
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
మాకొద్దు బాబోయ్..!
ఉపాధి వేతనదారులు ఫిష్‌పాండ్ పనులపై
నిరాసక్తత చూపుతున్నారు. తక్కువ వేతనం వస్తోందంటూ పనులు నిలిపివేస్తున్నారు.
–8లో
పట్టాలు తప్పిన పనులు..!
రైల్వే నిర్మాణ పనుల్లో నాణ్యత కరువైంది.
అండర్ టన్నల్ వే వద్ద రాళ్లుతేలడంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
–8లో
శ్రీకాకుళం కల్చరల్: డాబా గార్డెన్స్ అంటే విశాఖలోని ప్రాంతం అనుకునేరు. జిల్లా కేంద్రంలోనూ ఓ డాబా గార్డెన్ ఉంది. మేడపై తోటను అందంగా సాగు చేసుకుంటూ ఈ దంపతులు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. నగరంలోని బలగ వద్ద గల సత్యసాయి నగర్‌లో నివాసం ఉంటున్న పంతులు శశిభూషణరావు, మంజుల వాణి దంపతులు తమ డాబాను మొక్కలతో నింపి గార్డెన్‌గా చేసుకున్నారు. మంజుల వాణి గత ఏడాది తన తోటలో కొత్తగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను రెండు డబ్బాలలో వేశారు. ఈ నెలలో 12 డ్రాగన్ ప్రూట్స్ ఒకేసారి వచ్చాయి. ఇంకా 15 రెడీగా ఉన్నాయి. డ్రైఫ్రూట్స్ మొక్కలలో అంజీరా, స్టార్ ప్రూట్స్, గ్రీన్ బెర్రీ రకాలు సాగు చేస్తున్నారు.
20 రకాల మొక్కలు
మంజుల వాణి తన ఇంట్లో ఆదెనియం (బోన్సాయి) 10 రకాల పూల మొక్కలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించి పెంచుతున్నారు. ఇంకా జామ, మనీప్లాంట్, కాక్టస్ ప్లాంట్, జాస్మిన్ డ్రాగన్ ప్రూట్స్, షోయింగ్ ప్లాంట్స్, క్రోటన్ మొక్కలు పెంచుతున్నారు. ఇందులో బీరపాదు, బెండ, ఆనపపాదు, దొండపాదు, డ్రమ్ స్టిక్స్ రకాల కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి. పూల మొక్కలలో గులాబీ రకాలు, చామంతి, బంతి, మల్లె, కనకాంబరాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తుంటారు.
న్యూస్‌రీల్
మన
డాబా గార్డెన్
జిల్లా కేంద్రంలో మేడపై తోట పెంచిన దంపతులు
వివిధ రకాల మొక్కలతో కనువిందు

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం