
జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
కాశీబుగ్గ: జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాలు వద్ద కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కాశీబుగ్గ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జీడి రైతుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధర, జీడి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘం నాయకులు బత్తిని లక్ష్మీనారాయణ, టి.రాజు, డి.తారకేశ్వరరావు, జె.సంతోష్, టి.తాతారావు, సీఐటీయూ నాయకులు ఎన్.గణపతి తదితరులు పాల్గొన్నారు.