్రిగా నా జీవితంలో ఉండటం నేను చేసుకున్న అదృష్టం. ఇది 20 ఏళ్ల ప్రయాణానికి ముగింపు కాదు. మరో 20 ఏళ్లకు ఆరంభం' అని జ్యోతిక భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: పదేళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
దీపావళికి మహాశక్తి
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నామని యూనిట్ పేర్కొంది. నయనతార లీడ్ రోల్లో ఆర్జె బాలాజీ, ఎన్జె శరవణన్ దర్శకత్వం వహించిన ‘మూకుత్తి అమ్మన్’ 2020 నవంబరు 14న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందుతోంది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్‌పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార నటన, కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ పేర్కొన్నారు. గతంలో ‘మూకుత్తి అమ్మన్’ చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘మహాశక్తి’ని కూడా నవంబర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పండగ సమయంలో దైవిక కథాంశంతో కూడిన చిత్రాలకు కుటుంబ ప్రేక్షకాదరణ బాగుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. -
'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?
ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి సమయంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ రేట్ల పెంపుతో వస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ చిత్రం ప్రీమియర్స్‌కు ఫ్లాట్‌గా రూ.400 ధర నిర్ణయించినట్లు, తొలి రోజు నుంచి పది రోజుల వరకు ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక జీవోలు రావాల్సి ఉంది.అయితే అసలు ప్రశ్న టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారనేది కాదు.. ఎందుకు పెంచుతున్నారనేదే. కంటెంట్‌పై నమ్మకం ఉంటే సాధారణ ధరలతోనే సినిమా విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ‘ఇరుముడి’ వంటి సినిమాలు నిరూపించాయి.‘ది ప్యారడైజ్’ మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమాను ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తూ ఓ రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుతో మరో రిస్క్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందా.. లేక ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందా అనేది రిలీజ్ తర్వాతే తేలనుంది.తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 24 తేదీనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. -
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు
ప్రముఖ మలయాళ బ్యూటీ అహానా కృష్ణ పెళ్లి పీటలెక్కింది. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని ఆమె పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక కేరళ కోవలంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి ఫోటోలను అహానా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్, సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ సందడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. రాజీవ్ రవి దర్శకత్వం వహించిన 'నాన్ స్టీవ్ లోప్స్' చిత్రంతో అహానా కృష్ణ హీరోయిన్గా పరిచయమయ్యారు. అంతేకాకుండా అహానా బీజేపీ నాయకుడు, నటుడు జి. కృష్ణకుమార్ కుమార్తె కావడం విశేషం. ఆమె నటించిన తొలి చిత్రానికి నిమిషా రవి సహాయ కెమెరామెన్‌గా పనిచేశారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అహానా నటించిన'లూకా'మూవీకి సైతం నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా నిమిష్ రవి గుర్తింపు తెచ్చుకున్నారు. Ace cameraman #NimishRavi and actor & creator #AahaanaKrishna got married on Sep 13 in Kovalam, Kerala. Wishing the couple all the best🔥❤️ pic.twitter.com/lckqMZm2XF— Sreedhar Pillai (@sri50) September 15, 2026 -
‘5వేలు పోతే.. 500 కోట్లు వస్తాయి..!’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేడు ఆయన దేశంలోనే అత్యంత పాపులర్ హీరోల్లో ఒకరు. అయితే ఈ స్థాయికి చేరుకోకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తన తల్లితో కలిసి అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు. అప్పుడే జరిగిన ఓ ఆసక్తికర ఘటనను షారుఖ్ ఖాన్ గతంలో స్వయంగా వెల్లడించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. రూ.500 కోట్లు సంపాదిస్తావని..2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన షారుఖ్.. తన తల్లితో కలిసి అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన తల్లి దర్గాకు వెళ్లారట. చాదర్ సమర్పించేందుకు వెళ్తున్న సమయంలో తన తల్లి రూ.5 వేల నగదును షారుఖ్‌కు ఇచ్చారట. అయితే కొంతసేపటి తర్వాత ఆ డబ్బు కనిపించకుండా పోయిందట. షారుఖ్ దానిని వెతుకుతుండగా అక్కడే ఉన్న ఓ ఫకీర్ ఆయనను పిలిచి ఏదైనా పోగొట్టుకున్నావా? అని అడిగారట. షారుఖ్ అవునని చెప్పడంతో.. ఎంత డబ్బు పోయిందని కూడా ఆ ఫకీర్ చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత ఆ ఫకీర్ చెప్పిన మాటలు షారుఖ్ జీవితంలో నిజమైనట్టే అనిపించాయట. ‘నువ్వు ఇక్కడికి వచ్చావు. ఖాళీ చేతులతో వెళ్లవు. రూ.5 వేలు పోగొట్టుకున్నావు.. కానీ రూ.500 కోట్లు సంపాదిస్తావు’ అని ఫకీర్ చెప్పారట. (ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు సర్ప్రైజ్) షారుఖ్ పెద్దగా నమ్మలేదట..అప్పట్లో ఈ మాటలను షారుఖ్ పెద్దగా నమ్మలేదట. కానీ ఆ ఘటన మాత్రం ఆయన మనసులో నిలిచిపోయింది. తర్వాత బాలీవుడ్లో అగ్ర హీరోగా ఎదిగి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. భారీ స్థాయిలో సంపద కూడా కూడబెట్టారు. అయితే ఈ ఘటనను కేవలం డబ్బుతో ముడిపెట్టడం సరికాదని షారుఖ్ తెలిపారు. (ఇదీ చదవండి: షాలినీపై నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు.. బిగ్‌బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్)షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్..షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్ 1991లో కన్నుమూశారు. ఆ తర్వాత ఏడాదికే ‘దీవానా’ సినిమాతో షారుఖ్ బాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టారు. తన తల్లి తన విజయాన్ని చూడాలని ఎంతో కోరుకున్నానని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలోనే తొలిసారి ప్రార్థించానని షారుఖ్ గతంలో గుర్తుచేసుకున్నారు. ఆమె చివరి క్షణాల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.అజ్మీర్ షరీఫ్ దర్గా సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీకి అంకితం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం. అన్ని మతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. షారుఖ్ కూడా తన జీవితంలో పలుమార్లు ఈ దర్గాను సందర్శించారు. -
ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు సర్ప్రైజ్
‘ఇరుముడి’ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నక్షత్ర (మణమ్మ) కీలక పాత్రలో నటించింది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రీకూతురు సెంటిమెంట్ సన్నివేశాల్లో నక్షత్ర నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సన్నివేశాలను చూసి చాలామంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)నక్షత్రతో కేక్ కట్ చేయించి..తాజాగా నక్షత్ర చదువుతున్న పాఠశాల యాజమాన్యం ఆమె విజయాన్ని ప్రత్యేకంగా అభినందించింది. స్కూల్లో నక్షత్రతో కేక్ కట్ చేయించి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. చిన్నారి నక్షత్రను అందరూ ప్రశంసిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విజయంతో పాటు నక్షత్ర నటనకు ఇంతటి గుర్తింపు రావడంపై నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే.. Nakshatra Celebrated the success of #Irumudi with her teachers and friends l! 🥹✨#RaviTeja #BlockbusterIrumudi pic.twitter.com/lrCyYv01IB— Neeraj Kumar (@73forever_) September 15, 2026 -
పెళ్లి చేసుకున్న 'పవి టీచర్'.. ఫొటోలు వైరల్
'ఆహా కళ్యాణం' వెబ్ సిరీస్‌లో పవి టీచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి బ్రిగిడా సాగా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు ఆనంద్ రామ్‌తో కొత్త జీవితం ప్రారంభించింది. వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.(ఇదీ చదవండి: శుభవార్త చెప్పేసిన రష్మిక ఫ్రెండ్-సీరియల్ హీరోయిన్)బ్రిగిడా సాగా సొంత భాష తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. తమిళ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్‌గా వైరల్ అయిపోయిన ఈమె.. 2019లో వచ్చిన తమిళ మూవీ 'అయోగ్య'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్‌స్పాట్ టూ మచ్ తదితర చిత్రాలు చేసింది. తెలుగులో సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది.ఈ ఏడాది జూన్‌లో తన ప్రేమ సంగతి బయటపెట్టింది. జూలైలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేసింది. ఈమెని పెళ్లాడిన ఆనంద్ రామ్ కూడా నటుడే. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. ఓ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
ఈ తార పట్టిందే బంగారం.. ఏడాదిలో 1000 కోట్లు..
ఒకప్పుడు చిన్న పాత్రలతో మెప్పించిన ఈ మలయాళ భామ..ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. వరుస విజయాలు.. భారీ వసూళ్లతో మమిత బైజు క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. పట్టింది ప్రతీదీ బంగారం అన్నట్లుగా.. వరుసగా ఆమె నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ల రేంజ్లో డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఆ ఐదు సినిమాలు ఏంటి..? మమిత బైజు కేరీర్‌ను మలుపు తిప్పిన ఆ విజయాలు ఏంటో చూద్దాం..!‘కర’తో 50 కోట్లు..తమిళ హీరో ధనుష్ కథానాయకుడిగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన చిత్రం ‘కర’ ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాయి. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.‘డ్యూడ్’తో100 కోట్లుప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెల 17 విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లుకు పైగా వసూళ్లు సాధించింది. ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్‘జననాయగన్’తో 300కోట్లకు పైగా.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్( తెలుగులో జన నాయకుడు). హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. ఈ చిత్రం జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులో అంత విజయం సాధించనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూళ్లు రాబెట్టింది.బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ 300 కోట్లుబాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ కూడా ఒకటి. మమితా బైజు, నివీన్ పౌలీ నటించిన ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధించింది. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300ల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సెప్టెంబర్ 4న ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?విశ్వనాథ్ అండ్ సన్స్ 260 కోట్లుసూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరిస్తోంది. సెప్టెంబర్11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు సముద్రంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను చూసిన రజినీకాంత్ చిత్రబృందానికి మెచ్చుకున్నారు. ముఖ్యంగా సూరి నటనను ప్రశంసించారు. ఈ క్రమంలో రజినీకాంత్ స్వయంగా సూరికి ఫోన్ చేసి అభినందించారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి రజినీ కాంత్ నుంచి ఫోన్ కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజినీకాంత్.. ఆయన నటనను మెచ్చుకుంటూ స్వయంగా ఫోన్ చేశారు. దీంతో సూరి భావోద్వేగానికి గురయ్యారు. రజినీకాంత్ నుంచి వచ్చిన ఈ కాల్ తనకు ఎంతో ప్రత్యేకమని సూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో జరిగిన సంభాషణకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.ఈ చిత్రంలో సూరితో పాటు సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్ జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు నటించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తమిళం, తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబెడుతోంది. ఇది చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటనకథ ఏంటంటే..శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు.పూర్తి రివ్యూ కోసం ఇది చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
అంబానీ ఇంట గణపతి పూజోత్సవరం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోవడంతో వేడుకకకు మరింత కళ వచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సెటబ్రిటీల లక్స్, వారి సందడి నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. మరి ఎవరెవరు హాజరయ్యారో ఒకసారి చూద్దాం రండి. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు: మిర్జాపుర్ నటి
సినీ ఇండస్ట్రీలో ప్రతిభ, టాలెంట్ ఉన్నంత మాత్రాన అవకాశాలు దక్కుతాయని చెప్పలేమని నటి రసికా దుగ్గల్ అన్నారు. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమా రంగంలో అవకాశాలు ఎలా వస్తాయనే విషయంపై ఓ ఇంటర్వ్యులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి: భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు!ఆ నటీనటులకు కూడా..‘జీవితంలో కొన్నిసార్లు ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కళాత్మక ప్రతిభ కూడా అవవసరమవుతుంది. ఒక నటుడి పని పెరుగుతున్న కొద్దీ.. అతడిపై ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. నటుడు తమ ప్రాజెక్టుకు సరిపోతాడని భావించినప్పుడే కాస్టింగ్ జరుగుతుంది. పని పెరుగుతున్నప్పుడు.. ఆ ప్రాజెక్టుకు సరిపోతారని వారు భావించినప్పుడు మాత్రమే ఎంపిక చేస్తారు. అలా అనిపించకపోతే అవకాశం ఇవ్వరు. మంచి గుర్తింపు వచ్చిన నటీనటులకు కూడా అవకాశాలు చేజారడం బాధ కలిగిస్తుంది’ అని రసికా చెప్పింది.‘మిర్జాపూర్’తో గుర్తింపురసికా దుగ్గల్ ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్రియా పిల్గావోంకర్, కుల్‌భూషణ్ ఖర్బందా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: ‘కల్చర్ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. -
భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-18’ కార్యక్రమంలో తన భార్య, నటి జయా బచ్చన్ గురించి ఓ సరదా విషయాన్ని వెల్లడించారు. జయా బచ్చన్ ఈవెంట్లకు రెడీ అవ్వడానికి సమయం తీసుకుంటారని చెప్పిన అమితాబ్.. ఆమెను సమయానికి సిద్ధం చేసేందుకు తాను ఓ చిన్న ట్రిక్ ఉపయోగిస్తానని తెలిపారు.ఓ కంటెస్టెంట్.. ‘‘మీరు ఎప్పుడైనా జయాజీ రెడీ అయ్యే వరకు ఈవెంట్‌కు వెళ్లేందుకు ఎదురుచూశారా?’’ అని అమితాబ్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.టైమ్ విషయంలో బిగ్‌బీ ప్లాన్ ఇదే..‘సాయంత్రం 6 గంటలకు పెళ్లి కార్యక్రమం ఉందనుకోండి.. జయా బచ్చన్‌కు అసలు సమయం చెప్పకుండా నేను 5 గంటలకు బరాత్ వస్తుందని చెబుతాను. దాంతో ఆమె 3.30–4 గంటల నుంచే మేకప్, రెడీ అవ్వడం మొదలుపెడతారు. చివరికి మేము సమయానికి కార్యక్రమానికి చేరుకుంటాం’ అని అమితాబ్ సరదాగా చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదంఆలస్యంగా ఇంటికి వెళ్తే కూడా..జయా బచ్చన్ గురించి అమితాబ్ గతంలోనూ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. షూటింగ్ కారణంగా తాను ఆలస్యంగా ఇంటికి వస్తే జయా అసంతృప్తి చెందుతారని చెప్పారు. అందుకే తాను ఆలస్యంగా వస్తున్నప్పుడు ముందుగానే కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌లో సమాచారం ఇస్తానని తెలిపారు. షూటింగ్ ఉందని, ఇంటికి ఆలస్యంగా వస్తానని ముందే చెప్పడంతో తన కోసం భోజనం కోసం ఎదురుచూడొద్దని కుటుంబ సభ్యులకు చెబుతానన్నారు. ఒకవేళ ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆలస్యంగా ఇంటికి వెళ్తే మాత్రం.. ‘‘ఎక్కడికి వెళ్లారు? ఎందుకు చెప్పలేదు?’’ అంటూ జయా ప్రశ్నిస్తారని అమితాబ్ వెల్లడించారు.ఇదీ చదవండి:అడుగుపెట్టగానే ఫేమస్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ 1971లో ‘గుడ్డీ’ సినిమా సమయంలో తొలిసారి కలుసుకున్నారు. 1973లో వివాహం చేసుకున్న ఈ జంటకు శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇద్దరు ఉన్నారు. -
చిన్న సినిమా.. సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్..!
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ తారాగణం, బడ్జెట్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సైతం అదరగొడుతున్నాయి. ఇటీవలే రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. అలా మరో సినిమా సైతం కోట్లు కొల్లగొట్టింది. మలయాళంలో రిలీజైన బెత్లెహెం కుటుంబ యూనిట్ అనే మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.304.9 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కొత్త లోకా(రూ.302 కోట్లు) వసూళ్లును ఈ మూవీ దాటేసింది. దీంతో మలయాళ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది బెత్లెహెం కుటుంబ యూనిట్.కాగా.. ఈ చిత్రంలో నివిన్ పౌలీ, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్లో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ, బిందు పనికర్, శ్రీంద కీలక పాత్రలు పోషించారు.Congratulations to the entire team of #BethlehemKudumbaUnit on achieving INDUSTRY HIT status in Malayalam ❤️🔥A truly deserving feat for a film that gave us one of the most beautiful cinematic experiences in recent times ❤️@BhavanaStudios, Fahadh garu congratulations on backing… pic.twitter.com/Gx3xaGR4d8— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2026 -
లూయిస్ హామిల్టన్ కూడా ఇంత ఓవర్ చేయడు.. అజిత్‌పై నెటిజన్ల ఫైర్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం కార్ రేస్‌తో బిజీగా ఉన్నారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీలకు తమిళనాడు సీఎం విజయ్ సైతం హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరు కలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ఈవెంట్లో అజిత్ కుమార్ వ్యవహరించిన తీరుపై మాత్రం నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా అజిత్ సీరియస్ అయ్యారు. అతని వైపు కోపంగా చూస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.సెల్ఫీ కోరిన అభిమానిపై అజిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అభిమానులు అనే వారే లేకపోతే మీరు జీరో అంటూ అజిత్‌పై మండిపడుతున్నారు. తన అభిమానుల పట్ల అజిత్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. అభిమానులు లేకపోతే, అజిత్ పెద్ద సున్నా అంటూ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అజిత్ ఎందుకింత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు? ఇలాంటి వాళ్లు లేకపోతే నువ్వు, నీ కుటుంబం సున్నా.. ఇప్పటికైనా ఈ దురుసుతనాన్ని పక్కన పెట్టి నవ్వు.. దీనికి నీకేమీ ఖర్చు కాదంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఫార్ములా 1 స్టార్ లూయిస్ హామిల్టన్ కూడా ఇలా ప్రవర్తించడంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మొత్తానికి అజిత్ తీరుపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Kokila Williams (@dr.kokilawilliams) -
‘కల్చర్ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఆమె వేసుకున్న దుస్తులపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఐశ్వర్య స్పందించారు. తన దుస్తుల వల్ల తాను ఇబ్బందిగా ఫీల్ కాలేదని.. ఫొటోగ్రాఫర్లు వ్యవహరించిన తీరు తనకు ఇబ్బందికి గురిచేసిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈవెంట్లో ఫొటోగ్రాఫర్లు తన ముఖంపై కాకుండా అభ్యంతరకమైన కోణాల్లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీంతో తన వ్యక్తిగత హద్దులు ఉల్లంఘించినట్లు అనిపించిందన్నారు.ఇదీ చదవండి: అడుగుపెట్టగానే ఫేమస్.. ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఎవరో తెలుసా?‘ఆ సమయంలో అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. అలా అనిపించినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది. అయితే అక్కడి నెటిజన్లు నేను వేసుకున్న దుస్తుల వల్లే అలా ఇబ్బంది పడుతున్నానని అనుకున్నారు. అలా అసౌకర్యంగా ఫీల్ అవ్వడం ఎందుకు? అలాంటి డ్రెస్ ఎవరు వేసుకోమన్నారు? అంటూ నెటిజన్లు చేసిన కామెంట్స్‌ని ఆ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కల్చర్ అంటే వేసుకునే డ్రెస్‌లు మాత్రమే కాదని ఇతరులను గౌరవించడం కూడా ఒక భాగమేనని స్పష్టం చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇవరీ ఐశ్వర్య లక్ష్మిఐశ్వర్య లక్షి మొదట వైద్య వృత్తిలో కొనసాగాలని భావించినప్పటికీ.. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. 2017లో మలయాళి చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సిల్వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె మలియాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. -
ఇది 'సీఎం విజయ్' వినాయకుడు.. ఫొటోలు వైరల్
ఒకప్పుడు వినాయక చవితి అంటే పద్ధతిగా పందిరి వేసి జరుపుకొనేవారు. కానీ గత కొన్నేళ్లలో సినిమా హీరోలు, క్రికెటర్లని పోలినట్లు ఉండే వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. గతేడాది 'పుష్ప' తరహా బొమ్మలు కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి అలాంటిదేం లేనప్పటికీ తమిళనాడులో మాత్రం వినాయక చవితిలోనూ సీఎం విజయ్ మేనియానే నడుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండగ రావడంతో విజయ్ సైకిల్ తొక్కిన, కోటు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టినట్లు, అలానే గిల్లీ చిత్రంలో కబడ్డీ ఆడుతున్న విజయ్ తరహా వినాయకుడి బొమ్మలు తమిళనాడులో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్.. వీడియో) -
బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 18న కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి యావత్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిదీ ఈ చిత్రం. చిన్న సినిమాగా మొదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబరు 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మరి అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కంటెంట్ బలంగా..సాధారణంగా ప్రేక్షకులకు కంటెంట్ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ ఇదే ప్లస్ పాయింట్‌గా మారుతుందా లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్ఎంతవరకు ప్రభావం చూపుతుందని..అయితే తెలుగు మార్కెట్ పూర్తిగా భిన్నం. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమయంలో.. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటంతో సినిమాకు అదనపు క్రేజ్ వస్తోంది.కేవలం వసూళ్లను చూసి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. తెలుగు నేటివిటీకి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది అసలు పరీక్ష. హిందీలో ప్రేక్షకులను మెప్పించిన అంశాలు తెలుగులోనూ వర్కౌట్ అయితే ‘హనుమాన్ అంశ్’ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..ఆదర్శ కుటుంబం..మరోవైపు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ స్పెషల్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసిన సందర్భంగా చిత్రబృందం ఆమెకు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో రష్మికను అభినందించేందుకు విజయ్ దేవరకొండ కూడా సెట్‌కు వచ్చారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..షూటింగ్ పూర్తయిన సందర్భంగా..రష్మిక షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ ఆమెను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన జంటను ఇలా చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు It's a wrap for Jayamma ✨We will dearly miss you on sets, @iamRashmika ❤️The much loved #EndhayyaSaami out very soon.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥▶️https://t.co/tqKGJM7RdG#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/qHX008QMkF— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు
రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. గత నెల మూడో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. చిన్నాపెద్దా అని తేడాలేకుండా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. ఈ సినిమాని చూసిన పలువురు ఇప్పటికే ప్రశంసలు కురింపించారు. ఆ తరహాలోనే 'ఇరుముడి' విడుదలైన సమయంలో సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని చిరంజీవి, రామ్‌చరణ్‌లు అభినందించారు. తాజాగా ‘ఇరుముడి’ టీమ్‌ని స్వయంగా కలిసి మరో సారి శుభాకాంక్షలు తెలిపారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ నిర్మాతలు నవీన్ , వై. రవి శంకర్ లతో ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అడుతోంది. ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన A special moment of celebration ❤️🔥Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI /… pic.twitter.com/qncXARM9eY— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగు
తెరపై మాస్ హీరోగా అభిమానులను అలరించే రామ్ పోతినేని.. నిజ జీవితంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ అభిమాని గురించి తెలుసుకుని గతంలో అండగా నిలిచిన ఆయన.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల శశి చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని గతంలో చెప్పాడు. తాజాగా ఆమె కుటుంబానికి అవసరమైన వస్తువులను పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మంచానికే పరిమితం..తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి కొంతకాలంగా తీవ్రమైన అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి కారణంగా ఆమె మతిస్థిమితం కోల్పోయి చాలా ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా రామ్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: 'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్రామ్ అంటే ఎంతో అభిమానం..శశికి.. రామ్ పోతినేని అంటే ఎంతో అభిమానం. రామ్ ఫొటోలు చూస్తే ఆమె స్పందిస్తుందని.. ఆయనను చూపిస్తే అన్నం కూడా తింటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్.. శశితో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు చికిత్సకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోఅప్పుడు ఇచ్చిన మాటను రామ్ ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. శశికి అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు, పౌష్టికాహారాన్ని ఆమె కుటుంబానికి పంపించారు. తన కళ్లజోడును కూడా శశికి బహుమతిగా పంపంచారు.( 'ఇరుముడి' సూపర్ క్యూట్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్)అభిమానుల ద్వారా అందజేతరామ్ పంపించిన వస్తువులను ఆయన అభిమానులు శశి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా శశి కుటుంబ సభ్యులు రామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని కష్టాల్లో ఉందని తెలుసుకుని స్పందించడమే కాకుండా.. ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలుస్తున్న రామ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెరపై హీరోగా కనిపించే రామ్.. నిజ జీవితంలోనూ ‘రియల్ హీరో’ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. A fan girl’s dream came true ❤️🔥From a surprise video call to standing by her with regular support for medicines & groceries… and today, a special gift from her favourite hero @ramsayz 🥹❤️For a fan, he’s not just a HERO… he’s a beautiful memory for life 🫶🔥#RamPothineni pic.twitter.com/UuXnn2JpSN— RAPO Fan Trends (@RAPOFanTrends) September 13, 2026 -
త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. కానీ చిన్న గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లారు. అక్కడే సిల్వర్‌స్టోన్‌లో హీరో అజిత్ పాల్గొన్న రేసింగ్ ఈవెంట్‌ని వీక్షించారు. రేసింగ్ అనంతరం విజయ్-అజిత్ హగ్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే టైంలో విజయ్-త్రిష కలిసున్న ఫొటోలు, వీడియోలు కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ)సీఎం కాకముందు వరకు పలు సందర్భాల్లో త్రిష-విజయ్ జంటగా కనిపించారు. కానీ తర్వాత వీళ్లిద్దరి గురించి పెద్దగా వార్తలు రాలేదు. మరోవైపు విజయ్ భార్య సంగీత.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇప్పుడు విజయ్, త్రిష కలిసి రేసింగ్ ఈవెంట్ చూసేందుకు లండన్ వెళ్లారు. కాకపోతే త్రిష తన పక్కకు రాగానే విజయ్ ముఖం తిప్పుకోవడం ఇప్పుడు ట్విటర్లో హాట్ టాపిక్ అయిపోయింది.ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశారు. ఈయన చివరి సినిమా 'జన నాయగన్'.. రెండు నెలల క్రితం రిలీజైంది. ఇక త్రిష కెరీర్ విషయానికొస్తే ఈమె తెలుగులో చేసిన 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. మరోవైపు తమిళంలో వరస మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు విజయ్ తప్పుకొన్న పెరంబూర్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో ఈమె పోటీ చేస్తుందన్నారు గానీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP— Gokul (@ItzGokulVJ) September 12, 2026 -
పైలెట్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి
తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిచయమైన మలయాళ బ్యూటీ ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. పైలెట్ అవినాష్ సోమశేఖరన్తో కొత్త జీవితం మొదలుపెట్టింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య దేవన్ తన ఇన్ స్టాలో పంచుకుంది. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)కేరళకు చెందిన ఐశ్వర్య దేవన్.. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. 2011లో రిలీజైన 'కెరటం' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేసింది. ధనుష్ అనేకుడు, పృథ్వీరాజ్ సుకుమారన్ 'సింహాసనం'లోనూ నటించి ఆకట్టుకుంది. చివరగా అయితే 2018లో వచ్చిన 'కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా' అనే హిందీ మూవీలో కనిపించింది.2017లో ‘ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర’ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య దేవన్.. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంది. వారం క్రితం కేరళకు చెందిన పైలెట్ అవినాష్ సోమశేఖరన్ని పెళ్లాడి కొత్త జీవితం మొదలుపెట్టింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by Aishwarya Devan (@aishwaryadevan) -
నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ
నటి, ఒకప్పటి హీరోయిన్ శ్రియని చూస్తుంటే అందానికి వయసుతో పని ఉండదా? అనే సందేహం కలుగుతుంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం అంటే 2001లో 'ఇష్టం' అనే తెలుగు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సంతోషం, నేనున్నాను తదితర చిత్రాలతో అలరించింది. 2003లో తమిళంలోకి వెళ్లింది. విజయ్, ధనుష్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఇక 2018లో ఆండ్రీ కొచ్చీవ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె.. అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.(ఇదీ చదవండి: పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్)44 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియ.. తన సౌందర్య రహస్యం గురించి చెప్పింది. నేను మనసులో ఏదీ దాసుకోను. ఏది అనిపిస్తే అది చెబుతాను . ఏ విషయంలోనూ దాపరికాలు లేకుండా మాట్లాడటమే నా బ్యూటీకి కారణమని భావిస్తున్నా. ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందాన్ని నేను కాపాడుకుంటున్నానని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?) -
తలా అజిత్‌తో సీఎం విజయ్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ట్రీట్!
తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్‌ను లండన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్‌ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్‌తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్‌ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.The way Thalapathy Vijay Hugged Ajith Kumar & AK welcomed @actorvijay ❤️ What an incredible Moment !!! An WHOLESOME Video !!! https://t.co/5IxWCYarp0— Let's X OTT GLOBAL (@LetsXOtt) September 12, 2026 -
‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రొమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలపై మాట్లాడిన ప్రణయ్.. రివ్యూవర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.‘రివ్యూ చేయడం చాలా ఈజీ’..సినిమా రివ్యూ చేయడం చాలా సులభమైన పని అని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 90 శాతం సినిమాలు లేదా 10లో 9 సినిమాలు విడుదలైన తర్వాత విఫలమవుతుంటాయని.. వాటిని రివ్యూ చేయడం సులభమేనని అన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‘స్పిరిట్’తో చూస్తాం!ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి దానిపై రివ్యూవర్లు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ సినిమా విషయంలో చేసినట్లే పెద్ద సినిమా అయిన ‘స్పిరిట్’ విషయంలోనూ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘స్పిరిట్’ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!తాము ఆ సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్
తమిళ పండితుడు, ప్రముఖ నటుడు, టీవీ వ్యాఖ్యాత సోలమన్ పప్పయ్య (90) కన్నుమూశారు. మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం తీవ్రం కావడానికి కొద్దిరోజుల ముందు వినాయక చవితి సందర్భంగా ప్రసారం కానున్న ప్రత్యేక పట్టిమండ్రం కార్యక్రమాన్ని ఆయన రికార్డు చేశారు.రజినీకాంత్ సంతాపంతమిళ భాష, సాహిత్యంపై విశేష సేవలు అందించిన సోలమన్ పప్పయ్య.. ‘పట్టిమండ్రం’ను పండితుల చర్చా వేదిక నుంచి సామాన్యుల ఇళ్లలోకి తీసుకెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మృతిపై సూపర్‌స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు.అనుకోకుండా సినిమాల్లోకి.. సోలమన్ పప్పయ్యకు నటనపై ప్రత్యేక ఆసక్తి లేదు. అయితే ఆయన విలక్షణమైన గొంతు, హావభావాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ దర్శకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ‘మాప్పిళ్లై’, ‘పుదు వరుషం’ చిత్రాల్లో కనిపించిన ఆయనకు దర్శకుడు శంకర్ మరిన్ని అవకాశాలు ఇచ్చారు.ఇదీ చదవండి:పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత1999లో వచ్చిన ‘ముదల్వన్’లో నటించిన పప్పయ్య.. ఆ తర్వాత ‘బాయ్స్’, ‘ఎస్ మేడమ్’ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే రజినీకాంత్హీరోగా తెరకెక్కిన ‘శివాజీ: ది బాస్’ ఆయన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో థొండైమాన్ పాత్రలో రజినీకాంత్‌తో కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.200కు పైగా అవకాశాలు..‘శివాజీ’ విజయం తర్వాత సోలమన్ పప్పయ్యకు ఏకంగా 200కు పైగా సినిమా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు. తన అసలు రంగమైన తమిళ సాహిత్యం, పట్టిమండ్రానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.‘శివాజీ’లోని అంగవై, సంగవై పాత్రలకు సంబంధించిన కామెడీ సన్నివేశంపై ఆయన తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారట. అంగవై, సంగవై పేర్లు తమిళ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నవని, వాటిని అలాంటి హాస్య సన్నివేశానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారట. ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!పద్మశ్రీతో గౌరవం..తమిళ భాష, సాహిత్యం, ప్రజా చైతన్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 2000లో సోలమన్ పప్పయ్యను ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. 2021లో 85 ఏళ్ల వయసులో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. ఆరు దశాబ్దాలకు పైగా తమిళ భాష కోసం సేవలందించిన ఆయన మృతి తమిళ సాహితీ, సాంస్కృతిక రంగానికి తీరని లోటుగా మారింది. -
పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత
ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యులో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారతీయ వివాహ సంప్రదాయాలు, మహిళలపై రుద్దుతున్న ఆచారాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మగవాళ్లకు లేని కొన్ని నిబంధనలు ఆడవాళ్లకు మాత్రమే ఎందుకని ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?మగవాళ్లూ ఈ పనులు చేయచ్చు కాదా..‘పెళ్లి అనేది ఇద్దరిదీ.. మరి తాళి ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి. మహిళలే బొట్టు ఎందుకు పెట్టికోవాలి. అన్ని సంప్రదాయాలు వాళ్లే ఎందుకు పాటించాలని అందరూ అంటారు. వివాహానికి సంబంధించిన సంప్రదాయాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. మగవాళ్లు కూడా ఈ పనులు చేయచ్చు కదా. భర్త కోసం ఉపవాసం చేయాలని ఎక్కడైనా ఉందా. అలాంటిదేమీ లేదు కదా. అన్ని నిబంధనలు మహిళలకే ఎందుకు? ఇవన్నీ మనం సృష్టించుకున్నవే తప్పా ఏ గ్రంథంలోనూ ఇలాంటివి లేవు’ అని నమిత అభిప్రాయ పడ్డారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..సొంతం సినిమాతో.7 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. -
రోజుకి రెండే చపాతీలు తింటా.. ఇదే నా డైట్
ఒకప్పుడు రోజంతా కష్టపడి కడుపు నిండా తినేవాళ్లు. పెద్దగా ఇబ్బందులు లేకుండానే ఏళ్లకు ఏళ్లకు ఆరోగ్యంగా బతికేసేవాళ్లు. కానీ ప్రస్తుతం ఏం తిన్నా గానీ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్ అని లెక్కలేసుకుంటున్నారు. మరికొందరైతే రోజుకి ఒకటి రెండుసార్లు అది కూడా చాలా తక్కువ మొత్తంలో తింటున్నవాళ్లు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు చాలామంది రకరకాల డైట్స్ పాటిస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే సలార్, కేజీఎఫ్ సినిమాల సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్.. తన రోజువారీ డైట్ గురించి చెప్పి షాకిచ్చాడు.(ఇదీ చదవండి: ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)రవి బస్రూర్ సంగీతమందించిన లేటెస్ట్ సినిమా 'టాక్సిక్'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది గానీ అస్సలు ఆడలేదు. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ సంగీత దర్శకుడు.. తను ప్రతిరోజూ రెండు చపాతీలు, షాహీ పన్నీర్ కర్రీ మాత్రమే తింటానని మరేం తిననని అన్నాడు. కావాల్సినంత నీరు తాగి, కంటినిండా నిద్రపోతానని చెప్పాడు. ఇలా చేయడానికి కారణం కూడా చెప్పాడు.హిమాలయాల్లో ఉండే చాలామంది ఎలాంటి ఆహారం తీసుకోకుండానే 15-20 ఏళ్లు బతుకుతున్నారని.. తన డైట్‌కి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు. అయితే రవి బస్రూర్కి సాధ్యమైన ఈ డైట్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మన శరీరానికి ఆకుకూరలు, కూరగాయలు, అన్నం, పప్పలు, మాంసకృత్తులు ఇలా చాలా కావాల్సి ఉంటుంది. ఏవి అందకపోయినా సరే పోషకాహార లోపం వచ్చే అవకాశముంటుంది. మరి ఇలాంటివేం తినకపోయినా సరే 'సలార్' సంగీత దర్శకుడు ఎలా మేనేజ్ చేస్తున్నాడనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న.స్వతహాగా స్వర్ణకారుడు అయిన రవి బస్రూర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ప్రభాస్ 'సలార్'కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నీల్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్'కి ఇతడే సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ప్రశాంత్ నీల్ నిర్మాతగా హారర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
నాకు ఈగో లేదు.. ఆ రూమర్స్ పట్టించుకోవద్దు
సినిమా ఇండస్ట్రీలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అలా హీరోయిన్ శ్రీలీల కూడా విమర్శలని ఎదుర్కొంటూనే ఉంది. శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్ వయా కోలీవుడ్, బాలీవుడ్ అని పరుగులు పెడుతోందీ భామ. తెలుగులో క్రేజీ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'పరాశక్తి' మూవీతో తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ భామ ప్రస్తుతం ధనుష్ సరసన 'ఓం' చిత్రంలో నటిస్తోంది. నవంబర్ 26న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఇదీ చదవండి: నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్అసలు విషయానికొస్తే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీలీల.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇరు రాష్ట్రాల ప్రేక్షకులని ప్రేమిస్తున్నాను. అయితే నాతో సమంగా నటించే నటుడో, నటినో లేరని నేను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నాకు అలాంటి అహంకారం లేదు. నేనెవరి దగ్గర ఈగో ప్రదర్శించలేదు. అందరినీ గౌరవించే మనస్తత్వం నాది. కాబట్టి అనవసర పుకార్లని ఎవరూ నమ్మకండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. అది మినహా నా మనసులో మరేదీ లేదు అని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు -
ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలకే కాదు.. కొత్త హీరోలకు కూడా ఓ కొత్త ఇమేజ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా వస్తుందంటే కథ కంటే ముందు హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైలాగులు ఎలా పేలబోతున్నాయి? అనే ఆసక్తి ఉండేది. ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది?ముఖ్యంగా మహేశ్‌బాబు కెరీర్లో ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి మరోసారి మాస్ పల్స్ తనకు ఎంత బాగా తెలుసో చూపించారు. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దీంతో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి? మళ్లీ ఆయన పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది? అనే చర్చ మొదలైంది.మళ్లీ ఆ పూరి కనిపిస్తారా..?పూరి జగన్నాథ్ కెరీర్లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు. పూరి సినిమాలు వరుసగా కనిపించకపోవడంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ అనే యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారైనా పూరి పూర్వ వైభవం చూపిస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..? -
15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 18న విడుదల..సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్‌లో భారీ నష్టం -
బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్‌లో భారీ నష్టం
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే ఆ జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత రాబెట్టిందని ప్రస్తుతం అనే చర్చ జరుగుతోంది.తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ తొలి రోజే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.145 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇండియాలో కేవలం రూ.37 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి ‘టాక్సిక్’ ఇండియాలో రూ.247 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.339 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!భారీ నష్టాలు?‘టాక్సిక్’ సినిమా నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగే ఖర్చయిందనే వార్తలు వచ్చాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత నెట్ వసూళ్లతో పోలిస్తే భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రస్తుత ట్రేడ్ అంచనాలను పరిశీలిస్తే.. నష్టాల పరంగా ‘ఆదిపురుష్’ను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది.కాగా ‘టాక్సిక్’లో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు, ఆసక్తికర ప్రచారం లభించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళలను చూపించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. -
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం..‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ సెప్టెంబరు 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’ కూడా తీస్తున్నట్లు నిర్మాత నమ్రతా సింగ్ తెలిపారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. Trivikram Bringing #HanumanAnsh In Telugu pic.twitter.com/5HM8kglTSj— Aakashavaani (@TheAakashavaani) September 11, 2026 -
ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఒకే స్కూల్.. ఎక్కడంటే..?
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్2. ఇటేవలే వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల కావడంతో కార్తీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తి చదువుకున్న స్కూల్ డేస్ కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఇద్దరూ చెన్నైలో..సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కార్తి.. ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు . వీరికి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల పరంగా వీరిద్దరి ప్రయాణం వేర్వేరు అయినా స్కూల్ డేస్ లో వీరిద్దరికీ మంచి అనుభందం ఉందని మీకు తెలుసా.. మహేశ్‌బాబు, కార్తీ ఇద్దరూ చెన్నైలోని సెయింట బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ టైంలో మహేశ్‌బాబుకి కార్తి రెండు సంవత్సరాల జూనియర్. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్‌మీడియాలో వార్తను తెగ వైరల్ చేస్తున్నారు. ( ‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?)కలిసి నటిస్తారా..ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ఈ కామన్ కనెక్షన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..మహేశ్‌బాబు విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుత్ను చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నాడు. 2027 ఏప్రిల్ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 80s నాటి లుక్స్‌తో ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. పాతకాలం నాటి హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్, ఫిల్మ్ కెమెరా లుక్‌తో తమ తమ ఫొటోలను మార్చుకుంటూ నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో, హీరోయిన్‌తో కలిసి పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటో క్రియేట్ చేసి అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎంత సరదాగా ఉందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.APK ఫైల్స్ ఓపెన్ చేయద్దు.. కొంతమందికి ఈ ఫొటోలు ఎలా చేయాలో తెలియక ప్రామిట్ కోసం సోషల్‌మీడియాలోని వ్యక్తులను నమ్మివాళ్ల చేతిలో బలైపోతున్నారట. దీనికి కారణం సైబర్ నేరగాళ్లు పంపిన APK ఫైల్స్ ఓపెన్ చేయడమేనట. ఈ ట్రెడ్ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ( లోకేశ్ , అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!)ఫొటో అప్లోడ్ చేసే ముందు ఇదీ చూడండి..AI టూల్స్‌లో ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు, అభిమాన హీరోల ఫోటోలు అని వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి నిజమా కాదా అని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.‘1980ల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అభిమాన హీరోల ఫొటోలని సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్ యాప్స్, ఏపీకే ఫైళ్లను పంపిసూత మోసాలకు పాల్పడుతున్నారు. చాట్‌జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పద లింకులు తెరవకూడదు’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: (బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?) -
'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ లవ్ స్టోరీ
'కోర్ట్' సినిమాతో సక్సెస్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. ఆ వెంటనే 'బ్యాండు మేళం' అనే మూవీ చేసింది. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. అయితే 'కోర్ట్' హిట్ అయ్యేసరికి ఈమెకు తమిళంలో అవకాశం వచ్చింది. అలా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసింది. ఆ చిత్రమే 'హైకూ'. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ప్రకటించారు.ఏగన్ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రీదేవితో పాటు మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ హీరోయిన్గా చేసింది. యువరాజ్ చిన్నస్వామి దర్శకుడు. సిద్దు కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి వచ్చే నెల 23న మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. -
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారమే దీనికి కారణం. మరోవైపు గాయని కెనీషాతో ఇతడి రిలేషన్ గురించి సాగుతున్న ప్రచారం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఈ విషయమై దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న కెనీషా.. ఒక దశలో తమిళనాడు వదిలి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ చైన్నె వచ్చింది.ఇప్పటివరకు గాయనిగా ఉన్న ఈమె.. ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారింది. అది కూడా రవి మోహన్ దర్శక నిర్మాతగా చేస్తున్న 'యాన్ ఆర్డినరీ మ్యాన్' సినిమా కోసమే. ఈ మూవీలో యోగి బాబు హీరో. ఈ చిత్రంతోనే కెనీషా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండటం విశేషం. దీని గురించి స్పందించిన కెనీషా.. సరైన సమయంలో సరైన అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పుకొచ్చింది.తొలుత ఈ సినిమాలో భాగం కాకూడదని అనుకున్నాను. రవి మోహన్ చెప్పిన యాన్ ఆర్డినరీ మ్యాన్ స్టోరీ ఆర్టినరీనే అయినా అందులో విషయం మాత్రం ఎక్స్ట్రార్డినరి. ఈ చిత్ర కథనం ఇంప్రెస్ చేసింది. అందుకే సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంగీతమందించడం చాలా బాధ్యతతో కూడుకున్నది. చాలా రీసెర్చ్ చేసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు కెనీషా చెప్పుకొచ్చింది. -
లోకేశ్ , అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!
‘డిసీ’ బ్లాక్‌బస్టర్ విజయంతో చిత్ర బృందంపై నిర్మాత కళానిధి మారన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్లను అభినందించారు. వీరికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్ప్రైజ్ చేశారు. ఈ మేరకు కార్ల తాళాలను స్వయంగా అందజేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపింది. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం సన్ నెక్ట్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో అలరిస్తోంది. Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster pic.twitter.com/QOgmCA6ZqI— Sun Pictures (@sunpictures) September 10, 2026 -
వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?
సమంత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ.. తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానులతో పంచుకుంటూ ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’తో మాట్లాడిన సమంత.. తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?‘ఈ రింగ్ ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం రాజ్ చూసుకున్నాడు. ఆయన్నే అడగాలి. రాజ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే తొలిసారి ఆ రింగ్‌ను చూశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఉంగరాన్ని గ్రీస్‌కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ రూపొందించారని మాత్రం నాకు తెలుసు. అని సమంత తెలిపింది. అయితే దీనిని ఏథెన్స్కు చెందిన థియోడోరోస్ సవోపౌలోస్ రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత రింగ్ ధరించిన ఫొటోను ఆయన కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.విలువ ఎంతంటే..అయితే ఇప్పుడు ఆ రింగ్ ఖరీదు ఎంత ఉంటుందనే చర్చ. లొజెంజ్ కట్ డైమండ్‌తో రూపొందించిన ఈ రింగ్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందట. ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్ కట్ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్ కట్ వజ్రాలకు భారతీయ ఆభరణాల చరిత్రతోనూ మంచి అనుబంధం ఉంది. మొఘల్ కాలంలో ఈ తరహా డిజైన్లు దొరికేవని చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన డిజైన్లను రూపొందించేవారి సంఖ్య కూడా తక్కువేనట. కాగా సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇదీ చదవండి: హీరోయిన్ ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక -
బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?
బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా అడుగుపెట్ని షాలిని తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతకముందు ‘అగ్నిపరీక్ష2’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన మాటలతో ఆట తీరుతో మెప్పిస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా, కానిఫడెంట్గా కనిపించే షాలిని జీవితంలో ఓ విషాద కథ ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు..? ఆమె జీవతంలో జరిగిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవే ఏంటో తెలుసుకుందాం రండి!ఇదీ చదవండి: Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్‌పై ఫిర్యాదు8 ఏళ్ల వయసులోనే తల్లి మృతి..షాలిని తన వ్యక్తిగత జీవితం గురించా మాట్లాడుతూ.. ‘8ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మృతి చెందారు. చిన్నతనంలోనే ఇలా జరగడంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఈ విషయాన్ని అగ్ని పరీక్షలో పాల్గొన్న చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఈవిషయాలన్నీ చెప్పా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు’ అని షాలిని తెలిపారు.కామనర్‌గా బిగ్‌బాస్‌లోకి..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని రీల్స్, ఫొటోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2’లో పాల్గొని తన ఆట తీరుతో మెయిన్ షోకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో షాలిని గేమ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్షలో తనపై వచ్చిన అభిప్రాయాలను దాటి.. బిగ్‌బాస్ 10లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక.. -
విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
ఇటీవలే ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బాటలో విజయ్ దేవరకొండ చేరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆయనకు ఇచ్చిన విత్తన గణపతిని ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఈ వినాయక చవితిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. ‘నగరం కలుషితం కాకుండా మట్టి లేదా విత్తన గణపతిని పూజిద్దాం. దీంతో మొక్కలు పెరుగుతాయి’ అని విజయ్ సూచించారు. మొక్కగా ఎదుగుతాయి..‘కెమెకిల్స్తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను గతంలో మెగాస్టార్ చిరంజీవి వివరించారు. Actor Vijay Deverakonda received a Seed Ganesha (Vittana Ganapati) from Green India Challenge team and appealed to all to celebrate Ganesh Chaturthi with eco-friendly Matti Ganapati and Vittana Ganapati.“Use safe clay and seed idols so we don’t pollute our city. After the… pic.twitter.com/NBHq2unlkK— Milagro Movies (@MilagroMovies) September 10, 2026 -
TVK నినాదాలతో దద్దరిల్లిన ‘సిగ్మా’ ఈవెంట్.. సీఎం విజయ్ తనయుడి రియాక్షన్
తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక తమిళనాడులోని సేలంలో ఘనంగా జరిగింది. తెలుగు నటుడు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈవెంట్లో జేసన్ సంజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నినాదాలతో హోరెత్తించారు. 'మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సంజయ్ అనగానే అభిమానుల కేరింతలు మరింత పెరిగాయి. దీంతో కాసేపు ప్రసంగాన్ని ఆపిన సంజయ్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపిస్తూ స్పందించారు.కొంతకాలం క్రితం సీఎం విజయ్, సంజయ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. సంజయ్ తన తండ్రి విజయ్ నటించిన ‘తిరుమలై’ తాను థియేటర్లో చూసిన తొలి సినిమా అని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తనకు 3 ఏళ్ళు అని చెప్తూ నవ్వుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారుతున్న విషయం మొదటగా తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సైతం విజయ్ను తమ సినిమాకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. దానికి సంజయ్ కూడా చిరునవ్వుతో మద్దతు తెలిపారు. దీంతో తండ్రి, కొడుకుల మధ్య విబేధాలపై వస్తున్న ప్రచారానికి ఈ వేడుకలోని సంజయ్ స్పందన కొంత స్పష్టత ఇచ్చినట్టయింది.ఇక ‘సిగ్మా’ హీస్ట్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
డాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. రఘు మాస్టర్, సుమలతతో చర్చలు
లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై కీలక సమావేశం జరిగింది. జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, సుమలత దేవితో పాటు ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు జాయింట్ కమిషనర్ ఎదుట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని..సుమలత అధ్యక్షురాలిగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఆమె కార్యవర్గంలోని కొంతమంది రాజీనామా చేశారని జాయింట్ కమిషనర్ తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు సుమలత ఉప ఎన్నికలు నిర్వహించడంతో.. ఇప్పటికే ఎన్నికైన తమకు అన్యాయం జరిగిందని కొందరు ఆరోపించినట్లు చెప్పారు. తమవైపే మెజారిటీ సభ్యులు ఉన్నారని రఘు మాస్టర్ పేర్కొన్నారు.ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని..ఈ వివాదాన్ని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ సమక్షంలో పరిష్కరించుకోవాలని జాయింట్ కమిషనర్ సూచించారు. వివాదం కొనసాగితే యూనియన్ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని డాన్సర్లు కోరుతున్నారని రఘు మాస్టర్ తెలిపారు. సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. -
సినిమాలో బోల్డ్ సీన్స్.. హీరోయిన్‌కు భరోసా
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇంత దారుణమా?అయితే ఈ ఈవెంట్లో డైరెక్టర్ ఆదిత్య హీసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ వైష్ణవి నర్వస్‌గా ఫీల్ అయింది. ఈ విషయంలో ఆమెకు ఒకటే చెప్తున్నా.. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి నెగిటివిటీ వచ్చానా సపోర్ట్‌గా ఉంటా. బాధ్యత తీసుకుంటా’ అని తెలిపారు. కాగా ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల బోల్ట్ సీన్స్‌పై విమర్శలు ఎక్కువ అవుతుండడంతో గతంలో బేబీ మూవీలోని ఆమె పాత్రపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. Director #AdityaHaasan about the BOLD SCENES in #EPIC :“Vaishnavi is a SUPERSTAR.If there is any NEGATIVITY after the release regarding her BOLD SCENES, let it come to me first.I will take FULL RESPONSIBILITY for it.” pic.twitter.com/i2668WUK4n— Rangasthalam (@RangasthalamIN) September 8, 2026 -
బిగ్‌బాస్‌లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
బిగ్‌బాస్ సీజన్ 10 తెలుగులో బిగ్‌బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన. కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన ఆమె.. తనదైన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు.. జడ్జీలతో పాటు ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. దీంతో బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో ఆమెకు చోటు ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం దక్కలేదు. ( ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్)పిల్లలతో ఉన్న ఓ వీడియో..ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ అవకాశం కోసం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను బయటపెట్టారంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సింపతీ స్టార్’ అంటూ విమర్శలు చేయడంపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పుకొచ్చారు.‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా..‘హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. ‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు అండి. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా. నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని కూడా ఆలోచించండి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by rajakumari_dayana 46 (@rajakumari_dayana) -
దీపావళి బరిలో సూర్య.. సినిమా ఇదే..
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయంతో జోరుమీదున్న సూర్య.. మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జితు మాధవన్.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సూర్య, నజ్రియా జోడీ ఎలా అలరిస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్ -
1980s ఫొటో ట్రెండ్‌లో హీరోయిన్లు అందరినీ చూస్తారా? ఇదిగో..
సోషల్ మీడియాను ‘1980 ఫొటో’ ట్రెండ్ ఊపేస్తోంది. యూజర్లు ఏఐ (కృత్రిమ మేధస్సు) సాయంతో తమను తాము గత కాలానికి చెందిన రూపాల్లో మళ్లీ ఊహించుకుంటున్నారు. చాట్‌జీపీటీని ఉపయోగించి నెటిజన్లు తమ కొత్త సెల్ఫీలను 1980 దశాబ్దం నాటి నిజమైన ఫొటోలలా కనిపించే విధంగా మార్చుకుంటున్నారు. ఈ వైరల్ ట్రెండ్ ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటుల నుంచి సామాన్యుడి వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఈ ట్రెండ్‌లో.. చాట్‌జీపీటీలో ఒక ఫొటోను అప్లోడ్ చేసి, అదే చిత్రాన్ని 80ల నాటి నిజమైన శైలిలో రూపొందించాలని కోరుతారు. దుస్తులు, జుట్టు తీరు, వెలుతురు, నేపథ్యం, ఫొటోగ్రఫీ శైలి వంటి అంశాలను యూజర్లు తమకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. 1980 దశాబ్దం నాటి ప్రముఖ సినిమాలు, బాలీవుడ్ చిత్రాలు, కుటుంబ ఆల్బమ్‌ల ఆధారంగా రూపొందించిన చిత్రాలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. పూర్తయిన చిత్రాల్లో సాధారణంగా ఒత్తుగా కనిపించే జుట్టు, రంగురంగుల చీరలు, ఆకర్షణీయమైన ఆభరణాలు, పాత తరహా స్టూడియో నేపథ్యాలు, పాత ఫొటోలను గుర్తుచేసే స్వల్ప ఫిల్మ్ గ్రెయిన్ కనిపిస్తాయి. ఫిల్మ్ గ్రెయిన్ అంటే పాత ఫిల్మ్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో కనిపించే సూక్ష్మమైన గింజల్లాంటి మసక ఆకృతి.కేంద్ర మంత్రి కూడా ఈ ట్రెండ్‌లోకి.. View this post on Instagram A post shared by Piyush Goyal (@piyushgoyalofficial)కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన 1980ల నాటి శైలిలో రూపొందించిన కృత్రిమ మేధస్సు ఇమేజ్ను షేర్ చేయడంతో ఈ రెట్రో ఏఐ ట్రెండ్‌కు మరింత ఆదరణ లభించింది. ఆ చిత్రంలో గోయల్ చక్కగా కుట్టించిన సూట్, ఏవియేటర్ సన్‌గ్లాసెస్ ధరించి కనిపించారు. పాత ఫొటో ఆల్బమ్‌లను గుర్తుచేసేలా చిత్రానికి సెపియా ఛాయ, మసకబారిన పాత ఫొటో తరహా ఆకృతి ఇచ్చారు. ఈ ఇమేజ్ను షేర్ చేస్తూ “80ల ట్రెండ్‌ను ఆస్వాదిస్తున్నా” అని రాశారు.సౌతిండియా నటీమణులను ఫ్యాన్స్ ఎలా రూపొందించారంటే?ఈ వైరల్ ఏఐ ట్రెండ్ సినిమా అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ‘ప్రాంప్ట్గ్యాలరీ.ఐజీ’ వంటి ప్రముఖ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఈ ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. నెటిజన్లు వివరమైన చాట్‌జీపీటీ టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ప్రస్తుత సౌతిండియా గత కాలానికి చెందిన రూపాల్లోకి మార్చుతున్నారు. పాతకాలపు కళాశాల కథాంశాల్లో కనిపించే కల్పిత కథానాయికల శైలిని అందిస్తున్నారు. ఈ కింది ఇన్స్టాపోస్టులో 17 మంది హీరోయిన్ల 80ల ఫొటోలు చూడొచ్చు. View this post on Instagram A post shared by Trending AI Image Prompts (@promptgallery.ig)సమంత రూత్ ప్రభుఏఐతో రూపొందించిన పాతకాలపు రూపంలో హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఆధునిక రెడ్ కార్పెట్ ఫ్యాషన్‌కు బదులుగా 1980ల నాటి కళాశాల విద్యార్థిని శైలిలో కనిపిస్తున్నారు. ఆమెకు సాధారణంగా కనిపించే చక్కటి రూపానికి బదులుగా ఒత్తుగా కనిపించే జుట్టు, ప్రత్యేకమైన పక్క పాపిడి, కొద్దిగా అస్తవ్యస్తంగా కనిపించే జుట్టు తీరు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం నిజమైన పాతకాలపు ఫొటోలా కనిపిస్తోంది. చిన్న బొట్టు, మృదువైన పెదాలు, స్పష్టంగా కనిపించే కళ్లు, సహజంగా కనిపించే చర్మంతో దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాలోని యువ కళాశాల విద్యార్థినిని తలపించేలా రూపొందించారు.సాయి పల్లవిసహజమైన తెరపై కనిపించే తీరుకు పేరున్న సాయి పల్లవి 1980ల నాటి అనలాగ్ రూపానికి సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నారు. ఏఐ ప్రాంప్ట్‌లలో ఆమెను పాతకాలపు కళాశాల భవనాలు, సూర్యకాంతితో నిండిన వరండాలు, స్థానిక భాషలో సైన్‌బోర్డులు, సైకిళ్లతో ఉన్న వీధులు వంటి నేపథ్యాల్లో చూపిస్తున్నారు.త్రిష త్రిష కృష్ణన్ ఏఐతో రూపొందించిన పాతకాలపు రూపం ఆ కాలానికి ప్రత్యేకమైన రెట్రో ఫ్యాషన్‌పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. అభిమానులు ఆమెను నడుము పైభాగంలో బిగుతుగా ఉండే యాసిడ్-వాష్ జీన్స్, వెడల్పాటి బెల్టులు, లోపలికి మడిచిన షర్టులతో చూపించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. ఈ తుది రూపం 1980ల నాటి క్లాసిక్ ప్రేమకథా చిత్రంలో త్రిష హీరోయిన్గా ఎలా కనిపించి ఉండేవారో అభిమానులు ఊహించుకునేలా చేస్తోంది. ఈ హీరోయిన్ల ఇమేజ్‌లు అన్నీ ఫ్యాన్స్ చేసిన ఫొటోలు మాత్రమే.చాట్‌జీపీటీతో 80ల ఫొటోను ఎలా రూపొందించాలి? చాట్‌జీపీటీను తెరిచి న్యూ చాట్ ప్రారంభించండి.+ బటన్‌ను నొక్కి మంచి ఫొటోను అప్లోడ్ చేయండి.మీకు కావాల్సిన 1980ల శైలిని వివరించండి. ఇందులో దుస్తులు, జుట్టు తీరు, నేపథ్యం, వెలుతురు వంటి వివరాలను పేర్కొనండి.వ్యక్తిని గుర్తుపట్టగలిగే ముఖం, సహజమైన చర్మ రంగును అలాగే ఉంచాలని చాట్‌జీపీటీని కోరండి.మొదటి చిత్రం సరిగ్గా కనిపించకపోతే ప్రాంప్ట్‌ను మార్చండి. -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ నటి.. వరుడు ఎవరో తెలుసా..?
తమిళ నటి నివేదితా సతీశ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం అయిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం.’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. (మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను)ఈ వేడుకలో నివేదితా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. నివేదితా షేర్ చేసిన ఈ ఫొటోలకు గాయత్రి శంకర్, ఆండ్రియా జెర్మియా, సంయుక్తా, ఎస్తర్ అనిల్, ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.హలో సినిమాతో..అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన హలో (2017) సినిమా ద్వారా నివేదితా సతీష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె హీరోయిన్ ప్రియా స్నేహితురాలు కవితగా కనిపించారు. ధనుష్ హీరోగా నటించిన ఈ తమిళ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్(2024). తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది ఇందులో ఆమె 'తేన్పాసియార్' (యాక్షన్ రోల్) అనే కీలక పాత్రను పోషించారు. దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటించారు. (రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్) -
ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా తనను బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ షో 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా రాసిన బ్లాగ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా? కొనసాగించడం కష్టంగా మారుతోందికార్యక్రమానికి వచ్చే కొందరు కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లోని విషాదకర ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అమితాబ్ పేర్కొన్నారు. వాళ్లు పడిన బాధలను పంచుకుంటున్నప్పుడు నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నాకు కష్టంగా ఉంటోంది. హోస్ట్‌గానూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా.. ఇప్పటికే ఆలస్యమైంది.’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఇక KBC నుంచి తప్పుకోనున్నారా? అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి: మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను2000లో ప్రారంభమైన KBCకి తొలి సీజన్ నుంచి అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మూడో సీజన్‌కు మాత్రం షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గతంలోనూ అమితాబ్ KBC నుంచి తప్పుకోనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ( విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..) -
ఉత్కంఠను పెంచుతున్న అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం3’ ట్రైలర్
మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు ‘దృశ్యం 3’ రాబోతోంది. మలయాళంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో విడుదలైన ‘దృశ్యం3’ ఈ సారి హిందీలోనూ విడుదలకానుంది. ఈమేరకు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్, కీలక పాత్రలో అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో ‘దృశ్యం3’ని తెరకెక్కించారు. టబు,ప్రకాశ్ రాజ్, శ్రియతో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?ఈ చిత్రం గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం3’కి పూర్తి భిన్నమైన క్లైమాక్స్‌తో ఈ సిరీస్‌ను ముగించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకే దృశ్యం: ది కన్‌క్లూజన్ అనే టైటిల్‌తో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాలు, ట్విస్టులు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. -
మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘పంచనామా’ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, నటి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ ?స్వయం కృషితో ఎదిగా..చిన్న వయసు నుంచే మైక్ పట్టుకుని స్వయం కృషితో ఎదిగానని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగానే నిలబడ్డానని చెప్పారు. ‘ఎవరికి టాలెంట్ ఉన్నా.. ఏ డోర్ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్ ఉందని మర్చిపోవద్దు. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఈ ప్రొడక్షన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉంటుందంటే?x.com/FilmyFocus/status/2097604851358457984?s=20 -
ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు..చాలా బాధపడ్డా: ఐశ్వర్య లక్ష్మి
సినీ తారలపై ట్రోల్స్ రావడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ట్రోల్స్ వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అవకాశాలు చేజారేలా చేస్తాయి. నటి ఐశ్వర్య లక్ష్మి విషయంలోనూ ఇదే జరిగిందట. ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమా తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని.. చివరకు కొన్ని అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తాజాగా వెల్లడించారు.దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కోథా’లో ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో కనిపించారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమాతో పాటు నటీనటులపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘కింగ్ ఆఫ్ కోథా’ పరాజయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. సినిమా విడుదల తర్వాత మలయాళ చిత్రపరిశ్రమలో తనకు అవకాశాలు ఇవ్వడానికి కొందరు భయపడినట్లు అనిపించిందని చెప్పారు.‘2023లో భారీ అంచనాల మధ్య ‘కింగ్ ఆఫ్ కోథా’ విడుదలైంది. కానీ సినిమా తర్వాత మలయాళ చిత్రపరిశ్రమ నాకు అవకాశాలు ఇవ్వడానికి భయపడినట్లు అనిపించింది. కేవలం నన్ను మాత్రమే కాదు.. దుల్కర్‌తో పాటు చిత్ర బృందం మొత్తాన్ని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. నా నటన, డైలాగ్ డెలివరీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు వారు చెప్పింది నిజమేనేమో అని నాకూ అనిపించేది.సినిమాలో తాను దుల్కర్‌ను ‘రాజువెట్టా’ అని పిలిచిన విధానాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘హలో మమ్మీ’ సినిమా షూటింగ్ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తనను పిలిచి ఆ విషయాన్ని వెక్కిరించారని, అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. అంతేకాదు.. ట్రోలింగ్ ప్రభావం తనకు వచ్చిన అవకాశాలపైనా పడిందని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. విమర్శలకు భయపడి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.‘‘దుల్కర్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ ట్రోలింగ్ దెబ్బకు భయపడి ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నేను నటిస్తే దారుణంగా విమర్శలు వస్తాయని.. అది చివరకు మీకే సమస్య కావచ్చని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాను. ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రోల్స్ నన్ను అంతగా ప్రభావితం చేశాయి’ అని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.సినిమా ఫలితం, తనపై వచ్చిన విమర్శలు తన మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీశాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం: కార్తీ
కార్తీ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం సర్ధార్ – 2. ఈయన 2022లో నటించిన సర్ధార్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి ఫ్రీక్వెల్, సీక్వెల్ చిత్రం సర్ధార్ 2 అని నటుడు కార్తీ పేర్కొన్నారు. పీఎస్.మిత్రన్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్ మెంట్ సంస్థలపై ఎస్.లక్ష్మణన్, ఇషాన్ సక్సేనా కలిసి నిర్మించిన ఈ భారీ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటుడు ఎస్ జే.సూర్య,నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్, రజీషా విజయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జార్జ్ సీ.విలియంస్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన సర్ధార్ –2 చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్ధార్ 2 చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది సర్ధార్ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ గా ఉంటుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం. హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం. యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం యూనిట్ వర్గాలు చాలా శ్రమించారు. కార్లు, ట్రైన్ చేజింగ్ వంటి సన్నివేశాల కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ చాలా కష్టపడ్డారు. దర్శకుడు మిత్రన్ అయితే షూటింగ్ పూర్తి అయిన తరువాత ఏడాది పాటు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపైనే దష్టి పెట్టారు. నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించారు. చిత్ర జనరంజకంగా వచ్చింది అని నటుడు కార్తీ పేర్కొన్నారు. -
హబ్‌లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్‌కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్‌గా చెప్పుకునే హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. కాలేజ్‌లో కాకా... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ కాలేజ్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అజీజ్ నగర్లో... వరుస పాన్ ఇండియన్ మూవీస్‌తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంషాబాద్‌లో... మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌లో విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ లుక్‌లో చూపించారో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెమెరామెన్ షామ్‌దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ముచ్చింతల్‌లో... శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్‌ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. శంకర్‌పల్లిలో... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది. ఆర్ఎఫ్సీలో... తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.సంబరాల జోరు ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
60 అడుగుల ఎత్తు నుంచి దూకిన మాళవిక మోహనన్
హీరోయిన్ మాళవిక మోహనన్ ‘సర్దార్-2’ సినిమాలో యాక్షన్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆమె ఏకంగా 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సహాయంతో డైవ్ చేసిందట. అయితే అది నిజంగా కాదు, సినిమా కోసమే.విమానం నుంచి దూకుతున్న అనుభూతి కలిగేలా షూటింగ్లో భారీ బ్లోయర్లను ఏర్పాటు చేశారని మాళవిక తెలిపింది. అంత ఎత్తు నుంచి కిందకు వస్తూనే శరీర భంగిమను కాపాడుకోవడంతో పాటు డైలాగ్ కూడా చెప్పాల్సి వచ్చిందట. కెరీర్లో తాను చేసిన అత్యంత క్రేజీయెస్ట్ సీన్ ఇదేనని చెప్పుకొచ్చింది. ఎంత పక్కా జాగ్రత్తలు తీసుకొని చేసినప్పటికీ అంత ఎత్తు నుంచి కాస్త కిందకు జారాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ మాళవిక మాత్రం ఎంజాయ్ చేశానని చెబుతోంది.ఇక హీరో కార్తీ, తనకు ఒక కామన్ పాయింట్ ఉందని మాళవిక తెలిపింది. ఇద్దరికీ భోజనం కంటే అల్పాహారం, స్నాక్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. -
