
● విద్యుత్ శాఖకు నష్టం
అరసవల్లి: గాలుల తీవ్రతకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అలాగే పిడుగుపాటుకు శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో సుమారుగా 7 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, సుమారు 25 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా 33 కేవీ విద్యుత్ లైన్లపై హోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో అయితే 11 కేవీ విద్యుత్ లైన్లు తెగిపడటంతో తీవ్ర అంతరా యం ఏర్పడింది. ఈ ప్రభావంతో సుమారుగా రూ. 10 లక్షల వరకు విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.

● విద్యుత్ శాఖకు నష్టం