కేడీ మూవీ సాంగ్ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హిందీ వర్షన్ లిరిక్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఏకంగా సాంగ్‌నే యూట్యూబ్ నుంచి తొలగించారు. కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా కేడీ చిత్రానికి సంబంధించి సర్కే చునార్ తేరి సర్కే అనే పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ పాడారు.
తాజాగా ఈ సాంగ్ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను తాను ఎప్పుడు గౌరవిస్తానని అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వివాదం పట్ల బాధగా ఉందని.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. లిరిక్స్‌లో మార్పు చేశారని.. అప్‌డేట్ అయిన సాంగ్ త్వరలో విడుదల చేస్తారని మంగ్లీ రాసుకొచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నా తన నోట్‌లో ప్రస్తావించారు.
కేడీ: ది డెవిల్ మూవీ సాంగ్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అయితే కేవలం హిందీ వర్షన్ లిరిక్స్‌పై మాత్రమే తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


