
జూన్ 21 వరకు యోగాంధ్ర
అరసవల్లి: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరిట ప్రత్యేక యోగాసనాల కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించనున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖ రానున్నారని తెలిపారు. ఇక బుధవారం నుంచి గ్రామ స్థాయి, మండల, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకోసం ఒక్కో యోగాట్రైనర్‌ను నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ యోగా మాస్టర్‌గా తన అనుభవాన్ని వివరించారు. అంతకుముందు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రముఖులంతా స్వయంగా పాల్గొని యోగాసనాలను వేశారు. అయితే మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడంతో బుధవారం ఉదయం భక్తులు దర్శనాలకు ఇబ్బందులు పడ్డారు. అయితే పరిస్థితిని గమనించిన ఆల య అధికార సిబ్బంది శివాలయం మీదుగా దర్శనానికి పంపించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారిఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత, యోగా టీచర్లు పాండ్రంకి మురళికృష్ణ, తంగి స్వాతి, ఎ.గాయత్రి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

జూన్ 21 వరకు యోగాంధ్ర

జూన్ 21 వరకు యోగాంధ్ర