'దురంధర్‌-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ | kannada actress Divya Spandana Review On Dhurandher 2 movie | Sakshi
Sakshi News home page

Dhurandher 2 Movie: 'దురంధర్‌-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి'.. ప్రముఖ నటి రివ్యూ

Mar 20 2026 5:02 PM | Updated on Mar 20 2026 6:11 PM

kannada actress Divya Spandana Review On Dhurandher 2 movie

కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్‌పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్‌.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్‌వీర్‌ సింగ్‌ దురంధర్‌-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్‌లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.

మొదటి పార్ట్‌లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్‌-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది.  మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని  మేకర్స్‌ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. 

దివ్య తన ‍ట్వీట్‌లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను.  మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్‌లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్‌-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్‌గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా  నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్‌వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement