బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది.
నా గొంతు ఇబ్బంది
ఇళయారాజా సర్ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్‌పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్‌గా అనిపించింది.
నాన్న సలహా తీసుకోను
నేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేశ్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్‌లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్‌ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు.
పిచ్చి రీల్స్
దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్ పంపుతాడు..
అలాంటి వీడియోలు ఇష్టం
చిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్‌గా పరిచయమైంది శృతి హాసన్. తేవార్ మగన్ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్‌గా, హీరోయిన్‌గా రాణిస్తోంది.


