సినిమాపై భయం.. అబ్బాస్‌కు మంచి కమ్‌బ్యాక్‌!: హీరో | GV Prakash Kumar comments at Happy Raj Pre Release Event | Sakshi
Sakshi News home page

సినిమా మధ్యలో వదిలేస్తారనుకున్నా: జీవీ ప్రకాశ్‌

Mar 18 2026 6:46 AM | Updated on Mar 18 2026 6:46 AM

GV Prakash Kumar comments at Happy Raj Pre Release Event

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్‌. నటి శ్రీగౌరి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్‌ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్‌ పిక్చర్స్‌ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్‌ సురేశ్‌ సహనిర్మాతగా వ్యవహరించాడు.

దేనికీ భయపడని వ్యక్తి 
జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్‌, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. 

మధ్యలోనే వదిలేస్తారా?
కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్‌ పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్‌ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్‌కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement