
కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు
శ్రీకాకుళం క్రైమ్ : అమ్మవారి ఉత్సవాలతో సందడిగా గడుపుతున్న కుటుంబానికి పిడుగుపాటు తీరని శోకం మిగిల్చింది. జిల్లా కేంద్రంలో నాగావళి నదీ తీరాన మంగళవారం పిడుగు పడడంతో గేదెల రాజారావు (55) మృత్యువాత పడగా.. ఆయన కుమారుడు నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ధాటికి మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
జిల్లా కేంద్రంలోని బలగ బూబమ్మ నగర్ లో గేదెల రాజారావు తన భార్య, కుమారుడు నాగార్జునతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం భద్రమ్మ తల్లి వారాల సంబరాలుండటంతో ఉదయాన్నే రాజారావు కుటుంబీకులు గొర్రెపోతును చూపించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గొర్రె పొట్టు మాంసం కడిగేందుకు గుడికి కిలోమీటరు దూరంలో ఉన్న నాగావళి నదీ తీరానికి తండ్రీకొడుకులు వెళ్లారు. వీరికి ఓ రెండు మీటర్ల దూరంలో బుచ్చిపేటకు చెందిన దేళెళ్ల రాజారావు, భైరి రామారావు మరికొందరు కూడా పొట్టు శుభ్రం చేయడానికి వచ్చారు. వీరు పనిలో ఉండగా వర్షం మొదలైంది. సరిగ్గా 7:40 గంటలకు పెను శబ్దంతో పిడుగు పడడంతో రాజారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాగార్జునకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి సమీపంలో ఉన్న మరో ఇద్దరికి కాలిన గాయాల య్యాయి. భద్రమ్మ గుడి సిబ్బందికి సైతం పిడుగు శబ్దం వినిపించడంతో స్థానికులతో కలసి ఘటనా స్థలికి వచ్చి చూశారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను రిమ్స్‌లో చేర్పించారు. గత 70 ఏళ్లుగా వారాలు జరుగుతున్నా ఏ సందర్భంలోనూ ఇలా ఉదయం పూట వర్షాలు పడలేదని స్థానికులు చెప్పారు. అనంతరం రిమ్స్‌కు చేరిన రెండో పట్టణ ఎస్‌ఐ–2 రామారావు క్షతగాత్రు లను, మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించడమే కాక ఘటనాస్థలికి స్థానిక వీఆర్వోతో కలిసి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామారావు చెప్పారు. భారీ వర్షాలతో పాటు అత్యధికంగా పిడుగులు పడతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ గత రెండురోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాల్లో బయటకు వెళ్లకపోవమే మంచిదని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు ప్రజలను కోరారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: కుర్రకారు కండల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో మంగళవారం ఉత్తరాంధ్ర జోనల్‌స్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు కన్నులపండువలా జరిగాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ శరీర సౌష్టవ పో రులో అండర్– 50 నుంచి 85 కేజీల విభాగం, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పో టీల ప్రదర్శనలో కుర్రకారు జోరు ప్రదర్శించారు. స్టార్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు వి.విజయ్‌కుమార్, బి.ప్రసాద్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 80 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. శ్రీకాకుళానికి చెందిన దివ్యాంగ బాడీబిల్డర్ తుపాకుల అనీల్‌కుమార్ విశేషంగా ఆకట్టుకున్నాడు. జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని రిఫరీలు భరోసా ఇచ్చారు.
పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం
మండలంలోని కలివరంలో మంగళవారం పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది. జన నివాసాల నడుమ ఈ పిడుగు పడటంతో జనం భయాందోళన చెందారు. అంతే కాకుండా పలువురు ఇళ్లకు సంబంధించి ఇంటిగోడలు కూడా చిన్న చిన్న గా బీటలు బారాయి. దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. గ్రామంలో అనేక మంది ఇళ్లకు సంబంధించి కరెంట్ ఇన్వెర్టర్లు, తదితర విద్యుత్ సామగ్రి కూడా దెబ్బతింది. ఒక్కసారిగా నివాస గృహాల నడుమ పిడుగు పడటంతో గ్రామంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.
– ఆమదాలవలస రూరల్
జిల్లా కేంద్రంలో నాగావళీ నదీ తీరాన పిడుగుపాటు
ఘటనా స్థలంలోనే తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు

కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు