పిడుగులాంటి వార్త.. నిస్సహాయస్థితిలో నటుడు | Mimicry Artist Kannan Sagar Seeks Help after Heart Block Diagnosis | Sakshi
Sakshi News home page

బైపాస్‌ సర్జరీ చేయాలన్న డాక్టర్స్‌.. సాయం కోసం ఎదురుచూపు

Mar 22 2026 7:24 PM | Updated on Mar 22 2026 7:24 PM

Mimicry Artist Kannan Sagar Seeks Help after Heart Block Diagnosis

మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌ కన్నన్‌ సాగర్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు వీలైనంత త్వరగా బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత తనకు లేదని, దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ నోట్‌ వదిలాడు.

కుటుంబ బాగోగులు 
ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోనివారు ఈ ప్రపంచంలో ఉండరు. అలాగే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని ఎవరు కాదనగలరు? మన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తాం, పిల్లల్ని చదివిస్తాం.. వాళ్ల బాగోగులు చూసుకుంటాం. అలాగే మనకున్నదాంట్లోనే పక్కవాళ్లకు కూడా సంతోషాన్ని పంచే ప్రయత్నం చేస్తాం.

పిడుగులాంటి కుదుపు
కానీ సడన్‌గా అనారోగ్యం అనే ఓ పిడుగులాంటి వార్త మన జీవితాలను కుదిపేస్తుంది. మోయలేనంత భారాన్ని, బాధను తీసుకొస్తుంది. మన దారుల్ని మూసేస్తుంది.. ఇప్పుడెలా ముందుకెళ్తావని ప్రశ్నిస్తుంది. దృడ సంకల్పంతో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్థిక అంశాలు వెనక్కులాగుతాయి. అప్పుడే మన నిస్సహాయ స్థితి అర్థమై.. ఇతరుల సాయం కోసం వెతకడం మొదలుపెడతాం. 

గుండె సమస్య
ఇలా సాయం కోసం అర్థించడం బలహీనత అని నేననుకోను. ఎందుకంటే మన పరిస్థితి గురించి తెలిసినప్పుడే మంచి మనసున్నవారు మనకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కొద్ది రోజులుగా నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. నిన్ననే యాంజియోగ్రామ్‌ చేయించుకున్నాను. గుండె రక్తనాళాల్లో పూడిక ఉందని తెలిసింది. 

ఓదారుస్తున్నా
తక్షణమే బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా భార్యాపిల్లలు బాధతో ఏడుస్తూనే ఉన్నారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ, ఆపరేషన్‌ చేయించుకునేంత స్థోమత నాకు లేదు. సాయం కోసం చూస్తున్నా అన్నాడు. కన్నన్‌ సాగర్‌.. మలయాళంలో చార్లీ, అన్వేషిప్పిన్‌ కండేతుమ్‌, కర్ణన్‌ నెపోలియన్‌ భగత్‌ సింగ్‌ సినిమాల్లో నటించాడు.

చదవండి: లాభాల్లో 70% వాటా డిమాండ్‌ చేస్తున్న స్టార్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement