
ప్రచార ఆర్భాటాలు..
అసంపూర్తిగా రథసప్తమి పనులు
రథసప్తమి పేరిట కూటమి సర్కారు ఆర్భాటం
అభివృద్ధి తక్కువ.. ప్రచారం ఎక్కువ
అరకొరగా పనులు..అవి కూడా నాసిరకమే
క్యూలైన్లు, అన్నదానం, ప్రసాదాల భవనాల తొలగింపు
భక్తులకు తప్పని అవస్థలు
‘మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడ పురుగులుండు..’ అన్నారెప్పుడో యోగి వేమన. ‘కూటమి ప్రచారం చూడ మెరిసిపోవుచుండును.. గుట్టు విప్పి చూడ మేడిపండు మేలు’ అనాలేమో మనమిప్పుడు. అరసవల్లి రథసప్తమికి భూమి ఆకాశం బద్దలయ్యేలా అధికార నేతలు ఆర్భాటాలు చేశారు. ౖపైపెన పనులు చేసి ఉత్సవ ఉత్సాహం చూపించారు. కానీ ఉత్సవం ముగిశాక.. అసలు గుట్టు బయటపడింది. కూల్చివేతలపై పెట్టిన శ్రద్ధ నిర్మాణాలపై పెట్టలేకపోయారు. ప్రచారంపై చూపిన చిత్తశుద్ధి పనుల్లోని నాణ్యతపై చూపలేకపోయారు. ఫలితంగా ఆదిత్యుడి భక్తులకు అవస్థలు తప్పడం లేదు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథ సప్తమి ఉత్సవాలకు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రచార ఆర్భాటాలు సిక్కోలు వాసులు ఇంకా మర్చిపోలేదు. ఈ ఏడాది రథసప్తమి మహోత్సవాలను తొలిసారిగా రాష్ట్ర పండుగ అంటూ ప్రకటించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కానీ రాష్ట్ర పండుగ అని మా త్రం ప్రకటించుకున్నారు. పనుల్లోకి దిగాక ఆల యం ముందున్న శాశ్వత భవనాలను అభివృద్ధి ముసుగులో కూల్చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేస్తామంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌లు హడావుడి చేసి భవనాలన్నీ నేలమట్టం చేయించేశారు. కూల్చివేతల పర్వం పూర్తయ్యాక.. ఆలయానికి వచ్చే ఆదాయం పడిపోయింది. దీనికి తోడు కూల్చిన వాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా జింకు షెడ్లలోనే భక్తులకు సేవలందిస్తున్నారు. సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆదిత్యుని దర్శనానికి వస్తున్న భక్తులకు కష్టాలే ఎదురవుతున్నాయి.
ప్రచార ఆర్భాటాలు..
ప్రఖ్యాత ఆలయాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నుంచి పిలిగ్రిమేజ్ రెజూవనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) అనే పథకం వర్తించేలా అరసవల్లిని ఎంపిక చేసేశామని, త్వరలో రూ.100 కోట్ల వరకు నిధులు రానున్నాయంటూ పెద్ద ప్రచారాలు చేశారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రసాద్ పథకం కాదు కదా.. ప్రసాదాల భవనాలను కూడా నిర్మించలేకపోయారు. గత ఏడాది డిసెంబర్‌లోనే అరసవల్లి ఆలయం ముందున్న నిర్మాణాలన్నీ కూల్చివేయనున్నామని అధికారికంగా ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించేసి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేత పనులను చేపట్టారు. దీంతో గత ఆరునెలల నుంచి ఆదిత్యు డిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అరసవల్లి ప్రధాన రహదారిని కూడా విస్తరణ చేయకుండా మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేసి అరసవల్లి మిల్లు కూడలిలో మాత్రం అరసవల్లి జ్ఞాపికగా పెద్ద రథచక్రాన్ని మాత్రం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
గోరంత పని.. కొండంత ప్రచారం
ఆలయం ముందున్న 10 ఆలయ దుకాణ సముదాయంతో పాటు అన్నదాన తయారీ, ప్రసాదాల విభాగ భవనాలు, మరో 12 వసతి గదులు, 30 వరకు మరుగుదొడ్ల భవనాలన్నీ కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు శాశ్వత భవనాలను నిర్మించేలా ఒక్క నిర్ణయాన్ని కూడా ఆలయ వర్గాలు గానీ ప్రభుత్వం గానీ చేపట్టలేదు. కూల్చేసిన స్థానమంతా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసేసి వదిలేశారు. ఇంద్రపుష్కరిణి చుట్టూ గోశాల, అన్నదాన షెడ్డు, జింకు షీట్లతో మరుగుదొడ్లను, అలాగే భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను మాత్రం ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ తాత్కాలికం కావడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. పోనీ చేస్తున్న పనుల్లో నాణ్యత ఉందా.. అంటే నాసిరకంగానే ఉన్నాయి. ప్రసాదాల కౌంటర్లు ఇంతవరకు స్థిరంగా ఏర్పాటు చేయలేదు. అన్నదాన మండపాన్ని కూడా పుష్కరిణి ఒడ్డున షెడ్లులో ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సరైన రీతిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అరసవల్లి ఆలయాన్ని ప్రచార కేంద్రంగా మార్చేసేలా తెలుగుదేశం పార్టీ సోషల్‌మీడియా విభాగం వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా 23 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే అరసవల్లిలో 1996 నుంచే నిత్యాన్నదాన పథకం అమల్లో ఉంది. ఆలయంలో భక్తులిచ్చిన విరాళాలతోనే దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడేదో కొత్తగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేయించినట్లుగా సోషల్‌మీడియాలో పోస్టింగ్‌ల ప్రచారాలకు టీడీపీ దిగడంపై భక్తులు నవ్వుకుంటున్నారు.
వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ రామ్‌జీ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో 30 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారు అర్హులుగా తెలిపారు. ఉమ్మడి జిల్లా యువత అర్హులు కాగా, పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు 79933 40407, 9553410809 సంప్రదించాలని అన్నారు.
సరిహద్దులో పటిష్టంగా తనిఖీలు
ఇచ్ఛాపురం టౌన్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో గంజాయి, మద్యం అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు పటిష్టంగా చేయాలని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సరిహద్దులోని చెక్‌పోస్టును పరిశీలించారు. తనిఖీ వి ధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి, మద్యం అక్రమంగా రాకుండా అన్నిమార్గాల్లో అన్ని వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రొహిబిషన్ ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లో కలిగిస్తున్న అవగాహన కార్యక్రమాల కోసం తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ పి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
పర్యాటకాభివృద్ధికి చర్యలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పర్యాటక అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పర్యాటక శాఖపై సోమవారం ఆయన జూమ్‌లో సమీక్షించారు. జిల్లాలో రణస్థలం మండలం, కళింగపట్నం, బారువ, భావనపాడు, తదితర బీచ్‌ల అభివృద్ధికి రిపోర్టు తయారు చేయాలని సూచించారు. కవిటి బీచ్‌లో పర్యాటకులకు అనుగుణంగా ఉన్న స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. కళింగపట్నం బీచ్‌ను స్వదేశీ దర్శనం ద్వారా అభివృద్ధి చేయాలన్నారు.
నేలకూలిన పెలికాన్
కాశీబుగ్గ: పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం తక్కువ ఎత్తులో ఎగురుతున్న సైబీరియా పెలికాన్ పక్షిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో పెలికాన్ పక్షి రెక్కకు గాయాలై పక్షి ఎగర లేకపోయింది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ అధికా రి మురళీకృష్ణ ఆదేశాల మేరకు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పెలికాన్ పక్షిని పలాస పశు వైద్యశాలలో వైద్యం అందించారు.
సచివాలయ సిబ్బందిపై ‘కూన’ ఆగ్రహం
బూర్జ: సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం బూర్జ మండలం డొంకలపర్త గ్రామ సచివాలయం సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. సచివాలయ సిబ్బంది స్టూడెంట్లు కాదని, ఇంకా విద్యార్థుల్లాగా ప్రవర్తిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాకు చర్యలు
అరసవల్లి: ఈదురుగాలులు, వర్షంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేసినట్లుగా విద్యుత్ శాఖ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా భారీగా గాలులు వీయడంతో పాటు వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొంతమేరకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టామని, అయితే అంతకుముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఇబ్బందులు లేవని ప్రకటించారు. భారీ ఫ్లెక్సీల వల్ల కొన్నిచోట్ల విద్యుత్‌లైన్లు తెగిపోయాయని, 33 కేవీ విద్యుత్ లైన్లలో సరఫరా నిలిచిపోకుండా చర్య లు చేపట్టామన్నారు. సోమవారం సాయంత్రం నుంచి టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, శ్రీకాకుళం ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు తదితర బృందం ఎక్కడికక్కడ వివరాలను సేకరించారు.

ప్రచార ఆర్భాటాలు..