లాభాల్లో 70% వాటా డిమాండ్‌ చేస్తున్న హీరో | Sivakarthikeyan opts 70 Percentage for Seyon Movie | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: రూ.10 కోట్ల అడ్వాన్స్‌.. మిగతాదంతా సినిమా రిలీజయ్యాకే..

Mar 22 2026 5:49 PM | Updated on Mar 22 2026 6:17 PM

Sivakarthikeyan opts 70 Percentage for Seyon Movie

అమరన్‌ సినిమా తర్వాత శివకార్తికేయన్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్‌ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్‌ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్‌ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.

సెయాన్‌ అంటే..
శివకార్తికేయన్‌ ప్రస్తుతం సెయాన్‌ సినిమా చేస్తున్నాడు. స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నాడు. అమరన్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై శివకార్తికేయన్‌ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్‌ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

లాభాల్లో వాటా
ఈ మూవీకి శివకార్తికేయన్‌ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్‌ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్‌ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్‌ హాసన్‌ బ్యానర్‌కు వెళ్తాయి. సెయాన్‌ బడ్జెట్‌ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత జరగనుంది? బాక్సాఫీస్‌ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!

చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్‌ నిర్మాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement