సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.
అదిరిన కాంబినేషన్
లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు.
రూమర్స్
నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్‌ను తీసుకున్నారు.
సినిమా
కాగా విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!