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్‌బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుఊహించలేరు..‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అంటూ హెచ్చరించాడు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్ఒకసారి మాట్లాడుకోండి..అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని వ్యాఖ్యానించాడు. దీంతో అసలు అతడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే టాస్కులు, టీమ్‌ల మధ్య గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వార్నింగ్ మరింత మంట రాజేసేలా కనిపిస్తోంది. నామినేషన్స్‌లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానని చెప్పడంతో.. రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640— AnantapurBO (@AnantapurBO) September 8, 2026 -
దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’. ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘మహాశక్తి’ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార మరోసారి దేవతగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన నయనతార ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇదీ చదవండి: దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం వేగాంగా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో రెజీనా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తున్నారు. -
దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి ఇప్పటికే ఓటీటీలో భారీ ఆదరణ పొందిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘మిర్జాపూర్: ది మూవీ’ కాగా.. మరొకటి పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి క్రమంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’. ఈ రెండు సినిమాలు విజయవంతమైనప్పటికీ వాటి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. మూడు రోజుల్లోనే రూ.90 కోట్లకు..గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.నెమ్మదిగా మొదలై.. భారీ వసూళ్లు‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. తొలివారం కేవలం రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ రూ.0.40 కోట్లకే పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి సినిమా వసూళ్లు జోరు అందుకున్నాయి.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాతి వారాల్లోనూ జోరు కొనసాగించింది. 29వ రోజుకు భారత్‌లో రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఐదో శనివారం ఏకంగా రూ.16.50 కోట్లు, 31వ రోజు రూ.22.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 31 రోజుల్లోనే రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. 32వ రోజు నాటికి ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్నిల్క్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ( వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్)ప్రేక్షకుల ఆదరణతో..‘మిర్జాపూర్: ది మూవీ’ ఫ్రాంచైజీ క్రేజ్‌తో విడుదలైన వెంటనే భారీ ఓపెనింగ్ సాధించింది. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ మొదట్లో తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా మంచి వసూళ్లు సాధించింది. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయానికి ఒక్కో సినిమాది ఒక్కో దారి అని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి. -
‘బతుకమ్మ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి’
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ జి. ముకుందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్‌రెడ్డితో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్విజయవంతం చేయాలని..మంత్రి మాట్లాడుతూ.. షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఛాలెంజ్ చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. -
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
కొన్ని సినిమాలు కథ, కథనంతోనే కాదు.. పాటలతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘పౌర్ణమి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.ఇదీ చదవండి: వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్ఆకట్టుకునేలా..తాజాగా ఈ పాటకు ఓ చైనా యువతి అద్భుతంగా నాట్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మీరా వాంగ్ అనే యువతి షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దుస్తులు ధరించి ‘భరత వేదముగ’ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. ఆమె హావభావాలు, నృత్య భంగిమలు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తెలుగు సినిమా పాటకు చైనా యువతి ఇంత అందంగా నాట్యం చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంగీతం సరిహద్దులు దాటి ఆకట్టుకుంటోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి A Chinese woman performed the iconic #Pournami song in Shanghai yesterday! ❤️#Prabhas #Trisha pic.twitter.com/u0U42dO503— Milagro Movies (@MilagroMovies) September 8, 2026 -
నా కెరీర్లో సర్దార్ 2 చాలా ముఖ్యం: కార్తీ
‘‘నా కెరీర్లో ‘సర్దార్ 2’ కచ్చితంగా చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి ఒక గూఢచారి పాత్ర దొరకడం నా అదృష్టం. ‘సర్దార్ 2’ సినిమా విజయంపై నాకు నమ్మకం ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను’’ అని కార్తీ అన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ–‘‘కమల్‌హాసన్‌గారికి ‘ఇండియన్’(తెలుగులో భారతీయుడు) సినిమా ఎలానో నాకు ‘సర్దార్’ అలాగ. ఈ మూవీ తెలుగులోనూ చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ చూడని వారు ఓ సారి ఓటీటీలో చూసి ‘సర్దార్ 2’ కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్కి తెరకెక్కించిన మా నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేశ్గార్లకు, విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీధర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘కార్తీసర్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీస్‌లో ఆయన ‘ఆవారా, ఖైదీ, సర్దార్’ వంటి సినిమాలున్నాయి. ‘సర్దార్ 2’ ఘన విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ బోయ పాటి శ్రీను, కళ్యాణ్ శంకర్, అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, వై.రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, అనిల్ సుంకర, శ్రీధర్, హీరోయిన్లు మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, నటుడు ఎస్జే సూర్య మాట్లాడారు. -
RC17: సుకుమార్ కథ లాక్ చేశారా? ఇక చరణ్‌కు ఫైనల్ నెరేషన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘RC17’పై ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సినిమా ఫైనల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే రామ్ చరణ్‌కు ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట. నెరేషన్ పూర్తయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 డిసెంబర్లో ‘RC17’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా స్క్రిప్టింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందనే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అయితే చరణ్-రష్మికది ఫ్రెష్ కాంబో కాబట్టి ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. ఇందులో భాగంగానే హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. చదవండి: సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమఅయితే సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు రావడంతో మూవీ విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని చిత్ర బృందం మరోసారి ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయనున్నారు. -
సాయిబాబాపై సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..
సాయిబాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తేరా సాయి’. పలాశ్ ముచ్చల్ దర్శకుడు. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా సాయి బాబాగా కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓకే సారి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. షాయాజీ షిండే, మనోజ్ జోషి, అవికా గోర్ తదితరులు కీలకపాత్ర వహిస్తున్నారు.కాగా ఇప్పటికే ఈ తరహా చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. 2012లో వచ్చిన ‘షిర్డీ సాయి’ చిత్రంలో కింగ్ నాగార్జున బాబా పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా.. -
సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ
సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్ వచ్చారు. ఈ వేడుకలో నటుడు బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?ఓ సందేహం వస్తుందని..సినిమా గురించి మాట్లాడిన బ్రహ్మానందం.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో సిద్ధు జొన్నలగడ్డను ప్రశంసించారు. సిద్ధును చూస్తున్నప్పుడు తనకు ఓ సందేహం వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘అతను అందంగా ఉంటాడా.. లేక నేనా?’ అని అనిపిస్తుందని అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో ‘నాకు నేనే సంతృప్తి పరుచుకుంటా’ అంటూ చమత్కరించారు.అనంతరం ఇదే విషయంపై యాంకర్ సుమను బ్రహ్మానందం సరదాగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన సుమ.. ‘మీ గ్లామర్ ముందు నేనేం మాట్లాడగలను’ అంటూ నవ్వులు పూయించారు. ఆ వెంటనే ‘వారేవా ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అంటూ పాట పాడారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై కాసేపు నవ్వుల సందడి నెలకొంది. ( తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్’.. కలెక్షన్లు ఎంతంటే.? ) #Brahmanandam : Suma... Nenu Andanga Untana? #Siddu Andanga Untada?@ItsSumaKanakala : Vaar evaa Ema Face... Achhu Herola Vundi Baasu! 🤣#MahendragiriVarahi pic.twitter.com/SJwz6H8J6R— Milagro Movies (@MilagroMovies) September 6, 2026 -
తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్’.. కలెక్షన్లు ఎంతంటే.?
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మిర్జాపూర్:ది మూవీ’. ఓటీటీలో ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌కు మంచి ఆదరణ రావడంతో అదే పేరుతో మరో కొత్త కథతో తెరపైకీ తీసుకొచ్చారు. ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఆదివారం మరింత జోరు చూపించింది. మూడో రోజు ఏకంగా రూ. 36 కోట్ల నెట్ వసూళ్లూ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువమంది చదివింది: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులురూ.100 కోట్లకు చేరువలో..గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రూ.25.75 కోట్లతో బోణీ కొట్టింది. శనివారం అదే జోరులో కలెక్షన్లు మరింత పెరిగి రూ. 32 కోట్లకు చేరాయి. ఆదివారం వచ్చే సరికి ఈ చిత్రం రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు సుమారు రూ. 93.75 కోట్లకు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు దాదాపు రూ.6 కోట్ల దూరంలోనే ఉంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లుఈ చిత్రం.. ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. సాక్నిల్క్(గణాంకాల నివేదిక) ప్రకారం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇందులో దాదాపు రూ.20 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్లు సమాచారం. -
మమ్ముట్టి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఓమ్’ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ బయటికొచ్చింది. దీంతో మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదీ చదవండి: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులుసినిమా విషయానికి వస్తే..మమ్ముట్టి, దర్శకుడు నితీష్ సహదేవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మేళా’. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ బ్యానర్లో వస్తున్న తొమ్మిదో చిత్రమిది. ఈ చిత్రానికి అనురాజ్ ఓ.బి., నితీష్ సహదేవ్ కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నితీశ్ సహదేవ్ గతంలో ‘ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలోనే ప్రారంభమైనట్లు సమాచారం.ఓమ్: ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో..మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే 2019లో విడుదలైన యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముమ్ముట్టి. మంచి విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా యాత్ర2ను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఈ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో ముమ్ముట్టి కనిపించారు. ( స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?) -
‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఎక్కువమంది చదివింది: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?సంప్రదాయ వస్త్రధారణలో అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాని చేసేందుకు ఓ పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని పీవీఆర్‌కు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో పంచెకట్టుతో థియేటర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవలే ఈ సినిమా కోసం పడిన కష్టాలను డైరెక్టర్ విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’ हनुमान अंश ने सिनेमाघरों को सच में मंदिर बना दिया ❤️🚩PVR में गुरुकुल के युवा ब्रह्मचारियों ने जब #HanumanAnsh देखी, तो उनके चेहरों की चमक देखने लायक थी। 🙏यह सिर्फ फिल्म नहीं, हमारी संस्कृति, संस्कार और प्रभु हनुमान की भक्ति से जुड़ने का अनुभव है। 🇮🇳🚩#आ_गया_है_अवतार pic.twitter.com/fNVGglsGrh— Divya Singh (@DivyaSi51590883) September 7, 2026 -
పందెం అంటే పోటీ కాదు.. తెలివి ‘మండాడి’ ట్రైలర్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. -
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్ ‘పంచనామా’ ఉదయ భాను ప్రొడక్షన్స్ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ రోజు( ఆదివారం) ట్రైలర్ విడుదలైంది.సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ అయిన జీ5లో స్రీమింగ్ కానుంది. ఇదో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో భరత్ పోలీస్ అధికారిగా కనిపించారు. ప్రవీణ్, ఆది, జోసఫ్ అనే ముగ్గురు ఎందుకు చెనిపోయారు.? కొద్ది రోజుల తరువాత దొరికిన చేతులు ఎవరివి? దొరికేలా ఎవరు చేశారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇందులో శివాజీ రాజా, మేథారెడ్డి, రూప లక్ష్మి, శ్రీజ తదితరులు నటిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో -
‘అంతా రాములోరు చూస్కుంటారు‘ గ్లింప్స్ విడుదల
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రం బృందం గ్లింప్స్‌ని విడుదల చేసింది. వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సినిమాలో సంగీత్ శోభన్ మారుతి అనే గోదారి కుర్రాడులా కనిపిస్తున్నాడు. అనస్వర రాజన్ ‘శిరీష’గా వెండి తెరను పలకరించనుంది. -
అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?
దశాబ్దానికి పైగా టాలీవుడ్లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్‌గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో సర్ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. ఇక అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వచ్చి మరో సూపర్ హిట్ కొడితే ఈ రూమర్స్ అన్నీ రూమర్స్‌గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది నుంచి మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి. -
కథలో దమ్ముంటే ప్రేక్షకులే ఆదరిస్తారు: శ్రీవిష్ణు
జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.‘జానకీరామ్.. కంగారు పడి ఏవో వాగ్దానాలు చేయకు . సినిమా హిట్ అవ్వకపోతే అమీర్‌పేట్ సెంటర్లో బట్టలిప్పుతా.. లాంటి డైలాగ్‌లు చెప్పకు. కథలో బలం ఉన్నప్పుడు ప్రేక్షకులే ఆదరిస్తారు’ అని చెప్పి నవ్వులు పూయించారు. కాగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మన అందరి కథ అంటూ..కాగా హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ప్రొడక్షన్ నెం 39‘ ( వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు.ఇదీ చదవండి: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియోసినిమా హిట్టయితే అమీర్ పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా… వద్దు ఖంగారు పడి వాగ్దానాలు చేయకు. - @sreevishnuoffl to his director Janaki pic.twitter.com/yCzVFzBvOV— Rajesh Manne (@rajeshmanne1) September 5, 2026 -
బూతు సినిమాలకు లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఎందుకు?
జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, ఆర్. నారాయణమూర్తి సెన్సర్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎక్కువ మంది చదివింది: పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు: అల్లరి నరేశ్సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు‘సెన్సార్ విషయంలో సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఓటీటీలలో ఎలాంటి సెన్సార్ లేకుండానే కంటెంట్ వస్తోంది. మరి తెరపై వచ్చే సినిమాలకు సెన్సార్ ఆంక్షలు ఎందుకు?. సినిమాల విషయంలో రాజకీయాలు మానుకోవాలి. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు పెద్దలు కఠినమైన ఆంక్షలు పెట్టకుండా సినిమా వాళ్ల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ ఏ రాజకీయ నేత సినిమాల్లోకి వచ్చి సూపర్‌స్టార్ కాలేదు. ప్రతి తెలుగు సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడుతోంది’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.షాక్ అయ్యా‘కామ్రేడ్ అనే పదం సెన్సార్ వాళ్లు వద్దంటే షాక్ అయ్యా. అసలు ఈ పదం అర్థం తెలుసా ఎవరికైనా? కామ్రేడ్ అంటే ఒక అమ్మ. ఒకే భావజాలంతో ఒకే లక్ష్యంతో.. ఓకే జీవనశైలితో ప్రజల కోసం వారి జీవితాలను వదిలేస్తారో వాళ్లే కామ్రేడ్స్. కామ్రేడ్ అని పిలుచుకోవడం మన అదృష్టం. అందువల్ల ఈ పదంపై సెన్సార్ వాళ్లు ఇబ్బందులు పెట్టవద్దు. కొన్ని సినిమాల్లో బూతులు ఉన్నా వదిలేస్తున్నారు. మరికొన్ని సినిమాలు మంచిగా ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇదీ చదవండి: తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు -
‘పెద్ద సినిమాలకు అండగా నిలబడ్డాం’
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ‘మన ప్యానల్’ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి మన ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపారు.మేము అలాంటివి ఏం చేయలేదు..సి కల్యాణ్ మాట్లాడుతూ ‘కొన్ని హామీలు చూసాం. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి. గత రెండున్నర ఏళ్లుగా మీరేం చేశారు. ఇప్పుడు వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి మన ప్యానెల్ ఉంది. ఒకసారి నిర్మాత ఒక సినిమా చేస్తే మెడిక్లైమ్ వచ్చేలా మేమే చేశాం’ అని తెలిపారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘1990లో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇప్పుడు పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాతలు లేరు. అక్కడ నుండి ఇక్కడకు పరిశ్రమ వచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి బాగా సపోర్ట్ చేశారు. నిర్మాతలకు అంతా తెలుసు. కౌన్సిల్ లో మేము అధికారంలోకి వచ్చాక అన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తాం’ అని తెలిపారు.తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘గతంలో మమ్మల్ని ఎన్నికల సమయంలో వారు మోసం చేశారు. నేను చాలా మంది చిన్న నిర్మాతలకు అండగా నిలబడ్డాను. ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో క్లియర్ గా ఉంది. ఎన్నో పెద్ద సినిమాలకు కూడా మేము అండగా నిలబడ్డాం.’ అని తెలిపారు. -
కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం కావడంతో అంచానాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్‌లు, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన ఏషనాగుల పాట ఇప్పటికీ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో రీపోస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్, నాని ఇదే సాంగ్‌ను దసరా సినిమాలోని చమ్కీల సాంగ్‌తో మిక్స్ చేసి ఈ రెండు పాటలపై క్రాస్ ఓవర్ వీడియో చేశారు. అదికాస్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ50 మిలియన్లు దాటిన ఏషనాగుల..తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అంటే చాలామంది 'డిసి' అని చెబుతారు. తెలుగులో అయితే జీరో ప్రమోషన్స్ చేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇందులో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి దక్షిణాదిలో ఓవర్‌నైట్ స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడదే ఊహించని అవకాశం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలతో చాన్నాళ్ల తర్వాత వరస హిట్స్ అందుకున్న సూర్య ప్రస్తుతం నజ్రియాతో కలిసి మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌తో ఓ మూవీ చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ జ్ఞాన వేల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇకపోతే సూర్య 49వ చిత్రం 'జన నాయగన్' ఫేమ్ దర్శకుడు హెచ్.వినోద్ తీయనున్నాడట.ఈ మూవీలోనే హీరోయిన్గా లేటెస్ట్ సెన్సేషన్ వామిక గబ్బిని అనుకుంటున్నారట. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సూర్య 'కరుప్పు'కు సాయినే సంగీతమందించాడు. దీని అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది. -
పాఠాలు చెబుతాం... నిలదీస్తాం
టీచర్ అంటే క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడం, స్ట్రిక్ట్‌గా ఉండటం మాత్రమే కాదు... విద్యను వ్యాపారంగా మార్చాలనుకుంటే నిలదీస్తాం అంటున్నారు సిల్వర్ స్క్రీన్ టీచర్స్. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్వరలో తెరకు రానున్న కొన్ని టీచర్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం.ప్రొఫెసర్ పాఠాలు యాక్షన్ మోడ్‌లో స్క్రీన్ పై ప్రభాస్ ఎలా కనిపిస్తారో చాలా సినిమాల్లో చూశాం. కానీ ‘మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో ప్రభాస్ క్లాస్‌గానూ కనిపించారు. తాజా సినిమా ‘స్పిరిట్’లో కూడా కొన్ని సీన్స్‌లో క్లాస్‌గా కనిపిస్తారట. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్, డాన్, కాలేజీ ప్రొఫెసర్... ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారట. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ప్రభాస్ పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. ప్రొఫెసర్‌గా ప్రభాస్ నటించిన సన్నివేశాలనే ఆ షెడ్యూల్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రి గురువు... కుమార్తె శిష్యురాలు నిజ జీవితంలో తండ్రీ కూతుళ్ళు అయిన షారుక్ ఖాన్ –సుహానా ఖాన్లు ‘కింగ్’ సినిమాలో గురు–శిష్యులుగా కనిపించనున్నారని తెలిసింది. కాకపోతే ఈ చిత్రంలో గురువుగా సుహానాకు షారుక్ కాలేజీ పాఠాలు చెప్పరు. జీవిత పాఠాలు నేర్పుతారు. తనకు అన్యాయం చేసిన వారి భరతం పట్టే పాత్రలో సుహానా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఆమె కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సి ఉంది. ఆన్సెట్స్లో ఈ రిస్కీ ఫైట్స్ చేయడానికి షారుక్ సహాయం చేస్తున్నారట. అలాగే సినిమాలోనూ యాక్షన్ గురువుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాక్‌పీస్... తుపాకీ ‘హిస్టరీ లెసన్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి’ అంటూ ఆ మధ్య ‘టీచర్’ చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు బాలు శర్మ. ఈ సినిమా టైటిల్ లోగోలో చాక్‌పీస్ మాత్రమే కాదు... తుపాకీ కూడా కనిపించడం చర్చనీయాంశమైంది. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. టీచర్‌గా ప్రముఖ నటి సిమ్రాన్ నటిస్తున్నారు. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడంతో పాటు దుష్టుల పని పట్టే టీచర్‌గా ఆమె కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. దబాంగ్ టీచర్ ఆమె కోటీశ్వరురాలు... కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి, టీచర్‌గా చేరుతుందట. అది కూడా ట్రైనీ టీచర్‌గా... ‘దబాంగ్ టీచర్’ పేరుతో రూపొందుతున్న సిరీస్‌లో కనికా కపూర్ ఈ పాత్రను చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, న్యాయం కోసం పోరాటం, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టీచర్ నైనా పాత్ర కోసం తాను సుష్మితా సేన్, ఆలియా భట్లను స్ఫూర్తిగా తీసుకున్నానని, వారి బాడీ లాంగ్వేజ్ టీచర్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఉంటుందని కనికా పేర్కొన్నారు. షకేబ్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిజిటల్ వేదికగా త్వరలో వీక్షకుల ముందుకు రానుంది. -
‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదట్లో ఈ సినిమా కోసం వచ్చిన కష్టాలను విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు. 25 షోలకు పడిపోయాం‘ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రానికి తొలుత దేశవ్యాప్తంగా 350కిపైగా షోలు దొరికాయి. ఇతర భారీ చిత్రాల విడుదలతో ఈ సినిమా షోల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రేక్షకులే ఈ సినిమాను నడిపించారు. పెద్ద సినిమాలు విడుదల కావడంతో మా షోలను థియేటర్లు తగ్గించాయి. ఒకానొక సందర్భంలో 250 షోల నుంచి 25 షోలకు పడిపోయాం. మల్టీప్లెక్స్‌లు కూడా ప్రధాన ప్రాంతాల్లో మా సినిమాను ప్రదర్శించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు’ అని విశాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీఆ పోస్టు ఇచ్చిన ధైర్యం..‘సాధారణంగా పోస్టులను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సమయంలో నా సినిమా ఆడలేదేమోనని లోలోపల బాధపడుతున్నా. అప్పుడు ఒక పోస్ట్ కనిపించింది. ‘నీ పని నువ్వు చేయి.. మిగతాది నేను చూసుకుంటాను’ అనే సందేశం ఉంది. మొదటి వారం చివర్లో ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.బాలీవుడ్ నుంచి సాయం..‘హనుమాన్ అంశ్’తో పాటు ‘అవారాపన్ 2’, ‘బత్వారా’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తాను ఆశించినంత మద్దతు లభించలేదని విశాల్ అన్నారు. ‘సినిమా విజయవంతం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కాగా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.75 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని విశాల్ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: ఓటీటీలు సోమరిపోతుల కోసమే: నటుడు శివాజీ -
తొలిసారి ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన నయనతార..!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే టాక్సిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. యశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు గీతూ మోహన్గాస్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంచితే మరో మూవీ హాయ్ కూడా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. అయితే నయనతార ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తన సంప్రదాయానికి భిన్నంగా థియేటర్లో సందడి చేసింది. తన సుదీర్ఘ సినీ కెరీర్లోనే మొదటిసారిగా ఒక సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు థియేటర్‌ను సందర్శించింది. ఆమెను చూసిన ఆడియన్స్ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ కూడా కావడమే ఇలా ప్రమోషన్ కోసం బయటకు వచ్చిందని.. లేకపోతే ఎందుకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. #Nayanthara theatre visit at kamala theatre chennai.#HiMovie pic.twitter.com/AmZUTC3tBE— Quality Pixels (@Quality_Pixels) September 4, 2026 -
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తులసి కోమలవేణి అనే కన్నడ భక్తి పాటకు నృత్యం చేసి వీడియోను షేర్ చేశారు. కృష్ణుడుకి అంతా తెలుసు. నాకు అది చాలు అనే క్యాప్షన్‌ను చివర్లో జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ
ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం.. మంచి జీతం. తన తల్లి కల కోసం సినిమాలవైపు వచ్చింది. నటనపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చింది యువ హీరోయిన్ రాశీ సింగ్. ‘శశి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో మరోసారి వెండి తెరపై కనిపించింది. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఈ భామ తన కెరీర్ విశేషాలను వెల్లడించింది. తన మాటల్లోనే..‘చిన్నప్పటి నుంచి నటిని కావాలని నిర్ణయించుకున్నా. నిజానికి మా అమ్మకు కూడా నటి కావాలనే కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల కాలేకపోయారు. ఆమె కల కోసం నన్ను ఇలా ప్రోత్సాహించారు. ఇప్పుడు నాలో ఆమెను చూసుకుంటున్నారు.గతంలో ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్హోస్ట్గా పనిచేశా. ఆ ఉద్యోగం బాగానే ఉన్నప్పటికీ నా మనసంతా సినిమాల పైనే ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలేశా. తర్వాత మోడలింగ్ చేయడంతో పాటు కొన్ని ప్రకటనల్లో నటించా. గాడ్‌ఫాదర్ లేకపోవడంతో చాలా విషయాల్లో కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది.ఇదీ చదవండి: ‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’నాకు కెమెరా అంటే భయం ఉండేది కాదు. షూటింగ్ టైమ్‌లో నటనకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకున్నా. యాడ్స్‌లో పనిచేయడం కూడా కలిసొచ్చింది. మోడలింగ్ ద్వారా చాలామందిని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టా.ఎక్కువ మంది చదివింది: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి : అల్లరి నరేష్సినిమాలో నేను పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల నన్ను గుర్తుపట్టుకోవాలి. అందుకే తొందరపడకుండా కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలో గుర్తుండుపోయే పాత్రలు చేయాలనేదే నా కోరిక’ అని రాశి సింగ్ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? -
నయనతార చాలా స్ట్రాంగ్ ఉమెన్: రాధిక
నయనతార చూడటానికి సాప్ట్‌గా ఉంటుంది కానీ వాస్తవానికి ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్. హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉన్నాం కదా అని దానిని ఎంజాయ్ చేయకుండా ఇతర రంగాల్లోనూ విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో రిస్క్‌తో కూడిన చిత్ర నిర్మాణ రంగంలో విజయాలను సాధిస్తున్నారు. ఆమె చాలా మందికి స్ఫూర్తి అని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ అన్నారు. నయనతార నిర్మాణ సంస్థ వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్. కవిన్ హీరో. గత నెల 28న థియేటర్లలో రిలీజైంది. చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చైన్నెలోని ఒక హోటల్లో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్.. నయన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'హాయ్' షూటింగ్‌ని అందరం చాలా ఎంజాయ్ చేస్తూ నటించాం. ఈ టైంలో నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ని చాలా మిస్ అవుతున్నాం. ఆయనతో కలిసి నటించిన చివరి చిత్రం హాయ్. దర్శకుడు విష్ణు ఎడవన్.. షూటింగ్ టైంలో సమస్యలని ఎదుర్కొన్నప్పటికీ పైకి నవ్వుతూ పనిచేశారు. అందుకు ఇప్పుడు మంచి విజయాన్ని అందుకున్నారు అని రాధిక శరత్ కుమార్ చెప్పింది.నయనతార, రాధిక శరత్ కుమార్, సుహాసిని మణిరత్నం, ప్రభు, కె.భాగ్యరాజ్ వంటి లెజెండరీ నటీనటులతో కలిసి నటించడం మంచి అనుభవమని హీరో కవిన్ పేర్కొన్నాడు. ఇది నా తొలి విజయం, ఇందుకు కారణమయిన అందరికీ ధన్యవాదాలు అని దర్శకుడు విష్ణు ఎడవన్ చెప్పాడు. -
జూ. ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ‘డ్రాగన్’లో పవర్ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. నిజానికి డ్రాగన్ సినిమాలోకి అలియాను తీసుకుంటారనే ప్రచారం ఏడాది కిందటే నడిచింది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్ మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్‌లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
సినిమా వాళ్ల జీవితం మనం ఊహించనంతగా ఈజీగా ఉండదు. గ్లామర్ ఫీల్డ్ రంగుల ప్రపంచమే అయినప్పటికీ.. వాళ్ల జీవితంలో అలాగే ఉంటుందనుకుంటే తొక్కపై కాలేసినట్లే. అందరి లైఫ్ లగ్జరీగా ఉంటుందనుకుంటే పెద్ద పొరపాటే. వెండితెరపై కనిపించినంత కలర్ఫుల్గా వ్యక్తిగత జీవితం ఉండదు. అలాంటి కథే ఈ మలయాళ స్టార్ హీరోయిన్ చర్మిలాది. సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. రియల్ లైఫ్‌లో మాత్రం దారుణ పరిస్థితులు ఎదుర్కొంది.తమిళనాడులో జన్మించిన చర్మిలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. శివాజీ గణేషన్ నటించిన ‘నల్లతోరు కుటుంబం’ (1979) చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ చిత్రం ‘ఒయిలట్టం’ (1991)తో హీరోయిన్గా పరిచయమైంది. అయితే చర్మిలకు మోహన్‌లాల్ సరసన వరుస చిత్రాలలో నటించే అవకాశం లభించింది. ధనం(1991), అంకుల్ బన్ (1991) చిత్రాలు ఆమెను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత కేలి మూవీతో స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అంతేకాకుండా 90 దశకంలో తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా కనిపించారు.రియల్ లైఫ్‌లో ఫెయిల్..సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన చర్మిలా మాత్రం రియల్ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోయింది. బాబు ఆంటోనీతో మొదలైన ఆమె ప్రేమ ప్రయాణం.. ఆ రిలేషన్ విచ్చిన్నం కావడంతోనే మొదలైంది. ఆ తర్వాత ఆమె జీవితం మరింత పతనమైంది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చివరికీ విడాకులు తీసుకుంది.మలయాళంలో 'కడల్' (1994) అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ మూవీలో బాబు కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడే వారిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారు 'రాజధాని', 'కంబోలం' వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నప్పటికీ.. చివరికి విడిపోయారు. తన తండ్రికి బాబు అంటే అస్సలు ఇష్టం లేదని ఆమె ఒకసారి వెల్లడించారు. నా తండ్రి కఠిన వైఖరే తనను బాబుకు మరింత దగ్గర చేసిందని ఆమె పేర్కొంది.కిషోర్ సత్యతో సీక్రెట్ పెళ్లి..అయితే బాబు ఆంటోనీతో విడిపోయాక.. అప్పట్లో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నటుడు కిషోర్ సత్యకు ఆమె దగ్గరైంది. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లే ఆమె సినీ కెరీర్ పతనానికి నాంది పలికింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని కిషోర్ నన్ను అడిగాడని చెప్పింది. ఆ తర్వాత కిషోర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అలా నాలుగేళ్లపాటు అతను అక్కడ.. నేను ఇక్కడ ఉన్నామని తెలిపింది. ఒక షో కోసం నేను దుబాయ్ వెళ్లి అతన్ని కలిశా.. ఈ మన బంధాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని కిషోర్ చెప్పిన విషయాన్ని చర్మిల గుర్తుచేసుకుంది. కేవలం నా పాపులారిటీ వల్లే నన్ను పెళ్లి చేసుకున్నాడని గ్రహించి..ఆ తర్వాత మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని వెల్లడించింది.రెండో పెళ్లి కూడా..ఒక పెళ్లి విఫలమైనప్పటికీ.. చర్మిల మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన రాజేశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడింది. అతను చర్మిల సోదరి ఫ్రెండ్ కావడం విశేషం. అయితే మా ఇద్దరికీ ఓ కుమారుడు జన్మించాడు. అయితే నేను క్రిస్టియన్ కావడంతో తన కొడుకు కూడా అదే మతం అనుసరించాలని కోరుకున్నా..కానీ రాజేశ్ హిందూ మతంలోకి మారాలని కోరడంతో మా ఇద్దరికీ విభేదాలొచ్చాయని తెలిపింది. దీంతో మేము చట్టపరంగా విడాకులు తీసుకున్నామని తెలిపింది. అయినప్పటికీ అతనితో టచ్‌లో ఉన్నాం.. కోర్టు విచారణ సమయంలో నా కొడుకు నాతో ఉండాలనుకుంటున్నానని చెప్పాడని.. రాజేశ్ తరచుగా నా కొడుకును కలవడానికి వస్తుంటాడని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలలో లేనప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆమె పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించారు. -
టాక్సిక్ డిజాస్టర్.. ఇంగ్లీష్ వర్షన్లో భారీ కట్స్..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. వసూళ్లపరంగా ఘోరంగా విఫలమైంది. భారీ బడ్జెట్ చిత్రంపై పెట్టుకున్న అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.ఇండియాలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ.. హాలీవుడ్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ వర్షన్ రన్‌టైమ్‌లో 2 గంటల 57 నిమిషాలు ఉండనుందని.. ఒరిజనల్ వర్షన్ కంటే 17 నిమిషాలు తక్కువ ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ ఆంగ్ల వర్షన్ విదేశాల్లో ఆగస్టు 26న విడుదలైంది. ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఇండియాలో సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీలోని ఏ సీన్స్ తొలగించారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. తబాహి, మధోశ్ లాంటి పాటలు తొలగించి ఉంటారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ పాటలను తొలగించారనే వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. థియేటర్లో చూస్తేనే కానీ ఏయే సీన్స్ తొలగించారో ఓ క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. Toxic: A Fairy Tale for Grown-Ups, in English - one of the languages the film was written and shot in. A shorter cut from the Indian language version. In cinemas from September 4, 2026. 🖤🎭#ToxicTheMovie @TheNameIsYash #Nayanthara @advani_kiara #TaraSutaria @rukminitweets… pic.twitter.com/AkKlV7AwvB— KVN Productions (@KvnProductions) September 3, 2026 -
‘ఐ యామ్ గేమ్’ ట్విటర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్ నేడు( సెప్టెంబర్ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే మలయాళ వెర్షన్లో యథాతథంగా విడుదల చేశారు.ఈ సినిమా చేసిన ప్రేక్షకులు తమతమ అభిప్రాయలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా ఫస్టాఫ్, దుల్కర్ నటన, విజువల్స్, నేపథ్య సంగీతంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్టాఫ్ మంచి వినోదాన్ని అందించిందని అంటున్నారు. ఇంటర్వ్ల్లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. #ImGame First Half Superb! 👌🔥The film gets off to a strong start with an excellent first 30 minutes, setting up the world and characters really well. The fantasy element and core plot then take some time to establish, but once that phase is done, the film picks up really well… pic.twitter.com/6Fu5ckIdmw— Balaji (@RDBalaji) September 3, 2026‘ఈ చిత్రం ఆరంభం అదిరిపోయింది. తొలి 30 నిమిషాలు అద్భుతంగా సాగుతూ కథా ప్రపంచాన్ని పాత్రలు చాలా చక్కగా పరిచయం చేస్తాయి. ఆ తర్వాత ఫాంటసీ అంశం, అసలు కథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. మళ్లీ కొన్ని సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తుంటాయి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. #ImGame is an overall entertaining watch with some really enjoyable moments. The VFX work stands out, while Jakes Bejoy’s music adds great energy throughout. I m game movie Rating - ⭐⭐⭐⭐ 4/5 ALL TIME BLOCKBUSTER ❤️🔥🔥!!@dulQuer delivers a super performance, and especially… pic.twitter.com/gHyl4xoSym— its cinema (@itscinemaoficl) September 3, 2026‘ఐ యామ్ గేమ్’ మంచి వినోదాన్ని ఇచ్చే చిత్రం. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. విజువల్ ఎఫెక్ట్ ఆకట్టుకునేలా ఉంటాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం సినిమాకు బలం. కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. #ImGame REVIEW: A terrific first half elevated by a surprising fantasy element, explosive pre-interval and interval blocks, and a show-stealing performance from Dulquer Salmaan. The second half slows down, shifting into a predictable familiar template with fewer surprises. The… pic.twitter.com/beckv7w3pZ— Lets Cinema (@letscinema) September 3, 2026‘ఊహించని ఫాంటసీ ఎలిమెంట్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ తన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. #Imgame : A fantasy thriller from Nahas Hidhayath.DQ shines as Dan John.Myskkin as Villain good.Jakes BGM elevates. Screenplay keeps us hooked from Pre-interval .A banger first half with a decent second half 🔥Good watch 🏆 💥- (3.5/5) ✅ pic.twitter.com/KMBSRESFDa— ரோமன் 🎦 (@romanjebin) September 3, 2026 -
‘ఐ యామ్ గేమ్’ విడుదల తెలుగులో ఆలస్యం
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్ నేడు( సెప్టెంబర్ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురై పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు. దీనిపై టీమ్ స్పందించి నోట్ విడుదల చేసింది. ఇదీ చదవండి: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి: అల్లరి నరేష్‘పలు సాంకేతిక కారణాల వల్ల ‘ఐ యామ్ గేమ్’ సినిమా తెలుగులో విడుదల ఆలస్యం కానుంది. ఇప్పటికే మలయాళ వెర్షన్లో సినిమా విడుదలైంది. ఆలస్యం అయినా తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చిత్రబృందం నోట్ విడుదల చేసింది. కామెడీ, రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్, గేమింగ్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే పలు అంశాలు ఇందులో ఉన్నాయని టీమ్ తెలిపింది. -
అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. ప్రస్తుతం ‘గాంధారి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో వస్తున్న హింస, షాక్ వాల్యూతో కూడిన భారీ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘2015లో వచ్చిన సినిమాలను చూస్తే అది ఒక కలల కాలంలా అనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు కెరీర్ ప్రారంభించి ఉంటే.. నాకు అసలు కెరీర్ ఉండేది కాదు. ఇప్పుడు వస్తున్న చిత్రాలు అలా ఉన్నాయి. అప్పట్లో నచ్చిన చిత్రాలు చేసే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల కిందట ఫ్యామిలీతో ఓ సినిమా చూశాను. తర్వాత నేను సినిమాల నుంచి తప్పుకుంటేనే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు. అని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈమెదే.. ఎంతంటే..?నచ్చని సినిమాలు చేయలేను..‘ నా వృత్తి అంటే చాలా ఇష్టం. కానీ అదే పనిని గుడ్డిగా ప్రేమిస్తూ.. నచ్చని సినిమాలు చేయలేను. మనం చేసిన సినిమాలే ఫిల్మోగ్రఫీని నిర్ణయిస్తాయి. కాలం మారుతుంది. పదేళ్ల తర్వాత ఏదో ఒక కొత్త జానర్ రావచ్చు. కానీ చేసిన సినిమాలు మాత్రం అలాగే ఉంటాయి. ఎవరైనా భవిష్యత్తులో నా ఫిల్మోగ్రఫీని చూస్తే.. చేసిన సినిమాల గురించి నాకు కానీ, నాతో కలిసి పనిచేసిన వారికి కానీ ఇబ్బందిగా అనిపించకూడదు. అందుకే ప్రస్తుత ట్రెండ్ కంటే నా ఫిల్మోగ్రఫీకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అని తాప్సీ పేర్కొన్నారు.‘గాంధారి’తో మరోసారి..తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’కి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. కనికా ధిల్లాన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, ఛాయా కదమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు (సెప్టెంబర్ 3) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇదీ చదవండి: శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. అంత పెద్ద రిస్క్ చేస్తాడా? -
రామ్‌చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.తాజాగా ‘ఇరుముడి’ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్లో చరణ్ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్‌తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్‌ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్‌పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు. -
నెల గ్యాప్‌లో మూడు సినిమాలు.. హీరోయిన్‌కి అనారోగ్యం
గత నెల గ్యాప్‌లో జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహోమ్ కుడుంబ యూనిట్ అని తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ మమిత బైజు ఆస్పత్రిపాలైంది. తీవ్ర జ్వరంతో ప్రస్తుతం బాధపడుతోంది. ఈ శనివారం ఆస్ట్రేలియాలో జరిగే 'క్లైడ్ ఓనం' వేడుకల్లో ఈమె పాల్గొనాలి. అనారోగ్యం కారణంగా ఈ టూర్ రద్దయింది. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ వెల్లడించింది. మమిత వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మాధవన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)'డాక్టర్స్ సలహా మేరకు ప్రయాణం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి. త్వరలోనే అభిమానులని కలుసుకుంటాను' అని మమిత బైజు సదరు వీడియోలో చెప్పుకొచ్చింది. ఈమె చేసిన మలయాళ మూవీ 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు డబ్బింగ్ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) View this post on Instagram A post shared by Clyde Malayalee Community Inc (@clyde_malayalee) -
డైరెక్టర్ లేకుండానే సినిమా.. శ్రీకృష్ణ దేవరాయలుగా సుదీప్
కన్నడ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలియొచ్చేమో. 'ఈగ' విలన్ అంటే మాత్రం ఎక్కువగా గుర్తుపడతారు. సైరా, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం సొంత భాషకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఈ రోజు సుదీప్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు)తెలుగు ప్రముఖ నిర్మాణ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుదీప్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాకు 'దేవరాయ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మనందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి సంగీత దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ బాగుంది. అలానే ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది.వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించడం వరకు బాగానే ఉంది. కానీ దర్శకుడు ఎవరనేది బయటపెట్టలేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ కాలేదా లేదంటే కావాలంటే పేరుని రివీల్ చేయలేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. అలానే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు.(ఇదీ చదవండి: విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. 'జైలర్ 2' వాయిదా రూమర్స్.. తీరా చూస్తే) -
విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. వాయిదా రూమర్స్.. తీరా చూస్తే
రజనీకాంత్ 'జైలర్ 2' సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే 'జైలర్ 2' థియేటర్లలో రిలీజ్ కానుందని కొత్తగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదివరకే పూర్ణ చేసిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదలకు మరో నెలన్నర ఉంది కాబట్టి కొన్నిరోజుల తర్వాత ప్రమోషన్లు మొదలుపెడతారేమో అనిపిస్తుంది. 'జైలర్ 2'కి పోటీగా తెలుగులో విజయ్ దేవరకొండ 'రణబాలి', వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' బరిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర దసరాకి మంచి ఫైట్ చూడొచ్చు.2023లో వచ్చిన 'జైలర్' అద్భుతమైన సక్సెస్ అందుకుని రజనీకాంత్‌కి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సూపర్‌స్టార్ పని ఇక అయిపోయింది అనే టైంలో రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌పైనా బజ్ ఓ మాదిరిగా ఉంది. తొలి భాగంలోని నటీనటులు ఇందులోనూ కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు.(ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు)October 15th Alappara Kelappurom!🔥 #Jailer2@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren #SantoshRaju @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss #Jailer2FromOct15 pic.twitter.com/vhrR4Z2nSD— Sun Pictures (@sunpictures) September 2, 2026 -
ఇలాంటి సినిమా చేయడం సాధ్యమా అని ఆశ్చర్యపోయా
కార్తీ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'సర్దార్ 2'. 2022లో తొలి భాగం విడుదలై హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ తీశారు. ఈసారి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ తదితర హీరోయిన్లు కొత్తగా నటించారు. రజిషా విజయన్ మరోసారి కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎస్జే సూర్య విలన్. వచ్చే శుక్రవారం పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలో ఆడియో లాంచ్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు')ఈ చిత్ర టీజర్ చూసి ఇలా తమిళంలో చేయడం సాధ్యమా? అరే ఇది మిత్రన్ సినిమానా? అని ఆశ్చర్యపోయాను. అందరూ కార్తీని సర్ధార్ అని పిలుస్తున్నారు. కార్తీ నాకంటే మంచి మూవీస్ చేస్తున్నాడు. దాన్ని నేను ఆస్వాదిస్తూ , ఆశ్చర్యంగాను, సంతోషంగానూ చూస్తున్నాను. మరో విషయం ఏంటంటే నేను చెన్నైలోనే ఉంటున్నాను. అప్పడప్పుడు ముంబైకి వెళ్లి వస్తున్నాను అని సూర్య తాను గురించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు.నటుడు కార్తీ మాట్లాడుతూ .. నేను విదేశాల్లో చదువుకున్నాను. అక్కడ కూడా మన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాను కొందరు ఎగతాళి చేస్తారు. కొందరు అభినందిస్తారు. వారు అభినందించే విధంగా మూవీస్ చేయాలని నేను భావిస్తాను. సర్ధార్ 2 చిత్రం అలాంటిదే అని అన్నాడు.(ఇదీ చదవండి: ఐటమ్ సాంగ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?) -
ఐటమ్ సాంగ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?
ప్రస్తుత ట్రెండింగ్ హీరోయిన్లలో కాయదు లోహర్ ఒకరు. తెలుగులో 'అల్లూరి' అనే మూవీ చేసినప్పటికీ.. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన చేసిన 'డ్రాగన్'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలా తమిళ, తెలుగు, మలయాళంలో వరస సినిమాలు చేస్తూ మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఈమె లేటెస్ట్ మూవీస్ 'ఇమ్మోర్టల్', ఐ యామ్ గేమ్.. ఈ శుక్రవారమే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు రెడీ అవుతోందట.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?)రజనీకాంత్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ కంపల్సరీగా ఉంటోంది. 'జైలర్'లో తమన్నా చేసిన పాట సెన్సేషన్ హిట్ అయ్యింది. 'కూలీ'లో పూజా హెగ్డే చేసిన మోనికా కూడా సూపర్ హిట్ అయింది. 'జైలర్ 2'లోనూ పూర్ణ ప్రత్యేక పాటలో నర్తించింది. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ 'ధర్మన్'. కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్లు. మరో కీలక పాత్రలో శ్రియ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ మూవీలోనే ఒక ప్రత్యేక పాటలో నర్తించేందుకు కాయదు లోహర్‌ని అప్రోచ్ అయ్యారట. త్వరలో ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు') -
సినీ సెప్టెంబర్
ఆగస్టులో విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ తో సినిమా ఇండస్ట్రీకి మరింత ఊపిరి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఇది తెలుగు బాక్సాఫీస్‌కు మరింత ఊపునిచ్చింది. తాజాగా సెప్టెంబరులో కూడా ప్రతి వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఆశ్చర్యకరంగా స్ట్రయిట్ చిత్రాలతో పాటు సెప్టెంబరులో ప్రతివారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ డబ్బింగ్ సినిమా కూడా ఉంది. లవ్, యాక్షన్, డివోషన్, ఎమోషన్, యూత్‌ఫుల్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సెప్టెంబరులో సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి... ఏ వారం ఏయే సినిమా రిలీజ్ కానుందో, ఏ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఓ లుక్ వేయండి.రంభ... ఊర్వశి... మేనక భూలోకానికి వస్తే! సినిమా హీరో అవ్వాలన్నది సూరి ఆశయం. కానీ సూరి ఏ మాత్రం కష్టపడకుండా సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. షార్ట్‌కట్ లో తాను హీరో కావాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఓ మాయా పుస్తకం సాయంతో ఏకంగా రంభ... ఊర్వశి... మేనకలను భూలోకానికి తీసుకువస్తాడట సూరి. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? సూరి ఆశయం నెరవేరి అతను సినిమా హీరో అయ్యాడా? ‘రంభ... ఊర్వశి... మేనక డ్రామా కంపెనీ’ సూరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది... అనేది ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో చూడొచ్చు. అల్లరి నరేశ్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ప్రేమ... హాస్యం... ఉత్కంఠ ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాల్లో మంచి ఇంటెన్స్ అండ్ బోల్డ్ సీన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను ఆడియన్స్ చూశారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ సినిమా మాత్రం ఎక్కువగా ఫన్ ఎలిమెంట్స్‌తో రూపొందడం విశేషం. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ యూత్‌ఫుల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ‘‘కాలేజీ స్టడీస్ పూర్తయిన తర్వాత కొంతమంది యువత లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేని విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ కాంప్లిసిటీ నేపథ్యంలో ‘రోమాంచకం’ సినిమా కథనం సాగుతుంది’’ అని ఇటీవల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ గురువారం ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే... నేడే ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. లైఫ్ ఆఫ్ సంజు ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘సహా’ (లైఫ్ ఆఫ్ సంజు). శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిశాంత్ కోదాటి దర్శకత్వంలో సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వేల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న రిలీజ్ కానుంది. ‘‘సంజు జీవితంలోని వివిధ దశలను ఈ సినిమా ప్రజెంట్ చేస్తుంది. ప్రేమ, విడిపోవడం, మధురమైన జ్ఞాపకాలు, కష్టాలను అధిగమించేందుకు అవసరమైన మనోధైర్యం వంటి అంశాలను కథలో చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ ఎంటర్టైనర్ సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజక వర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 4న రిలీజ్ కానుంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారట మేకర్స్. అవినీతి, డ్రగ్ మాఫియాలపై ఓ సామాన్యుడు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నటి కస్తూరి ఈ సినిమాలో ఓ విలన్ రోల్ చేశారని టాక్. వారాహి అమ్మవారి శాపం ఎందుకు? సుమంత్ హీరోగా నటించిన ఆధ్యాతి్మక మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. దాదాపు 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.మధ్యతరగతి జీవితాలు ‘బేబీ’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మధ్య తరగతి యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ పడే కష్టాలు, వారి కుటుంబాల ఇబ్బందులు ... వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే లవ్, ఎమోషన్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. విలేజ్ యాక్షన్ డ్రామా నటుడు–నిర్మాత రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. ఈ విలేజ్ యాక్షన్ డ్రామా సినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించగా, దీపా బాలు హీరోయిన్గా నటించారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఓ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో ఆ ఊరి గ్రామదేవతకు ఓ ఆంబోతును సమరి్పస్తారు గ్రామస్థులు. కానీ సడన్‌గా, అది అదృశ్యం అవుతుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నదే ఈ సినిమా కథనం అని సమాచారం. ప్రేమకథ వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లు గా నటించిన లవ్‌స్టోరీ సినిమా ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం లో కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఈ సెపె్టంబరు 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ‘‘మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. మా సినిమా చూస్తే మీ ప్రేమకథ గుర్తుకు వస్తుంది’’ అని ఈ సినిమా గురించి దర్శకుడు ఎంజీఆర్ తుకారాం చెప్పారు. స్పై డ్రామా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి, యాక్షన్, థ్రిల్, స్పై యాక్షన్ డ్రామా, హ్యూమర్ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాని సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. జడల్ జమానా నాని హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘దిప్యారడైజ్’. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని కపిస్తారు. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ‘ఏష నాగుల గట్టుపైన..’ అనే స్పెషల్ సాంగ్‌లో కీర్తీ సురేష్ డ్యాన్స్ చేశారు. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. ‘దిప్యారడైజ్’ సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేశారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఐడెంటిటీ, ఆధిపత్య పోరు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 24న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెప్టెంబరు నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.⇒ ఈ సెప్టెంబరు నెలలో వారానికొక డబ్బింగ్ సినిమా కూడా తెలుగు తెరకు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్ వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెప్టెంబరు 3న విడుదలæ కానుంది. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు –దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జిమ్ వర్గీస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ⇒ మలయాళ నటుడు నివిన్ పౌలి హీరోగా, మమితాౖ బెజు హీరోయిన్గా నటించిన లవబుల్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘బెత్లెహోమ్ కుటుంబయూనిట్’. సూపర్‌హిట్ ‘ప్రేమలు’ ఫేమ్ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాను ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. మలయాళంలో ఆగస్టు 21న విడుదలైన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో సెప్టెంబరు 4న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. వయసు వ్యత్యాసంతో కూడిన లవ్‌స్టోరీగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ⇒ సూపర్‌హిట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఆధారంగా ‘మిర్జాపూర్:ది మూవీ’ అనే హిందీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవి, అభిషేక్. బి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. ⇒ తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆల్మోస్ట్ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘సర్దార్ 2’. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్లు ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నటించారు. ఇందులో తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు కార్తీ. దేశభక్తి, తండ్రీ కొడుకుల భావోద్వేగం ప్రధానంగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా కలిసి ‘సర్దార్ 2’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలæకానుంది. ⇒ తెలుగు హీరో సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా ‘మండాడి’. ఈ చిత్రంలో సూరి, సుహాస్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. సుహాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. సముద్రంపై సాగే పడవల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది. ⇒ కీర్తీ సురేష్ ప్రధాన పాత్రధారిగా సనంత్, రిషికాంత్ ఇతర కీలక పాత్రధారులుగా నటించిన పీరియాడికల్ విలేజ్ డ్రామా ‘డొరోతి’. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీ™Œ æమోంగా, అచిన్ జైన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల కానుంది. స్నేహం, ఆశ, ఆశయం, పక్షపాత ధోరణి వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని కోలీవుడ్ టాక్.ఈ సినిమాలే కాకుండా... జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘ఇమ్మోర్టల్’, ‘డీమాంటీ కాలనీ 3’ వంటివి సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కోవలో మరికొన్ని పరభాషా సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
డోంట్ ట్రబుల్ వాయిదా
ఫహాద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా వేసి, అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘వైవిధ్యమైన పాత్రల్లో నటించి, విలక్షణ నటుడిగా పేరు పొందిన ఫహాద్ ఫాజిల్ నటించిన ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. టీజర్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ‘కేకు వాకు...’ అనే వీడియో సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. -
మమితా బైజు హ్యాట్రిక్.. తొలి హీరోయిన్గా రికార్డ్..!
మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది.జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. -
బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం.శివ బాలాజీ‘బిగ్‌బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు.కౌశల్ మండారెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్‌లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్!రాహుల్ సిప్లిగంజ్:మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు.అభిజీత్ దుద్దాల: నాలుగో సీజన్ విజేత అభిజీత్ దుద్దాల. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. బిగ్‌బాస్ విజయంతో మరింత పాపులర్ అయ్యారు. అనంతరం సినిమాలు, డిజిటల్ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. నటుడిగా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.వీజే సన్నీ: ఐదో సీజన్ టైటిల్‌ను వీజే సన్నీ సొంతం చేసుకున్నారు. టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. బిగ్‌బాస్ తర్వాత నటుడిగానూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులతో కెరీర్‌ను మార్చుకున్నారు. ఎల్.వీ. రేవంత్ : ఆరో సీజన్ విజేత ఎల్.వీ. రేవంత్. అప్పటికే ప్రముఖ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘ఇండియన్ ఐడల్’ విజేతగానూ నిలిచారు. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత కూడా సంగీతానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో పలు పాటలు పాడుతూ.. సినిమాలు, మ్యూజికల్ ఈవెంట్లతో బిజీగా కొనసాగుతున్నారు.ఎక్కువమంది చదివింది: ‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’పల్లవి ప్రశాంత్ : ఏడో సీజన్లో ‘రైతు బిడ్డ’గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నారు. అయితే విజయం తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. బిగ్‌బాస్ ఫినాలే అనంతరం జరిగిన గొడవలు, వాహనాల ధ్వంసానికి సంబంధించి పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. అనంతరం పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ లభించింది. బిగ్‌బాస్‌కు ముందు రైతుగా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన ఆయనకు టైటిల్ తర్వాత మరింత పాపులారిటీ వచ్చింది.నిఖిల్ మలియక్కల్: ఎనిమిదో సీజన్ విజేత నిఖిల్ మలియక్కల్. టెలివిజన్ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘గోరింటాకు’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ విజయం ఆయన పాపులారిటీని మరింత పెంచింది. ప్రస్తుతం టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.కల్యాణ్ పడాల: తొమ్మిదో సీజన్లో ‘సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్’ థీమ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కల్యాణ్ పడాల విజేతగా నిలిచారు. దీంతో బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి కామనర్‌గా రికార్డు సృష్టించారు. ఫైనల్లో తనూజ పుట్టస్వామిపై విజయం సాధించిన కల్యాణ్‌కు రూ.40 లక్షల నగదు బహుమతితో పాటు ఓ ఎస్యూవీ లభించింది. మాజీ భారత సైనికుడైన కల్యాణ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అయితే విజయం తర్వాత ఓటింగ్ ప్రక్రియపై సోషల్ మీడియాలో జరిగిన చర్చ కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు పదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కొత్త విజేత ఎవరవుతారనేది బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే! -
‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’
ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె.. కెరీర్ మొదట్లో తన ప్రవర్తన ఎలా ఉండేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఎం చెప్పారంటే..‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో నాలో చాలా గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. అయితే ఓ సందర్భంలో కొంతమంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవు. ఇలా ఉండటం మంచిది కాదు’ అని చెప్పారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా నా ప్రవర్తనను మార్చుకున్నాను’ అని నమిత తెలిపారు. తన వల్ల తోటి నటులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ‘నా ప్రవర్తన కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయం నాకు చాలా మంది చెప్పారు. ఆ తర్వాత నా తప్పును అర్థం చేసుకుని నన్ను నేను మార్చుకున్నాను’ అని నమిత పేర్కొన్నారు.ఎక్కువ మంది చదివింది: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!17 ఏళ్ల వయసులో..17 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.ఇదీ చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ -
'నన్ను ఘోరంగా అవమానించారు'.. కోలీవుడ్ హీరో ఆవేదన
కోలీవుడ్ హీరోలు ఇప్పటికే చాలామంది తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో సూర్య ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత విజయ్, ధనుశ్, కార్తీ, విశాల్, అజిత్ లాంటి స్టార్స్‌కు సైతం టాలీవుడ్లో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం మరో కోలీవుడ్ హీరో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. అతను మరెవరో కాదు.. మండాడి మూవీతో అలరించేందుకు వస్తోన్న సూరి. ఈ మూవీ వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.ప్రస్తుతం మండాడి మూవీ ప్రమోషన్లతో బిడీగా ఉన్న సూరి.. ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనను ఘోరంగా అవమానించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని సూరి వెల్లడించారు.సూరి మాట్లాడుతూ..'నన్ను ఒక పెద్ద హీరో మూవీ షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే సీన్. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో.. దర్శకుడు కలిసి మానిటర్లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నా చొక్కా విప్పేసి.. రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారు. అది నా సొంత చొక్కా అయినా కూడా లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కప్పుకుని, తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నా. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన సంఘటన ఇదే. ఇది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన' అని పంచుకున్నారు.కాగా.. వెన్నెలా కబడ్డికుళు సినిమాతో వెండితెరకు పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్ తీసిన 'విడుదలై'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'విడుదలై 2, మామన్, గరుడన్ తదితర మూవీస్‌లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు. -
సినిమా చరిత్రలోనే ఓ డైలాగ్ సీన్‌కు అరుదైన గౌరవం
యాక్షన్ సినిమాలకు 1990ల దశకం ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే,’ ‘ది ఫ్యుజిటివ్,’ ‘స్పీడ్,’‘హీట్,’‘ది రాక్,’ ఎయిర్ ఫోర్స్ వన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. అలాంటి సన్నివేశాల్లో ఒకటైన హీట్ (1995)లోని రెస్టారెంట్ సీన్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. సినిమా చరిత్రలోనే ‘గొప్ప డైలాగ్ ఎక్స్ఛేంజ్’గా ఈ సన్నివేశం ఓ మైలురాయిగా నిలిచింది.తొలిసారి ఎదురెదురుగా..మైఖేల్ మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీట్’లో అల్ పచినో, రాబర్ట్ డి నీరో ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అధికారి విన్సెంట్ హన్నా (అల్ పచినో), ప్రొఫెషనల్ నేరస్థుడు నీల్ మెక్కాలీ (రాబర్ట్ డి నీరో) మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఓ భారీ దోపిడీకి రెడీ అవుతున్న టైంలో మెక్కాలీని కాఫీ కోసం ఓ రెస్టారెంట్‌కు హన్నా ఆహ్వానిస్తాడు. అప్పటివరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవని వీరిద్దరూ తొలిసారి ఎదురెదురుగా కూర్చొని తమ జీవితాలు, ఎదుర్కొన్న కష్టాలు, నేరం, పోలీసు వృత్తి గురించి మాట్లాడుకుంటారు.ఇదీ చదవండి: ప్రభాస్‘స్పిరిట్’షూటింగ్.. హైదరాబాద్‌లోనే ఎందుకంటే?ఓ డైలాగ్ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది..ఈ సన్నివేశంలో మెక్కాలీ చెప్పే ఓ డైలాగ్ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ‘పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఎలాంటి అనుబంధానికీ తాను లోనుకాను’ అని అతను చెప్తాడు. చివర్లో హన్నా తనను అడ్డుకుంటే మెక్కాలీని పట్టుకోవడానికి వెనుకాడనని అంటాడు. అదే సమయంలో తన దారికి అడ్డొస్తే హన్నాను చంపడానికి కూడా తాను వెనుకాడనని మెక్కాలీ అంటాడు. ఒకరినొకరు గౌరవిస్తూనే ప్రత్యర్థులుగా నిలిచే ఈ సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.ఇద్దరి నటుల మధ్య పోరు ‘ఫార్ అవుట్ మ్యాగజైన్’కు చెందిన టామ్ టేలర్ రూపొందించిన ‘ది 10 గ్రేటెస్ట్ డైలాగ్ ఎక్స్ఛేంజెస్ ఇన్ మూవీ హిస్టరీ’ జాబితాలో ఈ రెస్టారెంట్ సీన్‌కు మొదటి స్థానం దక్కింది. ఇద్దరు స్టార్ నటులు తమ నటనా ప్రతిభతో ఈ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని టేలర్ పేర్కొన్నారు.ఎక్కువమంది చదివింది: అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ పెట్టా..: విష్టుప్రియమరో ఆసక్తికరమైన విషయం..ఇక ఈ సన్నివేశానికి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అల్ పచినో, రాబర్ట్ డి నీరో ఈ సీన్‌ను షూట్ చేయడానికి ముందు రిహార్సల్ చేయలేదట. హన్నా, మెక్కాలీ పాత్రలు అప్పటివరకు ముఖాముఖిగా కలవలేదు కాబట్టి ప్రాక్టిస్ చేయకుండానే నేరుగా సీన్ షూట్ చేస్తే సహజంగా ఉంటుందని డి నీరో భావించారట. దర్శకుడు మైఖేల్ మాన్ అందుకు ఓకే చెప్పడంతో ఆ సన్నివేశం అలా చిత్రీకరించారట.చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ -
ప్రభాస్‘స్పిరిట్’షూటింగ్.. హైదరాబాద్‌లోనే ఎందుకంటే?
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఎందుకు జరుపుతున్నారో ప్రణయ్ వంగా తెలిపారు.ఓ కార్యక్రమంలో పాల్లొన్న ప్రణయ్ వంగా స్పిరిట్ షూటింగ్ కోసం మాట్లాడుతూ.. ‘ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సినిమా నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్‌ను ముంబై కేంద్రంగా తెరకెక్కించడం వల్ల 20% నుంచి 30% వరకు అధికంగా ఖర్చయింది. అదే హైదరాబాద్‌లో నిర్మించుంటే చాలా డబ్బులు ఆదా అయ్యేవి. ఆ అనుభవంతోనే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను హైదరాబాద్‌లోనే నిర్మిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండఎందుకు ఎక్కువ అంటే..‘ముంబైలో స్టూడియో స్థలం, మౌలిక వసతుల కొరత కారణంగా షూటింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడ సెట్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర వసతులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చిత్ర పరిశ్రమలో ఒకరికొకరు సహకరించే సంస్కృతి కూడా ఉంది. పని వేళల్లో కూడా మార్పు ఉంటుంది’ అని వెల్లడించారు. సినిమా విషయానికి వస్తే..పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న విడుదల కానుంది.ఎక్కువ మంది చదవింది: పెళ్లి పీటలెక్కనున్న బలగం బ్యూటీ.. వరుడు మ్యూజిక్ డైరెక్టర్ -
నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మద్యం మానేయడం, ప్రేమలో పడటం, బ్రేకప్ ఎదుర్కోవడం, చివరకు పెళ్లి చేసుకోవడం.. ఇలా తన జీవితంలో చోటుచేసుకున్న కీలక మలుపులను గుర్తుచేసుకున్నారు. ‘రొమాంచకం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేమ, బ్రేకప్, మద్యం మానేయడం, పెళ్లి వంటి అంశాలపై ఓపెన్‌గా మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.బ్రేకప్ అయింది..తన జీవితంలోని జరిగిన కొన్ని అనుభవాలని విజయ్ వివరిస్తూ.. ‘నేను ఆల్కహాలిక్ని. డబ్బులు ఉన్నా లేకపోయినా విస్కీ తాగేవాడిని. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మద్యం మానేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ప్రేమలో పడ్డా. బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా. ఏదేమైనా.. ఇదంతా థ్రిల్లింగ్ అనుభవమే’ అని విజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!ప్రస్తుతం రణబాలితో..ఇదే సందర్భంలో వదినమ్మ ఎలా ఉంది అని అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘రష్మిక బాగుంది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. పని నుంచి విరామం తీసుకుని రిలాక్స్ అవుతోంది’ అని చెప్పారు. కాగా విజయ్, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. Question: 2026 లో మీ దృష్టిలో ఒక 'రోమాంచకం' మూమెంట్ అంటే ఏమిటి?#VijayDevarakonda : 89 లో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీదీ రోమాంచకమే . జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ తాగినా గ్లెన్ ఫిడిచ్ తాగినా, మందు వదిలేసినా, ప్రేమలో పడినా, హార్ట్ బ్రేక్ అయినా, పెళ్లి… pic.twitter.com/G1DmPjT064— CHITRAMBHALARE (@chitrambhalareI) August 30, 2026 -
‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐయామ్ ది గేమ్’. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిదాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి2’కి సంబంధించిన అప్డేట్ను పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.‘ఇప్పటివరకు పది రోజుల షూటింగ్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రభాస్‌కు సమయం దొరకపోవడంతో లేట్ అవుతుంది. అతనికి సమయం దొరికాక పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తాం’ అని వెల్లడించారు.ఎక్కువమంది చదివింది: శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్2024లో విడుదలై..కాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. 2024 జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కల్కి2’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ తరహాలో ‘కల్కి2’కి సంబంధించిన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.Kalki Part 2 Update by Nag Ashwin:Only 10 days of shooting have been completed so far! #Prabhas pic.twitter.com/goJsSMHdJk— Movies4u Official (@Movies4u_Officl) August 31, 2026


