
● తప్పని తిప్పలు
ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక వద్దకు వచ్చే వారికి తిప్పలు తప్పడం లేదు. గత వారం ప్రజాఫిర్యాదుల విభాగానికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోలు పోసుకుని చనిపోతానని బెదిరించిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో ఈ వారం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ వారం ఓ దివ్యాంగురాలు వీల్‌చైర్‌లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. ఆమె వస్తువులన్నీ తీసి తనిఖీ చేయడంతో.. వీల్‌చైర్ పైకి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. కేజీబీవీ మురపాకలో ఇంటర్ సీటు కోసం ఇమె వచ్చారు. దివ్యాంగులు వెళ్లడాని కి ర్యాంపు లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న వారు అభిప్రాయపడ్డారు. అలా గే ప్రథమ చికిత్స వంటివాటికోసం స్టాఫ్ నర్సుల్ని ఏర్పాటుచేశారు. వారికి కనీసం ఓ చాంబర్, బల్ల వంటివి ఏర్పాటుచేయకపోవడంతో మెట్లపైనే కూర్చుని మందులు నేలపైనే పెట్టారు.
– శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)