
● కుట్టు మిషన్ల స్కీమ్ పెద్ద స్కామ్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రభుత్వ కుట్టు మిషన్ల స్కీమ్ పెద్ద స్కామ్ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతీదివ్య అన్నారు. ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కార వేదికలో సోమవారం పాల్గొని కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉలాల భారతీదివ్య మాట్లాడుతూ పథకాల పేరిట కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్‌సీపీ పథకాలు అందజేసిందని, కూటమి ప్రభుత్వం కేవలం పచ్చ చొ క్కాలకే పథకాలు అందిస్తోందని పేర్కొన్నారు. స్కామ్‌లపై దృష్టి సారించి ప్రజాధనం వృధా కాకుండా అర్హులైనవారికి పథకాలు అందేలా చూడాలని కోరారు. నరసన్నపేట నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు