
ముగిసిన బైపీసీ స్ట్రీం పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీఈఏపీ సెట్ –2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన పరీక్షలు సెలవు రోజుల్లో మినహా 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఎచ్చెర్ల మండల పరిధిలో రెండు కేంద్రాల్లో మంగళవారం పరీక్షలు జరిగాయి. బైపీసీ స్ట్రీం పరీక్షలు ముగియగా, ఎంపీసీ స్ట్రీం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. చిలకపాలెంలోని శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మొదటి షిఫ్టులో 280 మందికి 256 మంది, రెండో షిఫ్టులో 280 మందికి 255 మంది, ఎచ్చెర్ల వెంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 171 మందికి 159 మంది, రెండో షిఫ్టులో 170 మందికి 160 మంది పరీక్షకు హాజరయ్యారు.