వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

May 20 2025 1:01 AM | Updated on May 20 2025 1:01 AM

వర్చు

వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యకు నాంది పలికేలా ‘జీరో సైన్స్‌ ల్యాబ్‌’ వర్చువల్‌ ప్రయోగశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ వెల్లడించారు. మొదటిగా స్మార్ట్‌ డిస్‌ప్లేలు ఉన్న ఐదు పాఠశాలల్లో ఈ ల్యాబ్‌ను ప్రారంభించి, విద్యార్థులపై ప్రభావా న్ని విశ్లేషించనున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు కార్యాచరణపై కలెక్టర్‌ను సోమవారం కలిసిన ఈడీజెడ్‌వన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రతినిధులు రామ్‌కుమార్‌ రామదేవు, సంతోష్‌ కొత్తకోట ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. కలెక్టర్‌ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, పైలట్‌ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, సాంకేతిక మద్దతు కల్పించేందుకు సమగ్ర చర్య లు తీసుకోవాలని సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శశిభూషణ్‌కు సూచించారు.

నిలిచిన సీటీ స్కాన్‌ సేవలు

టెక్కలి రూరల్‌: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో సోమవారం సీటీ స్కాన్‌ సేవలు నిలిచిపోయా యి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం ఉదయం రోగులకు స్కాన్‌ చేస్తున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, రావడం జరుగుతుండటంతో సీటీ స్కాన్‌ ఒక్కసారిగా మరమ్మతులకు గురైంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిస్టంలో ఉన్న డేటా సైతం కనిపించకపోవడంతో ఇక్కట్లు తప్పలేదు. అత్యవసర కేసులను శ్రీకాకుళం రిఫర్‌ చేయాల్సి వచ్చింది.

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారు లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు, ప రిష్కార వేదికలో గ్రీవెన్స్‌కు ముందు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌తో కలిసి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. పిడుగు పాటు కు సంబంధించి వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే గ్రామ స్థాయిలో చేరే విధంగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకొని తద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్‌ లైన్లు దెబ్బ తినడం వంటి సమాచారం పై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

స్పాట్‌ ప్రారంభం

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలకేంద్రం వేదికగా జరుగుతు న్న స్పాట్‌ వాల్యుయేషన్‌లో భాగంగా మొదటి స్పెల్‌లో సంస్కృతంతోపాటు తెలుగు,ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, సివిక్స్‌, తెలుగు పేపర్లను దిద్దుతున్నారు. ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు, ఏసీవో జనరల్‌–1 గణపతి వెంకటేశ్వరరావు, జనరల్‌–2 శివరాంప్రసాద్‌ పర్యవేక్షిస్తున్నారు.

పదోన్నతులతో ఖాళీల భర్తీ

సారవకోట: జిల్లా పరిషత్‌ పరిధిలో వివిధ మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నామని జెడ్పీ సీఈఓ శ్రీధర్‌ రాజా తెలిపారు. సోమవారం ఆయన స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్‌ కార్యాలయాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలత్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హత కలిగిన వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 1
1/2

వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 2
2/2

వర్చువల్‌ ల్యాబ్‌కు కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement