మళ్లీ పెళ్లి చేసుకోలేదు, కానీ కలిసిపోయాం: స్టార్‌ డైరెక్టర్‌ | Priyadarshan Confirms Reunion with Lissy; We are living the same Life Together | Sakshi
Sakshi News home page

10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్‌ జంట

Mar 20 2026 2:53 PM | Updated on Mar 20 2026 3:11 PM

Priyadarshan Confirms Reunion with Lissy; We are living the same Life Together

మలయాళ స్టార్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌, హీరోయిన్‌ లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ఓ పెళ్లిలో జంటగా కనిపించారు. దీంతో ప్రియదర్శన్‌-లిస్సీ కలిసిపోయారా? అన్న ప్రచారం మొదలైంది. అది మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి చెవిలో పడింది.

సంతోషంలో మమ్ముట్టి
మమ్ముట్టి.. ప్రియదర్శన్‌ డైరెక్షన్‌లో, అలాగే లిస్సీతో కలిసి సినిమాలు చేశాడు. అలా ఇద్దరూ తనకెంతో సన్నిహితులు. వారు కలిసిపోవడంతో మమ్ముట్టి చెన్నైలోని ప్రియదర్శన్‌ స్టూడియోకి ఇద్దర్ని రమ్మని పిలిచాడట! మీ ఇద్దరినీ ఇలా జంటగా చూడటం సంతోషంగా ఉందని వారితో చెప్పాడట! విడిపోయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ కలవడానికి వారి పిల్లలు కల్యాణి, సిద్దార్థ్‌ ప్రధాన కారణమని తెలుస్తోంది. 

పెళ్లి
అయితే వారు కలిసిపోయారు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం చేయడం లేదు. మ్యారేజ్‌ అనేది కేవలం సర్టిఫికెట్‌ అని.. తమ మధ్య స్నేహం, అన్యోన్యత, ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారట! దీనిపై ప్రియదర్శన్‌ సైతం స్పందిస్తూ.. అవును, మేము కలిసే ఉంటున్నాం అని ధ్రువీకరించాడు.

సినిమా
కాగా ప్రియదర్శన్‌, లిస్సీ.. 1990 డిసెంబర్‌ 13న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్‌ సంతానం. కల్యాణి ప్రియదర్శన్‌ లోక సినిమాతో ఇటీవలే సెన్సేషన్‌ సృష్టించింది. ప్రియదర్శన్‌.. హిందీలో అక్షయ్‌కుమార్‌ హీరోగా భూత్‌ బంగ్లా సినిమా చేశాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

చదవండి: నడిరోడ్డుపై వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement