
పాత నేరస్థులపై నిఘా
టెక్కలి: టెక్కలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా వేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం టెక్కలి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో దత్తత కానిస్టేబుల్, మహిళా పోలీసుల సమన్వయంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సీఐ విజయకుమార్, సిబ్బంది ఉన్నారు.
కానిస్టేబుల్‌కు వడదెబ్బ
కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యుగంధర్ శుక్రవారం బందోబస్తు విధుల్లో ఉండగా ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
కుప్పకూలిన
ఉపాధి వేతనదారుడు
టెక్కలి: సీతాపురం పంచాయతీ వలియాసాగరం గ్రామంలో శుక్రవారం ఉపాధి పని చేస్తున్న పైల ధనుంజయరావు ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ధనుంజయరావును టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఏపీఓ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని వేతనదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే పంచాయతీలో ఇటీవల క్షేత్ర సహాయకుడి తొలగింపు విషయంలో రాజకీయం ప్రమేయం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్‌చార్జి క్షేత్ర సహాయకుడు నియామకం విషయంలో మండల స్థాయి అధికారులు జిల్లా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేశారంటూ పలువురు వేతనదారులు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనతో సీతాపురం పంచాయతీ ఉపాధి హామీ పనుల్లో మరోసారి రచ్చ చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నరసన్నపేట నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తున్న లాగేజ్ వ్యాన్ హరిశ్చంద్రాపురం ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఎన్.ఉమా, పి.లోకేష్‌లకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

పాత నేరస్థులపై నిఘా

పాత నేరస్థులపై నిఘా