
పాలిటెక్నిక్‌లో 95.27% ఉత్తీర్ణత
● 10349 మంది పరీక్షకు హాజరు కాగా 9860 మంది పాస్
● ఉత్తీర్ణతలో బాలికలే టాప్
శ్రీకాకుళం న్యూకాలనీ:
ఏపీ పాలిసెట్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్)–2025 ఫలితాల్లో శ్రీకాకుళం విద్యార్థులు హవా కనబర్చారు. బుధవారం వెలువడిన ఈ ఫలితాల్లో రికార్డు స్థాయిలో 95.27శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా నుంచి 10349 మంది పరీక్ష కు హాజరుకాగా.. వీరిలో 95.27 శాతంతో 9860 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా బాలురుతో పోలిస్తే బాలికలే బెస్ట్‌గా నిలిచారు. ఏప్రిల్ 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా (శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో) 39 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 10349 మంది హాజరయ్యారు. జిల్లా నుంచి రికార్డుస్థాయిలో 11376 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
టాపర్‌గా నిలిచిన సాయిశ్రీ..
శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు విద్యార్థులు మె రుగైన ర్యాంకులతో సత్తాచాటారు. 120 మార్కులకుగాను 119 మార్కులు సాధించిన కింతలి సాయి శ్రీ 20వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచింది. అలాగే కొల్ల మౌనిక 119 మార్కులు సాధించి 40వ ర్యాంకు సాధించి రెండోస్థానంలో నిలిచింది. వాన దివాకరరావు 118 మార్కులు సాధించి 84వ ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచాడు.
జిల్లా నుంచి పాలిసెట్–2025 పరీక్ష గణాంకాలు
ఇలా ఉన్నాయి..
బాలురు బాలికలు మొత్తం
దరఖాస్తు చేసింది 6439 4937 11376
పరీక్ష రాసింది 5905 4444 10349
పరీక్షకు గైర్హాజరు 534 493 1027
ఉత్తీర్ణత సాధింపు 5572 4288 9860
ఉత్తీర్ణత శాతం 94.36 96.49 95.27

పాలిటెక్నిక్‌లో 95.27% ఉత్తీర్ణత