
నల్లి ధర్మారావుకు సాహితీ పురస్కారం
శ్రీకాకుళం కల్చరల్: కవి, రచయిత, జర్నలిస్టు నల్లి ధర్మారావుకు విశాఖపట్నానికి చెందిన ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య, సాంస్కృతిక సంస్థ అవార్డు ప్రకటించింది. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం పురస్కారానికి ధర్మారావును ఎంపిక చేశారు. ఈ నెల 18న ఉదయం 10గంటలకు విశాఖ సిటీ లైబ్రరీలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ధర్మారావు కళింగాంధ్రా చరిత్ర, సంస్కృతి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అనేక వ్యాసాలు రాశారు. ఇప్పటికే గుర్రం జాషువా అవార్డు, రావి రంగారావు సాహిత్య పీఠం అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, దూసి ధర్మారావు అవార్డు వంటివి అందుకున్నారు. తాజాగా మరో సాహితీ పురస్కారం వస్తున్నందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.