
27న అమరవీరుల స్మారక సభ
పలాస: శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధరైతాంగ పోరాటంలో అమరులైన అమర వీరుల స్మారక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం స్మారక సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మే 27న బొడ్డపాడులో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు జోగి కోదండరావు, వంకల మాధవరావు, దుష్యంతు, రామారావు, వీరాస్వామి, ధర్మారావు, పుచ్చ దుర్యోధన, బాలకృష్ణ, త్రిలోచనరావు, శ్రీరాములు, మోహిని, జగన్,అప్పయ్య, బాలరాజు, అప్పారావు,మాధవరావు, ముసలయ్య పాల్గొన్నారు.