
అటు సందడి.. ఇటు అలజడి
సోంపేట: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాలవలస అమ్మవారికి ఘటమెత్తింది. ఇరవై ఏళ్ల అనంతరం ఆ ఊరిలో అమ్మవారి సంబరాలు జరుగుతు న్నాయి. వారం రోజులుగా ఊరుఊరంతా ఆ సందడిలోనే ఉంది. గ్రామస్తులు ఆదివారం బంధువులు, చుట్టాలను పిలిచి భోజనాలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇంతలోగా ఓ పిడుగు లాంటి వార్త వారి లో అలజడి రేపింది. గ్రామానికి చెందిన గోకర్ల ఈశ్వరరావు(35)ను ఎవరో చంపేశారని వార్తలు రావడం, మృతదేహం జీడితోటల్లో దొరకడంతో ఊరు నిశ్శబ్దమైపోయింది. వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన విశ్వనాథం, కాంతమ్మల కుమా రుడు గోకర్ల ఈశ్వరరావు హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామదేవత ఉత్సవాల కోసం ఇటీవలే గ్రామానికి వచ్చాడు. వారం రోజులుగా స్నేహితులతో ఆనందంగా గడిపాడు. శనివారం రాత్రి ఇంటిలో భోజనం చేసి బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా పడుకోవడానికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అంతా గాలించారు. అ యినా అతని ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉద యం పాలవలస జాతీయ రహదారి పక్కన ఈశ్వరరావు బైక్ కనిపించింది. సమీప జీడి తోటల్లో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు స మాచారం అందజేశారు. బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు, సోంపేట సీఐ బి.మంగరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈశ్వరరావును హత్య చేసినట్లు భావిస్తున్నారు. క్లూస్ టీంతో పరిశీలనలు చెపట్టారు. ఈశ్వరరావు భార్య స్వాతి ఫిర్యాదు మేరకు బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈశ్వరరావుకు భార్యతో పాటు రెండేళ్ల వయసు గల కుమార్తె ఉంది. ఈశ్వరరావు మృతిపై గ్రామంలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
ఆందోళనలో గ్రామస్తులు
పాలవలస గ్రామంలో ఇలాంటి హత్యల సంస్కృతి ఎన్నడూ లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఇలాంటి సంఘటన జరగడం బాధ కలిగించిందన్నారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పాలవలసలో వ్యక్తి దారుణ హత్య..?
ఊరిలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఘటన
ఆందోళనలో గ్రామస్తులు

అటు సందడి.. ఇటు అలజడి

అటు సందడి.. ఇటు అలజడి