Srikakulam
-
Nambala Keshava Rao: శ్రీకాకుళం టు సుప్రీం కమాండర్
సొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం ముగిసిపోయింది. ఎంటెక్ చదివినా ఏళ్లకు ఏళ్లు చేసిన అరణ్య వాసం పూర్తయ్యింది. కలాన్ని వదిలి తుపాకీ చేతబట్టిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది. జియ్యన్నపేటలో పుట్టి.. టెక్కలిలో చదివి.. వరంగల్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి.. ఆపై అడవిలో అన్నగా మారిన నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రస్థానం ముగిసిపోయింది. చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో కేశవరావు హతమయ్యారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కిపడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, పలాస: నలభై ఏళ్ల కిందట ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి.. తన వాటా ఆస్తి రాసిచ్చేయాలని టీచరైన తండ్రిని కోరారు. ఎందుకని అడిగితే ఆస్తి ఇస్తే.. పేదలకు పంచేస్తా అని చెప్పారు. ఆ విద్యార్థే నంబాళ్ల కేశవరావు. విద్యారి్థగా ఊరి నుంచి, కు టుంబం నుంచి వెళ్లిన కేశవరావు విగతజీవిగా మా రారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత వాసం చేసి అడవిలోనూ ఊపిరి వదిలేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కి పడింది. నంబాళ్ల స్వగ్రామమైన కోట»ొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నప్పుడు తెలివైన విద్యార్థి, మెరుగైన కబడ్డీ ప్లేయర్‌గా మన్ననలు అందుకున్న కేశవరావు కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందిన నంబాళ్ల వాసుదేవరావు (ఉపాధ్యాయుడు) లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లో విద్యనభ్యసించారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి 1971 లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కోర్సులో చేరారు. ఏడాది తర్వాత వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరారు. ఆ తర్వాత అక్కడే ఎంటెక్‌లో చేరారు. అటు నుంచి అటే అడవి బాట పట్టారు. కేశవరావు మరణంతో కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం ప్రస్తుతం గుంభనంగా ఉంది. గతంలో ఒకటి రెండు మార్లు కేశవరావుమృతి వదంతులపై కొందరు స్పందించడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో ప్రస్తుతం ఎవరూ బయట పడడం లేదు. ఉద్దానంలో.. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్త ఉద్దానంలో దావానలంలా వ్యాపించింది. టెక్కలికి చెందిన ఆయనకు ఈ ప్రాంతం ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ ప్రాంతం మావోయిస్టు కేడరుకు, నాటి పీపుల్స్ వార్ పార్టీ కేడరుకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కావడంతో మృతి వార్తతో ఉద్దానం ఉలిక్కిపడింది. పోలీసు వర్గాలు ముందుగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి ఈ సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకొని రావడానికి ఎవరైనా వెళ్తున్నారా అని అడిగారు. తమ గ్రామానితో ఎలాంటి బంధుత్వం లేదని, రాజకీయ బంధుత్వం మాత్రమే ఉందని వారు చెప్పారు. ఒక నాటి పీపుల్స్ వార్‌లో, నేటి మావోయిస్టు పారీ్టలో పనిచేసి ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారు 60మంది వరకు కార్యకర్తలు, నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు మృతితో ఇక నాయకత్వ స్థానాల్లో ఈ జిల్లా నుంచి ఎవరూ లేరనే తెలుస్తోంది. ఆయన మృతదేహం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు బయల్దేరి వెళ్తున్నట్టు ఉద్దానం వాసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌కు ఖండన చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ మఢ్ అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ను సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు కోరినా వాటిని తిరస్కరించి మన దేశపౌరులైన మావోయిస్టులను ఉగ్రవాదులపై దాడుల కన్నా ఎక్కువగా దాడి చేసి దండకారణ్యంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిండచం అప్రజాస్వామికమని, పౌర సమాజం వీటిపై తీవ్రంగా స్పందించాలని కోరారు. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
కాశీబుగ్గ: జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాలు వద్ద కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కాశీబుగ్గ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జీడి రైతుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధర, జీడి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘం నాయకులు బత్తిని లక్ష్మీనారాయణ, టి.రాజు, డి.తారకేశ్వరరావు, జె.సంతోష్, టి.తాతారావు, సీఐటీయూ నాయకులు ఎన్.గణపతి తదితరులు పాల్గొన్నారు. -
27న అమరవీరుల స్మారక సభ
పలాస: శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధరైతాంగ పోరాటంలో అమరులైన అమర వీరుల స్మారక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం స్మారక సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మే 27న బొడ్డపాడులో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు జోగి కోదండరావు, వంకల మాధవరావు, దుష్యంతు, రామారావు, వీరాస్వామి, ధర్మారావు, పుచ్చ దుర్యోధన, బాలకృష్ణ, త్రిలోచనరావు, శ్రీరాములు, మోహిని, జగన్,అప్పయ్య, బాలరాజు, అప్పారావు,మాధవరావు, ముసలయ్య పాల్గొన్నారు. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
ఎల్.ఎన్.పేట: ఖరీఫ్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. పంట దిగుబడి చేతికి అందివచ్చే వరకు ప్రతి రోజు పొలంలో ఏదో ఒక పనిచేస్తునే ఉంటారు. రానున్న జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుంటా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కోనుగోలు చేసి పొలంలో వేసుకున్న తరువాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తనను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలే అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు (బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తరువాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పనిసరినకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓ, ఏడీ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. పంటను పరిశీలించి ధృవీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకొస్తారు. పోలీసుల, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల మేరకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. – పైడి లతశ్రీ, మండల వ్యవసాయాధికారి, ఎల్.ఎన్.పేట -
ఎందుకీ తెలుగు ద్వేషం?
తీవ్ర అన్యాయం.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమానికి పాతరేసేలా కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం లేదంటూ పేర్కొనడం విచారకరం. కూటమి ప్రభుత్వం ఆనాడు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం తగదు. – పిపిసి వసంతరావు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడుతెలుగుకు వెలుగేదీ? నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూటమి పార్టీల పెద్దలు, నాయకులు.. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీషుమీడియం, సీబీఎస్సీ సిలబస్ పట్ల.. అనరాని మాటలు అన్నారు. ఆ వాఖ్యలు, ప్రకటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చాక తెలుగు మాధ్యమాన్ని అధఃపాతాలానికి తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి. – కూన రంగనాయకులు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిశ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్‌ల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి తూట్లు పొడుస్తోందని గత ఐదేళ్లగా అక్కసు వెళ్లగక్కిన కూటమి నాయకులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమానికి మంగళం పాడేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదంటూ విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కలిపి 2,638 ఉండగా.. అందులో 1,61,151 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్‌లోనూ తెలుగును ఐచ్ఛికం చేస్తూ.. ఇంటర్మీడియెట్‌లో సైతం ఇన్నాల్లు తప్పనిసరిగా ఉన్న తెలుగు సబ్జెక్టును.. ఐచ్ఛికం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి తెలుగు అధ్యాపకులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగు మాధ్యమానికి అన్యాయం చేస్తున్నారని.. తెలుగులోనే బోధన, చదువులు కొనసాగాలని గగ్గోలు పెట్టిన కూటమి పార్టీల పెద్దలు, నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ తెలుగుమాధ్యమం లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల తెలుగుభాషాభిమానులు, ఏపీ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ ప్రతినిధులు మండిపడుతున్నారు. నాడు తెలుగుకు అన్యాయం జరగకుండా.. తెలుగు సబ్జెక్టుకు అన్యాయం జరగకుండా.. తెలుగును సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను తీసుకొచ్చింది. పేద, మధ్య తరగతి పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీపడి రాణించాలని ఆనాడు ఇంగ్లీషుమీడియంలో చదువు, సీబీఎస్సీ సిలబస్ అమలు విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆనాటి గత సర్కారు వెనక్కి తగ్గలేదు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి కోర్సులను కూడా తెలుగు మాధ్యమంలో బోధించాలని పేర్కొంటే.. రాష్ట్రంలో మాత్రం పాఠశాలల్లో ఆ నిబంధనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలు తమ మాతృభాషకు అగ్రతాంబూలమిస్తుంటే మన రాాష్ట్రంలో మాత్రం మాతృభాషను పట్టించుకునే వారే లేకపోవడం బాధాకరమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ అధ్యక్షులు పిసిని వసంతరావు, ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు, ముఖ్య ప్రతినిధులు పూడి లక్ష్మిపతి, పట్నాన వెంకటరమణ, కుప్పన్నగారి శ్రీనివాసరావు, గోడబ మేరీప్రసాద్, సీహెచ్ జనార్ధన్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో తీవ్ర అన్యాయం.. పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను తీసేయడం తీవ్ర అన్యాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు మండిపడుతున్నారు. 8వ తరగతి తర్వాత రాబోయే పదో తరగతిలో తెలుగు ఉత్తీర్ణత ప్రభావితం కానుందని గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీ నాయకులు మాటలు, ప్రకటనలు విని నిలువునా మోసపోయామని తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తెలుగుభాష పట్ల గౌరవం ఉంటే తక్షణం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలి. విద్యార్థుల రేషియో ఆధారంగా బడుల్లో తెలుగు ఉపాధ్యాయులను నియమించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు పొందేందుకు 2% రిజర్వేషన్ కల్పించాలి. డిగ్రీ వరకు తెలుగును ఐచ్ఛికం కాకుండా.. తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకురావాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి. -
ఆర్టీసీ బస్సు– ఆటో ఢీ
గార: కళింగపట్నం నుంచి బందరువానిపేటకు వెళ్లే రోడ్డులో ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో సహా 12 మందికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బందరువానిపేటలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది కుందువానిపేట పండగకి వెళ్లి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో కె.మత్స్యలేశం గ్రామశివారులోని మలుపు వద్ద బందరువానిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్‌ను ఢీకొట్టారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను రెండు అంబులెన్సుల ద్వారా తొలుత కళింగపట్నం పీహెచ్‌సీకి, అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరిలో గనగళ్ల లక్ష్మీ, దేవిశ్రీ కాలుకు గాయాలవ్వగా.. అప్పారావుకు బలమైన గాయమైంది. డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గార ఏఎస్ఐ ఎం.చిరంజీవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపారు. డ్రైవర్‌తో సహా 12 మందికి గాయాలు -
9.2 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు 9.2 కిలోల గంజాయి తరలిస్తున్న గమేష్నాయిక్ అనే వ్యక్తిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం పట్టణ పొలీసులు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు జరుపుతుండగా గమేష్నాయిక్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 9.2 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గేరేగేడి గ్రామానికి చెందిన ఈయన కుటుంబ పోషణకు డబ్బులు చాలక గంజాయి రవాణాకు దిగాడు. కంధమల్ జిల్లా తిలోరి గ్రామానికి చెందిన అజిత్ప్రధాన్, సుభాష్‌ల వద్ద కిలో గంజాయి రూ.రెండు వేలకు కొని మైసూర్లో బబ్లూకుమార్కు కిలో రూ.పది వేలకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ తనిఖీలలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. గడ్డివాములు దగ్ధం కాశీబుగ్గ: పలాస మండలం అమలకుడియా పంచాయతీ పూర్ణభద్ర గ్రామ సమీపంలో గడ్డివాములను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తగలబెట్టారు. గ్రామానికి చెందిన కాయల హరికృష్ణతో పాటు మరో రైతుకు చెందిన ఐదెకరాల గడ్డివాములు ఈ ఘటనలో కాలిబూడిదయ్యాయి. పశువులకు ఏడాదిపాటు సరిపడా గడ్డివాములు దగ్ధం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.సిక్కోలు విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు బూర్జ/మందస/జలుమూరు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వీరంతా మంగళవారం రాత్రి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. అవార్డులు అందుకున్న వారిలో మందస మండలం హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జ్యోషిత(597), బూర్జ మండలం ఓ.వి.పేట మోడల్ స్కూల్ విద్యార్థి బుడుమూరు ఉదయకిరణ్(593), జలుమూరు మండల కరవంజ మోడల్ స్కూల్ విద్యార్థిని రావాడ హేమశిరీష(592) ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. -
అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
నందిగాం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జవాన్ పిన్నింటి దొరబాబు అంత్యక్రియలు స్వగ్రామం పెంటూరులో పోలీస్ లాంఛనాలతో మధ్య ముగిశాయి. మంగళవారం సాయంత్రం నరసన్నపేట వద్ద జాతీయ రహదారి వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దొరబాబు మృతి చెందిన విషయం విదితమే. బుధవారం నరసన్నపేటలో పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దొరబాబు మృతదేహానికి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి సదానందం తలకొరివి పెట్టగా పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం భార్య కాంచనకు జాతీయ పతాకం అందజేశారు. -
ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు తగదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజలకు ఐదేళ్లుగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం తొలగించడం తగదని ఎండీయూ ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ అన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి బుధవారం ఎన్జీవో హోంలో విలేకరులతో మట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మంది ఎండీయూ ఆపరేటర్లు, 9,200 సహాయకులు పనిచేస్తున్నట్లు చెప్పారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలలు అగ్రిమెంట్ ఉందన్నారు. ప్రస్తుతం మరో రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. రాత్రికి రాత్రి ఉన్న ఫలంగా తొలగించడం సబబు కాదన్నారు. ఈ నిర్ణయాల వల్ల 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఒక్కో ఆపరేటర్ 1500 నుంచి 2000 ఇళ్లకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులు అందించారని గుర్తు చేశారు. బ్యాంకుల ద్వారా వాహనాలకు తీసుకున్న రూ.1,90,000 బకాయిలు ఉందని, వీటిని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తప్పక తొలగించాల్సి వస్తే కార్మిక చట్టం ద్వారా ఆరు నెలలు జీతాలను ముందే చెల్లించాలని, లేనిపక్షంలో ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఎండీయూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు హేమసుందర్, వరహా నర్సింహులు, వెంకట్రావు, అప్పలనాయుడు, రవి, వాసు గోపి, రామారావు పాల్గొన్నారు. -
నా పోర్టు పరిహారం ఏమైంది..?
● టీడీపీ కార్యకర్త ఆవేదన సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు సంబంధించి రెండోసారి ఎకరాకి రూ.12లక్షల 50వేలు చొప్పున ఇచ్చిన పరిహారం ఏమైందంటూ టీడీపీ కార్యకర్త జీరు ధర్మారావు ప్రశ్నించారు. ఆయన బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని తాను వ్యతిరేకించానని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భూములు ఇవ్వడానికి సంతకం కూడా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు చివరలో సంతకం చేశానని అన్నారు. తనకు ఎకరా 30 సెంట్లు భూమి ఉంటే 83 సెంట్లకే రూ. 21లక్షల 25వేలు పరిహారం మొదటి విడతగా ఇచ్చారని తెలిపారు. రెండోవిడతగా 23 టీడీపీ కుటుంబాలకు ఎకరాకి రూ.12లక్షల50వేల పరిహారం ఇచ్చారని, తన పరిహారం ఏమైందని స్థానిక టీడీపీ నాయకులను అడిగితే నీ చెక్కు ఫలానా టీడీపీ నాయకుడి దగ్గర ఉంది తీసుకో అని చెప్పి వాళ్ల ఇళ్ల చుట్టూ పలు దఫాలు తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. టెక్కలి ఆర్డీఓ, నౌపడ ఎస్ఐలను బుధవారం కలిసి తన బాధను చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పోర్టుకు మన భూములు ఇవ్వద్దు మన భూముల్లో అందరం కలిసి వరినాట్లు వేద్దాం, ధర్నాలు చేద్దామని తన కుటుంబం దగ్గర రూ. 7వేలు చొప్పున తీసుకున్నారని, ఆ డబ్బులు కూడా ఇచ్చి వరి నాట్లు వేశానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడతగా వచ్చిన పరిహారాన్ని కలెక్టర్ స్పందించి ఇప్పించాలని ధర్మారావు కోరారు. -
శ్రీకాకుళం
ఎందుకీ తెలుగు ద్వేషం?తెలుగు భాషపై ప్రభుత్వ వైఖరిని టీచర్లు దునుమాడుతున్నారు. భాషాభిమానులు కూడా మండిపడుతున్నారు. –8లోసొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం ముగిసిపోయింది. ఎంటెక్ చదివినా ఏళ్లకు ఏళ్లు చేసిన అరణ్య వాసం పూర్తయ్యింది. కలాన్ని వదిలి తుపాకీ చేతబట్టిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది. జియ్యన్నపేటలో పుట్టి.. టెక్కలిలో చదివి.. వరంగల్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి.. ఆపై అడవిలో అన్నగా మారిన నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రస్థానం ముగిసిపోయింది. చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో కేశవరావు హతమయ్యారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కిపడింది. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, పలాస : నలభై ఏళ్ల కిందట ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి.. తన వాటా ఆస్తి రాసిచ్చేయాలని టీచరైన తండ్రిని కోరారు. ఎందుకని అడిగితే ఆస్తి ఇస్తే.. పేదలకు పంచేస్తా అని చెప్పారు. ఆ విద్యార్థే నంబాళ్ల కేశవరావు. విద్యార్థిగా ఊరి నుంచి, కు టుంబం నుంచి వెళ్లిన కేశవరావు విగతజీవిగా మా రారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత వాసం చేసి అడవిలోనూ ఊపిరి వదిలేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కి పడింది. నంబాళ్ల స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నప్పుడు తెలివైన విద్యార్థి, మెరుగైన కబడ్డీ ప్లేయర్‌గా మన్ననలు అందుకున్న కేశవరావు కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందిన నంబాళ్ల వాసుదేవరావు (ఉపాధ్యాయుడు) లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లో విద్యనభ్యసించారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి 1971 లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కోర్సులో చేరారు. ఏడాది తర్వాత వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరారు. ఆ తర్వాత అక్కడే ఎంటెక్‌లో చేరారు. అటు నుంచి అటే అడవి బాట పట్టారు. కేశవరావు మరణంతో కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం ప్రస్తుతం గుంభనంగా ఉంది. గతంలో ఒకటి రెండు మార్లు కేశవరావుమృతి వదంతులపై కొందరు స్పందించడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో ప్రస్తుతం ఎవరూ బయట పడడం లేదు. ఉద్దానంలో.. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్త ఉద్దానంలో దావానలంలా వ్యాపించింది. టెక్కలికి చెందిన ఆయనకు ఈ ప్రాంతం ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ ప్రాంతం మావోయిస్టు కేడరుకు, నాటి పీపుల్స్ వార్ పార్టీ కేడరుకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కావడంతో మృతి వార్తతో ఉద్దానం ఉలిక్కిపడింది. పోలీసు వర్గాలు ముందుగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి ఈ సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకొని రావడానికి ఎవరైనా వెళ్తున్నారా అని అడిగారు. తమ గ్రామానితో ఎలాంటి బంధుత్వం లేదని, రాజకీయ బంధుత్వం మాత్రమే ఉందని వారు చెప్పారు. ఒక నాటి పీపుల్స్ వార్‌లో, నేటి మావోయిస్టు పార్టీలో పనిచేసి ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారు 60మంది వరకు కార్యకర్తలు, నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు మృతితో ఇక నాయకత్వ స్థానాల్లో ఈ జిల్లా నుంచి ఎవరూ లేరనే తెలుస్తోంది. ఆయన మృతదేహం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు బయల్దేరి వెళ్తున్నట్టు ఉద్దానం వాసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌కు ఖండన చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ మఢ్ అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ను సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు కోరినా వాటిని తిరస్కరించి మన దేశపౌరులైన మావోయిస్టులను ఉగ్రవాదులపై దాడుల కన్నా ఎక్కువగా దాడి చేసి దండకారణ్యంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిండచం అప్రజాస్వామికమని, పౌర సమాజం వీటిపై తీవ్రంగా స్పందించాలని కోరారు. న్యూస్రీల్నారాయణపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు హతం -
జూన్ 21 వరకు యోగాంధ్ర
అరసవల్లి: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరిట ప్రత్యేక యోగాసనాల కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించనున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖ రానున్నారని తెలిపారు. ఇక బుధవారం నుంచి గ్రామ స్థాయి, మండల, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకోసం ఒక్కో యోగాట్రైనర్ను నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ యోగా మాస్టర్‌గా తన అనుభవాన్ని వివరించారు. అంతకుముందు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రముఖులంతా స్వయంగా పాల్గొని యోగాసనాలను వేశారు. అయితే మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడంతో బుధవారం ఉదయం భక్తులు దర్శనాలకు ఇబ్బందులు పడ్డారు. అయితే పరిస్థితిని గమనించిన ఆల య అధికార సిబ్బంది శివాలయం మీదుగా దర్శనానికి పంపించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారిఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత, యోగా టీచర్లు పాండ్రంకి మురళికృష్ణ, తంగి స్వాతి, ఎ.గాయత్రి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిట
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించింది. బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అమ్మవారి పండగలు కావడంతో వాటికి హాజరయ్యేందుకు దూరప్రాంతాలు నుంచి ప్ర యాణికులు రాకపోకలు సాగించారు. అయితే రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రధానంగా సాలూరులో అమ్మవారి పండగలు జరుగుతుండడంతో అక్కడకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి సగానికి పైగా బస్సులు వెళ్లిపోవడంతో స్థానికంగా కొరత ఏర్పడింది. కొత్తూరు, బత్తిలి, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విపరీతమైన రద్దీ కనిపించింది. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి
● రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి ● పెంటూరులో విషాదఛాయలు నరసన్నపేట: సత్యవరంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వంతెనపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి పిన్నింటి దొరబాబు(38) మృతి చెందారు. శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామంలో అమ్మవారి పండగలకు వెళ్లి స్వగ్రామం నందిగాం మండలం పెంటూరుకు ద్విచక్ర వాహనంపై మామయ్య సనపల సీతారాంతో కలిసి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే దొరబాబు మృతి చెందగా.. సీతారాంకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు.మూడు రోజుల్లో విధుల్లోకి..దొరబాబు అస్సాం రైఫిల్ విభాగంలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. బంధువుల కుమార్తె పెళ్లికి వారం రోజులు సెలవుపై వచ్చారు. వివాహ వేడుక రెండు రోజుల కిందటే కాగా, శ్రీకాకుళంలో బంధువుల ఇంట్లో అమ్మవారి పండగలకు వెళ్లారు. మరో మూడు రోజుల్లో తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో మృత్యువు వెంటాడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దొరబాబుకు భార్య కాంచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇవేం ‘పనులు’!
● ఉపాధి కూలీలు చేసిన పనులకే కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు ● సాగునీటి సంఘాల పేరుతో అక్రమాలకు దిగిన కూటమి నాయకులు ● ఆమదాలవలసలో కొనసాగుతున్న అధికార పార్టీ దందా ఆమదాలవలస రూరల్: కూటమి పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అక్రమ సంపాదనకు ఎంతకై నా వెనుకాడరని ఉపాధి హామీ పథకం, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ఆమదాలవలస మండలంలో ఉపాధి హామీ వేతనదారులు చేసిన పనులకే మళ్లీ నీటిపారుదల శాఖ ద్వారా కొత్తగా ప్రతిపాదనలు చేసి అరకొరగా మెరుగులు దిద్ది అక్రమాలకు పాల్పడటం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని నారాయణపురం ఎడమ కాలువ ద్వారా జంబోదీపం నుంచి దూసి వరకు పిల్ల కాలువలో ఇటీవల ఉపాధి పనులు చేపట్టారు. కలివరం, దూసి పంచాయతీలకు చెందిన ఉపాధి వేతనదారులు ఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ పనులు చేసేందుకు మూడు బిట్లుగా విభజించి ఒక్కో బిట్‌కు సుమారు రూ.8.5 లక్షల చొప్పున ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.20 లక్షలు వరకు ఉపాధి కూలీలకు వేతనాలు కింద వారి ఖాతాల్లో జమ చేశారు. పట్టుమని నెల రోజులు గడవ ముందే నీటిపారుదల శాఖ ద్వారా సుమారు రూ.10 లక్షలు వరకు అంచనాలు తయారు చేయించారు. అదే కాలువలో కూటమి కాంట్రాక్టర్లు సాగునీటి సంఘాల పేరుతో జేసీబీతో పనులు చేయిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక్కడే కాకుండా, మండలంలో పలు చెరువుల వద్ద కూడా ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి. ఉపాధి నిధులు దుర్వినియోగం.. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ఉపాధి నిధులు కూటమి నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం, కొల్లివలస, చిట్టివలస, కలివరం తదితర గ్రామాల్లో అవసరం లేని చోట పనులు ప్రతిపాదన చేయటమే కాకుండా నాయకులు సొంత స్థలాలకు, పంట పొలాలకు కూడా రహదారులు వేయించుకుంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మండలంలో ఉపాధి పనులు చేసిన చోట కొత్త ప్రతిపాదనలు రద్దు చేయటమే కాకుండా ఉపాధి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. మాకు సంబంధం లేదు.. మండలంలోని జంబోదీపం పిల్ల కాలువ పనులతో పాటు అనేక చోట్ల ఉపాధి కూలీలు చేసిన పనులకే సాగునీటి సంఘాలు ద్వారా కొత్త ప్రతిపాదనలు రావడంపై ఏపీఓ ఎం.అప్పలనరసమ్మ వద్ద ప్రస్తావించగా మండలంలో అన్ని సాగునీటి కాలువల పనులు చేసి కూలీలకు వేతనాలు కూడా చెల్లించామని చెప్పారు. ఇప్పుడు అదే చోట పనులుకు ప్రతిపాదనలకు రావడం మాకు సంబంధం లేదని, మా శాఖ ద్వారా చేసిన పనుల వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందించామని చెప్పారుఅక్రమాలు అడ్డుకోవాలి.. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఉపాధి నిధులు దారి మళ్లిస్తున్నారు. ఉపాధి కూలీలు చేసిన పనులకు మరలా కొత్త ప్రతిపాదనలు చేసి బిల్లులు పొందుతుండటం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులు సొంత స్థలాలకు, పంట పొలాలకు రహదారులు అక్రమంగా వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాం. – చింతాడ రవికుమార్, వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త -
సముద్రంలో వ్యక్తి గల్లంతు
రణస్థలం : మెంటాడ పంచాయతీ దోనిపేట వద్ద సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సరదాకు స్నానానికి వెళ్లి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి సంతోష్ (31), ఆళ్ల సూర్యనారాయణ, నీలాపు రమణ కలిసి కందివలస గెడ్డలో స్నానానికి వెళ్లారు. అక్కడ నీరు బాగోలేదని సమీపంలోని దోనిపేటలో సముద్ర స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి తొలుత నీలాపు రమణ మునిగిపోతుండగా గమనించిన సూర్యనారాయణ, సంతోష్‌లు కాపాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సూర్యనారాయణ, రమణ ఒడ్డుకు చేరుకున్నా సంతోష్ మాత్రం మునిగిపోయాడు. చాలాసేపు వెతికినా సంతోష్ జాడ కానరాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. జె.ఆర్.పురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి గాలించినా సంతోష్ ఆచూకీ దొరకలేదు. సంతోష్‌కు భార్య భవాని, ఇద్దరు కుమారులు సిద్దార్ధ, హర్షవర్దన్ ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ గల్లంతయ్యాడని తెలిసి తల్లిదండ్రులు రాము, సరస్వతి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి గతంలో పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్‌లో కెమిస్ట్‌గా పని చేసి హైదరాబాద్ వెళ్లాడు. మళ్లీ స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగం సాద్ధిద్దామనే ఉద్దేశంతో నెల రోజుల కిందట గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన బైపీసీ స్ట్రీం పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీఈఏపీ సెట్ –2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన పరీక్షలు సెలవు రోజుల్లో మినహా 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఎచ్చెర్ల మండల పరిధిలో రెండు కేంద్రాల్లో మంగళవారం పరీక్షలు జరిగాయి. బైపీసీ స్ట్రీం పరీక్షలు ముగియగా, ఎంపీసీ స్ట్రీం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. చిలకపాలెంలోని శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మొదటి షిఫ్టులో 280 మందికి 256 మంది, రెండో షిఫ్టులో 280 మందికి 255 మంది, ఎచ్చెర్ల వెంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 171 మందికి 159 మంది, రెండో షిఫ్టులో 170 మందికి 160 మంది పరీక్షకు హాజరయ్యారు. -
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకంలో పనిచేస్తున్న కెప్టెనన్(డ్రైవర్లు)ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, దశరథ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం సురక్షితంగా తల్లీబిడ్డలను చేర్చుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య,టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, సిబ్బంది కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎండీయూ వాహనాల రద్దు అన్యాయం’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో బండిలో ఉన్న కంప్యూటర్ కాటా సర్వీస్ ఇంజినీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఇంజినీర్ బి.అనంతకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినా డ, ఒంగోలు, ఏలూరు తదితర జిల్లాలకు ఎంవిఆర్ టెక్నాలజీ తరఫున నాలుగేళ్లుగా పనిచేస్తున్న తమ బతుకుల్లో నీళ్లు చల్లడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబాలతో రోడ్డున పడతామన్నారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి మరోమారు ఆలోచన చేయాలని కోరారు. చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యం సోంపేట: సోంపేట ప్రాంతంలోని చిత్తడినేలల్లో వెలకట్టలేని జీవవైవిధ్యం ఉందని పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ యారడి కృష్ణమూర్తి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా సోంపేట చిత్తడి నేలల జీవవైవిధ్యంపై ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని లోకానాథేశ్వర కళాసీ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించారు. అంతరించిపోతున్న పక్షులు, సీతాకోక చిలుకలు, మత్స్య సంపద, వివిధ రకాల పాములు, మత్స్యకారులు, రైతుల జీవన విధానం ఫొటో లు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ సోంపేట మండలంలోని చిత్తడి నేలలు మానవాళికి వెలకట్టలేని సంపద అని అన్నారు. ఈ నేలలను రక్షించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, నాగు, కోదండ, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా సర్వే చేపట్టాలి నరసన్నపేట: గ్రామాల్లో భూముల రీసర్వేను పక్కాగా చేపట్టాలని సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ (విజయవాడ) డీఎల్డీఎల్ కుమార్ సూచించారు. మండలంలోని నడగాంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీటీ కృష్ణారావు మాట్లాడుతూ నడగాంలో 1,679 ఎకరాలు ఉన్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే చేయాలని, తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ అప్పలస్వామి పాల్గొన్నారు. ‘తెలుగు మీడియం లేకుంటే ఎలా?’ శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా దేశం అంతటా మాతృభాషలకు ప్రాధాన్యత పెంచుతూ ఉంటే తెలు గు రాష్ట్రంలో మాత్రం తెలుగుభాషకు మంగళం పాడేటట్టుగా ఇక్కడ పాలకులు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్షు డు ఎస్వీ రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ ఆరోపించారు. ఏ భాషలో చదువుకోవాలన్నది విద్యార్థి ఇష్టమని.. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నా రు. ఈ మేరకు మంగళవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మాతృభాషలో చదివితే పిల్లల సృజనాత్మకత పెరుగుతుందని, మనో వికాసం అభివృద్ధి చెందుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపిస్తున్నప్పటికీ మన తెలుగు రా ష్ట్రంలో మాత్రం తెలుగు మీడియం లేకపోవ డం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంగ్లిష్తో పాటు తెలుగు మీడి యం కూడా సమాంతరంగా ఉండటం వల్ల ఎక్కువ టీచర్ పోస్టులు నియమించాల్సి వ స్తుందని.. తద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని భావించి, పాలకవర్గం ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే కొనసాగిస్తూ తెలుగు మీడియంను అటకెక్కించే కార్యాచరణ చేస్తుందని ఇది ఎంత మాత్రం తగదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం కచ్చితంగా ఉండేలా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుబాటులోకి సీటీ స్కాన్ సేవలు టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రిలో సోమవారం సీటీ స్కాన్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. మంగళవారం మరమ్మతులు నిర్వహించి మళ్లీ సీటీ స్కాన్ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభు త్వం నుంచి ప్రజలకు నేరుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రభుత్వ సేవలపై ప్రజలు ఇచ్చే సమాధానం విలువ కలిగి ఉంటుంది. అందుకే ప్రతి శాఖ బాధ్యతతో స్పందించాలి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి జిల్లా అభివృద్ధిపై ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ● జిల్లాలో ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 61,048 ప్రజా ఫిర్యాదులు నమోదుకాగా, వాటిలో 343 ఫిర్యాదులు గడువు మించాయని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ సమస్యలు అ ధికంగా ఉన్నాయని, పరిష్కరించాలన్నారు. ● మండలాల వారీగా ఉపాధి పనుల పురోగతిలో తేడాలు కనిపిస్తున్నాయని, కొన్ని మండలాల్లో 90 శాతం పనులు పూర్తవుతుండగా మరికొన్నింటిలో 50 శాతం కూడా చేరలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ● రెవెన్యూకు సంబంధించి 22(ఎ) రికార్డుల స్వ చ్ఛీకరణ, వివిధ శాఖలతో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల స్థితిగతులు, ముఖ్యంగా వంశధార నదిపై హై లెవల్ బ్రిడ్జి నువ్వలరేవు–మచినీళ్లపేట రహదారి నిర్మాణాలకు సంబంధించిన అడ్డంకులపై చర్చించారు. లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో యూనివర్సిటీ స్థాపనకు 30–40 ఎకరాలు, హైడ్రో కార్బన్ కంపెనీ స్థాపనకు 2000 ఎకరాల భూమిని గుర్తించాలని, అలాగే ఏపీఐఐసీ భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా, నియంత్రణ లేని గ్రానైట్ తవ్వకాలపై కలెక్టర్ స్పందించారు. జిల్లా మైనింగ్ శాఖ కలిసి వచ్చి అక్రమ మైనింగ్‌ను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ● జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయుష్ శాఖ, అరసవల్లి ఎండోమెంట్ అధికారి సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష -
జెడ్పీలో పదోన్నతులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తన అధికార నివాసమైన జెడ్పీ బంగ్లాలో ఐదుగురు సీనియర్ సహాయకులకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం నియామక ఉత్తర్వుల పత్రాలను సంబంధిత ఉద్యోగులకు అందజేశారు. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు డి.నరసింగరావును పదోన్నతిపై సంతబొమ్మాళిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ సర్గా నియమించారు. అలాగే హిరమండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు ఎన్.సోమశేఖర్‌ను పదోన్నతిపై వంగర మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా కొత్తూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు ఎ.మార్కండేయరావును పదోన్నతిపై రణస్థలం మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా శ్రీకాకుళంలోని జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ సహాయకులు కె.ఉమామహేశ్వరరావును పదోన్నతిపై శ్రీకాకుళంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అలాగే ఎస్సీఎస్సీఎస్ లిమిటెడ్‌లో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న జి.మధుసూధనరావును పదోన్నతిపై పొందూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. కార్యక్రమములో జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వీ శ్రీధర్‌రాజా, జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీ సి–సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్, సి–సెక్షన్ సిబ్బంది, పదోన్నతులు పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోడ్డున పడనున్న ఎండీయూ ఆపరేటర్లు
వీధివీధితోనూ ఐదేళ్లుగా అనుబంధం పెనవేసుకున్న రేషన్ బళ్లు ఆగిపోనున్నాయి. సామాన్యుడి ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించిన ఈ వాహనాలను కూటమి సర్కారు రద్దు చేసింది. ఇక రేషన్ కోసం డిపో ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇప్పటికే వలంటీర్లను తీసేయడంతో పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు.. రేషన్ బళ్ల రద్దుతో మళ్లీ పాత విధానంలో రేషన్ డీలర్ల ముందు నిలబడక తప్పదు. ● ఎండీయూ వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం ● ఇకపై డిపోల వద్దే సరుకులు తీసుకోవాలని ఆదేశం ● వలంటీర్లను తీసేయడంతో ఇప్పటికే నిలిచిపోయిన ఇంటింటికీ సేవలు ● తాజాగా సరుకుల పంపిణీకి బ్రేక్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ సరుకులు ఇక ఇంటికి రావు. ప్రభుత్వ సేవలు ‘ప్రజల వద్దకు’ ఇక చేరవు. వలంటీర్లను తీసేసి ‘పేదోడి సేవ’ తమ పద్ధతి కాదని సంకేతాలు ఇచ్చిన కూటమి సర్కారు.. ఇప్పుడు రేషన్ వాహనాలను రద్దు చేసి తన అజెండాలో పేదవాళ్లు లేరని స్పష్టం చేసేసింది. ఐదేళ్లుగా సేవలు అందించిన రేషన్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న బతుకులు కూడా పో తాయి. ఈ నిర్ణయంతో చంద్రబాబు నైజమేంటో మరోసారి ప్రజలకు తెలుస్తోందని రాజకీయ వేత్తలు అంటున్నారు. ఇంటింటికీ సేవలు నిలిపివేత కూటమి ప్రభుత్వం సంక్షేమాన్నే కాదు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలను కూడా వదిలేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సేవలు అందుకోవడం ప్రజల హక్కు అని భావించి.. సామాన్యుడి ఇంటి వద్దకే అనేక సేవలు అందజేసింది. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఏం అవసరమో గుర్తించి, వాటిని నేరుగా అందజేసింది. సంక్షేమ పథకాలతో పాటు అధికారిక సేవలను ఇంటి చెంతకే చేర్చింది. 15వేల మందికి పైగా వలంటీర్ల ద్వారా ప్రజలకు 539 సేవలు అందించింది. రేషన్ అందించడం కోసం వాహనాలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి చూపించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే వలంటీర్ వ్యవస్థను తీసేసింది. ఫలితంగా ప్రతి పౌర సేవకు ప్రజలు మళ్లీ అధికారుల చుట్టూ తిరగడం తప్పనిసరైంది. ఇప్పుడు రేషన్ వాహనాలను కూడా రద్దు చేయడంతో వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోవడమే కాకుండా.. ప్రజలకు మళ్లీ పాత కష్టాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సర్కారు రేషన్ కోత పెట్టింది. కార్డుదారులందరికీ రేషన్ ఇవ్వడం లేదు. బియ్యంలో భారీగా కోత పెట్టడంతో అందరికీ అందడం లేదు. ఇక, కందిపప్పు, పంచదార ఊసేలేదు. ఆ రెండు సరుకులను అటకెక్కించింది. చంద్రబాబు మార్క్ కష్టాలు హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చంద్రబాబుకు పరిపాటి. తాజాగా ఇంటింటికి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలో సరుకులు ఇస్తామని ప్రకటించారు.జిల్లాలో 3129 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 6,60,7430 కార్డుదారులు ఉన్నారు. వారందరికీ 10,670మెట్రిక్ టన్నుల మేర రేషన్‌ను పంపిణీ చేయాలి. దానికోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 422 ఎండీయూ వాహనాలను పెట్టి ఇంటింటికి స రుకులు పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడా వాహనాల భారాన్ని భరించలేక ఏకంగా రద్దు చేసేసి పాత పద్ధతిలో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు రేషన్ డిపోల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. జిల్లాలో ఎండీయూ వాహనాలపై ఆపరేటర్లతో పాటు సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఒక్కో వాహనానికి నెలకి రూ. 18వేల వరకు వచ్చేది. 1500నుంచి 2000 ఇళ్ల వరకు సరుకులు నేరుగా పంపిణీ చేసేవారు. వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి భవిష్యత్ ఆగమ్య గోచరమైంది. వాస్తవంగా ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ గడువు ఉంది. కానీ, ఉన్న ఫలంగా వాహనాలను ఆపేయడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. వారంతా ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు. -
కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు
శ్రీకాకుళం క్రైమ్ : అమ్మవారి ఉత్సవాలతో సందడిగా గడుపుతున్న కుటుంబానికి పిడుగుపాటు తీరని శోకం మిగిల్చింది. జిల్లా కేంద్రంలో నాగావళి నదీ తీరాన మంగళవారం పిడుగు పడడంతో గేదెల రాజారావు (55) మృత్యువాత పడగా.. ఆయన కుమారుడు నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ధాటికి మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బలగ బూబమ్మ నగర్ లో గేదెల రాజారావు తన భార్య, కుమారుడు నాగార్జునతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం భద్రమ్మ తల్లి వారాల సంబరాలుండటంతో ఉదయాన్నే రాజారావు కుటుంబీకులు గొర్రెపోతును చూపించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గొర్రె పొట్టు మాంసం కడిగేందుకు గుడికి కిలోమీటరు దూరంలో ఉన్న నాగావళి నదీ తీరానికి తండ్రీకొడుకులు వెళ్లారు. వీరికి ఓ రెండు మీటర్ల దూరంలో బుచ్చిపేటకు చెందిన దేళెళ్ల రాజారావు, భైరి రామారావు మరికొందరు కూడా పొట్టు శుభ్రం చేయడానికి వచ్చారు. వీరు పనిలో ఉండగా వర్షం మొదలైంది. సరిగ్గా 7:40 గంటలకు పెను శబ్దంతో పిడుగు పడడంతో రాజారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాగార్జునకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి సమీపంలో ఉన్న మరో ఇద్దరికి కాలిన గాయాల య్యాయి. భద్రమ్మ గుడి సిబ్బందికి సైతం పిడుగు శబ్దం వినిపించడంతో స్థానికులతో కలసి ఘటనా స్థలికి వచ్చి చూశారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను రిమ్స్‌లో చేర్పించారు. గత 70 ఏళ్లుగా వారాలు జరుగుతున్నా ఏ సందర్భంలోనూ ఇలా ఉదయం పూట వర్షాలు పడలేదని స్థానికులు చెప్పారు. అనంతరం రిమ్స్‌కు చేరిన రెండో పట్టణ ఎస్ఐ–2 రామారావు క్షతగాత్రు లను, మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించడమే కాక ఘటనాస్థలికి స్థానిక వీఆర్వోతో కలిసి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు చెప్పారు. భారీ వర్షాలతో పాటు అత్యధికంగా పిడుగులు పడతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ గత రెండురోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాల్లో బయటకు వెళ్లకపోవమే మంచిదని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు ప్రజలను కోరారు. శ్రీకాకుళం న్యూకాలనీ: కుర్రకారు కండల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో మంగళవారం ఉత్తరాంధ్ర జోనల్‌స్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు కన్నులపండువలా జరిగాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ శరీర సౌష్టవ పో రులో అండర్– 50 నుంచి 85 కేజీల విభాగం, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పో టీల ప్రదర్శనలో కుర్రకారు జోరు ప్రదర్శించారు. స్టార్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు వి.విజయ్‌కుమార్, బి.ప్రసాద్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 80 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. శ్రీకాకుళానికి చెందిన దివ్యాంగ బాడీబిల్డర్ తుపాకుల అనీల్‌కుమార్ విశేషంగా ఆకట్టుకున్నాడు. జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని రిఫరీలు భరోసా ఇచ్చారు. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం మండలంలోని కలివరంలో మంగళవారం పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది. జన నివాసాల నడుమ ఈ పిడుగు పడటంతో జనం భయాందోళన చెందారు. అంతే కాకుండా పలువురు ఇళ్లకు సంబంధించి ఇంటిగోడలు కూడా చిన్న చిన్న గా బీటలు బారాయి. దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. గ్రామంలో అనేక మంది ఇళ్లకు సంబంధించి కరెంట్ ఇన్వెర్టర్లు, తదితర విద్యుత్ సామగ్రి కూడా దెబ్బతింది. ఒక్కసారిగా నివాస గృహాల నడుమ పిడుగు పడటంతో గ్రామంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. – ఆమదాలవలస రూరల్ జిల్లా కేంద్రంలో నాగావళీ నదీ తీరాన పిడుగుపాటు ఘటనా స్థలంలోనే తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు -
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్‌చైర్‌లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డయాలసిస్ కేంద్రం ప్రారంభం
ఇచ్ఛాపురం టౌన్ : ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఆవరణలో కిడ్నీ రోగుల కోసం వైఎస్సార్సీసీ ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. డయాలసిస్ గదితో పాటు తాగునీటి ఆర్ఓ ప్లాంట్, స్టెమీ యూనిట్, అత్యవసర రోగుల యూనిట్, ల్యాబ్‌లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం గత వైఎస్సార్ సీపీ పాలనలోనే రూ.ఏడు వందల కోట్లతో తాగునీటి పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీసీహెచ్ కళ్యాణ్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవీ రోగులకు ఇప్పటి వరకు విశాఖ కేజీహెచ్‌లోనే ప్రత్యేక వైద్యసేవలు అందించే వారని, ఇకపై ఇచ్ఛాపురంలోనూ సేవలు అందిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కవిటిలో డయాలసిస్ కోసం 20 బెడ్లు, సోంపేటలో 19 ఉండగా అదనంగా మరో 3 బెడ్లు పెంచినట్లు చెప్పారు. పలాసలో 20 బెడ్లు ఉండగా మరో 10 పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దేవేంద్ర రెడ్డి, దాసరి రాజు, ఎన్.కోటి, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్లపై దాడి
నందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి అలజడి నెలకొంది. లారీలు ఆపి నిద్రిస్తున్న డ్రైవర్లుపై కొంతమంది దాడి చేసి అలజడి సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సుజిత్కుమార్రాయ్, అమర్జీత్ చౌహాన్, పురుషోత్తంసింగ్, విజయ్‌కుమార్ యాదవ్‌లు చైన్నె నుంచి కోలకత్తా మార్గంలో వెళ్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఉన్న డాబా వద్ద ఆగారు. లారీలను సర్వీస్ రోడ్డువైపు పార్కింగ్ చేసి భోజనాలు అనంతరం తమ లారీల్లో నిద్రపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఐదుగురు వ్యక్తులు మొదటగా విజయ్‌కుమార్ యాదవ్‌ను లేపి కత్తి చూపించి బెదిరించారు. సకాలంలో అప్రమత్తమైన విజయ్‌కుమార్ ఒక్కసారిగా లారీ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. తర్వాత సుజిత్‌కుమార్ రాయ్, అమర్జీత్ చౌహాన్, పురుషోత్తం సింగ్‌లను లేపి రాళ్లతో లారీ అద్దాలు పగులగొట్టి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.28వేలు నగదు లాక్కొని తామరాపల్లి వైపు పొలాల గుండా వెళ్లిపోయారు. అనంతరం డ్రైవర్లు కేకలు వేయడంతో డాబా సిబ్బంది వచ్చి గాయాల పాలైన వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించారు. దాడి లో పాల్గోన్న వారంతా తెలుగు, హిందీ మాట్లాడుతున్నారని, అందరూ 30 ఏళ్లలోపు వారేనని బాధితులు చెబుతున్నారు. అనంతరం నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. నగదు, సెల్ఫోన్లతో పరారైన దుండగులు పెద్ద తామరాపల్లిలో అర్ధరాత్రి అలజడి వాహనదారుడినీ వదల్లేదు.. నందిగాం: సుభద్రాపురం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం బైక్ ఆపి ఉండగా కొంతమంది దాడి చేశారు. తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పెట్రోల్ అపహరణ.. నందిగాం మండలంలోని సుభద్రాపురం పరిధి గుండా వెళ్తున్న ఐఓసీఎల్ పైపులైన్ నుంచి కొంత మంది పెట్రోల్ దొంగతనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పైపులైన్‌కు ఉండే ఓపెన్‌లో చిన్న పాటి మోటార్ ఇంజన్ పెట్టి పెట్రోల్ తోడేసినట్లు తెలుస్తోంది. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు అందగా హెచ్‌సీ రమణ కేసు నమోదు చేశారు. గతంలో కాశీరాజుకాశీపురం వద్ద ఇలాగే పెట్రోల్ చోరీ జరిగినట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే నందిగాం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు ఘోరంగా వైఫల్యం చెందాయని, లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ తీరుకు తాజా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. -
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 75 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి 75 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఏపీ హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 వినతులు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 50 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ● పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అంబుసోలిలో వాయలపల్లి మనీషా, శ్రీనివాసులుకు వారి బంధువులకు చిన్న తగాదా జరిగిందని, ఈ విషయమై స్టేషన్‌కు వెళ్లే అక్కడ సీఐ కులంపేరుతో దూషించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫిర్యాదు చేశారు. బందువుల మధ్య వ్యక్తిగతమైన గొడవల్ని రాజకీయం చేసి వారిపై కేసులు బనాయించడం దారుణమన్నారు. ఎస్సీ సెల్ పలాస నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మణరావు అక్కడ లేనప్పటికి అన్యాయంగా కేసు బుక్‌చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంలో పోలీసులపై సరైన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతి శుక్రవారం పలాస ఎస్పీ వచ్చిప్పుడు కలిసి విన్నవిస్తామన్నారు. అప్పటికి న్యాయం జరగకుంటే దళితులకు న్యాయం జరిగేవరకు ఎంత దూరమైనా వెల్తామని వెనక్కి తగ్గభోమని స్పష్టం చేశారు. -
98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం
కాశీబుగ్గ: పలాస మండలం పెదంచల పంచాయతీ మరదరాజపురం గ్రామానికి చెందిన 98 ఏళ్ల వృద్ధుడు నర్సింగ పండా (98) కనిపించడం లేదని కుమారుడు జగన్నాథ పండా సోమవారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న నర్సింగ పండా షుగర్ బాధపడుతున్నారు. సమయానికి భోజనం పెట్టలేదని భార్య జయంతి పండాపై కోపంతో ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. పరిసర ప్రాంతాలు, బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు తెలిస్తే 94937 90587 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. -
చెరువు.. రక్షణ కరువు!
కొత్త కర్ర (తమ్మయ్య) చెరువులో.. బొడ్డవలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 44/2ఏలో 6.92 ఎకరాల విస్తీర్ణంలో కొత్తకర్ర చెరువు ఉంది. దీంట్లో కొందరు రైతులు గతంలోనే పొలాలుగా మార్చి ఆక్రమణలకు పాల్పడ్డారు. తాజాగా ప్రశాంతనగర్ వైపు నుంచి ఆక్రమణలు జోరందుకున్నాయి. ముందుగా వ్యర్థాలు చెరువులో వేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొందరు చెరువు గర్భంలో కంచెలు పెట్టి చీరలు హద్దులుగా పెట్టడం గమనార్హం. ఆ స్థలంలో భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొందరు ఇప్పటికే చెరువును ఆక్రమంచి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నరసన్నపేట: కూటమి ప్రభుత్వం వచ్చాక చెరువులకు కూడా రక్షణ లేకుండాపోతోంది. నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో చెరువు గర్భాల్లో యథేచ్చగా ఆక్రమణలు జరుగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. అసలు రెవెన్యూ యంత్రాంగం ఉందా.. అనే సందేహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఆక్రమణల గురించి పంచాయతీ సిబ్బందికి తెలిసినా రెవెన్యూ వాళ్లకి పట్టనిది తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. నరసన్న చెరువులో.. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న గొట్టిపల్లి రెవెన్యూలో 94/3లో 8.16 సెంట్ల విస్తీర్ణంతో నరసన్న చెరువు ఉంది. దీంట్లో ఆక్రమణలు అధ/కంగా జరుగుతున్నాయి. కాంప్లెక్స్ నుంచి జాతీయ రహదారికి వెళ్లేదారిలో చెరువు భాగం మొత్తం కప్పేస్తున్నారు. తాజాగా ఆటో స్టాండ్ పేరిట చెరువును కప్పేశారు. ఇక్కడ ఆటో స్టాండ్‌కు అనుమతులు లేకపోయినా చెరువు కప్పి షెడ్ వేశారు. దానికి ముందు, వెనుక భాగాల్లో చెరువు గర్భాన్ని కప్పేశారు. ఇండోర్ స్టేడియానికి కేటాయించిన స్థలంలో కూడా పట్టణంలో శిథిల భవన వ్యర్థాలు వేసి ఆక్రమణలు సాగిస్తున్నారు. మరోవైపు ఇదే చెరువు గర్భంలో పచూరీ కాలనీకి ఆనుకొని ఉన్నవారు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కోట్ల విలువైన చెరువు అన్యాక్రాంతమవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. తగ్గుతున్న భూగర్భజలాలు.. నరసన్నపేట పట్టణానికి చుట్టుపక్కల చెరువులు ఉండటం వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండేవి కాదు. ఇప్పుడు చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతుండటం, భనవాలు నిర్మాణం కావడంతో చెరువుల్లో నీరు నిల్వకు అవకాశం లేకుండాపోతోంది. ఫలితంగా ఏటా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరింతగా భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు అడ్డుకోవాలి.. చెరువులు కప్పవద్దని స్టాండింగ్ జీఓ ఉంది. దీనిని రెవెన్యూ యంత్రాంగం విధిగా అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇవేవీ నరసన్నపేటలో చెరువుల ఆక్రమణలకు అడ్డుకోవడం లేదు. కేవలం రెవెన్యూ యంత్రాంగం అసమర్థత, నిర్లక్ష్యం వల్లే చెరువులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – ఎస్.ప్రభాకరరావు, విశ్రాంత తహసీల్దార్, మారుతీనగర్, నరసన్నపేట నరసన్నపేటలో యథేచ్చగా ఆక్రమణలు నరసన్న, కొత్తకర్ర చెరువుల్లో అక్రమ కట్టడాలు పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగంచర్యలు తీసుకుంటాం.. నరసన్న చెరువు, కొత్తకర్ర చెరువుల్లో ఆక్రమణలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలను పంపి ఆక్రమణల గురించి వివరాలు తెలుసుకుంటాం. చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడటం సరికాదు. – టి.సత్యనారాయణ, తహసీల్దార్, నరసన్నపేట -
ఆరేళ్లకే ఆయువు తీరింది
పొందూరు: పొందూరు–చిలకపాలెం రహదారిలోని ఎరుకులపేట కూడలి వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం గోకర్నపల్లి పంచాయతీ రంగనాథపేట గ్రామానికి చెందిన పేడాడ హరిబాబు, ఈశ్వరమ్మ దంపతులకు వెంకటసూర్య యువంత్(6) అనే కుమారుడు ఉన్నాడు. యువంత్ తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేటలో చిన్న తాతయ్యను చూసేందుకు వచ్చాడు. అక్కడి నుంచి చిలకపాలెం వెళ్లేందుకు తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేట బస్టాప్‌కు బయలుదేరాడు. బస్టాప్ నుంచి రహదారి అవతలవైపు ఆటో ఆపేందుకు తండ్రి హరిబాబు వెళ్లాడు. తండ్రి దగ్గరకు వెళ్లాలనే ఆతృతతో తల్లి ఈశ్వరమ్మ చేయిని వదిలి బాలుడు పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో చిలకపాలెం నుంచి పొందూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం బాలుడి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని పొందూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ లేకపోవడంతో 108 వాహనంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. తండ్రి హరిబాబు విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, బాలుడి మృతితో రంగనాథపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ● ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడి మృతి ● ఎరుకులపేట వద్ద ఘటన -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవరుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో మృతుడి పూర్తి వివరాలు తెలియలేదు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు ప్రమాద సంఘటన బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రదేశంలో వద్ద ఇసుక ఉండటంతో ఇసుక ట్రాక్టర్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనంపై ఓడీ 33ఏ డీ2053 నంబరు ఉంది. దీంతో ప్రమాదానికి గురైన వారు ఒడిశావాసులుగా పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.సర్పాల సయ్యాటపొందూరు రూరల్ : మండల కేంద్రం పొందూరులోని అఫీషియల్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బేత కృష్ణారావు ఇంటి పక్కన సోమవారం సాయంత్రం నాగుపాము, జెర్రిపోతులు సయ్యాట ఆడాయి. ఒక్కసారిగా పాములు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
సరుబుజ్జిలి: మండలంలోని కూనజమ్మన్నపేటకు చెందిన రోజువారీ కూలీ హనుమంతు వెంకటరావు(60) అనుమానాస్పదంగా మృతిచెందాడు. వెంకటరావు ఎప్పటిలాగానే ఆదివారం సరుబుజ్జిలి కూలీ పనులకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్న సమయంలో సరుబుజ్జిలికి చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇస్తూ సరుబుజ్జిలి, కూనజమ్మన్నపేట గ్రామాల మధ్య రహదారి పక్కన వెంకటరావు పడి ఉన్నట్లు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్సు సాయంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. భార్య నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టమ్ నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. -
దేవాలయాలపై దాడులు బాధాకరం
గార: కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువకావడం బాధాకరమని ఎంపీపీ గొండు రఘురామ్ అన్నారు. కళింగపట్నం కోదండ రామాలయంలో ఏడు దేవతా విగ్రహాలను ధ్వంసం జరిగిన ఘటన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఆలయ ఈవో మాధవి, అర్చకులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని రక్షించే దేవతలకే రక్షణ లేకుండా పోతుందన్నారు. ఇలాంటి దాడుల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి తమ్మిన అప్పలరాజు, గుంటు రామచంద్రరావు, వీరస్వామి, గుజ్జల అప్పలరాజు, ఉదయభాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు. అంబులెన్సులో ప్రసవం మందస: బుడార్సింగి గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆరికి ఢిల్లేశ్వరికి సోమవారం పురిటినొప్పులు మొదలవ్వడంతో బంధువులు 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మందస అంబులెన్సు ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎస్.రాజేంద్రప్రసాద్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో సుఖప్రసవం చేయించడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘ బలోపేతానికి కృషి శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గొర్రెలు, మేకలు పెంపకందార్ల సహకార సంఘం అధ్యక్షుడిగా కుజ్జు తాతయ్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తాతయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం తాతయ్యను పశుసంవర్ధకశాఖ జేడీ కె.రాజగోపాల్రావు, ఈడీ బమ్మిడి యోగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కలగల జగదీష్ యాదవ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పల్ల నరహరి, బూర పాపారావు, గద్దిబోయిన కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు ఏప్రిల్ నెల కరెంటు బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత నెల కంటే చార్జీలు రెట్టింపు కావడంతో మండిపడుతున్నారు. సంతబొమ్మాళి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న టీ కొట్టు యజమాని జమునకు సాధారణంగా నెలకు రూ.1000లు లోపు బిల్లు వచ్చేది. కానీ ఏప్రిల్ నెల బిల్లు రూ. 4502 రావడంతో ఆమె అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలీక విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి అడిగితే ఎవరూ స్పందించలేదని ఆమె తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బిల్లు సరి చేయాలని ఆమె కోరుతున్నారు. – సంతబొమ్మాళి -
పిడుగు.. అప్రమత్తతే గొడుగు!
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రస్తుతం మండుతున్న ఎండలకు భూమి వేడెక్కిపోవడంతో ఉక్కపోత ఎక్కువవుతోంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు సైతం పడుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా పొలం పనికి వెళ్లే రైతులు, గొర్రెలు, మేకలు, పశువులకాపర్లు పిడుగుపాటుకి గురై మరణిస్తుంటారు. పిడుగులనుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండటం మేలు. ● సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే దూరంగా వెళ్లాలి. రేకు, లోహం కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి. ● ఉరుముల శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. ● కారు/బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి. ● చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించాలి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ● పిడుగు బాధితులను తాకవచ్చు. సత్వరమే వారికి సహాయం అందించాలి. బాధితులను సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలి. అందని సాయం.. పిడుగు పాటుకి గురై వ్యక్తులు మరణించినా కార్మికశాఖ, పశుసంవర్ధకశాఖ నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేసియా ఇవ్వడం లేదు. మరణించిన వ్యక్తికి ఏదైనా ఇన్సురెన్స్ పాలసీ ఉంటే తప్ప ఆ వ్యక్తి కుటుంబానికి ఎటువంటి పరిహారం అందించడం లేదు. ఈ మరణాలను ప్రత్యేక కేసులుగా భావించి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సకాలంలో వైద్యం అందాలి.. పిడుగు పడే వ్యక్తులకు (ఏబీసీ) తప్పనిసరిగా ఉండాలి. ఏ–ఎయిర్‌వే, బి–బ్లడ్ సర్క్యులేషన్, సి–కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సీపీఆర్ చేసి దగ్గరలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. పిడుగు పడిన వ్యక్తి గుండె కొట్టుకునే శాతం పెరిగిపోయి మరణించే ప్రమాదం ఉంటుంది. ఎముకలు, మజిల్ ప్రోటిన్ అంతా కరిగిపోతాయి. పిడుగు ధాటికి వెలువడే కరెంట్ మెదడుకు చేరితో ఫిట్స్ వంటివి వచ్చి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. – డాక్టర్ సనపల నర్సింగరావు, జనరల్ ఫిజీషియన్, శ్రీకాకుళం ఇవి చేయవద్దు.. ఉరుములు, మెరుపులు సంభవించినపుడు చెట్ల కింద, టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు చార్జ్డ్ ఫోన్లు/ మొబైల్స్ వినియోగించరాదు. పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండడం లాంటివి చేయరాదు. మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉండే లోహపు భాగాలను తాకరాదు. అకాల వర్షాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగుపాట్లు అప్రమత్తం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం మృత్యువాత పడుతున్న రైతులు, పశుపెంపకందారులు -
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చున్నాక రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జె న్సీ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత రెండు వా రాలుగా లిక్కర్ స్కామ్ అంటూ ఎల్లోమీడియాలో హోరెత్తిస్తున్నారని, ఆ పేరుతో మాజీ ఐఏఎస్‌లు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ హ యాంలో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మద్యం షాపులు ప్రభుత్వమే నడిపించిందన్నారు. విక్రయాలు తగ్గిస్తే స్కామ్ ఎలా సాధ్యమవుతుందన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చి విలేకరులతో మాట్లాడారు. కూటమిలో స్కామ్‌లు జరుగుతున్నాయో, వైఎస్సా ర్సీపీ జరిగియో ప్రజలందరికీ తెలుసన్నారు. పలాసలో ఎమ్మెల్యే శిరీష ప్రత్యేకంగా ఒక్కో బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అనుమానంగా ఉందన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురే ష్‌ను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సైతం అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పెట్టుబడులన్నీ వైఎస్సార్సీపీ హయాంలో వచ్చినవే.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వచ్చేవారిని సైతం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు బ్లాక్మెయిల్ చేసి కమీషనర్లకు కక్కుర్తి పడుతున్నారని సీదిరి విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలోనే పెట్టుబడులు వచ్చాయని, ఆ సమయంలోనే భూమి సేకరించి, ఆ సమయంలో ఎంఓయూలు తెచ్చుకున్నారని వివరించారు. రి న్యూ కంపెనీ, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ, శ్రీసిటీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీలన్నీ వైఎస్ జగన్ హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. టీసీఎస్ కంపెనీని కూడా వైఎస్ జగన్ తీసుకువచ్చారని, అన్ని రకాల పూర్తి చేస్తే కూటమి నాయకులు గొప్పలు చెప్పు కుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఒక్కో యూనిట్ రూ 2.50కి కొనుగోలు చేస్తేనే స్కామ్ అన్నారు, ఇప్పుడు రూ.4.50 కొనుగోలు చేస్తున్నారు దీనిలో ఎంత స్కామ్ ఉంటుందో చెప్పాలని ప్రశ్నించారు. స్కామ్‌లు చేసే చంద్రబాబుకి అన్నీ స్కామ్‌లుగా కనిపిస్తాయన్నారు. తిరుపతిలో, సింహాచలంలో ఇలా అనేక దేవాలయాల్లో మృతి చెందుతున్న సంఘటనలు చూస్తే రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం చంద్రబాబు చేసిన పాపమే ప్రజలకు శాపంగా మారిందన్నారు. మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ల అరెస్ట్‌లు అప్రజాస్వామికం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు -
ట్రస్ట్ బోర్డు నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
అనర్హులకు చోటు లేకుండా నియామకాలు జిల్లాలో 16 ఆలయాల కు ట్రస్ట్ బోర్డు నియామకాలు చేపట్టనున్నాం. ఈ మేరకు ఈనెల 28లోగా దరఖాస్తులను స్వీకరించనున్నాం. అయితే దేవదాయ శాఖకు, హిందూ ఆలయాల వ్యవస్థకు, సంస్థలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, సంస్థకు చెందిన భూములను లీజులు, కౌలు కింద అనుభవిస్తున్న వారు, వరుసగా రెండు సార్లు ధర్మకర్తలుగా పనిచేసిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్రిమినల్ కేసులున్న వారు, మద్యం సేవించిన వారు ఈ ధర్మకర్తల పోస్టులకు అనర్హులు. ఇలాంటి వారు లేకుండా నియామకాలను చేపట్టేలా చర్యలు చేపడతాం. – బి.ప్రసాద్ పట్నాయక్, జిల్లా దేవదాయశాఖాధికారి అరసవల్లి: జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలోని 6–బి హోదా ఆలయాల్లో పాలక మండలి నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 16 ఆలయాలకు మరికొద్ది రోజుల్లోనే పాలకమండలి సభ్యులు కొలువుతీరనున్నారు. నిబంధనల ప్రకా రం పక్కాగా హిందువై ఉండి.. ఎలాంటి కోర్టు లావాదేవీలు, క్రిమినల్ కేసులు లేని వారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యతలను దేవదాయశాఖ కమిషనర్ నిర్వర్తించనున్నారు. ఆయా ఆలయాల్లో పాల క మండలి సభ్యుల స్థానాలకు దరఖాస్తులను స్వ యంగా జిల్లా దేవదాయ శాఖ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంది. ఇందుకు ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 వరకు గడువు ఖరారు చేశారు. అయితే పూర్తి రాజకీయ అండదండలతోనే దాదాపుగా పాలకమండలి సభ్యుల ఎంపిక ఉంటుందన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ అగ్రనేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు మొదలు పెట్టేశారు. గార మండలం శాలిహుండం కొండపై వేంచేసి ఉన్న శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంపై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో పాటు ఇక్కడి ఆలయ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఆలయ పాలకమండలి నియామకాలపై స్థానిక గార మండల టీడీపీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సా రించారని తెలుస్తోంది. జిల్లాలో 16 దేవాలయాల్లో ట్రస్టీలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న (6–బి) ఆలయాల్లో తొలిదశగా 16 ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాళీయ మర్దన వేణుగోపాలస్వామి ఆల యం (శాలిహుండం), ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం(గుడివీధి–శ్రీకాకుళం), శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం (పాలకొండ రోడ్డు–శ్రీకాకు ళం), వెంకటేశ్వర స్వామి ఆలయం (చిన్నబజార్–శ్రీకాకుళం), ఏవీపీ చౌల్ట్రీ (జిల్లా దేవదాయ శాఖ కార్యాలయ ప్రాంగణం), వేంకటేశ్వర స్వామి ఆలయం (ఫాజుల్‌బాగ్‌పేట–శ్రీకాకుళం), కనకదుర్గ ఆలయం (బ్రిడ్జి రోడ్డు–శ్రీకాకుళం), భీమేశ్వర స్వామి ఆలయం (కొన్నావీధి–శ్రీకాకుళం), లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (తుమ్మావీధి–శ్రీకాకుళం), గోపాల–జగన్నాథస్వామి వారి ఆలయం (టెక్కలి), లక్ష్మీ నరసింహ స్వామి ఆల యం(టెక్కలి), శ్రీ లక్ష్మణ బాలాజీ ఆలయం (టెక్క లి), రఘునాధ స్వామి ఆలయం (సిరిపు రం–మందస), వెంకటేశ్వర స్వామి వారి ఆలయం (నరసన్నపేట), కోదండరామ స్వామి వారి ఆల యం (సోంపేట), పెద్ద జగన్నాథ స్వామి వారి ఆలయం (ఇచ్ఛాపురం)లో పాలకమండలి సభ్యుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు దేవాలయాల్లో పాలకమండలి సభ్యుల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో గరిష్టంగా 9 మంది పాలకమండలి సభ్యులు ఉండాలి (చైర్మన్‌తో సహా). వంశపారం పర్యంగా ధర్మకర్తలుంటే వారే చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. మిగిలిన సభ్యుల స్థానాలకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్థాయి (6–బి) ఆలయాల్లో మొత్తం 9 మంది సభ్యుల్లో కచ్చితంగా మహిళల కోటా 50 శాతం అంటే కనీసం నలుగురు మహిళా సభ్యుల (ఓపెన్) నియామకం తప్పనిసరి అనే నిబంధన ఉంది. అ లాగే మొత్తం సభ్యుల సంఖ్యలో నలుగురు ఓసి కేటగిరిలో (ఇందులో ఒకరు కచ్చితంగా బ్రాహ్మణులై ఉండాలి), మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీకి చెందిన వారు, మిగిలిన నలుగురు బీసీ కేటగిరికి చెందిన వారు (ఇందులో ఒకరు కచ్చితంగా నాయీ బ్రాహ్మణుడు ఉండాలి) ఉండాలనే నిబంధనలను అమలు చేయాల్సి ఉందని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 28లోగా దరఖాస్తులకు గడువు జిల్లాలో మొత్తం 16 ఆలయాల్లో ట్రస్ట్‌బోర్డులకు నోటిఫికేషన్ విడుదల -
వర్చువల్ ల్యాబ్‌కు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యకు నాంది పలికేలా ‘జీరో సైన్స్ ల్యాబ్’ వర్చువల్ ప్రయోగశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. మొదటిగా స్మార్ట్ డిస్ప్లేలు ఉన్న ఐదు పాఠశాలల్లో ఈ ల్యాబ్‌ను ప్రారంభించి, విద్యార్థులపై ప్రభావా న్ని విశ్లేషించనున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు కార్యాచరణపై కలెక్టర్‌ను సోమవారం కలిసిన ఈడీజెడ్వన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు రామ్‌కుమార్ రామదేవు, సంతోష్ కొత్తకోట ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. కలెక్టర్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, సాంకేతిక మద్దతు కల్పించేందుకు సమగ్ర చర్య లు తీసుకోవాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శశిభూషణ్‌కు సూచించారు. నిలిచిన సీటీ స్కాన్ సేవలు టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో సోమవారం సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయా యి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం ఉదయం రోగులకు స్కాన్ చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రావడం జరుగుతుండటంతో సీటీ స్కాన్ ఒక్కసారిగా మరమ్మతులకు గురైంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిస్టంలో ఉన్న డేటా సైతం కనిపించకపోవడంతో ఇక్కట్లు తప్పలేదు. అత్యవసర కేసులను శ్రీకాకుళం రిఫర్ చేయాల్సి వచ్చింది. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారు లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు, ప రిష్కార వేదికలో గ్రీవెన్స్‌కు ముందు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలిసి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. పిడుగు పాటు కు సంబంధించి వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే గ్రామ స్థాయిలో చేరే విధంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని తద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బ తినడం వంటి సమాచారం పై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్ ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకేంద్రం వేదికగా జరుగుతు న్న స్పాట్ వాల్యుయేషన్‌లో భాగంగా మొదటి స్పెల్‌లో సంస్కృతంతోపాటు తెలుగు,ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సివిక్స్, తెలుగు పేపర్లను దిద్దుతున్నారు. ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు, ఏసీవో జనరల్–1 గణపతి వెంకటేశ్వరరావు, జనరల్–2 శివరాంప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. పదోన్నతులతో ఖాళీల భర్తీ సారవకోట: జిల్లా పరిషత్ పరిధిలో వివిధ మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నామని జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. సోమవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలత్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హత కలిగిన వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
నోటికి ప్లాస్టర్ చుట్టుకుని..
● యువకుడి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్‌చైర్‌లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకు రూ.కోటి
టెక్కలితో పోటీ.. ● పొందూరు మండలంలో అడ్డగోలుగా మైనింగ్ దందా ● టెక్కలి నియోజకవర్గంతో పోటీ పడి దోచేస్తున్న పరిస్థితి ● కీలక నేత కనుసన్నల్లో తవ్వకాలు ● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. అడ్డు చెప్పే వారు లేకపోవడం, అడ్డుకునే వారు రాకపోవడంతో ఓ కీలక నేత ఆధ్వర్యంలో మైనింగ్ దందా విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు టెక్కలి నియోజకవర్గంలో మాత్రమే ఈ దందా జరిగేది. ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం కూడా అడ్డాగా మారింది. అక్కడెలాగైతే ఓ కీలక నేత కనుసన్నల్లో మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా ఒక కీలక నేత దందాను నడిపిస్తున్నారు. రోజుకి రూ.కోటికి పైగా అక్రమ మార్గంలో ఆర్జిస్తున్నట్టు సమాచారం. మైనింగ్ దోపిడీలో కొంత అధికారులకు ముడుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో మైనింగ్ అంటే గుర్తుకొచ్చేది పొందూరు మండలమే. ఒక ప్పుడు కొన్ని కుటుంబాల వారు బతుకుతెరువు కోసం రాళ్లు కొట్టుకుని జీవించేవారు. రాను రాను ఆ రాళ్లకు డిమాండ్ పెరగడంతో అక్రమార్కుల కన్ను అక్కడున్న కొండలు, గుట్టలపై పడింది. యంత్రాలు, బ్లాస్టింగ్ ద్వారా తవ్వకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గ కీలక నేత కనుసన్నల్లో ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఆయనకు రూ.కోట్లలో ముడుపులందగా, క్వారీలు నడు పుతున్న వారు అంతకుమించి సంపాదిస్తున్నారు. అంతా కలిసి విలువైన బ్లాక్ స్టోన్‌ను దోచేస్తున్నారు. పొందూరు మండలంలో రాపాక, ఇల్లయగారిపేట, గారపేట, పుల్లాజీపేట, లోలుగు, పొందూరు తదితర ప్రాంతాలు అక్రమ మైనింగ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. పొందూరు మండలంలోని సర్వే నంబర్లు 335, 244, 223, 198, 71లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో వేల హెక్టార్లలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. కృష్ణాపురం సమీపంలోని సర్వే నంబర్ 335లో అత్యధికంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. కీలక నేత ఆధ్వర్యంలో కె.రమేష్, కె.రామినాయుడు, కె.అప్పారావు, జి.రమణ, వి.రామారావు, కె.గౌరీనాయుడు, కె.అక్కలనాయుడు, కె.శశి, పి.రమణ, కె.అప్పలనాయుడు, పి.రమణమూర్తితో మరో 20మంది వరకు అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రెండు, మూడు క్వారీలకు పరిమితమై నడవగా ఇప్పుడవి 26కు పైగా నడుస్తున్నాయి. వీటిలో ఐదు క్వారీలకు మాత్రమే లీజు అనుమతులు ఉన్నాయి. మిగతా 21 క్వారీలకు అనుమతుల్లేవు. ఇక లీజు అనుమతులు ఉన్న క్వారీల్లో కూడా పరిమితికి మించి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క క్వారీలే కాదు 25వరకు అక్రమ క్రషర్లు కూడా నడుస్తున్నాయి. గత ఐదేళ్లు అక్రమాలకు చెక్ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలకు చెక్ పడింది. విశ్వసముద్ర కంపెనీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో ప్రభుత్వానికి భారీ గా ఆదాయం రావడంతో అక్రమ క్వారీలకు అవకాశం ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత విశ్వసముద్రకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ చెడిందో గానీ విశ్వసముద్రను తప్పించి ఏఎంఆర్ సంస్థకు అప్పగించారు. అయితే, ఈ సంస్థతో కూడా లోపాయికారీ ఒప్పందాలు అమల్లోకి రాకపోవడమో, అడిగినంత ఇవ్వలేదనో గానీ ఏఎంఆర్ సంస్థను కూడా హోల్డ్‌లో పెట్టేశారు. దీంతో ఎవరికి నచ్చినంత వారు దోచే స్తున్నారు. ప్రస్తుతం ఇసుక, మట్టి, గ్రావెల్‌తో పాటు మైనింగ్ కూడా తెలుగు తమ్ముళ్లకు కనకవర్షం కురిపిస్తోంది. విశేషమేమిటంటే, ఇటీవల పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్లినాక కూడా అక్కడ అక్రమ మైనింగ్ ఆగలేదు. -
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక మరోసారి పోరుబాటకు సిద్ధమౌతోంది. రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన అసంబద్ధ రీఅపోర్షన్ ఉత్తర్వులు 19, 20, 21లకు వ్యతిరేకంగా రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 21న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, మజ్జి మదన్మోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోంలో ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. 9 రకాల పాఠశాలలను తీసుకురావడం వెనుక ఉద్దేశమేంటని.. కనీసం ప్రభుత్వానికై నా తెలుసోలేదా తమకు తెలియడంలేదని ప్రశ్నించారు. అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను గందరగోళానికి నెడుతున్నారని మండిపడ్డారు. బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను మ్యాన్యువల్‌గా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణమన్నారు. వీటికి నిరసనగా ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈవోల కార్యాలయాల ముట్టడి, 23న పాఠశాల విద్య డైరెక్టర్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎస్.కిషోర్‌కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, పిసిని వసంతరావు, బి.రవి, బి.వెంకటేశ్వర్లు, దుప్పల శివరాంప్రసాద్, సత్యనారాయణ భాస్కరరావు, లక్ష్మణరావు, మురళి, ప్రతాప్‌కుమార్, శరత్‌బాబు, మేరీప్రసాద్, రమేష్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
3 సెంట్ల స్థలం.. 200 మంది జనాలు
రణస్థలం: భూ వివాదం నేపథ్యంలో రణస్థలం టీడీపీ నాయకులు బల ప్రదర్శనకు దిగారు. భారీగా మద్దతుదారులను తీసుకొచ్చి తోపులాటకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల.. టీడీపీ నాయకుడు, కృష్ణపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముల్లు కృష్ణ, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు మధ్య కొన్నాళ్లుగా 3సెంట్ల భూమి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వారం కింద కృష్ణ తాను కొనుగోలు చేసిన 3సెంట్ల స్థలాన్ని చదును చేస్తుండగా ఆనందరావు వర్గీయులు అడ్డుకున్నారు. స్థలం సర్వ హక్కులు తమకే ఉన్నాయని గొడవ పడ్డారు. ఈ వివాదంపై ఇరువురు జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఆదివారం కృష్ణ తన అనుచరులతో మరోసారి స్థలం బాగు చేస్తుండగా ఆనందరావు వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు. ఇరువర్గాలకు చెందిన సుమారు 200 మంది జనం చేరడంతో తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పినా వినలేదు. ఎస్సై చిరంజీవి మరికొంత మంది సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. మూడు సెంట్ల స్థలం కోసం ఇంత రభస చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పత్రాలు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఇరువర్గాలకు చెప్పి పంపించేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రెవెన్యూ అంశం కావడం వల్ల తహసీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. ఎటువంటి గొడవలు పడకుండా ఇరువర్గాలపై బైండోవర్ నమోదు చేస్తున్నామని తెలిపారు. బల ప్రదర్శనకు దిగిన టీడీపీ నాయకులు రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలకు విఘాతంపై ఎస్సై ఆగ్రహం -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా.. అల్లర్లు, అలజడులు సృష్టించేందుకు యత్నించినా పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి రౌడీషీటర్లకు హెచ్చరించారు. నేరాల కట్టడిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఆదివారం వివిధ పోలీస్స్టేషన్లలో షీట్లు నమోదైనవారిని ఎస్‌హెచ్‌వోలు పిలిపించి మాట్లాడారు. నేర ప్రవృత్తి మాని సత్ప్రవర్తనతో మెలగాలని, కబ్జాలకు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడరాదని హితవుపలికారు. పేకాట డెన్లు నిర్వహించరాదని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించరాదని, అక్రమ రవాణా చేయరాదని చెప్పారు. కాగా, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్‌లో 39 మంది రౌడీషీటర్లుండగా, ఒకటో పట్టణ పరిధిలో 36 మంది ఉన్నట్లు సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యావ్యవస్థలో ఉన్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల వెన్నెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు భైరి అప్పారావు, తంగి మురళీమోహన్రావు, పప్పల రాజశేఖరరావు, దానేటి కేశవరావు, దుప్పల శివరాంప్రసాద్, సురేస్సింగ్, వెంకటరమణ, శ్రీనివాస్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చిలకపాలేంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆదివారం నిర్వహించారు. మొదటి షిఫ్టులో 242 మందికి 239 మంది, రెండో షిఫ్టులో 242 మందికి 239 మంది హాజరయ్యారు ఐక్యవేదిక ఉద్యమాన్ని విజయవంతం చేయండి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఉద్యమాలలో ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి చిన్నబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కొన ఊపిరితో కొనసాగుతోందన్నారు. తొమ్మిది రకాల స్కూల్ వ్యవస్థతో గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని అనేక మంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని, పాతపద్ధతిలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వ్యవస్థలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, రేషనలైజేషన్‌లలో అసంబద్ధమైన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్కూల్ అసిస్టెంట్లను ఎలిమెంటరీ పాఠశాలకు కేటాయించడం, రెండు మూడుసార్లు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు సరైన న్యాయం జరగకపోవటం, హైస్కూల్లో సెక్షన్‌కు 54 మందిని పరిగణించడం తగదన్నారు. ఐక్య వేదిక ఇచ్చిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర విద్యాశాఖలో జరుగుతున్న అసంబద్ధమైన, అస్తవ్యస్త నిర్ణయాల పట్ల అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకుండా కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే విద్యను కొనసాగిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల విద్యార్థుల మానసిక, సృజనాత్మక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబాటకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నాయకులు ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు. -
చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా
చెరువును కప్పేస్తున్నారు.. సంతబొమ్మాళి: అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే వాటికి వంత పాడుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సంత బొమ్మాళి మండల ఉపాధి ఏపీవో పంగ నరసింహమూర్తి స్వగ్రామైన చెట్లతాండ్ర గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న పెద్ద చెరువును కప్పేస్తున్నారు. టాక్టర్ల ద్వారా మట్టిని తరలించి పూర్తిగా కప్పేస్తున్నారు. ఈ చెరువులో నీరు పంట భూములకు ఎంతగానో ఆసరాగా నిలిచేదని, ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబధనలకు విరుద్ధంగా చెరువులో పనులు జరుగుతున్నా ఏపీవో పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు తప్పుపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇచ్చాపురం రూరల్: ఒకప్పుడు మండలంలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు..చెట్లు, గుట్టలతో ఆహ్లాదరక వాతావరణ దర్శనమిచ్చేది. ప్రస్తుతం కొంతమంది బడా నాయకులు పంట పొలాలు చదును పేరుతో అక్రమ మార్గంలో మట్టి దందా జోరుగా సాగిస్తున్నారు. మట్టిని తరలించి అందినకాడికి దండుకుంటున్నారు. దీనిని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి, కేశుపురం, హరిపురం, కొళిగాం, ధర్మపురం, తులసిగాం, లొద్దపుట్టి, ఈదుపురం, అరకబద్ర, మశాఖపురం, బిర్లంగి, మండపల్లి పంచాయతీ తదితర ప్రాంతాల్లో గట్టు చప్పుడు కాకుండా పంట భూములను తవ్వేసి దర్జాగా ఇటుక బట్టీలు, ప్లాట్లకు వేసుకుంటున్నారు. తేలుకుంచి తదితర గ్రామాల పరిధిలో దేవదాయ శాఖ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. అనుమతులేవీ..? పచ్చని పంట పొలాల్లో పాగా వేసి నాలా కన్వర్షన్ చేసుకోకుండా, స్థానిక సంస్థలతో అనుమతులు తీసుకోకుండా కొందరు మట్టి తవ్వకాలు చేపడుతూ ప్లాట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించాలంటే తొలుత ఆ భూమిని తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూమిగా (నాలా కన్వర్షన్) చేసుకోవాలి. మండలంలో ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు. మండలంలో సుమారు పాతిక వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటి కోసం జేసీబీ వాహనాలు ఉన్న యజమానులు ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చర్యలు తప్పవు.. సొంత పొలాల్లో సైతం మట్టి తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధం. మైనింగ్ శాఖాధికారుల పర్మిషన్ తీసుకోవాల్సిందే. దేవదాయ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపితే ఎండోమెంట్ శాఖాధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలి. పంట పొలాల్లో నాలా కన్వర్షన్ లేకుండా ప్లాట్లు వేస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎన్.వెంకటరావు, ఇచ్ఛాపురం తహసీల్దార్ అనుమతులు లేకుండా జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు ఇటుక బట్టీలు, ప్లాట్లకు అమ్మకాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని అధికార యంత్రాంగం -
సివిల్స్ ర్యాంకర్‌కు సత్కారం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం మట్టిలో పుట్టిన మాణిక్యం రావాడ సాయి మోహిని మానస అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.ఆర్.రజినీ అన్నారు. సివిల్స్‌లో 975వ ర్యాంక్ సాధించిన రావాడ సాయి మోహిని మానసను ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్ దళిత, ఉద్యోగ, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ శ్రమ, పట్టుదల, నిరంతర అధ్యయనం, తల్లిదండ్రులు ప్రోత్సాహమే నా విజయానికి కారణమని చెప్పారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు రావాడ ప్రకాశ్, ఉషారాణి, రైల్వే అధికారి కుందన రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రిటైర్డ్ జైల్ శాఖ డీఎస్పీ బత్తిన కృష్ణారావు, డాక్టర్ జగదీష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల శాఖ అధికారి కంబాల రవిరాజా, అసోసియేషన్ నాయకులు బత్తిలి మురళీకృష్ణ, పొన్నాడ రుషి, రుంకు అప్పారావు, రుంకు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెట్లకు ఐడీ కార్డులు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఐడీ కార్డులను అందజేయడంతో పాటు వారి ప్రగతి, గణాంకాలు, ట్రాక్ రికార్డులన్నీ అందులోనే నమోదు చేస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలో నిర్వహించారు. ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు) సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) విధానాలకు అనుగుణంగా ఆన్లైన్లో క్రీడాకారుల ఎంట్రీలను నమోదుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా ఎంట్రీలు జరిగేవని.. ఇకపై స్కూల్ సర్టిఫికెట్, స్టడీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంట్రీ నమోదు చేయనున్నట్లు స్పష్టం చేవారు. 2025–26 సీజన్‌కుగాను స్టేట్ షెడ్యూల్ వెలువడలేదని, వచ్చిన వెంటనే జిల్లాస్థాయి ఎంపికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, నౌపడ విజయ్‌కుమార్, బీవీ రమణ, పి.తవిటయ్య, కె.గోపి, కె.హరిబాబు, కె.మాధవరావు, సుజాత, బి.నారాయణరావు, మురళి, రామారావు, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం, పాలకొండ తదితర క్లబ్స్ నుంచి పీడీలు, కోచ్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ
అరసవల్లి: అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖకార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత ఆధ్వర్యంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నివారణాధికారి డాక్టర్ టి.శ్రీకాంత్ సమక్షంలో ఎయిడ్స్ మృతులను స్మరించుకుంటూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ‘ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని గుర్తుంచుకుంటాం.. మేం మాట్లాడతాం..మేం నడిపిస్తాం..’ అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ సీహెచ్,అప్పలనాయుడు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పి.మోహిని, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఆదిలింగం, సామాజికవేత్త వెంకటస్వామి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతా ఇష్టారాజ్యం!
నౌపడలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్ సంతబొమ్మాళి: జిల్లాలో అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నౌపడలో అక్రమ లేఅవుట్ వెలిసింది. ఓవైపు సంబంధిత స్థలం విషయమై కోర్టులో కేసు ఉన్నా.. మరోవైపు కన్వర్షన్ చేయకుండా, పంచాయతీ అనుమతి లేకున్నా లేఅవుట్లోని ప్లాట్లను లక్షల రూపాయల్లో విక్రయించడానికి సిద్ధం చేసేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నౌపడలో సర్వేనెంబర్ 486–3లో 82 సెంట్లు, 486–4లో 5 సెంట్లు కలిపి మొత్తం 87 సెంట్ల విస్తీర్ణంలో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్‌ను వేశారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిబంధనలకు తూట్లు.. నిబంధనల ప్రకారం లేఅవుట్ వేసేముందు వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అధికారులు అనుమతి పొందాలి. అనంతరం ప్లాట్లు వేసేముందు ప్లానింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత అధికారులు లేఅవుట్లోని భూములను పరిశీలించి అనుమతులు ఇస్తారు. అలాగే సామాజిక అవసరాల నిమిత్తం 10 శాతం భూమిని పంచాయతీకి కేటాయించాల్సి ఉంది. డ్రైనేజీలు, రోడ్లు కొలతల ప్రకారం ఏర్పాటు చేయాలి. అయితే స్థానికంగా అవేమీ కనిపించడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లో ప్లాట్లు అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. కోర్టులో కేసు.. సర్వే నెంబర్ 485–3 సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తనకు అన్యాయం చేశారని పలికిల శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పత్రాలను సైతం రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ పరిస్థితిలో లేఅవుట్ ఎలా వేశారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. కన్వర్షన్ చేయలేదు.. లేఅవుట్ ఏర్పాటు చేసే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కన్వర్షన్ అయ్యాకే లేఅవుట్ పనులు ప్రారంభించాలి. నౌపడలో సర్వే నెంబర్ 486–3,4లో కన్వర్షన్ కోసం దరఖాస్తు చేయలేదు. కోర్టు పరిధిలో ఉంటే సంబంధిత పత్రాలు తహసీల్దార్‌కు అందజేయాలి. – ముంగులు, వీఆర్వో, నౌపడ అనుమతులు లేవు.. నౌపడలో వేసిన లేఅవుట్లకు ఎటువంటి పంచాయతీ అనుమతులు లేవు. ఇంతవరకు పంచాయతీ అధికారులను ఎవరూ సంప్రదించలేదు. – యు.ఉమాపతి, పంచాయతీ కార్యదర్శి, నౌపడ నౌపడలో అక్రమ లేఅవుట్ కోర్టులో కేసు ఉన్నా.. అనుమతులు లేకపోయినా అమ్మకానికి సిద్ధం -
బ్లడ్ బ్యాంకుల్లో.. నిల్వలు నిల్!
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గిపోయాయి. దీంతో అత్యవసర వేళల్లో రక్తం అందక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, క్యాన్సర్, డయాలసిస్ పేషెంట్లు తదితర బాధితులకు రక్తం అందించలేని పరిస్థితి ఏర్పడిండి. ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయా చిన్నారులు అవస్థలు పడుతున్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. కార్యాలయాలు, గ్రామాల్లో ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా అవసరాలకు తగ్గట్లు నిల్వలు సరిపోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో కొన్ని రకాల బ్లడ్ యూనిట్లు పూర్తిగా ఖాళీ అయ్యాయని, రక్తదాతలు స్పందించాలని కోరుతున్నారు. దాతలు ముందుకు రావాలి యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామైక్య సంఘాలు, మానవతా మూర్తులు స్పందించాలి. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. శిబిరాలు నిర్వహించడానికి అవకాశం లేని వారు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్చు. శిబిరం ఏర్పాటు చేయదలచుకుంటే 94404 90525 నంబరును సంప్రదించాలి. – పి.జగన్మోహనరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ అత్యవసర వేళల్లో రక్తం అందక అవస్థలు రక్తదాతలు ముందుకు రావాలని నిర్వాహకుల పిలుపు -
మరిడమ్మకు ప్రత్యేక పూజలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్‌లో వెలసి ఉన్న మరిడమ్మ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని మొక్కుతీర్చుకున్నారు. ఏటా వైశాఖమాసంలో మరిడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకాకుళం నుంచి సాలూరుకు ప్రత్యేక బస్సులు శ్రీకాకుళం అర్బన్: సాలూరులో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ప్ర యాణికుల సౌకర్యార్థం ఈ నెల 18 నుంచి 21 వరకు పాలకొండ, పలాస, టెక్కలి, శ్రీకాకుళం–1, శ్రీకాకుళం 2వ డిపోల నుంచి 356 బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మే రకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. వీటిలో శ్రీకాకుళం నుంచి రాజాం వరకు 80 బస్సులు, రాజాం నుంచి సాలూరు వరకు 180 బస్సులు, బొబ్బిలి నుంచి సాలూ రు వరకు 96 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. పండగ కోసం బస్సులు వేసినందున జిల్లాలోని పలు సర్వీసులు రద్దవుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించి ఆర్టీసీ అధికారులకు సహకరించాలని కోరారు. లోపాలు ఉంటే సహించబోము ● గ్రానైట్ క్వారీల యాజమాన్యాలను హెచ్చరించిన ఆర్డీఓ కృష్ణమూర్తి టెక్కలి: గ్రానైట్ క్వారీల నిర్వహణలో లోపాలు ఉంటే సహించేది లేదని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి హెచ్చరించారు. ఇటీవల మెళియాపుట్టి మండలం ధీనబందుపురం సమీపంలో గ్రానైట్ క్వారీలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఆదివారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో క్వారీ యాజమానులతో పాటు మైన్స్, రెవె న్యూ అధికారులు, పోలీస్ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల పలు మండలాల్లో గ్రానైట్ క్వారీ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల క్వారీ లో సంభవించిన సంఘటనలో యాజమాన్యం తప్పుదోవ పట్టించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగుపాటు వల్ల కార్మికులు మృతి చెందారని మొదట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత తమ దర్యాప్తులో బ్లాస్టింగ్ వలన చనిపోయినట్లు గుర్తించామని ఆర్డీఓ గుర్తు చేశారు. ఇకపై రెవెన్యూ, మైన్స్, పోలీస్, పంచాయతీ అధికారులతో ఒక బృందంగా ఏర్పడి క్వారీల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. తనిఖీలు జరిగిన అనంతరం క్లియరెన్స్ ధ్రువీకరణం పత్రం పొందిన తర్వాతే కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశా రు. డివిజన్ పరిధిలో సుమారు 170 వరకు గ్రానైట్ క్వారీలు ఉంటే, వాటిలో సుమారు 70 వరకు క్వారీల్లో నిబంధనలు పాటించడం లేదని ప్రాథమికంగా తెలిసిందన్నారు. క్వారీ ల్లో పని భద్రత లేకపోవడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థా లు వినియోగించడం, కనీస భద్రత పాటించకుండా రోడ్లపై గ్రానైట్ బ్లాక్‌లను తరలించడంపై మండిపడ్డారు. సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, మైన్స్ ఏడీ విజయలక్ష్మి తో పాటు డివిజన్ పరిధిలో తహసీల్దార్లు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజినీరింగ్ కార్మికుల గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు, అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్యామలరావు, ఆర్.సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు కనీసం పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర జనాభాకనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. -
అటు సందడి.. ఇటు అలజడి
సోంపేట: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాలవలస అమ్మవారికి ఘటమెత్తింది. ఇరవై ఏళ్ల అనంతరం ఆ ఊరిలో అమ్మవారి సంబరాలు జరుగుతు న్నాయి. వారం రోజులుగా ఊరుఊరంతా ఆ సందడిలోనే ఉంది. గ్రామస్తులు ఆదివారం బంధువులు, చుట్టాలను పిలిచి భోజనాలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇంతలోగా ఓ పిడుగు లాంటి వార్త వారి లో అలజడి రేపింది. గ్రామానికి చెందిన గోకర్ల ఈశ్వరరావు(35)ను ఎవరో చంపేశారని వార్తలు రావడం, మృతదేహం జీడితోటల్లో దొరకడంతో ఊరు నిశ్శబ్దమైపోయింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన విశ్వనాథం, కాంతమ్మల కుమా రుడు గోకర్ల ఈశ్వరరావు హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామదేవత ఉత్సవాల కోసం ఇటీవలే గ్రామానికి వచ్చాడు. వారం రోజులుగా స్నేహితులతో ఆనందంగా గడిపాడు. శనివారం రాత్రి ఇంటిలో భోజనం చేసి బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా పడుకోవడానికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అంతా గాలించారు. అ యినా అతని ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉద యం పాలవలస జాతీయ రహదారి పక్కన ఈశ్వరరావు బైక్ కనిపించింది. సమీప జీడి తోటల్లో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు స మాచారం అందజేశారు. బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు, సోంపేట సీఐ బి.మంగరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈశ్వరరావును హత్య చేసినట్లు భావిస్తున్నారు. క్లూస్ టీంతో పరిశీలనలు చెపట్టారు. ఈశ్వరరావు భార్య స్వాతి ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈశ్వరరావుకు భార్యతో పాటు రెండేళ్ల వయసు గల కుమార్తె ఉంది. ఈశ్వరరావు మృతిపై గ్రామంలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆందోళనలో గ్రామస్తులు పాలవలస గ్రామంలో ఇలాంటి హత్యల సంస్కృతి ఎన్నడూ లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఇలాంటి సంఘటన జరగడం బాధ కలిగించిందన్నారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాలవలసలో వ్యక్తి దారుణ హత్య..? ఊరిలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఘటన ఆందోళనలో గ్రామస్తులు -
జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో నేటి నుంచి 23వ తేదీ వరకు అక్కడక్కడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22, 23 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. వానల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలవకూడదని, మొబైల్ ఫోన్లు, హెడ్ఫోన్లు వాడకూడదని, ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్ధులు బయ టకు వెళ్లకుండా చూడాలని, పశువులను కప్పుతో కూడిన షెడ్లలో ఉంచాలని, టీవీ, ఫ్రిజ్, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలని, నీటి మోటార్లను నడపరాదని పేర్కొన్నారు. అలాగే గాలివానల వేళ పంట పొలాల్లోకి వెళ్లకూడదని, బైకులు, ఆటోలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదని, పుకార్లను నమ్మకూడదని అధికారిక సమాచారాన్ని మాత్రమే అను సరించాలని తెలిపారు. విపత్తుల సమయంలో జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం 24 గంటల పాటు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ -
ఈఓ.. రూ.10 ఇవ్వు!
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అయితే పలు విభాగాల్లో నిర్ణీత రుసుం కంటే అదనంగా వసూలు చేస్తున్న ఆలయ సిబ్బందిపై ఆల య ఈఓ శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సి ఉండగా.. అక్కడ కూడా భక్తుల నుంచి అదనంగా రూ.10 వరకు వసూళ్లు చేస్తున్న వైనంపై ఆమె మండిపడ్డారు. ఆమె స్వయంగా మరుగుదొడ్లకు వెళ్లగా.. ఆమె ఈఓ అని తెలియక అక్కడున్న ఓ సిబ్బంది రూ.10 ఇవ్వాల్సిందేనని అడిగారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సిబ్బందిని విధుల నుంచి తప్పించి వేరే సిబ్బందిని నియమించేలా ఈఓ చర్యలు చేపట్టారు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి భక్తుల నుంచి రూ.10, క్లాక్ రూంలో సెల్‌ఫోన్ భద్రపరచడానికి అదనంగా రూ.5, బ్యాగులకు అదనంగా రూ.10, కొందరు సెక్యూరిటీ సిబ్బంది, కొందరు ఆలయ దినసరి వేతనదారులు భక్తుల నుంచి రూ.500 వరకు డబ్బులు వసూలు చేస్తూ దర్శనాలకు పంపిస్తున్నారని, కేశఖండన శాలలో తలనీలాల మొక్కులు చెల్లించడానికి అదనంగా రూ.50 వరకు వసూలు చేస్తున్నారని ఈఓ గుర్తించారు. వచ్చే ఆదివారం ఈ విభాగాలపై ప్రత్యేక విజిలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఆమె ప్రకటించారు. అదనపు వసూళ్లపై ఈఓ ఆగ్రహం.. ఆదిత్యునికి వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా దర్శనాలకు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు నకిలీ సిఫారసులతో ఎగ్జిట్ మార్గం నుంచి పెద్ద సంఖ్య లో దర్శనాలకు వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా తమకు నచ్చినట్లుగా దర్శనాలకు పంపించినట్లుగా ఈఓ దృష్టికి వెళ్లడంతో ఆమె అక్కడి సెక్యూరిటీతో పాటు విధుల్లో ఉన్న దేవదాయ శాఖ సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరసవల్లిలో ఈఓ అని తెలియక పది రూపాయలు అడిగిన సిబ్బంది అదనపు వసూళ్లపై మండిపడిన అధికారి -
వైఎస్సార్ సీపీ కల.. ఫలిస్తున్న వేళ
● ఇచ్ఛాపురంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం నేడు ● ఎన్నికల ముందే నిర్మాణం పూర్తి ● ఎట్టకేలకు ప్రారంభిస్తున్న కొత్త ప్రభుత్వం ఇచ్ఛాపురం టౌన్ : ఇచ్ఛాపురం పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఆవరణలో కిడ్నీ రోగుల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హ యాంలో నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్ని ఎట్టకేలకు సోమవారం ప్రారంభించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే డ యాలసిస్ కేంద్రం కోసం అనుమతులు తెచ్చింది. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఐదు డయా లసిస్ యంత్రాల ద్వారా రోగులకు సేవలు అందించేందుకు సకలం సిద్ధం చేసింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డయాలసిస్ కేంద్రం ప్రారంభం ఆగిపోయింది. సర్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం ప్రారంభించడానికి ఏడాది పాటు మీనమేషాలు లెక్కించిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. ఈ కేంద్రం ప్రారంభించలేదని ‘సాక్షి’ లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నెల 10వ తేదీన కూడా ‘పాలకులకు పట్టని డయాలసిస్ కేంద్రం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీంతో అధికారులు, పాలకులు స్పందించి బెడ్లు, ఇతర యంత్రాలు శుభ్రపరిచి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో డయాలసిస్ కేంద్రాన్ని సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కావాల్సిన సిబ్బందిని నియమించాలని, విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీటి నాణ్యత పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకుడు పిలక విజయ్ పాల్గొన్నారు. డయాలసిస్ కేంద్రం -
కూటమి పాలన.. ఆలయంలోని ఏడు విగ్రహాలు ధ్వంసం
గార: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలు హిందూవుల మనసులను కలచివేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో రెండురోజుల వ్యవధిలో 15 నక్షత్ర తాబేళ్లు మృత్యువాతపడడం, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా సింహాచలంలో చందనోత్సవ సమయంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించడం వంటి హృదయ విదారక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి.ఈ విషాద ఘటనలు మరువక ముందే శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయంలో మరో ఘోర అపచారం జరిగింది. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గర్భగుడిని స్థానికులు విరాళాలు పోగు చేసి బాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ దశావతారాలను సిమెంట్ విగ్రహాలతో ఏర్పాటు చేశారు. వీటిలో వామనావతరం విగ్రహాన్ని దుండగులు పూర్తిగా పెకిలించి వేశారు. కలి్క, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు కత్తి, నాగలి, పిల్లనగ్రోవి వంటివి పాడైపోయాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇక్కడ మందుబాబులు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వీపర్ గొండు చిన్నమ్మడు వెనుక వైపు వెళ్లి చూడగా విగ్రహాలన్నీ కొన్ని చోట్ల విరిగిపోయి ఉండటం గమనించి అర్చకులకు తెలియజేసింది. అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలచార్యులు ఆలయ ఈఓకు, స్థానిక పెద్దలకు తెలియజేశారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు. రెండు ఆలయాల్లోని రెండు సీసీ కెమెరాలు గత పదిహేనురోజులుగా పనిచేయడం లేదు. ఘటన జరిగిన తర్వాత విరిగిపోయిన విగ్రహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్ ఇన్చార్జి ఈఓ మాధవి విగ్రహాల ధ్వంసంపై గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ సంఘాల నిరసనఆలయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద పరిశీలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, ఇన్చార్జి ఎస్ఐ ఎం.హరికృష్ణ ఉన్నారు. జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పటా్నయిక్ ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ సభ్యులు ఆలయం వద్ద నిరసన చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్, రాష్ట్ర నాయకులు పండి యోగీశ్వరరావు ఆలయాన్ని పరిశీలించారు. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆటో డ్రైవర్లు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీనిలో భాగంగా స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఆటోలకు క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్, ఓనర్ వివరాలు, ఆటో ప్రయాణించే దిశ, రోడ్డు మార్గం, లోకేషన్ తదితర పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 26 వేల ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం 20 వేల ఆటోలు రవాణా లో ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు డ్రైవర్లు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తి యాప్‌తో ఈ సురక్ష యాప్‌ను రానున్న రోజుల్లో అనుసంధానం చేస్తామన్నారు. అనంతరం ఈ సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్ రూపకల్పన చేసిన ఐటీ కోర్ ఏఎస్ఐ బి.రమేష్, ఉత్తమ ఆటో డ్రైవర్లు భాస్కరరావు, శ్రీనివాసరావులను ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ విజయ సారధి, అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఎంవీ ఐ.గంగాధర్, సీఐలు పైడిపునాయడు, ఇమ్మనుల్ రాజు, ఈశ్వర్రావు, అవతారం, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మాకొద్దు బాబోయ్..!
● ఫిష్‌పాండ్ పనులపై వేతనదారుల నిరాసక్తత ● తక్కువ వేతనం వస్తుందని అసహనం ● పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ జింకిభద్ర కొత్త చెరువులో తవ్వుతున్న ఫిష్ పాండ్ సోంపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న షిష్ పాండ్ పనులు అంటే వేతనదారులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారుల ఒత్తిడితో గ్రామాల్లో ఫిష్ పాండ్ పనులు చేపడుతుంటే చాలీచాలని వేతనాలు అందుతున్నాయని వాపోతున్నారు. మండలంలోని జింకిభద్ర గ్రామంలో తాము పనులు చేయమని వేతనదారులు శనివారం పనులకు వెళ్లకుండా ఆగిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఇదివరకు మట్టితీసే పనులే... కేంద్ర ప్రభుత్వం గత వార్షిక సంవత్సరం వరకు చెరువులో మట్టితీసి గట్టుపై వేసే పనులు చేపట్టింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల ఆలోచనలతో చెరువు మధ్యలో మరో చెరువు తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెరువులో నీరు నిల్వ ఉండడంతో పాటు, చేపలు కూడా నిల్వ ఉంటాయని, ఫలితంగా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 5 ఎకరాల పైబడే చెరువుల్లో ఫిష్ పాండ్ తవ్వకాలు చేపట్టాలని ఉపాధి హమీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. చెరువు మధ్య భాగంలో సుమారు 40 అడుగుల పొడవు, వెడల్పుతో పాటు 6 అడుగుల లోతు తవ్వాలని వేతనదారులకు సూచించారు. ఈ పని పూర్తి అవ్వడానికి సుమారు రూ.9 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు వేతనదారులను హడలెత్తిస్తున్నాయి. చెరువులో రెండు అడుగుల లోతు తర్వాత మట్టి తవ్వాలంటే చాలా కష్టమవుతోంది. అందువలన నిబంధనల ప్రకారం పనులు చేపట్టలేకపోతున్నారు. దీంతో వేతనాలు అరకొరగా వస్తున్నాయని చెబుతున్నారు. సోంపేట మండలంలో... సోంపేట మండలంలోని సుమారు 15 పంచాయతీల్లో ఫిష్ పాండ్ పనులు మొదలుపెట్టగా అన్నిచోట్ల వేతనదారులు పనులు చేయలేమని చేతులెత్తేశారు. ప్రస్తుతం జింకిభద్ర గ్రామంలో కూడా చేయమని చెప్పేయడంతో ఫిష్ పాండ్ పనులు ఏ పంచాయతీలోనూ పూర్తవ్వని పరిస్థితి నెలకొంది. జింకిభద్ర గ్రామంలో సుమారు 120 మంది వేతనదారులు కొత్త చెరువులో ఫిష్ పాండ్ పనులు చేపడుతున్నారు. మొదటి రెండు వారాలు సరాసరి రూ.200ల వేతనాన్ని అందుకున్నారు. తర్వాత వారం నుంచి వేతనం తక్కువగా వస్తుందని శనివారం పనులకు వెళ్లకుండా నిరసన తెలిపారు. ఫిష్ పాండ్ పనులు చేపడుతుంటే కనీస వేతనం రూ.150లు కూడా అందడం లేదని వాపోతున్నారు. అందుకే ఫిష్‌పాండ్ పనులు చేపట్టకుండా నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఇటీవల ప్రభుత్వం కూలీ రేటును రూ.300ల నుంచి రూ.307లకు పెంచింది. కానీ ఎండలో ఫిష్‌పాండ్ పనులు చేస్తుంటే రూ.150లు కూడా రావడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల మేరకే వేతనం ప్రభుత్వ నిబంధనలు మేరకు కొలతలు కొలిచి వేతనం వేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేర పనులు చేపడితే పూర్తిస్థాయిలో వేతనం అందుతుంది. మట్టి గట్టిగా ఉండడంతో వేతనదారులు పనులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – ప్రమీల, ఉపాధి ఏపీవో, సోంపేట -
టీచర్లకు అన్యాయం చేయొద్దు
శ్రీకాకుళం న్యూకాలనీ: బదిలీల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు అన్యాయం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్, జిల్లా అధ్యక్షుడు వడమ శరత్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి సోరి ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞిప్తి చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పించిన స్టడీ లీవ్ జీవో నంబర్ 342 ప్రకారం ఇన్ సర్వీస్ బీఈడీ చేస్తున్నారని, రెండు నెలల్లో తిరిగి విధుల్లో చేరబోతున్నారని చెప్పారు. కానీ ఇటీవల విద్యాశాఖ చేపడుతున్న బదిలీల్లో వారు పనిచేస్తున్న పాఠశాల పోస్టును క్లియర్ వేకెన్సీగా చూపడం సరికాదన్నారు. వారు పనిచేస్తున్న ప్లేస్‌ను వారికే కేటాయించేలా చూడాలని విన్నవించారు. -
ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు
● ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇషాన్ బాషా నరసన్నపేట: జల జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇషాన్ బాషా తెలిపారు. శనివారం నరసన్నపేట వచ్చిన ఆయన స్థానిక ఆర్డబ్ల్యూఎస్ డీఈ కార్యాలయంలో నరసన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా జిల్లాలో రూ.813 కోట్లు విలువైన 1,793 పనులను ప్రభుత్వం రెన్యూవల్ చేసిందన్నారు. రెన్యూవల్ పనుల్లో 1,546 పనులకు టెండర్లు పిలిచామని, వీటిలో 800 పనులకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి టెండర్లు వేశారని వివరించారు. మరో 746 పనులకు టెండర్లు రావాల్సి ఉందన్నారు. వీటికి కూడా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తే జిల్లాలో దాదాపుగా జల జీవన్ పథకంతో ఇంటింటికీ తాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 5.34 లక్షల గృహాలు ఉన్న ట్లు లెక్కలు ఉన్నాయని, వీటిలో 2.12 లక్షల గృహాలకు కుళాయిలు వేయడం జరిగిందన్నారు. వచ్చే మార్చి నాటికి కనీసం మరో 2 లక్షల గృహాలకు కుళాయిలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గొట్టా నుంచి నీటి సరఫరాకు ప్రతిపాదనలు ప్రస్తుతం గొట్టా బ్యారేజీ నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని, ఇది విజయవంతంగా రన్ అవుతోందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాలు శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల ప్రజలకు కూడా గొట్టా బ్యారేజీ నుంచి తాగునీటి సరఫరాకు రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీంట్లో మొదటి విడతగా రూ.900 కోట్లతో నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలకు అనుమతుల రావొచ్చని పేర్కొన్నారు. కాగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో ప్రస్తుతం మొదటి ఫేజ్‌లో రూ.5.15 కోట్లతో జల జీవన్ పనులు జరుగుతున్నాయని, రెండో ఫేజ్‌లో మిగిలిన భాగాలకు కుళాయిలు వేయడానికి రూ.9.06 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి నరసన్నపేటలో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ రంగ ప్రసాద్, డీఈ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలు తప్పిన పనులు..!
చర్యలు తీసుకోవాలి అండర్ టన్నల్ వే పనుల్లో నాణ్యతా లోపాలు కళ్లకు అద్దినట్లు కనిపిస్తున్నాయి. రైల్వేశాఖ అధికారులు పర్య వేక్షణ చేసి సంబంధిత గుత్తే దారులపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే మరి న్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. – సూర శ్యామ్‌కుమార్, కనుగులవలస గ్రామం ఇబ్బందులను తొలగించాలి అండర్ టన్నల్ వే నిర్మాణ పనులు పూర్తిచేసి నెలలు గడవకముందే రాళ్లు తేల డం దారుణం. అనేక మంది ద్విచక్ర వాహనదారులు బోల్తాపడి గాయపడుతున్నారు. వర్షం వస్తే నీరు నిల్వ అవుతుండడంతో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా రైల్వేశాఖాధికారులు అండర్ టన్నల్ వే వద్ద నిర్వహణ చర్యలు తీసుకోవాలి. – పి.రామేష్, ఆమదాలవలస ఆమదాలవలస రూరల్: రైల్వేశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా పనుల్లో డొల్లతనం కళ్లకు అద్దినట్లు కనిపిస్తోంది. అయినా రైల్వేశాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తనట్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమదాలవలస మండలంలోని కనుగులవలస, పొందురు మండలంలోని పెనుబర్తి వద్ద జరిగిన అండర్ టన్నల్ వే నిర్మాణ పనులు అధ్వానంగా ఉన్నాయి. రైల్వేగేట్లు మూసివేసే ప్రాంతంలో రైల్వేశాఖ ఈ అండర్ టన్నల్ వే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. రైల్వేట్రాక్ కింద చేసిన నిర్మాణ పనులతో పాటు ఇరువైపులా చేపట్టిన నిర్మాణ పనులు కోసం ఒక్కో అండర్ టన్నల్ వేకు సంబంధించి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు రైల్వేశాఖ ఖర్చు చేసింది. అయితే నాణ్యతకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ కరువవ్వడంతో పనులు పట్టాలు తప్పాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో తప్పని ముప్పు రైల్వేగేట్లు బదులుగా ట్రాక్ కింద నుంచి పలు భారీ వాహనాలతో పాటు అనేక వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఈ అండర్ టన్నల్ వే పనులు రైల్వే శాఖ చేపట్టింది. రైల్వేశాఖకు సంబంధించి అండర్ టన్నల్ వే పైనున్న ట్రాక్ నుంచి నిత్యం అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత భారమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వేశాఖ ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టినా నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. లేకుంటే రైలు ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయని చెప్పడానికి ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాదాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాహనదారులకు ఇబ్బందులు అండర్ టన్నల్ వే పనులు పూర్తిచేసి మూడు నెలలు గడవకముందే రాళ్లు తేలుతుండడంతో నిత్యం ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. టన్నల్ వే వద్ద రహదారి పై రాళ్లు తేలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ద్విచక్ర వాహనాలు బోల్తాపడి పలువురు గాయాలబారిన ఇటీవల పడ్డారు. దీంతో అధికారులు ఇప్పటికై నా స్పందించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైల్వే నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్ల అండర్ టన్నల్ వే పనుల పర్యవేక్షణ కరువు నెలలు గడవక ముందే రాళ్లుతేలిన వైనం వాహనదారులకు తప్పని తిప్పలు -
అపార్ట్మెంట్ నిర్మాణంపై జేసీకి ఫిర్యాదు
నరసన్నపేట: స్థానిక ఇందిరానగర్‌లో కో–ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణ పనులు గురించి జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ దృష్టికి పంచాయతీ సర్పంచ్ బి.శంకర్, వార్డు సభ్యులు కేసీహెచ్‌బీ గుప్త, బీఎల్ శర్మ, ఆర్.శ్రీధర్‌లు తీసుకెళ్లారు. శనివారం జేసీ నర సన్నపేట పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ నిర్మాణ పనులకు అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా పనులు జరుగుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయనకు తెలియజేశారు. సుడా షార్ట్‌ఫాల్‌లో పెట్టి స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. దీనికి జేసీ స్పందించి వెంటనే సుడా అధికారులకు తన మొబైల్ నుంచి మెసేజ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మరోపక్క సుడా ఇచ్చిన స్టాప్ ఆర్డర్ ప్రకారం పనులు నిలిపివేయాల్సింది పంచాయతీ ఈవోనే అని సుడా అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రత్యేక జీవో ఉందని చెబుతున్నారు. అలాగే మరో వార్డు సభ్యుడు బోయిన సతీష్, స్థానిక నాయకులు తాలాభక్తుల గోవిందరావు, రామకృష్ణలు హోల్డ్‌లో ఉన్న బొరిగివలస రెవెన్యూ పరిధిలోని 18/1 సర్వే నంబర్‌ను సరిచేయాలని కోరారు. దీనివలన నరసన్నపేటలో 13 వీధులకు చెందిన ప్రజలు క్రయవిక్రయాలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే స్థానిక లెపర్సీ కాలనీలో మంచినీటి సమస్య ఉందని భాగ్యం, లక్ష్మిలు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈవోకు ఆదేశించారు. -
గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని తోటపాలేం గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన దీర్ఘాసి ఈశ్వరరావు (50) సైకిల్ మీద వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న స్కూటర్ ఈనెల 7వ తేదీన ఢీకొంది. దీంతో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వరరావు శనివారం మృతి చెందారు. ఆస్పత్రి వర్గాలు నివేదిక ఆధారంగా ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో జవాన్ మృతి ఆమదాలవలస: మున్సిపాలిటీలోని ఆరో వార్డు టి.మన్నయ్యపేటకు చెందిన గొద్దు మోహనరావు (46) అనే బీఎస్ఎఫ్ జవాన్ గుండెపోటుతో మరణించాడు. న్యూఢిల్లీ లోని బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే తోటి సైనికులు మోహనరావును సమీపంలోని ఆస్పత్రికు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం ఆయన మృతదేహం ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు, అక్కడ నుంచి స్వగ్రామానికి చేరుకోనుంది. మోహనరావుకు భార్య సంధ్య, కుమార్తె జాస్మిని, కుమారుడు శశాంక్ ఉన్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పశువుల వాహనం స్వాధీనం ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం నుంచి విశాఖప ట్నం వైపు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం రాత్రి చిలకపాలేం సమీపంలో జాతీయ రహదారిపై పట్టుకున్నారు. 25 పశువులు అక్రమంగా తరలిస్తుండడంతో వాహనం సీజ్ చేశా రు. పశువులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. పశువులను సంరక్షణ కోసం విజయనగరం గోశాలకు తరలించినట్లు ఎస్ఐ సందీప్‌కుమార్ తెలిపారు. ఏపీఈఏపీ సెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రం యూనిట్‌గా నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్–2025 (ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెలవు రోజుల్లో మినహా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ముందుగా 19, 20 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్ష నిర్వహిస్తారు. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు చేపడతారు. జిల్లాలో నాలుగు ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిప్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిప్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిప్టులో పరీక్షలు నిర్వహిస్తారు. అధికారులు ఈ మేరకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ, చిలకపాలేంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ, టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్‌లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి ఎంపీసీ, బైపీసీ స్ట్రీముల్లో 18,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు నుంచే అనుమతిస్తారు. గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య కాశీబుగ్గ: పలాస మండలంలోని లొత్తూరు పంచాయతీ తొసరాడ గ్రామానికి చెందిన సవర వసంతి (22) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇంటి వద్ద వసంతి ఖాళీగా ఉండడంతో తల్లి సవర మహాలక్ష్మి ఏదైనా పనిచేసుకోవాలని సూచించారు. దీంతో కోపంతో శుక్రవారం గడ్డిమందు తాగింది. దీంతో హుటాహుటిన పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి
పొందూరు: ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డ పోరంబోకు స్థలాలు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. మండలంలోని తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 5లో వీరమరణం పొందిన సైనికులకు ఇవ్వనున్న స్థలాన్ని శనివారం పరిశీలించారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో వీరమరణం పొందిన సింగూరు విష్ణుమూర్తి సతీమణి శాంతకు తోలాపిలో 2.5 ఎకరాలు స్థలం కేటాయించారు. అయితే ఆ స్థలంలో చెరువు గర్భం ఉండడంతో దీనిని రద్దు చేశారు. తనకు భూమి కేటాయించాలని సింగూరు శాంత ఉన్నతాధికారులకు వినతి అందించడంతో సెక్రటేరియట్ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో బొట్లపేట సర్వే నంబర్ 5లో స్థల పరిశీలన చేశారు. ఆమెకు పట్టా, పాస్‌బుక్‌లు సిద్ధం చేయాలని తహశీల్దార్ ఆర్.వెంకటేష్‌ను ఆదేశించారు. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025మాకొద్దు బాబోయ్..! ఉపాధి వేతనదారులు ఫిష్‌పాండ్ పనులపై నిరాసక్తత చూపుతున్నారు. తక్కువ వేతనం వస్తోందంటూ పనులు నిలిపివేస్తున్నారు. –8లోపట్టాలు తప్పిన పనులు..! రైల్వే నిర్మాణ పనుల్లో నాణ్యత కరువైంది. అండర్ టన్నల్ వే వద్ద రాళ్లుతేలడంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. –8లోశ్రీకాకుళం కల్చరల్: డాబా గార్డెన్స్ అంటే విశాఖలోని ప్రాంతం అనుకునేరు. జిల్లా కేంద్రంలోనూ ఓ డాబా గార్డెన్ ఉంది. మేడపై తోటను అందంగా సాగు చేసుకుంటూ ఈ దంపతులు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. నగరంలోని బలగ వద్ద గల సత్యసాయి నగర్లో నివాసం ఉంటున్న పంతులు శశిభూషణరావు, మంజుల వాణి దంపతులు తమ డాబాను మొక్కలతో నింపి గార్డెన్‌గా చేసుకున్నారు. మంజుల వాణి గత ఏడాది తన తోటలో కొత్తగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను రెండు డబ్బాలలో వేశారు. ఈ నెలలో 12 డ్రాగన్ ప్రూట్స్ ఒకేసారి వచ్చాయి. ఇంకా 15 రెడీగా ఉన్నాయి. డ్రైఫ్రూట్స్ మొక్కలలో అంజీరా, స్టార్ ప్రూట్స్, గ్రీన్ బెర్రీ రకాలు సాగు చేస్తున్నారు. 20 రకాల మొక్కలు మంజుల వాణి తన ఇంట్లో ఆదెనియం (బోన్సాయి) 10 రకాల పూల మొక్కలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించి పెంచుతున్నారు. ఇంకా జామ, మనీప్లాంట్, కాక్టస్ ప్లాంట్, జాస్మిన్ డ్రాగన్ ప్రూట్స్, షోయింగ్ ప్లాంట్స్, క్రోటన్ మొక్కలు పెంచుతున్నారు. ఇందులో బీరపాదు, బెండ, ఆనపపాదు, దొండపాదు, డ్రమ్ స్టిక్స్ రకాల కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి. పూల మొక్కలలో గులాబీ రకాలు, చామంతి, బంతి, మల్లె, కనకాంబరాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తుంటారు.న్యూస్రీల్మన డాబా గార్డెన్ జిల్లా కేంద్రంలో మేడపై తోట పెంచిన దంపతులు వివిధ రకాల మొక్కలతో కనువిందు -
పడేస్తారా?
మృతదేహాలను ముద్దల్లా ● ఆందోళనకు దిగిన క్వారీ ఘటన బాధిత కుటుంబ సభ్యులు ● పోస్టుమార్టానికి తరలించకుండా నిరసన ● న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్, ఎస్పీ మెళియాపుట్టి : దబ్బగూడ కొండపై క్వారీ (మౌనీస్ కూనపు రెడ్డి)లో శుక్రవారం జరిగిన ఘటన పిడుగు పాటు కాదని, పేలుడు వల్లే తమవారు మృతి చెందారంటూ బాధిత కుటుంబసభ్యులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం మూడు గంటల వరకు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించడానికి నిరాకరించారు. తమకు న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి నిమిషాల వ్యవధిలో తరలించడం వెనుక కుట్ర ఉందనీ, కొన్ని శరీరభాగాలను కొండ మీదనే విడిచిపెట్టి, మిగతా శరీర భాగాలను కిందకు తీసుకురావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతులు అప్పన్న, రాము, ఆర్ముగంల భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులు శనివారం క్వారీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాము కుమారుడు షణ్ముఖరావు మాట్లాడుతూ మృతదేహాలను బొలెరో వాహనంలో ముద్దగా పడేశారని, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడటం తగదన్నారు. ఆర్ముగం భార్య జయంతి మాట్లాడుతూ కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయామని, ఎలా బతకాలంటూ విలపించారు. కనీసం మానవతా దృక్పథం లేకుండా మృతదేహాలను బొలెరోలో పడేశారనీ, తమకు తెలియకుండా గొయ్యితీసి పాతేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. పిడుగుపాటుతో బ్లాస్టింగ్ జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నామని, ఘటనా స్థలంలో మృతదేహాలు ఉంచకుండా తరలించడం సరైన చర్యకాదని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు సేకరించి క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. సాయంపై మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడతానని చెప్పా రు. న్యాయం చేసేందుకు పూర్తి బాధ్యత తనదేనని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అనంతరం టెక్కలి జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పాతపట్నం సీఐ రామారావు తెలిపారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, మైన్స్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటానికి మద్దతు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఐక్య పోరాటానికి ఏపీసీపీఎస్ఈఏ (ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్) సంఘం పూర్తి మద్దతు ఇస్తోందని సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వి.వి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలపై కనీస చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. అధికారులను టార్గెట్ చేయడం తగదు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని, ఈ విషయంలో ఓటర్లకు సమాధానం చెప్పలేని స్థితిలో పాలకులు ఉన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పథకాల అమలును గాలికొదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట వైఎస్సార్ సీపీ నేతలతో పాటు సీనియర్ ఐఏఎస్, విశ్రాంత అధికారులను కూడా టార్గెట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను జైల్లలో పెట్టించారని మండిపడ్డారు. అధికారులను వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇదే విధానం కొనసాగితే ఏ ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కూడా రాష్ట్రంలో పనిచేయడానికి ముందుకు రారని చెప్పారు. కూటమి ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. 15 మంది యాత్రికులకు డయేరియా టెక్కలి రూరల్: కర్ణాటక నుంచి బస్సులో తీర్థయాత్రకు వెళ్లి తిరిగి స్వస్థలాలకు వస్తున్న పలువురు యాత్రికులు డయారియా బారిన పడ్డారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో సుమారు 15 మంది వాంతులు, విరో చనాలతో బాధపడుతూ టెక్కలి జిల్లా ఆస్పత్రి లో చేరారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది ప్రథమ చికిత్స అందించి డయేరియా వార్డులో చేర్పించారు. మొత్తం 50 మంది అయోధ్య, కాశీ వంటి క్షేత్రాలను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. అక్కడ వైద్యపరీక్షలు చేయించుకుని కొందరు రైలులో తమ ప్రాంతానికి వెళ్లిపోయారు. మిగిలిన వారు బస్సులో బయలుదేరి వస్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చేసరికి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తు తం ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. జిల్లాలో కొత్త అగ్నిమాపక కేంద్రాలు టెక్కలి రూరల్ : ఇచ్ఛాపురం, సోంపేట, బొబ్బిలి, పాలకొండ తదితర ప్రాంతాల్లో నూతనంగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం రీజనల్ అగ్నిమాపకాధికారి నిరంజన్ రెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం టెక్కలి అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు. పరికరాలు, వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందిలో ఎక్కువ శాతం మంది హోంగార్డులే ఉన్నారని, వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా ఫైర్ ఇంజిన్లు కొనుగోలు చేయనున్నామని చెప్పారు. అనంత రం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్ ● నిధుల్లేక ఎక్కడికక్కడ ఆపేయమన్న ప్రభుత్వం ● తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రుణాల జోలికెళ్లొద్దని మౌఖిక ఆదేశం ● వెనకబడిన వర్గాలకు మరోసారి నిరాశ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెనకబడిన వర్గాలకు మరోసారి నిరాశ తప్పలేదు. బీసీ, ఈబీసీల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మరో ఏడాది తాత్సారం చేసే పరిస్థితి కనిపిస్తోంది. సబ్సిడీ కింద మంజూరు చేయాల్సిన నిధుల్లేక.. అవసరం మేరకు నిధులు విడుదల చేయలేక ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను ఎక్కడికక్కడ ఆపేయాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు చర్యలు చేపట్టొద్దని సూచనప్రాయంగా చెప్పింది. ఇప్పటికే అరకొర యూనిట్ల కేటాయింపు, ఆపై నేతల జోక్యంతో తలలు పట్టుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇవ్వడంతో కొన్నాళ్లు ఒత్తిళ్లు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. మాటలే.. చేతల్లేవ్.. రాష్ట్రంలో అత్యంత వెనకబడిన జిల్లా.. 90 శాతం మేర వెనుకబడిన వర్గాలు ఉన్న ప్రాంతం శ్రీకాకుళం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని.. ఆలోపు రూ.3వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ఎన్నికల వేళ ప్రగల్బాలు పలికిన కూటమి నాయకులు పదవిలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పక్కన పెడితే విధిగా ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలనూ ఎగ్గొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వెనకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిస్తామని తొలుత హడావుడి చేశారు. దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ.. బ్యాంకు అధికారులు, ఇతర శాఖల అధికారులతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలే ఫైనల్ చేసే పరిస్థితి ఏర్పడింది. భారీగా దరఖాస్తులు.. అరకొరగా యూనిట్లు.. జిల్లాలో ఎక్కువగా వెనకబడిన వర్గాల వారే ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా మనకే అధికంగా రుణ యూనిట్లు కేటాయించాలి. కానీ, ప్రభుత్వం కేవలం 3,144 యూనిట్లే కేటాయించింది. 50 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి, ఈ యూనిట్లు ఎటూ సరిపోవు. కానీ, తక్కువ యూనిట్లు కారణంగా ప్రభుత్వం దరఖాస్తుల సమయంలోనే అనేక ఆంక్షలు పెట్టింది. చివరికి 22,822 మంది దరఖాస్తు చేసుకోగలిగారు. వారందరికీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. తుది ఎంపిక మాత్రం ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయింది. అధికారులపై ఒత్తిళ్లు.. ప్రభుత్వం కేటాయించిన 3144 యూనిట్లకు గాను సబ్సిడీ కింద సుమారు రూ.60 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. సబ్సిడీ నిధులు రాకపోవడంతో బ్యాంకులు ముందుకు రాలేదు. బీసీ కార్పొరేషన్ అధికారులు సైతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈలోపు దరఖాస్తుదారుల నుంచి ఒత్తిళ్లు, నేతల నుంచి సిఫార్సుల తాకిడి పెరగడంతో ఉక్కిరిబిక్కిరియ్యారు. చివరికి ప్రభు త్వం సబ్సిడీ నిధులు ఇచ్చాక చూసుకుందామనే ఆలోచనకు వచ్చేశారు. నిధుల్లేక రుణాలకు బ్రేక్.. తాజాగా రుణాల మంజూరు విషయంలో ముందుకెళ్లొద్దని ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఎక్కడికక్కడ ఆపేయాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. సబ్సిడీ కింద నిధులు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు అరకొర యూనిట్లతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది బీసీ, ఈబీసీలకు రుణాలు వస్తాయా? అన్న దానిపై సందేహాలు కమ్ముకున్నాయి. -
హైవేపై హాహాకారాలు
● లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు ● విశాఖకు చెందిన ఏడుగురు యాత్రికులకు గాయాలు ● అదే సమయంలో ప్రమాదానికి గురైన మరో లారీ ● క్యాబిన్లో చిక్కుకుని డ్రైవర్ దుర్మరణం శ్రీకాకుళం రూరల్: జాతీయ రహదారిపై శనివారం వేకువజామున హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు, అటువైపుగా వెళ్తున్న వాహనచోదకులు భీతిల్లిపోయారు. తొలుత టూరిస్ట్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టగా.. కొద్దిసేపటి తర్వాత అదేచోట ఆగి ఉన్న లారీలను మరో గ్రానైట్ లారీ ఢీకొట్టింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనల్లో ఓ డ్రైవర్ మృతి చెందగా, ఏడుగురు యాత్రికులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని సింగుపురం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం సమీపంలో శనివారం వేకువజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో విశాఖపట్నం నుంచి బరంపురం వెళుతున్న కంభమేశ్వరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రమాదం ధాటికి ఏడుగురు ప్రయాణికులు బస్సులోనే గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసు లు అప్రమత్తమై హైవే అంబులెన్స్‌కు సమాచా రం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభించింది. ఇదే రహదారిలో వరుసగా నాలుగు లారీలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విశాఖ వైపు నుంచి కోటబొమ్మాళికి గ్రానైట్ రాళ్లతో వస్తున్న లారీ.. ముందు ఆగి ఉన్న లారీలను గమనించక అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో గ్రానైట్ రాళ్లు క్యాబిన్ వైపునకు దూసుకురావడంతో అందులో చిక్కుకుని లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని విశాఖ జిల్లా సబ్బవరం గ్రామానికి చెందిన రాపర్తి నూకరాజు(38)గా గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద సమయంలో లారీలు ఒకదానితో ఒకటి కలిసిపోవడంతో అతి కష్టమ్మీద మృతుడిని బయటకు తీశారు. టౌన్ సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్సై రాము ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. నుజ్జయిన గ్రానైట్ లారీ ముందుభాగం -
ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఏదీ?
హిరమండలం: వంశధార ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేయగా.. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శనివారం హిరమండలంలో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌తో పాటు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనంతరం టీడీపీ ప్రభు త్వం నిర్వాసితులకు అన్యాయం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే అదనపు సాయం అందిందని గుర్తుచేశారు. దాదాపు 97 శాతం పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిచేసిందని.. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది కావస్తున్నా మిగిలిన మూడు శాతం పనులు పూర్తిచేయకుండా తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌కు కీలకమైన ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. 2022 సెప్టెంబరు 14న అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికిగాను రూ.176.35 కోట్లు మంజూరు చేశారని, ఏడాది కాలంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 33 శాతం పనులు పూర్తిచేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 7 శాతం పనులు మాత్రమే పూర్తిచేసిందన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మీసాల వెంకట రామకృష్ణ, నాయకు లు లోలుగు లక్ష్మణరావు, వి.చిన్నారావు, వి.చిరంజీవి, ఎం.రామారావు, ఎల్.ప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, బి.మురళి, వి.బాలరాజు, ఎన్. ఆనందరావు, మామిడి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆగ్రహం -
డెంగీ నిర్ధారణకు ఎలీసా టెస్టు
అరసవల్లి: డెంగీ వ్యాధి నిర్ధారణకు ఎలీసా పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయించుకో వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సంద ర్భంగా శుక్రవారం ఉదయం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా డెంగీ జ్వరాలపై ప్రజల్లో అవగాహన రావాలని, అలాగే అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇదే క్రమంలో డెంగీ నివారణ కోరుతూ అవగాహన ర్యాలీని జిల్లా వైద్యా రోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత జెండా ఊపి ప్రారంభించగా, కలెక్టర్‌తో పాటు అధికారులంతా కలిసి ర్యాలీగా ఏడు రోడ్ల కూడలి వరకు వెళ్లి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ బడులను పరిరక్షించాలిశ్రీకాకుళం న్యూకాలనీ: పూటకో ఆలోచన.. రోజుకో నిర్ణయాలతో సాగుతున్న విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని, ప్రభుత్వ బడులను పరిరక్షించాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చందనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్థానంలో 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండేలా చూడాలన్నారు. ప్రతిపాదిత మోడల్ ప్రాథమి క పాఠశాలలకు పీఎస్‌హెచ్‌ఎంలను నియ మించాలని, ఎస్జీటీలకు పీఎస్‌హెచ్‌ఎంలుగా ప దోన్నతులు కల్పించాలని, ఎస్ఎంసీ తీర్మానం లేకుండా మెర్జింగ్ చేయకూడదని పేర్కొన్నారు. -
తమ్ముళ్లకు కాసుల వాన..
అటు మరమ్మతుల రోడ్లు, ఇటు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన రోడ్లు.. తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపించాయి. దాదాపు రూ.185కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఉపాధి రోడ్లలో ఏ రకంగా నిధులు మింగేశారో జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు. బాగున్న రోడ్లపై కొన్ని చోట్ల రోడ్లు వేయగా, మరికొన్నిచోట్ల నాసిరకం రోడ్లు వేసి నిధులు స్వాహా చేశారు. ఇంకొన్నిచోట్ల అయితే ఏకంగా నాయకుల పొలాలకు, ఫాంహౌస్‌లకు, కొబ్బరితోటలకు, రియ ల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసుకుని లబ్ధిపొందారు. సొంత అవసరాలకు, స్వప్రయోజనాలకు రోడ్లు వేసుకుని ఉపాధి నిధులను దుర్వినియోగం చేశారు. ఇదే విధంగా మరమ్మతుల కింద ఖర్చు చేసిన రూ.31 కోట్ల రోడ్ల నిధులను సైతం కొల్లగొట్టారు. వర్క్ ఏదైనా సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకుని పథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో రోడ్డు మరమ్మతులు భలే గమ్మత్తుగా సాగుతున్నాయి. తెలుగు తమ్ముళ్లే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తడంతో పనుల్లో నాణ్యత గంగలో కలిసిపోయింది. మరమ్మతులే కదా.. పనులు ఎలా చేసినా ఫర్వాలేదనుకుని నాసిరకంగా చేశారు. దీంతో మరమ్మతులు చేసిన కొన్ని రోజులకే మళ్లీ రోడ్లు పాడైపోయి నరకం చూపిస్తున్నాయి. ఉమ్ముతడి పనులతో టీడీపీ కాంట్రాక్టర్ల జేబులు నిండాయే తప్ప రోడ్లు బాగు పడలేదు. రూ.31కోట్ల పనులపై నాసిరకం ప్రభావం.. జిల్లాలో రూ.31కోట్లతో 938 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేపడుతున్నట్టు యంత్రాంగం ప్రకటించింది. పనులన్నీ దాదాపు పూర్తి చేసినట్టు రిపబ్లిక్ డే రోజున ప్రకటించడం కూడా జరిగింది. అయితే మరమ్మతులు చేసిన రోడ్లను ఒకసారి పరిశీలిస్తే అంతకుముందు.. తర్వాత పరిస్థితులకు ఏ మాత్రం తేడా కనబడటం లేదు. మరమ్మతులు చేపట్టకముందు ఎలా ఉన్నాయో ఇప్పుడలానే దర్శనమిస్తున్నాయి. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లే ఆ పనులు దక్కించకోవడంతో నిధులు గోల్మాల్ అయ్యాయి. అడిగే వారు ఉండరని తాము చేసేవే పనులని ఇష్టారీతిన చేపట్టారు. నాసిరకం మెటీరియల్, నాణ్యత లేని పనులు చేసి రోడ్లకు ఎప్పటిలాగే కష్టాలు మిగిల్చారు. మంత్రి అనుచరుడు, ఎమ్మెల్యేల మనుషులే దాదాపు కాంట్రాక్టర్ల అవతారమెత్తి నాసిరకం పనులతో నిధులు స్వాహా చేసేశారు. మరమ్మతుల పనులపై క్వాలిటీ చెక్ ఉండదు, అధికారులు సైతం పెద్దగా పట్టించుకోరని ఇష్టారీతిన కానిచ్చేశారు. ఇంకేముంది ఇప్పుడా రోడ్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మరోసారి మరమ్మతులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. -
తనయుడికి తలకొరివి పెట్టిన తల్లి
సంతబొమ్మాళి: కన్న కొడుక్కి తల్లి తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సుగ్గువానిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆకాశలక్కవరం పంచాయతీ సుగ్గువానిపేట గ్రామానికి చెందిన పైల శాంతారావు (22) అనే యువకుడు 15 రోజుల క్రితం వరికోత మిషన్‌తో కలిసి లారీలో వలస కూలీగా రాజమండ్రి వెళ్లారు. వరి కోతలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద డ్రైవర్ నిద్ర వస్తుందని వాహనం ఆపి నిద్రపోయారు. శాంతారావు డ్రైవర్‌కు చెప్పకుండానే లారీ కింద నిద్రపోయాడు. ఇతనిని గమనించని డ్రైవర్ గురువారం వేకుజామున లారీ తీయడంతో శాంతారావు పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చారు. తండ్రి లేకపోవడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తలకొరివి పెట్టారు. రోడ్డు ప్రమాదంపై నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమాదైనట్లు పోలీసులు తెలిపారు. -
నల్లి ధర్మారావుకు సాహితీ పురస్కారం
శ్రీకాకుళం కల్చరల్: కవి, రచయిత, జర్నలిస్టు నల్లి ధర్మారావుకు విశాఖపట్నానికి చెందిన ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య, సాంస్కృతిక సంస్థ అవార్డు ప్రకటించింది. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం పురస్కారానికి ధర్మారావును ఎంపిక చేశారు. ఈ నెల 18న ఉదయం 10గంటలకు విశాఖ సిటీ లైబ్రరీలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ధర్మారావు కళింగాంధ్రా చరిత్ర, సంస్కృతి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అనేక వ్యాసాలు రాశారు. ఇప్పటికే గుర్రం జాషువా అవార్డు, రావి రంగారావు సాహిత్య పీఠం అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, దూసి ధర్మారావు అవార్డు వంటివి అందుకున్నారు. తాజాగా మరో సాహితీ పురస్కారం వస్తున్నందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆశల దీపం ఆరిపోయింది
తమ్ముడిని బాగా చదివించాలని ఆశ పడ్డాడు. చెల్లెలిని చక్కగా చూసుకోవా లని ఎన్నో కలలు కన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. 22 ఏళ్ల చిన్న వయసులోనే మృత్యువు అతడిని తీసుకెళ్లిపోయింది. అంతర్ రాష్ట్ర రహదారిపై జమ్ము సమీపంలోని శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సారవకోట మండలం బురద కొత్తూరుకు చెందిన జరజాన సమీర్ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో గడ్డెయ్యపేట జగనన్న కాలనీకి చెందిన చౌదరికి గాయాలయ్యాయి. బురదకొత్తూరుకు చెందిన సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పొందూరు వద్ద ఒక గ్రామంలో బంధువుల ఇంటిలో గురువారం పెళ్లికి వెళ్లి శుక్రవారం ఉదయం తిలారులో ట్రైన్ దిగి జమ్ము వచ్చాడు. అక్కడే సమీప బంధువు ప్రశాంత్ ఇంట్లో టిఫిన్ చేసి ప్రశాంత్ బైక్‌పై కల్లట గ్రామానికి బయల్దేరాడు. అక్కడ తన మేనత్త జ్యోతి 12 రోజుల కార్యానికి వెళ్లమని తండ్రి చెప్పడంతో బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగా వెనక నుంచి చౌదరి అనే వ్యక్తి బైక్‌పై సమీర్‌ను ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో బైక్‌లు ఒకదానికి ఒకటి తాకడంతో బళ్లు అదుపు తప్పాయి. దీంతో మందాలమ్మ గుడి వద్ద ఆగి ఉన్న లారీని సమీర్ బలంగా ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. చౌదరికి కాలు విరిగింది. నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తండ్రి శ్రీను ఇచ్చిన ిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. – నరసన్నపేట -
మాతా శిశు మరణాలు తగ్గాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాతా శిశు మరణాల రేటు తగ్గాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో జరిగిన 12 శిశు మరణాలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఎంహెచ్ఓ కె.అనిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రాందాస్, డీపీహెచ్ఎన్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
ఎచ్చెర్ల: లావేరు మండలం పెద్దకొత్తకోట ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లో ఈ నెల 3న చోరీకి గురైన 2 తులాల 3 గ్రాముల బంగారం వస్తువులు, ఇత్తడి వస్తువులను రికవరీ చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. అదపాక గ్రామానికి చెందిన ముద్దాయి పిన్నింటి చంద్రరావు (పోలారావు) పాత కుంకాం గ్రామంలో మామిడితోటలో కాపలాగా ఉండేవాడు. తోడల్లుడు, మరో వ్యక్తితో కలిసి ఈ నెల 3న పెద్దకొత్తకోట గ్రామానికి వెళ్లి దొంగతనం చేశారు. డీఎస్పీ వివేకానంద ఆదేశాల మేరకు సీఐ అవతారం, లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు, సిబ్బంది రంగంలోకి దిగి క్లూస్‌టీం ఇచ్చిన సమాచారంతో చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రరావు వద్ద ఇత్తడి సామాన్లు, అతని భార్య, మరదలు వద్ద బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చంద్రరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదపాకలో పాత నేరస్తులు చాలా మంది నేరాలు చేయడం మానేసి కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారని, కానీ కొందరు తిరిగి నేరాలు చేయడం ప్రారంభించారని చెప్పారు. దీనివల్ల గ్రామానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇలాంటి వ్యవహారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయనతో పాటు లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
పాత నేరస్థులపై నిఘా
టెక్కలి: టెక్కలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా వేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం టెక్కలి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో దత్తత కానిస్టేబుల్, మహిళా పోలీసుల సమన్వయంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సీఐ విజయకుమార్, సిబ్బంది ఉన్నారు. కానిస్టేబుల్‌కు వడదెబ్బ కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యుగంధర్ శుక్రవారం బందోబస్తు విధుల్లో ఉండగా ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుప్పకూలిన ఉపాధి వేతనదారుడు టెక్కలి: సీతాపురం పంచాయతీ వలియాసాగరం గ్రామంలో శుక్రవారం ఉపాధి పని చేస్తున్న పైల ధనుంజయరావు ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ధనుంజయరావును టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఏపీఓ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని వేతనదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే పంచాయతీలో ఇటీవల క్షేత్ర సహాయకుడి తొలగింపు విషయంలో రాజకీయం ప్రమేయం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్చార్జి క్షేత్ర సహాయకుడు నియామకం విషయంలో మండల స్థాయి అధికారులు జిల్లా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేశారంటూ పలువురు వేతనదారులు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనతో సీతాపురం పంచాయతీ ఉపాధి హామీ పనుల్లో మరోసారి రచ్చ చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నరసన్నపేట నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తున్న లాగేజ్ వ్యాన్ హరిశ్చంద్రాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఎన్.ఉమా, పి.లోకేష్‌లకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట శిబిరంపై దాడి
రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల పంచాయతీ కొమరవానిపేట సమీప తోటల్లో శుక్రవారం పేకాట ఆడుతున్న ఏడుగురిని జె.ఆర్.పురం పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.12,400 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. బాణసంచా దుకాణంలో చోరీ ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఇబ్రహింబాద్ పంచాయతీ పరిధిలో కింతలి రోడ్డులో ఉన్న ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ (మందుగుండు సామగ్రి దుకాణం)లో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఓ వ్యక్తి క్యాష్ కౌంటర్లో ప్రవేశించి తాళాలు పగల కొట్టి లాకర్లోని నగదు చోరీ చేశాడు. రూ.10 వేలు వరకు నగదు ఉంటుందని యజమానులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం షాపు వద్దకు వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో యజమాని వావిలపల్లి శ్యామలరావు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 100 లీటర్ల నాటుసారా స్వాధీనం సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం 100 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి సీఐ జీవీ రమణ తెలిపారు. మండలంలోని బకుడ గ్రామంలో సవర లక్ష్మి వద్ద 70 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని రాగుపురం గ్రామంలో 30 లీటర్ల నాటు సారాతో నర్తు హేమరాజును అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సుజాత సిబ్బంది పాల్గొన్నారు. -
స్లాట్.. చాలా లేట్!
● టైమ్ స్లాట్ విధానంతో రిజిస్ట్రేషన్లకు తప్పని పాట్లు ● గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భూ క్రయవిక్రయదారుల ఆవేదన ఇచ్ఛాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా తీసుకొచ్చిన టైమ్ స్లాట్ విధానంతో భూమి కొనుగోలు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్ఛాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే భూక్రయ, విక్రయదారులు తాము నమోదుచేసుకున్న సమయానికంటే ముందుగానే చేరుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముందుగానే స్లాట్ కోసం ఫీజు చెల్లించి సమయం నమోదు చేసుకోవాలని, ఆ సమయానికి తమలో ఎవరు లేకపోయినా, నెట్వర్క్ సరిగా పనిచేయకపోయినా, డాక్యుమెంట్ సరిగా లేకపోయినా, ఆలస్యం జరిగినా రిజిస్ట్రేషన్ జరగడం లేదని చెబుతున్నారు. స్లాట్ మొదటిసారి రిజిస్ట్రేషన్ ఉచితం అయినా పని జరగడంలేదని, రెండో సారి స్లాట్ నమోదుకు రూ.200 కాగా, మూడోసారి నమోదుకు రూ.800 ఫీజు చెల్లించాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో భోజన విరామం వల్ల కొంత సమయం పోతుందని, ఫలితంగా రోజుకు ముప్పై రిజిస్ట్రేషన్లు వరకు మాత్రమే జరుగుతున్నట్టు చెబుతున్నారు. గతంలోఇలా ఉండేదికాదని, ఎన్ని రిజిస్ట్రేషన్లైనా సాఫీగా జరిగిపోయేవని అంటున్నారు. ఇచ్ఛాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని 23 వార్డులు, ఇచ్ఛాపురం మండలంలోని 21 పంచాయతీలతోపాటు కవిటి మండలంలోని 23 పంచాయతీలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతుండటం వల్ల స్లాట్ నమోదు కష్టమవుతున్నట్టు డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. వివాహ రిజిస్ట్రేషన్లకు తప్పని పాట్లు ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్‌కార్డుల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సైతం స్లాట్ విధానం తిప్పలు తప్పడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జత చేయాలని నిబంధన విధించడంతో రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చిన్న పిల్లలతో కలిసి ఎండలోనే కూర్చుంటూ బారులు తీరుతున్నారు. నిబంధనల మేరకే.. ప్రభుత్వ నిబందనల మేరకే భూ, వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. స్లాట్ విధానంలో ఆన్లైన్లోనే జరుగుతుంది. నిర్దేశిత సమయానికి సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. – కె.తవిటినాయుడు, సబ్ రిజిస్ట్రార్, ఇచ్ఛాపురం -
రైతు ఆత్మహత్యలపై చర్యలేవీ..?
కంచిలి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఆత్మహత్యలపై ప్రభుత్వ చర్యలు లేకపోవడంపై తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సంయుక్త కార్యదర్శి వీఎస్ కృష్ణ ప్రశ్నించారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కంచిలి మండలంలోని పెద్దకొజ్జిరియా గ్రామంలో శుక్రవారం పర్యటించారు. అనంతరం కంచిలిలో విలేకరులతో మాట్లాడారు. ఈ గ్రామానికి చెందిన కౌలు రైతు బల్లెడ నర్సింహమూర్తి ఏప్రిల్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడని, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు. ఇతనికి ఇంత వరకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సాయం అందలేదని, కనీసం రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో త్రిసభ్య కమిటీతో విచారణ కూడా చేపట్టలేదని వెల్లడించారు. ఇలాంటి ఆత్మహత్యలు జరిగితే ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీలు విచారణ చేపట్టి, కలెక్టర్‌కు నివేదిక పంపిస్తే, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే వారం రోజుల్లో రూ.7లక్షలు పరిహారాన్ని మృతుని కుటుంబానికి ఇవ్వాలని జీఓ ఉందని కృష్ణ గుర్తు చేశారు. వ్యవసాయ మంత్రి జిల్లాలోనే రైతు ఆత్మహత్యలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. జిల్లాలో గత తొమ్మిదేళ్లలో 17 ఆత్మహత్యలు జరిగాయని, కవిటి, కంచిలి, నందిగాం, పలాస ప్రాంతాల్లో నాలుగు ఆత్మహత్యలు జరిగాయని రాష్ట్ర రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో–కన్వీనర్ బాలు అన్నారు. పెద్దకొజ్జిరియా కౌలు రైతు, మృతుడు బల్లెడ నర్సింహమూర్తి 12 ఎకరాలు వరకు జీడిమామిడి కౌలుకు తీసుకొని నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. కొత్త ప్రభుత్వం ఆత్మహత్య కేసులను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్దానంలో కిడ్నీ మరణాలతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండడం బాధాకరమన్నారు. పంటలను వేధిస్తున్న తెల్లదోమ నివారణకు కూడా యంత్రాంగం చర్యలు తీసుకోలేదన్నారు. అన్నదాత సుఖీభవ ప్రస్తావన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో మానవ హక్కుల వేదిక విశాఖపట్నం జిల్లా ప్రతినిఽధి కె.అనురాధ, మానవహక్కుల వేదిక అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బీన ఢిల్లీరావు, మరో నేత తామాడ అరుణ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీఎస్ కృష్ణ -
పనులు పూర్తయ్యేనా?
సగం భూమి పోయింది.. తాతలతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి 3 ఎకరాలు. ఇందులో ఎకరాన్నర భూమి రిజర్వాయర్‌లో కలిసి పోయింది. ఇల్లు పోయింది. 2008లో ఎకరాకు రూ.2.30 లక్షలు ఇచ్చారు. అవి అప్పుడే ఖర్చయిపోయాయి. ఉన్న భూమి వదల్లేను. ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదు. – దాసరి తాతారావు, రైతు, రేగులపాడు, పలాస మండలం వచ్చే ఏడాదికి నీరు నిల్వ వచ్చే ఏడాది జూన్‌కల్లా ఆఫ్‌షోర్‌లో 0.521 టి.ఎం.సిలు నీటిని నిల్వ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆఫ్‌షోర్ సామర్ధ్యం 1.864 టి.ఎం.సిలు. అందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. రోజుకు 8000 క్యూబిక్ మీటర్ల మట్టిపనిని చేస్తున్నాం. ఇప్పటి వరకు 45 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. – బి.శేఖరబాబు, ఈఈ, వంశధార ప్రాజెక్టు పలాస: మండలంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎప్పటికప్పుడు పనులు ప్రారంభించడం.. కొన్నాళ్లు కొనసాగడం.. తర్వాత నిలిచిపోవడంతో పరిపాటిగా మారింది. అరకొర నిధులు నేపథ్యంలో ఈసారి కూడా పనులు పూర్యయ్యేది అనుమానమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్వద్ద ఎర్త్‌బండ్ పనులు జరుగుతున్నాయి. 17 ఏళ్లుగా కొనసాగుతూ.. రేగులపాడు నుంచి నందిగాం, మెళియాపుట్టి మండలాలకు ఆర్.ఎం.సి, పలాస మండలానికి ఎల్.ఎం.సి కాలువల ద్వారా మొత్తం 24,500 ఎకరాలకు సాగునీరు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు 2008లో రూ.128 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులకు రూ.456 కోట్లు అంచనా వేశారు. అయినా పనులు మాత్రం జరగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2021లో ఈ పనులకు రూ.850 కోట్లు అంచనా వేసి పనులు ప్రారంభించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసాలు కల్పించారు. రిజర్వాయర్ సంబంధించిన పనులు కూడా కొంతమేర జరిగాయి. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓటాన్ అకౌంట్ బడ్జెటులో రూ.30 కోట్లు కేటాయించారు. తాజాగా ఇప్పుడు మరో రూ.90 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఎర్త్ బండ్ పనులు ప్రారంభమయ్యాయి. మెళియాపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయ నది నుంచి వరద కాలువను 13.6 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులో 7 కిలోమీటర్ల పని పూర్తి చేశారు. మిగిలినది అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం ఎర్త్ బండ్ పనులతో పాటు కుడికాలువ మెయిన్ కెనాల్ పనులతో పాటు వరదకాలువలో డీవాటరింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు, సుమారు 17 ఏళ్లు పూర్తవుతున్నా నిర్వాసితుల సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుతో పాటు నిర్వాసితుల సమస్యలు ఎప్పటికి పూర్తవుతాయో వేచి చూడాల్సిందే. ఎట్టకేలకు ఆఫ్‌షోర్ పనులు పునఃప్రారంభం అంచనాలు పెరగడమే తప్ప పూర్తికాని వైనం ఎక్కడికక్కడే నిర్వాసితుల సమస్యలు -
క్యాట్ ఫలితాల్లో జయశంకర్ ప్రతిభ
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బి.ఆర్.నగర్‌కు చెందిన యజ్జల జయశంకర్ కృష్ణ ఇటీవల వెలువడిన క్యాట్(సీఏటీ) ఫలితాలలో జాతీయ స్థాయిలో ఆరో స్థానం సాధించి ప్రతిష్టాత్మకమైన ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) ముంబై క్యాంపస్‌లో సీటు సాధించాడు. ఈ యువకుడు ఆంధ్ర యూనివర్సిటీలో 2024లో బీటెక్ డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడై ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగానికి సైతం ఎంపికయ్యాడు. అయితే ఐఐఎంలో చదవాలనే కోరికతో ఉద్యోగాన్ని వదులుకుని, తాజాగా సీటు సాధించినట్లు తెలిపాడు. తండ్రి వరప్రసాదరావు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ –1 ఈఓగా, తల్లి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. దివ్యాంగులకు ఉపాధి కల్పనపై దృష్టి శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి 12 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజా, డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుధా, బీసీ కార్పొరేషన్ అధికారి గడ్డెమ్మ, విభిన్న ప్రతిభావంతులు శాఖ ఏడీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు. -
మురపాకలో నాలుగు పూరిళ్లు దగ్ధం
ఎచ్చెర్ల: లావేరు మండలం మురపాకలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గార రాములమ్మ, లావేటి లక్ష్మీ, మామిడి ఈశ్వరరావు, లావేటి రాములమ్మలకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాన్లు, రూ.70 వేలు నగదు, బంగారం కాలిపోయాయి. అందరూ ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ముందుగా లావేటి రాములమ్మ ఇంటివద్ద మంటలు చెలరేగి వరుసగా ఉన్న ఇల్లు కాలిపోయాయి. స్థానిక యువత స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపుచేశారు. లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ప్రతినిధి పెయ్యిల లక్ష్మణరావు నాలుగు ప్యాకెట్లు బియ్యం, రూ.2 వేలు తక్షణ సహాయం అందించారు. ఎంపీటీసీ ప్రతినిధి తేనెల సురేష్, స్థానిక నాయకులు మడ్డి కనకయ్య, జల్లేపల్లి శారది తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. -
నకిలీ బిల్లులపై విచారణేదీ?
జిల్లాలో నాలుగైదు పర్యాయాలు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నకిలీ బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న లారీలు పట్టుబడ్డాయి. జాయింట్ కలెక్టర్ దగ్గరి నుంచి సీఐ స్థాయి అధికారి వరకు నకిలీ బిల్లుల బాగోతాన్ని కళ్లారా చూశారు. దొరికినాక రెండు రోజులు సంబంధిత లారీలను పట్టుకుని, ఆపై మైనింగ్ అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు నకిలీ బిల్లుల సృష్టికర్త ఎవరు? ఎక్కడి నుంచి నకిలీ బిల్లులు వస్తున్నాయి? ఏ డివైజ్ నుంచి నకిలీ బిల్లులు సృష్టించారు? ప్రభుత్వం జారీ చేసిన బిల్లుల మాదిరిగా నకిలీ బిల్లులు ఉండటం వెనక కారణమేంటి? దీనికంతటికీ వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఏమిటీ? ఇలా లోతుగా విచారణ చేసిన దాఖలాలు కనిపించలేదు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుండగా.. అక్రమార్కులు రూ.వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. -
వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..
● తాళి కట్టిన శుభవేళ.. శ్రీకాకుళం న్యూకాలనీ/ గార/కంచిలి/ శ్రీకాకుళం రూరల్/ సోంపేట/ జలుమూరు/సారవకోట/ బూర్జ: ఏపీఈసెట్–2025 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఏపీఈసెట్ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. 92.97 శాతం మంది అర్హత.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లా ఏపీఈసెట్–2025 ఫలితాల్లో 92.97 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షలకు జిల్లా నుంచి 1671 మంది దరఖాస్తు చేసుకోగా.. 1621 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 92.97 శాతం ఉత్తీర్ణతతో 1507 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో బాలురు 1049 మంది, బాలికలు 458 మంది ఉన్నారు. బాలురు91.94శాతం అర్హత సాధించగా, బాలికలు 95.42 శాతం మంది అర్హత సాధించి మరోసారి బెటర్ అనిపించారు. ● అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో జిల్లాలోని గార మండలం అంపోలుకు చెందిన డి.నళిని 112 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఆమె తండ్రి శ్రీనివాసరావు, కుటుంబసభ్యులు అంతా వ్యవసాయదారులే. తాను భవిష్యత్‌లో వ్యవసాయ శాస్త్రవేత్త అవుతానని ఆమె తెలిపారు. ● బయోటెక్నాలజీ విభాగంలో సోంపేట బనిశెట్టి వీధికి చెందిన దాసరి భవానీ శంకర్ 53 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచారు. తల్లిదండ్రులు దాసరి కృష్ణారావు, గోపి. విద్యార్థి డిప్లమో పూర్తి చేసి విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ● కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో కంచిలి మండలం జాడుపూడి సమీపంలోని బసవపుట్టుగకు చెందిన కె.శరత్‌కుమార్ 164 మార్కులతో స్టేట్ 9వ ర్యాంకు సాధించాడు. తండ్రి కండ్రెడ్డి రాజారావు ఎలక్ట్రీషియన్, తల్లి ఢిల్లమ్మ గృహిణి. ● ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో బూర్జ మండలం కంతలాంకు చెందిన కింజరాపు ప్రతాప్ 149 మార్కులతో స్టేట్ 6వ ర్యాంకు సాధించాడు. తండ్రి మురళి మృతి చెందడంతో తల్లి లత వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ చదివించారు. ● ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో బూర్జ మండలం పెద్దపేటకు చెందిన వి.మనోజ్‌కుమార్ 148 మార్కులు సాధించి స్టేట్‌లో 8వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తండ్రి అనంతరావు వ్యవసాయ కూలి, తల్లి దశరత్నం గృహిణి. ● అదే విభాగంలో శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగిలోని గొండువీధికి చెందిన గొండు భానుప్రసాద్ 147 మార్కులతో 9వ ర్యాంకు సాధించాడు. ● ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగంలో పొందూరు మండలం గోకర్నపల్లికి చెందిన శీపాన హేమప్రియ 101 మార్కులు సాధించి స్టేట్ 2వ ర్యాంకుతో సత్తాచాటింది. ఈమె తల్లి సీపాన జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తండ్రి ప్రభాకరరావు మృతి చెందారు. ● అదే విభాగంలో సారవకోట మండలం నౌతలలోని పెద్దవీధికి చెందిన ఆర్.హేమలత 91 మార్కులతో స్టేట్ 7వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సుధారాణి, డిల్లేశ్వరరావులు కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించారు. ● జలుమూరు మండలం గొటివాడ గ్రామానికి చెందిన గురువు బాలకృష్ణ ఈసెట్‌లో మెకానికల్ విభాగంలో పదో ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు గౌరమ్మ, శ్రీనివాసరావులు వ్యవసాయ కూలీలు. ● ఫార్మసీ విభాగంలో ఆమదాలవలసలోని ఐజే నాయుడుకాలనీకి చెందిన కూన భార్గవి 109 మార్కులతో స్టేట్ 3వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించింది. తండ్రి నర్సింగరావు సాధారణ పనులు చేస్తూ పువ్వుల వ్యాపారం చేస్తుంటారు. తల్లి రమణమ్మ గృహిణి. ఈమె పెళ్లి చేసుకున్నాక చదువు కొనసాగిస్తున్నారు. ర్యాంకు సాధించేందుకు భర్త రమేష్‌కుమార్, అత్తమామలు సహకారం అందించారని తెలిపారు. 1279106389 1621 మంది పరీక్ష రాయగా 92.97 శాతంతో 1507 మందికి అర్హత ఈసారి బాలికలదే పైచేయి -
బాపిరాజుపేట అంగన్వాడీ సహాయకురాలు తొలగింపు
పొందూరు: బాణాం పంచాయతీ పరిధిలోని బాపిరాజుపేట అంగన్వాడీ సహాయకురాలు బి.సుగుణను కలెక్టర్ ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగించినట్లు గురువారం సీడీపీఓ ఎస్.అనురాధ తెలిపారు. అంగన్వాడీ సహాయకురాలు సుగుణ పదో తరగతి చదవకుండానే తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగంలో చేరినట్లు ఆమదాలవలస నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సువ్వారి గాంధీ, బాపిరాజుపేటకు గ్రామానికి చెందిన సూర కిరణ్‌లు కలెక్టర్ గ్రీవెన్స్‌లో గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి పదోతరగతి ధ్రువపత్రం సమర్పించాలని సహాయకురాలిని అధికారులు కోరారు. ఆమె సర్టిఫికెట్ చూపించకపోవడంతో ఉద్యో గం నుంచి తొలగించారు. తడిచిన మొక్కజొన్న నరసన్నపేట: మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా మొక్కజొన్న రైతులకు అవస్థలు తప్పలేదు. ఎండిన మొక్కజొన్న గింజలు విక్రయానికి సిద్ధంగా ఉంచగా వర్షానికి తడిచిపోయాయి. దీంతో గురువారం మళ్లీ ఎండబెట్టారు. కోమర్తి నుంచి యారబాడు వరకూ కిలోమీటరు పొడవున మొక్కజొన్న గింజలు రోడ్డుపై ఒక భాగంలో ఎండ బెట్టారు. నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల స్వాభిమాన్ వినతులు స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌కార్యాలయంలో నిర్వహించనున్నట్టు జిల్లా విభి న్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు వారి సమస్యలను విన్నవించుకోవాలని సూచించారు. ‘దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): భవన నిర్మాణ కా ర్మికుల సంక్షేమ పథకాలను, లేబర్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి జమ చేయాలని కోరుతూ మే 20 న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం డైమండ్ పార్క్ దగ్గర భవన నిర్మాణ కార్మికులకు సమ్మె కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేసి, పోస్టర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికలలో టీడీపీ కూటమి హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమత్రి పవన్ కల్యాణ్ అమలుచేయడానికి పూనుకోకపోవడం అన్యాయమన్నారు. యాత్రికులకు అస్వస్థత ● మృతి చెందిన వృద్ధురాలు ఇచ్ఛాపురం: తీర్థయాత్రకు బయల్దేరిన చిత్తూరు వాసులకు విషాదం ఎదురైంది. యాత్రికులు అస్వస్థతకు గురి కాగా ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా, పె ద్ద పంజాని మండలం పరిధి లో గోనుమాకన్నపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన 46 మంది ఓ ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా ఈ నెల 8న తీర్థయాత్రలకు బయల్దేరారు. దారిలో స్వయంగా భోజనాలు సిద్ధం చేసుకుని తినేవారు. కాశీ, అయోధ్య దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 13న సాయంత్రం ఒడిశా స మీపించేసరికల్లా వీరిలో 30 మందికి వాంతు లు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుర య్యారు. గురువారం ఇచ్ఛాపురం చేరుకునేసరికి ఇంకా ఎక్కువ మంది అస్వస్థతకు గుర య్యారు. దీంతో వీరు స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరారు. వీరిలో పిచ్చుగల్లు మునిలక్ష్మమ్మ (69) ఆస్పత్రికి వచ్చేలోపే చనిపోయారని వైద్యులు పి.దేవేంద్రరెడ్డి తెలిపారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వా రు కోలుకుంటున్నారు. మృతురాలి సోదరి గంగులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేశారు. -
ఆకట్టుకున్న పప్పెట్రీ
టెక్కలి: టెక్కలి ప్రజా చైతన్య కళా సమితి భవన్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా గురువారం చేపట్టిన పప్పెట్రీ ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు డీఏ స్టాలిన్, ఆర్.వి.రమణమూర్తి, మోహన్ గౌడు ఆధ్వర్యంలో బొమ్మలతో అభినయం చేస్తూ కథలు ప్రదర్శన చేశారు. పులి బంగారం కడియం, మిత్రలాభం–మిత్రభేదం తదితర పంచతంత్ర కథలను ప్రదర్శన ద్వారా పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎం.పద్మనాభరావు, గణపతిరావు, ఎం.తాతయ్య, పి.హరిశ్చంద్రరావు, టి.భాస్కరరావు, కృష్ణారావు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
శ్రీకాకుళం రూరల్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినక ర్ పుండ్కర్ అన్నారు. సంసిద్ ఆదర్శ్ గ్రామ యోజ నలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండల పరిధి లోని నైరా గ్రామంలో గురువారం పర్యటించారు. స్థానిక సచివాలయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్థక శాఖలపై సమీక్షించారు. స్థానిక రైతు లు పండిస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధిపై ఆరా తీశారు. పాడిపంటలు, వ్యవసాయ ఉత్పత్తులు మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీడీఓ బి.శైలజ, నైరా సర్పంచ్ అరవల రామ్‌ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏఈపై కలెక్టర్ ఆగ్రహం.. ఎలక్ట్రికల్ ఏఈపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో సూర్యఘర్ పథకానికి ఎన్ని కనెక్షన్లు ఏర్పాటు చేశారని, విద్యుత్ కెపాసిటీ, ప్రతిపాదనలు ఏమేరకు నిర్వహించారని ప్రశ్నించగా ఏఈ సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఏఈని సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాభసాటి ఉత్పత్తులపై దృష్టి సారించండి నైరా గ్రామ సందర్శనలో కలెక్టర్ -
రూ.కోట్లు వృథా.. తీరని వ్యధ!
● చుక్కనీరివ్వని కడగండి రిజర్వాయర్ ● రైతులకు తప్పని ఇక్కట్లు ● స్పందించని పాలకులు, అధికారులు కడగండి జలాశయంకు కుడి, ఎడమ కాలువల నిర్మా ణం పూర్తయితే ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి మండలా ల్లోని 580 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఎడమ కాలువ పరిధిలో ఎల్.ఎన్.పేట మండలం జంబాడ, వలసపాడు, బొర్రంపేట, ముంగెన్నపాడు, కరకవలస, మల్లికార్జునపురం, శ్యామలాపురం, కుశమల పాడు రెవెన్యూ గ్రామాల్లోని పంట భూములకు సాగునీరు అంతుంది. కుడి కాలువ పరిధిలో ఎల్.ఎన్.పేట మండలం వలసపాడు, బొర్రంపేట, జంబాడ, సరుబుజ్జిలి మండలంలోని గోనెపాడు, అమృతలింగానగరం, బప్పడాం, సరుబుజ్జిలి, కూనజమ్మన్నపేట తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. కడగండి రిజర్వాయర్ ఎల్.ఎన్.పేట : కడగంటి జలాశయం.. రెండు మండలాల రైతుల చిరకాల స్వప్నం. ఈ జలాశయం నిర్మాణం పూర్తయి రెండు దశాబ్దాలు కావస్తున్నా కుడి, ఎడమ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో కళ్ల ఎదుటే నీరు వృథాగాపోతున్నా ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో రైతులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులకు, అధికారులకు వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే వారేరీ? ఎల్.ఎన్.పేట మండలం జంబాడ–బొర్రంపేట గ్రామాల మధ్య కొండల మధ్య నుంచి కడగండి గెడ్డ ప్రవహిస్తుంటుంది. కొండల్లో కుండపోతగా వర్షం కురిస్తే కడగండి గెడ్డ వారం పాటు నిండుగా ప్రవహిస్తూ దిగువ ప్రాంతానికి వృథాగా వెళ్లిపోతుంది. ఈ నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు అందిస్తే వంద ల ఎకరాలు సశ్యశ్యామలం అవుతాయని, రెండు పంటలను పండించుకోవచ్చని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జూలై 20న జలయజ్ఞంలో భాగంగా ‘నీటి పారుదల శాఖ ప్రత్యేక పరిశోధనా విభాగం, ఐఆర్‌డీఎఫ్–9’లో రూ.195.16 లక్షలు (సుమారు రూ.2కోట్లు) నిధులు మంజూరు చేశారు. 580 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 81 ఎకరాల్లో చేపట్టిన జలాశయం నిర్మాణం పనులు 2007 నాటికి పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ నిర్మాణం కోసం 2008లో టెండర్లు పిలిచారు. భూసే కరణ చేయకపోవటంతో కాలువ పనులు నిలిచిపోయాయి. 2009లో వైఎస్సార్ మరణానంతరం రిజర్వాయర్‌ను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. నిధులున్నా నిర్లక్ష్యం.. రిజర్వాయర్‌కు కుడి, ఎడమ కాలువల నిర్మాణంతో పాటు రైతుల వద్ద సేకరించి భూమికి పరిహారం చెల్లించాలని రైతులు అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో గతంలో రూ.4.06 కోట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.1.45కోట్లు భూసేకరణ కోసం, రూ.1.72 కోట్లు, కాలువల నిర్మాణం కోసం మిగిలిన నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. రిజర్వాయర్ లోపలి భాగంలో భూములు ముంపు బారిన పడుతున్నాయని, వాటిని ముంపు నుంచి తప్పించేందుకు గట్టు పెంచేందుకు రూ.89 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన పనులు గాలికి వదిలేశారు. 580 గ్రామాలకు సాగునీరు.. ఇప్పటికై నా స్పందించాలి.. కడగండి జలాశయం నిర్మా ణం పనులు పూర్తి చేసి 20 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు సెంటు భూమికి కూడా చుక్కనీరు అందలేదు. రిజర్వాయ ర్ నిండినా నీరు వృథాగా పోతుంది. దిగువన పంట భూములు నీట మునిగి రైతులు నష్ట పోతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కాలువల పనులు పూర్తి చేయాలి. – మామిడి నీలంనాయుడు, రైతు, బొర్రంపేట, ఎల్.ఎన్.పేట -
రైలు ఢీకొని యువకుడికి గాయాలు
కాశీబుగ్గ: కాశీబుగ్గ ఎల్సీ గేట్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేడు జాబ్‌మేళా శ్రీకాకుళం న్యూకాలనీ : నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నెహ్రూ యువకేంద్రం ప్రాంగణం వేదికగా శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, నవత ట్రాన్స్‌పోర్టులో వివిధ ఉద్యోగాల భర్తీకి 18 నుంచి 46 ఏళ్ల సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. టెన్త్‌క్లాస్ పాస్/ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చదివిన వారు ఉదయం 10 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని కోరారు. -
చనిపోయిన వ్యక్తికి సీపీఆర్
శ్రీకాకుళం క్రైమ్ : గత నెల 29న రోడ్డు ప్రమాదాని కి గురై మెడికవర్ ఆస్పత్రిలో చేరిన రణస్థలం మండలం కొండములగాం గ్రామానికి చెందిన కొండ్రు త్రినాధరావు (32) చికిత్స పొందుతూ మృతి చెంది నప్పటికీ ఆ విషయం బయటకు చెప్పకుండా చికిత్స పేరుతో లక్షలు రూపాయలు కట్టించుకుని మోసం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరో పించారు. ఈ మేరకు బాధిత యువకుడి బంధువు లు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఒకటో, రెండో పట్టణ సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, ఆమ దాలవలస సీఐ సత్యనారాయణ, ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్, శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము, ఆమదాలవలస ఎస్ఐ, స్పెష్ల్బ్రాంచి, ఇంటెలిజెన్సు పోలీసులు ఆసుపత్రి వద్ద మోహరించారు. అంతకుముందు బాధితులు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా దళిత ఐక్య వేదిక కమిటీ సభ్యుడు నందేశ్వరరావు మాట్లాడు తూ యువకుడు చనిపోయినా విషయం చెప్పకుండా మందులు, వైద్యం పేరిట రూ.లక్షల్లో కట్టించుకోవడం దారుణమన్నారు. మృతుడి తల్లి తవిటమ్మ మాట్లాడుతూ డబ్బులు కట్టించుకుని అన్యాయంగా తన బిడ్డను చంపేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మృతుడి తండ్రి అప్పారావు మాట్లాడుతూ ఇన్ని రోజులూ ఫర్వాలేద ని చెప్పారని, తీరా దగ్గరికి వెళ్లి చూశాక కొడుకు చనిపోయారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబీకురాలు ఉష మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేశారని ఆరోపించారు. నాలు గు లక్షలు ఖర్చయ్యిందని, కలెక్టర్, ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని కోరారు. మృతుడి కుటుంబీకుల ఆరోపణ గ్రామస్తులతో కలిసి ఆస్పత్రి ఎదుట ధర్నా -
రైతు రుణాలకు.. ముప్పుతిప్పలు
● అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తేనే రెన్యువల్ సాధ్యమంటున్న బ్యాంకర్లు ● రెన్యువల్ కాకుంటే జీరోవడ్డీ దక్కదేమోనని ఆందోళనలో అన్నదాతలు ● కూటమి ప్రభుత్వంలో నిబంధనలపై మండిపాటు ఇదీ పరిస్థితి.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4,10,847 మంది రైతులకు రూ.5246.55 కోట్లు పంట రుణాలుగా అందించాలని లక్ష్యం కాగా రూ.5054కోట్లు మంజూరు చేశారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తీసుకున్న ఈ పంట రుణాల రెన్యువల్ ప్రక్రియలో తీసుకున్న అసలుతో పాటు వడ్డీ రూ.50 కోట్ల వరకు రైతులు చెల్లించాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో సాఫీగా ప్రక్రియ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ప్రతి ఏటా రైతు భరోసా పథకం ఠంచన్‌గా అందేది. పంట రుణాల రెన్యువల్ సమయంలోనూ వడ్డీ కడితే రెన్యువల్ సులభంగా జరిగిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పంట రుణం గుదిబండగా మారింది. ఏడాది లోపల రెన్యువల్ చేసుకోకపోతే పెనాల్టీ వడ్డీ కట్టుకోవాలి. ఫలితంగా జీరో వడ్డీ పథకం వర్తించదు. దాంతో పాటు సదరు రైతు డిఫాల్టర్‌గా మారి సివిల్ రేటింగ్ దెబ్బతింటుంది. ఇప్పటిౖకైనా ప్రభు త్వం స్పందించి రైతు రుణాల మంజూరు విషయంలో ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు. కవిటి: ఖరీఫ్ సీజన్ ఆరంభం కాకముందే అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. పంట రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులకు ఊహించ ని షాక్‌లు ఎదురవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాం 2024 మార్చి 31 వరకు లేని ఆంక్షలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మాదిరిగానేవడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకుందామని బ్యాంకులకు వెళ్లిన రైతులకు అలా కుదరదంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. అసలు, వడ్డీ రెండూ కడితేనే రెన్యువల్ చేస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఉసూరుమంటూ రైతులు వెనుతిరుగుతున్నారు. గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను అప్పుల కోసం ప్రాధేయపడుతున్నారు. వారం పది రోజులకు నూటికి రూ.3 నుంచి రూ.5ల వరకు వడ్డీకి తీసుకొ ని ఆ సొమ్మును బ్యాంకులకు కడుతున్నారు. పోనీ కట్టిన వెంటనే డబ్బులు ఇస్తున్నారంటే అది లేదు. బ్యాంకులో ఆ సొమ్ము ఒకరోజు క్రెడిట్‌గా ఉంచాల్సి ఉంటుందని, డబ్బుల కోసం మరుసటి రోజు రావా లని బ్యాంకర్లు సూచిస్తున్నారు. దీనికితోడు రుణం డబ్బులు విత్ డ్రా చేయడానికి చెక్‌బుక్ అవసరమని చెబుతుండడంతో దానికీ తిప్పలు తప్పడం లేదు. బ్యాంకు నుంచి రూ.49,000 పైబడి డబ్బులు తీసుకోవడానికి పాన్‌కార్డు కూడా ఉండాలని చెబుతుండటంతో ఇవేం పాట్లు అంటూ ఆవేదన చెందుతున్నారు. -
అపస్మారక స్థితిలో విశ్రాంత ఉద్యోగి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం ఓ ప్రయాణికుడు దుస్తులు లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు గమనించారు. వెంటనే కాంప్లెక్స్ ఔట్‌పోస్ట్ హెచ్‌సీ ఎన్.శ్రీనివాసరావుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన వచ్చి పక్కనే ఉన్న దుస్తులను పరిశీలించగా ఆధార్‌కార్డు, ఫోన్ నంబరు లభించాయి. వాటి ఆధారంగా కంచిలి మండలం పెద్దపోలేరు గ్రామానికి చెందిన తులసీదాస్ వెంకటస్వామి మల్లపురెడ్డిగా గుర్తించా రు. విశ్రాంత ఉద్యోగి అని, కుటుంబ సభ్యులు ముంబైలో ఉంటున్నట్లు తెలుసుకుని వారికి సమా చారం అందించారు. ఇటీవల కంచిలి మండలం పెద్దపోలేరులో జరిగిన పండగలకు వచ్చి తిరుగు ప్రయాణంలో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించి 108 రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ సెక్యూరి టీ గార్డు జి.రామారావు తదితరులు ఉన్నారు. -
ముగిసిన పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ పీజీ సెట్ –2025 దరఖాస్తులు స్వీకరణ గడువు ముగిసింది. మా ర్చి 31న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రూ. 2000 అదనపు రుసుముతో ఈ నెల 20 వరకు, రూ. 4000 అదనపు రుసుము తో 24 వరకు, రూ.10,000 అదనపు రుసుము తో 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీరిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు కూడా ఏపీ పీజీసెట్ – 2025 ద్వారానే నిర్వహిస్తారు. నేడు డెంగీ అవగాహన ర్యాలీ అరసవల్లి: జాతీయ డెంగీ నివారణ దినోత్స వం సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాల యం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న ట్లు జిల్లా మలేరియా నివారణాధికారి పి.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత బృందం ఈ ర్యాలీని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఏడు రోడ్ల కూడలి లో ప్రతిజ్ఞ అనంతరం కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. రైలు ఢీకొని ఆవు మృతి టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డులో రైల్వే గేటు సమీపంలో గురువారం రైలు ఢీకొని ఆవు మృతిచెందింది. గుణ్‌పూర్ నుంచి పూరి వైపు వెళ్తున్న రైలు టెక్కలి సమీపంలోకి వచ్చేసరికి పట్టాలపైకి ఆవు రావడంతో ఈడ్చుకుపోయింది. ఈ క్రమంలో ట్రైన్ ఇంజిన్‌కు చెంది న కొన్ని భాగాలు సైతం విరిగి పడ్డాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. టెక్కలి ఎంజేపీ విద్యార్థినికి ప్రశంసలు టెక్కలి: టెక్కలి ఎంజేపీ ఏపీ బాలికల పాఠశాలకు చెందిన జె.నవ్య ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ లో జరిగిన అభినందన సభలో ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పూసపాటి సుధారాణి తెలిపారు. బీసీ సంక్షేమ శాఖామంత్రి ఎస్.సవిత, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, ఎంజేపీ ఏపీ పాఠశాలల సెక్రటరీ మాధవీలత, పూర్వపు సెక్రటరీ కృష్ణమోహన్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు శివచరణ్ ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి ఎండ శివచరణ్ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యా డు. సీఎస్ఈ బ్రాంచ్ మూడో ఏడాది చదువుతున్న శివచరణ్ ఇటీవల విజయనగరం జిల్లా కొండవెలగాడలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ –23 విభాగంలో 67 కిలోల గ్రీకోరోమన్ విభాగంలో ప్రతిభ కనబర్చాడు. దీంతో ఈ నెల 17, 18 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు అర్హత సాధించాడు. విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, ఫ్యాకల్టీ, యాజమా న్య సభ్యులు గురువారం అభినందించారు. -
18 కేజీల గంజాయి పట్టివేత
కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి 18 కేజీల 550 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. గురువారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. సుజిత్ సూర్జియా అనే వ్యక్తి గుణుపూర్ నుంచి పలాస మీదుగా బరంపురం వెళ్లే ఉమా ఎక్స్‌ప్రెక్స్ బస్సుకు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. పర్లాకిమిడికి చెందిన పుస్కో పొరిచా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పొరిచా తాను ఇచ్చే గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేయమని సుజిత్ కు చెప్పగా అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో మహారాష్ట్రకు 18.550 కేజీల గంజాయిని తరలిస్తుండగా పలాసలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. సుజిత్‌తో వచ్చిన మరో ఇద్దరు పరారయ్యారు. -
పునరాలోచన చేయాలి..
నేను 10 ఎకరాల్లో కొబ్బరి, జీడి సాగుచేస్తున్నాను. గత ఏడాది రూ.2లక్షల పంట రుణం బ్యాంకులో తీసుకున్నాను. మే మూడో వారంలో రెన్యువల్ చేసుకోవాలి. రూ.రెండు లక్షల అసలు, వడ్డీ రూ.14000 కలిపి మొత్తం కడితేనే లోన్ రెన్యువల్ అవుతుందని చెబుతున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇంత భారీ మొత్తం సమీకరించడానికి ప్రైవేట్ అప్పు ఒక్కటే మార్గం. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – ఎన్ని అశోక్, రైతు, చండిపురం, కవిటి మండలం -
● విద్యుత్ శాఖకు నష్టం
అరసవల్లి: గాలుల తీవ్రతకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అలాగే పిడుగుపాటుకు శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో సుమారుగా 7 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, సుమారు 25 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా 33 కేవీ విద్యుత్ లైన్లపై హోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో అయితే 11 కేవీ విద్యుత్ లైన్లు తెగిపడటంతో తీవ్ర అంతరా యం ఏర్పడింది. ఈ ప్రభావంతో సుమారుగా రూ. 10 లక్షల వరకు విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. -
29న వైఎస్సార్సీపీ నేతలకు సన్మానం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురికి కీలకమైన బా ధ్యతలు అప్పగించారని, వారందరికీ ఈ నెల 29వ తేదీన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నేషనల్ హైవే పెద్దపాడు జిల్లా పార్టీ కా ర్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో సన్నా హక సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు పార్లమెంటరీ సమన్వయకర్తగా, పార్లమెంటరీ పరిశీలకులుగా కుంభా రవితో పాటు పలువురికి కీలకమైన పదవులు అప్పగించారని వారందరికీ సన్మానం చేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సమావేశంలో కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, యువజన విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, యువజన విభా గం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, బుక్కూరు ఉమామహేశ్వరరావుతో పాటు అంబటి శ్రీనివాస రావు, గొండు రఘురాం, ఎన్ని ధనుంజయరావు, పొన్నాడ రుషి, ఎంఏ బేగ్, వై.వి శ్రీధర్, టి.కామేశ్వరి, యజ్జల గురుమూర్తి, ఎస్.రామారావు, రాజాపు అప్పన్న, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
● అమరజవాన్‌కు నివాళి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని ఎవరూ మరువలేరని వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆర్మీ జవాన్లకు ప్రభుత్వ పరిహారం కింద రూ.50లక్షలు ఇచ్చే సంప్రదాయాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ తరఫున రూ.25 లక్షలు ఇవ్వడం అభినందనీయమన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయంలో మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల స్వీకరణకు 20 చివరి తేదీ
ఎచ్చెర్ల క్యాంపస్: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)ల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 20 చివరి తేదీ. నాలుగు క్యాంపస్‌లు శ్రీకాకుళం, ప్రకాశం, న్యూజివీడు, ఇడుపులపాయలకు కలిపి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తారు. 10వ తరగతి మార్కు లు, రిజర్వేషన్ రోస్టర్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజ్ వంటి నిబంధనలకు లోబడి ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగు క్యాంపస్‌లకు ఆన్లైన్లో ఒకే దరఖాస్తు సరిపోతుంది. ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీన మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. రేషన్.. పరేషాన్ సారవకోట: మండలంలోని బుడితి చిన్నవీధికి చెందిన రేషన్ కార్డుదారులకు గత నెల రేషన్ సరుకులు పూర్తి అందజేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీధిలో ఉన్న సుమారు 50 మంది కార్డుదారులకు రేషన్ సరుకులు గత నెల అందజేయలేదని, అలాగే గత నెలో అక్కడక్కడ ఇచ్చిన రేషన్ కార్డు దారులకు ఈ నెల లో ఒక్కో కిలో బియ్యం చొప్పున తగ్గించారని నేతింటి సూర్యనారాయణ, ముద్దాడ హేమలత, రెడ్డి ముసలయ్య, పొన్నాన తాతారావులతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. దీని పై సీఎస్‌డీటీ షరీఫ్‌కు వివరణ కోరగా గత నెలలో రేషన్ సరుకులు అందలేదని తమ దృష్టికి రాలేదని దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీఆర్డీసీలో విద్యార్థి ప్రతిభ నరసన్నపేట: స్థానిక మారుతీ నగర్‌కు చెందిన అడపా విజయ్ ఏపీఆర్డీసీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. స్థానిక సంపత్ సాయి జూనియర్ కళాశాల్లో ఇంటర్ చదివిన విజయ్ డిగ్రీలో రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివేందుకు ఎంట్రన్స్ పరీక్ష రాయగా బుధవారం ఫలితాలు వచ్చాయి. దీంట్లో విజయ్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం పొందాడు. విజయ్ తండ్రి సింహాచలం లారీ డ్రైవర్ కాగా తల్లి గృహిణి. తమ కుమారుడు ఏపీఆర్డీసీలో ర్యాంకు పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ గణపతిరావు అభినందించారు. జ్ఞానరూపేశ్కు మూడో స్థానం స్థానిక సంపత్సాయి కళాశాల విద్యార్థి జ్ఞాన రూపేష్ శర్మ ఏపీఆర్డీసీలో మూడో ర్యాంకు పొందాడు. సారవకోటకు చెందిన శర్మ తల్లిదండ్రులు కృష్ణసాయిరాం, పద్మావతి ఆనందం వ్యక్తం చేశారు. -
● కూలిన పశువుల శాల
ఎల్.ఎన్.పేట: మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి అపార నష్టం చోటు చేసుకుంది. చింతలబడవంజ గ్రామానికి చెందిన సనపల నారాయణరావు ఇంటి ముందు ఉన్న పశువుల శాలపై పిడుగు పడడంతో గోడలతో పాటు పైకప్పు రేకులతో పాటు కూలిపోయింది. ఆ సమయంలో శాలలో పాడి పశువులు లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్లికార్జునపురం వద్ద అలికాం–బత్తిలి (ఏబీ) రోడ్డు పక్కనున్న చెట్టు కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొమ్ములు పడిన కొంత సమయం తర్వాత స్థానికులు కొమ్మలు తొలగించే పనులు చేపట్టారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సిక్కోలు వాతావరణం భయపెడుతోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గాలివాన దుమారం ఊళ్లకు ఊళ్లను చుట్టేసింది. గాలుల ధాటికి మామిడి కాయలు ఎక్కువ సంఖ్యలో రాలిపోయాయి. మొక్కజొన్న, బొప్పాయి, జీడి మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస ప్రధాన మార్గంలో కల్వర్టు పనులు జరుగుతున్నందున పెద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాగోలు దాటి న తర్వాత పెట్రోల్ బంకు దగ్గరలో, కొత్త రోడ్డు ముందు చర్చి దగ్గరలో వాహనాలు కిలోమీటరు పొడవున నిలిచిపోయాయి. శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు కూడలి వద్ద పరిస్థితి● జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ● నేలకూలిన విద్యుత్‌స్తంభాలు ● వణికించిన పిడుగుపాట్లు -
● అంధకారంలో ఆస్పత్రి
కొత్తూరు సీహెచ్‌సీలో విద్యుత్ లేక పోవడంతో సెల్‌ఫోన్ వెలుతురులో ఉన్న నవజాత శిశువులుకొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం బుధవారం రాత్రి అంధకారంలో మగ్గిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న నవజాత శిశువులు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సెల్‌ఫోన్ వెలుతురుతోనే వైద్య సిబ్బంది వైద్యం అందించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ ఈదురుగాలులకు విద్యుత్ నిలిచిపోయింది. ఆస్పత్రిలో ఉన్న ఇన్వెర్టర్లు కూడా చార్జింగ్ అయిపోవడంతో ఆస్పత్రి మొత్తం చీకటిగా మారిపోయింది. జనరేటర్ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. నవజాత శిశువులకు కనీసం ఇంజెక్షన్ కూ డా ఇవ్వలేకపోతున్నారు. ఆస్పత్రి మొత్తం అంధకారంలో ఉన్నందున విష సర్పాల భయంతో రోగులు వణికిపోయారు. మరుగుదొడ్లకు నీరు లేకపోవడంతో ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ అనురాధ వద్ద ప్రస్తావించగా ఆస్పత్రికి జనరేటర్ లేదన్నారు. –కొత్తూరు -
పాలిటెక్నిక్‌లో 95.27% ఉత్తీర్ణత
● 10349 మంది పరీక్షకు హాజరు కాగా 9860 మంది పాస్ ● ఉత్తీర్ణతలో బాలికలే టాప్ శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ పాలిసెట్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్)–2025 ఫలితాల్లో శ్రీకాకుళం విద్యార్థులు హవా కనబర్చారు. బుధవారం వెలువడిన ఈ ఫలితాల్లో రికార్డు స్థాయిలో 95.27శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా నుంచి 10349 మంది పరీక్ష కు హాజరుకాగా.. వీరిలో 95.27 శాతంతో 9860 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా బాలురుతో పోలిస్తే బాలికలే బెస్ట్‌గా నిలిచారు. ఏప్రిల్ 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా (శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో) 39 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 10349 మంది హాజరయ్యారు. జిల్లా నుంచి రికార్డుస్థాయిలో 11376 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. టాపర్‌గా నిలిచిన సాయిశ్రీ.. శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు విద్యార్థులు మె రుగైన ర్యాంకులతో సత్తాచాటారు. 120 మార్కులకుగాను 119 మార్కులు సాధించిన కింతలి సాయి శ్రీ 20వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచింది. అలాగే కొల్ల మౌనిక 119 మార్కులు సాధించి 40వ ర్యాంకు సాధించి రెండోస్థానంలో నిలిచింది. వాన దివాకరరావు 118 మార్కులు సాధించి 84వ ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచాడు. జిల్లా నుంచి పాలిసెట్–2025 పరీక్ష గణాంకాలు ఇలా ఉన్నాయి.. బాలురు బాలికలు మొత్తం దరఖాస్తు చేసింది 6439 4937 11376 పరీక్ష రాసింది 5905 4444 10349 పరీక్షకు గైర్హాజరు 534 493 1027 ఉత్తీర్ణత సాధింపు 5572 4288 9860 ఉత్తీర్ణత శాతం 94.36 96.49 95.27 -
ఎక్కడి వాహనాలు అక్కడే..
● కొత్తరోడ్డు–నందగిరిపేట మధ్య ట్రాఫిక్ జామ్ ● వందల సంఖ్యలో నిలిచిన వాహనాలు ● ఎండలో ప్రజల నరకయాతన ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్ /శ్రీకాకుళం రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన శ్రీకాకుళం–పాలకొండ–పార్వతీపురం రహదారి బుధవారం స్తంభించిపోయింది. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు నాలుగు లైన్ల రోడ్లుగా ఇటీవల అభివృద్ధి చెందుతున్న ఈ రహదారిలో పలుచోట్ల కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. ఇదే క్రమంలో ఆయా గ్రామాల పరిధిలో అమ్మవార్ల పండగలు బుధవారం జరగడంతో భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా కొత్త రోడ్డు సమీపంలోని చర్చి వద్ద ఉన్న ప్రధాన కాలువ కల్వర్టు పనులు కొన్నాళ్లుగా నిలిచిపోవడంతో ఇక్కడ నిత్యం వాహనాలు నిలిచిపోతున్నాయి. రాయిపాడు జంక్షన్ వద్ద కల్వర్టు ఒకవైపు తవ్వకాలు జరపటం చర్చి వద్ద ఉన్న కల్వర్టు ప్రాంత పక్క రహదారిని మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదే రహదారి సమీపంలో ఆమదాలవలస మండలం వంజంగి, గట్టుముడిపేట గ్రామాల్లో అమ్మవారి పండుగలు నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో జనం తరలివచ్చారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి కొత్త రోడ్డు ప్రాంతం నుంచి నందగిరిపేట వరకు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. బస్సులు, లారీలు, కార్లలో గంటల తరబడి ఉండిపోయారు. ఆసుపత్రులకు రోగులను తరలించే అంబులెను్ుస్ల సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. సుమారు మూడు గంటల పాటు ద్విచక్ర వాహనచోదకులు నరకయాతన అనుభవించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రధాన రహదారిపైకి వచ్చి భారీ వాహనాలను కొత్త రోడ్డు నుంచి సింగుపురం వైపు చింతాడ మీదుగా తరలించడంతో కొంతమేర ఊరట లభించింది. -
ఆకాశవాణి ఏ–గ్రేడ్ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్
కవిటి: బెనారస్ హిందూ యూనివర్సిటీలో మృదంగం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బొంతలకోటి సత్యవరప్రసాద్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇటీవల నిర్వహించిన ఆడిషన్లో ఏ–గ్రేడ్ ఆర్టిస్ట్‌గా అర్హత సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయని సత్యవరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం కవిటి మండలం కుసుంపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నారాయణపురం ఆయకట్టుకు నిధులు మంజూరు ఎచ్చెర్ల క్యాంపస్: ఖరీఫ్‌లో సాగునీటి సమస్య పరిష్కారానికి నారాయణపురం ఆయకట్టుకు రూ.34.63 లక్షల నిధులను జలవనరులు శాఖ అధికారులు మంజూరు చేశారు. జంగిల్ క్లియరెన్స్, ఇసుక పొరల తొలగింపు, షట్టర్లు, మదుముల మరమ్మతులకు ఈ నిధులు వినియోగిస్తారు. సజావుగా సాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇసుక వాహనాలు సీజ్ కొత్తూరు: మండలంలోని అంగూరు ఇసుక ర్యాంపు(ఆకులతంపర) వద్ద బుధవారం జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నట్లు తహశీల్దార్ కె.బాలకృష్ణ తెలిపారు. నది మధ్యలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రొక్లెయిన్, జేసీబీ, లారీలు, ట్రిప్పర్లు మొత్తం ఆరు వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉపాధి వేతనదారుడికి పాముకాటు మెళియాపుట్టి: మండలంలోని చాపర పంచాయతీలో పరిధిలో బుధవారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా డోల అప్పడు అనే 60 ఏళ్ల వృద్ధుడు పాముకాటుకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ఫీల్డ్ అసిస్టెంట్ సింహాచలంకు తెలియజేయడంతో హుటాహుటిన పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి కాశీబుగ్గ/ఇచ్ఛాపురం : ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లారోడ్డు రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జి.ఆర్.పి. పోలీసుస్టేషన్ ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇచ్చాపురం–సుర్లారోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య ఎగువ లైనులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతుడి వయసు 55–60 ఏళ్లు ఉండవచ్చని, కాషాయ రంగు టీషర్టు, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడని, చేతి కర్ర, సంచి ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 94406 27567 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య ఎచ్చెర్ల క్యాంపస్ : మద్యానికి బానిసై చిలకపాలెం గ్రామానికి చెందిన సారిపల్లి జనార్దన్ (31) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనార్దన్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్య ధనలక్ష్మి, కుమారుడు ఉన్నారు. జనార్దన్ రోజు సంపాదన మొత్తం మద్యం తాగేందుకే ఖర్చు చేస్తుండటంతో కొన్నాళ్గుఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల క్షయ వ్యాధి రావటంతో మందులు వాడుతున్నాడు. అయినా మద్యం ఆపకపోవడంతో భార్య ధనలక్ష్మి గొడవపడి బుధవారం శ్రీకాకుళంలో షాపులో పనికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన జనార్దన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్య భర్త మృతి చెందిన విషయం గమనించి ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 55 పశువులు పట్టివేత రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఐదు బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 55 పశువులను జె.ఆర్.పురం పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల నుంచి విశాఖపట్నం గోవధశాలకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. పశువులను విజయనగరం జిల్లా గుజ్జంగివలసలోని గో–సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
9 మంది పేకాటరాయుళ్లపై కేసు
గార: మండలంలోని పూసర్లపాడులో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని గార ఏఎస్ఐ ఎం.చిరంజీవి తెలిపారు. బుధవారం గ్రామ సమీపంలోని తోటల్లో ఆడుతున్న వీరిని టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.10,620 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. 20న అఖిల భారత సమ్మె రణస్థలం: కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం రణస్థలంలో సీఐటీయూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం పెంచాలని, కనీస పెన్షన్ రూ. 9వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ తదితర స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని, పని భారం తగ్గించాలని కోరారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు కె.సుజాత, పెద్దింటి కాంతమ్మ, ఎన్.జయలక్ష్మి, బి.గౌరి, కెల్ల ఉషా, ఎం.అన్నపూర్ణ, ఎ.అరుణ పాల్గొన్నారు. -
ఉద్దాన విధ్వంసాన్ని సహించేది లేదు
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజల ఆస్తులను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టి పచ్చని ఉద్దాన ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడితే సహించేది లేదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో బుధవారం కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుపచ్చ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, కార్గో ఎయిర్‌పోర్టు పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ప్రజల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయులుగా చేయడం సరికాదన్నారు. ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, జీడిపంటలను నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి సాగిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మేలును ఆకాంక్షిస్తే వెంటనే కార్గో ఎయిర్‌పోర్గ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఉద్దాన ప్రజలకు మేలు కలిగించే ఉద్దాన పంటల ఆధారిత పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, శివారు భూములకు సాగునీరు అందించే పనులపై దృష్టిపెట్టాలన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మౌనం వీడి ఉద్దాన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జీడి రైతు పోరాట కమిటీ అధ్యక్షుడు తెప్పల అజయ్‌కుమార్, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కోనారి మోహన్‌రావు, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, సీఐటీయూ నాయకులు ఎన్.గణపతి, కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు కుసుమ, దానేష్, చలపతి, పి.అరుణ, ధర్మారావు, జోగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
తవ్వేస్తున్నారు!
దర్జాగా.. ● గోవిందపురం కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలింపు ● అనుమతులు లేకపోయినా టిప్పర్ల ద్వారా రవాణా ● ఇదేంటని ప్రశ్నించిన సర్పంచ్‌పై దురుసు ప్రవర్తన సంతబొమ్మాళి: మండలంలోని గోవిందపురం సర్వే నెంబర్ 71లో కొండపై గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా దౌర్జన్యంగా టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. లక్షల రూపాయలను సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తరలింపుపై ప్రశ్నించిన స్థానిక సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు నిర్వాహకులు విశ్వసముద్రం సంస్థ ద్వారా మూలపేట పోర్టు పనులకు గ్రావెల్‌ను తరలిస్తున్నామని చెబుతున్నారు. ఆర్డర్ కాపీ చూపించాలని కోరగా..ఆర్డీవో వద్దకు వెళ్లి అడగండంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి సర్వే నెంబర్ 71లో ఉన్న ఈ కొండను గ్రామానికి చెందిన మండపాక నర్సింగరావు 2020–30 సంవత్సరం వరకు లీజుకు తీసుకున్నారు. ఏటా హెక్టార్‌కు రూ.65వేలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లు లీజుదారు చెబుతున్నారు. తనకు లీజుకిచ్చిన గ్రావెల్ కొండను ఇతరులు తరలించుకుపోతున్నారని జిల్లా మైన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు మంగళవారం ఏడీ అశోక్ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్లను సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. సీజ్ చేసిన గంటలోపే మళ్లీ గ్రావెల్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభం కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ గ్రావెల్‌ను తరలించుకుపోవడంపై విమర్శఽలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. న్యాయపోరాటం తప్పదు.. కింజరాపు కుటుంబీకుల కనుసన్నల్లోనే గ్రావెల్‌ను ఎటువంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతున్నారు. లీజుదారుడైన నన్ను సంప్రదించకుండా దౌర్జన్యంగా గ్రావెల్ తీసుకెళ్తున్నారు. జిల్లా మెన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాను. – మండపాక నర్సింగరావు, లీజుదారుడు, వల్లేవలసదురుసుగా సమాధానం.. అక్రమంగా గ్రావెల్ తరలించుకుపోవడంతో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాను. మీకు ఎటువంటి అనుమతులు ఉన్నాయో పత్రాలు చూపించండని కోరాం. ఆర్డీవో దగ్గర పర్మిషన్ ఆర్డర్ ఉంది వెళ్లి చూసుకోండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు. – ఆర్.రామిరెడ్డి, సర్పంచ్, గోవిందపురం -
బీసీ రుణాలకు మోక్షమెప్పుడో?
శ్రీకాకుళం పాతబస్టాండ్: వెనుకబడిన తరగతుల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షలా మారాయి. కేవలం కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు వరంగా మార్చుకుంటున్నారు తప్ప ఎక్కడా పారదర్శకత పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్వ్యూలు, దరఖాస్తుల ప్రక్రియ అంతా తూతూమంత్రంగానే ఉందని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా రాజకీయ జోక్యమే.. దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నాటి నుంచి రుణాల పంపిణీపై రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అర్హతలు ఉన్న సామాన్యులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పదవీ కాలంలో పింఛన్ల పెంపు పథకాన్ని తప్ప మరే ఇతర పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. హామీలను నెరవేర్చలేమంటూ కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తున్న తరుణంలో ప్రజలు తీవ్ర అసంతప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో బీసీ రుణాలను మంజూరుకు కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీకారం చుట్టారు. ఈ రుణాలు కూడా అందరికి అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. యూనిట్లు తక్కువగా ఉండటంతో దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. బ్యాంకు, ఇతర అధికారులతో పనిలేకుండా నేరుగా నియోజకవర్గాల శాసన సభ్యులు సిపారసు లేఖలే ప్రామాణికంగా ఎంపికలు జరగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీలకు బాసట కరువు.. జిల్లాలో ఎక్కువగా బీసీ సామాజికవర్గాల వారే ఉన్నారు. ఆ వర్గానికి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎక్కువ యూనిట్లు మంజూరి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించలేదు. బీసీ జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే బీసీలకు మరిన్ని యూనిట్లు వచ్చి మేలు జరిగే అవకాశం ఉండేది. పేద జిల్లా అయినందున స్వయం ఉపాధిని పొందేందుకు బీసీ రుణాల కోసం అఽధిక సంఖ్యలో యువత ముందుకు వస్తున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫలితం లేకుండాపో తోంది. ఇంటర్వ్యూలు పూర్తయినా.. బీసీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న వారికి అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు. ఎంపీడీవోలు తరువాత మీకు సమాచారం పంపుతామని చెప్పి పంపించేస్తున్నారు. ఎంపిక జాబితాలను మాత్రం వెల్లడించడం లేదు. బ్యాంకర్లకు తలనొప్పులు.. లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకులు కీలక భూమిక పోషించాల్సి ఉంది. లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వగా, మిగిలిన 50 శాతం రుణం బ్యాంకు వారు అందజేయాలి. అయితే బ్యాంకు అనుమతి లేకుండా కూటమి నాయకులు లబ్ధిదారుల పేర్లను సిఫారసులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి రుణం పొందేందుకు కావాల్సిన ‘సిబిల్’ స్కోర్ అనుకూలంగా లేనందున బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఈ సమయంలో నాయకులు బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితి బ్యాంకర్లకు తలనొప్పిగా మారింది. లక్ష్యం 3133 యూనిట్లు.. దరఖాస్తులు 22,822 తూతూమంత్రంగా మండల స్థాయి ఇంటర్వ్యూలు బ్యాంకర్లపై కూటమి నేతల ఒత్తిడి! -
ఉపాధిలో జియో ట్యాగింగ్ కీలకం
మెళియాపుట్టి: ఉపాధి హామీ పథకంలో జియో ట్యాగింగ్ విధానం కీలకమైనదని, దానికి అనుగుణంగా పనులు నిర్వహించాలని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి వి.సుగుణాకరరావు అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి మెళియాపుట్టి వచ్చిన ఆయన స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో నిర్మించిన రూఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాల పరిరక్షణ ఇటువంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టాలన్నారు. అనంతరం గోకర్ణపురంలో పంట కుంటను పరిశీలించారు. అంతకుముందు స్థానిక ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా జీఐఎస్ అధికారి శోభ, ఏపీఓ రవి, ఈసీ ఆదినారాయణ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు తిరుపతిరావు, రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
భూముల సమస్యలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రెవెన్యూ భూముల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ భూ సమస్యలు, ఎలినేషన్స్, మ్యుటేషన్లపై జిల్లా అధికారులు, తహసీల్దార్లతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీరప్రాంత తహసీల్దార్లు సీఆర్‌జెడ్ రూల్స్‌పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్‌రాజా మాట్లాడు తూ డీఎల్డీఓ కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమని చెప్పగా ఆర్డీఓ సాయి ప్రత్యూష స్పందిస్తూ కలెక్టరేట్ నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, పీడీ బి.శాంతిశ్రీ, సెరీకల్చర్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్ సూపరింటెండెంట్‌గా అమూల్య
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ సి.అమూల్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా నుంచి బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమూల్యను ప్రభుత్వం ఇటీవలే ప్రిన్సిపాల్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది సహకారంతో రోగులుకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో ఓపీ సంఖ్య పెరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం పలువురు వైద్యులు సిబ్బంది అమూల్యను అభినందించారు. -
● అలర్ట్..అలర్ట్
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో ఎలా మసలుకోవాలో వివరిస్తూ మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ప్రమాదాన్ని పసిగట్టడం, ఎదుర్కోవడం, సమాచారం అందజేయడం, బాధితులను రక్షించడం వంటివాటిపై అవగాహన కల్పించారు. – శ్రీకాకుళం అర్బన్ -
మేం అచ్చెన్నాయుడు మనుషులం..
నరసన్నపేట: స్థానిక ఇందిరా నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పనులు అందరినీ విస్మయపరుస్తున్నాయి. నిబంధనల మేరకు ఇక్కడ అపార్ట్మెంట్ నిర్మాణం జరగకూడదు. ఎలాంటి వాణిజ్యపరమైన నిర్మాణమూ చేపట్టకూడదు. కానీ విజయనగరానికి చెందిన ఓ బిల్డర్ ఈ పనులు చేపడుతున్నారు. స్థానిక సొసైటీ పాలక వర్గం సభ్యులు ప్రశ్నిస్తుంటే..‘మేం మంత్రి అచ్చెన్నాయుడు మనుషులం.. మా వెనుక ఆయన ఉన్నారు’ అని బెదిరిస్తున్నా రు. మెయిన్ రోడ్డుకు సమీపంలో గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలో ని సర్వే నంబర్ 204–1లో 1244 చదరపు అడుగుల్లో (26 సెంట్లు) అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. 1948లో ఇందిరానగర్‌లో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఏర్పడింది. కో ఆపరేటివ్ నిబంధనల ప్రకారం ఇది నడుస్తోంది. ఇక్కడ స్థలం పొందిన వారికి ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. సామూహిక గృహాలు వంటి వాణిజ్యపరమైన నిర్మాణాలు చేయడానికి అనుమతులు లేవు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా ఇక్కడ అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నారు. సొసైటీ నుంచి ఎన్ఓ సీ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదు. స్థలాన్ని ఇతరులకు మార్ట్గేజ్ చేయకూడదని నిబంధనలు చెబుతున్నా.. దాన్ని కూడా అతిక్రమించి మార్ట్గేజ్ చేశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్.. ప్లాట్ నంబరు ఎ–8 లో ఉన్న స్థలాన్ని గొండు రామన్న అనే వ్యక్తికి 1980లో కేటాయించారు. కానీ ఆయన సకాలంలో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో టంకాల గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామన్నకు అలాట్ చేసిన స్థలాన్ని రద్దు చేశారు. అయితే 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న టంకాల అర్జున్ను అధికార పార్టీ నాయకులు బెదిరించి ఆ స్థలాన్ని రామన్న పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ దీనికి పాలకవర్గం అనుమతి తీసుకోలేదు. అలాగే పాలకవర్గం తీర్మానం కూడా లేదు. దీంతో ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని ప్రస్తుతం అధ్య క్షుని హోదాలో ఉన్న చింతు రామారావు రిజిస్ట్రార్ కార్యాలయానికి లెటర్ పంపారు. ఇదే సమాచారా న్ని రామన్నకు కూడా తెలియజేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంపై కొందరి కన్ను పడింది. ఎలాగైనా ఈ స్థలాన్ని పొందాలని సబ్ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి చేసి విజయనగరానికి చెందిన బిల్డర్‌కు రామన్న చేత మార్ట్గేజ్ చేయించారు. దీంతో ఆయన అపార్ట్మెంట్ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ సభ్యులు పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ అపార్ట్మెంట్లో పొరుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులకు వాటాలు ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ధిక్కరిస్తున్నారు ఇందిరానగర్‌లోని మా సొసై టీ స్థలంలో అక్రమంగా అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇతరులకు మార్ట్ గేజ్ చేయడానికి, అపార్ట్మెంట్ నిర్మాణానికి వీలు లేదు. కానీ నిబంధనలు ధిక్కరించి పనులు చేస్తున్నారు. అసలు మార్ట్గేజ్ చేసిన వ్యక్తికి ఈ స్థలంపై ఎలాంటి హక్కులు లేవు. సుడా అధికారులు కూడా స్థలం చూడకుండా పూర్వాపరాలు చూసుకోకుండా అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నాం. – చింతు రామారావు, కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు -
ఇసుక దోపిడీ జరుగుతున్న ప్రాంతాలివే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో ఇసుక దోపిడీ పతాక స్థాయిలో జరుగుతోంది. అనుమతుల్లేకుండా ర్యాంపులు నిర్వహించి, అడ్డగోలుగా తవ్వకాలు జరిపి విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల అనుమతులు ఒక దగ్గర, తవ్వకా లు మరో చోట జరిపి ఇసుకను స్వాహా చేస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతులకు మించి తవ్వకాలు జరి పి, సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలు ఒక ఎత్తు అయితే ఆ అక్రమ ఇసుకను తరలించేందుకు నకిలీ బిల్లులు సృష్టించడం మరో ఎత్తు. అంతా కలిసి ఇసుక మాఫియాగా మారి ఇప్పటికే రూ.వేల కోట్లు మింగేశారు. ఇసుక దోపిడీ నేరమని సాక్షాత్తు సుప్రీం కోర్టే చెప్పినా కూటమి ప్రభుత్వంలో నాయకులు లెక్క చేయడం లేదు. అడ్డగోలుగా... ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నదుల గర్భంలోనే యంత్రాలు పెట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మంచినీటి బావులు, వంతెనలకు ముప్పు వాటి ల్లేలా తవ్వకాలు చేస్తున్నారు. అక్రమార్కుల దెబ్బకు కొన్నిచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరికొన్ని చోట్ల తవ్వకాలతో ఏర్పడిన గుంతల కారణంగా సముద్రం బ్యాక్ వాటర్ వచ్చేసి నదీ జలాలు ఉప్పునీటిమయమైపోయాయి. మరికొన్ని చోట్ల నదులను ఎక్కడికక్కడ తవ్వేసి, పెద్ద పెద్ద గోతులు చేయడంతో ప్రమాదాలకు తావిస్తున్నా యి. కొన్ని చోట్ల నదులు దీవుల్లా కన్పిస్తున్నాయి. అక్రమ రవాణా సాగిస్తున్న లారీలతో రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది రోడ్లు పాడవడం వల్ల ప్రమాదాలకు గురై మరణించడం, తీవ్రగాయాలపాలవ్వడం జరిగింది. నకిలీ బిల్లుల సృష్టి బిల్లులు లేకపోతే ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడ పట్టుబడిపోతా మో అన్న ముందు చూపు తో అక్రమార్కులు ఎక్కడికక్కడ యంత్రాంగం వినియోగిస్తున్న డివైజ్‌లను పోలిన డివైజ్‌లను కొనుగోలు చేసి నకిలీ బిల్లులు తయారు చేస్తున్నారు. అధికారులు జారీ చేసిన బిల్లుల్ని పోలిన విధంగా నకిలీ బిల్లులు ఉంటున్నాయి. ఏ ర్యాంపు నుంచైతే తీసుకొస్తున్నారో ఆ ర్యాంపు లేదా మరో ర్యాంపు పేరుతో నకిలీ బిల్లులు సృష్టిస్తున్నారు. దాదాపు అక్రమంగా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ జిల్లాలో నకిలీ డివైజ్‌లు వాడుతున్నారు. నకిలీ డివైజ్లతో బిల్లులు సృష్టిస్తున్నారని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక దందా చేస్తున్న వారంతా నాయకులు కావడంతో వారి జోలికి పోవడం లేదు. దీంతో తనిఖీల సమయంలో సిబ్బంది కూడా గుర్తించలేకపోతున్నారు. యంత్రాంగం జారీ చేసిన బిల్లులు మాదిరిగా ఉండటంతో వదిలేస్తున్నారు. పక్కాగా గమనించి, ఆ ర్యాంపు వద్ద ఆరా తీసి, కచ్చితంగా వ్యవహరిస్తే తప్ప పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా పైడిభీమవరం చెక్ పోస్టు పక్కాగా, కచ్చితంగా పరిశీలించడంతో నకిలీ బిల్లులతో రవాణా సాగిస్తున్న లారీల గుట్టు రట్టు అయింది. సీఐ అవతారం ఆధ్వర్యంలో తనిఖీలు జరగ్గా, పట్టుబడ్డ లారీలను మైనింగ్ అధికారులకు అప్పగించారు. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరాం పంచాయతీ దిబ్బలపేట, ముద్దాడ పేట, కాఖండ్యాం, నారాయణపురం, పురుషోత్తపురం, చినంకలాం, నిమ్మ తొర్లాడ, దూసి, తోటాడ, అక్కివరం, బెలమం, లొద్దలపేట, కొత్తవలస, సింగూరు, నైరా, అంబళ్లవలస. శ్రీకాకుళం నియోజకవర్గంలోని భైరి, కరజాడ, బూరవల్లి, కళ్లేపల్లి, కిల్లిపాలెం, పొన్నాం, బట్టేరు, గార. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం, పర్లాం, రామకృష్ణాపురం, శ్రీముఖలింగం, దొంపాక,లుకలాం, బుజ్జిపేట, చేనువలవలస, చెవ్వాకులపేట, గోపాలపెంట, ఉర్లాం, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బిర్లంగి, బొడ్డవడ, ఈదుపురం, కేసుపురం, కొలిగాం, ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో బహుద నది కొత్త, పాత బ్రిడ్జిల దగ్గర, పాతపట్నం నియోజకవర్గంలోని ఆకులతంపర, పాత పొనుటూరు, హిరమండలం మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, దోపిడీ జరుగుతోంది. -
ఇచ్చట.. సునాయాసంగా.. కబళిస్తున్నారు
● జిల్లాలో భారీగా ఇసుక దోపిడీ ● ఉచితం ముసుగులో ఇసుక స్వాహా ● నకిలీ డివైజ్లతో బిల్లులు సృష్టిస్తున్న వైనం ● తాజాగా పైడిభీమవరంలో బయటపడిన నకిలీ బిల్లులు ఈ ఫొటోలో ఉన్న లారీలను చూడండి. నకిలీ బిల్లులతో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాయి. పైడి భీమవరం చెక్ పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు చేయగా, నకిలీ బిల్లులని అనుమానంతో లారీలను పోలీసు అధికారులు నిలిపేశారు. పట్టుకున్న లారీలను మైనింగ్ అధికారులకు పోలీసులు అప్పగించారు. -
శ్రీముఖలింగం భూములకు సాగు వేలం ఖరారు
జలుమూరు: శ్రీముఖలింగం భూములకు సాగు వేలం ఖరారైంది. ‘వేలానికి వేళ కాలేదా’ అన్న శీర్షికన ఈ నెల నాల్గో తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 32 ఎకరాలు(మెట్టు,పల్లం) ఆలయ భూములకు సంబంధించి మంగళవారం బహిరంగ వేలం ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన దేవదాయ శాఖ కార్యాలయంలో ప్రథమ ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని ఈఓ పి.ప్రభాకరరావు తెలిపారు. మొత్తం ఆరుబిట్లుగా విడదీసి వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడేళ్లకు హక్కులు ఉంటాయని తెలిపారు. -
తస్మాత్ జాగ్రత్త..!
సరుబుజ్జిలి: వేసవిలో ఉష్టోగ్రతలు తారాస్థాయికి చేరడంతో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఇటీవల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే పలుచోట్ల పిడుగులు పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పిడుగు మాట వింటేనే ప్రజలు భయపడుతున్నారు. పొలాల్లో పనులు చేసుకొనే రైతులు, పశువుల కాపరులు ఎక్కువగా ప్రమాదాల బారినపడుతున్నారు. అలాగే సమీప ప్రాంతాల్లో ఇళ్లకు సమీపంలో పిడుగులు పడుతుండడంతో గృహోపకరణాలు కాలిపోయి తీవ్ర నష్టాలు ప్రజలు చవిచూస్తున్నారు. దీంతో పిడుగుపాటు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయకూడదు ● వర్షం కురిసేటపుడు చెట్లకింద ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండరాదు. ● మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంతకన్న తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగుపడే అవకాశముంది. ● మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయవద్దు. ● గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి, సెల్‌ఫోన్ ఉంటే స్విచ్చాఫ్ చేయాలి. ● ఒక వేళ ఇవి ఉంటే రేడియన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశముంటుంది. ● వర్షంపడే సమయంలో విద్యుత్ తీగలు కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ● అలాగే అటువంటి సమయాల్లో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు. ● గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మెరుపులు, ఉరుములతో భయందోళనకు గురవుతారు. అటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగుతున్న పిడుగుపాటు ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్న పిడుగులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను 1 అడుగుపైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. – బమ్మిడి జ్యోతిర్మయి, వైద్యాధికారి, పురుషోత్తపురం పీహెచ్సీ -
ముగిసిన అంత్యక్రియలు
శ్రీకాకుళం రూరల్: గురజాడ విద్యాసంస్థల్లో మూడు దశాబ్ధాలుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పులఖండం శ్రీనివాసరావు అంత్యక్రియలు మంగళవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడుతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఒక సాహితీవేత్తను, పరిపాలన దక్షుడిని కోల్పోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వీరితో పాటు విద్యాసంస్థల డైరక్టర్ రంగారావు, వి.మహేష్, ఐక్యూ ఏసీ మర్తాండ తదితరులు సంతాపం ప్రకటించారు. -
ఆరోగ్య ప్రదం
ఔషధ గుణం.. ముంజులను విక్రయిస్తున్న రైతు ● తాటి ముంజులతో శరీరానికి పుష్కలంగా విటమిన్లు ● వేసవిలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం ● కామెర్లు, ఎసిడిటీ తీవ్రతను తగ్గించే గుణంవజ్రపుకొత్తూరు / హిరమండలం: వేసవి తాపాన్ని అధిగమించేందుకు, ఈ కాలంలో శరీరంలో సంభవించే అనేక రుగ్మతులను నివారించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు. ఇవి ఐస్ యాపిల్‌గా విశేష ప్రాచుర్యం పొందాయి. తాటి ముంజుల సీజన్ ప్రారంభం కావడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ తాటి ముంజులు శరీరంలోని చెక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి గిరాకీ పెరిగింది. ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో తాటిచెట్లు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటి చెట్లు నరికేస్తుండడంతో భవిష్యత్‌లో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది. ఆరోగ్య ప్రదాయిని ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే తాటి ముంజులు కల్తీ లేనివి, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాటి ముంజులు సేకరించేవారు కరువయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతు కూలీలు తాటి ముంజులను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. జిల్లాల్లోని శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస, హరిపురం, ఇచ్ఛాపురం పట్టణాల్లో ఎక్కువగా విక్రయాలు చేపడుతున్నారు. తాటి ముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80ల నుంచి రూ.120ల వరకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటి ముంజుల ప్రియులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రయోజనాలు ● తాటి ముంజుల్లో విటమిన్లు, పాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు సోలేబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి తాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది. ● తాటి ముంజులు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు రక్తపోటు(బీపీ)ను అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా సీజన్లో క్రమం తప్పకుండా తాటి ముంజలను తినడం వల్ల చెడు కొలెస్త్రాల్ తగ్గించుకుని మంచి కలెస్ట్రాల్‌ను వృద్ది చేసుకోవచ్చు. ● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉండడం వలన అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కల్పించి శరీరం బరువు పెరగకుండా చేస్తుంది. ● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ● ఆహారంలో సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది. ● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● తాటి ముంజులను గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమట కాయలను నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉండడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెంచి ఎసిడిటీ, కామెర్ల తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఏడాదికి ఒక్కసారైనా తినాలి తాటి ముంజ కల్తీలేని స్వచ్ఛమైన పోషకాహారం. వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకు తాటి ముంజులు లభ్యమవుతాయి. ఇవి తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందనడంలో సందేహం లేదు. మా ప్రాంతంలో కోసేవారు లేకపోవడంతో ఇచ్ఛాపురం, హరిపురం పలాస, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి తెప్పించుకుని తింటాం. కొన్నిసార్లు పలాస– విశాఖ పాసింజర్ ట్రైన్లలో సైతం విక్రయాలు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఎక్కువ తీసుకుంటాం. ఐస్ యాపిల్‌గా పిలిచే తాటి ముంజలను ఏడాదికి ఒకసారైనా తిలనాలని కోరిక ఉంటుంది. – ఎం.కృష్ణారావు, బ్రాహ్మణతర్ల, పలాస మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది తాటి ముంజలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. లేతవి, జెల్లీలా ఉన్నవి తింటే రుచిగా ఉంటాయి. మా ఊరులో ఉన్న చెట్లు నుంచి గెలలను తీసి కోసుకుని తింటాం. పైగా వేసవిలో చల్లదనం ఇచ్చి దాహార్తిని తీరుస్తుంది. సరదాగా గడుపుతూ తోటల్లోకి చేరి, కొండ పక్కన ఉన్న తోటల్లో తాటిచెట్లు నుంచి కాయలను తీసి పంచుకుని తింటాం. అదో తియ్యని జ్ఞాపకం. – డి.ఢిల్లీరావు , అమలపాడు, వజ్రపుకొత్తూరు -
నలుగురిపై గృహ హింస కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: ముద్దాడ గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మంగళవారం ఆమె భర్త ముత్యాలరావు, ముగ్గురు కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు. భార్యభర్తలు మధ్య ఇటీవల గొడవలు రావడం, భర్త అప్పులు చేయడం, కన్నవారి ఇంటి నుంచి డబ్బులు తీసుకు రావాలని ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో అనితకు వివాహం కాగా, కుమార్తె ఉంది. ప్రస్తుతం కన్నవారు ఇంటి వద్ద దుప్పలవలసలో ఉంటోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 108 అంబులెన్సులో ప్రసవం మందస: మండలంలోని సింగుపురం గ్రామానికి చెందిన రాయవలస భారతి 108 అంబులెన్స్‌లో పండంటి బిడ్డకు మంగళవారం జన్మినిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారతి పురిటి నొప్పులతో బాధపడుతుండగా వారి బంధువులు 108కు సమాచారం అందించారు. దీంతో మందస 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎస్.రాజేంద్ర ప్రసాద్‌లు గ్రామానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమెకు సిబ్బంది ప్రసవం చేయడంతో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అనంతరం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పిడుగుపాటుకు మహిళ మృతి కొత్తూరు: మండలంలోని దిగువ మల్లెలుగూడకు చెందిన యువతి సవర చిన్నారమ్మ (30) పిడుగుపాటుకు మృతి చెందినట్లు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ మంగళవా రం తెలియజేశారు. చిన్నారమ్మ మేకలు కాపుకు వెళ్లగా సోమవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి తమ్ము డు సవర రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. కారు బోల్తా రణస్థలం:మండలంలోని విశాఖపట్నం వైపు నుం చి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు పైడిపేట జాతీ య రహదారిపై మంగళవారం బోల్తా పడింది. అయితే కారులో ఉన్నవారికి చిన్న,చిన్న గాయా లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడినప్పుడు జాతీయ రహదారిపై నీరు నిలబడిపోవడం వలన కారు బోల్తా పడిందని, తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్‌పురం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
మత్య్సకార గ్రామాల్లో కూటమి చిచ్చు
సంతబొమ్మాళి: ప్రశాంతంగా ఉండే మత్స్యకార గ్రామాల్లో కూటమి పార్టీలు చిచ్చుపెడుతున్నాయని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. మండలంలోని జగన్నాథపురం తీరప్రాంత గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గ్రామంలో అక్రమ కేసుల బాధితులైన సర్పంచ్ జోగి రాములమ్మ, ఉప సర్పంచ్ కొమర రామారావు, లండ రామారావులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారిని భయబ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. మహిళ సర్పంచ్ జోగి రాములమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గ్రామంలో టీడీపీ కార్యకర్తలు గొడవపడితే ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకులపైన, ఆ సమయంలో గ్రామంలోనే లేని సర్పంచ్ రాములమ్మపైన అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. సీఐ నిర్వాకంతోనే అక్రమ కేసులు టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు నిర్వాకం వలనే వైఎస్సార్సీసీ నాయకులపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దయ్యబట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు తమకు కావాల్సినవారిని అన్ని శాఖల్లో నియమించుకొని తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీకు చెందిన నాయకులను ఆర్థికంగా నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పనులు చేసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఆర్థికంగా నష్టపరిచినా, అక్రమ కేసులు బనాయించినా భయపడకుండా పార్టీకి అండగా నిలిచిన సర్పంచ్ రాములమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆదర్శమని కొనియాడారు. టీడీపీ నాయకుల దాడులకు ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందన్నారు. కింజరాపు కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన వేల కోట్లను జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.రామిరెడ్డి, ఎన్ని మన్మథరావు, చింతల రాజులు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకటరావు, వైఎస్సార్సీపీ నాయకులు సంపతిరావు హేమసుందరరాజు, అట్ల రాహుల్, సత్తారు సత్యం, కాళ్ల సంజీవరావు, పుక్కల లక్ష్మణరావు, మురళి పాల్గొన్నారు. కక్ష సాధింపులకు ప్రతి చర్యలు తప్పవు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు సరికాదు వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుల డిమాండ్ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు పీఆర్కే రావు, జిల్లా కార్యదర్శి వై.అప్పయ్యలు కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డీపీటీవో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే 1/2019 సర్క్యూలర్‌ను అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలని, 114 జీవోలో పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్‌లను రూ.150ల నుంచి రూ.400ల వరకు చెల్లింపులు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థపరంగా వేతనాలు చెల్లించాలని విన్నవించారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్‌ను బలోపేతం చేయాలని, తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలన్నారు. డిప్యూటేషన్లను యథావిధిగా కొనసాగించాలని, పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలని కోరారు. ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, రిటైర్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలతో పాటు టెక్కలి, పాలకొండ తదితర డిపోల నుంచి ఎన్ఎంయూ నాయకులు ఎంఎన్ రావు, పి.నవీన్‌బాబు, ఎంఆర్ మూర్తి, కె.నర్సింహులు, పి.వాసు, హెచ్వీ మూర్తి, జేఆర్ రావు, వీడీరావు, వీరబాబు, సూరిబాబు, పీఆర్ మూర్తి, పీవీ లక్ష్మి, కృష్ణవేణి, పార్వతి పాల్గొన్నారు. -
‘వాడికి ఎందుకంత కొవ్వు’ .. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం నోటి దురుసు వ్యాఖ్యలు
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్‌ను తొలగించేందుకు రెడీ అయ్యింది.ఈ తరుణంలో రవికుమార్‌ను విధుల నుంచి తొలగించవద్దంటూ కొఠారి గ్రామస్తులు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ఆశ్రయించారు. రవి కుమార్ ఏ తప్పూ చేయలేదని, అతన్ని తొలగించవచ్చని ఎమ్మెల్యేని కోరారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ మహిళలతో ఎమ్మెల్యే బెందాళం అశోక్ దురుసుగా మాట్లాడారు.ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ..‘వాడికి ఎందుకంత కొవ్వు. నేను ఎమ్మెల్యేని. నేను పిలిస్తే వాడు రాడా? వాడు నా దగ్గరికి ఎందుకు రాలేదు?’అంటూ దురుసుగా మాట్లాడారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో బెందాళం అశోక్ అలా దురుసుగా మాట్లాడడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా గ్రామస్తులు ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం, ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న తహసీల్దార్
కొత్తూరు: పొనుటూరు గ్రామంలోని వంశధార నది నుంచి ఒడిశాకు అక్ర మంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ పట్టుకున్నారు. ఇక్కడ అక్రమాలపై ‘దేవుడి పేరుతో దోపిడీ’ పేరిట సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి తహసీల్దార్ స్పందించారు. పొనుటూరు నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పొనుటూరు–రుగడ రోడ్డులో పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.పది వేలు చొప్పున అపరాధ రుసుం విధించారు. మరోసారి దొరికితే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. -
గోరంత పని.. కొండంత ప్రచారం
‘మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడ పురుగులుండు..’ అన్నారెప్పుడో యోగి వేమన. ‘కూటమి ప్రచారం చూడ మెరిసిపోవుచుండును.. గుట్టు విప్పి చూడ మేడిపండు మేలు’ అనాలేమో మనమిప్పుడు. అరసవల్లి రథసప్తమికి భూమి ఆకాశం బద్దలయ్యేలా అధికార నేతలు ఆర్భాటాలు చేశారు. ౖపైపెన పనులు చేసి ఉత్సవ ఉత్సాహం చూపించారు. కానీ ఉత్సవం ముగిశాక.. అసలు గుట్టు బయటపడింది. కూల్చివేతలపై పెట్టిన శ్రద్ధ నిర్మాణాలపై పెట్టలేకపోయారు. ప్రచారంపై చూపిన చిత్తశుద్ధి పనుల్లోని నాణ్యతపై చూపలేకపోయారు. ఫలితంగా ఆదిత్యుడి భక్తులకు అవస్థలు తప్పడం లేదు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథ సప్తమి ఉత్సవాలకు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రచార ఆర్భాటాలు సిక్కోలు వాసులు ఇంకా మర్చిపోలేదు. ఈ ఏడాది రథసప్తమి మహోత్సవాలను తొలిసారిగా రాష్ట్ర పండుగ అంటూ ప్రకటించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కానీ రాష్ట్ర పండుగ అని మా త్రం ప్రకటించుకున్నారు. పనుల్లోకి దిగాక ఆల యం ముందున్న శాశ్వత భవనాలను అభివృద్ధి ముసుగులో కూల్చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేస్తామంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు హడావుడి చేసి భవనాలన్నీ నేలమట్టం చేయించేశారు. కూల్చివేతల పర్వం పూర్తయ్యాక.. ఆలయానికి వచ్చే ఆదాయం పడిపోయింది. దీనికి తోడు కూల్చిన వాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా జింకు షెడ్లలోనే భక్తులకు సేవలందిస్తున్నారు. సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆదిత్యుని దర్శనానికి వస్తున్న భక్తులకు కష్టాలే ఎదురవుతున్నాయి.ప్రచార ఆర్భాటాలు..ప్రఖ్యాత ఆలయాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నుంచి పిలిగ్రిమేజ్ రెజూవనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) అనే పథకం వర్తించేలా అరసవల్లిని ఎంపిక చేసేశామని, త్వరలో రూ.100 కోట్ల వరకు నిధులు రానున్నాయంటూ పెద్ద ప్రచారాలు చేశారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రసాద్ పథకం కాదు కదా.. ప్రసాదాల భవనాలను కూడా నిర్మించలేకపోయారు. గత ఏడాది డిసెంబర్లోనే అరసవల్లి ఆలయం ముందున్న నిర్మాణాలన్నీ కూల్చివేయనున్నామని అధికారికంగా ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించేసి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేత పనులను చేపట్టారు. దీంతో గత ఆరునెలల నుంచి ఆదిత్యు డిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అరసవల్లి ప్రధాన రహదారిని కూడా విస్తరణ చేయకుండా మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేసి అరసవల్లి మిల్లు కూడలిలో మాత్రం అరసవల్లి జ్ఞాపికగా పెద్ద రథచక్రాన్ని మాత్రం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.గోరంత పని.. కొండంత ప్రచారంఆలయం ముందున్న 10 ఆలయ దుకాణ సముదాయంతో పాటు అన్నదాన తయారీ, ప్రసాదాల విభాగ భవనాలు, మరో 12 వసతి గదులు, 30 వరకు మరుగుదొడ్ల భవనాలన్నీ కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు శాశ్వత భవనాలను నిర్మించేలా ఒక్క నిర్ణయాన్ని కూడా ఆలయ వర్గాలు గానీ ప్రభుత్వం గానీ చేపట్టలేదు. కూల్చేసిన స్థానమంతా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసేసి వదిలేశారు. ఇంద్రపుష్కరిణి చుట్టూ గోశాల, అన్నదాన షెడ్డు, జింకు షీట్లతో మరుగుదొడ్లను, అలాగే భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను మాత్రం ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ తాత్కాలికం కావడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. పోనీ చేస్తున్న పనుల్లో నాణ్యత ఉందా.. అంటే నాసిరకంగానే ఉన్నాయి. ప్రసాదాల కౌంటర్లు ఇంతవరకు స్థిరంగా ఏర్పాటు చేయలేదు. అన్నదాన మండపాన్ని కూడా పుష్కరిణి ఒడ్డున షెడ్లులో ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సరైన రీతిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి.అరసవల్లి ఆలయాన్ని ప్రచార కేంద్రంగా మార్చేసేలా తెలుగుదేశం పార్టీ సోషల్‌మీడియా విభాగం వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా 23 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే అరసవల్లిలో 1996 నుంచే నిత్యాన్నదాన పథకం అమల్లో ఉంది. ఆలయంలో భక్తులిచ్చిన విరాళాలతోనే దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడేదో కొత్తగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేయించినట్లుగా సోషల్‌మీడియాలో పోస్టింగ్‌ల ప్రచారాలకు టీడీపీ దిగడంపై భక్తులు నవ్వుకుంటున్నారు.వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ రామ్‌జీ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో 30 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారు అర్హులుగా తెలిపారు. ఉమ్మడి జిల్లా యువత అర్హులు కాగా, పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు 79933 40407, 9553410809 సంప్రదించాలని అన్నారు.సరిహద్దులో పటిష్టంగా తనిఖీలుఇచ్ఛాపురం టౌన్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో గంజాయి, మద్యం అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు పటిష్టంగా చేయాలని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సరిహద్దులోని చెక్‌పోస్టును పరిశీలించారు. తనిఖీ వి ధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి, మద్యం అక్రమంగా రాకుండా అన్నిమార్గాల్లో అన్ని వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రొహిబిషన్ ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లో కలిగిస్తున్న అవగాహన కార్యక్రమాల కోసం తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ పి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.పర్యాటకాభివృద్ధికి చర్యలుశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పర్యాటక అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పర్యాటక శాఖపై సోమవారం ఆయన జూమ్‌లో సమీక్షించారు. జిల్లాలో రణస్థలం మండలం, కళింగపట్నం, బారువ, భావనపాడు, తదితర బీచ్‌ల అభివృద్ధికి రిపోర్టు తయారు చేయాలని సూచించారు. కవిటి బీచ్‌లో పర్యాటకులకు అనుగుణంగా ఉన్న స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. కళింగపట్నం బీచ్‌ను స్వదేశీ దర్శనం ద్వారా అభివృద్ధి చేయాలన్నారు.నేలకూలిన పెలికాన్కాశీబుగ్గ: పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం తక్కువ ఎత్తులో ఎగురుతున్న సైబీరియా పెలికాన్ పక్షిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో పెలికాన్ పక్షి రెక్కకు గాయాలై పక్షి ఎగర లేకపోయింది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ అధికా రి మురళీకృష్ణ ఆదేశాల మేరకు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పెలికాన్ పక్షిని పలాస పశు వైద్యశాలలో వైద్యం అందించారు.సచివాలయ సిబ్బందిపై ‘కూన’ ఆగ్రహంబూర్జ: సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం బూర్జ మండలం డొంకలపర్త గ్రామ సచివాలయం సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. సచివాలయ సిబ్బంది స్టూడెంట్లు కాదని, ఇంకా విద్యార్థుల్లాగా ప్రవర్తిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాకు చర్యలుఅరసవల్లి: ఈదురుగాలులు, వర్షంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేసినట్లుగా విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా భారీగా గాలులు వీయడంతో పాటు వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొంతమేరకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టామని, అయితే అంతకుముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఇబ్బందులు లేవని ప్రకటించారు. భారీ ఫ్లెక్సీల వల్ల కొన్నిచోట్ల విద్యుత్లైన్లు తెగిపోయాయని, 33 కేవీ విద్యుత్ లైన్లలో సరఫరా నిలిచిపోకుండా చర్య లు చేపట్టామన్నారు. సోమవారం సాయంత్రం నుంచి టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, శ్రీకాకుళం ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు తదితర బృందం ఎక్కడికక్కడ వివరాలను సేకరించారు. -
ఇల్లు కట్టి చూడు..!
పెన్డౌన్పై సమాచారం లేదు లైసెన్సుడు సర్వేయర్లపై పెన్‌డౌన్ చేస్తున్నట్టు సమాచారం లేదు. అలా చేస్తున్నట్టు చెబితే వారి లైసెన్సు రద్దవుతుంది. ఇళ్ల నిర్మాణదారులు నేరుగా వచ్చి కూడా మా కార్యాలయంలో ప్లాన్లను అప్లోడ్ చేసుకుని అనుమతులు పొందవచ్చు. – పీవీడీ ప్రసాదరావు, కమిషనర్ ● భూమి విలువ పెంచడంతో పెరిగిపోయిన అభివృద్ధి చార్జీలు ● ఆకాశాన్నంటుతున్న సిమెంట్, ఇనుము ధరలు ● ప్రభుత్వ ప్రకటనలకు విరుద్ధంగా ఇసుక రేటు ● నిలిచిపోతున్న భవన నిర్మాణాలు -
కుమార్తె పుట్టిన రోజే తండ్రికి ఆఖరి రోజు
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం సమీపంలోని వరిసాం దగ్గర ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆపడంతో వెనుక బైక్‌పై వెళ్తున్న బొద్దాన హరీష్‌రావు(25) లారీని ఢీకొట్టి గాయాలపాలై ఆస్పత్రిలో మృతిచెందాడు. కూతురి పుట్టిన రోజు వేడుకలు చేసుకుని మిగిలిన భోజనాలు రోడ్డు పక్కన ఉన్న వారికి ఇద్దామని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. జేఆర్ పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న హరీష్‌రావుకు అదే పంచా యతీలోని సీతంపేట గొల్లపేటలోని అమ్మాయితో పెళ్లయ్యింది. వీరికి నాలుగేళ్ల కూతురు ఉత్తర, ఆరు నెలల కుమారుడు రేవంత్ ఉన్నారు. ఆదివారం ఉత్తర పుట్టిన రోజు. దీంతో హరీష్‌రావు అత్తవారింట కుటుంబ సభ్యులతో కలిసి విందు చేసుకున్నాడు. తన బావమరిది పుట్టిన రోజు వేడుక కూడా చేసుకున్నాడు. ఈ రెండు కార్యక్రమాల్లో భోజనాలు మిగిలిపోవడంతో రోడ్డు పక్కన బిచ్చగాళ్లకు ఇద్దామని సీతంవలస అత్తవా రి ఇంటి నుంచి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పైడిభీమవరం వరకు మూడు బైక్‌లపై తొమ్మి ది మంది బయల్దేరారు. దారి పొడవునా కొందరికి ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో రణస్థలం వైపు వస్తుండగా వరిసాం వద్ద ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ముందు వెళ్తున్న లారీ సడెన్‌గా ఆపడంతో బైక్‌లు ఆ లారీని ఢీకొన్నా యి. హరీష్‌రావుకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్నేహితులు బైక్‌పై రణస్థలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స అందించే సమయంలో మృతి చెందాడు. వెనుక కూర్చుని ఉన్న మరో ఇద్దరు కోరాడ దుర్గ, గొర్లె భాస్కరరావులకు తీవ్ర గాయాలకు కావడంతో 108లో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుని భార్య ఉమ, తల్లి దమయంతి ఇంటిలోనే ఇండగా, తండ్రి అసిరయ్య రణస్థలం మండల కేంద్రంలో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె పుట్టిన రోజు వేడుకలో మిగిలిన భోజనం పడేద్దామని కుటుంబ సభ్యులు చెప్పినా.. కాదని ఏవరో ఒకరికి ఇస్తే పుణ్యమని బయలుదేరి వెళ్లి ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదంపై మరో క్షతగాత్రుడు గొర్లె భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన రోజు వేడుకల్లో మిగిలిన భోజనాలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం జేఆర్‌పురంలో విషాద ఛాయలు -
అవి వైఎస్సార్ సీపీ హయాంలో వచ్చిన నిధులు
● ఎమ్మెల్సీ రామారావు కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని, ఈ పనుల నిధులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవేనని ఎమ్మెల్సీ నర్తు రామారావు గుర్తు చేశారు. మండల కేంద్రం కంచిలిలో గల ఎమ్మెల్సీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోంపేట మండలం బారువ కొండిరేవ బ్రిడ్జికి రూ.3కోట్ల 45 లక్షలు, మహేంద్రతనయ బ్రిడ్జికి రూ.14 కోట్ల 60లక్షలు, ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు నుంచి పెద్దలక్ష్మీపురం వరకు రూ.4కోట్ల 86లక్షలు ప్రధాన మంత్రి సడక్యోజన కింద తారు రోడ్డు వేయడానికి, బూర్జపాడు ఉప్పుటేరుపై రూ.10కోట్ల 50లక్షలతో వంతెన నిర్మాణానికి ఆనాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి, టెండర్లు పిలిచి, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ పనులు తాత్కాలికంగా ఆగాయని అన్నారు. ఈ పనులు తామే తెచ్చామని కూటమి నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నా.. నిజానికి ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీలు పైల దేవదాస్‌రెడ్డి, డాక్టర్ నిమ్మన దాస్, బోర పుష్ప, కంచిలి జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, పార్టీ నేతలు నర్తు నరేంద్రయాదవ్, ఇప్పిలి కృష్ణారావు, తడక జోగారావు, దుర్గాసి ధర్మారావు, నర్తు ప్రేమ్‌కుమార్, డొక్కరి బలరాం, మడ్డు వెంకటరావు, కొత్తకోట శేఖర్, బల్లెడ సుమన్, గణప సింహాచలం, రాంపత్ని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘సమస్యలు పరిష్కరించాలి’
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతిరావు కిశోర్‌కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 15వ తేదీన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రధాన డిమాండ్లను వివరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలని, ఉర్దూ మైనర్ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్జిటి, ఎస్ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎ స్ హెచ్ఎం పోస్ట్ అదనంగా కేటాయించాలన్నారు. అనంతరం యూటీఎఫ్ సంఘ పెద్దలు డీఈఓ తిరుమల చైతన్యకు, జిల్లా పరిషత్ సీఈఓకు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రాలను అందజేశారు. -
● తప్పని తిప్పలు
ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక వద్దకు వచ్చే వారికి తిప్పలు తప్పడం లేదు. గత వారం ప్రజాఫిర్యాదుల విభాగానికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోలు పోసుకుని చనిపోతానని బెదిరించిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో ఈ వారం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ వారం ఓ దివ్యాంగురాలు వీల్‌చైర్‌లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. ఆమె వస్తువులన్నీ తీసి తనిఖీ చేయడంతో.. వీల్‌చైర్ పైకి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. కేజీబీవీ మురపాకలో ఇంటర్ సీటు కోసం ఇమె వచ్చారు. దివ్యాంగులు వెళ్లడాని కి ర్యాంపు లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న వారు అభిప్రాయపడ్డారు. అలా గే ప్రథమ చికిత్స వంటివాటికోసం స్టాఫ్ నర్సుల్ని ఏర్పాటుచేశారు. వారికి కనీసం ఓ చాంబర్, బల్ల వంటివి ఏర్పాటుచేయకపోవడంతో మెట్లపైనే కూర్చుని మందులు నేలపైనే పెట్టారు. – శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) -
● కుట్టు మిషన్ల స్కీమ్ పెద్ద స్కామ్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రభుత్వ కుట్టు మిషన్ల స్కీమ్ పెద్ద స్కామ్ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతీదివ్య అన్నారు. ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కార వేదికలో సోమవారం పాల్గొని కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉలాల భారతీదివ్య మాట్లాడుతూ పథకాల పేరిట కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్సీపీ పథకాలు అందజేసిందని, కూటమి ప్రభుత్వం కేవలం పచ్చ చొ క్కాలకే పథకాలు అందిస్తోందని పేర్కొన్నారు. స్కామ్‌లపై దృష్టి సారించి ప్రజాధనం వృధా కాకుండా అర్హులైనవారికి పథకాలు అందేలా చూడాలని కోరారు. నరసన్నపేట నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు -
53 రోజుల ఆదాయం రూ.7.31 లక్షలు
పాతపట్నం: పాతపట్నంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ.7,31,962లు వచ్చిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చెప్పారు. సహాయ కమిషనర్ కార్యాలయం దేవదాయ శాఖ అధికారి జీవీబీఎస్ రవి కుమార్ పర్యవేక్షణలో సోమవారం హుండీ ఆదాయం లెక్కింపు జరిగిందన్నారు. 53 రోజులగాను ఆదాయం వచ్చిందని చెప్పారు. లెక్కింపులో శ్రీవెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.పిడుగుపాటుకు వ్యక్తి మృతిసరుబుజ్జిలి: మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన దాసరి అప్పన్న (47) సోమవారం చిగురువలస సమీపంలో పిడుగుపాటుకు మృతి చెందాడు. ఆయన రోజూ లాగానే చిగురువలస పంచాయతీ పరిధిలోని తాడికొండ వద్ద గొర్రెల మందను నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాతావరణంలో ఒక్క సారి మార్పులు ఏర్పడి ఈదురుగాలులు, వర్షం కురిసి పిడుగుపడింది. పిడుగు ప్రభావానికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.జగన్నాథుని నిధులు కై ంకర్యంమందస: మందస మండలం సాబకోట గ్రామంలో జగన్నాథ స్వామి దేవాలయం నిధు లు కైంకర్యం అయ్యాయని, దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు సోమ వారం కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దేవస్థానం కోసం మందస రాజులు 25 ఎకరాలు ఇచ్చారని, 18 మంది రైతులు ఆ భూములు సాగు చేస్తూ శిస్తు చెల్లిస్తున్నారని, కానీ అధికారుల పర్యవేక్షణ లేక గుడి శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. కార్యనిర్వహణ అధికారి అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. రికార్డుల్లో మాయ చేసి నిధులు కై ంకర్య చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు.సాహితీవేత్త ‘పులఖండం’ కన్నుమూతశ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం సాహితీ రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ పులంఖండం శ్రీనివాసరావు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. వృత్తిపరంగా గాయత్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సాహి తీ రంగంలోనూ కృషి చేశారు. ముఖ్యంగా వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలను రమ్యంగా నిర్వహించారు. అష్టావధానం నిర్వహించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించేవారు. శ్రీనివాసరావు విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యనభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, బరంపురం యూనివర్సిటీలో ‘హరికథా వికాసం–ఉత్తరాంధ్రము’పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. పులఖండం మృతిపై సుమిత్ర కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తి చిన్నారువు, నక్కశంకరరావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, ఉపనిషన్మందిరం అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మానగేష్, కామేశ్వరరరావు, జంధ్యాల శరత్‌బాబు, నిష్టల నర్సింహమూర్తి, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.ఆయన నేత్రాలు సజీవంటెక్కలి: టెక్కలి చిన్నబజారుకు చెందిన వ్యాపారి కింతలి చిట్టిబాబు సోమవారం మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులు చిట్టిబాబు నేత్రాలను దానం చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కుమారులు తిరుమలకుమార్, సురేష్‌కుమార్, అల్లుడు నేతాజీ గుప్తా తదితరులు పట్టణంలో అభయం యువజన సేవా సంఘానికి సమాచారం అందజేశారు. వారు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావుకు సమాచారం ఇవ్వడంతో, మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం నుంచి వైద్య బృందం టెక్కలికి చేరుకుని చిట్టిబాబు నేత్రాల నుంచి కార్నియాలను సేకరించారు.మద్యం తాగి వాహనం నడిపినందుకు 30 రోజులు జైలుశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఏడురోడ్ల కూడలిలో ఈనెల 9న మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి సోమవారం కోర్టు 30 రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ నాగరాజు వెల్లడించారు. పోలాకి మండలానికి చెందిన ఇర్రి శ్రీను ఈనెల 9న మధ్యాహ్నం 2.05 గంటలకు ఏడురోడ్ల కూడలిలో ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించిన ట్రాఫిక్ పోలీసులు శ్రీను పై కేసు నమోదు చేశారు. ఛలానాయే కదా.. కట్టేయొచ్చనుకుని కోర్టుకు వెళ్లిన శ్రీనుకు న్యా యమూర్తి 30 రోజుల జైలు శిక్ష విధించారు. -
టెక్కలిలో కింజరాపు ట్యాక్స్
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు ట్యాక్స్‌తో పెద్ద ఎత్తున దోపిడీ పర్వం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సోమవారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ట్లాడారు. గత ప్రభుత్వంలో ఎంతో పారదర్శకంగా ఏజెన్సీ వ్యవస్థతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఆ వ్యవస్థలను పక్కన పెట్టి విచ్చలవిడి గా కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో ఎ లాంటి లీజు అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమంగా కంకర తవ్వకాలు చేస్తున్నారని, దీనికి కింజరాపు ట్యాక్స్ కడితే చాలని తిలక్ దుయ్యబట్టారు. గోవిందపురం సమీపంలో సర్వే నంబర్ 71 లో వైఎస్సార్సీపీకి చెందిన మండపాక నర్సింగరావు అన్ని రకాల అనుమతులతో గ్రావెల్ క్వారీ నిర్వహిస్తుండగా, ఆ క్వారీలో మంత్రి అచ్చెన్నాయుడు, సోదరుడు హరిప్రసాద్ అక్రమంగా తవ్వకాలు చేసి కంకర తరలించేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న గ్రావెల్ తరలింపు ఆపకపోతే వచ్చే సోమవారం గ్రావెల్ క్వారీను ముట్టడిస్తామని తిలక్ హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారానికి కింజరాపు ప్రసాద్, మైనింగ్ వ్యాపారానికి ఆయన కుమారుడు సురేష్ డాన్లుగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం కింజరాపు కుటుంబానికి వెళ్తోందన్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన మహిళా మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసుల ప్రవర్తన హేయమని తిలక్ మండిపడ్డారు. మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్లో కింజరాపు కుటుంబానికి పెద్ద ఎత్తున వాటాలు ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ -
● ఎస్పీ గ్రీవెన్స్‌కు 61 వినతులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యా దుల స్వీకరణ కార్యక్రమంలో (గ్రీవెన్సు) ప్రజల నుంచి 61 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించిన అనంతరం ప్రజా ఫిర్యాదులు పెండింగ్ ఉంచరాదని అధికారులను ఆదేశించారు. నిందితులను శిక్షించాలి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని జామియా మసీదులో ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చందనం చెట్లను నరికి అక్రమంగా తరలించిన విషయం తెలిసిందే. దీనిపై మత పెద్దలు ఎం.ఎ.రఫీ, ఎం.ఏ.బేగ్ మరికొందరు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలసి సమగ్ర విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని కోరారు. 400 ఏళ్ల పైబడిన జామియా మసీదు శ్మశాన వాటికతో కలసి 17 ఎకరాల విస్తీర్ణంలో వృక్షసంపదతో నిండి ఉందని, 40 చందనపు మొక్కలు, చెట్లు ఉండేవని, వాటిలో కొన్నింటిని నరికేసి అక్రమంగా తరలించడంపై ఇప్పటికే ఒకటో పట్టణ సీఐ, ఎస్‌లకు వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశామని అన్నారు. -
సోదాలు అప్రజాస్వామికం
శ్రీకాకుళం: బ్రిటిష్ పాలనను కూటమి ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని ‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని ఆయన ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బలగంతో సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే... ఇలాంటి ఘటనలు లేవు పత్రికా సంపాదకులపై దాడులకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే. మన దేశంలో ఒక సంపాదకీయం రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై రాజద్రోహం నేరాన్ని ఆపాదించి జైలు శిక్ష విధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగలేదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆ నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్బంధాన్ని అమలు చేశారు. అయితే పత్రికల కార్యాలయాలు, సంపాదకుల ఇళ్లపై మాత్రం దాడులు జరిగిన దాఖలాలు లేవు. నచ్చకపోతే అణగదొక్కుతారా? నచ్చిన పత్రికలను ప్రోత్సహించడం, నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మొదలైంది. పత్రికా రంగాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలమనే భావన సరైనది కాదని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన విజయంతో రుజువైంది. చంద్రబాబు పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై మునుపెన్నడూ లేని విధంగా అణచివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార బలంతో వేధింపులు దేశానికి ఒకటే పవిత్ర గ్రంథం. అది రాజ్యాంగం. వ్యవస్థలన్నీ దీనికి లోబడే పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అలా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు అనేక కేసుల విచారణ సమయంలో మందలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయినా కూటమి ప్రభుత్వం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీడియాలో వచ్చిన వార్త, కథనంపై లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి చట్టం కొన్ని అవకాశాలు కల్పించింది. వాటిని విస్మరించి నేరుగా అధికార బలంతో క్రిమినల్ కేసులు బనాయించి, వేధించడం ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక ఎడిటర్ ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట. ఏముంటాయి అక్షరాలు తప్ప ఎడిటర్ ఇంట్లో ఏముంటాయి. అక్షరాలే తప్ప ఆయుధాలు కాదు కదా. అక్షరాలను కూడా ఆయుధాలుగా భావించిన ఒకనాటి బ్రిటిష్ వైఖరి బయట పెట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదు. అణచివేతలతో చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేరు. మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలు సరైన సమయంలో తమ చైతన్యాన్ని ప్రకటిస్తారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు సంఘాలు కలిసి ‘సాక్షి’ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉంటాయి. -
ఎత్తిపోతలు.. ఉత్తి మాటలు
హిరమండలం వద్ద నత్తనడకన సాగుతున్న ఎత్తిపోతల పథకం పనులు హిరమండలం: పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలోని కీలక ప్రాజెక్టు గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదిలో 33 శాతం పనులు జరిగితే.. కూటమి ప్రభుత్వం ఏడు శాతానికి మించి పనులు చేయలేకపోయింది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఒక సాగునీటి ప్రాజెక్టు అవసరమని 2003 పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటగా గుర్తించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ రిజర్వాయర్ నిండాలంటే నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కానీ దీనికి ఒడిశా అభ్యంతరాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒడిశాతో జల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే.. ప్రత్యామ్నాయంగా 2022 సెప్టెంబరు 14న గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథ కం నిర్మాణానికిగాను రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థకు టెండర్లు కేటాయించారు. దీంతో శరవేగంగా పనులు జరిగాయి. 2024 ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా 33 శాతం పను లు పూర్తిచేసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కేవలం 7 శాతం పనులను మాత్రమే పూర్తిచేసింది. ఇంకా ప్రధాన విభాగాలకు సంబంధించి పనులు ఇంతవరకూ ప్రారంభం కాలే దు. పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. వాస్తవంగా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం పూర్తయితే రిజర్వాయర్‌లో నీటి స్థిరీకరణకు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఒడిశా ప్రభుత్వంతో వివాదం కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. ఒడిశాతో ఒకవైపు జలాల సమస్యకు పరిష్కార మార్గం చూపుతూనే.. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 12 టీఎంసీలను రిజర్వాయర్‌లోకి తరలించాలని ఆలోచన చేశారు. 2022 సెప్టెంబరు 14న రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. 2023 ఆగస్టులో హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించింది. అక్కడకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకూ రూ.140.07 కోట్లతో 33 శాతం పనులు పూర్తిచేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత పనులు మందగించాయి. చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ ప్రభావం పనులపై పడింది. కూటమి ప్రభుత్వం రూ.182 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పినా.. పనులు మాత్రం ఆశించిన స్థాయి లో జరగలేదు. ఈ ఏడాది కూటమి పాలనలో ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు 7 శాతం మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానరాని పురోగతి.. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పనుల తీరు చూస్తుంటే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే పనులు కొలిక్కి వచ్చేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గొట్టా బ్యారేజీ ఆర్ఎంసీ హెడ్ రెగ్యులేటర్ నుంచి 2.4 కిలోమీటర్ల పొడవున కాలువ వెడల్పు ఐదు మీటర్ల చొప్పున పెంచాల్సి ఉంటుంది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయాల్సి ఉంది. పంపుహౌస్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఏపీ ట్రాన్స్‌కోకు రూ.9.18 కోట్ల బకాయిల చెల్లించాల్సి ఉంది. 3.2 మీటర్ల 110 పైపులను తయారుచేశారు. వీటిని అమర్చాల్సి ఉంది. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జలాశయం గట్టుపై డెలివరీ సిస్టమ్స్‌కు ఇంతవరకూ అనుమతి రాలేదు. ఇన్ని పనులు పెండింగ్‌లో ఉంటే కూటమి పాలకులు ఎత్తిపోతల పథకం విషయంలో ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. బహుళ ప్రయోజనాలు ఎన్నో.. ఇక్కడ ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ జలాశ యం లక్ష్యం నెరవేరదు. కేవలం వర్షాకాలంలో అతిగా వచ్చే వరదలు సైడ్ వీయర్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు చేరుతుంది. అంతే తప్ప వంశధారలో సాధారణ ప్రవాహం ఉన్నప్పుడు రిజర్వాయర్‌లోకి నీరు చేరే అవకాశమే లేదు. అందుకే అత్యవసరంగా ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాల్సి ఉంది. రిజర్వాయర్‌లోకి 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అదే జరిగితే ఏడాది పొడ వునా శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయవ చ్చు. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించవచ్చు. ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. నదుల అనుసంధానం, నారాయణపురం ఆనకట్ట ద్వారా మరో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి 1.12 టీఎంసీల తాగునీరు అందిచవ చ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం జిల్లా రైతులకు శాపంగా మారుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు.. పుష్కలంగా సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఆలోచన చేశారు. వెనువెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదిలో 33 శాతం పనులు చేయిస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 7 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం పనుల్లో చిత్తశుద్ధి కరువు వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదిలో 33 శాతం పూర్తి కూటమి ఏడాది పాలనలో కేవలం 7 శాతమే పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం -
కులమతాల అడ్డుగోడలు పోవాలి
● సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ శ్రీకాకుళం కల్చరల్: కులమతాల అడ్డుగోడలు పోవాలని, దాని వల్ల ఎదగలేకపోతున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అభిప్రాయపడ్డారు. స్థానిక బాపూజీ కళామందిర్లో సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీశూద్రగంగ కావ్యగాన కార్యక్రమం శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త నిర్వహణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో రంగఖూని అనే ప్రేమ్‌చంద్ నవల చదివిన తర్వాత దానికి బానిసనయ్యాను. అందులోని పాత్రలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 30 ఏళ్ల కిందటే నాకు కులమతాల కోసం తెలిసి ఉంటే నా పేరును సుద్దాల అశోక్ శూద్ర తేజ అని పెట్టుకునేవాడిని’ అని అన్నారు. పేరు పక్కన శూద్ర అని పెట్టుకుంటే కులమతాల అడ్డుగోడలు తొలగిపోతాయన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కవిని, కావ్య పరిచయాన్ని శ్రీకాకుళ సాహితీ ప్రతినిధి అట్టాడ అప్పలనాయుడు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శ్రీకాకుళం సాహిత్య చరి త్రలో ఇది ఒక సువర్ణ ఘట్టమని తెలిపారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ శూద్రగంగ కావ్యగానం చేశారు. అనంతరం ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.ఉదయ్‌కిరణ్, కంచరాన భుజంగరావు, చీకటి దివాకర్, కారసాల శ్రీనివాసరావు, కల్లేపల్లి రామ్‌గోపాల్, ఎస్.రుద్రమరాణి, బాడాన శ్యామలరావు పాల్గొన్నారు. -
దేవుడి పేరిట దోపిడీ
● పొనుటూరులో ఇసుక దందా ● ఒడిశాకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● వరద గట్టును సైతం తవ్వేసిన వైనం కొత్తూరు: దేవుడి పేరు చెప్పి మరీ అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ఆ నాలుగు గ్రామాల టీడీపీ నేతలకు దేవుడి వరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆలయాలు నిర్మిస్తున్నామంటూ పొనుటూరు పంచాయతీ పరిధిలోని పాతపొనుటూరు, పొనుటూరు కాలనీ, కొత్తపొనుటూరు, బంకి గ్రా మాలకు చెందిన కొంత మంది నేతలు ఇసుక ట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు మైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. కొత్తూరు మండలంలోని పాత పొనుటూరుకు అనుకొని ఉన్న వంశదార నదిలో అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లే ఆంధ్రా వాహనాల నుంచి రూ.200, ఒడిశా వాహనాల నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అసలే అక్రమ ర్యాంపు. ఆపై అక్రమ వసూళ్లు కావడంతో స్థానికులు కూడా నిశ్చేష్టులవుతున్నారు. గత 8 నెలలుగా ఈ దందా సాగుతోంది. నాలుగు గ్రామాలకు చెందిన కొంత మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రెవెన్యూ, మైన్స్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాస్తవానికి ఆంధ్రా నుంచి ఇసుక ఒడిశాకు రవాణా చేయకూడదని నిబంధన ఉన్నా.. ఒడిశాకు చెందిన ట్రాక్టర్లతో పొనుటూరు నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు. ఒడిశాకు తరలిస్తున్న ట్రాక్టర్ నుంచి రూ. 500ను దేవుడి పేరుతో గుంజుకుంటున్నారు. సాక్షాత్తు గ్రామ సచివాలయం పక్క నుంచే అక్ర మంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇదే పంచాయతీ పరిధి బంకి గ్రామం నుంచి నదిలో ఇసుక అక్రమ రవాణా కోసం పూర్తిగా వరద గట్టును తవ్వేశారు. నదికి వరదలు వస్తే వరద నీరంతా పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా వంశధార ఇంజినీరింగ్ అధికారులకు పట్టడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలని, అక్రమ ఇసుక రవాణా ఆపాలని కోరుతున్నారు. ●తగిన చర్యలు తీసుకుంటాను పొనుటూరు వంశధారలో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే చర్యలు తీసుకుంటాను. ఒడిశాకు ఇసుక తరలించకూడదు. దేవుడి పేరుతో అక్రమ వసూళ్లు చేయడం నేరం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్ కొత్తూరు -
దళిత విద్యార్థులకు న్యాయం చేయండి
కాశీబుగ్గ: పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బాలికల/బాలుర గురుకుల పాఠశాలలు 1983లో స్థాపించారని సుమారుగా 30 ఏళ్ల నుంచి అవే భవనాలు ఉండడం, కొత్త భవనాలు అరకొరగా ఉండడం, మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు. గత 15 ఏళ్లుగా గురుకులాల్లో దళిత విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయని, అందుకు గల కారణాలు విశ్లేషించాలని కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకమైన కమిటీతో అధ్యయనం చేయించాలని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, బెలమర ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి మద్దిల వినోద్, జిల్లా కార్యదర్శి యడ్ల గోపి, ధర్మారావు, కరుణాకర్, బి.దుర్యోధన, ఎన్జీఓ నాయకులు బోనెల గోపాల్, చల్లా రామారావు, గెజిటెడ్ అధికారుల సంఘం గోజ్జ నాగరాజు, ఆదివాసీ సంఘం నాయకులు వరహాల భాగ్యరావు, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఇప్పిలి చంద్రశేఖర్, పిలక శ్రీను, ఉదయపురం శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చె..
● మెట్టవలసలో ఎట్టకేలకు గ్రామదేవత పండుగలు ● సిరిమాను, ఘటాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ నా చిన్నప్పుడు జరిగింది.. నాకు 85 ఏళ్లు. నా చిన్నప్పుడు మా ఊరిలో గ్రామదేవత పండగ చేశారు. నాకు తెలిసీతెలియని వయసులో జరిగింది. ఇప్పుడు మళ్లీ మా గ్రామస్తులంతా కలిసి గ్రామదేవత పండగను నిర్వహిస్తున్నాం. – డకర లక్ష్ముంనాయుడు, మెట్టవలస 80 ఏళ్లవుతోంది.. నాకు 90 ఏళ్లు. నేను 5వ తరగతి చదువుతున్నప్పు డు మా గ్రామంలో తాత లు, పెద్దలు గ్రామ దేవత పండగ చేశారు. మా ఊరిలో మొదటి ఉద్యోగం చేసిన వాడిని నేనే. ఈ వయసులో మళ్లీ గ్రామదేవత పండగ చూసే అదృష్టం కలగడం ఆనందంగా ఉంది. – యడ్ల ఆదినారాయణ, విశ్రాంతి పంచాయతీ అధికారి, మెట్టవలస జి.సిగడాం: మండలంలోని మెట్టవలసలో ఎట్టకేల కు గ్రామదేవత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయం చేశారు. గ్రామంలో 650 ఇళ్లు ఉన్నాయి. అంతా కలిసికట్టు గా పండుగ నిర్వహించేందుకు తీర్మానించారు. 80 ఏళ్ల తర్వాత.. గ్రామంలో ఈ ఉత్సవాలు జరిగి 80 ఏళ్లయ్యాయి. అప్పటి నుంచి ఉత్సవాలు జరగనేలేదు. మళ్లీ ఆ నాటికి ఉత్సవం నిర్వహిస్తుండడంతో ఊరు ఊరంతా సంబరపడుతోంది. దాదాపు రూ.7కోట్ల వ్య యంతో జాతర నిర్వహిస్తున్నారు. అయితే సిరిమాను గానీ, ఘటాలు గానీ లేకుండా పండుగ జరిగేలా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. -
21,572
● 56 కేంద్రాలు.. మంది విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో సోమవారం నుంచి మొదలుకానున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష కేంద్రాలకు మెటీరియల్స్‌ను చేరవేశారు. మార్చిలో రాసిన పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు ప్రథమ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) మరికొంతమంది విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తున్న విషయం తెలిసిందే. మొత్తంమీద ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి 21,572 మంది విద్యార్థులు ఫీజులను చెల్లించారు. పరీక్షల కోసం 56 కేంద్రాలను కేటాయించారు. వీటిలో ప్రభుత్వ యాజమాన్య కళాశాలలే అధికంగా ఉన్నాయి. అధికారులు, సిబ్బంది నియామకం పూర్తి.. పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించారు. మూడు ఫ్లయింగ్, 6 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్/డీవీఈఓ ఆర్.సురేష్‌కుమార్, ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు, డీఈసీ కమిటీ సభ్యులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్‌ను సిద్ధం చేశారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసి అమర్చారు. రెండు సెషన్స్‌లలో పరీక్షలు.. సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు అర్ధగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయానికి హాజరుకాకుంటే.. పరీక్ష కేంద్రంలోపలకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేందుకు, పరీక్ష కేంద్రాల వద్ద పహారా కాసేందుకు పోలీసు సిబ్బందిని నియమించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. ఇన్విజిలేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 10 ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన యంత్రాంగం ఎండల నేపథ్యంలో సౌకర్యాలు.. మండే ఎండల నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు, కలెక్టర్ సూచనల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్లతో మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. – ప్రగడ దుర్గారావు, ఆర్ఐఓ/డీఈసీ కమిటీ కన్వీనర్ -
కూటమిది కక్షపూరిత పాలన
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కక్షపూరిత పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజినిపై సీఐ సుబ్బనాయుడు అనుచిత ప్రవర్తన, గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత మహిళ, ఎంపీటీసీ కల్పన పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద పార్టీ నా యకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య, పార్టీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజినిపై సీఐ సుబ్బనాయుడు అనుచితంగా ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూ డకుండా సీఐ రజినిని పక్కకు తోసేయడం పోలీ సుల దుశ్చర్యకు నిదర్శనమన్నారు. మహిళలపై కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఎంతటి గౌర వం ఉందో ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలు స్తోందన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కల్పన ఒక దళిత మహిళ అని చూడకుండా అర్ధరాత్రి ఆమెను అరెస్ట్ చేసి నైటీలోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారని, ఇది అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు కూటమి ప్రభుత్వం, నాయకులు హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం రూరల్ జెడ్పీటీసీ రుప్ప దివ్య, వైఎస్సార్సీపీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఎల్లకా లం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదని గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, నాయకులు అంబటి శ్రీనివాసరావు, యజ్జల గురుమూర్తి, మూకళ్ల తాతబాబు, గుంట జ్యోతి, సీపాన రామారావు, రావాడ జోగినాయుడు, ఎస్.వెంకటరావు, సతివాడ రామినాయుడు, పి.రాజశేఖర్, అలపాన త్రినాథ రెడ్డి, ఎన్.కృష్ణ, తవిటినాయుడు, ఎ.రమేష్, సీహెచ్ గడ్డెయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు మహిళలపై అనుచిత ప్రవర్తన ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం.ఏపీ.జివోవి.ఇన్) వె బ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి స్థితి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే డయల్ 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకూర్మనాథాలయంలో ‘సదస్యం’ గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథుని కల్యా ణోత్సవాల్లో భాగంగా ఆదివారం సదస్యం జరిగింది. ఆస్థాన మంటపంలో ప్రత్యేక ఆసనంపై ‘చక్ర పెరుమాళ్’ను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతా రామనృసింహాచార్యులు, వైదికులు వివిధ పురా ణాలను స్వామికి విన్నవించారు. ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు, శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, దాసుబాబు, మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులుపాల్గొన్నారు. ముమ్మరంగా తనిఖీలు శ్రీకాకుళం క్రైమ్ : దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కూడళ్లలోను, ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణ, పేలుడు పదార్థాల గుర్తింపు, సంఘ విద్రోహక శక్తుల అడ్డుకట్ట, కొత్త, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. -
నేను కుందువానిపేట.. వింటారా నా మాట
ప్రియమైన పర్యాటకులకు.. మీ కుందువానిపేట సముద్ర తీరం.. ఆశీర్వదించి రాయు విన్నపం.. మీకు గుర్తుందో లేదో.. ఒకప్పుడు మీలో చాలా మంది నా ఒడిలో ఆడుకునేవారు. పొద్దు పోయే వరకు ఇక్కడే ముచ్చట్లాడుకునేవారు. ఈ తీరాన ఉండే చిన్ని పాకల్లో చిరుతిళ్లు కొనుక్కుని ఇంటిల్లిపాదీ ఆనందించేవారు.. మీ ముఖాల్లో వెల్లివిరిసే సంతోషం చూసి నాకూ ముచ్చటేసేది.. కానీ ఏ దిష్టి తగిలిందో.. ఇప్పుడు నా వద్దకు రావడమే మానేశారు.. ఒక ఆదివారం కాకపోతే మరో వారమైనా వస్తారని ఎదురు చూస్తున్నాను.. కానీ ఎవరూ రావడం లేదు.. పోనీలే.. కార్తీకంలో వస్తారు అనుకునేదాన్ని.. కానీ నా అంచనా తప్పైపోయింది.. ఒకప్పుడు కళకళలాడిన ఈ పాకలు ఇప్పుడు కూలిపోయాయి.. స్వచ్ఛమైన నా ఇసుక తిన్నెల మధ్య ఏవేవో సీసా ముక్కలు గుచ్చుకుంటున్నాయి.. ఒకప్పుడు రాత్రి 8 గంటల వరకు నా ఒడిలో చాలా మంది సేదతీరేవారు.. కానీ ఇప్పుడు రాత్రయితే చాలు ఇటుగా రావడానికే చాలా మంది భయపడుతున్నారు.. విద్యుత్ బల్బులన్నీ పాడైపోయాయి.. అనాదిగా అందాలు పంచిన ఈ ప్రదేశం.. ఇప్పుడు అందవిహీనమవుతోంది.. ఇది నేను తట్టుకోలేకపోతున్నా.. నాకు మళ్లీ వెనకటి రోజులు కావాలి.. పిల్లలంతా నా ఒడిలో ఆడుకోవాలి.. మీరంతా ఉదయాస్తమయాలు ఇక్కడి నుంచి మళ్లీ ఆస్వాదించాలి.. ఆ పాకలన్నీ మళ్లీ కళకళలాడాలి.. సీసా ముక్కలు కనిపించని ఇసుక తిన్నెలు మిమ్మల్ని స్వాగతించాలి. నా అలల ఘోషనే నా విన్నపంలా భావించండి.. నా కెరటాలు మీ కోసమే వస్తున్నాయని తెలుసుకోండి.. నా విన్నపాన్ని మన్నిస్తారని భావిస్తూ.. మీ కుందువానిపేట సముద్ర తీరం – శ్రీకాకుళం రూరల్ సచివాలయాలకు ఫైబర్ నెట్ కష్టాలు సారవకోట: మండలంలో సచివాలయాలకు ఫైబర్ నెట్ కష్టాలు తప్పడం లేదు. సచివాలయాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఏపీ ఫైబర్ నెట్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఫైబర్ నెట్వర్క్ గత కొన్ని రోజులుగా రాకపోవడంతో సచివాలయాల్లో ఆన్లైన్ పను లు చేసేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్లు వారి సొంత మొబైల్స్‌కు వైఫై ద్వారా కంప్యూటర్లకు కనెక్ట్ చేసుకుని ఆన్లైన్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా ఈ ఏపీ ఫైబర్ నెట్ వినియోగిస్తుండటంతో వారు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నెట్వర్క్ వచ్చేటట్లు చూడా లని కోరుతున్నారు. -
మరణించిన 22 రోజులకు..
కాశీబుగ్గ: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఊహించని రీతిలో మరణించిన యువకుడి మృతదేహం ఇరవై రెండు రోజుల అనంతరం స్వదేశానికి చేరుకుంది. పలాస మండలం తర్లాకోట పంచాయతీ ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర (33) గత నెల 21వ తేదీ సోమవారం మరణించినట్లు ఇక్కడకు సమాచారం వచ్చింది. పోలాండ్ దేశంలో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లి ఓ పార్కులో ఊయల వద్ద మరణించడం సంచలనంగా మారింది. దామోదర్‌కు అమ్మ పున్నమ్మ, పెరాలిసిస్తో బాధపడుతున్న తండ్రి లక్ష్మీనారాయణ, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దివ్యాంగుడైన అన్నయ్య, అతని భార్య పిల్లలతో కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నారు. వారందరి కీ దామోదర్ మాత్రమే ఆధారం. కుటుంబం కోసమే ఆయన పోలాండ్ వెళ్లాడు. ఇంటి కోసం అంతదూరం వెళ్లి తిరిగి విగతజీవిగా రావ డంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన చనిపోయిన ఘటనపై ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. అయితే అక్కడ నిబంధనల ప్రకారం ప్రక్రియలు అన్నీ పూర్తయ్యి మృతదేహం స్వగ్రామానికి చేరేందుకు 22 రోజులు పట్టింది. ఆదివారం అంత్యక్రియలు దామోదర్ మృతదేహానికి స్వగ్రామం ఖైజోల గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రబాను, చంద్ర అల్లూరి, రమేష్‌లు కష్టపడగా ఇండియన్ ఎంబసీ ఎంతో సహకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
శ్రీముఖలింగంలో భక్తుల సందడి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వైశాఖిమాసం మొదటి ఆదివారం భక్తులు సందడి చేశారు. హిరమండలం పరిధి అంబా విల్లి త్రినాథ స్వామికి మొదటి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శ్రీముఖ లింగం తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా నలుమూలలతోపాటు పక్క రాష్ట్రాలైన వియనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలి వచ్చారు. అర్చకులు గణ పతి పూజతో ప్రారంభించి స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారాహి అమ్మవారికి కూడా కుంకుమ పూజలు చేశారు. మరికొంద రు తమ కోర్కెలు తీరడంతో గోలెంలో బియ్యం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.శ్రీముఖలింగంలో నరసింహ జయంతిజలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ఆలయ పరిధి నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ మాసం ఆదివారం ఘనంగా నరసింహ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతి అయిన బెల్లం, పానకాలు నైవేద్యం సమర్పించి భక్తులు పంచిపెట్టి నట్లు అర్చకులు విశ్వనాథ్ దాస్, ప్రసాద్ పాడి తెలిపారు. అనంత రం స్వామివారికి హారతులిచ్చారు.రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌కు గాయాలురణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, హైవే పెట్రోలింగ్ ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో క్లీనర్ సదాశివం కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే హైవే పోలీసులు అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.కళకళలాడిన కాంప్లెక్స్శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించింది. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత అధికమైంది. తిరుగు ప్రయాణంలో కాంప్లెక్స్‌లో నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం క్యూలో బారులు తీరుతూ కనిపించారు. నాన్‌స్టాప్ బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ అధికారులు త్వరితగతిన స్పందించి ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు నాన్‌స్టాప్ బస్సుల స్థానంలో పల్లెవెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపారు.‘బకాయి వేతనాలు చెల్లించండి’శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మార్చి నెల బకాయి వేతనం రూ. 7,200 వెంటనే చెల్లించా లని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌర వ అధ్యక్షులు కె.నాగమణి, డి.ధనలక్ష్మి, జి.అమ రావతి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో సీఐటీయూ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్‌తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మార్చి నెల పూర్తి వేతనం చెల్లించినా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికారుల జాప్యం వల్ల జీతం రాలేదని అన్నా రు. ఆశాలకు రికార్డులు అవసరం లేదని మొబై ల్ యాప్‌లో పని చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలిస్తే జిల్లాలో రికార్డు పని, ఆన్లైన్ పని రెండు రకాలు పనులు చేయిస్తూ పని భారం పెంచుతున్నారన్నారు. లేబర్ కోడ్లు రద్దు, కనీ స వేతనం 26 వేలు ఇవ్వాలని కోరుతూ కార్మి క సంఘాలు పిలుపుమేరకు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆశాలంతా జయప్రదం చేయాలని కోరారు. -
మాజీ మంత్రి రజినిపై పోలీసుల చర్య హేయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: కూటమి పాలనలో అంతా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కోర్టులు ఎన్ని మొట్టికాయులు పెడుతున్నా పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఇష్టానుసారం వ్యవహరించడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీసీ నేత, మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తన హేయమైన చర్య అని అన్నారు. ఒక మహిళపై ఇలా దురుసుగా ప్రవర్తించడం దారణమని పేర్కొన్నారు. మాజీ మంత్రిని ఇలా పక్కను నెట్టడం, ఆమైపె దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. అలాగే గుంటూరు జిల్లా కంతేరులో కూడా ఎంపీటీసీ అయిన దళిత మహిళ కల్పనను రాత్రి 3 గంటలకు అరెస్టు చేయడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. ఈ అన్యాయాలపై పోరాటం చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. -
యాక్సిస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందే
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల అదనుపు భారం, యాక్సిస్ ఒప్పందాల రద్దు కోరుతూ శుక్రవారం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఏకంగా 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం ఆదానీ సంస్థలతో సోలార్ విద్యుత్ యూనిట్ ధర రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. ఇవే అధిక రేట్లంటూ పత్రికల్లో రాయించి రాద్ధాంతం చేసిన టీడీపీ.. ఇప్పుడు అఽధికారంలోకి వచ్చాక అంతకు రెట్టింపు డబ్బులు పెట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తాజా యాక్సిప్ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15 వేల కోట్ల భారం పడనుందని, తక్షణమే ఈ దొంగ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను పెంచకుండా తగ్గిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఏడాదిలోనే మూడు సార్లు విద్యుత్ చార్జీలను పెంచేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, సర్‌చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు అంటే ఏంటో చూపించారని విమర్శించారు. దేశంలో అనేక రాష్ట్రాలు రూ.2, రూ.2.50కే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం రూ.4.60కి కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నారంటే.. అక్రమాలకు తెరతీసినట్లుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నేతలు ఎం.ఆదినారాయణమూర్తి, కొత్తకోట అప్పారావు, అల్లు సత్యన్నారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
కోచింగ్ సెంటర్లో దారుణం
● విద్యార్థిని చితకబాదిన నిర్వాహకులు ● తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం నరసన్నపేట: స్థానిక ప్రశాంత్ నగర్లో కుందనా నవోదయ కోచింగ్ కేంద్రం నిర్వాహకులు విద్యార్థులను చితకబాదుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను మంచిగా చదివిస్తామని నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధం చేస్తామని తల్లిదండ్రులను నమ్మించి జాయిన్ చేసుకున్నారు. తీరా అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో తల్లిదండ్రులు వీధికెక్కారు. దీంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పోలాకి మండలం ఈదులవలస గ్రామానికి చెందిన ముద్దాడ శ్రీనివాసరావు తన కుమారుడు శ్రీకర్‌ను కోచింగ్ కోసం కుందనా నవోదయ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అయితే గురువారం అబ్బాయి ఇంటికి వచ్చాక స్నానం చేయిస్తున్నప్పుడు వీపు, చెవులుపై గాయాలు ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో విద్యార్థిని ప్రశ్నించగా కోచింగ్ సెంటర్లో టీచర్ కొట్టారని, చాలా అవమానకరంగా మాట్లాడారని తెలిపాడు. పోలీసుల హెచ్చరిక ఈ విషయంపై విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించగా అతడినే కొడతామని వారు సమాధానం చెప్పారు. దీంతో విషయాన్ని శుక్రవారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏఎస్ఐ సింహాచలం కోచింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇలా కొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ ప్రతినిధి మదన్‌కుమార్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బాలల హక్కులను కాలరాస్తున్న ఈ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలబాలికలకు రోజుకు 10 గంటలకు పైగా శిక్షణనిస్తున్నారని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఘటనపై కోచింగ్ కేంద్రం నిర్వాహకుడు వైకుంఠరావు మాట్లాడుతూ.. అనుకోకుండా గట్టిగా దెబ్బ తగిలిందని, అంతేతప్ప కావాలని పిల్లలను ఇబ్బంది పెట్టలేదన్నారు.