
ఐక్య పోరాటానికి మద్దతు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఐక్య పోరాటానికి ఏపీసీపీఎస్‌ఈఏ (ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్) సంఘం పూర్తి మద్దతు ఇస్తోందని సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వి.వి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలపై కనీస చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
అధికారులను టార్గెట్ చేయడం తగదు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని, ఈ విషయంలో ఓటర్లకు సమాధానం చెప్పలేని స్థితిలో పాలకులు ఉన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పథకాల అమలును గాలికొదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట వైఎస్సార్ సీపీ నేతలతో పాటు సీనియర్ ఐఏఎస్, విశ్రాంత అధికారులను కూడా టార్గెట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను జైల్లలో పెట్టించారని మండిపడ్డారు. అధికారులను వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇదే విధానం కొనసాగితే ఏ ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కూడా రాష్ట్రంలో పనిచేయడానికి ముందుకు రారని చెప్పారు. కూటమి ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.
15 మంది యాత్రికులకు డయేరియా
టెక్కలి రూరల్: కర్ణాటక నుంచి బస్సులో తీర్థయాత్రకు వెళ్లి తిరిగి స్వస్థలాలకు వస్తున్న పలువురు యాత్రికులు డయారియా బారిన పడ్డారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో సుమారు 15 మంది వాంతులు, విరో చనాలతో బాధపడుతూ టెక్కలి జిల్లా ఆస్పత్రి లో చేరారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది ప్రథమ చికిత్స అందించి డయేరియా వార్డులో చేర్పించారు. మొత్తం 50 మంది అయోధ్య, కాశీ వంటి క్షేత్రాలను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. అక్కడ వైద్యపరీక్షలు చేయించుకుని కొందరు రైలులో తమ ప్రాంతానికి వెళ్లిపోయారు. మిగిలిన వారు బస్సులో బయలుదేరి వస్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చేసరికి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తు తం ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
జిల్లాలో కొత్త అగ్నిమాపక
కేంద్రాలు
టెక్కలి రూరల్ : ఇచ్ఛాపురం, సోంపేట, బొబ్బిలి, పాలకొండ తదితర ప్రాంతాల్లో నూతనంగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం రీజనల్ అగ్నిమాపకాధికారి నిరంజన్ రెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం టెక్కలి అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు. పరికరాలు, వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందిలో ఎక్కువ శాతం మంది హోంగార్డులే ఉన్నారని, వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా ఫైర్ ఇంజిన్లు కొనుగోలు చేయనున్నామని చెప్పారు. అనంత రం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఐక్య పోరాటానికి మద్దతు

ఐక్య పోరాటానికి మద్దతు